New trends
-
సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్..! ఇదీ లెటెస్ట్ ట్రెండ్ వైరల్ స్టోరీ
ఇప్పుడంటే బఫేలు, కేటరింగ్లు వచ్చాయి గానీ, గతంలో విందు భోజనాల్లో కొసరి కొసరి వడ్డించడం అలవాటు. ఏమండీ... ఇది రుచి చూశారా.. మీ కోసమే స్పెషల్‌గా చేయించా... అసలు ఈ పనస పొట్టు బిర్యానీ తిని చూడండి.. హా.. ములక్కాడ, జీడిపప్పు అబ్బ.. ఒక్కసారి రుచి చూడండి... ఇంకో పూర్ణ బూరె వేసుకోండి.. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే బ్రహ్మాండం కదా..! అన్నట్టు చివర్లో తాంబూలం మర్చిపోకండి సుమా! ఇదీ పెళ్లిళ్లు, పేరంటాల్లో అతిథులకు లభించే మర్యాద. కానీ ప్రస్తుత బిజీ లోకంలో ఆ అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. దీన్ని అందిపుచ్చుకున్న చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారంలో ట్రెండ్ మార్చేశాయి. ప్రస్తుత బిజీ లోకంలో ఆనాటి అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. దీన్నే చిన్నా, పెద్దా రెస్టారెంట్లు, హోటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. రా రామ్మని ఊరించేలా కస్టమర్లను వినూత్నంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటిదాకా సరికొత్త రుచులు, వివిధ ప్రాంతాల వంటకాలను అందించిన హోటళ్లు భోజన ప్రియుల్ని, కొత్తగా తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించడమే కాకుండా చుట్టాల్లా ఆదరిస్తున్నాయి. ( శివారులో వినూత్న హోటళ్లు) ఇక ఆ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేలా తమ హోటళ్ల పేర్లను పెట్టుకోవడంలో మరో అడుగు ముందుకేశాయి. తినేసి పో.., ఉలవచారు, కోడికూర-చిట్టిగారె,రాజుగారి పులావ్ లాంటి పేర్లతో తమ హోటళ్ళకు రప్పించుకుంటున్నాయి. (ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను! ) సమోసాను, కచోరీని మర్చిపోతే ఎలా? ఎప్పటికపుడు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఈక్రమంలోనే ఇపుడు నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అయ్యా , మా హోటల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి మాత్రం ఇవి మర్చిపోవద్దు అంటూ గుర్తు చేయడం విశేషంగా నిలిచింది. రెస్టారెంట్ బిల్లుపై సమోస, కచోరీ తినడం మర్చిపోకండి.. వాటిలో ఫిల్లింగ్ ఉంటుంది. కడుపు నిండుతుంది అన్నట్టు ఒక మెసేజ్ ఉండటం లేటెస్ట్ ట్రెండ్. దీనికి సంబంధించిన రిసీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఔరా అంటున్నారు భోజన ప్రియులు. (హంగూ, ఆర్బాటంలేదు, గుర్రమెక్కలేదు.. మూడు ముళ్లు వేయలేదు.. సింపుల్‌గా సెలబ్రిటీ పెళ్లి) -
బంగారం కొనుగోలులో కొత్త ట్రెండ్: నెల నెలా కొనేద్దాం!
ఒకేసారి 10 గ్రాముల ఆభరణం కొనుగోలు చేద్దామంటే.. ధరల తీవ్రత. దీనితో వినియోగదారులు నెలవారీ డిపాజిట్, కొనుగోళ్ల పథకాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతోందని బంగారం వర్తకులు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ‘నెలవారీ డిపాజిట్ పథకాల ద్వారా జరుగుతున్న విక్రయాల’ వాటా 50 శాతం దాటినట్లు కొందరు వర్తకులు వెల్లడించారు. దాదాపు ప్రతి గోల్డ్ రిటైల్ చైన్ డిపాజిట్ స్కీమ్‌లను కస్టమర్లకు అందిస్తున్నాయి. కొన్ని సంస్థల నుంచి అందిన వివరాలు.. తనిష్క్ రూ.3,890 కోట్ల సమీకరణ టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) డిపాజిట్ల రూపంలో రూ.3,890 కోట్లు సమీకరించింది. అంతక్రితం (2021–22) ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.2,701 కోట్లు. రిలయన్స్ రిటైల్లోనూ ఇదే ధోరణి.. 2021–22తో పోల్చితే 2022–23లో ఈ పథకాల ద్వారా రిలయన్స్ రిటైల్ సమీకరణ మొత్తం రూ.184 కోట్ల నుంచి రూ.282 కోట్లకు ఎగసింది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ సంస్థ పలు పథకాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. పీఎన్జీ జ్యూవెలర్స్‌లో 27 శాతం అప్ పీఎన్జీ జ్యూవెలర్స్... డిపాజిట్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు 2022–23లో రూ. 700 కోట్లు సమీకరంచింది. 2021–22తో పోల్చితే ఈ పరిమాణం 27 శాతం అధికం. మహారాష్ట్ర, గోవాల్లో ఈ సంస్థ 42 స్టోర్లను ఆపరేట్ చేస్తోంది. శాన్కో గోల్డ్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు సంబంధించి కోల్‌కతాకు చెందిన శాన్కో గోల్డ్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 192 కోట్లు సమీకరించింది. 2021–22తో పోల్చితే ఈ విలువ భారీగా 89 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిస్కౌంట్ల ఆకర్షణ డిపాజిట్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లు పెరగడానికి రిటైలర్లు కూడా పలు ఆఫర్లు, ప్రోత్సాహకాలు అందజేస్తుండడం గమనార్హం. 10 నెలల స్కీమ్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్లో 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ వర్గాలు తెలిపాయి. ‘‘కోవిడ్ పసిడి ఆభరణాల కొనుగోళ్ల పథకాలపై ప్రభావం చూపాయి. అయితే మళ్లీ ఈ విభాగం ఇప్పుడు పురోగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే పసిడి పథకాల ద్వారా కొనుగోళ్ల విలువ 50 శాతం పెరిగింది’’ అని తనిష్క్ చైన్ నిర్వహించే టైటాన్ కంపెనీ జ్యూవెలరీ విభాగ సీఈఓ అజయ్ చావ్లా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం తనిష్క్ అమ్మకాల్లో పసిడి పథకాల ద్వారా విక్రయాలు 19 శాతమని చావ్లా తెలిపారు. ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. పసిడి పథకాల్లో ఒక నిర్దిష్ట కాలానికి నెలవారీ డిపాజిట్ల ద్వారా చివరకు ఒక ఆభరణాన్ని పొందగలగడం ఒక అనుభూతిగా కస్టమర్లు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మన్ముందు సంవత్సరాల్లో నెలవారీ డిపాజిట్ల ద్వారా పసిడి కొనుగోళ్ల ధోరణి మరింత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈ రంగంలోని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికల చిత్రం మారుతోంది.. ప్రధాన కారణం అదేనా?
మన దేశంలో ఎన్నికల తీరుతెన్నులను 2014కు ముందు, తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖ గీయొచ్చు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో విభిన్నమైన ధోరణులు కనిపించాయి. ఒకప్పుడు వివిధ రాష్ట్రాల్లో బహుముఖ పోరు ఉంటే, ఇప్పుడు రెండు పార్టీలే నేరుగా తలపడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం , రాష్ట్రాల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉండే కీలక పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపిస్తూ ఉండడంతో ఎన్నికల ట్రెండ్స్ మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంటుందని అందరూ భావించినప్పటికీ జేడీ(ఎస్) తన ప్రాభవాన్ని కోల్పోయి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నేరుగా పోటీ జరగడం అతి పెద్ద ఉదాహరణ. ఇకపై ఎన్నికల్లో కింగ్మేకర్లు అన్న పదమే వినిపించేలా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ► హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పిలుచుకునే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకప్పుడు ముఖాముఖి పోరు నెలకొని ఉండేది. ఇప్పుడు ఎన్నికల తీరుతెన్నుల్ని చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు నెలకొని ఉంది. గుజరాత్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య పోరు ఉంటే, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పార్టీల మధ్య బహుముఖ పోరాటం నెలకొంది. ► కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఢిల్లీ తీసుకుంటే 2014కి ముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉండేది. కానీ కాలక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం, కాంగ్రెస్ బలహీనపడడం మొదలైంది. దీంతో దేశరాజధానిలో ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. మరోవైపు హరియాణాలో బీజేపీ బలం పుంజుకోవడంతో అక్కడ ముఖాముఖి పోరు కాస్త బహుముఖ పోరుగా మారింది. బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ల మధ్య ఎన్నికల్లో రసవత్తరంగా పోరు నడుస్తోంది. ► కొన్ని రాష్ట్రాల్లో పోలయిన ఓట్లను విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీలకే ఓట్లు వేసే ధోరణి కనిపిస్తుంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉండే పార్టీలే అత్యధిక ఓటు షేర్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బీఎస్పీ, కర్ణాటకలో జేడీ(ఎస్), బెంగాల్లో వామపక్ష పార్టీలకు ఓట్లు వేసినా ఉపయోగం లేదన్న భావన ఓటర్లలో వచ్చింది. అందుకే రెండు పార్టీల్లో ఏదో ఒకదానిపైనే మొగ్గు చూపించే రోజులొచ్చాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల అసెంబ్లీలలో కమలనాథులు పట్టు బిగిస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఒడిశా, త్రిపుర రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తూ ఇతర పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం వల్ల ఎన్నికల తీరు మారిపోయి రెండు పార్టీల మధ్య పోరు నెలకొంది. -
రూ.25 లక్షల ప్యాకేజీ.. సాఫ్ట్వేర్ ఉద్యోగం.. అయినా పెళ్లికి ఇది సరిపోదు..
పెళ్లి సంబంధం కుదరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. సంపాదన ఏడాది ప్యాకేజీ ఎంత అన్నదీ కీలకంగా చూస్తున్నారు. ‘ప్యాకేజీ’ నచ్చితేనే అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు ఓకే చేస్తున్నారు. లేకుంటే మరో ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పెళ్లి చూపులు కూడా సరికొత్త రూపు దాలుస్తున్నాయి. వధువు ఇంట జరగాల్సిన పెళ్లి చూపులకు హోటళ్లు.. ఇతర ప్రదేశాలు వేదికగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన దీప్తి డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇదే జిల్లాకు చెందిన అబ్బాయి రాకేష్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే వీరిద్దరి పెళ్లిచూపులు అయ్యాయి. వచ్చే నెల ఇండియాలో పెళ్లి జరగబోతోంది. ►గుంతకల్లుకుచెందిన సురేష్‌కు నాలుగైదు సంబంధాలు వచ్చినా.. కుదరలేదు. కారణమేంటంటే.. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లయినా పెద్ద కుటుంబం కదా ఇంతమందికి పెట్టుపోతలు కష్టమని అమ్మాయి తరఫు వారు వెనక్కు తగ్గుతున్నారు. ►ఆస్తులు, అంతస్తులు.. ముందు పది తరాలు, వెనుక పది తరాలు.. బలమూ బలగమూ ఇవి ఉంటే చాలు గతంలో అమ్మాయికి ఎలాంటి ఢోకా లేదని పెళ్లి కుదుర్చుకునే వారు. రానురాను కాలం మారింది. ఆస్తులేమోగానీ బలమూ బలగానికి చోటు లేదు. ఇప్పుడంతా ‘ప్యాకేజీ’లే. నెలజీతం ఎవరూ అడగడం లేదు. వార్షిక ప్యాకేజీ (యాన్యువల్ ప్యాకేజీ)ని బట్టి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. ప్యాకేజీ లేకపోతే వందెకరాల భూస్వామి కొడుక్కు కూడా పిల్లనిస్తామని వచ్చేవారు లేరు. అదే హైదరాబాద్.. బెంగళూరుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అమ్మాయిలకు అయితే డిమాండ్ బాగుంది. అమ్మాయిల ప్యాకేజీల పైనా ఆరా.. అబ్బాయికి ఏడాదికి రూ.25 లక్షలు ప్యాకేజీ అయినంత మాత్రాన పదో తరగతి చదివిన అమ్మాయిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు, అదీ మంచి ప్యాకేజీతో వేతనం ఉన్న వారికి త్వరగా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల విషయంలో కట్న కానుకలు రెండో ప్రాధాన్యత అంశంగా మారింది. కానుకల విషయంలో వెసులుబాటూ కలుగుతోంది. డాక్యుమెంట్లు చూపించండి ఆస్తులు, డబ్బే ఇప్పుడు పెళ్లిళ్లను కుదురుస్తున్నట్టుంది. ఆస్తులున్నట్టు చెబితే డాక్యుమెంట్లు అడుగుతున్న వారూ లేకపోలేదు. ఉమ్మడి ఆస్తులకు లెక్కచెప్పండి.. నీ వాటా ఎంత వస్తుంది, ఎప్పుడు పంచుకుంటున్నారు..మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంటుంది. ఇలాంటివన్నీ అడుగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విదేశాల్లోనే వివాహ బంధాలు అమెరికా, కెనడాల్లో స్థిరపడిన అబ్బాయిలు, అమ్మాయిలు.. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో అక్కడే పెళ్లిచూపులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడి తల్లిదండ్రులు ఆస్తులు, ఇళ్లు, డబ్బు వగైరాలు ఆరా తీసి ఓకే చేస్తున్నారు. ఇలా అయితే ప్రత్యేకంగా హెచ్1 వీసాలు, డిపెండెంట్ వీసాలు అక్కర్లేదని అక్కడికక్కడే సంబంధం వెతుక్కుంటున్నారు. ఆడపడుచులు..అన్నదమ్ములు ఉంటే.. ఉమ్మడి కుటుంబమంటే పెళ్లి చూపులకు కూడా మొగ్గుచూపని పరిస్థితి నెలకొంది. చివరకు అబ్బాయి తరఫున ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నా ఇలాంటి వాటికి అమ్మాయి తరఫు వాళ్లు మక్కువ చూపడం లేదు. ‘ఇంతమందికి మా అమ్మాయి సేవలు చేయలేదు’ అని ముఖాన్నే చెప్పేస్తున్నారు. పెళ్లవగానే అబ్బాయి వేరు కాపురం పెడితేనే వస్తామనే అమ్మాయిలూ లేకపోలేదు. హోటళ్లలోనే పెళ్లిచూపులు కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లి చూపులు ఇంటివద్ద చేయడం లేదు. ఎక్కువ సంబంధాలు వచ్చి వెనక్కు వెళుతున్నాయన్న వంక చూపిస్తారని..హోటళ్లలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇరువురూ మాట అనుకోవడం.. హోటల్‌కు రావడం కాఫీ తాగుతూ అబ్బాయి.. అమ్మాయి మాట్లాడుకోవడం. ఇదీ పెళ్లిచూపుల తంతు. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కాఫీతోనే పెళ్లిచూపులు ముగుస్తున్నాయి. ‘ప్యాకేజీ’కే ప్రాధాన్యం రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులంతా ఏడాది వేతనాని (యాన్యువల్ సాలరీ ప్యాకేజీ)కే ప్రాధాన్యమిస్తున్నారు. ఈడు జోడు, జాతకాలు, ఇతరత్రాలు అన్నీ గొప్ప సంపాదన ముందు తక్కువే అని వధూవరులు భావిస్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి కెరియర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు – బత్తలపల్లి సత్య రంగారావు, వధూవరుల పరిచయ వేదిక పిల్లల అభిప్రాయాలదే చెల్లుబాటు మేము పాతికేళ్లుగా వివాహాలు చేయిస్తున్నాం. ముందు రోజుల్లో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఆలోచించకుండా ఒప్పుకునేవారు. ఇప్పుడు పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వివాహాది సంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. అతి స్వేచ్ఛ వల్ల కూడా చాలా వివాహ బాంధవ్యాలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. –గరుడాద్రి సురేష్ శర్మ, పురోహితులు -
ఆర్థిక రంగంలో నూతన ఒరవడులు
గాంధీనగర్/సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ ఆర్థిక రంగంలో నూతన ఒరవడులను సృష్టించే దేశాల సరసన భారత్ నిలిచిందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఘటన సాధించిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్..ప్రస్తుత, భవిష్యత్ పాత్రను పోషించగల సంస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం గాంధీనగర్ సమీపంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) శంకుస్థాపన అనంతరం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్(గిఫ్ట్)లో ప్రధాని ప్రసంగించారు. గిఫ్ట్ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సేవల్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైం డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ వాటా 40% వరకు ఉందన్నారు. విద్యార్థులు దేశ ప్రగతికి సారథులు నేటి విద్యార్థులు రేపటి దేశ ప్రగతికి సారథులుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెన్నై గిండిలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 69 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ప్రపంచం మొత్తం భారతీయ యువతను గమనిస్తోందని, వారే దేశాభివృద్ధిలో కీలకమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ద్వారా అన్నా యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు లభించాయన్నారు. కరోనా కాలంలో దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లకు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరి వల్లే పరిష్కారం లభించిందన్నారు. -
Youth Pulse: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్‌టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!
Semiconductor Career Opportunities in India: ‘శుభాకాంక్షలు’ తెలియజేసే ఛీర్... హిప్ హిప్ హుర్రే. ఇప్పుడు అదే ఛీర్తో భవిష్యత్కాల శుభ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ‘చిప్ చిప్ హుర్రే’ అంటుంది యూత్. ఎందుకంటే...పరాధీనతకు చరమగీతం పాడడానికి, సెమికండక్టర్ చిప్‌ల తయారీవ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. రాబోయే కాలంలో ఈ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు యూత్ కోసం ఎదురుచూస్తున్నాయి. సర్వం సాంకేతికమయం అయిన ఈ ప్రపంచంలో సెమికండక్టర్ చిప్‌లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కరోనా కాటేసిన రంగాలలో ‘చిప్’ తయారీరంగం కూడా ఒకటి. కరోనాదెబ్బతో ‘చిప్’ల డిమాండ్, సరఫరాకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. తయారీదార్లు రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో దేశాలు సెమీకండక్టర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మన దేశం సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పన,తయారీ ప్రాజెక్ట్ కోసం 76వేల కోట్లు కేటాయించింది. మరోవైపు విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలో సెమికండక్టర్ల డిజైన్‌ను అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘దేశంలో చిప్‌ల కొరత...అనే వార్త చదువుతున్న క్రమంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అనే కోణంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నన్ను ఆశ్చర్య,ఆనందాలకు గురి చేసిన విషయం ఈ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు. ఇంజనీరింగ్ చదువుతున్న చెల్లి సుహానితో నేను చదివిన విషయాలను షేర్ చేసుకున్నాను’ అంటోంది నాగ్‌పూర్(మహారాష్ట్ర)కు చెందిన కావేరి. చెల్లి సుహానికి ఇప్పుడు ‘చిప్స్’ అనేది హాట్‌టాపిక్. ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అనేదాని గురించి చిన్నపాటి రిసెర్చ్ చేయడమే కాదు ఆ విషయాలను స్నేహితులకు చెబుతోంది. పెద్ద పెద్ద సంస్థలు దేశంలోని వివిధప్రాంతాలలో సెమికండక్టర్ల తయారీ యూనిట్లను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. ఇదే సందర్భంలో మాన్యుఫాక్చరింగ్ టాలెంట్, ప్రాక్టికల్ స్కిల్స్‌పై చర్చ మొదలైంది. కళాశాల చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులను ‘జాబ్–రెడీ’కి సిద్ధం చేయడానికి ఆరు నుంచి పన్నెండు నెలల టైమ్ పడుతుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. ‘ఫ్యూచర్ ఏమిటి?’ అని రకరకాలుగా ఆలోచించిన సహజకు ‘చిప్’ల రూపంలో ఇప్పుడొక దారి దొరికింది. తిరునెల్వేలి(తమిళనాడు) చెందిన సహజ ‘సెమీకండక్టర్ ఇంజనీర్’ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ‘సెమీకండక్టర్ల పరిశ్రమలో నైపుణ్యం కొరతను దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం చిప్ స్కూల్‌ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సైన్స్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. చిప్ స్కూల్లో విద్యార్థులకు సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించడంతో పాటు సీనియర్ ఇంజనీర్లు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు, ప్రొఫెసర్లతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. అలాంటి స్కూల్స్ మన దేశంలో కూడా ఏర్పాటుచేయాలి’ అంటుంది సహజ. మాసివ్ టాలెంట్ షార్టేజీ... అనే మాట ఒకవైపు నుంచి నిరాశగా వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి మాత్రం అత్యంత ఉత్సాహంగా ‘మేము రెడీ’ అని సన్నద్ధం అవుతోంది యువతరం. సాంకేతిక చదువు మాత్రమే చిప్ తయారీ పరిశ్రమలో రాణించడానికి ప్రధాన అర్హత కావడం లేదు. దీనికి క్రియేటివిటీ కూడా అత్యవసరం అంటున్నారు నిపుణులు. తమ డిజైనింగ్ ద్వారా టైమ్, డబ్బును ఆదా చేయడం యూత్ క్రియేటివిటీలో ఒకటి కాబోతుంది. చదవండి: Indravathi Inspiring Story: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది -
Influencers: పేరుకు పేరు.. చెప్పుకోదగ్గ ఆదాయం.. !
ఇప్పుడు మచ్చుకు రెండు సంభాషణలు... ‘చదువు పూర్తయింది కదా, కీర్తి ఇప్పుడు ఏం చేస్తుంది?’ ‘ఆ అమ్మాయికేం, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మారింది’ ‘ఉద్యోగం చేయను’ అంటున్నాడు శ్రీకర్. ‘మరి ఏం చేస్తాడట?’ ‘ఖాళీగా ఏమీ కూర్చోలేదు. ఇన్ఫ్లుయెన్సర్గా ఫుల్‌బిజీలో ఉన్నాడు’ ∙∙ ‘ఇన్ఫ్లుయెన్సర్ అనే మాట మనకు కొత్త కాదు. అయితే ‘జెన్ జడ్’ ఇన్ఫ్లుయెన్సర్ వేరు. ఇంతకీ ఎవరు వీరు?ఒక ఉత్పత్తికి మార్కెట్లో ప్రాచుర్యం కలిగించడానికి, నలుగురి దృష్టిని ఆకర్షించేలా మాట్లాడటానికి‘సెలబ్రిటీ హోదా’తో పనిలేదని ఇన్ఫ్లుయెన్సర్లు రుజువు చేస్తున్నారు. తమ క్రియేటివిటీతో సోషల్ మీడియాలో వెలిగిపోతున్న యూత్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లుగా సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒక ప్రాడక్ట్‌కు తమ మాటల చాతుర్యంతో ప్రాచుర్యం కలిపించడమే వీరి పని. దీనిద్వారా చెప్పుకోదగ్గ ఆదాయం గడిస్తున్నారు. మైక్రో–సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకుంటున్నారు. ‘గతంతో పోల్చితే బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి కంపెనీలు యూత్ ఇన్ఫ్లుయెన్సర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటున్నారు కన్జ్యూమర్ మార్కెట్ విశ్లేషకులు హర్ష. ఒక ఇన్ఫ్లుయెన్సర్ విజయసూత్రం ఏమిటి? ట్రెండ్ ఏమిటో తెలిసి ఉండడమే కాదు, దానికి భిన్నంగా ఆలోచించి కొత్తగా ఎలా ఆకట్టుకోవాలో తెలిసుండాలి. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు చేసిన అధ్యయనంలో ట్రెడిషనల్ సెలబ్రిటీల కంటే, యువ ఇన్ఫ్లుయెన్సర్ల మాట వినడానికి టీనేజర్స్ అధిక ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఏదో గాలివాటంగా గోదాలోకి దిగడం అని కాకుండా ఇన్ఫ్లుయెన్సర్గా తమను తాము మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తుంది యువత. ‘ఏ సబ్జెక్ట్‌లో నా బలం ఉంది’‘ఏ ప్లాట్‌ఫామ్ అయితే బాగుంటుంది?’ ‘టార్గెట్ ఆడియన్స్ ఎవరు?’‘ఏ తరహా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి? ‘ఇతర ఇన్ఫ్లుయెన్సర్లతో ఎలా కొలాబరేట్ కావాలి? ఇతర కమ్యూనిటీల నుంచి ఫ్యాన్స్ బలాన్ని ఎలా పెంచుకోవాలి? ‘సోషల్ మీడియలో స్ట్రాటిజికల్గా ట్రాఫిక్ ఎలా జెనరేట్ చేయాలి?’... ఇలా ఎన్నో విషయాల్లో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. ‘ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లోని బ్యూటీ ఏమిటంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్గా మారవచ్చు!’ అనే నానుడి కాని నానుడి ఉంది. అలా అని మాయ చేసి ఫేక్ఫాలోవర్స్తో సక్సెస్ కావడానికి లేదు. కచ్చితంగా శాస్త్రీయ ప్రమాణాలు పాటించాల్సిందే. ‘హై లెవల్ ఆఫ్ ట్రస్ట్’ ఇన్ఫ్లుయెన్సర్ గెలుపులో కీలకం అవుతుంది. తమకు కావల్సిన ఇన్ఫ్లుయెన్సర్లను వెదికి పట్టుకునేంత టైమ్ కంపెనీలకు ఉండడం లేదు. దీంతో నికార్సయిన ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో క్లియర్, ట్రాకర్, హైపర్... మొదలైన ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ల సహాయం తీసుకుంటున్నారు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో వీటిని గ్రేట్ స్టార్టింగ్ పాయింట్స్‌గా చెబుతున్నారు. చదవండి: ఎంత మంచి మనసమ్మా నీది.. తమ్ముడికి పెళ్లి చేసి.. తల్లి కోసం తను మాత్రం.. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) -
కొత్త క్రియేటివిటి.. వ్యాక్సిన్ థీమ్ పేస్ట్రీలు..
వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కాకపోతే ఇవి ఇంజక్లన్ల రూపంలో వేయించుకునే వ్యాక్సిన్లు కావు. లొట్టలేసుకుంటూ తినే పేస్ట్రీలు. హంగేరియన్ పేస్ట్రీ షాప్‌లో వ్యాక్సిన్ థీమ్‌తో పేస్ట్రీలను తయారు చేస్తూ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ‘క్రియేటివిటీ భళా’ అంటూ వచ్చిన కస్టమర్లు తెగ అభినందనలు తెలుపుతున్నారట. గ్రీన్ ఫర్ ఫైజర్, ఆరెంజ్ ఫర్ స్పుత్నిక్, బ్లూ ఫర్ మోడరనా... ఇలా కోవిడ్– 19 టీకా అనే అంశంపై హంగేరియన్ పేస్ట్రీ దుకాణం నిర్వహించే సులయన్ కుటుంబం వీటిని తయారుచేస్తోంది. పేస్ట్రీ జెల్లీ వేర్వేరు రంగుల్లో ఉండి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రతిబింబిస్తుంది. సిట్రస్ ఎల్లో ఆస్ట్రా జెనెకా, ముదురు పసుపు రంగు సినోఫార్మ్, ఫైజర్ కోసం గ్రీన్, స్పుత్నిక్ కోసం ఆరెంజ్, మోడరనా కోసం నీలం రంగులో తయారు చేస్తున్నారు. పేస్ట్రీ అలంకరణలో సిరంజిలను కూడా వాడారు. వినోదమే తప్ప వివాదాల్లేవట.. కొన్నిరకాల టీకాల గురించి వివాదం నడుస్తోంది. కానీ, ఇక్కడ లభించే పేస్ట్రీల వల్ల మాత్రం ఎలాంటి వివాదం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘వినియోగదారుడు తమకు నచ్చిన వ్యాక్సిన్ పేస్ట్రీని కొనుగోలు చేసి, టేస్ట్ చేయచ్చు’ సులయన్ పేస్ట్రీ యజమాని కైట్లిన్ బాంక్వో చెబుతున్నారు. ‘వీటిని కొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ లేవు. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న ప్రజల ముఖాల్లో చిరునవ్వులను తీసుకురావడానికి మేం చేస్తున్న చిరు ప్రయత్నమిది’ అంటున్నారు నిర్వాహకులు. -
క్వారంటైన్ కాఫీ
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్ అప్లోడ్ అవుతున్నాయి. వీటిలో అత్యధికమైన పోస్ట్స్ ఫుడ్ గురించే ఉంటున్నాయి. ఎక్కువ టైమ్ ఇంట్లో ఉండటంతో ఇప్పటిదాకా మర్చిపోయిన పాక శాస్త్రాన్ని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటున్నారు కొందరు. మరికొందరేమో.. హోటల్స్, రెస్టారెంట్ ఫుడ్‌కి అలవాటైన జిహ్వను అణుచుకోలేక తమకు తామే స్వయంగా కొత్త వంటల్ని ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సిటీజనులకు ఇప్పుడు క్రేజీగా మారింది డాల్గొనా. దక్షిణ కొరియాలోని స్పాంజీ టాఫీ నుంచి స్ఫూర్తి పొందిన ఈ డాల్గొనా కాఫీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మూడు రకాల ముడి దినుసులతో తయారయ్యే ఈ కాఫీ ఇప్పుడు సిటీలో పలువురి ఇళ్లలోనూ ఘమఘమలు పంచుతోంది. నేపథ్యమిదీ.. దక్షిణ కొరియా కాఫీ కల్చర్‌కు బాగా ఫేమస్. సాధారణ ముందస్తుగా కలిపిన ప్రీ మిక్సడ్ కాఫీ నుంచి ఆర్టిస్టిక్ క్యులినరీ విశేషాలు కలగలిసిన కాఫీలకూ అక్కడ డిమాండ్ ఎక్కువే. అచ్చం అక్కడిలానే నగరంలోనూ యువత సోషలైజింగ్‌కు ఎక్కువగా కాఫీషాప్‌లే ఎంచుకుంటారనేది తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాఫీషాప్ ముఖం చూసి కూడా ఎన్నో ఏళ్లు గడిచినట్టయ్యిందని అంటున్నారు నగరవాసులు. ఈ పరిస్థితుల నుంచే పుట్టుకొచి్చంది సింపుల్ హోమ్ మేడ్ కాఫీ డాల్గొనా. దీన్నిప్పుడు క్వారంటైన్ కాఫీ అని నెటిజన్లు పిలుస్తున్నారు. దీని తాలూకు రిసిపీ, ఫొటోలు, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్‌లలో సందడి చేస్తున్నాయి. కేవలం మూడు ముడి దినుసులతో సులభంగా తయారు చేసుకోగలగడంతో ఇప్పుడది క్రికెట్ గాడ్ సచిన్ సహా పలువురికి క్వారంటైన్ ఫేవరెట్‌గా మారిపోయింది. మేడ్ ఈజీ.. టేస్ట్ క్రేజీ.. ఓ రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్, 2 కప్పుల బాయిల్డ్, కూల్డ్, చిల్డ్ మిల్‌్క, కొన్ని ఐస్ క్యూబ్స్‌లను సిద్ధం చేసుకోవాలి. బౌల్లో కాఫీ పౌడర్ వేసి పంచదార, హాట్ వాటర్ దానికి కలపాలి. బాగా అంటే నురుగ లాగ చిక్కగా అయ్యేవరకూ (సుమారుగా 10 నిమిషాల వరకూ) కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నుంచి తీసిన చిల్డ్ మిల్క్ గ్లాసులో పోసుకోవాలి. తయారు చేసుకున్న నురగని గ్లాసుకు పైన తేలేలా పోయాలి. ఫ్లేవర్ పాలలో కలవడానికి ఓ మూల నుంచి ఒక్కసారి మాత్రం తేలికపాటి డిప్ చేయాలి. సర్వ్ చేసేటప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు జెమ్స్, చాకో చిప్స్, చాక్లెట్ సిరప్.. వంటివి టాపింగ్స్‌గా వేసుకోవచ్చు. కాఫీ.. కుక్.. చాలా మంది సెలబ్రిటీలు డాల్గొనా సేవించడం చూశాను. నాకు పెద్దగా వంట రాదు. అయితే ఈ కాఫీ చాలా క్విక్‌గా, సులభంగా తయారు చేసుకోవచ్చనేది ఇన్‌స్ట్రాగామ్ ద్వారా కొందరు చేస్తున్నప్పుడు అర్థమైంది. దాంతో నేనూ ప్రయతి్నద్దామని అనుకున్నా. రిసిపి గురించి తెలుసుకుని తయారు చేశా. జెమ్స్, చాకో చిప్స్‌తో దానిని అలంకరించా. కోల్డ్ కాఫీ తాగకుండా నేనెప్పుడూ ఏ రెస్టారెంట్ కాఫీ షాప్‌ని దాటింది లేదు. దీంతో కోల్డ్ కాఫీ దొరక్క ప్రాణం గిలగిల్లాడిపోతోంది. సో.. నా కొత్త క్వారంటైన్ పార్ట్నర్గా ఇది మారిపోయింది. – వర్షిత లక్ష్మి, శ్రీనగర్‌కాలనీ మంచి రిఫ్రెష్మెంట్.. ఈజీగా తయారు చేసుకోగలగడమే డాల్గొనా క్రేజ్‌కి కారణం అనిపిస్తుంది. ఒక కాఫీ తయారు చేసేయగలిగామనే కాఫీ మాస్టర్‌లాంటి ఫీల్.. కాఫీ టేస్ట్‌కి తోడవుతుంది. ఈ డాల్గొనాకి క్యారామెల్, చాక్లెట్, సాస్ వంటివి కూడా జోడించుకోవచ్చు. సమ్మర్లో మంచి రిఫ్రెష్‌మెంట్‌గా దీన్ని చెప్పొచ్చు. తయారు చేయడం మంచి ఫన్ కూడా. – నేహ -
పీకి పందిరేయవచ్చు
ఇప్పటి వరకు మనకు తెలిసింది పిల్లలకు కథ చెప్పి వాళ్లను ఊహా లోకంలో విహరింపచేయడమే. అది కాకపోతే టీవీలో, యూ ట్యూబ్‌లో కామిక్ వీడియోలు చూపించి కథ తెలియ చేయడం తెలుసు. ఇప్పుడు కొత్త ట్రెండ్ పిల్లల్ని కథల్లో జీవింపచేయడం. ఆ ట్రెండ్‌ను సృష్టించింది.. ‘అమర్ చిత్ర కథ అలైవ్’. ఓ హనుమంతుడు, ఓ శ్రీకృష్ణుడు వంటి పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్ల సృజనాత్మకతకు చక్కటి పందిరి వేయడానికి అనువైన రూపకల్పన ఇది. రాణా రతన్ సింగ్ రాజస్థాన్‌లో ఓ రాజ్యానికి రాజు. అతడి గారాల కూతురు మీరా. ఆమె ఓ రోజు అంతఃపురంలో నుంచి రాజవీథి నుంచి వెళ్తున్న పెళ్లి ఊరేగింపుని చూసింది. ఏనుగు అంబారీ మీద ఊరేగుతున్న వరుణ్ని చూసింది. పెళ్లంటే... ఒక అమ్మాయి వధువులా అలంకరించుకుని ఒద్దికగా ఉంటుంది. ఒక అబ్బాయి వరుడి అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు... అని అర్థం చేసుకుంది ఆరేళ్ల మీరా. ‘అమ్మా! నాకు వరుడు ఎవరు’ అని వాళ్లమ్మను అడిగింది. ఈ సన్నివేశంతో మొదలైన భక్త మీరాబాయి కథ, ఆమె వృద్ధాప్యం వరకు సాగుతుంది. కృష్ణుడి పట్ల ఆమె మధురభక్తిని బొమ్మలతో కళ్లకు కడుతుంది అమరచిత్ర కథ. అలాగే హనుమాన్ కూడా. పిల్లలకు ఇష్టమైన పాత్ర. ఉదయిస్తున్న ప్రభాత భానుడిని పండుగా భావించిన బాల హనుమాన్ ఆ పండుని అందుకోవడానికి గాల్లోకి ఎగురుతాడు. ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు తమను తాము హనుమంతుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటారు. హనుమంతుడు లంకాదహనం చేస్తున్న బొమ్మలను చూస్తూ... తోక ఒక్కటి లేదన్నమాటే కానీ ఇంట్లో అంతటి బీభత్సాన్ని సృష్టిస్తారు గడుగ్గాయిలు. అమరచిత్రకథ రూపకర్త అంకుల్ పాయ్ సృష్టించిన పిల్లల ప్రపంచం ఇది. కథల మామయ్య అందరికీ మేనమామ చందమామ. అయితే పిల్లలకు కథలు చెప్పే మామ అనంత్‌పాయ్. అంకుల్ పాయ్ పేరుతో పిల్లలకు కథలు చెప్పిన మామయ్య అనంత్‌పాయ్. 1967లో అనంత్‌పాయ్ చెప్పిన కథలకు ‘అమరచిత్ర కథ అలైవ్’ పేరుతో భౌతిక రూపం వచ్చిందిప్పుడు. దేశంలోనే తొలి ప్రయత్నమిది. పిల్లలకు కథ చెప్పడమే కాదు, కథలో దాగి ఉన్న పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయించడంతోపాటు, జీవననైపుణ్య కళలను పరిచయం చేసే ప్రయత్నం కూడా ఇది. ఓ హనుమంతుడు, శ్రీకృష్ణుడు పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్లే పందిరి వేయడానికి అనువైన ఇంటి రూపకల్పన ఇది. ఎవరికి తోచినట్లు వాళ్లు వేసవి సెలవులు కావడంతో ‘అమరచిత్ర కథ అలైవ్’ పిల్లలకు ఇది ఓ పెద్ద ఆటవిడుపు. ఒక్కోగదిలో నలుగురైదుగురు పిల్లలు కలిసి ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నారు. వాల్మీకి గదిలో స్టోరీ టెల్లింగ్, తాన్సేన్ గదిలో మ్యూజిక్ క్లాస్, చిత్రలేఖ గదిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఆమ్రపాలి గదిలో ట్రైనర్లు పిల్లలకు భరతనాట్యం, యోగ, కలరిపయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్‌లో పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ సెక్షన్లో ప్రింటింగ్ బ్లాక్స్‌తో కుస్తీ పడుతున్నారు, మరికొందరు మూన్ సర్ఫేస్ను వాళ్ల ఊహ మేరకు పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నారు. దర్జీ కార్నర్లో రంగురంగుల గుండీలు, దారాలను మ్యాచ్ చేస్తూ టైలరింగ్‌తో పరిచయం పెంచుకుంటున్నారు. పై ఫ్లోర్లో ఉంది పాటరీ సెక్షన్. పిల్లలు మట్టితో కుండలు చేయడానికి ప్రయాస పడుతున్నారు. ఆ పక్కనే ఉన్న స్కల్ప ్చర్ అండ్ మాస్క్ మేకింగ్ విభాగంలో ఓ పాపాయి దీపావళి ప్రమిద చేసి సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకుంటోంది. మరో గదిలో సంస్కృతం నేర్చుకుంటూ కొందరు, లైబ్రరీలో ఉన్న కథల పుస్తకాలు తీసుకుని చదువుకుంటున్న పిల్లలు... మొత్తానికి ‘అమర్ చిత్రకథ అలైవ్’ ప్రాంగణం అంతా ఆహ్లాదంగా ఉంది. బయట ఆర్చరీ పాయింట్ ఉంది. గురి బాణాలు వేస్తున్న విలుకాళ్లు అర్జునుడిని మించి పోవడం జరగదేమో కానీ ఓ లింబారామ్, మరో దీపికా కుమారి తయారయ్యే అవకాశం మాత్రం ఉంది. ఈ తరం కృష్ణులు ‘ఫ్యూచర్ గ్రూప్’ అధినేత కిషోర్ బియాని, రానా దగ్గుబాటి, అమర చిత్ర కథ గ్రూప్ సంయుక్తంగా డిజైన్ చేసిన థీమ్.. ‘అమర చిత్ర కథ లైవ్’ శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపుని ఆశ్రమంలో 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు. ప్రతి కళనూ ఒక కథరూపంలో నేర్చుకున్నారు. లైఫ్డిజైనింగ్ స్కిల్స్‌ని కథల రూపంలో నేర్పించాడు సాందీపుడు. ఆ కథల్లో పిల్లల్ని జీవింపచేస్తోంది అమర చిత్ర కథ అలైవ్. కాలదోషం పట్టిన కళల్ని వదిలేసి 32 కళలను మాత్రమే పిల్లలకు నేర్పిస్తున్నారు. – వాకా మంజులారెడ్డి మాట్లాడే కుందేళ్లు ‘అమర చిత్ర కథ అలైవ్’ లెర్నింగ్ సెంటర్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, 79వ రోడ్లో ఉంది. లైబ్రరీలో కృష్ణ– రుక్మిణి, పృథ్విరాజ్ చౌహాన్, చంద్ర గుప్త మౌర్య, విక్రమాదిత్య, అష్టావక్రుడు, బీర్బల్, షాజహాన్, రాణి– ఝాన్సీ, కృష్ణదేవరాయ, ద హిస్టారిక్ సిటీ ఆఫ్ ఢిల్లీ, షేర్షా, ద గోల్డెన్ మంగూస్, తంజావూరు.. ఇలాంటి కథల పుస్తకాలెన్నో ఉన్నాయి. ఈ కథల్లోని పాత్రలు గోడలమీద పెయింటింగ్స్ రూపంలో ప్రాణం పోసుకుని ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ రూమ్‌లో ఉన్న పిల్లలు ఆ పాత్రల్లో ఒదిగిపోయి ఉన్నారు. క్లాత్‌తో చేసిన జంతువుల మాస్కులను వేళ్లకు తొడుక్కుని తమను తాము ఆ పాత్రలో లీనం చేసుకుని మరీ కథలో జీవిస్తున్నారు. కుందేలు, రామచిలుక, ఏనుగు, చిట్టి ఎలుగుబంటి.. ఇలా ఒక్కో పాపాయి ఒక్కో పాత్రను ఆవాహన చేసుకుని ఆ పాత్ర చెప్పాల్సిన డైలాగ్స్ చెప్తూ అమర చిత్ర కథలకు ప్రాణం పోస్తున్నారు. మధ్యలో కిలకిల నవ్వుకుంటున్నారు. కోట్లు కుమ్మరించినా అంతటి స్వచ్ఛమైన నవ్వు నవ్వలేరు పెద్దవాళ్లు. లక్షలు ఫీజు వసూలు చేసే స్కూళ్లు కూడా పిల్లల్ని రోజుకో గంటసేపు అలా నవ్వించలేవు. నవ్వడానికి ఎటువంటి శషబిషలు లేని బాల్యం కడుపారా నవ్వాలి. నవ్వడానికి ఓ కథ చెప్పే తీరిక లేని పెద్దవాళ్లున్నప్పుడు నవ్వించడానికి, పిల్లల్ని నవ్వులో జీవింపచేయడానికి చేసిన గొప్ప ఆలోచన ఇది. -
మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం..
అక్కడ పుస్తకాలు మాట్లాడతాయి.. తమలోని సారాన్ని వినిపిస్తాయి.. విశేషాలను వివరిస్తాయి.. జ్ఞానాన్ని అందిస్తాయి.. జీవిత గాథలను కళ్లకు కడతాయి.. సందేహాలను నివృత్తి చేస్తాయి.. అవే మానవ పుస్తకాలు. కొత్తగా ఉంది కదూ! అవును.. నగరంలో నయాట్రెండీ హ్యూమన్ లైబ్రరీ. ఈ లైబ్రరీ సిటీలో సంచరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, పాఠకుల చెంతకే వచ్చేస్తోంది. మరో ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ‘హ్యూమన్ లైబ్రరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఒక్కరికీ కొన్ని పరిధులు, పరిమితులు ఉంటాయి. తమకు తెలిసినవే నిజమని భావిస్తారు. వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బాధను, జీవితాన్ని అర్థం చేసుకోవడంలో అందరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. సమాజంలో ‘గే’లుగా ముద్రపడిన వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాగే సరిహద్దుల్లో జరిగే యుద్ధాల వాస్తవిక విశేషాలు అందరికీ తెలియకపోవచ్చు. గృహహింసను ఎదుర్కొనే మహిళ సమస్యలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వ్యక్తుల విజయగాథలు ఎంతో ఆసక్తిగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇలాంటి అనేక రకాల విశేషాలను పుస్తకాల్లో చదివి తెలుసుకుంటాం. కానీ... ఆ వ్యక్తులే స్వయంగా తమ గురించి వివరిస్తే, అదే ‘హ్యూమన్ బుక్’ కాన్సెప్ట్. 100కు పైగా మానవ పుస్తకాలు.. ఇది మొట్టమొదట డెన్మార్క్‌లో మొదలైంది. రొన్నీ అబేర్గల్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జాతి, కులం, మతం, ప్రాంతం, వివక్ష, లైంగికహింస, హ్యూమన్ ట్రాఫికింగ్, లైఫ్‌స్టైల్, ఊబకాయం తదితర అనేక అంశాలతో ‘హ్యూమన్ లైబ్రరీ’ ఆవిర్భవించింది. గతేడాది మార్చిలో హర్షద్, ఆయన మిత్రులు నగరంలో ‘హ్యూమన్ లైబ్రరీ’ ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో ప్రస్తుతం 100కు పైగా ‘హ్యూమన్ బుక్స్ (మానవ పుస్తకాలు)’ ఉన్నాయి. వివిధ అంశాలపై స్వచ్ఛందంగా మాట్లాడేవాళ్లను, తమ గురించి తాము చెప్పుకునే ఆసక్తి ఉన్నవాళ్లను సోషల్ మీడియా వేదికగా ఒక్క దగ్గరికి చేర్చారు. అలా ఏర్పడిన ఈ హ్యూమన్ లైబ్రరీ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. లామకాన్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బ్రిటీష్ లైబ్రరీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. తాజాగా స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. విభిన్నం.. వైవిధ్యం నగరంలో నిర్వహించే ‘హ్యూమన్ బుక్స్ ఎగ్జిబిషన్’లో వైవిధ్యమైన అంశాలు ఉంటాయి. ఒక అంతర్జాతీయ యాత్రికుడు ఇండో–ఆఫ్రికన్ సంబంధాల గురించి మాట్లాడతాడు. బ్రాహ్మణుడు ఉర్దూలో అనర్గళమైన ప్రసంగం చేస్తాడు. ఈ విభిన్న అంశాలకు తగినట్లుగానే పుస్తకాలకు శీర్షికలు పెట్టారు. బీయింగ్ ఏ డక్, బ్రేక్ ది సైలెన్స్ ఆన్ చైల్డ్ సెక్సువల్ హరాజ్మెంట్, ది సొజోర్నర్, డెఫ్ అండ్ మ్యూట్, ఓవర్‌కమింగ్ ఒబేసిటీ, వండర్ ఉమన్, యంగ్ పొలిటీషియన్, హోప్ అండ్ హ్యాపీనెస్, ది ప్రైజ్ ఆఫ్ స్మైలింగ్ తదితర ఉన్నాయి. ‘హ్యూమన్ లైబ్రరీ’ ప్రతినిధులు ఈ నెల 11న ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు హోటల్ గ్రీన్‌పార్కులో ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ హాల్లో హ్యూమన్ బుక్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. పాఠకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకొనే విధంగా ఇక్కడ కేటలాగ్ ఉంటుంది. ఎంపిక చేసుకున్న అంశంపై 30 నిమిషాలు హ్యూమన్ బుక్ (మనిషి) మాట్లాడుతుంది. -
ట్రెండీ టైమ్
మగువ మెచ్చే వస్త్రాభరణాలు... మగవారికి నప్పే విభిన్న సూటింగ్స్... సరికొత్త ట్రెండ్స్‌తో ఆకట్టుకుంది ‘విన్యాస్’ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్. విజయ్రాణా, వైశాలీ, పూజారావు, నటాషా వంటి ప్రవుుఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్లతో బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన... నయా వెరైటీలను పరిచయం చేసింది. శ్రావణం స్పెషల్... ఆధ్యాత్మిక వూసం శ్రావణంలో వుహిళలకు కావల్సిన సంప్రదాయు వస్త్రాలు ఇక్కడ ఆకర్షణీయుంగా ఉన్నారుు. పట్టు చీరలు, వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కొలువుదీరారుు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కోసం గోల్డ్ కోటెడ్ లక్ష్మీదేవి విగ్రహాలు, పుష్పాలు ప్రత్యేక ఆకర్షణ. అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని తెలిపే రక్షాబంధన్‌లు వునసుకు హత్తుకొంటున్నారుు. వీటికి బంగారు పూత పూశారు. ఇవేకాక గృహాలంకరణ వస్తువులు... డిజైనర్ ఫుట్‌వేర్ వంటివెన్నో స్టాల్స్‌లో ప్రదర్శించారు. తెలంగాణ రాష్ర్ట వుంత్రి హరీశ్‌రావు, ఆయన సతీమణి శ్రీనిధారావు ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హరీశ్‌రావు చెప్పారు. - సాక్షి, సిటీ ప్లస్