వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కాకపోతే ఇవి ఇంజక్లన్ల రూపంలో వేయించుకునే వ్యాక్సిన్లు కావు. లొట్టలేసుకుంటూ తినే పేస్ట్రీలు. హంగేరియన్ పేస్ట్రీ షాప్‌లో వ్యాక్సిన్ థీమ్‌తో పేస్ట్రీలను తయారు చేస్తూ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ‘క్రియేటివిటీ భళా’ అంటూ వచ్చిన కస్టమర్లు తెగ అభినందనలు తెలుపుతున్నారట.
గ్రీన్ ఫర్ ఫైజర్, ఆరెంజ్ ఫర్ స్పుత్నిక్, బ్లూ ఫర్ మోడరనా... ఇలా కోవిడ్– 19 టీకా అనే అంశంపై హంగేరియన్ పేస్ట్రీ దుకాణం నిర్వహించే సులయన్ కుటుంబం వీటిని తయారుచేస్తోంది. పేస్ట్రీ జెల్లీ వేర్వేరు రంగుల్లో ఉండి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రతిబింబిస్తుంది. సిట్రస్ ఎల్లో ఆస్ట్రా జెనెకా, ముదురు పసుపు రంగు సినోఫార్మ్, ఫైజర్ కోసం గ్రీన్, స్పుత్నిక్ కోసం ఆరెంజ్, మోడరనా కోసం నీలం రంగులో తయారు చేస్తున్నారు. పేస్ట్రీ అలంకరణలో సిరంజిలను కూడా వాడారు.
వినోదమే తప్ప వివాదాల్లేవట..
కొన్నిరకాల టీకాల గురించి వివాదం నడుస్తోంది. కానీ, ఇక్కడ లభించే పేస్ట్రీల వల్ల మాత్రం ఎలాంటి వివాదం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘వినియోగదారుడు తమకు నచ్చిన వ్యాక్సిన్ పేస్ట్రీని కొనుగోలు చేసి, టేస్ట్ చేయచ్చు’ సులయన్ పేస్ట్రీ యజమాని కైట్లిన్ బాంక్వో చెబుతున్నారు. ‘వీటిని కొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ లేవు. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న ప్రజల ముఖాల్లో చిరునవ్వులను తీసుకురావడానికి మేం చేస్తున్న చిరు ప్రయత్నమిది’ అంటున్నారు నిర్వాహకులు.
Comments
Please login to add a commentAdd a comment