గుండు గీయించుకున్న హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా? | 10th Class Heroine Shaved Off Her Head In Thiruthani Murugan Temple, Video And Photos Goes Viral | Sakshi
Sakshi News home page

గుండు గీయించుకుని, నాలుకపై శూలం గుచ్చుకుని.. ఎవరో తెలుసా?

Published Sun, Jun 16 2024 7:43 PM | Last Updated on Mon, Jun 17 2024 10:59 AM

10th Class Heroine Shaved off Her Head in Thiruthani Murugan Temple

పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్‌. ఒకప్పుడు హీరోయిన్‌గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్‌ కవితై సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. కాదల్‌ (ప్రేమిస్తే) సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఫేమస్‌ అవడంతో అప్పటినుంచి కాదల్‌ శరణ్యగా ముద్రపడిపోయింది.

నాలుకపై శూలం..
ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన శరణ్య.. 10th క్లాస్‌, పేరణ్మయి, మళైకాలం, రెట్టై వాలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈమె తమిళనాడు తిరుత్తనిలోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది. అలాగే నాలుకపై శూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది. 

గుండు గీయించుకుని..
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది తన కేశాలను భగవంతుడి కోసం త్యాగం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement