ఇటీవల యువతలో లక్షల జీతాలు కోసం వెంపర్లాడేవారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనుకున్న కొలువులో ఉద్యోగం కొట్టి గ్రేట్ అనిపించుకునేవారు. కానీ ఇప్పడు ఆ ఉద్యోగాలే వారికి విసుగు తెప్పించి బయటకొచ్చేలా చేస్తున్నాయి. పైగా సాదాసీదా ఉద్యోగాలు చేస్తూ..అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కొందరు. అలాంటి కోవకు చెందిందే యూఎస్‌కు చెందిన మహిళ. మంచి ఉద్యోగం, లక్షల్లో వేతనం వదులుకుని ఎలాంటి ఉద్యోగం చేస్తుందో తెలిస్తే షాకవ్వుతారు.
వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ వాలెరీ వాల్‌కోర్ట్ గూగుల్, అమెజనా వంటి పలు కార్పోరేట్ కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత సీటెల్‌లో అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ పార్టనర్‌గా ఏకంగా రూ. 83 లక్షల వేతనం అందుకున్నారు. 2020 వరకు పలు కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. ఇక వాటిల్లో ఉండే ఒత్తిడిలు, టెన్షన్లకు తట్టుకోలేక ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుని డిసైడ్ అయ్యింది వాల్‌కోర్ట్.
అలా ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లి పేస్ట్రీ స్కూల్‌లో జాయిన్ అయ్యి మూడెళ్ల పాట్ర శిక్షణ తీసుకుంది. అక్కడ రెస్టారెంట్ ఇంటర్నెషిప్‌లలో ఆహ్లదకరంగా ట్రైనింగ్ పూర్తి అయ్యిందని, ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకున్నానని చెబుతోంది వాల్‌కోర్ట్. ప్రస్తుతం ఆమె మైసన్ చబ్రాన్ రెస్టారెంట్‌లో పేస్ట్రీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యూఎస్‌లోని కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్నప్పుడూ కంటే ఇప్పుడే మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. అంతేగాదు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విలువైన జీతం కంటే మనసుకు సంతోషాన్ని, హాయిని ఇచ్చే ఉద్యోగమే బెటర్ అంటోంది వాల్‌కోర్ట్. ప్రస్తుతం చాలామంది యువతలో ఈ ధోరణి ఎక్కువ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!)
Comments
Please login to add a commentAdd a comment