
పెరంబూరు: పుదుచ్చేరిలో ఆదివారం జరిగిన మారథాన్‌లో నటి అమలాపాల్ పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం పుదుచ్చేరి, ఆరోవిల్‌లో మారథాన్ నిర్వహించారు. మందిర్ సెంటర్ నుంచి ఉదయం 5.30 గంటలకు మారథాన్ పోటీలు ప్రారంభం అయ్యాయి. 40, 21, 10 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలను చేపట్టారు. ఇందులో తమిళ రైల్వే ఏటీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో రైల్వే పోలీసుల బృందం, మహిళా కమాండర్ బృందం పాల్గొన్నారు. వీరితో పాటు మొత్తం 3 వేల మంది మారథాన్‌ల్లో పాల్గొన్నారు. సంచలన నటి అమలాపాల్ తన మిత్రులతో 21 కిలోమీటర్ల పోటీలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.