ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మందికిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది.
ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయి
జెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్‌కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.
తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్‌లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.
వెలుగులోకి ఎలా వచ్చింది
2020లో ఒక షాపింగ్ మాల్‌లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్‌టాప్‌లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్‌లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది.
తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.
ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో
ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.
2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్‌లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది.
గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట.
Comments
Please login to add a commentAdd a comment