
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ప్రస్తుతం రామ్ చరణ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు పెద్ది అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్ గ్లింప్స్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా..ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న బుచ్చిబాబు ఓ ఫంక్షన్‌లో సందడి చేశారు. తన సొంతూరులోని ఓ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం అయినా కాకినాడ జిల్లా కొత్తపల్లిలో బుచ్చిబాబు ఓ వేడుకకు హాజరయ్యారు. డైరెక్టర్ రాకతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. పలువురు సన్నిహితులు బుచ్చిబాబుతో ఫోటోలు దిగారు. ఈ వేడుకలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.