ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్ | Telugu Movies Release On OTT In November 2024 1st Week | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: థియేటర్లలో 9.. ఓటీటీల్లో 23 మూవీస్ రిలీజ్

Published Mon, Nov 4 2024 11:04 AM | Last Updated on Mon, Nov 4 2024 11:11 AM

Telugu Movies Release On OTT In November 2024 1st Week

దీపావళి అయిపోయింది. గతవారం రిలీజైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టేశాయి. ఏకంగా తొమ్మిది మూవీస్ బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి. 'ధూం ధాం', 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో', 'జితేందర్ రెడ్డి', 'బ్లడీ బెగ్గర్', 'జాతర', 'ఈసారైనా', 'రహస్యం ఇదం జగత్', 'వంచన', 'జ్యూయల్ థీఫ్' సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో బ్లడీ బెగ్గర్.. 7వ తేదీన రానుండగా మిగిలినవన్నీ 8వ తేదీన రిలీజ్ కానున్నాయి. కానీ ఒక్కదానిపై కూడా బజ్ లేదు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: నయని రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?)

మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్', 'విజయ్ 69' మూవీస్ మాత్రం అస్సలు మిస్సవొద్దు. వీకెండ్‌లో సడన్‌గానూ కొన్ని రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ సినిమా రిలీజ్ కానుందంటే?

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు)

అమెజాన్ ప్రైమ్

  • సిటాడెన్: హన్నీ బన్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 07

  • వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08

నెట్‌ఫ్లిక్స్

  • లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - నవంబర్ 05

  • లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ సిరీస్) - నవంబర్ 06

  • మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06

  • పెడ్రో పరామో (స్పానిష్ సినిమా) - నవంబర్ 06

  • 10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ‍్యాన్ (టర్కిష్ మూవీ) - నవంబర్ 07

  • బార్న్ ఫర్ ద స్పాట్‌లైట్ (మాండరిన్ సిరీస్) - నవంబర్ 07

  • కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07

  • ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07

  • బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ సిరీస్) - నవంబర్ 08

  • ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08

  • మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 08

  • ద బకింగ్‪‌హమ్ మర్డర్స్ (హిందీ మూవీ) - నవంబర్ 08

  • ద కేజ్ (ఫ్రెంచ్ సిరీస్) - నవంబర్ 08

  • ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 08

  • విజయ్ 69 (తెలుగు డబ‍్బింగ్ మూవీ) - నవంబర్ 08

  • ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 09

  • ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 09

హాట్‌స్టార్

  • ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08

ఆహా

  • జనక అయితే గనక (తెలుగు మూవీ) - నవంబర్ 08

జియో సినిమా

  • డెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 05

బుక్ మై షో

  • ట్రాన్స్‌ఫార్మర్స్ వన్  (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06

(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement