Heroine
-
కళ్లతోనే కవ్విస్తోన్న హీరోయిన్ అనుపమ.. ఫోటోలు
-
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్
సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.అందుకోసమైతే రాలేదు25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.డ్రగ్స్ కేసులో క్లీన్చిట్కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్ల.. ఈమె ఎవరంటే? (ఫోటోలు)
-
వీడియో లీక్‌పై స్పందించిన హీరోయిన్.. జీవితం నాశనం చేస్తారా?
హీరోయిన్ ప్రగ్య నగ్ర ప్రైవేట్ వీడియో లీకైందంటూ నిన్నటినుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రియుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఇది చూసిన హీరోయిన్ ప్రగ్య నగ్ర షాక్‌కు గురైంది. టెక్నాలజీని వాడుకుని తనను దారుణంగా చిత్రీకరించారని వాపోయింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.పీడకల అయితే బాగుండుఇప్పటికీ నమ్మలేకున్నాను. ఇదంతా ఒక పీడకల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయపడాలే కానీ మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దరిద్రపుగొట్టు ఆలోచనలు ఉన్న దుర్మార్గులు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో చెత్త వీడియో సృష్టించారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎవరికీ ఇలా జరగడకూదుధైర్యంగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్నవారికి చాలా థాంక్స్. ఏ అమ్మాయికీ ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చింది. దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు నీ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమావరళరు ముఖ్యం అనే తమిళ సినిమాతో 2022లో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది తమిళంలో ఎన్4, మలయాళంలో నదికళిల్ సుందరి యమున సినిమాలు చేసింది. ఈ ఏడాది లగ్గంతో తెలుగువారిని పలకరించింది.చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే? -
టాలీవుడ్ హీరోయిన్ వీడియో!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. తెగ సంబరపడిపోతున్న హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఎన్టీఆర్ హీరోయిన్ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి సెగల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్- అశేష్ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం. నవంబర్ 27న సాయంత్రం సోనాలి బిడ్డకు జన్మనిచ్చింది అని రాసుకొచ్చారు.బీర్ బాటిల్స్‌కు బదులు పాల సీసాలుకాగా సోనాలి ఈ ఏడాది ఆగస్టు 16న తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బీర్ బాటిల్స్ పట్టుకునే చేతిలో ఇకపై పాలడబ్బాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అశేష్ జీవితంలో మార్పు మొదలుకానుంది. నా విషయానికి వస్తే ఇప్పటివరకు నా ఒక్కదానికోసమే తిన్నాను, ఇప్పుడేమో ఇద్దరికోసం తింటున్నాను. గతేడాది పెళ్లిమా కుక్కపిల్ల కూడా రాబోయే బేబీతో ఎలా ఆడుకోవాలా? అని ఆలోచిస్తోంది. డిసెంబర్లో డెలివరీ డేట్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్ సోనాలి, రెస్టారెంట్ యజమాని అశేష్ ఐదేళ్లపాటు డేటింగ్ చేశారు. గతేడాది జూన్‌లో సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే సోనాలి సెగల్.. ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by One Communication (@one__communication) -
హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య
తొలిచూపులోనే ప్రేమ.. పరిచయమైన పదిహేను రోజుల్లోనే పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే ఉంటాయనుకునేరు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వాహబ్ జీవితంలోనూ ఇదే జరిగింది. మతాలు వేరైనా మనసులు కలవడంతో జరీనా, హీరో ఆదిత్య పంచోలి పెళ్లి చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు.36 ఏళ్ల దాంపత్యం తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఓ సినిమా చేస్తున్న సమయంలో నిర్మల్ (ఆదిత్య పంచోలి అసలు పేరు)ను కలిశాను. అతడు నాకంటే చిన్నవాడు. మీరు నమ్ముతారో, లేదో గానీ మేము కలుసుకున్న 15-20 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకంటే ఎక్కువ కలిసుండలేరని విమర్శించారు. ఇప్పుడేమైంది? 36 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం. మా ఆయన ఉత్తమ భర్తఅయితే అతడు ఎవరితోనైనా ఎఫైర్స్ పెట్టుకునే ఛాన్స్ ఉందని నేను ముందుగానే ఊహించాను. ఇంటికి వచ్చాక నాతో ఎలా ఉంటున్నాడనేది మాత్రమే పట్టించుకున్నానే తప్ప తన ఎఫైర్స్ గురించి ప్రశ్నించేదాన్ని కాదు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ అన్నట్లుగా అతడేమీ కిరాతకుడైతే కాదు. ఎన్నడూ నాపై చేయెత్తలేదు. బహుశా వాళ్లు కోరుకుంది దక్కలేదని అతడిపై నిందలు వేశారంతే! ఆదిత్య ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! అని చెప్పుకొచ్చింది.ఆదిత్యపై హీరోయిన్ల ఫిర్యాదుకాగా ఆదిత్య పంచోలి కంటే జరీనా వయసులో ఆరేళ్లు పెద్దది కావడం గమనార్హం. వీళ్ల వివాహం 1986లో జరిగింది. తర్వాత ఇతడు హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 1993లో పూజా బేడీ.. ఆదిత్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2004లో కంగనా రనౌత్.. ఆదిత్య తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. అత్యాచారం చేశాడంటూ 2019లో పోలీస్ కేస్ కూడా పెట్టింది.చదవండి: బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్ -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
హీటెక్కిస్తున్న కీర్తి సురేష్ (ఫోటోలు)
-
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
చీరకట్టులో కొత్త హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ మెరుపులు (ఫొటోలు)
-
తెలుగు హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
ఒక్కరు కాదు ఇద్దరు.. పుష్ప రాజ్ తగ్గేదేలే
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రచ్చ సినిమాలో కనిపించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా..? (ఫోటోలు)
-
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
దుబాయ్‌లో చిల్ అవుతున్న బర్త్‌డే గాళ్ (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?