నేడు (జూన్ 16న) ఫాదర్స్ డే. అందరూ తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీలైతే నాన్నను తలుచుకుని ఎమోషనలవుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా సక్సేనా.. తనకు తల్లయినా, తండ్రయినా అన్నీ అమ్మేనంటూ ఓ వీడియో షేర్ చేసింది.
హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా.. నాన్న లేడన్న లోటు తెలియకుండా పెంచావు. పుట్టినప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం. అమ్మ, నాన్న, ఫ్రెండ్.. అన్నీ నువ్వే అయ్యావు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు థాంక్యూ అమ్మా. నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం. లవ్ యూ మా.. అని రాసుకొచ్చింది.
కాగా నేహా సక్సేనా.. రిక్షా డ్రైవర్ అనే తుళు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ప్రేమకు చావుకు అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం వృషభ అనే సినిమా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment