pastry and bakery
-
రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..!
ఇటీవల యువతలో లక్షల జీతాలు కోసం వెంపర్లాడేవారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనుకున్న కొలువులో ఉద్యోగం కొట్టి గ్రేట్ అనిపించుకునేవారు. కానీ ఇప్పడు ఆ ఉద్యోగాలే వారికి విసుగు తెప్పించి బయటకొచ్చేలా చేస్తున్నాయి. పైగా సాదాసీదా ఉద్యోగాలు చేస్తూ..అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కొందరు. అలాంటి కోవకు చెందిందే యూఎస్‌కు చెందిన మహిళ. మంచి ఉద్యోగం, లక్షల్లో వేతనం వదులుకుని ఎలాంటి ఉద్యోగం చేస్తుందో తెలిస్తే షాకవ్వుతారు.వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ వాలెరీ వాల్కోర్ట్ గూగుల్, అమెజనా వంటి పలు కార్పోరేట్ కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత సీటెల్‌లో అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ పార్టనర్‌గా ఏకంగా రూ. 83 లక్షల వేతనం అందుకున్నారు. 2020 వరకు పలు కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. ఇక వాటిల్లో ఉండే ఒత్తిడిలు, టెన్షన్లకు తట్టుకోలేక ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుని డిసైడ్ అయ్యింది వాల్కోర్ట్. అలా ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లి పేస్ట్రీ స్కూల్లో జాయిన్ అయ్యి మూడెళ్ల పాట్ర శిక్షణ తీసుకుంది. అక్కడ రెస్టారెంట్ ఇంటర్నెషిప్లలో ఆహ్లదకరంగా ట్రైనింగ్ పూర్తి అయ్యిందని, ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకున్నానని చెబుతోంది వాల్కోర్ట్. ప్రస్తుతం ఆమె మైసన్ చబ్రాన్ రెస్టారెంట్లో పేస్ట్రీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యూఎస్‌లోని కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్నప్పుడూ కంటే ఇప్పుడే మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. అంతేగాదు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విలువైన జీతం కంటే మనసుకు సంతోషాన్ని, హాయిని ఇచ్చే ఉద్యోగమే బెటర్ అంటోంది వాల్కోర్ట్. ప్రస్తుతం చాలామంది యువతలో ఈ ధోరణి ఎక్కువ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(చదవండి: హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!) -
కొత్త క్రియేటివిటి.. వ్యాక్సిన్ థీమ్ పేస్ట్రీలు..
వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కాకపోతే ఇవి ఇంజక్లన్ల రూపంలో వేయించుకునే వ్యాక్సిన్లు కావు. లొట్టలేసుకుంటూ తినే పేస్ట్రీలు. హంగేరియన్ పేస్ట్రీ షాప్‌లో వ్యాక్సిన్ థీమ్‌తో పేస్ట్రీలను తయారు చేస్తూ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ‘క్రియేటివిటీ భళా’ అంటూ వచ్చిన కస్టమర్లు తెగ అభినందనలు తెలుపుతున్నారట. గ్రీన్ ఫర్ ఫైజర్, ఆరెంజ్ ఫర్ స్పుత్నిక్, బ్లూ ఫర్ మోడరనా... ఇలా కోవిడ్– 19 టీకా అనే అంశంపై హంగేరియన్ పేస్ట్రీ దుకాణం నిర్వహించే సులయన్ కుటుంబం వీటిని తయారుచేస్తోంది. పేస్ట్రీ జెల్లీ వేర్వేరు రంగుల్లో ఉండి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రతిబింబిస్తుంది. సిట్రస్ ఎల్లో ఆస్ట్రా జెనెకా, ముదురు పసుపు రంగు సినోఫార్మ్, ఫైజర్ కోసం గ్రీన్, స్పుత్నిక్ కోసం ఆరెంజ్, మోడరనా కోసం నీలం రంగులో తయారు చేస్తున్నారు. పేస్ట్రీ అలంకరణలో సిరంజిలను కూడా వాడారు. వినోదమే తప్ప వివాదాల్లేవట.. కొన్నిరకాల టీకాల గురించి వివాదం నడుస్తోంది. కానీ, ఇక్కడ లభించే పేస్ట్రీల వల్ల మాత్రం ఎలాంటి వివాదం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘వినియోగదారుడు తమకు నచ్చిన వ్యాక్సిన్ పేస్ట్రీని కొనుగోలు చేసి, టేస్ట్ చేయచ్చు’ సులయన్ పేస్ట్రీ యజమాని కైట్లిన్ బాంక్వో చెబుతున్నారు. ‘వీటిని కొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ లేవు. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న ప్రజల ముఖాల్లో చిరునవ్వులను తీసుకురావడానికి మేం చేస్తున్న చిరు ప్రయత్నమిది’ అంటున్నారు నిర్వాహకులు. -
అమ్మవారిని ప్రార్థిస్తూ నైవేద్యాలు
దసరా సరదాల పండుగ కడుపు నిండా పిండి వంటలు ఆరగించే పండుగ ఈ సంవత్సరం మాత్రం కరోనా కనికరించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నైవేద్యాలు అర్పించే పండుగ జాగ్రత్తలు పాటిస్తూ అందరూ కలిసి దసరాను సరదాగా... దసరదాల పండుగగా జరుపుకుందాం. ► సాబుదాన (సగ్గుబియ్యం) వడలు కావలసినవి: సాబుదానా (సగ్గుబియ్యం): ఒక కప్పు; బంగాళ దుంప – 1(ఉడికించి పొట్టు తీయాలి); పచ్చిమిర్చి – 8; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారీ: ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి బాగా కగిగాక, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు మూడు గంటలు నాననివ్వాలి ఒక పాత్రలో... నానిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళ దుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి సన్నని మంట మీద నూనెను ఉంచి, వీటిని అందులో వేసి, నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ప్లేటులో పేపర్ నాప్కిన్ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి (సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి) ► నేతి గారెలు కావలసినవి: మినపపప్పు – 4 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చికొబ్బరి తురుము – ఒక టీ స్పూను; అల్లం ముద్ద – 5 టీ స్పూన్లు; నెయ్యి – తగినంత; దాల్చిన చెక్క – రెండు; లవంగాలు – 2; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర: ఒక టేబుల్ స్పూను. తయారీ: ముందుగా మినప్పప్పును మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మిక్సీలో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ జత చేసి మెత్తగా చేసి, రుబ్బుకున్న మినప్పిండిలో వేసి బాగా కలపాలి స్టౌ వెలిగించి పాన్ పెట్టి తగినంత నెయ్యి వేసి కాచాలి గారెలు వేసే ముందు ఉప్పు జత చేయాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ప్లాస్టిక్ పేపర్‌పై గారెలుగా ఒత్తి, కాగిన నేతిలో వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. (అల్లం చట్నీతో తింటే రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది) ► పనీర్ పాయసం కావలసినవి: తరిగిన పనీర్ – అర కప్పు; బెల్లం తరుగు – 2 కప్పులు; చిక్కటి పాలు – ముప్పావు కప్పు; పాలు – అర లీటరు; డ్రై ఫ్రూట్లు – అలంకరిచంటానికి తగినన్ని; ఏలకుల పొడి – ఒక టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద మందపాటి బాణలి ఉంచి వేడయ్యాక, తరిగిన పనీర్, పాలను ఒకదాని తరవాత ఒకటి వెంటవెంటనే వేయాలి ∙సుమారు పది నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙చిక్కటి పాలను జత చేసి మరో నాలుగు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి, బెల్లం కరిగేవరకు బాగా కలియబెట్టాలి ∙డ్రై ఫ్రూట్లను జత చేసి, బాగా కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించి, బాగా చల్లారాక అందించాలి. ► కొబ్బరి పులిహోర కావలసినవి: బియ్యం – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత పండు – 50 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మిన\ప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – మూడు రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – 10. తయారీ: బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి అన్నం వేడిగా ఉండగానే ఒక ప్లేటులోకి తీసుకుని, గరిటెతో పొడిపొడిలాడేలా కదపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడకనివ్వాలి దింపే ముందు ఎండు కొబ్బరి తురుము జత చేసి కలిపి దింపేసి, అన్నం మీద వేసి బాగా కలియబెట్టాలి పల్లీలు, జీడిపప్పులు జత చేసి మరోమారు కలిపి, గంట సేపటి తరవాత అందిస్తే రుచిగా ఉంటుంది. (ఇదే పద్ధతిలో పెసర పిండి పులిహోర, ఆవ పులిహోర, దానిమ్మ రసం పులిహోర, నువ్వుల పొడి పులిహోర కూడా తయారుచేసుకోవచ్చు) ► తారాట్టి పాల్ కావలసినవి: పాలు – అర లీటరు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ: ముందుగా వెడల్పాటి గిన్నెను స్టౌ మీద ఉంచి, అందులో పాలు పోసి సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి పాలు సగం అయ్యే వరకు వాటిని కలుపుతూ మరిగించాలి పాలు బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం తరుగు వేసుకోవాలి నెయ్యి జత చేసి గిన్నె అంచులకు అంటుకోకుండా కలుపుతూ వుండాలి ఏలకుల పొడి కూడా వేసి, నెమ్మదిగా కలుపుకుంటూ సన్నని మంట మీద బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి నెయ్యి పాల నుండి బయటికి వస్తున్నప్పుడు మరో అయిదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. ► రవ్వ బొబ్బట్లు కావలసినవి: రవ్వ – ఒక కప్పు; మైదా – 2 కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; పంచదార – 2 కప్పులు; వంట సోడా – చిటికెడు; నెయ్యి 2 టీ స్పూన్లు; నూనె అర కప్పు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, గోధుమపిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు, వంట సోడా జత చేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగాక, రవ్వ వేసి దోరగా వేయించి పక్కన ఉంచాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, ఏలకులపొడి వేసి కలపాలి ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూరా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. ► పెసర పప్పు పొంగలి కావలసినవి: బియ్యం ఒక కప్పు; పెసరపప్పు – ఒక కప్పు; బెల్లం 2 కప్పులు; నీళ్ళు: నాలుగున్నర కప్పులు; జీడిపప్పులు – 10; కిస్మిస్ –10; ఎండుకొబ్బరి ముక్కలు: అర కప్పు; ఏలకుల పొడి: అర కప్పు; నెయ్యి అర కప్పు. తయారీ: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కరిగాక, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేగి, సువాసన వచ్చే వరకు వేయించాక, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యమధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తరువాత, ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లతో పాటుగా నెయ్యి కూడా వేసి బాగా కలిపాలి అంతే.. ఎంతో రుచికరమైన తియ్యటి పెసర పప్పు పొంగలి సిద్ధమైనట్లే. నవరాత్రి సందర్భంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ► బాదం పాయసం కావలసినవి: బాదం పప్పులు: ఒక కప్పు; పాలు – 6 కప్పులు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – కొద్దిగా; నీళ్లు – ఒక గ్లాసుడు. తయారీ: ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి గంట సేపు నానిన తరవాత, నీళ్లు ఒంపేసి, బాదం పప్పులపై వుండే పొట్టును తీసేయాలి తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేసి, బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి (అవసరం అయితే పాలు వేసుకోవాలి) బాదం పేస్టును పాన్‌లో వేసి 5– 10 నిమిషాలు వేడి చేయాలి చక్కెర జత చేసి మరి కాసేపు ఉంచి, బాగా చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం పోసి ఉడికించాలి కుంకుమపువ్వుతో అలంకరించితే, రుచికరమైన బాదం పాయసం రెడీ. ► పూర్ణం బూరెలు కావలసినవి: మినపప్పు – ఒక కప్పు; బియ్యం 2 కప్పులు; పచ్చి సెనగ పప్పు – 2 కప్పలు; బెల్లం తరుగు – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నూనె – తగినంత; నెయ్యి – అర కప్పు. తయారీ: ముందుగా మినపప్పు, బియ్యాన్ని కడిగి, సరిపడా నీళ్ళు పోసి సుమారు నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి పచ్చి సెనగపప్పును కుకరలో వేసి తగినన్నినీళ్ళు జత చేసి ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక బెల్లం తరుగు జత చేసి, తడి పోయేవరకు మరోమారు ఉడికించాలి (లేదంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది) చివరగా ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, కాగిన తరవాత ఉండలను మినపప్పు–బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి పూర్ణం మధ్యలో రంధ్రం చేసి, కాగిన నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. నిర్వహణ: వైజయంతి పురాణపండ కర్టెసీ: శ్రీదేవి లేళ్లపల్లి, చెన్నై -
కుకింగ్లు!
భగభగలాడే భూమి పొరల నుండి వెలికితీసి, మరిగించి, కరిగించి పోత పోసేది, మన ఒంటి మీది బంగారం అయితే భగ భగలాడే బాణలిలో ఉడికించి, మరిగించి, కరిగించి, పోపించి, వడ్డించేది మన కంచంలోని బంగారం. ఆ కమ్మటి వాసనను ఎగబీల్చి, ‘ఈ వంట చేసిన ఆవిడ ఎవరో’ అని అనుకుంటే పొరపాటే. వంట ఒక్క ఆడవాళ్ల సొత్త్తే కాదు, మేము కూడా చేయి కాల్చుకోగలం అని నిరూపించారు ఈ ముగ్గురు కుర్ర షెఫ్‌లు. ఇంజినీరింగో, ఎంబియే అనో వెళ్లకుండా పాకశాస్త్ర పట్టా పుచ్చుకొని, ఆ రంగంలో కొత్త రుచులు సృష్టిస్తున్న ఈ ముగ్గురి గురించి... 1- ‘‘ఎవరైనా 8వ తరగతి చదివే విద్యార్థిని, ట్యూషన్‌కో, ఐఐటీ కోచింగ్ సెంటర్స్‌కి వర్క్ షాపులకు పంపుతుంటారు. నన్ను మాత్రం హైదరాబాద్ పార్క్ హోటల్లోని పేస్ట్రీ అండ్ బేకరీ వర్క్‌షాప్‌కి పంపించారు నా తల్లిదండ్రులు. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పట్నుంచీ వంటలంటే చాలా ఆసక్తి. ఏదైనా తినగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగేది. దాని వెనుక ఉన్న మేజిక్ ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించేది. హాస్టల్లో ఉండి చదువుకునేప్పుడు, వారానికి రెండు మూడు రోజులైనా స్కూల్ కిచెన్‌లోకి వెళ్లి అంతా అబ్జర్వ్ చేసేవాడిని. నా ఆసక్తిని గమనించి మా పేరెంట్స్ నన్ను ఆ రంగం వైపు వెళ్లేందుకు ప్రోత్సహించడమే కాక, కలినరీ ఆర్ట్స్‌లో ఫ్యూచర్ ప్లానింగ్‌లోనూ సాయం అందిస్తున్నారు. ఆ వర్క్ షాప్ నా జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. షెఫ్‌లకు ఉండే విలువ, ఆదరణ కళ్లారా చూశాను. ఇద్దరు, ముగ్గురు షెఫ్స్ ఫోన్ నంబర్లను తీసుకుని, వారితో ప్రతిరోజూ మాట్లాడేవాడిని. రకరకాల వంటల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేవాడిని. స్కూల్‌కి వెళ్లడం, హోమ్ వర్క్ చెయ్యడం, షెఫ్‌లతో మాట్లాడటం, లేదంటే ఏదైనా వంట చెయ్యడం... ఇదే పని! దాంతో మా ఫ్రెండ్స్ నాకు ‘బావర్చి’ అని నిక్ నేమ్ పెట్టారు. నాకు పేస్ట్రీల మీద ఎక్కువ ఆసక్తి. ఆ ఆసక్తితోనే పార్క్ హోటల్లో జూనియర్ గౌర్మెట్ షెఫ్‌గా చేరాను. అక్కడ 5000 బ్రెడ్ పీసెస్‌తో రాష్ట్రంలోనే అతి పెద్ద జింజర్ డ్రెడ్ హౌస్‌ని నిర్మించాం. అందులో నేనూ ఒకణ్ణి అవ్వడం నా అదృష్టం. ఎన్నిసార్లు చేతులూ, వేళ్లూ కాల్చుకున్నా వాటినుండి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. 2- మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్నగారు ఛత్తీస్‌గడ్‌లోని ఒక నర్సింగ్ కాలేజీలో, అమ్మ ఓ హాస్పిటల్లో పని చేస్తారు. చిన్నప్పట్నుంచీ నాకు ‘ఇది అవ్వాలి’ అనే క్లారిటీ లేదు. తల్లిదండ్రులు, మెడికల్ ఫీల్డ్‌లో పని చేస్తుండటంతో డాక్టర్ అవుదామని ఇంటర్ తరువాతCOMEDKలో మంచి ర్యాంక్ సాధించా! కానీ అందరూ వెళ్లే దారిలోనే వెళుతున్నానని వెలితిగా అనిపించేది. అంతేకాక నేను ఎమ్‌బీబీఎస్ చేస్తే, మా తమ్ముడు కూడా నన్ను ఫాలో అయి ఎమ్‌బీబీఎస్ కానీ ఇంజినీరింగ్ కానీ చేస్తేనో? కనీసం మా ఇంట్లో ఈ పరిస్థితి మార్చాలనుకున్నాను. అందుకే ఎవరూ ఎన్నుకోని ప్రొఫెషన్ని ఎంచుకుందామని నిర్ణయించుకున్నాను. చిన్నప్పట్నుంచీ మా అమ్మ నాకు వండి తినిపించడమే కాక, వంట ఎలా చెయ్యాలో కూడా నేర్పేది. అందుచేత వంట అనేది నాకు చిన్నప్పట్నుంచీ ఉన్న హాబీ. అలాగే చిన్నప్పట్నుంచీ సంజీవ్ కపూర్ గారంటే ఒక ఆరాధ్యభావం. అంత సులువుగా వంట ఎలా చేసేవారా అని ఆశ్చర్యపోయేవాణ్ణి! అందులో కిటుకేంటో తెలుసుకుందామని ఈ వృత్తి ఎన్నుకున్నాను. మా ఇంట్లో కూడా ఓకే అన్నారు. వండటం అనేది కళ. ఒక చిత్రకారుడు చిత్రం వేసే ముందు రంగుల్ని కలుపుతాడు. నేను దినుసుల్ని కలుపుతాను. ‘ఎవరి హృదయాన్నయినా చేరుకోవాలంటే ముందు వారి కడుపుని శాంతపరచడమే మార్గం’ - ఇది ఇన్నేళ్ల వంట గది ప్రయాణంలో నేను నేర్చుకున్నది. ఐహెచ్ఎమ్లో చేరాక, వంట అంటే కేవలం గిన్నె, గరిటెల్లోనే ఉండేది కాదని తెలుసుకున్నాను. ఈ కలినరీ ఆర్ట్స్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని తెలుసుకున్నాను. ఈ రంగంలో జీతం బాగుంటుంది. మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా కోర్సులు చేసి, సొంతంగా ఒక ఇండియన్-ఇటాలియన్ రెస్టారెంట్ పెట్టాలనేది నా కోరిక. 3- ‘‘తండ్రి సైంటిస్టు. అన్న లా స్టూడెంట్. ఇంట్లో ఇద్దరు గొప్ప విద్యావంతులున్నా నాకు స్ఫూర్తినిచ్చింది మాత్రం నిరక్షరాస్యురాలైన మా అమ్మే. బీహార్‌లోని ససరం అనే చిన్న ఊరు మాది. ఇంటర్లో అవినాష్ అనే మిత్రుడుండేవాడు. అతను వంట చేయడంలో సిద్ధహస్తుడు. అతని స్ఫూర్తితో ఇంటర్ తర్వాత కలినరీ ఆర్ట్స్‌లో చేరాను. వంటలలో బేసిక్స్ మా అమ్మ దగ్గర నేర్చుకుంటే, నూతన టెక్నిక్స్‌ను మా స్నేహితుడి వద్ద నేర్చుకున్నాను. ఐహెచ్ఎమ్లో కోర్స్ పూర్తిచేసి ప్రస్తుతం లెమన్ ట్రీ ప్రీమియర్‌లో షెఫ్‌గా చేస్తున్నాను. సామర్థ్యం, మెళకువలతో పాటు దీక్ష, ఓపిక ఈ రంగానికి అవసరం. కుకింగ్ అనేది వేరొకరి మీద ప్రేమని చూపించే కళ. ఒక పెయింటింగ్‌నో, పొయిట్రీనో చూసినప్పుడు కలిగే భావన ఒక మంచి వంటకం తిన్నా కలుగుతుంది. అంతేకాక వంటల్లో మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. అందుకే కుకింగ్ ఒక కళే కాదు, సైన్సు కూడా! ప్రతి వంటా ఒక సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఆ సంప్రదాయాన్ని వేరే వారికి పరిచయం చేయడమే నా ధ్యేయం. అందుకే మారుమూల ప్రాంతాల్లో వంటకాలను రెసిపీలను యూ ట్యూబ్‌లో పెడుతున్నాను. అంతేకాక వాటి గురించి ఒక పుస్తకం కూడా రాస్తున్నాను. ఎక్కువ మంది ఈ రంగం మీద ఆసక్తి ఉన్నా చేరరు. డబ్బు తక్కువ వస్తుంది అనేది ఒక కారణం. కాని అది పూర్తిగా నిజం కాదు. మొదట ఒకటి రెండేళ్లు అరకొరగా ఉన్నా, ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్దీ జీతం విపరీతంగా పెరుగుతుంది. లక్షలు సంపాదించే షెఫ్‌లు కూడా మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ పని చేసినా తృప్తి అనేది ముఖ్యం. అది ఈ రంగంలో భాండాలకొద్దీ దొరుకుతుంది. నా మట్టుకు నాకు నేనే ఒక ఫుడ్ డాక్టర్... ఫుడ్ ఇంజినీర్!