తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.
అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్‌లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)
కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment