annapoorna studios
-
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. -
ఒక్క మెయిల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌తో సినిమా ఛాన్స్
చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని చాలామందికి కోరిక ఉంటుంది. టాలెంట్ ఉన్నా కూడా ఛాన్స్‌లు రావడంలేదని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలోని టాలెంట్‌ను గుర్తించి పలు నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నాయి. మీలో ప్రతిభ ఉంటే చాలు అవకాశం ఇస్తామని చిత్ర యూనిట్ నుంచే అధికారికంగా ఈ మధ్య ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.యాక్టింగ్ మీద కోరిక ఉండి ఒక్క ఛాన్స్ వస్తే చాలు తామేంటో నిరూపిస్తామనుకునే వారు ఎలాంటి స్టూడియోల చుట్టూ తిరిగే అవసరం లేదు. అలాంటి వారి కోసమే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ఆఫర్ వెలువడింది. తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త సినిమా కోసం ఆసక్తి ఉన్న నటీనటులు కావాలని ఒక ప్రకటనలో కోరింది. అందుకోసం 'actors@annapurnastudios.com' అకౌంట్‌కు మీ వివరాలతో పాటు ఒక నిమిషం నిడివి గల ఏదైనా సీన్‌కు సంబంధించి వీడియోను కూడా అందులో షేర్ చేయాలని కోరింది. 14 నుంచి 28 సంవత్సరాల వయసున్న యువతీయువకులు కావాలని వారు కోరారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు దూరమయ్యానంటే: వెంకట్ అక్కినేని
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలను నిర్మాతగా నిర్మించారు. ఆ చిత్రాలన్నీ కూడా అన్నపూర్ణ బ్యానర్‌పై నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసత్వాన్ని విజయవంతంగా నాగార్జున కొనసాగిస్తున్నారు. కానీ ఏఎన్నాఆర్ పెద్దాబ్బాయి అమెరికాలో చదువుకుని ఇండియా తిరిగొచ్చారు. కానీ ఆయన మీడియాకు కొంచెం దూరంగానే ఉంటూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. 'నేను, నాగార్జున ఇద్దరం కూడా మొదట ఇండస్ట్రీ వాతావరణంలో పెరగలేదు. మా ఇద్దరికి సినిమా ప్రపంచం అంతగా తెలియదు.. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. దీంతో అప్పట్లో సినిమాల గురించి మా ఇద్దరికీ ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయలేదు. అలా మా చదువులు పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా ఎంట్రీ గురించి కూడా మొదట నేనే నాన్నగారితో మాట్లాడాను. నాగార్జునను హీరోగా చేద్దాం అని చెప్పాను దానికి ఆయన వెంటనే ఓకే అనేశారు. నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు నేను చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. సినిమా వ్యవహారాలు నాకు అంతగా తెలియవు.. ఆ విషయాలపై నాగార్జునకు మంచి అవగాహన ఉంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఎప్పుడూ మేము టచ్‌లోనే ఉంటాము. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్నీ నాగార్జుననే చూసుకుంటున్నాడు.' అని వెంకట్ చెప్పారు. -
మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్.. టాలీవుడ్‌కు ఇదొక వరం లాంటిది. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించాక ఇక్కడ సినిమా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని 1975లో పునాదిరాయి పడింది. అలా ఇక్కడ మన తెలుగు సినిమాకు పునాదిరాయిగా అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది. అది పూర్తి అయిన తర్వాత అక్కడే ఎన్నో సినిమాలకు చెందిన పనులు జరిగేవి.. నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పెద్ద సంస్థ. అందులో ఎంతో మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అధునాతన సాంకేతికతకు ఫిలిమ్ స్కూల్ వంటి ఏర్పాట్లకు అంకురార్పణ చేసిన స్టూడియో ఇది. అవుట్డోర్ సెట్లు, ఇండోర్ అంతస్తులు, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన సేవలను ఈ స్టూడియో అందిస్తోంది. నేడు ఆ స్టూడియో ఈ రేంజ్‌కు చేరుకోవడానికి ప్రధాన కారణం నాగార్జున అక్కినేనితో పాటు అమల, సుప్రియ అనే చెప్పవచ్చు. అయితే సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రామాచారి అనే ఉద్యోగి గురించి నాగార్జున స్పెషల్‌గా చెబుతూ అన్నపూర్ణ స్టూడియో హీరోస్ పేరుతో ఒక వీడియో విడుదల చేశారు. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించాము.. అప్పట్లో నాగేశ్వరరావు గారి దగ్గర చేరిన మొదటి ఉద్యోగి రామాచారినే... 47 ఏళ్లుగా మా వద్ద నిజాయితీగానే పనిచేస్తున్నారని చెప్పడం కంటే మా ఇంట్లో మనిషిలా చేరిపోయాడు అని చెప్పడం కరెక్ట్. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే యాక్టివ్‌గా పనిచేస్తారు. మా డబ్బులు అన్ని ఇనప్పెట్టెల్లో పెట్టి దాని తాళం ఆయనకు ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చని నాగార్జున చెప్పారు. (ఇదీ చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్) ఇక అదే వీడియోలో రామాచారి మాట్లాడుతూ... 'నేను అన్నపూర్ణ స్టూడియోలో చేరిన మొదటి ఉద్యోగిని.. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం. అక్కినేని వారు నన్ను సొంత కుటుంబ సభ్యుడి మాదిరే చూసుకుంటారు. నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏంతో సహాయం చేయడమే కాకుండా నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నాగార్జున గారు ముందు ఉంటారు.' అని ఆయన చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు తాము ఇంత స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా కష్టపడింది ఉద్యోగులే అని నాగార్జున తెలిపారు. వారి వల్లే మేము ఇలా ఉన్నాం అన్నారు. అలాగే తమ ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని ఆయన చెప్పారు. హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అనే సిరీస్ లో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారి గురించి అందరికి తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇంత ప్రత్యేకతను ఇచ్చిన నాగార్జునను సోషల్ మీడియా పలువురు అభినందిస్తున్నారు. -
బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నచ్చదు కానీ.. : రాజ్ తరుణ్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ‘అనుభవించు రాజా’సినిమా ఎలా ఉండబోతుంది? అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ, తండ్రి కొడుకుల సంబంధంతో పాటు విలేజ్ ఎమోషన్స్ కూడా బలంగా ఉన్నాయి. బంగారం క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగా నచ్చింది. ఆ పాత్రను ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేశాం. ప్రేక్షకులకు కూడా ఆ పాత్ర బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీలో సెక్యూరిటీ గార్డుగా చేశారు. ఆ పాత్రకు కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. పొద్దున్న మన గేట్ తీసేది సెక్యురిటే, రాత్రి గేట్ వేసిది సెక్యురిటే. వాళ్ళు నవ్వుతూ పనిచేస్తే ఆ రోజంతా మనకు బావుంటుంది. అలా నవ్వుతూ ఆ జాబ్ చేయడం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తే కోడి పందాలు ఎలిమెంట్స్ కనిపించాయి. మీ నిజ జీవితంలొ కోడిపందాలు వేశారా? లేదు. బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నాకు అస్సలు నచ్చదు. వాటి జోలిని ఎప్పుడు వెళ్లలేదు.వెళ్లను కూడా. సంక్రాంతి కోళ్ళ పందాలు చూశాను. మా సినిమాలో సంక్రాంతి వుంది. ఈ సినిమాలో కోడిని షూటింగ్ కోసం తీసుకొచ్చాం. షూటింగ్ అయిపోయాక ఇంటికి తీసుకెళితే అది తినడం లేదని చెప్పారు. బహుశా దానికి కూడా షూటింగ్ అలవాటైపొయిందేమో (నవ్వుతూ). భీమవరం షూటింగ్ ఎలా అనిపిచింది ? నా కెరీర్ సగం సినిమాలు అక్కడే చేశా. అక్కడ మనుషులు, ఫుడ్ బావుంటుంది. సరదాగా గడిచిపోయింది. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో రెండో సినిమా. తొలి సినిమాకి ఇప్పటికి అతనితో ఎలా అనిపించింది? శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేసినప్పుడు అతను కుర్రాడు. ఇప్పుడు చాలా మెచ్యురిటీ వచ్చింది. చాలా నెమ్మది వచ్చింది. సినిమాని అర్ధం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో సంబంధం? అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే నేను హీరోగా(ఉయ్యాలా జంపాలా మూవీ) పరిచయమయ్యారు. ఇప్పుడు అదే బ్యానర్‌పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం నాగచైతన్య సినిమా చూశారట కదా? అవును. ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు కొన్ని ప్రయోగాలు చేశారు. మళ్ళీ పాత జోనర్ కి వచ్చారు. సేఫ్ గేమ్ అనుకోవచ్చా ? అదేంలేదు. మనం అదీ ఇదీ అని లెక్కలు వేసుకుంటే వర్కౌట్ కాదు. కథ బావుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సినిమాలో వినోదం మీ పాత్ర చుట్టే ఉంటుందా? లేదు, పోసాని, సుదర్శన్, అజయ్ ఇలా చాలా మంది వున్నారు. అన్నీ పాత్రల్లో ఫన్ వుంటుంది. కథంతా నా పాత్ర చుట్టే తిరుతుంది కాబట్టి.. నా కామెడీ కాస్త ఎక్కువగా ఉంటుంది హీరోయిన్ కశిష్‌ఖాన్ గురించి ? తెలుగు రాకపోయిన చాలా బాగా నేర్చుకొని సొంతగా డైలాగులు చెప్పడానికి ప్రయత్నించింది. మంచి మనిషి. షూటింగ్ సమయంలో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. చాలా ప్రశాంతంగా వుంటుంది. కొత్త సినిమా కబుర్లు ఏంటి? స్టాండప్ రాహుల్ రెడీ అవుతుంది. మాస్ మహారాజా సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. మరిన్ని కథలు వింటున్నా. -
చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం’అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్న మామ (నాగార్జున) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్న మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు. ►అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్న మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది. ►రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను. ►సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్డౌన్ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు. ►చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ►ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా. ►ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జునకి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు. ►ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా. ►నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది. ►ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు. ►ఫ్యూచర్లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి. -
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ పెద్దల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాస్టింగ్ కౌచ్ అంశం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకోవటం. వ్యాఖ్యల వెనుక తానున్నానంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం ఉదయం పవన్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన ఫిలిం ఛాంబర్ ఈ రోజు (శనివారం) 10 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా), నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని 24 శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని భావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా సినీ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
సంక్రాంతి బరిలో నాగార్జున..!
పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాలు బరిలో ఉన్నా.. నాగార్జున పోటికి రెడీ అవుతున్నారు. అయితే నాగార్జున బరిలో దిగుతోంది.. హీరోగా కాదు, నిర్మాతగా సంక్రాంతి రేసుకు సై అంటున్నారు కింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారిన రాజ్ తరుణ్ మరోసారి అదే బ్యానర్ లో రంగుల రాట్నం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన చిత్రా శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
సూపర్ స్టార్‌తో మెగాస్టార్
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి దర్శనమివ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం రెడీ అయిన మెగాస్టార్, మహేష్ బాబు, మురుగదాస్‌లతో కలిసి కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ ఫోటోను తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేయగా.. మురుగదాస్.. 'మా సెట్‌ను ఎవరు విజిట్ చేశారు చూడండి' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్‌ల చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా.. అదే స్టూడియోలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూట్ కూడా జరుగుతోంది. దీంతో కాలీ సమయంలో మెగాస్టార్ మహేష్ మూవీ సెట్లో సందడి చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రమణ సినిమాను ఠాగూర్‌గా రీమేక్ చేసిన చిరు, తరువాత మురుగదాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్ సినిమాలో హీరోగా నటించాడు. తన రీ ఎంట్రీ కోసం కూడా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి సినిమానే ఎంచుకున్నాడు. మహేష్‌తో పాటు మురుగదాస్‌తో సాన్నిహిత్యం కారణంగా మెగాస్టార్ సూపర్ స్టార్ సెట్లో సందడి చేశాడు. Look who visited our set today