Fathers Day 2024
-
నాన్న వంటబట్టించిన కళ
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..నాన్న ‘వంటబట్టించిన’కళ... మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్‌లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్‌కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది. టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్‌ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్‌గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్‌స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.ఫాదర్స్ డే స్పెషల్ కథనం -
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
నేడు (జూన్ 16న) ఫాదర్స్ డే. అందరూ తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీలైతే నాన్నను తలుచుకుని ఎమోషనలవుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా సక్సేనా.. తనకు తల్లయినా, తండ్రయినా అన్నీ అమ్మేనంటూ ఓ వీడియో షేర్ చేసింది.హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా.. నాన్న లేడన్న లోటు తెలియకుండా పెంచావు. పుట్టినప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం. అమ్మ, నాన్న, ఫ్రెండ్.. అన్నీ నువ్వే అయ్యావు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు థాంక్యూ అమ్మా. నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం. లవ్ యూ మా.. అని రాసుకొచ్చింది.కాగా నేహా సక్సేనా.. రిక్షా డ్రైవర్ అనే తుళు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ప్రేమకు చావుకు అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం వృషభ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Neha Saxena (@nehasaxenaofficial) చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? -
డాడీతో సెల్ఫీ.. నడిపించే దైవం నాన్న (ఫొటోలు)
-
Fathers Day: నాన్నే మొదటి హీరో.. స్పెషల్ ఫోటోలను పంచుకున్న స్టార్స్
నేడు(జూన్ 16) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు తమ నాన్నతో ఉన్న అనబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డకి నాన్నే మొదటి హీరో అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో సహా పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమ నాన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కేయండి. Father is the First Hero, to Every Child! Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge— Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q— Allu Arjun (@alluarjun) June 16, 2024Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH— shruti haasan (@shrutihaasan) June 16, 2024#ShrutiHaasan and #Ulaganayagan cute moments♥️♥️♥️♥️😍😍😍#Happyfathersday@ikamalhaasan@shrutihaasan#KamalHaasan#Indian2 pic.twitter.com/PyOfRsU6wF— Nammavar (@nammavar11) June 16, 2024 View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) https://www.instagram.com/p/C8RAhxbP7Ex/?img_index=1 View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!
తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది. చరిత్ర: 1910లో వాషింగ్టన్లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్టన్లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నీ తానై.. ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.(చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!) -
Father's Day 2024: స్టార్ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)
-
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్ గిల్-లఖ్విందర్ సింగ్: భారత క్రికెట్ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్ గిల్ తండ్రి పేరు లఖ్విందర్ సింగ్. లఖ్విందర్ సింగ్ తన కొడుకు క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్ చలువే. గిల్ కెరీర్ కోసం లఖ్విందర్ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్.. కొడుకు కెరీర్లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్ చేసేందుకు లఖ్విందర్ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరుకాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్ చేయించేవాడు. గిల్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్ సింగ్-యోగ్రాజ్ సింగ్: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, టు టైమ్ వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తండ్రి పేరు యోగ్రాజ్ సింగ్. స్వతాహాగా క్రికెటర్ అయిన యోగ్రాజ్ సింగ్.. యువరాజ్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన యోగ్రాజ్.. క్రికెట్లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్రాజ్.. యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్ క్రికెట్ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్ ఖాన్-నౌషద్ ఖాన్: టీమిండియా యంగ్ తరంగ్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరు నౌషద్ ఖాన్. సర్ఫరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్ చేయాలని పరితపించిన నౌషద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి. -
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)