రోమ్‌లోని గార్మెటెల్లా జన్మించిన జార్జియా ఇటలి తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మహిళల్లో స్ఫూర్తినింపేలా ఆమె కెరీర్ సాగింది. ఆమె పవర్‌ఫుల్ ప్రధానిగా బాధ్యతల నిర్వర్తించడమే గాక చాకచక్యమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆమె దేశ ప్రధానిగా హుందాగా ఉంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని సెట్ చేశారు. ప్రధాని అంటే ఇది డ్రెస్సింగ్ స్టైల్ అనేలా ఉంటుంది ఆమె ఆహార్యం..!
ప్రపంచవ్యాప్తంగా జార్జియా మెలోని డ్రెస్సింగ్ స్టైల్ హాట్‌టాపిక్‌గా ఉంది. ఆ ధరించే ఫ్యాట్ అంటూ సూట్ ఓ ప్రత్యేకతను ఆకర్షణగా హైలెట్‌గా నిలుస్తాయి. జార్జియా ధరించే అర్మానీ బ్రాండ్ సూట్ ఆమె అధికార దర్పాన్ని చూపించేలా ఉంటాయి. ఒక శక్తిమంతమైన మహిళ అనేలా ఆమె ఆహర్యం కనిపిస్తుంది. మంత్రలతో సమావేశం అయ్యేటప్పుడూ అర్మానీ నల్ల చొక్కా మారిది సూట్‌ని ధరిం చింది. ఆ తర్వాత హ్యాండ్‌ఓవర్ మీటింగ్ కోసం అర్మానీ బ్రాండ్ ముదురు చొక్కా సూట్‌ని ఎంచుకుంది.
వీటితోపాటు మధ్య మధ్యలో నేవీ బ్లూ అర్మానీ కూడా ధరిస్తుంది. చెప్పాలంటే అదొక ఆఫీస్ యూనివఫాంలా ఉండి తన చుట్టు ఉన్నవారిని అలర్ట్ చేసేలా ఉంటుంది జార్జియా ఫ్యాషన్. ఆ డ్రెస్సింగ్ శైలి అధికారులు తమ పనిలో అలర్ట్‌గా వ్యవహరించేలా, వినేలా చెలాయస్తున్నట్లుగా ఉంటుందని చెబుతుంటారు అధికారులు. ఆమె దుస్తులు నుంచి జుట్టు వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇటాలియన్ ఫ్యాషన్‌కు ఐకాన్‌గా ఉంటారు జార్జియా. ఆమె అర్మానీ సూట్లు మేడ్ ఇన్ ఇటలీ అని చెబుతున్నట్లు కనిపిస్తాయి.
రాజకీయనాయకులు డ్రెస్సింగ్ శైలీ విభిన్నంగా ఉంటుదని తెలిసిందే. కానీ ఇక్కడ జార్జియా మాత్రం తప డ్రెస్సింగ్ స్టైల్‌తోనే తన పవర్ ఏంటన్నది చూపిస్తుంది. ఇక జార్జియా కేవలం 15 ఏళ్ల వయసులో ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ యువజన విభాగంలో రిజస్టర్ అయ్యి చురుగ్గా పాల్గొనేది. అంతేగాదు సోషల్ మీడియాలో ఆమె క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదర్కొనే శక్తిమంతమైన మహిళగా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉది ఆమెకు.
Comments
Please login to add a commentAdd a comment