Amala Paul
-
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఫ్లాట్స్, కార్లు అని ఏదో ఒకటి కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) భర్త ఖరీదైన కారు కొని భార్యకి బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ దీని రేటు ఎంతో తెలుసా?(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ)కేరళకు చెందిన అమలాపాల్ ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్నాళ్ల ముందు వరకు మాత్రం తెలుగు, తమిళ, మలయాల చిత్రాల్లో నటించింది. 2023లో జగత్ దేశాయ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత టైమ్ అంతా పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తోంది. గతేడాది కొడుకు కూడా పుట్టాడు.తాజాగా సందర్భం ఏంటో తెలియదు గానీ జగత్.. అమలాపాల్ కి ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW Car) కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర మార్కెట్ లో రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా వీళ్ల దగ్గర కాస్ట్ లీ పోర్స్ కారు కూడా ఒకటి ఉంది. బీఎండబ్ల్యూ కారు వీడియోని మాత్రం అమలాపాల్, ఆమె భర్త ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
చీరలో అనుపమ.. టీ షర్ట్ పోజుల్లో అమలాపాల్!
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకంచీరకట్టులో బుట్టబొమ్మలా అనుపమటీ షర్ట్ మాత్రమే వేసుకుని అమలాపాల్ పోజులుఫన్నీ వీడియో పోస్ట్ చేసిన మృణాల్ ఠాకుర్జిమ్ లో గ్లామర్ చూపిస్తూనే నభా వర్కౌట్స్ఎర్ర చీరలో రీతూవర్మ మోడ్రన్ లుక్ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
కొడుకును చూసి మురిసిపోతున్న అమలాపాల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో.! (ఫోటోలు)
-
ఈ ఏడాది తల్లిదండ్రులైన హీరోహీరోయిన్లు వీళ్లే (ఫొటోలు)
-
నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. తెగ సంబరపడిపోతున్న హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన గతేడాది రెండో పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా ప్రేమించిన తర్వాత ప్రియుడు జగత్ దేశాయ్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. గత నవంబర్ 5న వివాహం జరగ్గా.. ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా అమలాపాల్ అప్పటి మధుర జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంది. కేరళలోని కొచ్చిలో ఈ పెళ్లి వేడుక జరిగింది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)ఈ పెళ్లి వీడియో అంతా బాగానే ఉంది. కాకపోతే అమలాపాల్ పరోక్షంగా తన మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్స్ చేసింది. 'నా జీవితంలో గతంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే వాటి వల్లే ఇతడు నా జీవితంలోకి వచ్చాడు' అని చెప్పుకొచ్చింది. ఈమె జీవితంలో తప్పు అంటే అది దర్శకుడు ఏఎల్ విజయ్‌తో పెళ్లే అనుకుంటా! అలానే జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్‌గా అనిపిస్తుందని కూడా చెప్పింది. అంటే ఇంతకుముందు అలా లేదనేగా!తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించిన అమలాపాల్.. 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్ను పెళ్లాడింది. కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడమే మంచిదని నిర్ణయానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) View this post on Instagram A post shared by Magic Motion Media | Photography & Films (@magicmotionmedia) -
హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. చూడండి (ఫొటోలు)
-
దీవుల్లో అమలాపాల్ చిల్.. జలకాలాడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతోన్న అమలాపాల్ జలకాలాడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి.. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి లేటేస్ట్ లుక్స్.. బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ లుక్.. కలర్‌ఫుల్ శారీలో ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)
సినిమా అంటేనే ఇలానే ఉండాలి అనేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయి. ఇవి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'లెవల్ క్రాస్'. ఒరిజినల్‌గా దీన్ని మలయాళంలో తీశారు. కానీ రీసెంట్గా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?రఘు (అసిఫ్ అలీ) ఎడారి ప్రాంతంలో ఒక చోట రైల్వే గేట్ కీపర్. నిర్మానుస్య ప్రాంతంలో ఒక్కడే చెక్క ఇంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి కింద పడినట్లు రఘు గమనిస్తాడు. దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన ఆమెని తన ఇంటికి తీసుకొస్తాడు. కోలుకున్న తర్వాత ఆమెకు తన గురించి చెబుతాడు. ఆమె కూడా తన గురించి చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ సినిమా తీయాలంటే హీరోహీరోయిన్ ఉండాలి. ఆరు పాటలు, మూడు ఫైట్స్, అవసరం లేకపోయినా సరే కామెడీ.. ఇలా పాన్ ఇండియా పేరుతో వందలకోట్ల బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి అక్కర్లేదని 'లెవల్ క్రాస్' సినిమా నిరూపించింది. మూడే పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర సినిమా అంతా రెండు-మూడు డ్రస్సులో మాత్రమే కనిపిస్తారు. అలాంటి విచిత్రమైన మూవీ ఇది.ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియని యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మరో వ్యక్తికి తెలిస్తే.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఎంతకు తెగిస్తారు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే ఇది. సినిమా కథ గురించి చెబితే మళ్లీ స్పాయిలర్ అవుద్దేమో! కాస్త ఓపికతో చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే వస్తుంది.సినిమాలో మూడు పాత్రలు ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతాయి. కానీ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకు అర్ధం కాదు. ఒకటి జరుగుతుందని అనుకుంటాం. కానీ తర్వాతి సీన్లో ఊహించనది జరుగుతుంది. ఒక్కొక్కరి గతం గురించి బయటపడే ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు? హీరో అనేది ప్రారంభంలో చాలామంది గెస్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలా కనిపెట్టలేరు.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏదో ఆర్ట్ మూవీ తీసినట్లు చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 45 నిమిషాల వరకు అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తాయి. మధ్యలో ఓ పాట ఉంటుంది కానీ అది అనవసరం అనిపించింది.యాక్టింగ్ పరంగా అసిఫ్ అలీ, అమలాపాల్, షరాఫుద్దీన్ ఆకట్టుకున్నారు. 'దృశ్యం' డైరెక్టర్ జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్భాజ్ ఆయూబ్ దర్శకుడు. ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్. దాన్ని తీసిన విధానం అంతకంటే డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్, యాక్షన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.-చందు డొంకాన -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఓటీటీలో అమలాపాల్ 'లెవల్ క్రాస్' థ్రిల్లర్ సినిమా
అమలాపాల్ తాజాగా నటించిన మలయాళ సినిమా 'లెవల్ క్రాస్'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించగా.. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు. జులై 26న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.'లెవెల్ క్రాస్' చిత్రానికి మలయాళ టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే, జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలో ఎప్పుడు..?సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్ క్రాస్ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ వర్షన్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్
తెలుగులో అప్పట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. మధ్యలో రెండో పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి జరగ్గా.. ఈ జూన్‌లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది.ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
బ్యూటిఫుల్ ఔట్ఫిట్ : అమలాపాల్ రాయల్ లుక్ (ఫొటోలు)
-
ఫస్ట్ మీట్ సెలబ్రేషన్స్.. భర్త-కొడుకుతో హీరోయిన్ అమలాపాల్ (ఫొటోలు)
-
పలుచటి డ్రస్‌లో దిశా పటానీ.. శారీ కట్టిన సీరియల్ బ్యూటీ!
భర్తతో కలిసి హీరోయిన్ అమలాపాల్ ఫస్ట్ మీట్ సెలబ్రేషన్స్పూలతో నవ్వుతూ మాయ చేస్తున్న కీర్తి సురేశ్హాట్ డ్యాన్స్‌తో కవ్వించేలా గ్లామరస్ బ్యూటీ రీతూ చౌదరిఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మంజరి.. మరింత హాట్గాపచ్చబొట్టు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్పొట్టి నిక్కర్లో కేక పుట్టిస్తున్న హీరోయిన్ రియా చక్రవర్తిఉంగరాల జుట్టుతో తాప్సీ హోయలు చూపిస్తూ..ఉల్లిపొర లాంటి పలుచటి డ్రస్సులో హీరోయిన్ దిశా పటానీ View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. అమలాపాల్‌పై విమర్శలు!
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.అలాంటి డ్రెస్‌లో కాలేజీ ఈవెంట్‌కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్‌ను విమర్శిస్తున్నారు. అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్‌లో ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఎర్రటి ఎండ.. అమలాపాల్ కేరవాన్‌లో నుంచి దిగమంది: మేకప్ ఆర్టిస్ట్
హీరోహీరోయిన్లకు కేరవాన్, వానిటీ వ్యాన్లు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే వంటకోసం, రిలాక్స్ అవడానికి, వర్కవుట్ చేయడానికి.. ఇలా ఒక్కోదానికి ఒక్కో కేరవాన్ కూడా వాడుతున్నారు. కొన్నిసార్లు నిర్మాణ సంస్థలే వానిటీ వ్యాన్ ఏర్పాటు చేసి పెడతాయి. అయితే స్టార్ సెలబ్రిటీలు ఆ కేరవాన్‌లోకి అవతలివారిని రానివ్వరు. అందులో అమలాపాల్ కూడా ఒకరని తెలుస్తోంది. తాజాగా మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.ఎర్రటి ఎండలో షూటింగ్ఆమె మాట్లాడుతూ.. 'ఓసారి చెన్నైలో అమలాపాల్‌తో షూటింగ్‌కు వెళ్లాను. ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెను కలిశానే తప్ప తనతో నాకసలు పరిచయమే లేదు. ఏప్రిల్, మే నెలలో ఎర్రటి ఎండలో షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. మేము వెళ్లిన లొకేషన్లో కాసేపు నీడలో కూర్చుందామంటే ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. అలా వానిటీవ్యాన్లో కూర్చున్నాను.వెళ్లిపోమందిఆ వ్యాన్‌లో రెండు భాగాలుండేవి. ఒక వైపు ఆర్టిస్టులు మరోవైపు టెక్నీషియన్లు కూర్చోవడానికి వీలుండేది. ఓసారి అమలాపాల్ తన మేనేజర్‌ను పిలిచి మమ్మల్ని వానిటీ వ్యాన్‌లో నుంచి బయటకు వెళ్లిపోమని చెప్పింది. మేమంతా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నాం. ఇంతటి ఎండలో ఎక్కడికని వెళ్తాం అనుకున్నాం.. కానీ అందులో నుంచి దిగక తప్పలేదు. ఇలాంటివి చాలానే జరిగాయి.మమ్మల్ని లెక్క చేయరుమేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టు వంటి వారు వ్యాన్‌లోకి రాకూడదని సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా రూల్ ఉందేమో మరి! మమ్మల్ని వారసలు లెక్క చేయరు. అలాంటప్పుడు మేమెలా పరిచయం చేసుకుంటాం. టబు వంటి స్టార్స్‌తో కలిసి పని చేశామని ఎలా చెప్పగలం? మా లాంటి వారికోసం టబు వ్యాన్ అంతా బుక్ చేసేది. ఎంతో బాగా చూసుకునేది' అని చెప్పుకొచ్చింది.చదవండి: అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన ముద్దగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలా పాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈనెల 11 వ తేదీన బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని వెల్లడించింది. కాగా.. మైనా చిత్రం ద్వారా కోలీవుడ్‌లో పాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో అభిమానులను మెప్పించింది. View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
చీరలో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరినాభి అందాలతో మైమరిపిస్తున్న పూనమ్ బజ్వాబేబీ బంప్‌తో డ్యాన్సులు చేస్తున్న అమలా పాల్క్యూట్ యోగాసనాలతో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ దివిబ్లాక్ డ్రస్‌లో మెంటలెక్కిస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్పొట్టి స్కర్ట్‌లో చూపు తిప్పుకోనివ్వని తమిళ బ్యూటీ దివ్య View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Reeshma Nanaiah 🎀 (@reeshma_nanaiah) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
హీరోయిన్ అమలా పాల్కి ట్విన్స్.. నిజం ఏంటంటే?
కెరీర్, పర్సనల్ విషయాల్లో కొందరు హీరోయిన్లు ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంటారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఈమెకు కవలలకు జన్మనిచ్చిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అసలు నిజం ఏంటి?(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ)కేరళకు చెందిన అమలా పాల్.. 2009 నుంచి ఇండస్ట్రీలో ఉంది. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'నాన్న' అనే తమిళ మూవీ చేస్తున్న టైంలోనే ఆ చిత్ర దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఈమె గతేడాది నవంబరులో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న తను గర్భంతో ఉన్నానని ప్రకటించిన అమలా పాల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్న అమలా పాల్ తాజాగా ట్విన్స్‌కి జన్మనిచ్చిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. కానీ అలాంటిదేం లేదని, ఇంకా ప్రసవమే జరగలేదని తెలిసింది. కవలలు పుట్టడం అనేది కేవలం రూమర్ మాత్రమేనని తేలింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్‌లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
భర్త పై పోస్ట్ వైరల్: అమలాపాల్
-
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Amala Paul Baby Shower Ceremony: ఘనంగా అమలాపాల్ సీమంతం..ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
వేడుక వేళ.. ఆనంద హేల
హీరోయిన్ అమలా పాల్ తల్లి కాబోతున్నారు. తాజాగా తన సీమంతం వేడుక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భర్త జగత్ దేశాయ్‌తో కలిసి అమలా పాల్ గుజరాత్‌లోని సూరత్‌లో ఈ వేడుక జరుపుకున్నారు. ‘ట్రెడిషన్ అండ్ లవ్’ అనే క్యాప్షన్‌తో అమలా పాల్ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక వేళ అమల, జగత్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కొన్ని సంవత్సరాలు రిలేషన్షిప్ కొనసాగించి 2023లో అమలా పాల్, జగత్ దేశాయ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాక్సాఫీస్ వద్ద క్రేజీ మార్క్‌ను దాటిన 'ఆడుజీవితం' కలెక్షన్స్
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన చిత్రం 'ఆడుజీవితం'. 'సలార్'లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్ చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మలయాళంలో మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి అయిన తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం మలయాళ వెర్షన్ రూ. 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగులో కోటి రూపాయలు కూడా దాటలేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల 'గోట్ డేస్'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవలకు మంచి ఆదరణ దక్కిన వెంటనే, సినిమాగా తీయాలని ఎంతోమంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రన్ టైమ్ విషయంలో కాస్త తగ్గించి ఉంటే బాగుండు అనే విమర్శ ఉంది. -
Amala Paul Baby Shower: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ సీమంతం ఫోటోలు వైరల్
-
ప్రియుడితో పెళ్లి.. ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా ఆడుజీవితం చిత్రంలో మెరిసింది. అయితే గతేడాది తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకన్న అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఫంక్షన్‌ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది భామ. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో అమలాపాల్ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Aadujeevitham Review: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్ లైఫ్ నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు నిర్మాణం:జువల్ రొమాన్స్ దర్శకత్వం: బ్లెస్సీ సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది: మార్చి 28, 2024 నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్‌ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ. ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్‌లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
స్టార్ హీరోయిన్‌కు ట్విన్స్.. వైరలవుతున్న పోస్ట్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని కనిపిచింది. అంతే కాకుండా 'టూ హ్యాపీ కిడ్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్‌ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అమలాపాల్ తాజా పోస్ట్ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
నా భర్త ప్రెగ్నెన్సీతో ఉన్నారు: టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ అమలాపాల్. నవంబర్‌లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా.. ఇటీవలే తాను ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోలు షేర్ చేస్తూ కాస్తా ఫన్నీగా కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట దాదాపు అతని భార్య గర్భంతో సమానంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి అపోహలను తొలగించే సరైన సమయం ఇదే. ఇప్పుడు కేవలం నేను మాత్రమే గర్భవతి కాదు. మేమిద్దరం. సారీ మై హస్బెండ్' అంటూ ఫన్నీ ఫోటోలను పంచుకుంది. కాగా.. తమిళంలో మైన చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. తమిళం, తెలుగులోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాజ ఈ జంట మనస్పర్థలు కారణంగా 2017లో విడిపోయారు. కాగా.. గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తితో డేటింగ్ విషయం బయటకొచ్చింది. అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు పెద్ద పార్టీని ఏర్పాటు చేసి లవ్ ప్రపోజ్ చేశాడు. అమలాపాల్ యాక్సెప్ట్ చేయడంతో ప్రియుడు ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
బేబీ బంప్‌తో అమలాపాల్.. భర్తతో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు.. మంచుకొండల్లో కేజీఎఫ్ భామ!
►ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు ►మంచుకొండల్లో చిల్ అవుతోన్న కేజీఎఫ్ భామ ►గుర్రంతో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సవారీ ►అరెంజ్ డ్రెస్సులో ఊర్వశి రౌతేలా హోయలు ►వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్ ►కొత్త ఏడాది బీచ్‌లో చిల్ అవుతోన్న మేఘా ఆకాశ్ ► అలాంటి వీడియో షేర్ చేసిన అమలాపాల్.. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్ హీరోయిన్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. నిన్న గాక మొన్న ప్రపోజ్. అంతలోనే పెళ్లి) గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించింది. అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. కాగా.. హీరోయిన్ అమలాపాల్ తన ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్‌లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Pearle Maaney Baby Shower Function: నటి సీమంతం.. భర్తతో కలిసి సందడి చేసిన అమలాపాల్ (ఫోటోలు)
-
Amala Paul Second Marriage Pics: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్, ఫోటోలు వైరల్
హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో ఆదివారం (నవంబర్ 5న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను నూతన వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తమ పెళ్లి ఫోటోలను సైతం పంచుకున్నారు. 'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అని తమ పోస్టుకు క్యాప్షన్ జోడించారు. ఈ పెళ్లి వేడుకలో అమలాపాల్ లావెండర్ కలర్ లెహంగా ధరించింది. జగత్ కూడా ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండర్ కలర్ షేర్వాణీ వేసుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారగా సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ఇటీవల అమలాపాల్ బర్త్‌డే (అక్టోబర్ 26న) రోజు జగత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. బర్త్‌డే పార్టీలో మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అందరి ముందే అడిగేశాడు. మొదట సర్ప్రైజ్ అయిన అమలాపాల్ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పేసింది. దీంతో ఆ క్షణమే హీరోయిన్‌కు ఉంగరం తొడిగి పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే అమలాపాల్ 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో విడిపోవడమే మంచిదని నిర్ణయానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
Amala Paul-Jagat Desai Photos: అమలాపాల్ బర్త్ డే.. ప్రియుడితో రెండో పెళ్లికి రెడీ! (ఫొటోలు)
-
అమలాపాల్ బర్త్‌డే.. ముద్దు పెట్టి ప్రపోజ్ చేసిన ప్రియుడు
-
పెళ్లికి ఎస్
హీరోయిన్ అమలా పాల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడనున్నారు అమలా పాల్. గురువారం (అక్టోబరు 26) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా అమలా పాల్‌కు తాను ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘నా కలల రాణి నాకు ‘ఎస్’ చెప్పింది. వెడ్డింగ్ బెల్స్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని పేర్కొన్నారు జగత్ దేశాయ్. సో.. జగత్ దేశాయ్, అమలా పాల్ ఒకింటివారు కానున్నారని స్పష్టమవుతోంది. ఇక 2014లో తమిళ దర్శక–నిర్మాత ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. -
రెండోపెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. బర్త్ డే రోజే సర్ప్రైజ్!
స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ.. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ నటించిన భోళా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇవాళ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేరళ కుట్టి రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!) ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమలాపాల్, జగత్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. తన లవర్ అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది. కాగా.. అమలాపాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరా మూవీలో తొలిసారిగా నటించింది. 2010లో తమిళ చిత్రం మైనాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. బాలీవుడ్, తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. . (ఇది చదవండి: మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున) -
Amala Paul Latest Photos: అందంతో అదరగొడుతున్న అమలాపాల్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్‌కు రజినీకాంత్ వార్నింగ్.. ఆమె కోసమేనా?
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. బెజవాడ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతోనూ నటించింది. లవ్ ఫెయిల్యూర్, నాయక్, రఘువరన్ బీటెక్ చిత్రాలతో మెప్పించింది. ఆడై చిత్రంలో అమల న్యూడ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్, శాండల్‌వుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటోంది. (ఇది చదవండి: ఆటో డ్రైవర్‌తో గొడవపడ్డ నటి.. డబ్బులివ్వకుండా చెక్కేసింది! ఇంత ఘోరమా?) అయితే తాజాగా ఓ మలయాళీ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ధనుశ్‌తో చాలా క్లోజ్‌గా ఉండేదని అంటున్నారు. వీరిద్దరు కలిసి నటించిన వేళైల్లై పట్టదారి సినిమాతో సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో తెగ వైరలైంది. అంతే కాకుండా వీరిద్దరి రిలేషన్‌పై కోలీవుడ్‌లో తెగ చర్చ నడిచింది. అయితే ప్రస్తుతం అమలాపాల్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ధనుశ్‌తో అమలాపాల్ సన్నిహితంగా మెలగడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. ధనుశ్, అమల మధ్య రిలేషన్ వల్లే రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని సమాచారం. రజినీకాంత్ తన కూతురు జీవితం కోసమే అమలా పాల్ ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే ఈ వార్తల్లోన నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. కొందరేమో ఇదంతా రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. (ఇది చదవండి: హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!! ) -
అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్
నటి అమలాపాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మంచి, సంచలన, వివాదాస్పద నటి అంటూ ముద్రవేసుకున్న నటి ఈమె. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. విజయ్, ధనుష్ వంటి ప్రముఖ నటులు సరసన నటించిన అమలాపాల్ టాలీవుడ్‌లోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా మంచి పీక్‌లో ఉండగానే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఆదిలింగం ఎవరంటే) అయితే రెండేళ్లలోపే మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి విడాకులకు దారి తీసింది. కాగా అమలాపాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అందులో మైనా చిత్రం తరువాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానని చెప్పింది. (ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్) తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని చెప్పింది. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరంది. ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొంది. కాగా ఆ మధ్య నిర్మాతగా మారిన అమలాపాల్ ప్రస్తుతం మాతృభాషలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్ 50వ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Amala Paul Without Makeup: మేకప్ లేకుండా, టాటూ చూపిస్తూ అమలాపాల్ ఫోజులు (ఫోటోలు)
-
అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ అథర్వ కామెంట్
అథర్వ మురళీ తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడే అథర్వ అనే సంగతి తెలిసందే. 2010లో 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో కోలీవుడ్‌లో విడుదలైన 'పరదేశి'కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆపై 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అథర్వ ప్రవేశించాడు. తాజాగ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ 'మధకం' స్ట్రీమింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ, తనతో నటించిన హీరోయిన్లలలో అమలా పాల్ చెత్త హీరోయిన్ అని ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) 'నా రెండో సినిమా 'ముహుదుముత్ ఉన్ కర్పనై'లో మేమిద్దరం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్కే చెప్పాను' అని అథర్వ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. -
యాక్షన్ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
Amala Paul: మూడోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ?
నటుడు ధనుష్ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్, నటుడు విష్ణువిశాల్ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్ పేరు వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) ఇటీవల కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించిన అమలాపాల్ ఇంతకుముందు ధనుష్‌కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆధ్యాత్మిక బాటలో అమలాపాల్, వీడియో వైరల్
వివాదాలకు చిరునామా అమలాపాల్. నటన, ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, కేసులతో ఆమె నిత్యం సావాసం చేస్తుంటారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా నటించి గుర్తింపు పొందారు. తమిళంలో మైనా చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఈమె ఆ తరువాత ప్రముఖ హీరోల సరసన నటించారు. అదేవిధంగా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్లలోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటిగా కొనసాగుతున్న అమలాపాల్ ఆ మధ్య నిర్మాతగానూ మారి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా నటిగా క్రేజ్ తగ్గడంతో తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది. క్రిస్టియన్ మతానికి చెందిన అమలాపాల్ ఇటీవల కేరళలోని ఓ హిందూ దేవాలయానికి వెళ్లారు. అయితే అక్కడి అర్చకులు. ఆలయ నిర్వాహకులు అనుమతించకపోవడంతో భంగపడ్డారు. కానీ తన ఆధ్యాత్మిక పర్యటనను మాత్రం ఆపలేదు. ఇటీవల తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్ ఇండోనేషియాలోని బాలి దీవికి వెళ్లి అక్కడ ఓ ఆశ్రమంలో బస చేశారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ యోగా ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన!
నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్న సంఘటన స్థానికంగా వివాదస్పమైంది. వివరాలు.. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో రీసెంట్గా తన స్నేహితులతో అమలాపాల్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం ఆలయానికి వెళ్లింది. క్రిస్టయన్ మతస్తురాలైన అమలాను అక్కడ ఆలయ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చదవండి: అరుదైన వ్యాధి.. పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు దీంతో నిరాశ చెందిన ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో నోట్ రాసింది. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదు. నేను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శక్తిని ఫీల్ అయ్యాను. కానీ నన్ను ఆలయంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ వివక్షలో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుంటున్నా’ అని అమలా పేర్కొంది. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వివాదస్పదంగా మారింది. దీనిపై పలు సామాజికి సంఘాలు, ప్రముఖుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న ప్రోట్‌కాల్‌ను మాత్రమే మేం పాటిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చింది ఒక సెలబ్రెటి కాబట్టి ఇది వివాదస్పదం అయ్యింది’ అని అన్నారు. -
తెలుగులో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎమ్. మోహన శివకుమార్ సమర్పణలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కెప్టెన్ పాత్రను సుదీప్ స్టయిలిష్‌గా చేయడంతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతంగా నటించారు. తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. -
బాలీవుడ్‌కి స్పెషల్‌గా...
కథానాయిక అయిన పదేళ్లకు అమలా పాల్ ఇప్పుడు హిందీ తెరకు పరిచయం కానున్నారు. అది కూడా స్పెషల్‌గా... అంటే స్పెషల్ రోల్లో అన్నమాట. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘భోలా’లోనే ఆమె ప్రత్యేక పాత్ర చేయనున్నారు. కార్తీ హీరోగా నటించిన హిట్ తమిళ మూవీ ‘ఖైదీ’కి ‘భోలా’ హిందీ రీమేక్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను టబు చేస్తున్నారు. తాజాగా అమలా పాల్ని ఎంపిక చేసిన విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్లో ఆరంభం కానున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అమలా పాల్ పాల్గొంటారు. -
అమలా పాల్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన అమలాపాల్.. కారణమిదే
తమిళ సినిమా: నటి అమలాపాల్ మళ్లీ తన పబ్లిసిటీ ఆటను మొదలెట్టింది. ఇటీవల ఓ చిత్రం నిర్మాణంలో తల మునకలై ఉన్న ఈమె ప్రస్తుతం.. ఆ పనిని ఓ ఓటీపీ సంస్థకు అప్పగించి మళ్లీ అవకాశాల వేటలో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ అమ్మడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఒక భేటీలో పేర్కొంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో తాను నటించాల్సి ఉందని, కొన్నేళ్ల క్రితం ఈ చిత్రంలో నటించే విషయమై దర్శకుడు మణిరత్నం పిలిచారని చెప్పింది. ఆయన అభిమానిని కావడంతో ఎంతో ఉత్సాహంగా ఆడిషన్లో పాల్గొన్నానని చెప్పింది. అయితే ఆ చిత్రం అప్పట్లో ప్రారంభంకాలేదని, దీంతో తాను చాలా చింతించానని పేర్కొంది. ఆ తరువాత 2021లో అదే చిత్రం కోసం మణిరత్నం మళ్లీ తనను పిలిచారని చెప్పింది. అప్పుడు తనకు ఆ చిత్రంలో నటించాలని అనిపించకపోవడంతో నిరాకరించినట్లు తెలిపింది. అందువల్ల తానేమీ బాధపడటం లేదని చెప్పింది. ఇక చాలామంది తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అడుగుతున్నారనీ, అక్కడ సినిమా కుటుంబాలు, అభిమానుల ఆధిక్యం పెరిగిపోయిందని పేర్కొంది. ఒక్కో చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారని, ప్రేమ, పాటల సన్నివేశాల్లో గ్లామరస్‌గా నటించడం వంటి కమర్షియల్ అంశాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పింది. అందుకే తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లోనే నటింనట్లు అమలాపాల్ చెప్పుకొచ్చింది. -
టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్..
‘బెజవాడ’తో చిత్రంతో తెలుగు తెరకు పరచమైన మలయాళ బ్యూటీ అమలా పాల్. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో ఇక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించింది. అనంతరం ఈ భామకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి మాకాం మార్చిన ఆమె తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా? అంతేకాదు బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో సైతం నటించేందుకు ఆమె వెనుకాడటం లేదు. ఆ మధ్య నటించిన ఆమె సినిమా వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్‌లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమలా పాల్ టాలీవుడ్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు హీరోయిన్లను కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ కోసమే ఎంచుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్లో తన జర్నీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం నాకు మొదటి రోజే అర్ధమైంది. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అలాంటి సినిమాలనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి భిన్నమైన సంప్రదాయం కారణంగానే తెలుగు పరిశ్రమకు నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. అందుకే తెలుగులో తక్కువ సినిమాలు చేశాను. ఇక తమిళంలో నేను నటించిన మొదటి చిత్రం ‘మైనా’ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లి , విడాకుల తరువాత అమలా పూర్తిగా బోల్డ్ కంటెంట్, లేడీ ఓరియంటేడ్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. -
Amala Paul: రెండవ పెళ్లి నిజమే..!.. ఇదిగో ఆధారాలు..
ఓ దర్శకుడితో వివాహం.. తర్వాత విడిపోవడం వంటి ఘటనలతో నటి అమలాపాల్.. ఆమధ్య వార్తల్లో ఉండేది. అయితే కొంతకాలం సైలెంట్ అయ్యింది. ఆ మధ్య నిర్మాతగానూ మారి ఎత్తి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించి ప్రధాన పాత్రలో నటించింది. ఈమె తిరువళ్లూరు జిల్లా కోట్టకుప్పం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచి తాను చిత్ర నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో బవేందర్ సింగ్ అనే వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాను అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని గత నెల 22వ తేదీన తిరువళ్లూరు ఎస్పీకి తన మేనేజర్‌తో ఫిర్యాదు చెయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ ఫిర్యాదు చేసిన బవేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దీంతో అతను బెయిల్‌కోసం తిరువళ్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తాను నటి అమలాపాల్‌ను ఎలాంటి లైంగిక వేధింపులకు గురి చేయలేదని, తామిద్దరం 2019లో పెళ్లి చేసుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించాడు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం బవేందర్ సింగ్‌కు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నటి అమలాపాల్‌కు రెండవ పెళ్లి జరిగినట్లు రుజువైంది. -
ఐదేళ్ల కిందటే అమలాపాల్‌తో పెళ్లయిపోయిందట!
హీరోయిన్ అమలాపాల్ తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్‌పై పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే! భవీందర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా అతడు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 2017లోనే అమలాపాల్‌తో తన పెళ్లి జరిగిందని తెలియజేస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను దానికి అటాచ్ చేశాడు. వాటిని పరిశీలించిన అనంతరం న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కోర్టు వ్యవహారం నేపథ్యంలో మరోసారి వీరి పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అమలాపాల్ 2014లో దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావడంతో 2017లో విడిపోయారు. అనంతరం ఆమె తన నివాసాన్ని పుదుచ్చేరికి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె సింగర్ భవీందర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. 2020లో అమలాపాల్- భవీందర్ సింగ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వారు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారని అంతా భావించారు. కానీ అది కేవలం ఫొటోషూట్ మాత్రమేనని అమలాపాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. చదవండి: చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యా: యాంకర్ రామ్‌చరణ్ మేకప్ ఆర్టిస్ట్‌తో బాలీవుడ్ నటుడి పెళ్లి -
మాజీ ప్రియుడిని అరెస్ట్ చేయించిన అమలాపాల్
సంచలనటి అమలాపాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ ప్రియుడిని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయించింది. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో మెరిసిన నటి అమలాపాల్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, భాషల్లో నటించి దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి సంసార జీవితం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్ధల కారణంగా 2017లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ చిత్రాలు నటించడం మొదలెట్టిన అమలాపాల్ 2018లో జైపూర్‌కు చెందిన గాయకుడు భవీందర్‌తో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అమలాపాల్ పెళ్లి చేసుకున్న ఫొటోలను భవీందర్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి కలకాలం సృష్టించాడు. అయితే అవి ఫొటో షూట్ దృశ్యాలని తమకు పెళ్లి జరగలేదని అమలాపాల్ ఖండించింది. చదవండి: (Kamal haasan- Simbu: శింబు కోసం కమల్ హాసన్) కారణాలు ఏమైనా అమలాపాల్ భవీందర్లు మనస్పర్ధల కారణంగా విడిపోయినట్లు సమాచారం. ఇప్పుడు తన మాజీ ప్రియుడిని లైంగిక వేధింపులు కేసులో అరెస్ట్ చేయించింది. ఆ వివరాలు చూస్తే ఇటీవల నిర్మాతగా కూడా మారిన అమలాపాల్ ప్రస్తుతం విల్లుపురం జిల్లా, ఆరోవిల్ గ్రామం సమీపంలో ఉన్న తన ఇంటిలో నివసిస్తోంది. గత 26వ తేదీన భవీందర్‌పై విల్లుపురం ఎస్పీ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేసింది. అందులో రవీందర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, డబ్బు మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి లైంగిక వేధింపులు తదితర 16 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. -
ఆ వీడియోలను విడుదల చేస్తా.. అమలాపాల్ కు వేధింపులు!
హీరోయిన్ అమలాపాల్ విల్లుపురం(తమిళనాడు) పోలీసులను ఆశ్రయించారు.మాజీ ప్రియుడు పవీందర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్ హీరోయిన్ల డిమాండ్) 2018లో అమలాపాల్, పవీందర్ సింగ్ సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ లావాదేవీల్లో విబేధాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. డబ్బులు అడిగితే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెరదిస్తున్నాడని అమలాపాల్ ఫిర్యాదులో పేర్కొంది. పవీంధర్ సింగ్ స్నేహితులు కూడా తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆ హీరోలతో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా : అమలాపాల్
విభిన్నమైన పాత్రలతో తనకంటూ దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అమలాపాల్. మైనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీకి అమలాపాల్ పరిచయమై 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. నా కన్నా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించాను. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితంలో ఒకానొక సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేశాను. సక్సెస్ కోసం పాకులాడినట్లు అనిపించింది. నిజానికి దూరంగా బతుకుతున్నట్లు ఫీలయ్యా. ఆ సమయంలో ఎంతో మదనపడ్డాను. సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. మా నాన్ని చనిపోయిన సందర్భంలో ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి సమయం పట్టింది. కానీ పోరాడి నిలబడగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే -
నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్
Amala Paul About Cadaver Movie Releasing Problems: హీరోయిన్ అమలా పాల్ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం 'కడావర్'. నటుడు హరీష్ ఉత్తమన్, తిరికున్, వినోద్‌సాగర్, అతుల్య రవి, రిత్విక తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి అభిలాష పిళ్లై కథ అందించగా.. అనూప్ ఎస్. ఫణికర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 12వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం (ఆగస్టు 8) సాయంత్రం అమలాపాల్ విలేకరులతో ముచ్చటించారు. ఇది మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని అమలా పాల్ తెలిపారు. రచయిత అభిషేక్ పిళ్లై, దర్శకుడు అనూప్ ఎస్. ఫణికర్ తనను కలిసి 'కడావర్' చిత్ర కథను చెప్పారన్నారు. అందులో తన పాత్ర కొత్తగానూ, బలమైనదిగానూ ఉండడంతో నటించడానికి అంగీకరించానన్నారు. చిత్రంపైన నమ్మకంతోనే నిర్మాతగా మారినట్లు చెప్పారు. ఇందుకు తన తల్లి, సోదరుడు ఎంతగానో సహకరించారని తెలిపారు. నాలుగేళ్లు కష్టపడి, పలు పోరాటాలు చేసి చిత్రాన్ని పూర్తి చేశామన్నారు. చిత్రం విడుదల సమయంలోనూ పలు ఆటంకాలు ఎదురయ్యాయన్నారు. కొందరు చిత్రం విడుదలను అడ్డుకోవడానికి రహస్యంగా ప్రయత్నించారని ఆరోపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిత్రం విడుదల హక్కులను పొందినట్లు తెలిపారు. వరుసగా క్రైమ్, థ్రిల్లర్ హార్రర్ కథా చిత్రాలను చేయడంతో కాస్త రిలీఫ్ కోసం రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలను చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ 'విక్టిమ్' స్ట్రీమింగ్
విక్టిమ్ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతూ ఆదరణ పొందుతోంది. ఒకే కాన్సెప్టును నలుగురు డైరెక్టర్లు వివిధ కోణాల్లో సిరీస్‌ను తెరకెక్కించారు. పా.రంజిత్ దమ్మమ్ అనే కథను, వెంకట్ ప్రభు కన్ఫెషన్స్ అనే కథను, ఎం.రాజేష్ విలేజ్ మిర్రర్ కథను, శింబుదేవన్ కోట్టై పాక్‌కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్ అనే కథను రూపొందించారు. ఈ నాలుగు కథలు కాన్సెప్ట్ ఒకటే. భావోద్రేకాలతో కూడిన వినోదాన్ని జోడించిన క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కించారు. అయితే నలుగురు దర్శకులు వారి వారి శైలిలో రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. కరోనా కాలంలో ఇంటిలోనే ఉండిపోయిన ఒక సహాయ కథా రచయితకు పని పోయే పరిస్థితి. దీంతో అతనికి ఒక సిద్ధ వైద్యుడి గురించి తెలియడంతో ఆయన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందన్న అంశాలను వినోదభరితంగా రూపొందించిన కథ కోట్టై పాక్‌కు వత్తలుమ్ మొట్టైమాడి సిత్తరుమ్. ఇందులో సహాయ రచయితగా తంబి రామయ్య, సిద్ధ వైద్యుడిగా నాజర్ నటించారు. అదే విధంగా నటుడు నటరాజన్ ఇంటిలో అద్దెకు నివసిస్తున్న నటి ప్రియా భవాని శంకర్ జీవితంలో జరిగే సంఘటనలతో రూపొందిన కథ విలేజ్ మిర్రర్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కన్ఫెషన్స్ కథలో నటి అమలాపాల్ ప్రధాన భూమిక పోషించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించారు. మరో ముఖ్య పాత్రలో ప్రసన్న నటించారు. ఇక పా.రంజిత్ తెరకెక్కించిన దమ్మమ్ కథ తండ్రీ కూతురు, సమాజం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నటుడు గురు సోమసుందరమ్ ప్రధాన పాత్రలో నటించారు. చదవండి: నాకున్న ప్రేమను ఇలా తెలియజేశాను: రకుల్ ప్రీత్ సింగ్ -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్‌ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్‌ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్‌గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
నేరుగా ఓటీటీకి సంచలన నటి అమలా పాల్ చిత్రం
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రాని పరిస్థితి. స్టార్ నటులు లేదా చిత్రం ఎంతో బాగుంటే మాత్రమే థియేటర్లోకి వస్తున్నారు. ఇటీవల అలాంటి చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. దీంతో నిర్మాతలు సేఫ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే ఓటీటీ ప్లాట్ఫారం. నిజం చెప్పాలంటే ఇది చిన్న నిర్మాతలకు వరంగా మారింది. దీంతో థియేటర్లో చిత్రాలను విడుదల చేసి అవి హిట్ అవుతాయో లేదో అని టెన్షన్ పడుతూ ప్లాప్ అయితే పెట్టిన పెట్టుబడి పోగొట్టుకోవడం కంటే ముందుస్తు జాగ్రత్తలతోనే పడుతున్న నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఆశ్రయిస్తున్నారు. చదవండి: పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్ ఇక సంచలన నటి అమలాపాల్ విషయానికొస్తే చాలా కాలంగా తెరపై కనిపించడం లేదు. అలాంటిది ఈమె నిర్మాతగా మారి ‘కడావర్ పేరుతో చిత్రాన్ని నిర్మించింది. అంతేకాదు ఈ మూవీలో ఆమె ప్రధాన పాత్రలో కూడా నటించింది. మలయాళ దర్శకుడు అనూప్ ఎస్.పణికర్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు హరీష్ ఉత్తమన్, మునీష్ కాంత్, పశుపతి, నిళల్గళ్ రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మెడికల్ క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అమలాపాల్ పోలీసుగా నటించింది. ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేసును ఏసీపీతో కలిసి ఈమె ఎలా చేధించింది అన్నదే చిత్ర కథాంశం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
రెండో పెళ్లిపై స్పందించిన అమలాపాల్!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన అమలాపాల్ ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఓటీటీలో అడుగుపెట్టిన ఆమె తెలుగులో కుడి ఎడమైతే, హిందీలో రంజిష్ హీ సహి అనే వెబ్‌సిరీస్‌లతో అలరించింది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో డైరెక్టర్ విజయ్ను పెళ్లాడింది. కానీ వీరి పెళ్లి బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన అమలాపాల్ తన పెళ్లి గురించి ఓపెన్ అయింది. మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అసలిప్పుడు మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తనను తాను పూర్తిగా అర్థం చేసుకుని మరింత ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నానని బదులిచ్చింది. తనను మనువాడాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఇప్పుడైతే చెప్పలేనన్న ఈ బ్యూటీ త్వరలోనే దానికి బదులిస్తానని చెప్పుకొచ్చింది. అంటే అమలాపాల్ ప్రస్తుతం పెళ్లి మీద దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది మెగాస్టార్ కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే! -
ఆ స్టార్ డైరెక్టర్ జీవితంలో చిచ్చు పెట్టిన అమలాపాల్!
సినిమాల్లో అమాయకపు ఎక్స్ప్రెషన్స్, వినయంతో కనిపించే హీరోయిన్ అమలాపాల్ బయటక మాత్రం సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తరచూ వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సౌత్‌లో వెలుగు వెలిగిన ఆమె కెరీర్ ఒక్కసారిగా స్లో అయ్యింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ అందుకున్న ఆమె కెరీర్ గ్రాఫ్ అంతే తొందరగా పడిపోయింది. దీనికి ఆమె తీరు ఒక కారణమనే చెప్పొచ్చు. ఈ క్రమంలో కెరీర్ మళ్లీ స్టార్ట్ చేసిన ఈ డస్క్రీ బ్యూటీ ఆడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టికొస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే అమల తెలుగులో ‘కుడిఎడమైతే’ అనే వెబ్ సీరిస్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇప్పుడు అది జనవరి 13 నుంచి ప్రముఖ ఓటీటీలో వూట్(Voot)లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అమలాపాల్ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్ నటిగా కనిపించనుంది. స్టార్ డైరెక్టర్-నిర్మాత మహేశ్ భట్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను నిర్మాత మహేశ్ భట్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్‌గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అని, కొన్ని ఫిక్షన్ అని తాహిర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇందులో అతడు మహేశ్ భట్ పాత్రలో దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల అత్యంత విధేయుడిగా ఉండే ఆ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ పర్విన్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథ. ఇందులో అమలాపాల్ దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే సదరు స్టార్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్‌లాక్ చేయడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్లో చూపించారు. ఇలా అమలా పాల్ చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆమె పరిస్థితికి అన్వయించుకుని తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. -
అమలాపాల్ చీర ఖరీదు అన్ని వేలంటే నమ్ముతారా?
అమలాపాల్.. గ్లామర్ పాత్రలు చేస్తూనే ఏ చిన్న చాన్స్ దొరికినా నటనకు ప్రాధాన్యం ఉన్న భూమికలనూ పోషిస్తూ ఓ స్టయిల్‌ను సెట్ చేసుకున్న నటి. సినిమాల్లోనే కాదు.. తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌ను చూపిస్తోంది.. డిజైన్.. ఫాస్ట్ఫుడ్కే కాదు ఫాస్ట్ డ్రెసింగ్కూ అంతే క్రేజ్ ఉందిప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రెడీ టు వేర్ చీర డిజైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనిదే ఈ చీర. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్‌కు ముందుగానే కుచ్చులను కుట్టేస్తారు. దీనితో పాటు స్టిచ్డ్ బ్లౌజ్, ఒక కాలర్, ఒక బెల్టు కూడా ఉంటుంది. నికిత విశాఖ.. మార్వాడీ కుటుంబానికి చెందిన నికిత, విశాఖ అనే ఇద్దరు తోడికోడళ్ల గొప్ప పనితనమే ఈ ఫ్యాషన్ హౌజ్. అత్తింటి వారికి మహారాష్ట్రలో ఓ పెద్ద వస్త్ర పరిశ్రమ ఉంది. దాదాపు దశాబ్దంపాటు అదే వృత్తిలో ఉన్న వారి భర్తలను చూసి.. వస్త్ర ప్రపంచంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇంటరెస్ట్కు కాస్త సృజనాత్మకతను జోడించి తమ దుస్తులను తామే డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తింపు, మెప్పు వస్తూండడంతో ‘నికిత విశాఖ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ డిజైన్స్‌కు ఆదరణ పెరిగి ఫేమస్ డిజైనర్స్గా ఎదిగారు. వీరి డిజైన్స్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వీరు డిజైన్ చేసిన చీరలకు. ట్రెండీ లుక్‌తో ఉండే సంప్రదాయ చీరలను డిజైన్ చేయడంలో వీరికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. మెయిన్బ్రాంచ్ ముంబైలో ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. మొదట్లో నా చర్మరంగు గురించి చేసే విమర్శలకు బాధపడేదాన్ని, కానీ, సరిగ్గా లేకపోవడం కూడా సరైనదే అని అర్థమవుతోందిప్పుడు. – అమలాపాల్ చీర డిజైనర్ : నికిత విశాఖ ధర: రూ. 46,000 -
నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం..
Amala Paul Get Golden Visa: నటి అమలాపాల్ దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు అని చెప్పవచ్చు. ఇటీవల ఈమె హవా కాస్త తగ్గింది. అయితే వెబ్ సిరీస్‌లతో బిజీగానే ఉన్నారు. కాగా, తాజాగా దుబాయ్ ప్రభుత్వం అమలాపాల్‌కు గోల్డెన్ వీసాను ఇవ్వడం విశేషం. దీని గురించి ఆమె పేర్కొంటూ ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, భాగ్యంగానూ భావిస్తున్నానన్నారు. అది ఇది అందం, ఆడంబరాలకు నిలయమైన దేశం మాత్రమే కాదనీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ నిజాయితీగా లక్ష్యంతో పని చేస్తారని పేర్కొన్నారు. చదవండి: (నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది) -
నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్!
నాగార్జున అక్కినేని ప్రస్తుతం ‘బంగార్రాజు’ మూవీతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు ఆయన ప్రవీణ్ సత్తారుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా మొదట కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో హీరోయిన్ వేటలో పడ్డ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారట మన కథానాయికలు. చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు ఈ సినిమా కోసం హీరోయిన్ అమలా పాల్‌ను సంప్రదించగా.. ఆమె భారీగా డిమాండ్ చేసి మేకర్స్‌కు షాక్ ఇచ్చిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను కాదని మెహరీన్ కౌర్‌ను అడగ్గా ఈ బ్యూటీ కూడా కోటీ రూపాయలకు వరకు డిమాండ్ చేసిందని వినికిడి. ఇక హీరోయిన్ల వైఖరితో నిర్మాతలు విసిగిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక అమలా పాల్, మెహరీన్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ -
కాజల్ ప్లెస్‌లో త్రిష.. సాయేషా స్థానంలో ప్రగ్యా.. చివరి క్షణంలో మారిన తారలు
‘యస్... ఈ సినిమా చేస్తా’... హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘అయ్యో... కుదరడం లేదండీ’... కొన్నాళ్లకు రెడ్ సిగ్నల్ పడింది. మళ్లీ కొత్త హీరోయిన్ వేటలో పడింది సినిమా యూనిట్. ఈ మధ్యకాలంలో ఇలా తారుమారు అయిన తారల జాబితా చాలానే ఉంది. ఒకరు తప్పుకుంటే.. ఇంకొకరికి ఆ చాన్స్ దక్కింది. ఆ ‘తారమారె’ విశేషాలు తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ‘ఆచార్య’ తొలి ప్రియురాలు త్రిషే. 2016లో వచ్చిన ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మరోసారి ‘ఆచార్య’ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకోవడం, ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ రీప్లేస్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ‘ఆచార్య’ చిత్రంలో త్రిష ప్లేస్‌ను కాజల్ రీప్లేస్ చేస్తే కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోల్‌ను త్రిష రీప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ‘భారతీయుడు 2’ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆ పాత్రకు త్రిషను సంప్రదించారట చిత్రదర్శకుడు శంకర్. ‘భారతీయుడు 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తాజా చిత్రాలు ‘పొన్నియిన్ సెల్వన్’, ‘రాంగీ’ (ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది)లో త్రిష నటించారు. సో.. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధం, కమల్‌తో సినిమా కాబట్టి ‘భారతీయుడు 2’కి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగూ ‘భారతీయుడు 2’ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి... ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర నుంచి ఐశ్వర్యా రాజేశ్ కొన్ని కారణాల వల్ల∙తప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మాటకొస్తే ‘భారతీయుడు 2’ సినిమాయే కాదు.. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’లో రానా భార్య పాత్ర ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు ఐశ్వర్యా రాజేశ్. దాంతో రానా భార్యగా సంయుక్తా మీనన్ సీన్లోకి వచ్చారు. ఇక 2015లో ‘అఖిల్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన సాయేషా సైగల్ చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకున్న చిత్రం బాలకృష్ణ ‘అఖండ’. అయితే ఆర్యను పెళ్లి చేసుకున్న సాయేషా తల్లయ్యారు. దాంతో ఆమె ప్లేస్‌ను ప్రగ్యా జైస్వాల్ రీప్లేస్ చేశారు. ఇంకా నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర అమలాపాల్‌కు దక్కిందన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు హిందీకి వెళితే.. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో కథానాయికగా నటించడానికి ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు కీర్తీ సురేశ్. ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇదిలా ఉంటే.. తొలి హిందీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఓ తమిళ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నారు నయనతార. అయితే షారుక్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ కారణంగా యువరాజ్ దయాలన్స్ దర్శకత్వంలో అంగీకరించిన తమిళ సినిమాకు డేట్స్ కేటాయించలేక నయనతార వదులుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటించే అవకాశం శ్రద్ధా శ్రీనాథ్ సొంతమైనట్లు టాక్. వీరే కాదు.. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రీప్లేస్ అయిన తారలు ఇంకొందరు ఉన్నారు. -
అమలాపాల్ బర్త్‌డే స్పెషల్
-
Kudi Yedamaithe: కలలో ఏం జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరిగితే!
అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. జూలై 16న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా అనిపించింది. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ ట్రైలర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి. -
భయపెట్టారు; విడాకులపై నోరు విప్పిన అమలాపాల్..
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యాంథాలజీ ‘పిట్ట కథలు’ చిత్రంలో నటించి మెప్పించారు అమలాపాల్. నందిని రెడ్డి దర్వకత్వం వహించిన ఈ కథలో మీరా అనే మహిళా పాత్రలో ఆమె కనిపించారు. వివాహం మీద సాంప్రదాయ ఆలోచన ఉన్న ఆధునిక మహిళ మీరా. ఆమెను భర్త నిత్యం అనుమానిస్తూ ఉంటాడు. లైంగికంగా, శారీరక వేధింపులకు గురిచేస్తుంటాడు. అయినప్పటికీ మీరా అతనితోనే జీవితం కొనసాగిస్తుంటుంది. అయితే ఈ బంధం నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. చివరికి ఈ గృహహింస నుంచి తనెలా బయటపడిందనేది మీరా కథ. ఈ సిరీస్‌లోని తన నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ కేరళ బ్యూటీ. ఈ క్రమంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించారు. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చర్చించారు. పిట్టకథలులోని తన పాత్ర దృష్టిలో పెట్టుకొని నిజ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. ‘ఏఎల్ విజయ్‌తో నెలకొన్న విభేదాల కారణంగా విడిపోవాలని అనుకొన్నప్పుడు నన్ను అందరూ భయపెట్టారు. నువ్వు ఒక అమ్మయివంటూ ఎగతాళి చేశారు. నాకు అండగా ఎవరూ నిలువడలేదు. నా కెరీర్ నాశనం అవుతుందని, సమాజం హేళన చేస్తుందని హెచ్చరించారు. నా సంతోం గురించి, నా మానసిక సంఘర్ణణను గురించి ఎవరూ పట్టించుకోలేదు’ అని అమలాపాల్ చెప్పుకొచ్చారు. కాగా 2014 తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమధ్య కాలంఓ మరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే దర్శకుడితో విడాకుల అనంతరం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని టార్గెట్ చూస్తూ అనేకమంది అమలాను ట్రోల్స్ చేశారు. అయితే పట్టించుకోకుండా తన కెరీర్లో ముందుగు సాగుతున్నారు. ప్రస్తుతం అధో ఆంధా పరవాయి పోలా, ఆడు జీవితం, పరాణ్ణు పరాణ్ణు, పరాణ్ణు, కాడవెర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. చదవండి: మాజీ ప్రియుడిపై అమలాపాల్ కేసు రన్నింగ్ బస్‌లో లిప్‌లాక్.. ‘రొమాంటిక్’గా పూరీ కొడుకు -
రివ్యూ టైమ్: పిట్ట కథలు
వెబ్ యాంథాలజీ: ‘పిట్టకథలు’; తారాగణం: జగపతిబాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, మంచులక్ష్మి, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా; దర్శకులు: తరుణ్ భాస్కర్– నందినీ రెడ్డి – నాగ్ అశ్విన్ – సంకల్ప్ రెడ్డి; ఓటీటీ: నెట్ ఫ్లిక్స్; రిలీజ్: ఫిబ్రవరి 19 వేర్వేరు రచయితలు, కవులు రాసిన కొన్ని కథలనో, కవితలనో, గేయాలనో కలిపి, ఓ సంకలనం (యాంథాలజీ)గా తీసుకురావడం సాహిత్యంలో ఉన్నదే! మరి, వేర్వేరు దర్శకులు రూపొందించిన కొన్ని వెండితెర కథలను గుదిగుచ్చి, తెరపైకి తీసుకువస్తే? అదీ యాంథాలజీనే. ఓటీటీ వేదికలు వచ్చాక పెరిగిన ఈ వెబ్ యాంథాలజీల పద్ధతి ఇప్పుడు తెలుగులో కూడా ప్రవేశించింది. తమిళంలో గత ఏడాది ‘పుత్తమ్ పుదు కాలై’ (అమెజాన్ ప్రైమ్), ఈ ఏడాది ‘పావ కదైగళ్’ (నెట్ ఫ్లిక్స్) లాంటివి వచ్చాయి. గత సంవత్సరమే తెలుగులో ‘మెట్రో కథలు’ (ఆహా) లాంటి ప్రయత్నాలూ జరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగులో తొలిసారి తమ ఒరిజినల్ ఫిల్మ్‌గా అందించిన వెబ్ యాంథాలజీ ‘పిట్టకథలు’. పాపులర్ దర్శకులు తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఈ పిట్టకథలను రూపొందించారు. మన చుట్టూ ఉన్న మనుషుల కథలు, వాళ్ళ మనసులోని వ్యధలు, ప్రేమలు, మోసాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు – ఇలా చాలా వాటిని ఈ కథలు తెర మీదకు తెస్తాయి. స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతతో పాటు, వారి మధ్య పవర్ ఈక్వేషన్‌ను కూడా చర్చిస్తాయి. నేటివిటీ నిండిన ‘రాములా’: ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకొని, దర్శకత్వం వహించిన ‘రాములా’ గ్రామీణ నేపథ్యంలోని ఓ టిక్ టాక్ అమ్మాయి రాములా (శాన్వీ మేఘన) కథ. తోటి టిక్ టాక్ కుర్రాడు (నవీన్ కుమార్) ప్రేమిస్తాడు. కానీ, పెద్దల కోసం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైనప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఓ అమ్మాయి కష్టాన్ని మహిళామండలి అధ్యక్షురాలు స్వరూపక్క (మంచు లక్ష్మి) ఎలా వాడుకుంది ఈ కథలో చూడవచ్చు. సహజమైన నటనతో, తెలంగాణ నేపథ్యంలో, అదే మాండలికంలోని డైలాగ్స్ తో ఈ పిట్టకథ – జీవితాన్ని చూస్తున్నామనిపిస్తుంది. క్లైమాక్స్ గుండె పట్టేస్తుంది. హాట్ హాట్ చర్చనీయాంశం ‘మీరా’: ‘ఓ బేబీ’ ఫేమ్ నందినీరెడ్డి రూపొందించిన ‘మీరా’ – అనుమానపు భర్త (జగపతిబాబు) శారీరక హింసను భరించే పద్ధెనిమిదేళ్ళ వయసు తేడా ఉన్న ఓ అందమైన భార్య (అమలాపాల్) కథ. రచయిత్రి మీరా ఆ హింసను ఎంతవరకు భరించింది, చివరకు ఏం చేసిందనేది తెరపై చూడాలి. లక్ష్మీ భూపాల్ మాటలు కొన్ని చోట్ల ఠక్కున ఆగేలా చేస్తాయి. డిప్రెషన్‌తో బాధపడుతూ, భార్యను బతిమలాడే లాంటి కొన్ని సన్నివేశాల్లో జగపతిబాబులోని నటప్రతిభ మరోసారి బయటకొచ్చింది. అమలా పాల్ కూడా టైటిల్ రోల్‌ను సమర్థంగా పోషించారు. వంశీ చాగంటి, కిరీటి దామరాజు, ప్రగతి లాంటి పరిచిత నటీనటులతో పాటు నిర్మాణ విలువలూ బాగున్నాయి. హాట్ దృశ్యాలతో పాటు, హాట్ హాట్ చర్చనీయాంశాలూ ఉన్న చిత్రం ఇది. ట్విస్టులు, కీలక పాత్ర ప్రవర్తన అర్థం కావాలంటే రెండోసారీ చూడాల్సి వస్తుంది. టెక్నాలజీ మాయలో పడితే... ‘ఎక్స్ లైఫ్’: ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తీసిన పిట్టకథ ‘ఎక్స్ లైఫ్’ ఓ సైన్స్‌ఫిక్షన్. దర్శకుడు క్రిష్ వాయిస్ ఓవర్ చెప్పిన ఈ కథ భవిష్యత్ దర్శనం చేయిస్తుంది. ప్రపంచంలోని మనుషులందరినీ కేవలం డేటా పాయింట్లుగా భావించే విక్రమ్ రామస్వామి అలియాస్ విక్ (సింగర్ సన్నత్ హెగ్డే) ఎక్స్ లైఫ్ అంటూ ప్రపంచంలోనే అత్యాధునిక వర్చ్యువల్ రియాలిటీ కంపెనీ నడుపుతుంటాడు. మనుషుల్లోని ప్రేమను చంపేసే టెక్నాలజీని నమ్ముకున్న మాయాలోకం అది. అక్కడ కిచెన్‌లో పనిచేసే అమ్మాయి దివ్య (శ్రుతీహాసన్)ను చూసి, అమ్మ గుర్తొచ్చి, ప్రేమలో పడతాడు. తరువాత ఏమైందన్నది ఈ కథ. టెక్నాలజీ లోకపు పెను అబద్ధాల కన్నా చిరు సంతో షాలు, ప్రేమలు దొరికిన జీవితమే సుఖమనే తత్త్వాన్ని క్లిష్టంగా బోధపరుస్తుందీ కథ. అసంపూర్తి అనుబంధాల... ‘పింకీ’: ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు తీసిన సంకల్ప్ రెడ్డి రూపొందించిన పిట్ట కథ ‘పింకీ’. ఇద్దరు దంపతుల (సత్యదేవ్ – ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ – ఆషిమా నర్వాల్) మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ప్రేమ కోసం పరితపించే ఒకరు, పాత జ్ఞాపకాలను వదిలించుకోవాలనుకొనే మరొకరు... ఇలాంటి వివిధ భావోద్వేగాలతో నాలుగు పాత్రలు కనిపిస్తాయి. ఆ అనుబంధాల క్రమాన్ని కానీ, చివరకు వారి పర్యవసానాన్ని కానీ పూర్తి స్థాయిలో చూపకుండా అసంపూర్తిగా ముగిసిపోయే కథ ఇది. ఈ యాంథాలజీలో ఒకింత ఎక్కువ అసంతృప్తికి గురిచేసే కథా ఇదే. ప్రధానంగా స్త్రీ పాత్రల చుట్టూ తిరిగే ఈ పిట్టకథల్లో పేరున్న కమర్షియల్ చిత్రాల తారల అభినయ కోణం కనిపిస్తుంది. సంగీతంలో వివేక్ సాగర్ (‘రాములా’), మిక్కీ జె మేయర్ (‘మీరా’), ప్రశాంత్ కె. విహారి (‘పింకీ’) లాంటి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేశారు. అలాగే, ఛాయాగ్రహణం, ఆర్ట్ వర్క్‌లోనూ పాపులర్ టెక్నీషియన్లు ఉన్నారు. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, నవతరం దర్శకులు తీసిన ఈ కథలన్నిటిలో లవ్ మేకింగ్ సీన్లు ఎదురవుతాయి. అశ్లీలపు మాటలూ వినిపిస్తాయి. స్మార్ట్ ఫోన్లో చూస్తే అది ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, సకుటుంబంగా చూడాలంటే కష్టమే. చిరకాలంగా ‘నెట్ ఫ్లిక్స్’ ఊరిస్తూ వచ్చిన ఈ యాంథాలజీలో నాలుగు కథలూ ఒకే స్థాయిలో లేకపోవడమూ చిన్న అసంతృప్తే. కొసమెరుపు: ‘పిట్టకథలు’... అద్భుతంగా ఉన్నాయనలేం... అస్సలు బాగా లేవనీ అనలేం! బలాలు ♦సమాజంలోని కథలు ♦పాపులర్ దర్శకులు, నటీనటుల ప్రతిభ ♦నిర్మాణ విలువలు బలహీనతలు ♦హాట్ సన్నివేశాలు ♦కొన్ని అసంతప్తికర కథనాలు రివ్యూ: రెంటాల జయదేవ -
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
వెళుతూ ఉండాలి... వెళ్లనివ్వాలి
‘‘జీవితం ఏది ఇస్తే దాన్ని అంగీకరించాలి’’ అంటున్నారు అమలా పాల్. ఇంకా చాలా విషయాలు చెప్పారు. 2020 చాలా నేర్పించిందంటున్నారామె. ఈ ఏడాది నేర్చుకున్న విషయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి అమలా పాల్ ఈ విధంగా చెప్పారు. సరిగ్గా లేకపోవడం సరైనదేనని నేర్చుకున్నాను. నువ్వు సరిగ్గా లేవనే సంగతిని స్వీకరించకపోవడం సరైనది కాదని తెలుసుకున్నాను. సరేనా? మన లోపాల్ని స్వీకరించడంతోనే ఉపశమనం మొదలవుతుంది. . దైవత్వంతో పున స్సంధానమై, నా అహం తాలూకు మరణం నుంచి మేలుకొన్నాను. నాలోని కుండలిని (అనిర్వచనీయమైన శక్తి)ని నన్ను జాగృతం చేయనిచ్చాను. జీవితం నా దారిలో విసిరేసిన ప్రతి దానినీ హుందాగా, కృతజ్ఞతగా స్వీకరించాను. బాధ నుంచి నేనెప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ బాధను నన్ను ప్రభావితం చేయనిచ్చాను. బాధను అనుభవించడం నుంచే చాలా నేర్చుకున్నా. పాత స్నేహితులను కలవడానికి వెళ్లాలి. జీవితంలో కొత్త జ్ఞాపకాల కోసం వెళ్లాలి. శత్రువులను క్షమించడానికి వెళ్లాలి. మన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి వెళ్లాలి. వెళ్లాలి.. వెళ్లాలి.. వెళుతూ ఉండాలి. వెళ్లనివ్వాలి. నా జీవనగడియారాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఆయుర్వేదాన్ని ఆశ్రయించాను. -
కుడి ఎడమైతే...
వెబ్ సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా సిరీస్‌లలో నటించేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పచ్చజెండా ఊపుతున్నారు. ఆల్రెడీ అమలా పాల్ ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన హిందీ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ స్ట్రీమింగ్కి రెడీ అవుతోంది. తాజాగా ‘కుడి ఎడమైతే’ పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారట. పవన్ కుమార్ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ ఈ సిరీస్‌ని నిర్మించనుందని టాక్. థ్రిల్లర్ కథాంశంతో ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ సాగుతుందని తెలిసింది. -
ఉన్నది ఒక్కటే జీవితం.. ఆస్వాదించాలి
‘సీరియల్ కిల్లర్’ అని విన్నాం కానీ ‘సీరియల్ చిల్లర్’ అని వినలేదే అనుకుంటున్నారా? అమలా పాల్ తనని తాను ఇలా అనుకుంటున్నారు. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆస్వాదించాలి’ అంటుంటారు అమలా పాల్. అందుకే పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయిపోవడానికి అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌లు ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. కొన్నిసార్లు స్నేహితులతో కలసి ‘చిల్’ అవ్వడానికి ట్రిప్‌లు వెళుతుంటారు. ఇప్పుడు గోవాలో ఉన్నారు అమలా పాల్. ఫుల్‌గా రిలాక్స్ అవుతున్నారు. స్నేహితులతో కలసి చిల్ అవుతున్నారు. గోవాలో చిల్ అవుతున్న ఫొటోలను షేర్ చేసి, ‘మా హౌస్‌లో నేనే సీరియల్ చిల్లర్ని’ అని క్యాప్షన్ చేశారు. ఇలా వీలు కుదిరినప్పుడల్లా చిల్ అవ్వడానికి ఎక్కడో చోటకు వెళుతుంటారు కాబట్టే తనని తాను ‘సీరియల్ చిల్లర్’ అని ఉంటారామె. -
మాజీ ప్రియుడిపై అమలాపాల్ కేసు
చెన్నై : తన మాజీ బాయ్‌ప్రెండ్‌గా ప్రచారంలో ఉన్న బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌పై నటి అమలా పాల్ ఫిర్యాదు చేశారు. ప్రొఫెషనల్ షూట్ కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్ తప్పు అర్థం వచ్చేలా పోస్టు చేసి తన పరువుకు నష్టం కలిగించాడని చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమలా పాల్ ఫోటోలను అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవి అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారాయి. కాసేపటికే ఆ ఫోటోలు డిలీట్ అయ్యాయి. దీనిపై స్పందించిన నటి అవి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కావని స్పష్టం చేశారు. చదవండి:కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..! అక్కడితో ఈ టాపిక్ ముగియగా.. తాజాగా ఈ ఫోటోలపై అమాలాపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే కారణం కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్ తన అనుమతి లేకుండా ఉపయోగించాడని అమలాపాల్ ఆరోపించారు. ఇందుకు అతడిపై పరువు నష్టం దావా వేశారు. అమలాపాల్ ఆరోపణలు విన్న న్యాయమూర్తి.. భువ్నిందర్పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా భువ్‌నిందర్ సింగ్, అమలాపాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో భువ్‌నిందర్ ను ఆమె అన్‌ఫాలో చేసిందని టాక్. చదవండి: రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే ఇదిలా ఉండగా ఇప్పటికే తమిళ తర్శకుడు ఏఎల్ విజయ్ను 2014లో ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇటీవల వేరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. ఇక అమలాపాల్ నటించిన తమిళ చిత్ర అధో ఆంధ పరవై పోలా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. చదవండి: నన్ను నేను తెలుసు కుంటున్నాను -
నన్ను నేను తెలుసు కుంటున్నాను
‘‘మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ఆర్డర్ అని అనారోగ్యాన్ని డిజార్డర్ అని అన్నారు. డిజార్డర్ ఎందువల్లో కనుక్కోగలిగితే దాన్ని ఆర్డర్లో పెట్టడం సులువు అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కనుగొంటున్నాను’’ అన్నారు అమలాపాల్. ప్రస్తుతం ఆమె పంచకర్మ చికిత్స తీసుకుంటున్నారు. ఆయుర్వేద చికిత్సలో ఇదో భాగం. 28 రోజుల ఈ చికిత్సా ప్రక్రియలో సుమారు 20 రోజులు పూర్తి చేశారట ఆమె. ఈ ప్రయాణం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదంతో నా ప్రయాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయింది. ఈ ప్రయాణంలో ఓ పుస్తకంలో దోషాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కలసి మూడు శక్తులను సృష్టించాయి. వాటినే దోషాలంటారు. వాతా. పితా. కఫా. ఇందులో మొదటిది మన ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. రెండోది మన జీర్ణాన్ని, శారీరక చర్యలను చూసుకుంటుంది. చివరిది మన శరీరాకృతిని నిర్దేశిస్తుంది. ఆయుర్వేదిక ప్రక్రియలన్నీ ఈ మూడు దోషాలను సరైన క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేసుకోవడానికే. నెల రోజులుగా ఆయుర్వేదంలో పంచకర్మలో మునిగితేలుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన శక్తిని మనమే తెలుసుకొని స్వయంగా నయం చేసుకోగలిగే ప్రక్రియ ఇది. ఇలాంటి ప్రక్రియలో పంచకర్మ ఒకటి’’ అన్నారామె. -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
బాలకృష్ణ బీబీ3లో అమలా పాల్!
హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు(జూన్ 9) సందర్భంగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో 64 సెకండ్ల వీడియోను విడుదల చేసిన విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దక్షాణాది భామ అమలా పాల్‌ను చిత్ర నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. అంతేగాక దర్శకుడు బోయపాటి ఇటీవల అమలాకు కాల్ చేసి సినిమా స్క్రిప్ట్‌ను వివరించగా దానికి ఆమె ఆసక్తి చూపినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో అమలా పాత్రను అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. (బాలయ్య అభిమానులకు మరో కానుక) అయితే ఇదే పాత్ర కోసం దర్శక, నిర్మాతలు హీరోయిన్ శ్రియా శరణ్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల తాను అంగీకరించలేదని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ లీడ్ రోల్ పాత్రను కూడా త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను విలన్ పాత్లో నటింపజేయాలని నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమా 2021 వేసవిలో విడుదల కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించారు. కరోనా కారణంగా ఈ షూటింగ్ ఆగిపోయింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. (బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!) -
జీవితం ఉన్నది అనుభవించడానికే..
జీవితం ఉన్నది అనుభవించడానికేనని నటి అమలాపాల్ పేర్కొంది. కరోనా కాలంలో ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది సినిమా హీరోయిన్లే అని చెప్పవచ్చు. ఈ లాక్డౌన్ కాలంలో నటీ నటులందరూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతుండడమే ఇందుకు తా ర్కాణం. అందులో ఇల్లు, వంట పనులు సినిమాలు చూడడం మిగిలిన సమయాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటించడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. ఇక నటి అమలాపాల్ విషయానికొస్తే తను మొదటి నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూ సంచలన నటిగా ముద్ర వేసుకుంది. దర్శకుడు విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత రెండేళ్లకే ఆయనకు విడాకులు ఇచ్చి, మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఈమధ్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. కాగా ఇలాంటి పరిస్థితుల్లో నటి అమలాపాల్ తాజాగా తాను ఈత దుస్తుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతూ అభిమానుల వివిధ రకాల కామెంట్లకు చేస్తున్నారు. ఒకరు ఫొటోలు చాక్లెట్ల తరహాలో ఉన్నాయంటే.. మరొకరు ఈ లాక్‌డౌన్‌ను నీలాగా ఎవరూ ఎంజాయ్ చేయలేరు అని కామెంట్స్ చేశారు. ఆ విషయాన్ని పక్కన పెడితే. నటి అమలాపాల్ తన ఫొటో కింద ఒక క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది. అందులో విశ్రాంతి సమయంలో ప్రశాంతత కోసం మీరు.. ఎందుకు ఎంజాయ్ చేయలేక పోతున్నారు? అని ప్రశ్నించింది. నేటి ప్రపంచంలో ఎన్నో విషయాలను మహిళలు చేయగలుగుతున్నారు. కాగా ఈ అమ్మడి ఫొటోను, కామెంట్‌ను మరో సంచలన నటి మాళవిక మోహన్ ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. చదవండి: మానసిక వేదనతో బాధపడుతున్నా -
తండ్రి అయిన దర్శకుడు
చెన్నై: ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి ఐశ్వర్య విజయ్ శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఐశ్వర్య విజయ్ మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు విజయ్ సోదరుడు, నటుడు ఉదయ తెలిపారు. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది’ అని ఉదయ ట్వీట్ చేశారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) కాగా హీరోయిన్ అమలాపాల్‌తో విడాకుల అనంతరం డాక్టర్ ఆర్.ఐశ్వర్యను దర్శకుడు ఏఎల్ విజయ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ 2014లో అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం అమలాపాల్ సింగిల్‌గానే ఉన్నారు. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) Yes..IAM A PERIYAPPA now..Brother Director VIJAY And AISHWARYA VIJAY blessed with baby boy at 11.25am ...Happppyyyyyyyy....Soooo happpy....@onlynikil — Udhaya (@ACTOR_UDHAYAA) May 30, 2020 -
చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్
తండ్రి మరణాంతరం తన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటూ హీరోయిన్ అమలా పాల్ భావోద్యేగానికి లోనయ్యారు. తన తండ్రి మరణం తనని, తన తల్లిని ఎంతగానో కుంగదీస్తోందంటూ తన తల్లి అన్నీ పాల్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశారు. ‘తల్లిదండ్రులను కోల్పోవడం అనేది వర్ణించలేని బాధ. ఇది ఒక పెద్ద పతనం కూడా. ఎప్పుడూ చూడని చీకటిని చూస్తాం. విభిన్న భావోద్యేగాలకు గురవుతాం. క్యాన్సర్‌తో నా తండ్రిని కోల్పోయిన అనంతరం నా జీవితంలో ఎన్నో మార్పులు రావడం నేను గమనించాను’ అంటూ భావోద్యేగ లేఖ రాసుకొచ్చారు. (అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం) View this post on Instagram LOSING A PARENT is a feeling that cannot be described, it's a MAJOR DOWNFALL and you begin to TRANSCEND into the UNKNOWN DARKNESS and experience varied emotions. Losing my PAPPA to CANCER OPENED a whole new DIMENSION IN MY LIFE. It made me realize so many things. Here's one such thought! . We live in a big beautiful world. Like the Yin to the Yang, we also live in a world carved out by 'SOCIETAL NORMS' that DICTATE our EVERY MOVE and EVERY THOUGHT. We start getting CONDITIONED from a very YOUNG AGE and SHUT OURSELVES through the TRAUMATIC EXPERIENCES and LOCK parts of our INNER-CHILD in to these BOXES. . Unfortunately in the RAT RACE TO THE TOP, we often AREN'T TAUGHT to LOVE OURSELVES. We don't ALLOW ourselves to OPEN THESE BOXES and HEAL our INNER-CHILD from these TRAUMAS and conditioning. . We shift from RELATIONSHIP after RELATIONSHIP, craving for company and searching for the missing 'HALF' in PEOPLE, THINGS, CAREER, SUBSTANCES, MOMENTARY PLEASURES, EXPERIENCES all a mean to ESCAPE OUR TRUE-SELVES only to be left more emptied. . WHEN WILL WE LEARN TO LOVE OURSELVES AS A 'WHOLE' AND FULLY EMBRACE THE DARK, LIGHT, GOOD, BAD, HAPPINESS, EMPTINESS, VULNERABILITIES ,PAIN, INSECURITIES, FEARS ? . Yes I have decided to WHOLEHEARTEDLY accept this and COURAGEOUSLY WALK THE PATH LESS TRAVELED.. no more ESCAPE! . MOST IMP - THE WOMEN we grew up looking up to have forgotten that they're as important as their family. Our MOTHERS have really forgotten to LOVE THEMSELVES, let alone HEALING!! They spend their whole life taking care of their HUSBAND, CHILDREN, FAMILY and NEVER FOR ONCE STOP to do SOMETHING for THEMSELVES. It's our responsibility to educate and make them understand about loving and nurturing their INNER-SELF BEFORE THEY LOSE THEMSELVES FOREVER!! I almost lost myself and my mom to the verge of DEPRESSION but here we are gearing up to FLY LIKE A PHOENIX in to transformation THROUGH LOVE AND HEALING. . Thanks to my constant support system, my dearest BROTHER for all that he is and especially for making my CHILDHOOD TRAUMATIC EXPERIENCES very entertaining and still continuing to do that 😂🙄💙 Lots of love and healing to all the broken hearts 💟 A post shared by Amala Paul ✨ (@amalapaul) on Apr 1, 2020 at 5:31am PDT అదే విధంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న మనుషులు తమను తాము ఎలా కోల్పోతారో వివరిస్తూ.. ‘‘మనమంతా ఒక అందమైన ప్రపంచంలో జీవిస్తుస్తాము. అలాగే మన ప్రతి కదలికను, ఆలోచనను నిర్దేశించే సామాజిక నిబంధనలతో కూడిన ప్రపంచంలో కూడా జీవిస్తుస్తాము. ఎలా అంటే చిన్న వయస్సు నుంచే షరతులతో కూడి.. బాధాకరమైన అనుభవాలతో మనలోని చిలిపి తనాన్ని ఓ పెట్టెలో బంధించేంతగా. ఈ జీవిత పోరాట పందెంలో మనమంతా బాధలను భరించడం తప్పా.. మనల్ని మనం ప్రేమించడం కూడా మరచిపోయి మనలోని పిల్లల మనస్తత్వాన్ని అనుమతించలేనంతగా మారిపోతాం’’ అంటూ తాను ఎదుర్కొంటున్న చేదు అనుభవాన్ని వివరించారు. కాగా అమలా తండ్రి పాల్ వర్గీస్ క్యాన్సర్‌తో జనవరి 22న మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ ‘అధో ఆంధ పరవై పోలా’, ‘ఆదు జీవితం’, ‘కాడవర్, లస్ట్ స్టోరీస్’ వంటి రీమేక్‌లో నటిస్తున్నారు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి) -
అందుకే తప్పుకున్నా
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ’పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. ‘మనకి ఆఫర్ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము. ’పొన్నియిన్ సెల్వన్’లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి
నటులపై, దర్శకులపై ఘాటు విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన నటి శ్రీరెడ్డి తాజాగా అమలాపాల్ రెండవ పెళ్లిపై స్పందించారు. నీ పంజాబీ భర్త మంచివాడే, భయపడొద్దు అమలాపాల్.. అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ మేరకు ‘‘బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమలాపాల్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారీ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. (శ్రీరెడ్డి కేసు.. డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు..) కాగా ఇటీవల నటి అమలాపాల్.. ప్రియుడు, ముంబైకు చెందిన గాయకుడు భవ్నీందర్ సింగ్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలు కాస్తా సోషల్ మీడియాలో వైరలవ్వడంతో దీనిపై స్పందించిన అమలాపాల్ తనకు వివాహం జరగలేదని, అవి కేవలం ఫోటోషూట్ కోసం దిగిన ఫోటోలని స్పష్టం చేశారు. ఇక అమలాపాల్ 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఈ తర్వాత విజయ్ మరో వివాహం చేసుకున్నారు. (ప్రియుడిని పెళ్లి చేసుకున్న అమలాపాల్) (రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే) -
రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే
ఏఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత తన రిలేషన్ కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకిచెప్పలేదు అమలాపాల్. నటి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది. తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్లో ఉన్న ఫోటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్ కోసం అని స్పష్టంచేసింది. అయితే గత కొద్ది రోజుల కింద ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. కాగా..చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. దర్శకుడు విజయ్‌తో విడిపోయాక అమల కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలోనే చివరికి భవీందర్‌తో ప్రేమాయణం కూడా.. ఇప్పుడు అది కూడా పెళ్లికి చేరకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
హీరోయిన్ అమలాపాల్ ఫోటోలు
-
అమలా పరిణయం
ఏఎల్ విజయ్‌తో విడిపోయిన తర్వాత తన రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ప్రతీ విషయాన్ని రహస్యంగా ఉంచారు అమలా పాల్. ప్రేమలో ఉన్నానంటారు కానీ ఆ విషయాలేవీ బయటకు చెప్పలేదు. అయితే ముంబైకు చెందిన సింగర్ భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారనే విషయం కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చింది. తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం బయటకు వచ్చింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు భవీందర్. ప్రస్తుత పరిస్థితులను (కరోనా) అనుసరించి కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి చేసుకున్నారని సమాచారం. అయితే పెళ్లి ఫొటోలను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొలగించారు భవీందర్. అమలా పాల్, భవీందర్ -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అమలాపాల్
హీరోయిన్ అమలపాల్ తన ప్రియుడు సింగర్ భవ్నీందర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. గత కొన్నిరోజులుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒకటైనట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను భవ్నీందర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెడ్డింగ్ పిక్స్ అని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ కొద్దిసేపటికే భవ్నీందర్ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అయితే అప్పటికే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. అమలాపాల్ తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. గతంలో ఆమె దర్శకుడు ఏఎల్ విజయ్ను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైయినా కొద్దికరోజులకే మనస్పర్థలు రావడంతో వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకు అమలాపాల్ గానీ, భవ్నీందర్ గానీ తమ బంధం కూడా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. చదవండి : అతడే అమలాపాల్ ప్రియుడు! -
అమలాపాల్ ప్రియుడెవరో తెలుసా?
‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది ఎవరో కాదు హీరోయిన్ అమలాపాల్. గత కొంతకాలంగా అమల ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేరళ బ్యూటీ ఇది నిజమేనని అంగీకరించినప్పటికీ, అతని పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. అంతేకాక ప్రియుడి వివరాలను, వారి షికార్లను కూడా గుట్టుగా దాస్తూ వచ్చింది. ఇకపోతే అమల బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందోచ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు కొన్ని ఫొటోలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బుర్కా ధరించి ఉన్న అమల వెంట ముంబై సింగర్ భవ్నీందర్ సింగ్ ఉన్నాడు. (ఆ ఇద్దరు విడిపోవడానికి అతనే కారణం) దీంతో అతని కోసం నెటిజన్లు అన్వేషించగా వారి మధ్య కుచ్ కుచ్ హోతా హై అన్నది బోధపడుతూ వచ్చింది. దీనికి కారణం గతంలోనూ భవ్నీందర్ ఆడై సినిమా ప్రమోషన్ల సమయంలో.. నా ప్రేయసిని చూసి గర్వపడుతున్నాను. మున్ముందు కూడా ఇలాగే నీ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కొన్నిసార్లు వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నాడు. తాజాగా అతను షేర్ చేసిన ఫొటో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అందులో అతను పై నుంచి ఫొటో తీస్తుండగా ఓ యువతి అతన్ని ముందునుంచి హత్తుకుని ఉంది. కానీ ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆమె కచ్చితంగా అమలాపాలే అని నెటిజన్లు డిసైడ్ అయిపోతున్నారు. కాగా ఈ మధ్యే ఈ ప్రేమ జంట బాలి ట్రిప్‌కు వెళ్లారని సమాచారం. ఇక దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ రెండేళ్లకే అతని నుంచి విడాకులు తీసుకుంది. -
నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్
‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన హీరోయిన్ అమలాపాల్.. తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. వార్తల్లో ఉండడం హీరోయిన్ అమలాపాల్‌కు కొత్తేమీ కాదు. తనేంటో, తన పనేంటో తాను చూసుకుంటూ ఉండే ఈ సంచలన నటిని ఆమె మాజీ మామ వార్తల్లోకి లాగారు. అమలాపాల్ దర్శకుడు విజయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటి అమలాపాల్ నటనపై దృష్టి పెట్టగా విజయ్ దర్శకత్వంపై నిమగ్నమయ్యారు. ఇటీవల ఆయన ఒక వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. నటి అమలాపాల్ కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్ తండ్రి, నిర్మాత, నటుడు ఏఎల్.అళగప్పన్ అమలాపాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణం అని పేర్కొన్నారు. (వార్తల్లో.. అమలాపాల్ వీడియో) ఆయన తాను నిర్మించిన ‘అమ్మ కణక్కు’ చిత్రంలో నటించమని అమలాపాల్‌ను కోరాడని తెలిపాడు. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్‌కు, ఆమెకు మధ్య విడాకులకు దారి తీసిందని చెప్పారు. ఇక ఈ మాటలన్నీ సంచలన వార్తగా మారి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. కాగా విజయ్ తండ్రి వ్యాఖ్యలకు కాస్త ఆలస్యంగానైనా అమలాపాల్ గట్టిగానే స్పందించింది. ‘మీ వివాహ రద్దుకు నటుడు ధనుష్ కారణమనేది వాస్తవమా?’ అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు అడుగుతున్నారేంటని ఆశ్చర్యపోయింది. అయినా తన వివాహ రద్దు గురించి చర్చ అనవసరం అని పేర్కొంది. అది తన వ్యక్తిగత విషయమని ధీటుగా సమాధానమిచ్చింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, అందుకు వేరెవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చింది. (విజయ్, అమలాపాల్ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం!) ‘అయినా వేరెవరి కారణంగానో వివాహాన్ని రద్దు చేసుకుంటారా?’ అని తిరిగి ప్రశ్నించింది. నటుడు ధనుష్ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పింది. ఈ విషయంపై ఇంకేమీ తనను అడగవద్దు అని, ఇంతకు మించి మాట్లాడటానికి తనకు ఇష్టం లేదంది. కాగా ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో నటించడానికి అంగీకరించి, ఆ తరువాత సినిమా నుంచి వైదొలగింది. అందుకు కారణం ఏమిటన్న ప్రశ్నకు అన్ని పాత్రలను అందరూ చేయలేరని పేర్కొంది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో తనకు ఇచ్చిన పాత్రను తాను చేయలేననిపించిందని, ఆ పాత్ర తనకు నప్పదనిపించడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు చెప్పింది. ‘మీరు మళ్లీ ప్రేమలో పడ్డట్టు ప్రచారం హోరెత్తుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటార’న్న ప్రశ్నకు అందుకు ఇంకా సమయం ఉందని, తాను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి వెల్లడిస్తానని అమలాపాల్ తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ భామ యాక్షన్ హీరోయిన్గా నటించిన ‘అదో అందపరవై పోల’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు బాలీవుడ్లో మకాం పెట్టడానికి సిద్ధమవుతోంది. సంచలన దర్శకుడు మహేశ్‌భట్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పర్వీన్ బాబీ’ బయోపిక్‌లో అమలాపాల్ నటించనుంది. (స్టార్ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!) -
కొన్ని అలా జరిగిపోతాయంతే
సినిమా: ఎన్నో అవాంతరాలను, వివాదాలను ఎదుర్కొని నిలబడ్డ నటి అమలాపాల్. నటిగా రంగప్రవేశం, ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ నటన ఇలా అన్నీ చకచకా అమలాపాల్ జీవితంలో జరిగిపోయాయి. ప్రస్తుతం అమలాపాల్ చాలా బిజీగా ఉంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆమె నటించిన అదో అంద పరవై పోల చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన అమలాపాల్ తాజాగా బాలీవుడ్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమలాపాల్‌కు అలాంటి అవకాశం ముంగిటవాలింది. దర్శకుడు మహేశ్‌భట్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నాయకిగా నటించనుంది. దీని గురించి అమాలాపాల్ స్పందిస్తూ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియకుండానే జరిగిపోతాయని అంది. అలాంటిదే బాలీవుడ్ దర్శకుడు నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడం అని పేర్కొంది. మహేశ్‌భట్ యూనిట్‌తో అమలాపాల్ ఆయన చిత్రాల్లో నటించాలని దక్షిణాది హీరోయిన్లు కలలు కంటారని అంది. ఆయన చిత్రాల్లో కథానాయకి పాత్రలు బలంగానూ, అర్థవంతంగానూ ఉంటూ జీవితంలో గుర్తుండిపోతాయని పేర్కొంది. ఆయన స్కూల్లో నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పింది. ఆయని నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌ను పుషబ్దీప్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పింది. ఆయన చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని పేర్కొంది. ఆయన ఇచ్చిన కథను చదివినప్పుడు ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంటుందని భావించానని తెలిపింది. ఈ వెబ్ సిరీస్ 1970 కాలానికి చెందిన విజయం కోసం పోరాడే దర్శకుడికి, ఒక స్టార్ హీరోయిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఇతి వృతంతో కూడిందట. హిందీ చిత్రం చిచ్చోర్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు పొంది మహేశ్ భట్‌ను ఆకట్టుకున్న తాహీర్ ఈ వెబ్ సిరీస్‌లో దర్శకుడి పాత్రలోనూ అమలాపాల్ స్టార్ హీరోయిన్‌గానూ నటించనున్నారు. ఇందులోని సవాల్‌తో కూడిందని అందుకే మూడు నెలల పాటు వేషభాష, హావబావాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆ సిరీస్ యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం ఈమె ఆడు జీవితం, కడావర్ అనే రెండు మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో రీమేక్ అవుతున్న అసురన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఘోస్ట్ స్టోరిస్ అనే హిందీ చిత్రంలోనూ అమలాపాల్ బిజీగా ఉంది. -
1970 ప్రేమకథ
హిందీ భాషపై పట్టు సాధించే ప్రయత్నాలను మొదలుపెట్టారు హీరోయిన్ అమలాపాల్. ఎందుకంటే తొలిసారి ఆమె హిందీ డైలాగ్స్ చెప్పబోతున్నారు. కానీ సినిమాలో కాదు.. వెబ్ సిరీస్ కోసం. ‘చిచోరే’ ఫేమ్ తాహిర్ రాజ్ బాసిన్, అమృత ఇందులో కీలక పాత్రధారులు. పుష్పదీప్ భరద్వాజ్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారు. బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత, రచయిత మహేశ్‌భట్ ప్రొడక్షన్లో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకోనుంది. 1970లో పెద్ద ఫిల్మ్‌మేకర్ కావాలనుకున్న ఓ యువకుడు, ఓ అగ్ర హీరోయిన్ మధ్య కొనసాగిన రిలేషన్షిప్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. దివంగత నటి పర్వీన్ బాబీ జీవితం నేపథ్యంలో అమలా పాల్ పాత్రను డిజైన్ చేశారట. ‘‘1970 బ్యాక్‌డ్రాప్‌లోని ఓ బాలీవుడ్ లవ్‌స్టోరీ నేపథ్యం ఉన్న కథాంశంలో నటించబోతున్నాను. నా బాలీవుడ్ అండ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకన్నా నాకు ఏం కావాలి’’ అన్నారు అమలాపాల్. -
కురుమలైలోనారప్ప
తమిళనాడులో ఫైట్ చేస్తున్నారు ‘నారప్ప’. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రంలో ప్రియమణి, అమలాపాల్ కథానా యికలుగా నటిస్తున్నారని తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని పాల్తూరు గ్రామంలో ఇటీవల ‘నారప్ప’ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని కురుమలైలో జరుగుతోంది. స్టంట్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి అనంతపురంలో ‘నారప్ప’ చిత్రీకరణ మొదలవుతుంది. ‘నారప్ప’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ. -
‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి అతడే!’
దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం అట. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్ అయిన మలయాళ కుట్టి అమలాపాల్. ఆ తరువాత వరుసగా ఆమెకు అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు విజయ్‌తో పరిచయమైంది. ఆయన విక్రమ్ హీరోగా తెరకెక్కించిన దైవ తిరుమగళ్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా అమలాపాల్‌ను ఎంపిక చేశారు. ఆ తరువాత విజయ్ హీరోగా చేసిన తలైవాలోనూ అమలాపాల్‌నే హీరోయిన్గా నటించింది. అలా దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. అలా 2014లో దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల పెళ్లి పెద్దల సమ్మతంతో జరిగింది. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే ఈ జంట విడిపోయారు. అప్పుట్లో ఇద్దరు పరస్పర చర్చలతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు కానీ, సమస్య ఏమిటన్నది ఎవరూ చెప్పలేదు. అయితే పెళ్లి అయిన తరువాత అమలాపాల్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది. ఆమె నటించడం విజయ్‌కు ఇష్టం లేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి మూడేళ్లపైనే అయ్యింది. దర్శకుడు విజయ్ గత ఏడాది ఐశ్వర్య అనే వైద్యురాలిని రెండో పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ నటిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్, అమలాపాల్ విడిపోవడానికి అసలు కారణాన్ని విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ కుండబద్దలు కొట్టారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ వివాహానంతరం అమలాపాల్ నటించరాదని నిర్ణయించుకుందన్నారు. ఆ సమయంలో హీరో ధనుష్.. ఆమెను తను నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నటించేలా చేశారని చెప్పారు. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరువాతనే విజయ్‌కు, అమలాపాల్‌కు మధ్య సమస్యలు తలెత్తడం ప్రారంభించాయని ఏఎల్.అళగప్పన్ ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు సినీపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. కాగా అమ్మా కణక్కు తరువాత అమలాపాల్ .. ధనుష్‌తో కలిసి వేలైఇల్లా పట్టాదారి, దాని సీక్వెల్లోనూ వరుసగా నటించింది. కాగా ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం కలిగించిన ఆమె ఆ తరువాత అదో అంద పరవై పోల చిత్రంలో నటించింది. ప్రేమికుల రోజు 14న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చదవండి: అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి -
అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం
హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి పౌల్ వర్గీస్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కాగా అమలాపాల్ తన తాజా చిత్రం ‘అదో అంద పరవై పోల’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు అమలాపాల్ చెన్నై విచ్చేసింది. ఈ సమయంలో తన తండ్రి మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి పయనమైంది. నేడు కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్ పౌల్ క్యాథలిక్ చర్చిలో మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో ఆమె తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక అమలాపాల్ సినిమాల్లోకి రావటం ఆమె తండ్రికి అస్సలు నచ్చేది కాదట. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని ఒప్పించడంతో అమల సినిమాల్లో నటించేందుకు అడ్డు చెప్పలేదట. అలా అమల ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. -
పర్వీన్ బాబీగా అమలాపాల్?
‘‘1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్ ప్రయాణం మొదలుపెడుతున్నాను’’ అని ఆ మధ్య ప్రకటించారు హిందీ దర్శక–నిర్మాత మహేశ్ భట్. అయితే ఇది నటి పర్వీన్ బాబీకి, మహేశ్ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్ టాక్. పర్వీన్ బాబి బయోపిక్ తరహాలోనే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. పర్వీన్ బాబీగా అమలాపాల్ నటించబోతున్నారన్నది తాజా వార్త. పర్వీన్ బాబీ పాత్రకు అమలా పాల్ కరెక్ట్‌గా సరిపోతారని టీమ్ భావించారట. ఈ వెబ్ సిరీస్‌ను మహేశ్ భట్, ముఖేష్ భట్ కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తారు. త్వరలోనే ఈ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారట అమలా పాల్. -
ఈ వీడియో ఇప్పుడు వార్తల్లో
సినిమా: నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పాపులర్ అయిన నటి అమలాపాల్ అని పేర్కొనవచ్చు. కోలీవుడ్‌లో తొలి చిత్రంలోనే చర్చనీయాంశ కథా పాత్రలో నటించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత మైనా చిత్ర విజయంతో నటిగా పేరు తెచ్చుకుంది. ఇక దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి సంచలన నటిగా ముద్ర వేసుకుంది. ఆయన్ని పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే విడిపోయి విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయినా కథానాయకిగా నిలదొక్కుకుందంటే ఆమె సంపాధించుకున్న పాపులారిటీనే కారణం అని చెప్పవచ్చు. కాగా ఆ మధ్య ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. అలా ఆమె ధైర్యానికి పోలీసులతో కూడా ప్రశంసులు అందుకుంది. ఇకపోతే విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గుతుందని పాండిచేరిలో రిజిస్టర్ చేయించుకుని వివాదాల్లోకి ఎక్కింది. View this post on Instagram It all starts with A Vision! ✨ . . #wakeupandlift #girlswholift #weightlife #gymrat #fuelyourlife #fitfam #lifeinmumbai #AmalaPaul A post shared by Amala Paul ✨ (@amalapaul) on Dec 19, 2019 at 7:31am PST ఇలా అమలాపాల్ అంటేనే సంచలనం అన్నంతగా ముద్ర వేసుకున్న ఈ కేరళా కుట్టి. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి మరోసారి చర్చకు తావిచ్చింది. కాగా సమీప కాలంలో వార్తల్లో ఎక్కడా కనిపించని అమలాపాల్ తాజాగా మరో సారి సామాజక మాధ్యాలకు పనిచెప్పింది. పిట్నెస్ కోసం కసరత్తులు చేస్తున్న వీడియో తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో అమలాపాల్ ఎంత కష్టపడి కసరత్తులు చేస్తున్నదో అందరికీ తెలిసేలా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆడై చిత్రం తరువాత అమలాపాల్ నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. కాగా ఈ సంచలన నటి నటించిన అదో అందపరవై పోల చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. కాగా తాజాగా బాలీవుడ్లో అడుగు పెట్టనుంది. అక్కడ హీరోయిన్లు ఎలా ఉంటే ఆదరిస్తారో తెలిసిందేగా. ఆ చిత్రం కోసమే ఈ అమ్మడు స్లిమ్‌గా తయారవ్వడానికి వరౌట్స్ చేస్తోందట. ఈ విషయాన్ని తెలియజేయడానికీ, పనిలో పనిగా ఉచిత ప్రచారం పొందడానికీ తన కసరత్తుల వీడియోను విడుదల చేసింది. ఇలా వార్తల్లో ఉండడంలో అమలాపాల్ తనకు తానే చాటి అని మరోసారి రుజువు చేసింది. -
కొత్త నిర్మాతలకు తరగతులు
‘‘ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ‘భాస్కర్ ఒక రాస్కెల్’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర నిర్మాణం పట్ల నూతన నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం నిర్మాత మండలి తరఫున తరగతులు నిర్వహిస్తున్నాం’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. అరవింద స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ అనే పేరుతో కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్‌బాషా ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి. సముద్ర, నిర్మాత దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కథా బలమే సినిమాకు ప్రాణం’’ అన్నారు సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుగోపాల్ యాదవ్. ‘‘తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? ఇందుకోసం ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది’’ అన్నారు పఠాన్ బాషా. -
అమలా ఔట్?
ప్రముఖ దర్శకులు మణిరత్నం భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో ‘పొన్నియిన్ సెల్వమ్’ చిత్రం తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, కీర్తీ సురేశ్, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా నుంచి అమలా పాల్ తప్పుకున్నారనే వార్త బయటకు వచ్చింది. పీరియాడికల్ చిత్రం కావడంతో సినిమా షూటింగ్ ప్రారంభానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. షూటింVŠ లేట్ కావడంతో యాక్ట్ర్స్ డేట్స్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం అమలా పాల్కి కూడా ఇదే సమస్య అని తెలిసింది. డేట్స్ కారణంగానే అమల ఈ సినిమా నుంచి బయటకు వచ్చేశారట. ఇప్పుడు అమల స్థానంలో ఎవరు నటిస్తారో తెలియాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. -
పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...
సినిమా: జలకాలాటల్లో పూలమాటుల్లో ఏమీ హాయిలే అమలా? ఏమిటి నాటి పాట గతి తప్పిందనుకుంటున్నారా? ఇక్కడ ప్రస్తావన ఆ మధురమైన పాట గురించి కాదు. హీరోయిన్ అమలాపాల్ గురించి. ఈ సంచలన నటి తరచూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. అయితే ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు అందుకుందనుకొండి. కానీ ఆ చిత్రం కెరీర్ పరంగా చాలా నష్టాన్నే కలిగించింది. అంతకుముందు అమలాపాల్‌తో చిత్రాలను కమిట్ అయిన దర్శక నిర్మాతలు వాటిని విరమించుకున్నారు. ప్రస్తుతంలో కొత్త అవకాశాలేమీలేవు. దీంతో అమలాపాల్ బాలీవుడ్లో ప్రయత్నాలు మొదలెట్టింది. అలా ఒక చిత్ర అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. తమిళంలో అదో అంద పరవై పోల అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో రూపొందుతున్నదే. ఏదొక విధంగా వార్తల్లో ఉండాలనుకుందో ఏమో నటి అమలాపాల్ తన అర్ధనగ్న ఫొజులతో కూడిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసింది. అదీ బాత్రూమ్లోని టబ్‌లో రంగురంగుల పూల మధ్య జలకాలాడుతూ తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇక నెటిజన్ల గురించి చెప్పాలా? ఆలా అమలాపాల్ అర్ధనగ్నంగా పూలస్నానమాడుతున్న ఫొటోలను చూసి అమలాపాల్ ఆడై 2కి సిద్ధం అవుతుందా అని అడుగుతున్నారు. అయితే ఈ ఫొటో దృశ్యాలపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయనుకోండి. దర్శకుడు విజయ్ మీతో వివాహ బంధాన్ని రద్దు చేయడంలో తప్పేలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఆడై చిత్రంలో పూర్తిగా నగ్నంగానే నటించావు. ఇలా ఫొటోలు విడుదల చేయడంలో విశేషం ఏముందిలే అంటున్నారు. -
అమలా పూల్
అమలా పాల్ కాస్తా అమలా పూల్ అయిందేంటని ఆలోచిస్తున్నారా? కింద ఉన్న ఫొటో చూశారు కదా. పువ్వులు నిండిన తొట్టిలో అమలా పాల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? అందుకే అమలా పూల్ అన్నాం. షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి తన బర్త్‌డేను (అక్టోబర్ 26) సెలబ్రేట్ చేసుకోవడానికి బాలీకి హాలిడేకు వెళ్లారు అమలా. అక్కడ కొన్ని రోజులు తనకు నచ్చినట్లుగా గడిపారామె. ఆ వెకేషన్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. వాటిలో పూలతో నిండిన బాత్ టబ్‌లో ‘హీలింగ్ బాత్’ చేస్తున్న ఫొటో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమలా పాల్ నటించిన ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ చిత్రం, ‘ఆడు జీవితం’ అనే మలయాళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘లస్ట్ స్టోరీస్’ యాంథాలజీలోనూ నటిస్తున్నారు అమలా పాల్. -
తోడు లేని జీవితాలు
అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ పేరుతో పఠాన్ చాన్‌బాషా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రం విడుదల కానుంది. చాన్ బాషా మాట్లాడుతూ– ‘‘మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ని తమిళంలో ‘భాస్కర్ ఒరు రాస్కెల్’గా రీమేక్ చేశారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించగా సిద్ధిక్ దర్శకత్వం వహించారు. మలయాళంలో విజయం సాధించటంతో తమిళంలో అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా సిద్ధిక్ రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా కలిశారు, ఆ ఇద్దరూ కలవటానికి ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారనేది ఈ సినిమా. నటి మీనా కూతురు నైనిక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసింది’’ అన్నారు. -
‘భాస్కర్ ఒక రాస్కల్’ మూవీ స్టిల్స్
-
రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్!
కోలీవుడ్ అమ్మడు అమలాపాల్ నటించిన తాజా చిత్రం ఆడై.. తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించకపోయినప్పటికీ.. కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఒక ప్రత్యేక చిత్రంగా ‘ఆడై’ గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ఒంటిమీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా నటించి.. పాత్రకు అమలాపాల్ న్యాయం చేకూర్చారు. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. ‘ఆడై’ సినిమాలో అమల్‌పాల్ పాత్ర కంగన పోషించనున్నారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేశాయి. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ వార్తలపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా కంగనా టీమ్ ఈ వార్తలపై స్పందించింది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కంగన ప్రస్తుతం తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో మాత్రమే నటిస్తున్నారని, ఇతర కొత్త ప్రాజెక్టులేమీ కమిట్ అవ్వలేదని, ముఖ్యంగా ‘ఆడై’ రీమేక్‌లో ఆమె నటించడం లేదని కంగన టీమ్ స్పష్టం చేసింది. నిజానికి ‘ఆడై’ హిందీ రీమేక్ మీద ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. హిందీలో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్న మహేశ్ భట్.. త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశముంది. హిందీలోనూ రత్నకుమారే దర్శకత్వం చేస్తారని అంటున్నారు. చిత్రయూనిట్ గురించి మరిన్ని వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
‘ఆమె’ రీమేక్ చేస్తారా?
అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైంది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్ సంచలనం సృష్టించారు. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో విమర్శకుల ప్రసంశలు పొందింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోందని సమాచారం. ఒరిజినల్‌ను రూపొందించిన రత్నకుమారే హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారట. హిందీ రీమేక్‌లో హీరోయిన్గా నటించేవారిలో కంగనా రనౌత్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
డిజిటల్ ఎంట్రీ
ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు నటి అమలాపాల్. ఇటీవల ‘ఆమె’ సినిమాలో అమల ఎంత బోల్డ్‌గా నటించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా అటువంటి బోల్డ్ పాత్రలోనే మరోసారి నటిస్తున్నారట ఆమె. హిందీ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగులో కూడా రూపొందనుంది. హిందీలో నిర్మించిన రోనీ స్క్రూవాలాయే తెలుగులోనూ నిర్మిస్తున్నారట. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఓ భాగంలో నటి అమలాపాల్ నటిస్తుండగా, ‘ఓ బేబి’ ఫేమ్ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని టాక్. జగపతిబాబు ఓ కీలక పాత్రధారి. ఈ ఆంథాలజీలోని మిగిలిన విభాగాలకు సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. కాగా అమలా పాల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో నటిస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
అమలా ఏమిటీ వైరాగ్యం!
అహో అమలాపాల్ ఏమీ ఈ వైరాగ్యం? ఆశలు ఆవిరయ్యాయా? లేక ఆడంబర జీవితంపై విరక్తి కలిగిందా? లేక ఇంకేమైనా కారణం ఉందా? ఇవి నెటిజన్లు ఆమె భావాలను చూసి ఆశ్చర్యపోతూ అడుగుతున్న ప్రశ్నలు. ఏమిటీ అమలాపాల్ ఏ మంటోంది అనేగా మీ ఉత్సుకత. దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని అందుకున్న నటి అమలాపాల్. ఈ మలయాళీ బ్యూటీ నటిగా పరిచయమై ఎంత వేగంగా ఎదిగిందో, అంతే అంత కంటే వేగంగా ప్రేమలో పడిపోయింది. దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ చిత్రాల దర్శకుడు విజయ్‌తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లి జస్ట్ రెండేళ్లు మాత్రమే సాఫీగా సాగింది. మనస్పర్థలతో విడిపోయి, విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సక్సెస్‌లను అందుకోవడంతో పాటు, వివాదాస్పద కథా చిత్రాల్లోనూ నటిస్తూ సంచలన నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. దీంతో దర్శకులిప్పడు క«థలను పట్టుకుని ఆమెచుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు చాలా నిరాడంబరగా జీవించడాన్ని కోరుకుంటోంది. ఆ మధ్య హిమాలయాలకు వెళ్లొచ్చింది. ఇటీవల తరచూ పాండిచ్చేరిలో గడపడానికి ఇష్టపడుతోంది. అంతే కాదు పాండిచ్చేరిలోని అరవిందర్ ఆశ్రమంలో తనకు ఎంతో మనశ్శాంతి లభిస్తోందని, ఇక్కడ తనకోసం కొత్త జీవితం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని పేర్కొంటోంది. ఇప్పుడు తనకు ఆడంబర జీవితాన్ని అనుభవించడం నచ్చడంలేదని అంటోంది. సహజమైన ప్రకృతి మధ్య జీవించాలనిపిస్తోందని చెప్పింది. అన్నట్టు ఆ మధ్య విదేశాల నుంచి కొనుగోలు చేసి వివాదాల పాలైన ఖరీదైన కారును కూడా అమలాపాల్ ఇటీవల విక్రయించేసింది. ఈ మధ్యనే హిమాలయ ప్రాంతాలను చుట్టేసి వచ్చిన అమలాపాల్ ప్రకృతిలోని సహజమైన అందాలను ఆస్వాదిస్తూ జీవించడం ఇష్టంగా ఉందని అంది. చిన్న పాటి సంచిలో కొంచెం బట్టలు తీసుకుని ఒక బృందంగా కలిసి అడవుల్లో వంటావార్పులు చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతోందట. దీంతో ఈ వయసులోనే ఈ భామకు ఇంత వైరాగ్యం ఏమీటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
జెర్సీ రీమేక్‌లో అమలాపాల్!
‘‘కథాబలం ఉన్న కథలు, బలమైన పాత్రలు రావడంలేదు. అందుకే సినిమాలు వదిలేద్దామనుకున్నా’’ అని ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పారు. అయితే కథాబలం ఉన్న స్క్రిప్ట్ కావడంతో ‘ఆమె’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమలా పాల్కి మరో బలమైన పాత్ర చిక్కింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో అమలా పాల్‌ను కథానాయికగా అడిగారట. తెలుగు సినిమా చూసినవారికి కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అమలా పాల్ ఒప్పుకున్నారట. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ రీమేక్‌ని హీరో రానా నిర్మించనున్నారు. నాని పాత్రలో విష్ణు విశాల్ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రీమేక్‌ని ‘దిల్’ రాజు, నాగవంశీ నిర్మించనున్నారు. ఇంకా తారాగణం ఎంపిక కాలేదు. -
ఫోరెన్సిక్ పరీక్షల నేపథ్యంలో...
అమలా పాల్ హీరోయిన్గా, అరుణ్ ఆదిత్ హీరోగా అనూప్ పనికర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. ఫణీ ంద్ర కుమార్, ప్రభు వెంకటాచలం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘రాక్షసుడు’ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఫోరెన్సిక్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏంటో ఈ సినిమాలో చూపించనున్నారు’’ అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నా. తమిళంలో అజయ్ పనికర్‌తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో ‘కడావర్’ అనే టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘నా గత సినిమా విడుదలైన తర్వాత ‘ఇమ్రాన్ హష్మి అవుదామనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు.. అలాంటిదేమీ లేదు’’ అన్నారు అరుణ్ ఆదిత్. ‘‘చెన్నైలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అభిలాష్ ఈ కథ రాశారు’’ అన్నారు అనూప్ పనికర్. నటుడు వినోద్ సాగర్, కెమెరామేన్ అరవింద్ సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోనీ. -
జెర్సీ రీమేక్‌లో ఓకేనా?
సినిమా: నటి అమలాపాల్‌కు మరో కొత్త అవకాశం ఎదురు చూస్తోందన్నది తాజా సమాచారం. ఆడై చిత్రంతో హీరోయిన్ ఓరియేంటేడ్ చిత్రాల నటిగా మారింది ఈ మలయాళ బ్యూటీ. ఆడై చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలు, వివాదాలతో బోలెడు ప్రచారం పొందేసిన ఈ అమ్మడు ఈ చిత్ర విడుదలకు ఆర్థికంగా ఆదుకుని మంచి ఇమేజ్ను కొట్టేసింది. ఇక ఆడై చిత్రం విడుదలయ్యి మంచి టాక్‌నే తెచ్చుకుంది. మొత్తం మీద హీరోయిన్ ఓరియేంటేడ్ చిత్రాల నాయకిగా ముద్ర వేసుకునేసింది. ప్రస్తుతం మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రం ‘అదో అంద పరవై పోల’ చిత్రంలో నటిస్తోంది. కడవర్ అనే మరో మలయాళ చిత్రం చేతిలో ఉంది. కాగా తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిసింది. తెలుగులో మంచి విజయాన్ని సాధించిన చిత్రం జెర్సీ. నిరాశలో ఉన్న నటుడు నానీలో ఉత్సాహాన్ని నింపిన చిత్రం అది. ఇప్పుడా చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. ఇందులో నానీ నటించిన పాత్రలో నటుడు విష్ణు విశాల్ నటించనున్నారు. ఇక హీరోయిన్గా సంచలన నటి అమలాపాల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఒరునాళ్ కూత్తు, మాన్స్టర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగు చిత్రం జెర్సీలో నటి శ్రద్ధాశ్రీనాథ్ పోషించిన పాత్రను తమిళంలో నటి అమలాపాల్ చేసే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే విష్ణువిశాల్, అమలాపాల్‌లది హిట్ ఫెయిర్. ఇంతకు ముందు ఈ జంట నటించిన రాక్షసన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. -
జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది
సినిమా: జాతి, మత జాడ్యాలతో భయంగా ఉందని నటి అమలాపాల్ పేర్కొంది. ఈమె దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయాన్నైనా నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడే అరుదైన నటి ఈ జాణ. ఒక నటిగా అమలాపాల్ ఎదుర్కోని సవాల్ లేదనే చెప్పాలి. అన్నింటిని ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. నటిగానే కాదు వ్యక్తిగతం జీవితంలోనూ తనకు నచ్చిన బాటలో పయనిస్తోంది. అందుకు ఎవరెన్ని విధాలుగా విమర్శస్తున్నా, డోంట్‌కేర్ అంటోంది. ఇక వృత్తిపరంగా తనకు నచ్చింది చేసే నటి అమలాపాల్. దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లాడి, ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న నటి అమలాపాల్. అయితే వివాహాం, విడాకులనంతరం హీరోయిన్గా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరని చెప్పవచ్చు. ] గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ ఆ దిశగా సాగుతోంది. అలా నటించిన తొలి చిత్రం ఆడై ఆమెకు సంతృప్తినిచ్చింది. ఆడై చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలను ఎదుర్కొన్న ఈమె చిత్ర విడుదల తరువాత తన నటనకు ప్రశంసలను అందుకుంటోంది. ఈ సందర్భంగా పలు విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టపరిచింది. శ్వాస ఉన్నంత వరకూ సినిమాని ప్రేమిస్తాను. నాకేమైనా చిత్రం నుంచి ఆడై వరకూ ప్రేక్షకులు ఆమోఘ ఆదరణను అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పుడమి, భాష, ప్రజల నుంచే నేను ఎంతో నేర్చుకున్నాను. జాతి, మతం అనే భేదాభిప్రాయాలు సమసిపోవాలి. ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించడానికి అందరం పాటు పడాలి. సమీపకాలంలో పలు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. మతం, జాతి పరంగా భయం కలగుతోంది. వాటిని త్యజించాలి. మనిషిని మనిషిగా చూడాలి. ఈ భావన సమాజంలో కలగాలి. అని పేర్కొంది. ప్రస్తుతం అదో అంద పరవై పోల చిత్రంలో నటిస్తోంది. త్వరలో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. -
తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా
‘‘ఆమె’ సినిమాకి మంచి పేరు వచ్చింది.. కానీ, కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు. కలెక్షన్లు రాకపోవడంతో అన్యాయం జరిగిందని చెప్పడం లేదు’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అమలాపాల్ లీడ్ రోల్లో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రాంబాబు కల్లూరి, విజయ్ మోరవనేని ‘ఆమె’ పేరుతో ఈ నెల 20న తెలుగులో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతలకు నెల కిందటే ‘ఆమె’ కోసం డబ్బులు చెల్లించాం. తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చారు. అయితే ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బు కట్టలేదు. చివరకు అమలాపాల్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడంతో పాటు ఎదురు డబ్బులు ఇచ్చి విడుదల చేయించింది. ముందుగా అనుకున్నట్లు 19న విడుదలైతే బాగుండేదేమో? ఒక రోజు ఆలస్యంగా విడుదల కావడం వల్ల క్రేజ్ తగ్గిపోయి మా చిత్రం చచ్చిపోయింది. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ అవుతున్న సినిమా చంపేయబడింది. సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నారు. నాకు దొరికినా తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా. దీనిపై తెలుగు ఫిల్మ్ చాంబర్లో కేసు పెట్టా. ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పద్ధతిగా విడుదల చేయడం కూడా అంతే ముఖ్యమనే పాఠాన్ని ‘ఆమె’తో నేర్చుకున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... నేటితరం ఆవేశంలో, మద్యం మత్తులో విసిరే సవాళ్లు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని అసభ్యత లేకుండా తీశాడు దర్శకుడు. అమలాపాల్ బాగా నటించింది. ‘మల్లేశం, ఆమె’ లాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు. -
నటి అమలాపాల్‌పై ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: వివాదాలకు చిరునామాగా మారిన నటి అమలాపాల్. ఫిర్యాదులు, కేసు నమోదులు, ఆరోపణలు, విచారణలు ఈ అమ్మడికి కొత్త కాదు. తాజాగా అమలాపాల్ నటించిన ఆడై. ఈ చిత్రం ఇప్పుడు వివాదాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిత్రంలో నగ్నంగా నటించిన దృశ్యాలు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఇప్పటికే వివాదంగా మారాయి. అయితే తాను నగ్నంగా నటించడాన్ని నటి అమలాపాల్ సమర్థించుకుంటోంది. ఆడై చిత్ర కథకు అలాంటి సన్నివేశం అవసరం అయ్యిందని, అయితే అవి అసభ్యంగా ఉండవని చెప్పుకుంటోంది. కానీ నగ్నంగా నటించేసి అసభ్యంగా ఉండవనడాన్ని కొందరు హర్షించడం లేదు. కాగా అమలాపాల్ నటించిన ఆడై చిత్రంలోని నగ్న దృశ్యాలు, ఆ చిత్ర పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆడై చిత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆడై చిత్రం రేపు శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందింది. దీంతో విడుదలకు డోకా లేకపోయినా, ఆ తరువాత ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందో చూడాలి. -
ఆయన మూడో కన్ను తెరిపించాడు!
సినిమా: ఆయన తన మూడో కన్ను తెరిపించాడు అంటోంది నటి అమలాపాల్. ఈ అమ్మడు ఏం చెప్పినా ఆసక్తిగా మారిందిప్పుడు. దర్శకుడు విజయ్ను 2014లో ప్రేమ వివాహం చేసుకుని, మూడేళ్లు తిరగకుండానే విడాకులు తీసుకుంది. ఆ తరువాత నటనపై దృష్టి సారించిన అమలాపాల్ తన చిత్రాలతో తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. కాగా ఇటీవల తన మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మరోసారి వార్తల్లోకెక్కింది. కాగా ఇప్పుడు తనకూ మరో ప్రేమికుడున్నాడన్న విషయాన్ని బయట పెట్టి చర్చల్లో నానుతోంది. ఇటీవల తన కొత్త ప్రేమికుడితో పాండిచ్చేరిలో ఎంజాయ్ చేస్తోందట. దీని గురించి జరుగుతున్న ప్రచారంతో మండిపడుతున్న ఈ అమ్మడు తాను ఎవరితో కలిసుంటే మీకెందుకూ అని ప్రశ్నిస్తోంది. అవును తానిప్పుడు ప్రేమ బంధంలో ఉన్నానని, ఆడై చిత్ర కథ విన్న సమయంలోనే అతనితో తన ప్రేమ గురించి చెప్పానని తెలిపింది. తాను మారడానికి తనే కారణం అని చెప్పింది. కన్నతల్లి మాత్రమే హద్దులు లేని ప్రేమను కరిపించగలదని అంది. అయితే అవన్నీ తానూ చేయగలనని అతను నిరూపించాడని చెప్పింది. తన కోసం అతని పని కూడా పక్కన పెట్టాడని, సినిమాపై తనకున్న ఆసక్తిని తను బాగా అర్థం చేసుకున్నాడని పేర్కొంది. తన చిత్రాలను చూసి చాలా భయంకరమైన నటినని అంటుంటాడని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తన మూడో కంటిని తెరిపించింది అతనేనని అంది. నటీమణులది రక్షణ లేని పరిస్థితి కావడంతో తమను అభినందించేవారినే పక్కన ఉంచుకుంటుంటారంది. అయితే తన చుట్టూ ఉన్నవారు నిజాలు చెప్పే పరిస్థితి లేదని అంది. అలాంటి అతను తన జీవితంలోకి ప్రవేశించి తనలోని తప్పుల గురించి తెలియజేశాడని చెప్పింది. ఇప్పుడు తన జీవితంలో నిజం అంటే అతనేనని చెప్పుకొచ్చిన అమలాపాల్ అతనెవరన్నది మాత్రం బయటపెట్టలేదు. -
కొత్తదనం లేకపోతే సినిమా చేయను
‘‘తెలుగు ఇండస్ట్రీ నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడ 5 సినిమాలు చేశా. ‘జెండాపై కపిరాజు’ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ, కథ ఎగై్జట్‌మెంట్‌గా అనిపించకపోవడం, పాత్ర కొత్తగా లేకపోవడంతో అంగీకరించలేదు’’ అన్నారు అమలాపాల్. రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది. మన దర్శక–నిర్మాతలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారని సంతోషపడ్డా. ఈ చిత్రంలో నగ్న సన్నివేశాలు కథానుగుణంగానే ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు మహిళా ప్రేక్షకులు అసౌకర్యంగా భావించరు. ప్రేక్షకులు మూస కథలు కాకుండా కొత్తదనం ఉన్నవి కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా పాత్రల్ని ఎంపిక చేసుకోవాలి. తెలుగులో ‘మహానటి, జెర్సీ, ఓ బేబీ’ వంటి మంచి సినిమాలొచ్చాయి. నాకిష్టమైన డైరెక్టర్ రాజమౌళిగారు. నాగ్ అశ్విన్ కూడా బ్రిలియంట్ డైరెక్టర్. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.. వాటిలో ఒకటి తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోంది. దానికి నేనే నిర్మాత. ఓ మలయాళ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
అమలాపాల్ ‘నగ్నసత్యాలు’
నగ్నంగా కనిపించింది..సంచలనానికి దారి తీసింది. వివాదానికి తెర లేపింది. స్క్రీన్ మీద మగవాడు కత్తి దూస్తాడు.. తుపాకీ పేల్చుతాడు. మొరాలిటీ వదులుతాడు..కానీ స్క్రీన్ కోసం స్త్రీ వస్త్రం విప్పితే ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. ‘ఆమె’లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపించబోతోంది. బోలెడన్ని ‘నగ్నసత్యాలు’ ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) టీజర్లో నగ్నంగా కనిపించి, సంచలనం సృష్టించారు. ఇలాంటి పాత్ర అంగీకరించడానికి కారణం ఏదైనా? ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్స్ అన్నీ సహజత్వానికి దూరంగా అబద్ధాలతో నిండినవే. లేదా అన్నీ రెగ్యులర్ మసాలా సినిమాలే వస్తున్నాయి. విసిగిపోయాను. కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి, లేకపోతే మానేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. సాధారణంగా మా మేనేజర్ రోజుకు రెండు స్క్రిప్ట్స్ నాకు పంపుతుండేవారు. అవన్నీ మహిళా సాధికారత కథలు లేదా త్యాగాలు చేసే భార్య పాత్రలు, రేప్ విక్టిమ్ కథలు. ఇలాంటి ఎన్నని చూస్తాం? నిజం చెప్పడమే ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యుండాలి. అలాంటి ఓ స్క్రిప్ట్ కావాలని నేను బలంగా కోరుకోవడం వల్లనో ఏమో ‘ఆమె’ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్ ఒక్క పేజీ చదివి ‘వావ్’ అనుకున్నాను. కొత్త ఎనర్జీ వచ్చింది. వెంటనే మేనేజర్‌తో ఇది ఇంగ్లీష్ సినిమానా? అని అడిగాను, కాదన్నారు. పోనీ హిందీ సినిమానా? కాదు, తమిళ సినిమానే అని చెప్పారు. డైరెక్టర్ ఎవరు? అనడిగితే రత్నకుమార్ అన్నారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. వెంటనే తనను ఇక్కడికి రమ్మనండి అని చెప్పాను. స్క్రిప్ట్ చాలా మోడ్రన్‌గా, ఫ్రెష్‌గా, ఒరిజినల్‌గా అనిపించింది. ఫుల్ గెడ్డంతో రత్నకుమార్ ఢిల్లీ వచ్చారు. ఫస్ట్‌సారి చూడగానే ఈ కథ ఇతనే రాశాడా? అనిపించింది. ఏదో ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ చేశారేమో? రీమేక్ సినిమానేమో అనుకున్నాను. అతన్ని అడిగితే ‘ఒరిజినల్ ఐడియా’ అని చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘ఈ సినిమా నేను చేస్తే మాత్రం యాక్టర్‌గా చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నట్టే’ అని రత్నతో అన్నాను. అయితే చేయాలా వద్దా? అనే సందిగ్ధంలో పడ్డాను. ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? అని చాలా ఆలోచనలు. ఫైనల్లీ ఫలితం గురించి అస్సలు ఆలోచించలేదు. సినిమా చేసేవాళ్లకు, చూసేవాళ్లకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ఒంటికి కేవలం టిష్యూ పేపర్లు చుట్టుకుని కనిపించడం కొంచెం వివాదం అయింది కదా? సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను. ఫస్ట్ లుక్ చూసే ఉంటారు. ఒంటికి టిష్యూ పేపర్లు చుట్టుకొని ఏడుస్తూ ఉంటాను. ఐరన్ రాడ్ పట్టుకొని సీరియస్‌గా ఉండే లుక్‌ని ముందు రిలీజ్ చేద్దామనుకున్నాం. అయితే స్త్రీ ఎప్పుడూ బా«ధితురాలిగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకే ఏడుస్తున్న ఫొటోను రిలీజ్ చేశాం. ఆ స్టిల్ కొంచెం కాంట్రవర్శీ అయినా బాగా రిజిస్టర్ అయిం ది. అలాగే టీజర్లో నేల మీద‡బట్టలు లేకుండా స్పృహ లేకుండా ఉంటాను. సడన్‌గా తేరుకుంటాను. ఇది చూసి, అత్యాచారానికి గురైన అమ్మాయి కథ అని కొందరు సినిమా కథ అల్లేశారు. ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది. స్టోరీ లైన్ ఎవ్వరూ ఊహించలేదు. రివెంజ్ డ్రామానా? అసలేంటి సినిమా కథ అనుకుంటున్నారు. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? ఇందులో నేను బ్యాడ్ గాళ్ అని చెప్పను. ప్రస్తుతం సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారో అలానే నా పాత్ర ఉంటుంది. ఇండిపెండెంట్ గాళ్‌ని. మన రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోయిన్ లాంటి అమ్మాయి అయితే కాదు. జనరల్‌గా హీరోయిన్ అంటే మంచి పనులే చేస్తుంది, మంచి మాటలే మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయే నాకు కావాలని అబ్బాయిలందరూ అనుకునేలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామిని (అమలాపాల్ పాత్ర పేరు) ఆ టైప్ కాదు. డామినేట్ చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది. ప్రపంచానికి ఎదురు వెళ్లయినా సరే అనుకున్నది సాధిస్తుంది. తనకో డార్క్ సైడ్ కూడా ఉంటుంది. మోరల్‌గా కరెక్ట్‌గా ఉంటుందని కూడా చెప్పను. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయి కదా. అందుకే ఇది రియలిస్టిక్ క్యారెక్టర్ అని నా అభిప్రాయం. ఇందాక అన్నాను కదా.. ఆర్ట్ ముఖ్యోద్దేశం నిజానికి దగ్గరగా ఉండటం అని. కామిని పాత్ర అలాంటిదే. కానీ ‘మంచి’ హీరోయిన్ల పాత్రలనే చూడ్డానికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ‘డార్క్ సైడ్’ అంగీకరిస్తారంటారా? ఇలాంటి మూస పద్ధతులను ఎవరో ఒకరు బ్రేక్ చేయాల్సిందే. ఈ ప్రాసెస్‌లో కాంట్రవర్శీలు కూడా ఎదురవుతాయి. వాటికి నేను సిద్ధంగానే ఉన్నాను. బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ తనకు నచ్చిన సినిమాలే చేస్తారు. ఎవరేమన్నా పట్టించుకోరు. మన ఇండస్ట్రీలు కూడా నిజమైన కథలు చెప్పాలి. హీరోయిన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కథలేనా? ఇంకెన్నాళ్ళు స్క్రీన్ మీద అబద్ధాలే చూపిస్తాం. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌లో రకరకాల కంటెంట్ వస్తోంది. సినిమాలు చూసి పాడైపోతున్నారనుకోవడం కరెక్ట్ కాదు. మనమెంత నిజం చెబితే అది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. స్క్రీన్ మీద పర్ఫెక్ట్ అమ్మాయి పాత్రను చూసి అలాంటి అమ్మాయి కోసమే అబ్బాయిలు ఎదురు చూస్తుంటారు. నేను పర్ఫెక్ట్గా లేను అనుకునే అమ్మాయిలు కూడా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అలానే అంగీకరిద్దాం. అందరికీ ఏదో ఓ అసంపూర్ణత ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కామిని పాత్రకు, అమలాపాల్‌కు పోలికలు ఉన్నాయా? ఒకప్పటి అమలాపాల్‌కి, ఈ కామినీకి చాలా దగ్గర పోలికలున్నాయి. టీనేజ్‌లో ఉండే చాలా మంది అమ్మాయిలు కామినీలానే ఉంటారు, ఆలోచిస్తారు. స్వార్థం, అభద్రతాభావం, హైపర్‌గా ఉండటం, డబ్బు సంపాదించాలనుకోవడం.. ఇలా వాళ్ల ఆలోచనలు చాలా వాటి మీద ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకటే. ఎక్కువ తక్కువలు లేవు అనుకునే మనస్తత్వం కామినిది. తనలానే నేను రెబల్ పర్సన్‌ని. అయితే ఒకప్పుడు. జీవితంలో జరి గిన సంఘటనలు, యోగా ఇవన్నీ నన్ను ప్రశాంతమైన వ్యక్తిని చేసేశాయి. ఈ పాత్ర చేస్తుంటే నా టీనేజ్ రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నట్టుంది. ఈ సినిమా కోసం జిమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. హైపర్‌గా ఉండాల్సి వచ్చింది. ఫిజికల్‌గా స్ట్రెయిన్ చేసిన పాత్రæ ఇది. ఎప్పుడో వదిలేసిన నాలో కొంత భాగాన్ని వెనక్కి వెళ్లి చూసుకొని వచ్చినట్టుంది. ‘మసాలా’ సినిమాలు చేయడం ఇష్టం లేదన్నారు. మరి ‘ఆమె’లో న్యూడ్‌గా కనిపించడం మసాలా కింద రాదా? ప్లీజ్.. దీన్ని గ్లామర్ సినిమా, మసాలా సినిమా అనొద్దు. రత్నలాంటి ధైర్యం ఉన్న డైరెక్టర్‌తో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదే అతని ఫస్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ సినిమానే ఇలాంటి స్క్రిప్ట్ చేస్తే తన మీద ట్యాగ్ వేస్తారని ‘మేయాద మాన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేశారు. మంచి హిట్ అయింది. చాలామంది హీరోలు తనతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేశాడు. అది నిజమైన ప్యాషన్. న్యూడ్ సీన్స్‌ని డూప్‌తో తీయాలనుకోలేదా? లేదు. మిగతా సీన్స్ మేమే చేస్తాం కదా. దీనికి మాత్రం డూప్ ఎందుకు? ఈ సీన్స్ షూట్ అప్పుడు 15 మంది టీమ్ మాత్రమే లొకేషన్లో ఉన్నారు. వాళ్ల చూపులు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ల కళ్లలో నా పట్ల జాలి ఉన్నా నేను సరిగ్గా చేయలేకపోయేదాన్నేమో? ఆర్ట్ మీద వాళ్లకున్న రెస్పెక్ట్ అది. సినిమా చూస్తే కావాలని అతికించిన సీన్స్‌లా ఉండవు. స్క్రిప్టే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. దీనివల్ల మీ ఇమేజ్‌కు ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని అనుకుంటున్నారా? ఇమేజ్ నా చేతుల్లో ఉండదు. అయితే యాక్టర్‌గా నన్ను అభినందిస్తారనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్‌ని ఈజీగా 50 సార్లు చదివి ఉంటాను. ఆ న్యూడ్ సీన్స్ ఎందుకు పెట్టాం అనేదానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక సినిమా ఫలితం గురించి ఆలోచించిన క్షణం నుంచి ఇన్సెక్యూర్ అయిపోతాం. నేను కొన్ని సినిమాలను చూడటానికి ఇష్టపడతాను. ఆ సినిమాలను నేను చేయగలిగితే ఆర్ట్‌కి న్యాయం చేసినట్టు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయినా మనం కొత్తగా ట్రై చేశాం అనే సంతృప్తి ఉంటుంది. ఈ మధ్య మీ దగ్గరకు వచ్చిన చాలా స్క్రిప్స్ నచ్చలేదన్నారు. ఇప్పుడు యాక్టర్‌గా మెచ్యూరిటీ రావడం వల్లనేనా? అవును. నేను చేసే సినిమాలు ఆ సమయానికి నా మానసిక స్థితి ఎలా ఉందో చెప్పడానికి ఉదాహరణలు. కెరీర్ స్టార్టింగ్‌లో ఇన్సెక్యూరిటీతో, ఫైనాన్షియల్‌గా సర్వైవ్ అవ్వడం కోసమో సినిమాలు చేశాను. ప్రస్తుతం చాలా స్టేబుల్‌గా ఉన్నాను. అందుకే కొత్త సినిమాలు చేయగలుగుతున్నాను. నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. యంగ్ ఏజ్‌లోనే హీరోయిన్గా వచ్చి, సక్సెస్ అయ్యారు. వ్యక్తిగతంగా 23 ఏళ్లకే పెళ్లి. ఆ తర్వాత బ్రేకప్... మరి జీవితం మీకేం నేర్పించింది? ఐ లవ్ హార్ట్‌బ్రేక్. నాకు బాధ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జీవితాన్ని చాలా లోతుగా చూడటానికి ట్రాజెడీలే ఉపయోగపడతాయి. మనలోకి మనం డీప్‌గా వెళ్లగలం. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. 25 ఏళ్లకు సెపరేట్ అయిపోయాం. ఈ జర్నీలో చాలా ఒత్తిడి, బాధలు చూశాను. ఇప్పుడు నేనింత ధైర్యంగా ఉండటానికి అవన్నీ కారణం. జగమే మాయ అంటారు కదా. ఇండస్ట్రీ కూడా ఓ మాయే. ఒక ఆర్టిస్ట్‌కి స్పిర్చువాలిటీ చాలా ముఖ్యం అని నమ్ముతాను. అది లేకపోతే ఈ ఫేమ్, కంఫర్ట్ అన్నీ తలకి ఎక్కేస్తాయి. అప్పుడు మనిషిగా స్థిరంగా ఉండలేం. ఏదో ఓ దానికి అడిక్ట్ అయిపోవడం చూస్తుంటాం. నా ప్రాబ్లమ్స్, నా ట్రాజెడీల వల్ల నేనో కొత్త మనిషిని అయ్యాను. స్పిర్చువాలిటీ మంచి దారి అనుకుని, అటువైపుగా వెళ్లాను. ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాను. బాహ్య ప్రపంచంలో జరిగే హంగూ ఆర్భాటాలను కూడా మామూలుగా చూసేంత స్థిరత్వం వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్‌లా ఉంటున్నారనుకోవచ్చా? యస్. ప్రస్తుతం నన్ను నేను జడ్జ్ చేసుకోగలుగుతున్నాను. ఇతరులను కూడా జడ్జ్ చేయగలుగుతున్నాను. ఇదో క్రేజీ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆర్ట్ ద్వారా మనల్ని మనం ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తాం. కానీ మెల్లిగా చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని మార్చేస్తారు. స్టార్ మెటీరియల్‌లో చిక్కుకుపోతాం. వాటిని దాటడానికి నాకు యోగా ఉపయోగపడుతోంది. నేను పాండిచెరీలో ఉంటాను. నా వర్క్ అయిపోయిన తర్వాత పూర్తిగా కట్ అయిపోతా. నా పెట్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా బైక్ మీద ఫ్రీగా తిరుగుతాను. అదో డిఫరెంట్ లైఫ్. ఫ్రెండ్స్, పెట్స్ అన్నీ ఓకే. లైఫ్ పార్టనర్ లేరు అనే వెలితి ఉండటం సహజం కదా? అవన్నీ మనం నిర్ణయించలేం. మనం ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో మన చేతుల్లో ఉండదు. అవన్నీ దేవుడి ప్లాన్స్ అని నమ్ముతాను. నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు. అయ్యాను. మా ఫ్యామిలీకి ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఇదంతా దేవుడు ఇచ్చాడనుకుంటాను. వీటన్నింటినీ మనం స్వీకరించాలి. ఆనందించాలి. లైఫ్ పార్టనర్ కంటే కూడా మనతో మనం కనెక్ట్ అయ్యుండాలి. అప్పుడే లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు. మనల్ని ఎవరో ప్రేమించాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు నా లైఫ్‌లోనూ ఓ వ్యక్తి ఉన్నారు. లవ్‌లో ఉన్నాను. మీ మనసులో ఉన్న ఆ వ్యక్తి సినిమా ఫీల్డ్కి సంబంధించినవారేనా? కాదు. బయటి వ్యక్తే. ఇప్పటికి ఇంతే చెప్పగలుగుతాను. దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్నాక చాన్సులు తగ్గాయా? కెరీర్లో మార్పు ఏదైనా వచ్చిందా? లేదు. అయితే నా కెరీర్‌ని ఎఫెక్ట్ చేస్తుందేమో? అనే ఆలోచన ఉండేది. పెళ్లి తర్వాత కెరీర్ అయిపోతుంది. సెపరేట్ అయిన తర్వాత ఆంటీ పాత్రలే, సీరియల్సే అని చుట్టూ ఉన్నవాళ్లు భయపెడతారు. మనలో టాలెంట్ ఉన్నంత వరకూ, మనం ప్రొఫెషనల్‌గా ఉన్నంత వరకూ మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. విడిపోయాక చాలా సీరియస్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాను. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాను. ఆ ఫైరే ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ తెచ్చిపెట్టింది. విజయ్ పెళ్లి చేసుకున్నారు.. ఏం చెబుతారు? విజయ్ చాలా స్వీట్ పర్సన్. అమేజింగ్ సోల్. అతని లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకు ఎక్కువమంది పిల్లలు పుట్టాలి. హ్యాపీగా ఉండాలి. ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాల్లో ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ సినిమా ఒకటి. ఈ షూటింగ్లో గాయపడ్డారు. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? గాయాలు లేనీ హీరో లేరు కదా (నవ్వుతూ). యాక్షన్ అనేది కేవలం హీరోలకే అనేది ఉంది. సినిమా డబ్బంతా హీరో మీద ఉంటుంది కాబట్టి యాక్షన్ చేయాలనుకుంటారు. నేను ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేశాను. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు టీమ్ అంతా ఫుల్ రెస్పెక్ట్‌తో చూస్తుంది. స్టంట్స్ కేవలం హీరోలకే కాదు అనే దాన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు చాలా సంతృప్తి లభిస్తోంది. జనరల్‌గా అమ్మాయి ఫైట్ చేస్తే మగాడిలా చేశావంటారు. ఆ పోలిక ఎందుకు? మా ట్రైనర్ కూడా స్టంట్స్ సమయంలో అబ్బాయిలా ఫీల్ అవ్వు అని మోటివేట్ చేస్తుంటారు. ‘నేను అబ్బాయిలా ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను స్త్రీలానే ఉంటాను. మగాళ్లలా నాకు మజిల్ పవర్ ఉండకపోవచ్చు. అయితే ఇన్నర్ పవర్ తెచ్చుకుంటాను’ అని చెప్పాను. ఈ పోలికను మెల్లిగా పోగొట్టాలి. మంచి కథలు రాకపోవడంవల్ల సినిమాలు మానేద్దాం అనుకున్నా అన్నారు. ఏం చేద్దామనుకున్నారు? తెలియదు. బట్ ఏం చేసినా బోరింగ్ పని మాత్రం చేయను. మీ కెరీర్‌ని చూసి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ‘ఆమె’ కథ చెప్పగానే ఎలా షూట్ చేయబోతున్నారు? అని అడిగారు. నా పేరెంట్స్ నా చాయిస్‌ని ఎప్పుడూ గౌరవించారు. ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ పిల్లల్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదు. ప్రతీదాంట్లో వాళ్లే ఉంటున్నారు. పిల్లల లైఫ్‌ని కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు వాళ్లే పాడు చేస్తున్నారు. పిల్లల్ని ఎదగనివ్వాలి. ఎప్పుడూ తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్లలాగా పెంచకూడదు. మా అమ్మానాన్న నన్ను ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండనిచ్చారు. మా నాన్నగారు ‘ఆమె’ టీజర్ చూశారు. వాళ్లు హిపోక్రైట్స్ కాదు. మామూలు సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వాళ్ల అమ్మాయి ఇలాంటి సినిమా చేయకూడదు అనుకోరు. నేను చేసే సినిమాల విషయంలో అమ్మానాన్న హ్యాపీ. విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్గా మిమ్మల్ని తప్పించారు. అసలు కారణం ఏంటి? నేనేదో ప్రొడక్షన్ ఫ్రెండ్లీ కాదని, రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేశానని ఆ యూనిట్ ప్రచారం చేస్తోంది. కానీ అది నిజం కాదు. అందుకే పెద్ద పోస్ట్ పెట్టాను. వాళ్లు సినిమా నుంచి తప్పించినా ఏం మాట్లాడలేకపోతున్నావు అని ఎవరైనా అంటారేమో అని భయం. పిరికిదానివి అంటారని భయం. అందుకే సోషల్ మీడియా ద్వారా నా ఫీలింగ్‌ని షేర్ చేసుకున్నాను. ‘కడవేర్’ అనే తమిళ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణం అంటే టఫ్ కదా? నిర్మాణం అంటే ఓన్లీ డబ్బు పెట్టడం మాత్రమే కాదు. చాలా మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. యాక్టర్స్‌ని పిలవాల్సి ఉంటుంది. బేరాలు ఆడాల్సి ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్యాకప్ అయిన వెంటనే వెళ్లిపోవచ్చు. కానీ నిర్మాతగా చాలా పనులు ఉంటాయి. 16 గంటలు పని చేస్తున్నాను. ఓ టీమ్ లీడర్ అందర్నీ మోటివేట్ చేయాలి. క్రియేటివ్ పీపుల్స్‌ని ఒకలా, మేనేజర్స్‌ని ఒకలా డీల్ చేయాలి. ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగులో ‘భద్ర’ పేరుతో విడుదలవుతుంది. కథలు రాయాలనుకుంటున్నారా? లేదు. చిన్న చిన్న ఐడియాలు చెబుతుంటాను. కానీ ఎప్పుడూ స్క్రిప్ట్ రాయలేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్‌లో చిన్నచిన్న కవితలు రాస్తుంటాను. జర్నల్స్ రాస్తుంటాను. హిమాలయాలకు ట్రెకింగ్ వెళ్లినప్పుడు రాస్తుంటా. ట్రెకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం. అందరూ ఓసారి తప్పకుండా హిమాలయాలను చూడాలన్నది నా అభిప్రాయం. సిటీలో ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితాన్ని లీడ్ చేస్తుంటాం. హిమాలయాల్లో పరిగెత్తం. కేవలం నడుస్తాం. చాలా కామ్‌గా ఉంటాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం. ఫోన్‌కి దూరంగా ఉంటాం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమో అలానే మారిపోతాం. బాల్యంలో ఉన్నట్లుగానే ఫీలవుతాం. ఫైనల్లీ.. లవ్‌లో ఉన్నాను అన్నారు. ఆ ప్రేమను పెళ్లితో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నాం. దాన్ని అలానే ఉండనిస్తాం. దేని గురించీ ఎక్కువ ఆలోచించడం లేదు. అయితే జీవితం చాలా హాయిగా ఉంది. – డి.జి. భవాని చదవండి: ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్ ఆసక్తికరంగా ‘ఆమె’ -
హీరోయిన్ మాజీ భర్తకు రెండో పెళ్లి..
చెన్నై,పెరంబూరు: నటి అమలాపాల్ మాజీ భర్త, సినీ దర్శకుడు ఏఎల్.విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. కిరీటం, మదరాసు పట్టణం, తలైవా, దైవ తిరుమగళ్, దేవీ 1, 2 వంటి పలు చిత్రాల దర్శకుడు ఏఎల్.విజయ్. ఈయనకు దైవ తిరుమగళ్ చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో ఒక హీరోయిన్గా నటించిన అమలాపాల్‌తో పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నా రు. అయితే మూడేళ్లు తిరగకుండానే విజ య్, అమలాపాల్ మధ్య మనస్పర్థలు తలెత్తడం, విడిపోవడం జరిగిపోయింది. 2017 లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు పొం దారు. ఆ తరువాత దర్శకుడిగా విజయ్, నటిగా అమలాపాల్ ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్ ఇటీవల చెన్నైకి చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే విజయ్, ఐశ్వర్యను శుక్రవారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువర్గాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా విజయ్‌కి ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండో వివాహం మీ జీవితంలో సంతోషాలను కురిపించాలని కొందరంటే, గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కొందరు శుభాకాంక్షలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. -
‘ఆమె’ ప్రెస్‌మీట్
-
ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్
చెన్నై : విమర్శలతో రాటు తేలిన నటి అమలాపాల్ అని పేర్కొనవచ్చు. అందుకేనేమో అలాంటి విమర్శకులను అస్సలు పట్టించుకోనంటోంది. అంతే కాకుండా ఈ మలయాళీ భామకు కాస్త ధైర్యం ఎక్కువే. విమర్శించే వారిని తనదైన భాణిలో ధీటుగానే బదులిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ఆడై చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రంలో అమలాపాల్ పోషించిన పాత్ర గురించే ఇప్పుడు చర్చంతా. కారణం ఇందులో అమలాపాల్ పూర్తి నగ్నంగా నటించిన సన్నివేశాలు చోటు చేసుకోవడమే. అలా నటించినందుకు కొందరు విమర్శించినా, ఆమె ధైర్యానికి చాలా మంది అభినందిస్తున్నారు. అమలా పాల్ నగ్నంగా నటించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్‌కు చెందిన నమ్మకమైన 15 మందిని మాత్రమే సెట్లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. వారి నుంచి కూడా సెల్ఫోన్లను తీసుకుని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తరువాతనే తిరిగి ఇచ్చేవారట. దీని గురించి అమలాపాల్ తెలుపుతూ తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని నిర్మాత అన్నారని, అయితే ఆ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని అంది. అప్పుడలా అన్నా, నగ్న సన్నివేశాల చిత్రీకరణ రోజున షూటింగ్‌కు బయలుదేతున్నప్పుడే కాస్త దడ పుట్టిందని చెప్పింది. సెట్లో ఎం జరుగుతుందో? ఎవరెవరు ఉంటారో, తగిన రక్షణ ఉంటుందా? లాంటి అన్న భయం కలిగిందని చెప్పింది. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులు 15 మంది మాత్రమే ఉండటం చూసి కాస్త మనసు కుదుట పడిందని చెప్పింది. వారిపై ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించినట్లు అమలాపాల్ చెప్పింది. కాగా అమలాపాల్ అలా నగ్నంగా నటించడాన్ని కొందరు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు స్పందించిన ఆమె విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారని, మనం వివరణ ఇచ్చినా సరే వారికి కావలసింది మాత్రమే చెవిన వేసుకుంటారని అంది. అందువల్ల అలాంటి వారిని అస్సలు పట్టించుకోరాదని పేర్కొంది. ఇన్ని విమర్శలను మూట కట్టుకున్న ఆడై చిత్రం ఈ నెల 19వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
ఆసక్తికరంగా ‘ఆమె’
ఇటీవల టీజర్‌తోనే సెన్సేషన్ సృష్టించిన సినిమా ఆమె. టీజర్లో అమలాపాల్ నగ్నంగా నటించటంతో ఒక్కసారిగా ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. టీజర్లో బోల్డ్ లుక్‌లో కనిపించిన అమలా పాల్, ట్రైలర్లో బోల్డ్ డైలాగ్స్‌తో ఎట్రాక్ట్ చేశారు. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
కొత్త అమలాపాల్‌ను కనుగొన్నా
‘‘ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన అన్ని స్క్రిప్ట్‌లు అబద్దాలతో నిండినవే. దాంతో విసిగిపోయి ఇక సినిమాలను వదిలేద్దాం అనుకుంటున్న సమయంలో ‘ఆడై’ సినిమా నా దగ్గరకు వచ్చింది’’ అన్నారు అమలాపాల్. రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ నటించిన చిత్రం ‘ఆడై’. అంటే బట్టలు అని అర్థం. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించారు అమలాపాల్. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో అమలాపాల్ మాట్లాడుతూ – ‘‘ఆడై’ స్క్రిప్ట్ ఫస్ట్ పేజీ చదవగానే షాక్ అయ్యాను. ఈ సినిమాకు నిర్మాత కూడా దొరికారా? అని ఆశ్చర్యపోయాను. ‘ఆడై’ అనేది చాలా క్రేజీ ఫిల్మ్. నటిగా మనం ఒక సైడ్‌ని మాత్రం చూపిస్తాం. ఎందుకంటే మనకు మనమే ఓ పరిధి గీసేసుకుంటాం. కానీ ఈ సినిమా ద్వారా కొత్త అమలాపాల్‌ని కనుగొన్నాను. నాలో అలాంటి ఒక అమ్మాయి ఉంటుంది అనే విషయానే ఇన్నేళ్లూ నేను గుర్తించలేదు’’ అన్నారు. ‘ఆడై’ చిత్రం ‘ఆమె’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. -
జూలై 19న అమలా పాల్ ‘ఆమె’
సెన్సేషనల్ హీరోయిన్ అమలా పాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ఆమె. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమలా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
కామిని పోరాటం
అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’). ‘మేయాద మాన్’ ఫేమ్ రత్నకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్జే రమ్య, వివేక్ ప్రసన్న ముఖ్య పాత్రధారులు. విజ్జి సుబ్రమణియన్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలాపాల్ బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె పాత్ర పేరు కామిని అని తెలిసింది. తాజాగా ‘అడై’ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నట్లు అమలాపాల్ వెల్లడించారు. ‘‘నేను పోరాడతాను. జీవిస్తాను. వచ్చిన అడ్డంకులు చిన్నవైనా, పెద్దవైనా ఎదుర్కొంటాను. నీ సంకల్ప బలం బలీయమైనది అయినప్పుడు నువ్వు విఫలమయ్యే అవకాశమే లేదు’’ అని సినిమాలోని తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు అమలాపాల్. -
డాక్టర్ ఐశ్వర్యతో విజయ్ వివాహం
మదరాసిపట్నం, శైవం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఏఎల్ విజయ్, 2014లో నటి అమలా పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లలోనే అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్న ఈ జంట ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యారు. అయితే కొద్ది రోజులు విజయ్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలో మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక దశలో హీరోయిన్ సాయి పల్లవితో విజయ్ వివాహం అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ.. విజయ్ తన వివాహానికి సంబంధిచి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. జూలై నెలలో తాను డాక్టర్ ఐశ్వర్యను వివాహమాడనున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు అన్ని సందర్భాల్లో సహకరించిన మీడియాకు విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
తప్పుకోలేదు... తప్పించారు
‘‘నిర్మాణ సంస్థలకు నా నుంచి సరైన మద్దతు లభించదనే నెపంతో నన్ను ఓ సినిమా నుంచి హీరోయిన్గా తొలగించారు’’ అని వాపోయారు అమలా పాల్. విజయ్ సేతుపతి హీరోగా విజయ్ కృష్ణన్ దర్శకత్వంలో చంద్ర ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా అమలా పాల్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో హీరోయిన్గా మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. అమలా పాల్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంవల్లే ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వివాదం గురించి అమలా పాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ప్రొడక్షన్ హౌస్‌లకు నా వంతుగా సపోర్ట్ చేస్తున్నానా? లేదా? అనే విషయంలో ఆత్మశోధన చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ పోస్ట్ పెడుతున్నాను. దశాబ ్దకాలంగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా పరిచయస్తులు, నా సహనటీనటులు ఇప్పటివరకు నాపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. నేను నిర్మాణ సంస్థలకు చాలా సపోర్టివ్‌గా ఉంటాను. ఇందకు కొన్ని ఊదాహరణలు చెప్పదలచుకున్నాను. ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే తీరాలని ఆయన్ను ఒత్తిడి చేయలేదు. అలాగే నేను నటించి రిలీజ్‌కు సిద్ధమైన ‘అదో అంద పరవై పోల’ షూటింగ్ సమయంలో నాకు ఓ చిన్న గ్రామంలో వసతి ఏర్పాటు చేశారు. కావాలనుకుంటే సిటీలో హోటల్ రూమ్ బుక్ చేయమని నేను అడగొచ్చు. కానీ చిత్రబృందం సమయం, డబ్బులు వృథా కాకూడదని నేను అడ్జస్ట్ అయ్యానే. అంతేకాదు నేను ఇచ్చిన డేట్స్ కన్నా ఇంకా సమయం కేటాయించాల్సి వచ్చింది. పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ ఖర్చులన్నీ నేనే భరించాను. ఇక ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాని సాలరీ కమ్ ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద కమిటై చేశాను. కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకుని ఈసినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇలా నేను చేస్తున్న సినిమాల నిర్మాణ æసంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, నా అవసరాలకు రెండోప్రాధాన్యతను ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చంద్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాలోని నా పాత్ర కోసం నా సొంత ఖర్చులతో కాస్ట్యూమ్స్ కొనడానికి ముంబై వచ్చాను. ఈ సంస్థ ఎప్పుడూ ఆర్థికపరమైన వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. నేను ఊటీలో ఏవేవో సౌకర్యాలు అడిగానని, తమ నిర్మాణసంస్థకు నేను సరిపోనని చెప్పి నన్ను హీరోయిన్గా తొలగించారు. కనీసం ఈ విషయం గురించి నాతో సరైనచర్చలు జరపకుండానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను భారీ పారితోషికం డిమాండ్ చేశానని ఆరోపించారు. ‘ఆడై’ టీజర్ రిలీజ్ తర్వాత నన్ను తప్పించారు. ఇలాంటి నిర్మాణ సంస్థల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్. ఇంకా చెబుతూ – ‘‘విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ అవకాశం చేజారింది. చంద్ర ప్రొడక్షన్స్ వల్ల ఇండస్ట్రీలో వత్తిపరంగా నా నడత గురించి వినిపిస్తున్న పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేందుకే నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
‘కాస్ట్యూమ్స్ ఖర్చు నేనే భరిస్తానన్నా’
సాక్షి, చెన్నై: ‘ఆడై’ టీజర్‌తో ప్రేక్షకులకు షాకిచ్చిన నటి అమలాపాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. సంచలనానికి బ్రాండ్‌నేమ్ అయిన ఈ భామకు.. ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం సర్వసాధారణంగా మారిందని చెప్పవచ్చు. తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి అంగీకరించి.. ఆ తరువాత ఆ చిత్రానికి కాల్షీట్స్ సమస్య కారణంగా టాటా చెప్పినట్లు సమీపకాలంలో వార్తలు దొర్లిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్పీ.జననాథన్ శిష్యుడు వెంకట్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి విజయ్‌సేతుపతి హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చంద్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నుంచి అమలాపాల్ వైదొలగిందని, ఆమెకు బదులు నటి మేఘాఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా నటి అమలాపాల్ సరిగా సహకరించకపోవడంతోనే ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన అమలాపాల్ ఈ చిత్ర నిర్మాతల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటనను గురువారం మీడియాకు విడుదల చేశారు. అందులో తాను విజయ్‌సేతుపతి నటిస్తున్న చిత్రం నుంచి తొలగించబడ్డానని పేర్కొన్నారు. తాను సరిగా సహకరించని కారణంగానే తొలగించినట్లు చిత్ర నిర్మాతలు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకూ తాను నటించిన చిత్రాలకు నిర్మాతలకు సపోర్టుగానే ఉన్నానని చెప్పారు. ఇంత కాలంగా నటిస్తున్న తనకు సినిమా రంగంలో ఉన్న అనుబంధంలో ఇలా ఎవరూ తనపై నేరం మోపలేదని వాపోయారు. భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రానికి తన పారితోషికంలో కొంత మొత్తాన్ని తీసుకోలేదని, అంతే కాకుండా ఆ చిత్ర నిర్మాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే తాను అప్పుగా కొంత డబ్బు ఇచ్చానని చెప్పారు. చదవండి : బోల్డ్‌గా నటించిన అమలాపాల్ ఆడై టీజర్‌నే కారణం వారు తనను చిత్రం నుంచి తొలగించడానికి కారణం ఆడై చిత్ర టీజర్ అని తనకు అనిపిస్తోందని అమలాపాల్ అన్నారు. చంద్రా ప్రొడక్షన్స్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం అనాగరికం అని మండిపడ్డారు. నటించడానికి వచ్చిన తరువాత దేనికీ వెనుకాడని వారే నిజమైప నటి అన్నారు. తన పాత్రకు న్యాయం చేయాలనే తాను భావిస్తానని.. ఇకపై కూడా తాను ఇలానే చేస్తానని చెప్పారు. నటుడు విజయ్‌సేతుపతి అంటే తనకు గౌరవం ఉందని, ఆయనకు తాను అభిమానినని అమలాపాల్ పేర్కొన్నారు. ఇక త్వరలో విడుదల కానున్న తన సినిమా ‘అదో అంద పరవై పోల’ చిత్ర షూటింగ్ చిన్న గ్రామంలో జరిగితే అక్కడ ఎలాంటి వసతులు లేని చిన్న ఇంట్లో బస చేసినట్లు చెప్పారు. లో బడ్జెట్ చిత్రం కావడంతో రేయింబవళ్లు పని చేశానని... చిత్రం విషయంలో కాంప్రమైజ్ కాకూడదని చివరి రోజు షూటింగ్ ఖర్చు అంతా తానే భరించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ‘ఆడై’ చిత్రానికి చిన్న పారితోషికాన్నే తీసుకున్నానని, చిత్ర లాభాల్లో భాగం ఇస్తానని నిర్మాతలు చెప్పారని అమలాపాల్ తెలిపారు. విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రానికి కాస్ట్యూమ్స్ కొనుగోలు కోసమే ముంబైకి వెళ్లానని..చంద్రా ప్రొడక్షన్స్ సంస్థ బడ్జెట్ గురించి గోల పెట్టడంతో ఈ ఖర్చును తానే భరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అలాంటిది సడన్‌గా ఈ చిత్ర నిర్మాత రతన్‌కుమార్ తనకు ఒక మేసేజ్ పంపి మీ నిబంధనలు తమ సంస్థకు సరిపడక పోవడంతో మీరు ఈ చిత్రానికి అవసరం లేదు అని పేర్కొన్నారని వాపోయారు. అయితే వారు ఈ నిర్ణయం తీసుకునే ముందు తనను పిలిచి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
మేఘా ఇన్.. అమలా అవుట్
అమలాపాల్ హీరోయిన్గా ఎంపికైన సినిమాలో ఆమెకు బదులుగా హీరోయిన్ మేఘా ఆకాష్‌ను చిత్రబృందం ఫైనలైజ్ చేశారన్నది కోలీవుడ్ తాజా ఖబర్. విజయ్ సేతుపతి హీరోగా వెంకట్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. తొలుత ఈ సినిమాకి కథానాయికగా అమలా పాల్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకి మేఘా వచ్చారని సమాచారం. ఆల్రెడీ ఊటీలో ఈ సినిమా చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే.. సడన్‌గా ఇప్పుడు అమలా ఎందుకు ఈ సినిమా చేయడం లేదు అంటే... ఏదో కొత్త సినిమాకు సైన్ చేశారని కొందరు, రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం స్పందించలేదు. -
మేఘాకు జాక్‌పాట్
సినిమా రంగంలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఏ చిత్రంలో ఎవరు ఉంటారో, ఎవరు వైదొలుగుతారో చెప్పలేం. ఇప్పుడు నటి అమలాపాల్ విషయంలో ఇదే జరిగింది. చిత్ర ప్రారంభం నుంచి ఈ అమ్మడి పేరు మారుమోగింది. తీరా చిత్ర షూటింగ్ మొదలైన తరువాత తను లేదంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాదు తను నటించిన తాజా చిత్రం ఆడై టీజర్‌తో సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. నటుడు విజయ్‌సేతుపతి నటిస్తున్న 33వ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా వెంకట కృష్ణ రోహంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. చంద్రా ఆర్ట్స్ పతాకంపై ఇసక్కిదురై నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతికి జంటగా నటి అమలాపాల్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు మగిళ్ తరుమేని ప్రతినాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం పళనిలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌సేతుపతి సంగీత కళాకారుడిగా నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రం నుంచి అమలాపాల్ వైదొలిగారు. కాల్షీట్స్ సమస్య కారణంగానే అమలాపాల్ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు అమలాపాల్ స్థానాన్ని మరో నటి మేఘాఆకాశ్ భర్తీ చేశారు. ఇది ఈమెకు జాక్‌పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే మేఘాఆకాశ్ తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నా సరైన సక్సెస్‌ను ఈ అమ్మడు చూడలేదు. కాలాలో చిన్న పాత్రలో నటించినా ఆ విజయం రజనీకాంత్‌కే చెందుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల శింబుకు జంటగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో కథానాయకిగా నటించిన మేఘాఆకాశ్కు ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం ఈ అమ్మడికి లభించడం నిజంగా లక్కీనే. ఈ చిత్రం షూటింగ్లో మేఘాఆకాశ్ మంగళవారం జాయిన్ అయ్యారని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రం అయినా ఈ అమ్మడి జాతకాన్ని మార్చుతుందేమో చూడాలి. -
నగ్నంగా ఇరవై రోజులు!
తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చ అంతా నటి అమలాపాల్ గురించే. అందుకు కారణం ఈ సంచలన నటి నటించిన ఆడై చిత్రంలో పోషించిన పాత్రనే. కథనాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇది. ఇంతకుముందు మేయాదమాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం ద్వారా పరిచయం అయిన రతన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఆడై. ఆ మధ్య విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టరే సంచలనం సృష్టించింది. దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్ పేపర్ చుట్టుకున్న అమలాపాల్ ఫొటోతో కూడిన ఆ పోస్టర్ ఆడై చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదల చేసిన ఆడై చిత్ర టీజర్ మరింత ప్రకంపనలను సృష్టిస్తోంది. అందులో నటి అమలాపాల్ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం చోటు చేసుకోవడమే కారణం. అలాంటి సన్నివేశంలో అమలాపాల్ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం నటి అమలాపాల్ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు. అందుకు అమలాపాల్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నటి సమంత వంటి తారలు అమలాపాల్‌ను అభినందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ఇలా ఇంతకుముందు ఏ చిత్రానికి రానట్టుగా లైక్స్ రికార్డు స్థాయిలో వచ్చాయట. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నారు. ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడం వంటి సన్నివేశాలతో పాటు, మోటార్ బైక్ నడపడం, విలన్లతో ఫైట్ చేయడం వంటి సాహసాలు చేసిందట. ఇది కచ్చితంగా ఆమె కేరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని ఆడై చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
ఆ నగ్న సత్యమేంటి?
అమలా పాల్ కొత్త చిత్రం పేరు ‘ఆడై’. అంటే బట్టలు అని అర్థం. కానీ ఈ చిత్రం టీజర్ చూస్తే అవి లేకుండానే కొన్ని సన్నివేశాల్లో ఆమె కనిపించారని తెలుస్తోంది. నగ్నసత్యాలను కొందరు దర్శకులు పట్టుబట్టలు కట్టి చెప్పదలచుకుంటారు. కొందరు నగ్నంగానే చూపించేస్తారు. దర్శకుడు రత్నకుమార్ ఏదో విషయాన్ని నగ్నంగా చెప్పదలిచారు. అందుకే తన లీడ్ యాక్టర్‌తో నగ్నంగా నటింపజేశారు. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అంత నగ్నంగా చెప్పదలిచిన విషయం ఏంటా? అని టీజర్ చూసి ఆలోచనలో పడక మానం. అమలాపాల్ ముఖ్యపాత్రలో రత్నకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడై’. ఈ చిత్రం టీజర్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో అమలా పాల్ నగ్నంగా కనిపించారు. ‘నీకు జరిగిన దానికి తిరిగి నువ్వేం చేస్తావో అనేదే స్వాతంత్య్రం’ అనే కొటేష¯Œ ను టీజర్లో చూపించాడు దర్శకుడు. సో.. తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకునే పాత్ర అమలా పాల్ది అని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. -
టీజర్‌తో షాక్ ఇచ్చిన అమలా పాల్
సౌత్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించేందుకు రెడీ అంటున్నారు. తాజాగా సౌత్ హీరోయిన్ అమలా పాల్ తన తాజా చిత్రం ఆడై కోసం నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆకట్టుకున్న చిత్రయూనిట్ టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేశారు. తెలుగులో ఆమె అనే పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఓ తల్లి తన కూతురు తప్పి పోయినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వటం తరువాత పోలీసులకు అమలా పాల్ దారుణమైన పరిస్థితుల్లో కనిపించటం లాంటి సన్నివేశాలతో టీజర్‌ను కట్ చేశారు. గతంలో సౌత్ లో ఏ హీరోయిన్ చేయని సాహసం చేసిన అమలాపాల్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. వీ స్టూడియోస్ బ్యానర్‌పై రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ టీజర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విడుదల చేయగా తెలుగు టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. -
విజయ్‌సేతుపతితో అమలాపాల్!
గతంలో టైటిల్ నిర్ణయించని చిత్రాలకు ప్రొడక్షన్ 1, 2 అని పేర్కొనేవారు. అలాంటిది స్టార్ హీరోల చిత్రాలకు విజయ్ 63, అజిత్ 58 అని చెప్పడం అలవాటుగా మారిపోయ్యింది. అదే బాటలో నటుడు శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వంటి వారు కూడా నడుస్తున్నారు. నటుడు విజయ్‌సేతుపతి తాజా చిత్రానికి వీఎస్పీ 33 అని పేర్కొన్నారు. ఇటీవల ఓ సినిమాను ప్రారంభించిన ఇది ఈయన 33వ చిత్రం. చంద్ర ఆర్ట్స్ పతాకంపై ఇసక్కిదురై నిర్మిస్తున్నారు. దీని ద్వారా నవ దర్శకుడు వెంకట్‌కృష్ణ రోహంత్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎస్పీ.జననాథన్ వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేశారు. ఈ మూవీలో సంచలన నటి అమాలాపాల్ కథానాయకిగా నటించనున్నారు. విజయ్‌సేతుపతితో ఈ అమ్మడు జత కడుతున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు శుక్రవారం చెన్నైలో జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్పీ.జననాథన్ విచ్చేసి చిత్ర ముహూర్తానికి క్లాప్ కొట్టి తన శిష్యుడైన దర్శకుడికి యూనిట్ వర్గానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చిత్ర వర్గాలు వివరాలను తెలుపుతూ ఈ చిత్ర టైటిల్‌ను సస్పెన్స్‌గా ఉంచామన్నారు. అంత వరకూ వీఎస్పీ 33 అని ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇది క్రిస్మస్, నూతన సంవత్సం, ఇతర వేడుకలు, ప్రేమ, సంగీతం అంటూ సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అంతకు మించి అంతర్జాతీయ అంశం గురించి చర్చించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ మూవీలో విజయ్‌సేతుపతి సంగీత కళాకారుడిగా నటిస్తున్నారని తెలిపారు. ఇందులో నటి అమలాపాల్‌తో పాటు, మరో విదేశీ నటి నాయకిగా నటించనుందని చెప్పారు. ఇందులో నటించే ఇతర ప్రముఖ తారాగణం గురించి వరుసగా వెల్లడిస్తామని చెప్పారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని, మహేశ్ముత్తుస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. కాగా సినీ ఇన్నోవేషన్స్, ఆర్కే. జయకుమార్ ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. -
లవ్ అండ్ మ్యూజిక్
అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ షురూ చేశారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. కోలీవుడ్‌లో వెంకటకృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అమలా పాల్ నటి స్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. సంగీతం, ప్రేమ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మ్యుజిషియన్‌గా నటిస్తున్నారని తెలిసింది. చెన్నై షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఊటీలో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది. అమలాపాల్‌తో పాటు ఓ విదేశీ నటి ఈ సినిమాలో మరో హీరోయిన్గా కనిపించనున్నారని టాక్. ‘సంగతమిళన్, లాభం’ ఇలా తమిళ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నారు. -
జయలలిత ఎప్పటికీ బతికే ఉంటారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తయారవుతున్నాయి. లేటెస్ట్గా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయలలితగా కాజోల్ దేవగన్, శశికళగా అమలాపాల్ నటిస్తారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ టైటిల్‌ను శనివారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిలో అభిమానులను సొంతం చేసుకున్నారు జయలలిత. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందారామె. ‘శశిలలిత’ చిత్రం రూపొందించడం అభినందనీయం. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘జయలలిత ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆమె బాల్యం, సినీనటిగా ఎదగడం, ప్రేమ విఫలం, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె మరణం వెనుక ఉన్న కారణం, 75 రోజులు ఆసుపత్రిలో ఉన్న సంఘటనలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కట్టిపడేశారు
ఇక్కడున్న ఫొటో చూశారుగా! హీరోయిన్ అమలాపాల్ కాళ్లు, చేతులు కట్టిపడేశారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న ‘అదో అంద పరవై పోల’ సినిమా కోసమే. ఈ చిత్రానికి కేఆర్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘అదో అంద పరవై పోల’ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా ఇలా నన్ను కట్టిపడేశారు. ఒకవేళ నన్ను ఇలానే వదిలి వెళ్లిపోతారా? ఏంటి? అని కంగారు పడ్డాను’’ అని ఈ ఫొటోను సరదాగా షేర్ చేశారు అమల. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో అమలాపాల్ కొన్ని యాక్షన్ స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె గాయపడ్డ సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ఇందులో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల అమల ‘కడవేర్’ అనే సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్
కుందనపు బొమ్మలే కాదు..ఇప్పుడు బొమ్మా బొరుసూ కూడా.బొమ్మ తయారవ్వడానికి కావాల్సి నంత లక్ష్మిని కటాక్షిస్తున్నారు.ఇదిగో వచ్చారు.. శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్. పారితోషికం తీసుకోవడమే కాదు.. ఇస్తాం కూడా అంటున్నారు అందాల నాయికలు. నటన మీద ఆసక్తితో సిల్వర్ స్క్రీన్ కనపించడంతో పాటు మేకింగ్ మీద ఇంట్రస్ట్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. కథానాయికలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏం కాదు. కొత్తగా ఈ తరంలో కొందరు కథానాయికలు తమ పేర్లను రిజిష్టర్ చేయించుకున్నారు. అలా నిర్మాతలుగా అడ్వాన్సులు ఇవ్వడానికి సిద్ధపడిన ప్రొడ్యూసరమ్మల గురించి తెలుసుకుందాం. సినిమాలు లేక కాదు సౌత్‌లో కథానాయికగా కాజల్ సూపర్ సక్సెస్. ‘మగధీర, బృందావనం, డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, బిజినెస్‌మేన్, తుపాకీ’ ఇలా... చెప్పుకుంటూ పోతే కాజల్ కథానాయికగా నటించిన హిట్టు సినిమాల లిస్ట్ పెద్దదే. రెండేళ్ల క్రితం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో నాయికగా 50వ చిత్రం మైలురాయిని కూడా చేరుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత సాధించిన కాజల్ ఇక ప్రొడ్యూసర్‌గా సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకే ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గతేడాది ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ సినిమాకు కాజల్ నిర్మాతగా మారనున్నారని సమాచారం. 50 సినిమాలు చేసింది కదా.. ఇక హీరోయిన్గా అవకాశాలు లేక నిర్మాతగా మారుతుందేమో అనుకుంటున్నారా? అంటే అలాంటిదేం లేదండీ బాబు. కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నటిగా ప్రస్తుతం ఆరేడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మనసు గెలవాలని.. ఇండస్ట్రీలో తాను సంపాదించిన సొమ్మును ఇండస్ట్రీలోనే పెడుతున్నందుకు రొంబ (చాలా) హ్యాపీ అని అమలాపాల్ అంటున్నారు. అవును... ఆమె నిర్మాతగా మారారు. అనూప్ ఫణిక్కర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తమిళంలో ‘కడవేర్’ అనే ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగాను వ్యహరించేందుకు రెడీ అయ్యారు అమలాపాల్. కేరళ పోలీస్ శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ జీవితంలో జరిగిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌గా నటిస్తున్నారు అమలాపాల్. ఆడియన్స్ మనసు గెలుచుకునే స్క్రిప్ట్ కాబట్టి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా వారి మనసు గెలవాలనుకుంటున్నాని అమలా పాల్ పేర్కొన్నారు. ఇటు హీరోయిన్‌గానూ ఆమె కెరీర్ ఫుల్ రైజింగ్లోనే ఉంది. తండ్రి బాటలో... కమల్‌హాసన్ కూతురిగా శ్రుతీహాసన్ ఇండస్ట్రీకి పరచయం అయ్యారు కానీ తక్కువ కాలంలోనే తానేంటో ప్రూవ్ చేసుకుని సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు శ్రుతీహాసన్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు వీలైనప్పుడు సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చాటుతున్నారు శ్రుతి. కొత్త కథలను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించడానికి ఆమె నిర్మాతగా మారారు. 2017లో తమిళంలో ‘లెన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్నారు జయప్రకాష్ రా«ధాకృష్ణన్. ఆ తర్వాత ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అనే సినిమా తీశారు. ఈ సినిమా చూపి ఇంప్రెస్ అయిన శ్రుతీహాసన్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా నిర్మాతగా మారారు. ఇదిలా ఉంటే.. కమల్హాస రాజ్ కమల్ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తుంటారని తెలిసిందే. చిన్నప్పటి నుంచి తండ్రిని చూశారు కదా. అలా యాక్టింగ్, ప్రొడక్షన్‌ను రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రుతీ తండ్రి బాటలో నడుస్తున్నట్లున్నారు. డైరెక్షన్ మారింది డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ యాక్టర్స్ అందరూ ఎంటర్టైనింగ్ డిజిటల్ సెక్టార్ వైపు కన్నేశారు. ఈ జాబితాలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ కూడా ఉన్నారు. కానీ యాక్టింగ్ పరంగా కాదు. నిర్మాతగా. 2010లోనే ‘గోవా’ అనే సినిమాను నిర్మించిన సౌందర్యా రజనీకాంత్ తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రముఖ తమిళ నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘కొచ్చాడియన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సూర్యప్రతాప్ దర్శకుడు. అన్నట్లు ‘కొచ్చాడియన్’ సినిమాకు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బావ ధనుష్ హీరోగా ‘వీఐపీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు సౌందర్య. అయితే దర్శకురాలిగా రెండు వైఫల్యాలను చవిచూడటంతో నిర్మాణం వైపు డైరెక్షన్ మార్చారేమో! హిందీ హిట్ ‘క్వీన్’ చిత్రం సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు పరుల్ ఒక నిర్మాతగా ఉన్నారు. కన్నడ రీమేక్ ‘బటర్‌ఫ్లై’లో పరుల్ యాదవ్ కథానాయికగా నటించారు. విశేషం ఏంటంటే.. ‘క్వీన్’ సౌత్ రీమేక్లన్నింటికి సహ–నిర్మాతల లిస్ట్‌లో కన్నడ బ్యూటీ పరుల్ యాదవ్ పేరు ఉంది. సో... పరుల్ కూడా ప్రొడక్షన్లోకి వచ్చినట్లే. టాలీవుడ్లో సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్నో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే... డైరెక్షన్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని భవిష్యత్‌లో నిర్మాణ రంగంవైపు దృష్టి పెట్టాలనే ఆలోచన మాత్రం ఉందని ఓ సందర్భంలో సమంత చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ప్రొడక్షన్వైపు తనకు ఆసక్తి ఉందన్నారు. ఆల్రెడీ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నానని, భవిష్యత్‌లో సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందని ఇటీవల చెప్పారు. చార్మింగ్ ప్రొడ్యూసర్ తెలుగుతెరపై కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు నటి చార్మీ. ‘మాస్, అనుకోకుండా ఒకరోజు, మంత్ర’ వంటి హిట్ చిత్రాలు కథానాయికగా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్గా కెరీర్లో కాస్త స్లో అయ్యారు. కానీ నిర్మాతగా జోరు పెంచారు చార్మీ. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల (రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’) నిర్మాణాన్ని చూసుకుంటూ ‘చార్మింగ్ ప్రొడ్యూసర్’ అనిపించుకుంటున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఆమె ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. 2017లో వచ్చిన ‘రోగ్’ సినిమాకు తొలిసారి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘పైసా వసూల్, మెహబూబా’ సినిమాలకు కూడా ఆమె నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. ఆ అనుభవంతో ఒకేసారి ‘ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్’ చిత్రాల నిర్మాణాన్ని చాకచక్యంగా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. బాలీవుడ్లో అగ్రకథానాయికలుగా ఎదిగిన ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ‘వెంటిలేటర్’ అనే చిత్రానికి ప్రియాంకా చోప్రా అయితే నిర్మాతగా జాతీయ అవార్డును కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ నిర్మాతగా మారారు. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జార్ దర్శకత్వంలో ‘చప్పాక్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు దీపికా పదుకోన్. ఇక ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న స్వరా భాస్కర్ కూడా నిర్మాతగా మారారు. ‘‘తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, ఎక్స్: పాస్ట్ అండ్ ప్రజెంట్, వీరే ది వెడ్డింగ్’’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు స్వర. ఆమె తన తమ్ముడు ఇషాన్ భాస్కర్‌తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికే నిర్మాతగా మారాను అని స్పష్టం చేశారు స్వరాభాస్కర్. మరో యువనటి రీచా చద్దా కూడా నిర్మాతల జాబితాలో చేరారు. ఫుక్రే, మసాన్ వంటి సినిమాల్లో నటించిన రీచా చద్దా ఇటీవల షకీలా బయోపిక్‌లో నటించారు. ‘‘హీరోయిన్లు కెమెరా ముందు నటించడానికి మాత్రమే కాదు. డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని క్రాఫ్ట్స్‌లో సత్తా చాటగలరు’’ అని రీచా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ కూడా ప్రొడక్షన్ ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కథానాయికగా ఉన్న కంగనా ఇటీవల ‘మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలో కొన్ని సన్నివేశాల కోసం మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. అలాగే కన్ఫార్డ్మ్గా చెప్పలేదు కానీ సోనమ్ కపూర్, ఆలియా భట్ కూడా భవిష్యత్‌లో ప్రొడక్షన్ వైపు అడుగులు వేసే ప్లాన్‌లో ఉన్నట్లు మాత్రం చెబుతున్నారు. – ముసిమి శివాంజనేయులు -
శవాలతో సావాసం!
ట్రావెలింగ్‌ను బాగా ఇష్టపడే అమలాపాల్ ఇటీవల హాస్పిటల్స్ చుట్టూ తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్లో ఆమె ఎక్కడికి వెళుతున్నారంటే? శవాలను భద్రపరిచే మార్చురీలోకి అట. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న నెక్ట్స్ తమిళం చిత్రం ‘కడవేర్’ కోసమే. ఈ సినిమాలో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నారు అమలపాల్. పాత్ర ప్రిపరేషన్లో భాగంగానే ఆమె హాస్పిటల్స్‌కి వెళ్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంతో అనూప్ ఫణిక్కర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇంకా స్పెషల్ ఏంటంటే.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు అమలాపాల్. సోమవారం షూటింగ్ ఆరంభమైంది. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ‘‘ఈ సినిమాలో పాథాలజిస్ట్‌గా నటిస్తున్నాను. మర్డర్‌మిస్టరీ నేపథ్యంలో ఉంటుంది. నేనింతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఇంటర్నెట్లో బాగా వెతికాను. ఉమాదతాన్తో కూడా మాట్లాడాను’’ అని అన్నారు. అంటే ఈ పాత్ర కోసం అమలా పాల్ శవాలతో సావాసం చేస్తున్నారన్నమాట. ఇక నిర్మాతగా మారడం గురించి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకు 4 ఏళ్ల క్రితం వచ్చింది. అనూప్ అండ్ టీమ్ గత మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్‌గా ఉండే ఇలాంటి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నేను సంపాదించినదాన్ని ఇండస్ట్రీలోనే పెడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు అమలాపాల్. -
స్క్రీన్ టెస్ట్
‘ఆడొచ్చాడు.. ఆడి కొడుకొచ్చాడని చెప్పు’... ‘మిర్చి’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. తండ్రికి తగ్గ వారసుడిగా సినిమాలో ప్రత్యర్థిపై ప్రభాస్ సవాల్ విసురుతాడు. రియల్ లైఫ్‌లో వారసులు ఇలాంటి డైలాగ్ చెప్పకపోయినా... తల్లిదండ్రులకు తగ్గ బిడ్డలు అనిపించుకోవాలని అనుకుంటారు. మామూలుగా వారసులంటే ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో... ఇది నిన్నటి కథ. ఇప్పుడు అమ్మాయిల జోరు కూడా పెరిగింది. ‘లేడీ వారసుల’ హవాతో ఈ వారం స్పెషల్ క్విజ్. 1 ఇందిరా ప్రొడక్షన్స్ అధినేత మంజుల అనగానే సూపర్‌స్టార్ కృష్ణ కూతురని అందరికీ తెలుసు. మహేశ్‌బాబు అక్కగా ఆమె ఫేమస్. ఈ మధ్య ఆమె ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) వరుణ్ సందేశ్ బి) సందీప్ కిషన్ సి) ప్రిన్స్ డి) అరవింద్ కృష్ణ 2 విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేశ్. ఆ చిత్రంలో ప్రతి నాయకురాలి పాత్రలో మెప్పించిన నటి ఎవరో తెలుసా? (ఆమె తమిళ హీరో శరత్ కుమార్ కూతురు) ఎ) సమంత బి) వరలక్ష్మి సి) తమన్నా డి) సాయి పల్లవి 3 యన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించారు త్రిష. మరో హీరోయిన్గా నటించింది ప్రముఖ నటి రాధ కూతురు. ఆమె పేరేంటి? ఎ) లక్ష్మీ మీనన్ బి) తులసి సి) కార్తీక డి) శరణ్యా మోహన్ 4 తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఒకరు సౌందర్య, మరొకరు ఐశ్వర్యా ధనుష్. ఇద్దరూ దర్శకులే. వీరిలో కార్తీ హీరోగా నటించిన ఓ సినిమాకి ఐశ్వర్య తన గొంతును అరువిచ్చారు. ఆమె ఏ హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పారో తెలుసా? ఎ) రిమ్మీసేన్ బి) రియాసేన్ సి) రీమాసేన్ డి) రైమాసేన్ 5 సంగీత దర్శకుడు యస్.యస్. తమన్‌తో కలిసి ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘డౌన్ డౌన్ డుప్ప డుప్ప...’ సాంగ్‌ను పాడిన సింగర్ ఎవరో తెలుసా? (ఆమె ప్రముఖ హీరో కూతురు) ఎ) అమలా పాల్ బి) శ్రుతీహాసన్ సి) ఆండ్రియా డి) ఐశ్వర్యా అర్జున్ 6 ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి, నటించటంతో పాటు తన ఫిల్మ్ కెరీర్‌ను ప్రారంభించిన ‘ఒక మనసు’ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిహారిక బి) స్వాతి సి) ఇషా రెబ్బా డి) తేజస్వి మడివాడ 7 అఖిల్‌తో ‘హలో’ చెప్పి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరైన కళ్యాణి ఓ హీరోయిన్ కుమార్తె. ఆమె తండ్రి పెద్ద దర్శకుడు. ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. కళ్యాణి అమ్మ గారి పేరేంటి? ఎ) వాణీ విశ్వనాథ్ బి) అంబిక సి) లిజి డి) ఊర్వశి 8 విలక్షణ నటునిగా పేరున్న నటుడు మోహన్‌బాబు. ఆయన కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న పేరు మీదే ఆయన చిత్రనిర్మాణ సంస్థ ఉంది. ఆమె ఇంగ్లీషు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు అనేక టీవీ షోస్ చేశారు. ఆమె ఏ తమిళ దర్శకుని చిత్రంలో నటించారో తెలుసా? ఎ) మణిరత్నం బి) బాలచందర్ సి) భారతీరాజా డి) పి. వాసు 9 చిరంజీవి పెద్ద కుమార్తె, రామ్‌చరణ్ అక్క సుస్మిత సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆమె ఏ శాఖలో తన ఉనికిని చాటుకుంటున్నారో కనుక్కోండి? ఎ) ఎడిటింగ్ బి) ఫొటోగ్రఫీ సి) ప్రొడ్యూసర్ డి) ఫ్యాషన్ డిజైనర్ 10 ‘సాహెబా సుబ్రమణ్యం’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగు పెట్టారు శశికిరణ్. ఆమె ఓ ప్రముఖ కమెడియన్ కూతురు. ఎవరా కమెడియన్ కనుక్కోండి? ఎ) ఏ.వి.యస్ బి) యం.యస్. నారాయణ సి) ధర్మవరపు సుబ్రమణ్యం డి) ఎల్బీ శ్రీరామ్ 11 అడివి శేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయన సరసన హీరోయిన్గా నటిస్తున్న నటి ఎవరు? (ఆ హీరోయిన్ వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నారు) ఎ) శివాత్మిక బి) రష్మికా మండన్నా సి) శివాని డి) చేతన 12 హీరో కమల్‌హాసన్ అన్న ప్రముఖ నటుడు చారుహాసన్. ఆయన కుమార్తె మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత పెద్ద హీరోయిన్ అయ్యారు ఆమె పేరేంటి? ఎ) జయసుధ బి) భానుప్రియ సి) సుహాసిని డి) విజయశాంతి 13 తెలుగులో ‘రక్తకన్నీరు’ నాగభూషణం లానే తమిళ్లో యం.ఆర్. రాధ అనే నటుడు చాలా ఫేమస్. ఆయన కూతురు దక్షిణాదిన పాపులర్ హీరోయిన్. ఆమె పేరేంటి? ఎ) రాధిక బి) రాధ సి) సుమలత డి) జయప్రద 14 1989లో విడుదలైన ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు నటి ఐశ్వర్య. ఆమె ప్రముఖ హీరోయిన్ లక్ష్మి కుమార్తె. ఆమె ఏ హీరోతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టారో తెలుసా? ఎ) జేడీ చక్రవర్తి బి) వడ్డే నవీన్ సి) జగపతిబాబు డి) శ్రీకాంత్ 15 ప్రముఖ నటుడు అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వివేగం’లో ఆయన సరసన హీరోయిన్గా నటించారు కాజల్ అగర్వాల్. మరో నటి కీలక పాత్ర చేశారు. ఆమె పేరేంటి? (ఆమె తండ్రి తమిళ, తెలుగు సినీరంగంలో మంచి పేరున్న నటుడు) ఎ) అమలాపాల్ బి) శ్రుతీహాసన్ సి) అక్షర హాసన్ డి) కీర్తీసురేశ్ 16 వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఈ పేరు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్. ఆమెను హీరోయిన్గా మొదట పరిచయం చేసిన దర్శకుని పేరేంటో తెలుసా? (ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్‌తో ఎఫైర్లో ఉన్నాడు) ఎ) ఏ ఆర్ మురుగదాస్ బి) లింగుస్వామి సి) ఏ.ఎల్. విజయ్ డి) విఘ్నేశ్ శివన్ 17 శ్రీదేవి కూతురు జాహ్నవి. ఆమె నటించిన మొదటి సినిమా ‘ధడక్’ నటిగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసా? ఎ) బాక్సర్ బి) పైలెట్ సి) షూటర్ డి) క్రికెటర్ 18 ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? (ఆమె తండ్రి ప్రముఖ హిందీ దర్శకుడు) ఎ) కరీనా కపూర్ బి) కరిష్మా కపూర్ సి) ఆలియా భట్ డి) సోనమ్ కపూర్ 19 1970 – 80ల మధ్య కాలంలో తమిళ్ హీరోల్లో మంచి పేరున్న నటుడు ఆనంద్. ఆయన కుమార్తె తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు. ఆమె భర్త కూడా నటుడే. ఎవరామె? ఎ) సిల్క్ స్మిత బి) అభినయ శ్రీ సి) అనురాధ డి) డిస్కో శాంతి 20 ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘118’. ఆ చిత్రంలో నివేదా థామస్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి పేరు పాట. ఆ పాప ఓ ప్రముఖ తెలుగు నటుని కుమార్తె. ఎవరా నటుడు? ఎ) ఉత్తేజ్ బి) రాజీవ్ కనకాల సి) సమీర్ డి) రఘుబాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (బి) 3) (సి) 4) (సి) 5) (బి) 6) (ఎ) 7) (సి) 8) (ఎ) 9) (డి) 10) (బి) 11) (సి) 12) (సి) 13) (ఎ) 14) (సి) 15) (సి) 16) (డి) 17) (బి) 18) (సి) 19) (డి) 20) (ఎ) -
సినీ హోలీ
రంగురంగుల హోలీ వేడుకల్లో ఆనందాన్ని చల్లుకుని, చిరునవ్వులను పంచుకుని అనుభూతులను దాచుకున్నారు సినీ తారలు. కొందరు కుటుంబంతో హోలీని జరుపుకుంటే మరికొందరు హోలీడే అయినా నో హాలిడే అంటూ సెట్లో జరపుకున్నారు. మరికొందరు స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. వాటిలో కొన్ని ఫొటోలే ఇక్కడున్నవి. సన్నీ లియోన్ కల్యాణ్ దేవ్, శ్రీజ కత్రినా కైఫ్ కృతీ సనన్, కంగన నిహారిక, అల్లు అర్జున్, స్నేహ వరుణ్, నటాషా అమలా పాల్, ప్రియా ప్రకాశ్ రాయ్ లక్ష్మీ -
మారథాన్‌లో అమలాపాల్
పెరంబూరు: పుదుచ్చేరిలో ఆదివారం జరిగిన మారథాన్‌లో నటి అమలాపాల్ పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం పుదుచ్చేరి, ఆరోవిల్‌లో మారథాన్ నిర్వహించారు. మందిర్ సెంటర్ నుంచి ఉదయం 5.30 గంటలకు మారథాన్ పోటీలు ప్రారంభం అయ్యాయి. 40, 21, 10 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలను చేపట్టారు. ఇందులో తమిళ రైల్వే ఏటీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో రైల్వే పోలీసుల బృందం, మహిళా కమాండర్ బృందం పాల్గొన్నారు. వీరితో పాటు మొత్తం 3 వేల మంది మారథాన్‌ల్లో పాల్గొన్నారు. సంచలన నటి అమలాపాల్ తన మిత్రులతో 21 కిలోమీటర్ల పోటీలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. -
ఇది అమల వేదాంతం
ఎప్పుడూ ఎలా వార్తల్లో ఉండాలో తెలిసిన నటి అమలాపాల్. అయితే వివాదం లేకపోతే వేదాంతం వ్యాఖ్యలతో ఈ కేరళా కుట్టి సంచలనం కలిగిస్తోంది. నటిగా ఎంత స్పీడ్‌గా పేరు తెచ్చుకుందో ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ అంతే దూకుడును ప్రదర్శించింది. అంతకంటే వేగంగా విడాకుల విషయంలోనూ తొందర పడింది. ఆ తరువాత వేధింపుల ఆరోపణలు, కారు వివాదం, గ్లామరస్ దుస్తులతో ఫొటోలను ఇంటర్నెట్లకు విడుదల చేయడం, ఇవన్నీ అమలాపాల్ జీవితంలో సంచలనాలే అని చెప్పక తప్పదు. వైవాహిక జీవితం నుంచి బయట పడిన తరువాత నటిగా వేగం పెంచినా, ప్రస్తుతం కెరీర్ కాస్త నత్త నడక నడుస్తోందనే చెప్పాలి. ఈ అమ్మడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేసిన రాక్షసన్ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నా, కొత్తగా అవకాశాలేమీ అమలాపాల్‌కు రాలేదు. అయితే ఆ చిత్ర హీరో రెండో పెళ్లికి సిద్ధం అవుతుందనే వదంతికి మాత్రం కారణమైంది. ఇకపోతే అంతకుముందు అంగీకరించిన ఆడై, అదో అంద పరవై పోల రెండు చిత్రాలే ప్రస్తుతం చేతిలో ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఈ రెండూ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలే కావడం. వీటిలోనూ గ్లామర్ విషయంలో విజృంభిస్తోందనే ప్రచారం హోరెత్తుతోంది. వీటితో పాటు చాలా కాలం తరువాత మాతృభాషలో ఒక చిత్రం చేస్తోంది. మొత్తం మీద అమలాపాల్ హడావుడి తగ్గింది. ఆ కొరత పూర్తి చేయడానికే అన్నట్టుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య అటవీ ప్రాంతానికి వెళ్లి, లుంగీ పైకి బిగించి, మద్యం సీసాను చేత పట్టి తీసుకున్న ఫొటోను సోషల్‌మీడియాలకు విడుదల చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా వేదాల్ని వల్లించేలా సొంత కాళ్లపై నిలబడాలి. అది కూడా లోకం నిన్ను కిందకు తోసినప్పుడు లేచి తలెత్తుకుని నిలబడాలి అనే వ్యాఖ్యలను తన ట్విట్టర్లో పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక కథేంటనే విషయం గురించి ఆరా తీసే పనిలో సినీ వర్గాలు పడ్డాయి. అలా సంబంధం లేని వేదాంత వ్యాఖ్యలతో అమలాపాల్ వారికి పని చెప్పడంతో పాటు మరోసారి వార్తల్లో నానుతోంది. Stand tall, always. Especially, when the world beats you down! 🌟#onyourowntwofeet pic.twitter.com/Q9kaG0utID — Amala Paul ⭐️ (@Amala_ams) 20 December 2018 -
నిన్న హన్సిక.. నేడు అమలాపాల్
సినిమా: ఎదుటి వారికి చెప్పడానికే నీతులు అన్నారో రచయిత. అది అక్షరాలా సత్యం. నిషిద్ధం కాకపోయినా, ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.అందుకు భారీ మొత్తంలో పారితోషికాలు పుచ్చుకుంటారు అది వేరే సంగతి. వారితో చెప్పిస్తే మంచి ఫలితం ఉంటుందనే అలా చెప్పిస్తుంటారు. అయితే అదే పారితోషికం కోసం కొందరు భామలు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల నటి హన్సిక మహా చిత్రంలో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సిగరెట్ పట్టుకుని నోటి నుంచి పొగను సుడులు సుడులుగా వదులుతన్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై వివాదానికి దారి తీసింది. ఆ పోస్టర్ విషయంలో హన్సికపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు నటి అమలాపాల్ మరో వివాదానికి తెర లేపింది. ఇలాంటి వివాదాలు, విమర్శలు ఆ కేరళా కుట్టికి కొత్తేమీ కాదు. ఇటీవలే లుంగీ ఎగ్గటి చేతిలో సారా సీసా పట్టుకుని అడవిలోని మందు బాబుల స్పాట్కెళ్లిన దృశ్యాన్ని అమలాపాల్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి నెటిజన్లకు మస్త్ పని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే అమలాపాల్ ఆ ఫోజ్‌ను ఎంజాయ్ చేసిన వారూ చాలా మందే ఉన్నారనుకొండీ. తాజాగా ఆ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్న మద్యం సీసాతో కనిపిస్తే, ఈ సారి దమ్మారో దమ్ అంటూ పొగ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పైగా తాను కావాలని అలా సిగరెట్ తాగలేదని, ఒక హాలీవుడ్ అభిమాని కోరికను నెరవేర్చడానికి అలా చేశానని సమర్ధించుకుంటోంది. సర్కార్ చిత్ర విషయంలో విజయ్ను, మహా చిత్ర విషయంలో నటి హన్సికను విమర్శలతో ఉతికి ఆరేసిన రాజకీయ పా´ర్టీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు ఇప్పుడు అమలాపాల్‌ను మాత్రం వదులుతారా? అయినా ఇలాంటి సంఘటనలతోనే ఉచిత ప్రచారం పొందాలనుకునే అమలాపాల్ వంటి తారలు విమర్శలను పట్టించుకుంటారా? -
ఇద్దరమ్మాయిలు
సభ్యత, సంస్కారం మరచి కామెంట్లు పోస్ట్ చేసేవారిని, ఇన్‌డీసెంట్ ప్రపోజల్స్ పంపేవారిని చట్టం పట్టుకోడానికి, శిక్షించడానికి సమయం పట్టొచ్చు. అయితే అలాంటి వ్యక్తుల మాటలకు నిశ్చేష్టులు కాకుండా మాటకు మాట ఇవ్వగలిగితే వారితో పాటు, మిగతావారినీ దారిలోకి తేవచ్చు. లేటెస్ట్గా బాలీవుడ్ నటి ఆలియాభట్ మాటకు మాటతో ఒక ‘ఎక్స్ట్రా’ను నోరు మూయించారు. రణ్‌బీర్ కపూర్‌తో ఆమె అఫైర్‌లో ఉందో లేదో తెలుసుకునేందుకు, ‘మిమ్మల్ని మేము ఆలియా కపూర్’ అని పిలవొచ్చా?’ అని ట్విట్టర్ చాట్‌లో హిమాంశు అనే వ్యక్తి చేసిన కామెంట్‌కు ‘మిమ్మల్ని.. నేను హిమాంశు భట్ అని పిలవొచ్చా?’ అని సుతిమెత్తని తిరుగు టపాల్ కొట్టారు ఆలియా. అలాగే గాయత్రి అనే టీవీ నటి స్మూత్ రిప్లయ్‌తో ఒక కుబుద్ధిని ‘ఢమాల్’ మనిపించి మళ్లీ తేరుకోకుండా చేశారు. గాయత్రి ఇచ్చిన ‘టిట్ ఫర్ టాట్’, ఈ ఏడాది ఆరంభంలో అమలాపాల్ ఇచ్చిన ‘షూట్ ఎట్ సైట్’.. సోషల్ మీడియాలో ఈ ఏడాది సంచలనం రేపాయి. గాయత్రి అరుణ్ యువ టీవీ నటి. ఏషియానెట్‌లో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘పరస్పరం’ సీరియల్లో దీప్తీ ఐపీఎస్‌గా ఆమె పోషిస్తున్న పాత్రకు కేరళలో ప్రతి ఇల్లూ పెద్ద ఫ్యాన్. అమ్మాయి కూడా ఒరిజినల్‌గా అందంగా ఉంటుంది. 2014లో ‘పరస్పరం’ సీరియల్‌తో గాయత్రి కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఏడాదే ఏషియానెట్ ‘బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు’ గెలుచుకుంది. గాయత్రికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బ్రేవ్ గర్ల్. ఈ సంగతి ఇటీవలి వరకు ఎవరికీ తెలియదు. బాగా యాక్ట్ చేస్తుంది. నవ్వు చక్కగా ఉంటుంది. ఇంతవరకే తెలుసు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. నన్ను ప్రేమించగలరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకుంటారా? అంటూ వేలకు వేలుగా ఆమెకు ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే ఈ మధ్య నేరుగా ఆమె పర్సనల్ ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ‘నాతో ఒక రాత్రి గడుపుతారా? రెండు లక్షలు ఇస్తాను. ఈ విషయం మన మధ్యే ఉంటుంది’ అన్నది ఆ మెసేజ్. ఆ వెంటనే రెండో మెసేజ్ కూడా వచ్చింది. ‘టూ లాక్స్ జస్ట్ ఫర్ వన్ అవర్’ అని! గాయత్రి షాక్ తిన్నారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తర్వాతి మాట. ముందు వాడికి బుద్ధి చెప్పాలి. ఆమెకు చాలా కోపంగా ఉంది. వెంటనే రిప్లయ్ పెట్టింది. వాడి మెసేజ్‌లను, తన రిప్లయ్‌ని కలిపి డిసెంబర్ 10న ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘ఎంత మంచి రిప్లయ్!’ అని గాయత్రికి ప్రశంసలు మొదలయ్యాయి. ‘వాడిక చచ్చినా.. ఆడవాళ్లకు ఇలాంటి మెసేజ్ పెట్టడు. అంత బాగా బుద్ధి చెప్పారు’ అని మరికొన్ని కాంప్లిమెంట్స్. అయితే గాయత్రి రిప్లయ్ పెట్టి, ‘టిట్ ఫర్ ట్యాట్’ అని మౌనంగా ఉండిపోలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఒక్క గంటకు రెండు లక్షలు ఇస్తానని గాయత్రికి మెసేస్ పెట్టినవాడి పేరు రోహన్ కురియాకోస్. ధైర్యంగా తన పేరు కూడా చెప్పుకున్నాడు. ఇంతకీ మిస్టర్ రోహన్ కురియాకోస్కి గాయత్రి ఇచ్చిన రిప్లయ్ మెసేజ్ ఏంటి? అది చివర్లో చూద్దాం. కేరళలోని అలప్పుళ గాయత్రి జన్మస్థలం. చేర్తాళ ఆమె చదువుకున్న ఊరు. చదువులో ఫస్ట్. ఆటల్లో ఫస్ట్. అభినయంలోనూ ఫస్ట్. స్టేట్ స్కూల్స్ యూత్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా వచ్చింది. డిగ్రీ అయ్యాక ‘కమ్యూనికేటివ్ ఇంగ్లిష్’లో జర్నలిజం చేసింది. తర్వాత ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో కొన్నాళ్లు పని చేసింది. ఇంకో విషయం.. గాయత్రికి పెళ్లైంది. అవును. ఆమె పేరు పక్కన ఉన్న అరుణ్.. ఆమె భర్తే. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఇంకో విషయం. ఆమెకో కూతురు కూడా ఉంది! పేరు కల్యాణి. ఊపిరి సలపనివ్వని షూటింగ్‌లు పూర్తయ్యాకక నేరుగా ఇంటికొచ్చి రిలాక్సేషన్ కోసం కూతురుతో ఆడుకుంటుంది గాయత్రి. ఇవన్నీ కేరళైట్లకు తెలియకుండా ఏమీ లేవు. అయినా అతడెవరో అలాంటి మెసేజ్‌లు పెట్టాడు. ‘ఒక్కరాత్రి నాతో ఉంటావా? ఒక్క గంటలకు రెండు లక్షలు ఇస్తాను’ అని! అందుకు గాయత్రి ఇచ్చిన రిప్లయ్ ‘నేను ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా మీ మదర్ని / సిస్టర్ని గుర్తుపెట్టుకుంటాను. వాళ్లకెలాంటి అవమానం జరగకూడదని ఆ దైవాన్ని ప్రార్థిస్తాను’. హృదయాన్ని టచ్ చేసే రిప్లయ్ ఇది. ఆ రోహన్ నిజంగా మనిషైతే కనుక ఆ రోజంతా ఇంట్లో ఒక్కడే కూర్చొని తలుపులు వేసుకుని ఏడ్చి ఉంటాడు. మరి గాయత్రిని అలా రిప్లయ్ ఇవ్వవలసిన స్థితిలోకి నెట్టిన అతడి మెసేజ్‌లు ఆమె హృదయానికి మరెంత గాయం చేసి ఉంటాయో కదా! అది ఆలోచించాలి ఎవరైనా. సినీతారలు ఒకప్పుడు స్క్రీన్ మీద మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆటోగ్రాఫ్ కావాలని అభిమానులు ఎవరైనా ఉత్తరం రాస్తే, సంతకం ఉన్న ఫొటో ఒకటి తిరుగు పోస్టులో వచ్చేది. అక్కడికే పరమానందం. ఇప్పుడీ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య ఉన్నది ఒక్క మెసేజ్ దూరమే. ఆరాధించేవాళ్లకూ, వాంఛించేవాళ్లకు ఒకే రకమైన సౌలభ్యం ఉండడంతో సెలబ్రిటీలకు మనశ్శాంతి కరువవుతోంది. అవాంఛనీయమైన మెసేజ్‌లకు ఒక చోట చెక్ పాయింట్ ఉంటే మధ్యలోనే అవి ఆగిపోతాయి. ఇక నేరుగా ‘సంప్రదించేవాళ్లకు’ ఐపీసీ సెక్షన్ల ‘గౌరవాలు’ ఎలాగూ ఉంటాయి. చాటున ఉండి ‘మాట’ వేసే వాళ్లకు ‘తిరుగు మాటే’ శిక్ష, సమాధానం. ఏదైనా..విషయమైతే బయటికి రావాలి. అప్పుడే ‘బ్యాడ్ ప్రపోజల్స్’ చేసేవాళ్లకు భయం ఉంటుంది. దీప్తీ ఐపీఎస్ లాంటి అమ్మాయే అమలాపాల్ కూడా! ఈ ఏడాది మొదట్లో అమలాపాల్ విషయంలో జరిగింది. ‘నీతో గడపాలని ఉంది’ అని డైరెక్ట్‌గా ఆమె ప్రాక్టీస్ గదిలోకే వచ్చి అడిగాడు ఒక ఆగంతకుడు. డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్ అది. ప్రాక్టీస్‌కి వెళుతుంటే వెంట పడ్డాడు. ప్రాక్టీస్ రూమ్‌లోకి వెళ్లగానే వెనకే వెళ్లాడు. ప్రాక్టీస్‌కి సంబంధం ఉన్న మనిషి అన్నట్లే ఆమెను మాట్లాడించాడు. చివరికి అన్నాడు.. ‘నాకు చాలా పలుకుబడి ఉంది. ఒక రాత్రికి నాతో గడుపుతావా?’’ అని. ఖిన్నురాలైంది అమలాపాల్. అక్కడికక్కడ ‘షూట్ ఎట్ సైట్’లా ఆమె.. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పేరు అలగేశన్. సెక్షన్ 354ఎ (లైంగిక వేధింపు), సెక్షన్ 509 (అసభ్యకరమైన సంకేతాలు ఇవ్వడం) కింద, మహిళల్ని వేధించడంపై తమిళనాడుకే ప్రత్యేకంగా నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద అతడిపై కేసులు పెట్టారు. అమలాపాల్ దక్షిణాది చిత్రాల కథానాయిక. పుట్టింది కేరళలోని కొచ్చిలో. ఉండడం ఢిల్లీలో. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలన్నిటిలో కలిపి ఇప్పటి వరకు ముప్పై ఐదుకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అవార్డులకైతే లెక్కేలేదు. వయసు ఇరౖ ఏడు. 2014లో తమిళ్ డైరెక్టర్ విజయన్ని పెళ్లి చేసుకున్నారు. 2016లో ఏవో మనస్పర్థలతో విడిపోయారు. ‘పరస్పరం’ సీరియల్లో దీప్తీ ఐపీఎస్లా.. అమలాపాల్ నిజ జీవితంలో తన కుటుంబంలోని పరిస్థితులతో నెగ్గుకు వస్తున్నారు. మధ్యమధ్య.. ఇదిగో ఇలాంటి చికాకులు. -
అమలా ఏమిటీ గోల!
నటి అమలాపాల్ వివాదాస్పద చర్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తుంది. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్ అయిన ఈ కేరళా కుట్టి హీరోయిన్గా ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఏడాది తిరిగొచ్చే సరికి ఆయనతో విడాకులు కూడా తీసుకుని మళ్లీ ఫ్రీ బర్డ్‌లా మారిపోయింది. ప్రస్తుతం నటనపై దృష్టి సారిస్తున్న ఈ జాణ ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిష్ట్రేషన్‌తో వివాదాల్లో ఇరుక్కుంది. ఇక ఇటీవల తననొక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి కలకలాన్ని సృష్టించింది. ఇక సెక్సీ దుస్తులు ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతి నిండా పని చెప్పే అమలాపాల్ మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. తరచూ విహార యాత్రలు చేసే అమలాపాల్, కేరళాలోని అడవీ ప్రాంతాల్లో ఒంటరిగా బైక్‌లో రౌండ్లు కొట్టొస్తుంటుంది. అలాగా తాజాగా కాషాయ రంగు లుంగీని పైకి ఎగగట్టి చేతిలో సీమ సరకు బాటిల్‌ను పట్టి అడవి ప్రాంతంలో ఎనుక్కు తిరిగి చూస్తున్నట్లు ఫొటో తీయించుకుని ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అంతే కాదు లుంగీలకు ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి వ్యక్తి చేపల కూర తింటూ నాటు సారా పట్టేస్తుంటారు. ఈ రోజు బాగా తాగవచ్చు. ఎంజాయ్ చేద్దాం అని పేర్కొంది. అమలాపాల్ ఈ చర్యలకు విమర్శలతో పాటు అభిమానుల నుంచి లైక్‌లు తెగ వస్తున్నాయి. కొందరు లుంగీలో సూపర్‌గా ఉన్నావని అంటే, మరి కొందరు ఏమ్మా అమలాపాల్ ఏమీటీ గోల. ఎందుకు ఇలా తయారయ్యావు? అని ప్రశ్నిస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే ఈ అమ్మడిపై విమర్శల దాడి చేస్తున్నారు. అయితే విమర్శలను ఏనాడు లెక్క చేయని అమలాపాల్‌కు ఆశించిన ఫ్రీ ప్రచారం పొందడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. -
ఆమెతో నాకు పెళ్లా?
సినీ సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇటువంటి వార్తలను కొందరు లైట్ తీసుకుంటే, కొందరు వివరణ ఇస్తుంటారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఓ వార్తపై స్పందించారు. ‘విష్ణు విశాల్, అమలా పాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు’ అని వస్తున్న వార్తలకు విష్ణు స్పందిస్తూ – ‘‘ఆమెతో నాకు పెళ్లా? ఇదొక స్టుపిడ్ న్యూస్. ఏదైనా వార్త రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. లేనిపోని పుకార్లు పుట్టించి, కుటుంబాలను బాధపెట్టడం సరికాదు. ఇకపై దీని గురించి ఎటువంటి వార్తలు రాయకండి’’ అన్నారు. కాగా విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించిన ‘రాక్షసన్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైంది. డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయారు అమలా పాల్. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉన్నారు. -
సైకో థ్రిల్లర్‌కు సై?
ఏదైనా భాషలో హిట్ అయిన చిత్రాన్ని తమ ఆడియన్స్‌కి చూపించాలనుకుంటారు వేరే భాషల ప్రముఖులు. రీమేక్ చేస్తే ‘ఫ్లేవర్’ పోతుందనిపిస్తే అనువదించి, విడుదల చేస్తారు. లేకపోతే రీమేక్ చేస్తారు. ఇప్పుడు నితిన్ ఓ తమిళ సినిమాకు తెలుగు నేటివిటీ దట్టించి రీమేక్ చేయాలనుకుంటున్నారని టాక్. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ రీమేక్ రైట్స్‌ను నితిన్ తీసుకున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ తమిళనాట ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తోంది. కథ, కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నితిన్ నటించాలనుకుంటున్నారట.