ఒకప్పుడు నాన్న అంటే హడల్‌..కానీ ఇప్పుడు..! | Happy Father's Day 2024: When Is Father's Day, Significance & History | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు నాన్న అంటే హడల్‌..కానీ ఇప్పుడు..!

Published Sun, Jun 16 2024 11:33 AM | Last Updated on Sun, Jun 16 2024 11:48 AM

Happy Father's Day 2024: When Is Father's Day, Significance & History

తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్‌ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది. 

చ‌రిత్ర: 
1910లో వాషింగ్ట‌న్‌లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్ట‌న్‌లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. 

అన్నీ తానై.. 
ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.

(చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement