నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..? | Naga Chaitanya And Sobhita Dhulipala Wedding Venue Revealed, Check Out For More Details | Sakshi
Sakshi News home page

Naga Chaitanya-Sobhita Wedding: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?

Published Mon, Nov 4 2024 9:32 AM | Last Updated on Mon, Nov 4 2024 10:00 AM

Naga Chaitanya And Sobhita Dhulipala Wedding Venue

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు.  ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను  కూడా నాగ్‌ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్‌ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.

అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌ కాస్త హర్ట్‌ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement