బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ షో జరుగుతోంది. నేడు (డిసెంబర్ 15) ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విజేతను ప్రకటిస్తారు. దీంతో అక్కడకు భారీగా అభిమానులు చేరుకుంటారని పోలీసులు ముందస్తుగా అంచనా వేశారు.
గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈమేరకు సుమారు 300 మంది పైగానే అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండనున్నారు.
చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్
బిగ్ బాస్ తెలుగు 8కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ రానున్నారని తెలుస్తోంది. వాస్తవానికి అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అర్జున్ చుట్టూ ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటన వివాదంగా మారడంతో ఆయన ఈ షోకు రావడంలేదని చెప్పేశారట.దీంతో అల్లు అర్జున్‌కు బదులుగా బిగ్ బాస్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా రామ్ చరణ్ వచ్చే అవకాశం మెండుగా ఉందని సమాచారం. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షో కోసం అతిథిగా వచ్చారు. ఇప్పుడు చరణ్ వస్తే ఆయన చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment