మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ | Actress Amala Paul Shares Her Marriage Video With Jagat Desai, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Amala Paul Marriage Video: పెళ్లి వీడియో షేర్ చేసిన అమలాపాల్

Published Tue, Nov 5 2024 7:44 AM | Last Updated on Tue, Nov 5 2024 9:02 AM

Amala Paul Marriage Video Latest

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన గతేడాది రెండో పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా ప్రేమించిన తర్వాత ప్రియుడు జగత్ దేశాయ్‪‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. గత నవంబర్ 5న వివాహం జరగ్గా.. ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా అమలాపాల్ అప్పటి మధుర జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంది. కేరళలోని కొచ్చిలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)

ఈ పెళ్లి వీడియో అంతా బాగానే ఉంది. కాకపోతే అమలాపాల్ పరోక్షంగా తన మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్స్ చేసింది. 'నా జీవితంలో గతంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే వాటి వల్లే ఇతడు నా జీవితంలోకి వచ్చాడు' అని చెప్పుకొచ్చింది. ఈమె జీవితంలో తప్పు అంటే అది దర్శకుడు ఏఎల్ విజయ్‌తో పెళ్లే అనుకుంటా! అలానే జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్‌గా అనిపిస్తుందని కూడా చెప్పింది. అంటే ఇంతకుముందు అలా లేదనేగా!

తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించిన అమలాపాల్.. 2014లో త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత ఏఎల్ విజ‌య్‌ను పెళ్లాడింది. కొంత‌కాలానికే వీరి మ‌ధ్య మనస్పర్థలు రావ‌డంతో విడిపోవ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement