Peddi Movie
-
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు.అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్‌ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు. "Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026 -
'పెద్ది' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
-
'ఉప్పెన కంటే ఎక్కువ.. ఆయన లేకపోతే పెద్దినే లేదు'
రామ్ చరణ్ పెద్ది సక్సెస్‌తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు అభిమానులకు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రీమియర్స్ నుంచే నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలైందన్నారు. పెద్ది విజయానికి కారణం రామ్ చరణ్ మాత్రమేనన్నారు. ఉప్పెన కంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పెద్ది క్యారెక్టర్ ఆదర్శమని పలువురు కొనియాడారని తెలిపారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు.. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు.. థ్యాంక్ యూ చరణ్ సార్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీనే పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించగా.. శృతిహాసన్ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రెండో రోజే ‘పెద్ది’కి భారీ షాక్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లో ప్రత్యేక్షమైంది.సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్‌ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. @AlwaysRamCharan Peddi movie is streaming online in some site. Someone has forwarded me the link. I can’t send the link here in public. Let me know where to send so you can ask the concern to restrict the site.— Kiran Surya Nadella (@kiran_nadella) June 5, 2026 -
కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్‌పై సింగర్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్‌గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్ అట్రాక్షన్ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.సుమంగళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌ను షేర్ చేసింది.హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్ సీన్స్‌పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు. -
పెద్ది మూవీపై చిరు సంచలనం వైరల్ గా మారిన ట్వీట్
-
పెద్ది సూపర్ సక్సెస్... ఉపాసనకు దిష్టి తీసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
-
అభిమానుల ఓవరాక్షన్.. ఉపాసన ఆగ్రహం.!
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్‌కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026 -
‘పెద్ది’లో జాన్వీ కపూర్.. శ్రీదేవి ఒప్పుకునేదే కాదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి. అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్‌లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు. After watching Peddi, you can't help but feel pity for Janhvi Kapoor. Sridevi would have never allowed her to act in such B-grade films in the South.#Peddi #PeddiReview #JanhviKapoor pic.twitter.com/F2beJEGaYl— 𝐳𝐚𝐲𝐝 (@MaheshFallout) June 4, 2026There is no need to blacklash her role in #Peddi She did great her part more over some scenes & one song trimed in Movie. And 2nd Half One Emotional is Enough her potentiaI of acting & i accept but for section audience response. But there is no need to negative her #JanhviKappor pic.twitter.com/6MkV7qfuia— 𝐀kh!L Kesana (@AlwaysAkhilK) June 4, 2026 -
మ్యాటినీ తర్వాత పూర్తిగా మారిన పెద్ది రెస్పాన్స్..
-
‘పెద్ది’లో హీరోయిన్‌కి అవమానం.. ఒప్పుకున్న జాన్వీ కపూర్!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలతో నిన్న(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రామ్ చరణ్ నటన, మేకింగ్, రెహమాన్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ.. కథనం, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. దేవర మాదిరే పెద్దిలోనూ జాన్వీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పలు సినిమా వెబ్‌సైట్స్ కూడా తమ రివ్యూల్లో జాన్వీ పాత్ర గురించి నెగెటివ్‌గానే రాసుకొచ్చాయి. అయితే తన గురించి నెగెటివ్‌గా రాస్తూ ఇన్‌స్టాలో పెట్టిన ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ చేయడమే ఇప్పుడు విమర్శకులకు దారి తీసింది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘పెద్ది: భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్‌కి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్‌తో రాసి ఉన్న ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. విమర్శిస్తూ రాసిన రివ్యూను లైక్ చేసిందంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుందంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తే.. మరికొంత మంది ఏమో పొరపాటును ఆమె లైక్ కొట్టిందేమోనని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పోస్ట్ వైరల్ కావడం.. పెద్దిపై విమర్శలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. అయితే ఈ లోపే ఆమె లైక్ కొట్టిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించింది. అయితే అసలు కథలు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. నిడివి కూడా తక్కువే ఉంటుంది. నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఇక పెద్ది విషయానికొస్తే..టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. అదే తంతు
'పెద్ది' సినిమా బాగుందా? బాగోలేదా? ఎన్ని కోట్లు కలెక్షన్స్ వస్తాయనేది ఇక్కడ విషయం కాదు. ఒక మంచి ఉద్దేశం లేదా మంచి పాయింట్‌తో మూవీ తీద్దామనుకున్నప్పుడు అందులో ప్రతి విషయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పంటి కింద రాళ్లలా అనవసర సీన్స్ ఉండకూడదు. అలా కాకుండా కమర్షియల్ పేరిట నచ్చిన అంశాలు నచ్చినట్లు పెట్టేస్తే మంచి కంటే మిగతా విషయాలే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు 'పెద్ది' విషయంలో అదే జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'పెద్ది' సినిమాలో ఊరి గుర్తింపు కోసం ఓ కుర్రాడు ఎంతవరకు వెళ్లాడు అనే అంశాన్ని చూపించాలనుకున్నారు. అదే చూపించారు కూడా. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ హీరోయిన్ పాత్ర తీరుతెన్నులే అత్యంత దారుణంగా ఉన్నాయి. సినిమా చూసిన చాలామంది ఇదే అంటున్నారు. అందచందాల ప్రదర్శన తప్పితే జాన్వీ చేసిందేం లేదు. దీని కోసమే జాన్వీని తీసుకున్నారా అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో పాత్ర.. అనుమతి లేకపోయినా సరే హీరోయిన్‌కి ముద్దు పెడతాడు. పైగా దానిని రొమాన్స్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు.. జనాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పైగా 'పెద్ది' సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే సదరు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? సదరు సన్నివేశాలపై వీళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది సెన్సార్ బోర్డ్, హీరో, దర్శకనిర్మాత కచ్చితంగా ఆలోచించాలి.జాన్వీ కపూర్లోనూ నటి ఉండొచ్చు. తెలుగు దర్శకులు మాత్రం ఆమెలోని నటి కంటే గ్లామర్‌నే చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ 'దేవర'లోనూ గ్లామర్ షో తప్పితే మరొకటి చేయలేదు. కనీసం 'పెద్ది'లోనైనా కాస్తంత గుర్తింపు ఉన్న పాత్ర చేస్తుందనుకుంటే ఇందులోనూ అదే తంతు. కావాలనే ఈమెతో దర్శకులు అలా చేయిస్తున్నారా? లేదంటే అన్ని తెలిసే జాన్వీ ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకొంటుందా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇదే కొనసాగితే మాత్రం జాన్వీ.. టాలీవుడ్లో ఎక్కువ రోజులు నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?) -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్‌గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్‌లో పెద్ది రాంచరణ్‌లా.. రియల్ లైఫ్‌లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్‌తో క్రీడారంగంలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా.. రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్‌లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్‌లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్‌గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్‌గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్‌పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్‌లోనూ అతను అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్‌ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్‌లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్‌లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్‌కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్‌లో కొత్త స్టార్‌గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం బాగుందని అంటున్నారు గానీ మిగతా విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు కళ్లు చెదిరే కలెక్షన్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: రాఘవ లారెన్స్‌కి కూతురుందా? ఇప్పుడామె కూడా ఇండస్ట్రీలోకి)'పెద్ది' మూవీకి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. తద్వారా 'ఆర్ఆర్ఆర్' తర్వాత తొలిరోజే వందకోట్ల మార్క్‌ని చరణ్ మరోసారి అందుకున్నట్లయింది. 1980ల నాటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఊరికి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ సాధారణ యువకుడు ఎంతవరకు వెళ్లాడు? అనే అంశంతో మూవీ తీశారు.'పెద్ది' విషయానికొస్తే.. అది 1990ల కాలం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు. 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు.గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు పెద్ది వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ని ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్‌పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్‌కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026 -
'నా బాడీ గార్డ్‌ను బయటికెళ్లకుండా చేశారు'.. రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్‌లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్‌లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్‌కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్‌ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నారు. కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. -
పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
పెద్దిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్‌తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో వీక్షించిన సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్ నుంచి బయటికి వస్తున్న సందీప్‌ను అక్కడే ఉన్న కొందరు అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Sensational director Sandeep Reddy Vanga snapped at AMB Cinemas, Hyderabad after watching the special screening of Ram Charan's #Peddi!#SandeepReddyVanga #RamCharan #PeddiMovie #AMBCinemas pic.twitter.com/r1dmMAovhq— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 4, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్‌లతో అభిమానులు ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
‘పెద్ది’పై చిరంజీవి రివ్యూ.. గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది చిత్రం థియేటర్స్‌లో సందడి చేస్తోంది. నిన్న(జూన్ 3) రాత్రి ప్రీమియర్ షో నుంచే మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్‌కి పోటెత్తారు. ఒక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సినిమా చూసి..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు సినిమాపై స్పందించాడు. ఎక్స్ వేదిగా ‘పెద్ది’పై తనదైన శైలీలో రివ్యూ ఇస్తూ.. ‘తండ్రిగా, నటుడిగా చరణ్ చూసి గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబుకి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన రెహమాన్‌కి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన కొల్లా అవినాష్, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. -
Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. బ్లాక్ బస్టర్
-
సీన్ రివర్స్.. పూర్తిగా మారిపోయిన పెద్ది పబ్లిక్ టాక్!
-
‘పెద్ది’ గాడి మాస్ ఎంట్రీ.. థియేటర్స్‌లో పేపర్లు ఎగరేసిన ఉపాసన
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం పెద్ది థియేటర్స్‌లో సందడి చేస్తోంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే నిన్న(జూన్ 3) రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మెగా అభిమానులంతా థియేటర్స్‌కి పోటెత్తారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న రాత్రే సినిమా చూశారు. హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న విమల్ థియేటర్స్‌లో అభిమానుల మధ్య ఉపాసన తన స్నేహితులతో కలిసి సినిమా వీక్షించారు. పెద్ది పాత్ర ఎంట్రీ కాగానే ఫ్యాన్స్‌తో కలిసి పేపర్లు ఎగరేస్తూ, ఆనందంతో గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక మెగా అభిమానులు అయితే రాత్రి నుంచే నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సినిమా చూసిన వారిలో చాలా మంది చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. రెహమాన్ బీజీఎంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ మొత్తంలో ఇప్పుడు పెద్ది గురించే చర్చ కొనసాగుతోంది. మరి కలెక్షన్ల పరంగా పెద్ది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES— justin telugu (@JustinTelu59343) June 3, 2026 -
పెద్ది రిలీజ్..తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ
పెద్ది రిలీజ్ సందర్భంగా సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, జాన్వీ కపూర్, రామ్ చరణ్ జంటగా నటించిన పెద్ది చిత్రం ఈ రోజు (జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథ బాగున్నప్పటికీ.. కథనం ఊహకందేలా ఉండడం మైనస్ అని చెబుతున్నాయి. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు.ఇక ఏఆర్ రెహమాన్ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేపథ్యం సంగీతం కొత్తగా ఉందని... అదే సినిమా స్థాయిని పెంచిందని కామెంట్ చేస్తున్నారు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Tirumala, Andhra Pradesh: Actor Janhvi Kapoor visited the Tirumala temple and offered prayers at the revered shrine.#JanhviKapoor #Tirumala #Tirupati #AndhraPradesh #CelebrityUpdate pic.twitter.com/hriHzRfDu6— Rohit (@Rohit6156585804) June 4, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
Watch Live: పెద్ది సినిమా పబ్లిక్ టాక్
-
పెద్దితో ఇండస్ట్రీ అన్ని రికార్డులు బద్దలు!
-
పెద్ది చూస్తూ.. పేపర్స్ విసురుతూ..! థియేటర్లో ఉపాసన హంగామా
-
నా అల్లుడికి ఆస్కార్ పక్కా.. పెద్ది పై రామ్ చరణ్ అత్త రియాక్షన్
-
ఏంటి బుచ్చి ఇది..పెద్ది ప్రీమియర్స్ Public Talk
-
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులునిర్మాత: సతీష్ కిలారుసమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్రచన-దర్శకత్వం: బుచ్చిబాబుసంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: జూన్ 4, 2026గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రం ‘పెద్ది’. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అదించిన తెలుగు చిత్రం ఇదే కావడం మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు, ఆసక్తికి దీటుగా ఈ చిత్రం ఉందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూ(Peddi Review)లో చూద్దాం.కథేంటంటే..1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్‌తో తెరపై ఎంట్రీ ఇచ్చి, కుస్తీతో ఆకట్టుకొని, అథ్లెట్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. మూడు విభిన్నమైన క్రీడల్నీ తీసుకున్న బుచ్చి బాబు.. వీటి మధ్యలో ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహకందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్. అయితే రామ్ చరణ్ నటన, రెహమాన్ నేపథ్య సంగీతం ఆ మైనస్‌ని కొంతవరకు కప్పిపుచ్చాయనే చెప్పాలి.2016లో కథ ప్రారంభం అవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కి కేవలం 2 ఓలింపిక్స్ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్ అవ్వడం.. వచ్చే పోటీల్లోపు మెరికాల్లాంటి కుర్రాళ్లను తయారు చెయమని ఆదేశించడం.. ఓ అధికారి(బోమన్ ఇరానీ) విజయనగరం రావడం.. అక్కడ పెద్ది పేరు విని..అతని గురించి తెలుసుకునేందుకు ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్ ఇస్తూ.. స్టోరీని ప్రారంభిస్తాడు. అయితే కేజీయఫ్ తర్వాత ఇలా హీరో కథని ఎలివేషన్ ఇస్తూ, ముక్కలు ముక్కలుగా చెప్పడం రొటీన్‌గా మారింది. అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా అనిపించదు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్లో సిక్సర్ కొడతాడో.. అప్పటి నుంచి కథనం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే.. మరోవైపు అప్పల సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి.. అసలు సంఘర్షణ ఏంటనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చీయమ్మగా జాన్వీ ఎంట్రీ, ఎన్నికల ప్రచారం.. ముద్దు సీన్.. ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఈమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమెషనల్‌గా సాగుతాయి. పోలీస్ స్టేషన్ సీన్‌తో హీరో మెయిన్ ట్రాక్ ఎక్కుతాడు. ఇంటర్వెల్ సీన్ ని దర్శకుడు చక్కగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు.. సెకండాఫ్‌ని మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ అన్ని ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్.. ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమి ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఇది. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్..ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు. అయితే ప్రమోషన్స్‌లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్‌కుమార్ న్యాయం చేశాడు. ఇక అచ్చియమ్మగా జాన్వీ కపూర్ తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథకి ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. హీరోయిన్ అన్నాక కథకు కొంత లింకు చేయాలి అన్నట్లుగా.. కొంతవరకు అలా చూపించారంతే. రామ్ బుజ్జిగా దివ్యేందుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్‌తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్లో చూడనుందంటే?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా చూసేందుకు మెగా ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి.ఈ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రానుంది. బాలానగర్‌లో విమల్ 70ఎంఎం థియేటర్లో ఆమె పెద్దిని వీక్షించనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఉపాసనతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కానున్నారు. పెద్ది కోసం గ్రాండ్‌గా సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం పెద్దిని వీక్షించనున్నారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
పెద్ది ఫస్ట్ రివ్యూ.. అంచనాలు పెంచేసిన సమంత
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం ఈ రోజు(జూన్ 3) రాత్రికే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే అప్పుడే రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందో తెలియదు కానీ.. సినిమా సూపర్, రామ్ చరణ్ నటన అదిరిపోయిందంటూ ఎక్స్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటన అదరగొట్టేశాడని సెన్సార్ సభ్యులు అన్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింటని చెప్పారట. అంతేకాదు జాన్వీ కపూర్, జగపతి బాబు నటనపై కూడా ప్రశంసలు కురిపించారట.#Peddi అందరూ రామ్ చరణ్ గురించే మాట్లాడుతున్నారు..అయితే ఓ సీన్ లోజాన్వి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తుంది..విజిల్స్ వేయిస్తుంది— devipriya (@sairaaj44) June 3, 2026మరోవైపు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ..పెద్దిపై హైప్ క్రియేట్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సమంంత మాట్లాడుతూ.. 'నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది టైమ్. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరచబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఈ సినిమాలో బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ తన శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌తో పాటు పలువు టాలీవుడ్ హీరోలు కూడా పెద్ది టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేశారు. INSIDE REPORTS:#PEDDI seems to be a film that will connect more strongly with South Indian audiences. The emotions, setting, and mass moments feel very rooted, making it a proper big-screen experience. 🔥— Cɪɴᴇ Hᴜɴɢᴀᴍᴀ (@Cinehungamaa) June 3, 2026 -
మీ అభిమానం సల్లగుండా.. పెద్ది కోసం రూ.2 లక్షల ఖర్చు..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా పెద్ది మానియా కనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్‌లో పెద్ది దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మూవీపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.ఈ సినిమాకు ఫ్యాన్స్ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ ఉన్నారు. పెద్ది కోసం ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఇద్దరు జపనీస్ మహిళ అభిమానులు భాగ్యనగరానికి చేరుకున్నారు. పెద్దిని చూసేందుకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు చేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెద్ది సినిమాను 3 రోజుల్లో 10 సార్లు చూడాలన్నదే ఆశయమని చెబుతున్నారు. తెలుగు భాష రాకపోయినా కేవలం అభిమానంలో జపాన్ నుంచి ఇండియాకు రావడమంటే మాటలు కాదు. ఇది చూసిన కొందరు ఖరీదైన అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. -
'పెద్ది'.. రూ.100 టికెట్ రూ.420
'పెద్ది' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, ఓవర్సీస్లో రెండు మూడు రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం రిలీజ్‌కి కొన్ని గంటల ముందు తెరిచారు. ఇక తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంచుకోవచ్చని పేర్కొన్నారు. కానీ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం ఒక్కో టికెట్ రూ.420 ఉండటం షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?)హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70ఎమ్ఎమ్ థియేటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ థియేటర్లో రిలీజ్ రోజు నుంచి రెగ్యులర్ షోల కోసం టికెట్ రూ.420 అన్నట్లు బుక్ మై షోలో చూపించింది. మిగతా సింగిల్ స్క్రీన్లలో సెకండ్ క్లాస్ టికెట్ పెంపుతో కలిపి రూ.150 రూపాయలు ఉంటే దేవిలో మాత్రం రూ.420 ఉంది. దీంతో పలువురు నెటిజన్లు ఈ పెంపుపై విమర్శలు చేస్తున్నారు.ఎందుకంటే ఏఎంబీ, ఏఏఏ లాంటి మల్టీప్లెక్స్‌ల్లో రూ.420, దేవి లాంటి సింగిల్ స్క్రీన్‌లోనూ రూ.420 టికెట్ రేటు ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే సినిమాపై బజ్ బాగానే ఉంది గానీ ఈరోజు రాత్రికల్లా అసలు టాక్ ఏంటనేది బయటకొస్తుంది. అప్పుడు టికెట్ సేల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపించడం గ్యారంటీ.'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా) -
పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్‌తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
‘పెద్ది’ విజయం.. వీరికి చాలా కీలకం
మరికొన్ని గంటల్లో పెద్ది(Peddi) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పెద్దితో టాలీవుడ్‌కి పెద్ద విజయం వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విజయంపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. కొంతమందికి అయితే ఈ సినిమా విజయం చాలా అవసరం. వారిలో మొదటి వరులో ఉన్నది హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాతో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు రామ్ చరణ్ ఆశలన్నీ పెద్ది పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయంపైనే చరణ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్ది సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ తీసుకొస్తే.. పాన్ ఇండియా మార్కెట్లో చరణ్ వ్యాల్యూ పెరిగిపోతుంది. అతని పారితోషికం పెరగాలన్నా.. పాన్ ఇండియా స్టార్స్‌తో పోటీలో నిలవాలన్నా పెద్ది విజయం చరణ్‌కు చాలా అవసరం.ఇక దర్శకుడు బుచ్చిబాబుకు కూడా పెద్ది హిట్ అత్యంత కీలకమనే చెప్పాలి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు. రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం బుచ్చిబాబు అదృష్టం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం సాధిస్తేనే బుచ్చిబాబు కెరీర్ బాగుంటుంది. తర్వాత కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయి. బోల్తా పడితే మాత్రం ఆ నింద ఎక్కువగా బుచ్చిబాబుపైనే పడుతుంది. ఆయన కెరీర్‌కి ఈ సినిమా చాలా కీలకం.వీరితో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్‌కి కూడా పెద్ది హిట్ చాలా అవసరం. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా..తొలి సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. తెరపై కనిపించింది కూడా చాలా తక్కువే. పెద్దిలో అచ్చియమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలనుకోంటోంది. సినిమా హిట్ అయితేనే ఆమె పాత్రకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాత వెంకట సతీష్‌కి కూడా పెద్ది విజయం చాలా కీలకం. ఆయన నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఓ రకంగా ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. చరణ్ సినిమా కాబట్టి హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్‌తో పాటు నిర్మాతగా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇలా భారీ ఆశలతో వస్తున్న పెద్ది సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. -
రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా
మరికొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, విదేశాల్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేయగా తెలంగాణలో మాత్రం ఇంకా సమస్య తీరలేదు. ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణలో జీవో వచ్చినా గానీ ఆన్లైన్లో బుకింగ్స్ మాత్రం పూర్తిస్థాయిలో ఓపెన్ అవ్వలేదు. అయినా సరే ప్రీ సేల్స్‌లో మంచి నంబర్లే కనిపిస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది'కి ప్రీ సేల్ వసూళ్లు ఎంతొచ్చాయి? తెలంగాణలో సమస్య ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'పెద్ది'కి ఎలాగైనా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు కొన్నిరోజుల క్రితం పట్టుబట్టుకుని కూర్చున్నారు. నిర్మాతలు, చిరంజీవి, తెలుగు ఫిలిం ఛాంబర్‌తో వరస చర్చల కారణంగా ఈ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే మంగళవారం.. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి జీవో కూడా వచ్చేసింది. అయితే పీవీఆర్ యాజమాన్యంతో అగ్రిమెంట్ విషయంలో ఏదో సమస్య నడుస్తోందని, అందుకే ఇంకా సదరు థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. మిగతా చోట్ల కూడా త్వరలోనే ఓపెన్ చేయనున్నారు.'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మిగతా దేశాల్లో బుకింగ్స్ పర్లేదనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతానికి నంబర్లన్నీ బాగానే ఉన్నాయి గానీ ఈరోజు రాత్రికి పడే ప్రీమియర్లతో టాక్ ఏంటనేది బయటకొస్తుంది. దానిబట్టి బుకింగ్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన 'పెద్ది'లో రామ్ చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపించబోతున్నాడు. అంటే క్రికెట్ ఆడతాడు, కుస్తీ చేస్తాడు, రన్నింగ్ కూడా చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?) -
తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు
-
ప్రస్తుతానికి ఆ భాషలో నటించాలనుకోవడం లేదు
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. బాలీవుడ్లో ఇప్పటికే పలు మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన తల్లి శ్రీదేవిలా దక్షిణాది సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకోవాలనేది ఈ బ్యూటీ కోరిక. అలా ఇప్పటికే తెలుగులో 'దేవర'లో చేసింది. పరం సుందరి'లో మలయాళీ అమ్మాయిలా నటించింది. ఈమె నటించిన 'పెద్ది' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీనిపై చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పొచ్చు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది భాషల గురించి, మరీ ముఖ్యంగా మలయాళ భాష గురించి జాన్వీ తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?)మలయాళ భాష చాలా అందమైనది, మధురమైనది. అయినా నాకు చాలా కష్టమైనది. అందుకే ప్రస్తుతానికి మలయాళ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. మలయాళం కంటే తెలుగు, తమిళ భాషలు నాకు కొంచెం పరిచయం ఉన్నవిగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. తమిళ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే జాన్వీ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు) -
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
-
తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ హిట్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ కానుందని ఇప్పటికే ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనున్న విషమం తెలిసిందే.ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట ఈ సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆ పాటను సినిమాలో రీమిక్స్ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్ చేసేశామని బుచ్చిబాబు తెలిపారు. -
ఏపీలో టికెట్ ధరల పెంపు.. తెలంగాణలో పెద్ది పరిస్థితేంటి?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది ప్రీమియర్స్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే ప్రీయమర్ షోలు షురూ కానున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ది మూవీపై అంచనాలు ఓ రేంజ్‌కు దూసుకెళ్లాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఇక తెలంగాణ విషయానికొస్తే పెద్ది టికెట్ ధరల పెంచేందుకు అనుమతులు రానట్టేనని తెలుస్తోంది. టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రేపటిలోగా ఎలాంటి ప్రకటన రాకపోతే సాధారణ రేట్లతోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని పెద్ది టీమ్ భావిస్తోంది. దీంతో రేపటి నుంచే తెలంగాణలో పెద్ది మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభించే అవకాశముంది. మరోవైపు పెద్ది ప్రీమియర్స్ సైతం తెలంగాణలో లేనట్టేనని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. -
పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు
‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..‘పెద్ది’ ఎలా మొదలైంది?నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా కదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?ఇందులో హీరో క్రికెట్‌తో పాటు మరో రెండు ఆటలు కూడా ఆడతాడు. దాని కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం.క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.పెద్ది విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.‘పెద్ది’ కథ ముందు ఎన్టీఆర్ కోసం రాసుకున్నారా?లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం తయారు చేసిన కథ.చరణ్ ని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్ ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుంది?జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.శివరాజ్ కుమార్, జగపతి బాబు పాత్రల గురించి చెప్పండిఇందులో శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.రెండో సినిమాకే రూ. 350 కోట్ల బడ్జెట్.. ఎలా అనిపిస్తోంది?ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.ఏఆర్ రెహమాన్ గారి గురించి?నాకు రోజా, బొంబాయి.. రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు ‘పది కేజీఎఫ్‌లతో సమానం’ అన్నారు. మరి పెద్ది గురించి?పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు(నవ్వుతూ..)షూటింగ్ సమయంలో చరణ్‌కు చాలా గాయాలయ్యాయని విన్నాం?అవును. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి?పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మైండ్బ్లోయింగ్గా అనిపించింది.క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెప్పారు.చిరంజీవి గారు సినిమా చూశారా?-ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. -
‘పెద్ది’ ట్రైలర్‌కు యావరేజ్ టాక్, కారణం ఇదే : బుచ్చిబాబు
పెద్ది సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే ఉంది. రామ్ చరణ్ లుక్ రిలీజ్, గ్లింప్స్‌తో పాటు పాటలు కూడా ఆ అంచనాలు భారీగా పెంచాయి. అయితే ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్మీట్లో బుచ్చిబాబు దగ్గర ప్రస్తావించాడు ఓ విలేకరి. దానికి బుచ్చిబాబు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.‘కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుంది. అందుకే ట్రైలర్‌ని అలా కట్ చేశాం. అసలు కంటెంట్‌ని తీసుకోలేదు కాబట్టి.. ట్రైలర్లో చెప్పాల్సినంత చెప్పలేకపోయాం. అయితే ఒకప్పుడు ఘన విజయం సాధించిన చిత్రాల ట్రైలర్లన్నీ యావరేజ్ టాకే సంపాదించుకున్నాయి(నవ్వుతూ..). ఈ లెక్కన పెద్ది కూడా సరైన దారిలోనే వెళ్తుందేమో అనిపిస్తుంది’ అని బుచ్చిబాబు అన్నారు. ఇక రిలీజ్ దగ్గరపడుతున్నకొద్ది తనకు టెన్షన్ ఎక్కువైపోయిందన్నారు. మరికొన్ని గంటల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుందని, హిట్ టాక్ వస్తే హ్యాపీగా ఫీలవుతానని బుచ్చిబాబు చెప్పారు. ఇక తన కొత్త సినిమాల గురించి చెబుతూ..అల్రెడీ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. మూడో సినిమా ఎన్టీఆర్తోనే చేస్తారా అని అడగ్గా.. ‘ఆయన టైమ్ ఇవ్వాలనే కానీ క్షణాల్లో వెళ్లి కథ చెబుతా’ అన్నారు. -
రామ్ చరణ్ కంటికి గాయం.. చిరంజీవి ఏమన్నారంటే..: బుచ్చిబాబు
‘పెద్ది’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పలు సార్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అవన్నీ బయటకు రాలేదు కానీ..కంటికి గాయమైన విషయం మాత్రం క్షణాల్లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడు ఆందోళ చెందారు. చివరకు చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆందోళన చెందాడట. అంతేకాదు ఈ విషయం చిరంజీవికి తెలిస్తే ఎంత తిడతాడేమోనని భయపడ్డాడట. కానీ చిరంజీవి మాత్రం ఒక్కమాట కూడా అనలేదని బుచ్చిబాబు చెప్పాడు.తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రామ్ చరణ్ కంటికి గాయం ఎలా గాయం అయిందో వివరించాడు. ‘ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. కింద ఉన్న ఫైటర్ ఒక్కసారిగా లేవడంతో పైన ఉన్న చరణ్ కంటికి దెబ్బతాకింది. చాలా రక్తం పడిపోయింది. భయపడిపోయా. ఈ విషయం చిరంజీవి తెలిస్తే ఎంత తిడతాడేమోనని టెన్షన్ పడ్డా. భయంతోనే చిరంజీవికి కాల్ చేసి మాట్లాడా. అయితే ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘ఆ వీడియో ఉంటే పంపు బుచ్చిబాబు’ అన్నాడు. అది విని నేనే షాకయ్యా’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. -
'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?
టాలీవుడ్ ఊపిరి పీల్చుకునే టైమొచ్చేసింది. ఎందుకంటే 'పెద్ది' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'తో వచ్చి హిట్ కొట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరిగా ఆడలేదు. మోస్తరు కలెక్షన్స్‌తో మమా అనిపించినవి ఒకటో రెండో ఉన్నాయంతే. అందుకే ఇప్పుడు అందరూ 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయి? బడ్జెట్ ఎంత? వసూళ్లు ఎంత రావాలి?'ఉప్పెన' అనే ఒకే ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబు 'పెద్ది' తీశాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు.. ఈ స్క్రిప్ట్ తొలుత ఎన్టీఆర్ దగ్గరకెళ్లి వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. కానీ దీన్ని చరణ్ కోసమే రాసుకున్నానని ప్రమోషన్లలో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అంతా రిలాక్స్ అయిపోయారు.మొదటగా వచ్చిన గ్లింప్స్ నుంచి లేటెస్ట్గా రిలీజైన 'మస్సా మస్సా' పాట వరకు ప్రతిదానికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హీరోహీరోయిన్, సహయనటులు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఎవరిని కదిపినా సరే ఆహాఓహో అనే రేంజులోనే 'పెద్ది' గురించి చెబుతూ వచ్చారు. హీరో రామ్ చరణ్ అయితే మగధీర, ఆర్ఆర్ఆర్ చిత్రాలని మించి ఇది ఉంటుందని అన్నాడు. దీంతో అభిమానులు గట్టిగానే అంచనాలు పెంచేసుకున్నారు.సగటు ప్రేక్షకుల్లో మాత్రం 'పెద్ది'పై యావరేజ్ అంచనాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు ఆడియెన్స్ గత కొన్నేళ్లుగా చూసుకుంటే చాలా కాలిక్యులేటెడ్‌గా థియేటర్లకు వెళ్తున్నారు. 'పెద్ది'కి కూడా పాజిటివ్ టాక్ వస్తేనే వెళ్తారు తప్పితే స్టార్ హీరో సినిమా కదా అని వెళ్లిపోరు. ఎందుకంటే స్కూల్స్ మొదలయ్యే సమయమిది. పిల్లలకు అవసరమైన బుక్స్, బ్యాగ్స్ లాంటి వాటికి మధ్య తరగతి తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి టైంలో 'పెద్ది' వైపు చూడాలంటే కచ్చితంగా అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది. మరి దీన్ని ఈ సినిమా ఏ మేరకు నిలబెట్టుకుంటుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.మరోవైపు టాలీవుడ్ కూడా 'పెద్ది'పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత నుంచి థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎగ్జిబిటర్లు, బయ్యర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరిలో జోష్ రావాలంటే 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్ కావాల్సి ఉంటుంది. దీనికి రూ.350 కోట్ల బడ్జెట్ అయిందని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు.. విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్లకుపైనే జరిగింది. అంటే కనీసంలో కనీసం రూ.500-600 కోట్లకు మించి కలెక్షన్ రావాలి. అప్పుడే నిర్మాత, ఎగ్జిబిటర్లు అందరూ లాభాలు అందుకుంటారు. అలా జరగాలంటే ఉత్తరాదిలో దీనికి అద్భుతమైన టాక్ రావాలి!విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. పెద్ది అనే క్రాస్ ఓవర్ అథ్లెట్.. అంటే క్రికెట్, కుస్తీ, రన్నర్‌గా కనిపిస్తాడు. ట్రైలర్ బట్టి, దర్శకుడు చెప్పిన దానిబట్టి చూస్తే మాస్ మూమెంట్స్ కంటే బలమైన ఎమోషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏఆర్ రెహమాన్ అందించిన చికిరి చికిరి, రయ్ రయ్ రారా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు టేకింగ్‌పైనా అందరికీ నమ్మకముంది. అందుకే 'పెద్ది' చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. -
మీ కోసం కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం.. రామ్ చరణ్ భావోద్వేగం..
-
తెలుగు ఆడియన్స్ గురించి మా అమ్మ ఒక్కటే చెప్పింది..
-
పెద్దిలో మాస్ డైలాగ్ చెప్పిన జగపతి బాబు
-
చరణ్ ఇంత కష్టపడ్డాడా? 'పెద్ది' క్రేజీ సాంగ్
'పెద్ది' మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. రేపు(జూన్ 03) రాత్రికి ప్రీమియర్లు పడబోతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విజయవాడలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే మూవీలో క్రేజీ సాంగ్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. రామ్ చరణ్.. అథ్లెట్‌లా కనిపించేందుకు ఎంతలా కష్టపడ్డారో ఈ పాటలో చూపించారు.(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)'మస్సా మస్సా' అంటూ సాగే ఈ గీతానికి సంబంధించి కొన్నిరోజుల ముందు కేవలం ఆడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడు లిరికల్ వీడియోని కూడా వదిలారు. ఇందులో కుస్తీ వీరుడిగా ఎంతలా కష్టపడ్డాడు? చెమటోడ్చాడు అనేది ఇందులో చూపించారు. ఇకపోతే ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్) -
విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్‌గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్‌లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్‌ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్‌ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్‌లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.టికెట్ బుకింగ్స్ ఓపెన్..ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 ఉండగా.. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. -
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. దీంతో పాస్‌లు పొందిన ఫ్యాన్స్ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఐదున్నర గంటలకే గేట్లు మూసేయడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.దీంతో పెద్ది సినిమా రిలీజ్ ఈవెంట్ వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పాసులు ఉన్నవారిని అనుమతించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ పాసులు తీసుకుని వివిధ జిల్లాల నుంచి అభిమానులు విజయవాడ చేరుకున్నారు. తిరుపతి, నెల్లూరు వంటి సుదూరప్రాంతాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియం ఫుల్ అయిపోందంటూ పోలీసులు అభిమానులను అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులతో అభిమానుల వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. -
‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్ పాత్రలో చరణ్ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్కి కంటెంట్‌ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
టాలీవుడ్ చాలా బెటర్.. దీపికకు జాన్వీ ఇన్‌డైరెక్ట్ కౌంటర్
సినిమా ఇండస్ట్రీలో 'పనిగంటలు' అనేవి గత కొన్నాళ్ల నుంచి హాట్ టాపిక్ అయిపోయాయి. టాలీవుడ్లో వర్కింగ్ టైం సెట్ కాకపోవడం వల్లే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలని వదులుకుందనే రూమర్స్ ఉన్నాయి. అయితే దీపికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా స్పందించింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)'బాలీవుడ్ కంటే టాలీవుడ్ వర్క్ కల్చర్ సూపర్. ఇక్కడ పనిగంటలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో అందరూ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా వరకు నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పనిచేయలేదు. అదే ముంబైలో అయితే ఒక్కో నిర్మాణ సంస్థ ఒక్కోలా పనిచేస్తుంది. అక్కడ పనిగంటల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమయపాలన సరిగా ఉండదు''రాత్రి షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్లో స్పష్టమైన ప్లానింగ్ ఉంటుంది. తెలుగులో నైట్ షిఫ్ట్ ఉంటే కచ్చితంగా రాత్రి 2 గంటలకల్లా ప్యాకప్ చెప్పేస్తారు. దీనివల్ల అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ ముంబైలో పరిస్థితి వేరు. అక్కడ ఏ టైంకి షూటింగ్ పూర్తవుతుందో చెప్పలేం. టాలీవుడ్లో రోజుకు 12 గంటల పాటు పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రోజులు 9 గంటల్లోనే అయిపోయింది' అని జాన్వీ కపూర్ చెప్పింది.తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీ చేసిన జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సరసన 'పెద్ది' చేసింది. ఇది గనక హిట్ అయితే టాలీవుడ్లో ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) -
అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్‌కుమార్
మరో నాలుగు రోజుల్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం చెబుతున్న విషయాలతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. చరణ్‌కు అవార్డుకు రావడం పక్కా అంటున్నారు. అలాగే క్లైమాక్స్ కన్నీళ్లును పెట్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ‘పెద్ది’ తనకు చాలా స్పెషల్ చిత్రం అంటున్నాడు. కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పేశాడట. కానీ మధ్యలో మళ్లీ ఈ సినిమా వదిలేద్దాం అనుకున్నాడట ఈ స్టార్ హీరో. తనకు బదులుగా వేరే వ్యక్తిని తీసుకోమని చెబితే.. బుచ్చిబాబు వినలేదని.. తాను వచ్చేవరకు షూటింగ్ చేయకుండా ఆపేశాడని చెప్పాడు శివరాజ్ కుమార్.నటించలేనని చెప్పా.. శివరాజ్ కుమార్ 2024లో క్యాన్స్ర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్లి వచ్చాడు. అయితే క్యాన్సర్ బారిన పడేకంటే ముందే శివరాజ్ కుమార్ పెద్ది సినిమా ఒప్పుకున్నాడట. తనకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. కానీ బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదని..తాను వచ్చేవరకు ఎదురు చూశారని శివరాజ్ కుమార్ చెప్పాడు. తాజాగా చెన్నైలో నిర్వహించి పెద్ది ఈవెంట్లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘, బుచ్చి బాబు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. ఆ రోజు నేను రామ్ చరణ్‌తో కూడా మాట్లాడాను. ఆ తర్వాత, దురదృష్టవశాత్తు, నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది, నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా.నా కోసం ఎదురు చూశారు..నా నిర్ణయాన్ని చిత్రబృందానికి తెలియజేశా. గౌర్నాయుడు(పెద్దిలో శివరాజ్‌కుమార్ పోషించిన పాత్ర) పాత్రకి వేరే నటుడిని తీసుకోమని వారికి చెప్పా. కానీ నిర్మాతలు, దర్శకుడు నన్ను వెళ్లనివ్వలేదు. బుచ్చిబాబు వచ్చి ‘మాకు మీరే కావాలి సార్’ అన్నాడు. నా కోసం చాలా కాలం ఎదురు చూశారు. వారికి కృతజ్ఞతలు. పెద్ది నాకు స్పెషల్ మూవీ’ అని శివరాజ్ కుమార్ అన్నాడు. -
అది చాలా కష్టం.. కానీ రామ్ చరణ్ సాధించాడు: ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్
మెగా హీరో రామ్ చరణ్‌పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్‌లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ సైతం ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్‌కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
రిలీజ్‌కి ముందు ‘పెద్ది’ మేకర్స్ కీలక నిర్ణయం!
పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలనుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు తమ విజ్ఞప్తిని తెలియజేయడంతో..దానికి ధర్మాసనం అనుమతించింది. జూన్ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్ ధరలను 7 రోజులపాటు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ అధికారులకు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 15న వినతిపత్రం ఇచ్చి, 25న మరోసారి విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఇలాంటి అంశంలోనే ఇదే హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ తీసుకుందని గుర్తుచేశారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే పిటిషన్ ఉపసంహరణకు పిటిషనర్ కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్స్ ధరల పెంపు ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జూన్ బాక్సాఫీస్: పెద్దితో పాటు ఆ సినిమాలదే హవా!
ఈసారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హవా పెద్దగా కనిపించలేదు. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్స్ పూర్తి కాక, ఇటు ఐపీఎల్ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. దీంతో వేసవిలో చిన్న, డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్కువగా బోసిపోయే కనిపించింది. ఇప్పుడు రామ్‌చరణ్ 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్ కళకళలాడేందుకు సిద్ధమైంది. మరి పెద్దితోపాటు జూన్‌లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..⇒ జూన్ 4- పెద్దిరామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.⇒ జూన్ 5 - హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ మూవీ)బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న రిలీజవుతోంది.⇒ జూన్ 11- సింగ్ గీతంలెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న విడుదలవుతోంది.⇒ జూన్ 19 - మా ఇంటి బంగారండైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. సామ్ భర్త రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా, ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 19న బంగారం థియేటర్లలోకి వస్తోంది.⇒ జూన్ 19 - ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.⇒ జూన్ 19- దీవానాశుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'దీవానా'. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'మా ఇంటి బంగారం'తో పోటీపడుతూ జూన్ 19న రిలీజవుతోంది.⇒ జూన్ 19 - కాక్టైల్ 2 (హిందీ మూవీ)షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం కాక్టైల్ 2. ఇది 2012లో వచ్చిన కాక్టైల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూన్ 19న విడుదలవుతోంది.⇒ జూన్ 26- లెనిన్నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రం నెలాఖరులో జూన్ 26న రిలీజవుతోంది.⇒ జూన్ 26- వెల్కమ్ టు ద జంగిల్ (హిందీ చిత్రం)ఇది వెల్కమ్ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇకపోతే జూన్ 22న స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో జూన్ 19న ఆయన చివరి మూవీ జన నాయకన్ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్ ఆటంకాలు దాటుకుని జన నాయకన్ విడుదలవుతుందో, లేదో చూడాలి! -
పెద్ది మేకర్స్ దూకుడు.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు..!
రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్‌కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్‌లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్...
-
'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే గురవారమే (జూన్ 04) థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేయనున్నారు. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం.. ఇప్పుడు టికెట్ ధరల పెంపుపై కూడా జీవో తెచ్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)జూన్ 3న రాత్రి 8 గంటలకు వేసే ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ రూ.600 (జీఎస్టీతో కలిపి).. అలానే 4వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. రన్నర్, రెజ్లర్, క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే నాలుగు పాటలు, ట్రైలర్ రిలీజ్ చేశారు. బుచ్చిబాబు దర్శకుడు.ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ తెలంగాణలోనూ వస్తాయా అనేది చూడాలి? ఎందుకంటే మొన్నటివరకు ఈ సినిమాకు కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టుకుని కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే 'పెద్ది' టికెట్ రేట్లు పెంచేది లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశామని చెప్పారు. మరి ఇప్పుడు మాట మార్చి పెంపునకు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్) -
Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు
పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భోపాల్, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ చిత్ర హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్ అనే ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్ వివరించారు.ఇక భోపాల్‌లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్‌ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు. గతంలో భోపాల్‌లో జరిగిన ఈవెంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్‌ను అనధికారికంగా అప్లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి. -
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
వచ్చేవారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయబోతున్న సినిమా 'పెద్ది'. ఇందులో రామ్ చరణ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా అంటే రెజ్లర్, క్రికెటర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఓ మాదిరి హైప్ తీసుకొచ్చింది. మూడు పాటలు కూడా రాగా వాటిలో చికిరి చికిరి, రయ్ రయ్ రారా.. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోగా, ఐటమ్ సాంగ్ మాత్రం మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఇప్పుడు 'మస్సా మస్సా' అంటూ సాగే పాటని వదిలారు. అయితే లిరికల్ వీడియోలా కాకుండా కేవలం పాటకు సంబంధించిన ఆడియోని మాత్రమే రిలీజ్ చేశారు. ట్రైలర్, టీజర్లో వినిపించిన క్రేజీ మ్యూజిక్ సంబంధించిన పాట ఇది. కొన్నిరోజుల క్రితం భోపాల్ ఈవెంట్లో ఈ పాటని ఫెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు స్ట్రీమింగ్)s -
ఆ ఆరు సినిమాల్లో ‘పెద్ది’ మొదటి స్థానంలో ఉంటుది: జగపతి బాబు
‘‘లెజెండ్’ మూవీ తర్వాత చాలా సినిమాలు చేశాను. అయితే వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు చిత్రాలు ఉంటాయి. ఆ జాబితాలో ‘పెద్ది’ చిత్రంలో నేను చేసిన అప్పలసూరి పాత్ర మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు జగపతిబాబు తెలిపారు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో కలిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి పాత్ర లుక్‌ని డిజైన్ చేశారు బుచ్చిబాబు. ఈ సినిమా మొత్తం జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఒక సవాల్‌గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ‘పెద్ది’ మరో ఎత్తు. ప్రస్తుతం సోనీ లివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం
'పెద్ది' సినిమాకు పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు.. లేదు ఎప్పటిలానే రెంట్ మాత్రమే ఇస్తామని నిర్మాతలు పట్టుబట్టుకుని ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి ఈ వివాదం అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఎట్టకేలకు ఓ పరిష్కారం దొరికింది. చిరంజీవి మరోసారి కలిసిన తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఓ పరిష్కారం దొరికింది.(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదం సర్దుమణిగింది. 'పెద్ది' చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల నిర్ణయించుకున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్‌తో పాటుగా 7.5 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలని పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్ణయాలను చిరంజీవికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వివరించగా.. ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు.(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?) -
హనుమంతుడిలా రామ్ చరణ్.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు!
‘‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్‌గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. రాత్రిపూట ఆ మ్యాచ్ ఎపిసోడ్ షూట్ చేశాం. స్క్రీన్‌పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్‌గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.⇢ రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్‌గా తీసుకుంటారు. పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.⇢ ఈ సినిమాలో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్పై వర్క్ చేశారు. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్‌గా కనిపిస్తుంది.⇢ ఇందులో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్లో చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్‌లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్‌గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.⇢ ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.⇢ నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.⇢ ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్‌ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాం.⇢ శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్‌ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా ఉంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్‌లు, కొండ ప్రాంతాలు, వాటర్‌ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.⇢ నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్‌లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్‌లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.⇢ రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.⇢ నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ⇢ ఈ సినిమాకి మా అబ్బాయి కూడా పని చేశాడు. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్‌ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు. -
రాంచరణ్ పెద్దిని ఒవర్ హైప్ చేస్తున్నారా..?
-
పెద్ది సినిమాకి ముందే ఎందుకిలా! ఎగ్జిబిటర్లతో చిరంజీవి భేటీ..
-
నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్‌కుమార్
‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. ‘పెద్ది’ సినిమాలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే’’ అని చెప్పారు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్. హీరో రామ్‌చరణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్వేందు, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘పెద్ది’ కథ విన్న తర్వాత, ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించి, ఈ సినిమా చేశాను. ఇందులో ఓ కోచ్ తరహా పాత్రలో నటించాను. కథలో గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఈ పాత్రను బుచ్చిబాబు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. పెద్ది–గౌర్నాయుడు పాత్రల మధ్య అనుభందం ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య నెలకొన్న ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్ 2’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
కర్నాటకలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
-
'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్బంప్స్ స్పీచ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Reiterates... "Ee Cinema Raasi Pettukondi" 🔥#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/OOAdD59WHI— Trends RamCharan ™ (@TweetRamCharan) May 25, 2026 -
చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు బయట పెద్దగా తిరగరు. సెల్ఫీల పేరుతో అభిమానులు ఇబ్బంది పెడతారని భయం. అందుకు కొందరు బాడీగార్డ్స్‌ని పెట్టుకుంటారు. సల్మాన్ ఖాన్, యష్ లాంటి వాళ్ల లోకల్‌గా ఉండేవాళ్లని నియమించుకోగా మెగాహీరో రామ్ చరణ్ మాత్రం ఏకంగా ఓ ఆఫ్రికన్ ఫైటర్ని తనకు బాడీగార్డ్‌గా పెట్టుకున్నాడు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇతడెవరు? జీతం ఎంతిస్తున్నారు?(ఇదీ చదవండి: డబ్బింగ్‌లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?)'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్గా ముంబైలో జరిగింది. అప్పటినుంచి చరణ్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్న వ్యక్తి పేరు కెవిన్ కుంట. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఇతడు.. అంతర్జాతీయ స్థాయిలో ఎమ్ఎమ్ఏ(MMA) ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు.కేవలం బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా నిజ జీవితంలోనూ సెలబ్రిటీలు, అంతర్జాతీయ వీఐపీలకు VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 'పెద్ది' ప్రమోషన్లు జరిగేంతవరకు రామ్ చరణ్ ఇతడిని మాట్లాడుకున్నట్లు ఉంది. అయితే భద్రత కల్పిస్తున్నందుకుగానూ రోజుకు రూ.2 లక్షలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్‌కి రూ.15 లక్షలు ఇస్తుండగా.. కన్నడ హీరో యష్ తన బాడీగార్డ్‌కి రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని టాక్. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ గురించి వస్తున్న నిజమైతే మాత్రం ఇదో రికార్డ్ అవుతుందేమో!(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)Mega Power Star #RamCharan arrives in Bengaluru for #Peddi promotions!! pic.twitter.com/fsH5ucWi7t— cinee worldd (@Cinee_Worldd) May 25, 2026 -
పెద్ది ఐటమ్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్ తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
పెద్ది మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న జాన్వీ కపూర్
-
చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ .. 'పెద్ది' గురించి ఏం తేలుస్తారో?
ప్రస్తుతం టాలీవుడ్లో పర్సంటేజీ పంచాయితీ నడుస్తోంది. నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శించినందుకు అద్దె మాత్రమే చెల్లిస్తామని అంటుంటే.. ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లు తమకు కూడా పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రామ్ చరణ్ 'పెద్ది'తోనే దీనిని మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతల వైపు నుంచి సానుకూల స్పందన రావట్లేదు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చిరంజీవి దగ్గర చేరింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) తెలంగాణ ఎగ్జిబిటర్లతో సోమవారం సాయంత్రం 4 గంటలకు చిరంజీవి భేటీ కానున్నారు. ఇందులో పర్సంటేజీ విధానంపై చర్చించుకోనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరగా.. ఎగ్జిబిటర్స్ మాత్రం దీనిపై అసంతృప్తి గా ఉన్నారు. ససేమిరా అంటున్నారు. మల్టీప్లెక్స్‌ల కంటే తక్కువగా ఎంతో కొంత పర్సంటేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.శనివారం జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశంలోనే చిరంజీవి సమయం ఇస్తే తాము గోడు వినిపిస్తాం అని ఎగ్జిబిటర్లు అన్నారు. ఇప్పుడు చిరుతో భేటీకి సిద్ధమయ్యారు. పెద్ది సినిమాని తాము టార్గెట్ చేయలేదని, ఏడాదిగా పర్సంటేజీ గురించి అడుగుతున్నామని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం.. నిర్మాణంలో ఉన్న 25సినిమాలపై ఇప్పటికే దాదాపు 70-80 శాతం ఖర్చు చేశామని, అవి రిలీజైన తర్వాత పర్సంటేజీ ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనల గురించి 'పెద్ది' నిర్మాత వెంకట్ సతీష్ కిలారు.. రామ్ చరణ్‌కి తెలియజేశారు. మరి ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజీ వివాదాన్ని ఇప్పుడు చిరంజీవి పరిష్కారిస్తారా? ఒకవేళ చేస్తే ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ) -
శృతి హాసన్ టు పూజ హెగ్డే... ‘స్పెషల్’ స్పెషలిస్ట్‌గా సీనియర్ భామలు
ఒకప్పుడు కేవలం ఐటెమ్ సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా కొందరు డ్యాన్సర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్, నార్త్ సినిమాలలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌కు ‘కేరాఫ్’గా నిలుస్తున్నారు. వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే, కేవలం మూడు నాలుగు నిమిషాల పాటతో సినిమా స్థాయిని మార్చేయగల సత్తా ఈ సీనియర్ హీరోయిన్లకు ఉంది. అందుకే నిర్మాతలు సైతం కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఈ భామలను స్పెషల్ సాంగ్స్ కోసం ఎంచుకుంటున్నారు.‘పెద్ది’ హాసన్ మాస్ స్టెప్పులుటాలెంట్, గ్లామర్ కలబోసిన శృతి హాసన్ ఇటు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే, అటు స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొడుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ప్రత్యేక పాటకు రామ్ చరణ్‌తో కాలు కదిపింది. గతంలో మహేశ్ బాబు ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్ లో..’ అంటూ మాస్ స్టెప్పులేసిన శృతి, ఇప్పుడు చరణ్‌తో స్టెప్పులేయబోతుంది. నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ స్పెషల్ అప్పియరెన్స్‌తో ప్రేక్షకులను అలరించింది.‘స్పెషల్ సాంగ్స్’ స్పెషలిస్ట్‌గా తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చుట్టూనే తిరుగుతోంది. కేవలం పాట కోసమే థియేటర్లకు వచ్చేలా చేయగల క్రేజ్ తమన్నా సొంతం. జై లవకుశ: ‘స్వింగ్ జరా..’ అంటూ ఎన్టీఆర్‌తో పోటీపడి డ్యాన్స్ చేసింది. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి ‘డాంగ్ డాంగ్..’ అంటూ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దుమ్మురేపింది. రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా..’ పాట దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే హిందీ మూవీ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అంటూ బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది.ఒక్కసారే..రికార్డులు బ్రేక్స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లోనే మైలురాయిగా నిలిచే స్పెషల్ సాంగ్ ‘పుష్ప: ద రైజ్’ లోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’. అల్లు అర్జున్ సరసన సమంత చేసిన ఈ ఊరమాస్ సాంగ్ కేవలం టాలీవుడ్లోనే కాదు, అంతర్జాతీయంగా ట్రెండ్ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది. సమంత గ్లామర్, ఎక్స్ప్రెషన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.‘మొనికా’ హంగామాబుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో ‘మొనికా..’ అనే స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు, గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతకు ముందు రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ‘జిగేల్ రాణి’గా పూజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్‌తో మెరిసింది. వీళ్లు మాత్రమే కాదు.. శ్రీలీల, మృణాల్తో పాటు మరికొంత మంది యంగ్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. -
పెద్దిని ఆపితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..!
-
ఇద్దరు భామలతో 'పెద్ది' స్టెప్పులు.. ఐటం సాంగ్ చూశారా?
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్ప్రైజ్లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ఈ ఐటం సాంగ్‌లో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్‌తో, ఇటు జాన్వీ కపూర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. సింగర్ రక్షిత సురేశ్ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
రామ్‌చరణ్ 'పెద్ది కీ ఆవాజ్' ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు)
-
చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్‌చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
'పెద్ది' ఆపితే ఆమరణ నిరహార దీక్ష చేస్తా
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆంధ్రాలో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలంగాణలోని థియేటర్లలోకి వస్తుందా అనే సందేహం మాత్రం నెలకొంది. దానికి కారణం పర్సంటేజీ వివాదం. కొన్నిరోజుల ముందు అంతా సద్దుమణిగింది అనుకుంటే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది'కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదలా ఉండగానే నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)'మీరు పెద్ది సినిమాని ఇదే ప్రకారం ఆపాలని నిర్ణయించుకుంటే బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ నిరహార దీక్షకు దిగుతా. మీరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూనే అదే చేస్తున్నారు. చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు' అని నట్టికుమార్ ఆవేశపడిపోయారు.ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. శనివారం జరిగిన ఇదే ప్రెస్మీట్లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ అడ్డంకులు దాటుకుని మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)Producer #NattiKumar :"మీరు #PEDDI సినిమా ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను." pic.twitter.com/NaeuuHtT7Q— Whynot Cinemas (@whynotcinemass_) May 23, 2026 -
మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు కష్టాలు తొలగిపోలేదు. సమస్య మళ్లీ మొదటకొచ్చింది. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజీ గొడవ మళ్లీ మొదలైంది. 'పెద్ది'కి కూడా పర్సంటేజీ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో శనివారం సమావేశమైన అనంతరం పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో రెండుమూడు సార్లు చర్చలు జరిగాయి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే 2-3 నెలల్లో సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయినా అది జరగలేదు. నిర్మాతలు.. ముందుగా మూడు వారాలన్నారు. ఇప్పుడు మరో మూడు వారాలని వాయిదా వేస్తున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని థియేటర్లలో ఆడిస్తాం అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.దేశం మొత్తం థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉంది. తెలంగాణలో మాత్రం రెంటల్ ఉంది. నిర్మాతలు.. సమస్యని రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగడం లేదు. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. అది ఎంతిస్తారో చెప్పండి అని కూడా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం ఉండదు. రేట్లు పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాం. 'పెద్ది'పై మాకు ఎలాంటి పగ లేదు. కానీ ఇప్పుడు కాకపోతే నిర్మాతలు మళ్లీ ఎప్పుడు పట్టించుకుంటారనేది తెలియదు అందుకే ఈ చిత్రాన్ని కూడా పర్సంటేజీ శ్లాబ్‌లో చేర్చాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చారు.దీనిబట్టి చూస్తే ఆంధ్రా వరకు 'పెద్ది'కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు గానీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే అటు నిర్మాతలు గానీ ఇటు ఎగ్జిబిటర్లు ఎవరూ తగ్గడం లేదు. విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'పెద్ది' విషయంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌లా మారిపోయింది.(ఇదీ చదవండి: వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్) -
పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. ప్రోమోతోనే గూస్ బంప్స్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ హిట్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అంతేకాకుండా ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పరిశీలించిన మేకర్స్.. చివరికీ కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హల్లల్లో హల్లల్లో అంటూ సాగే ఈ పాట ప్రోమో చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను మే 23న భోపాల్‌లో జరగనున్న ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. -
ఎవరి ఊహలకి అందదు.. చరణ్ అన్న ఇరగకొట్టేసాడు
-
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించనుంది. -
పెద్ది ట్రైలర్ VS డ్రాగన్ గ్లింప్స్.. తార స్థాయికి చేరిన ఫ్యాన్ వార్స్
-
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు) -
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?
-
ఇదో అందమైన జ్ఞాపకం.. చేతికైన గాయం గురించి చెప్పిన రామ్ చరణ్
-
'పెద్ది'.. సమస్యలన్నీ క్లియర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు. -
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
-
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు. -
‘పెద్ది’కి పర్సెంటేజ్ కావాల్సిందే!
మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌లోనూ పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం.. ఇప్పటికిప్పుడు వీలుకాదంటూ ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు మాట్లాడటం తెలిసిందే. ఈ సమస్యపై చర్చించేందుకు ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో గత శుక్రవారం నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌తో సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఏడుగురు నిర్మాతలు, ఏడుగురు ఎగ్జిబిటర్లు, ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లు (మొత్తం 21 మంది)తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సోమవారం మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదట. ‘పెద్ది’ సినిమా ప్రదర్శనలో తమకు పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారట. థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు సిద్ధమేనని నిర్మాతలు చెప్పారని తెలిసింది. అయితే ‘పెద్ది’కి మాత్రమే పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, తర్వాతి చిత్రాలకు కూడా ఎంత మేర పర్సెంటేజ్ ఇస్తారు? అనే విషయంపై ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరారట. ఈ డిమాండ్‌పై అంతర్గతంగా చర్చించుకుని, తమ నిర్ణయాన్ని నేడు చెబుతామని నిర్మాతలు చెప్పినట్లు సమాచారం. -
పెద్దితో జాన్వీ శ్రీదేవి గారి రేంజికి వెళ్ళిపోతారు
-
పెద్ది తర్వాత బుచ్చిబాబుతో చరణ్ మరో మూవీ
-
రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం
-
‘పెద్ది’ .. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ : రామ్ చరణ్
‘‘నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్ ఫిల్మ్ ‘పెద్ది’. ఇలాంటి చిత్రాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ ఇది’’ అని హీరో రామ్‌చరణ్ తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీ జూన్ 4న విడుదలకానుంది. సోమవారం ముంబైలో జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు ‘‘మా అమ్మగారు(శ్రీదేవి), చిరంజీవిగారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. చరణ్‌గారు–నా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ నాకు చాలా ప్రత్యేకం’’ అని జాన్వీ కపూర్ చెప్పారు. ‘‘నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నిర్మాత సతీష్ కిలారు, నటుడు దివ్యేందు శర్మ, కెమెరామెన్ రత్నవేలు మాట్లాడారు. -
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
-
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
-
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
-
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
రామ్ చరణ్‌కు మరో ఆపరేషన్.. ?
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పాటు నిర్మాత కూడా చరణ్ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్‌కు తగిలిన గాయాల గురించి వివరించాడు.‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్ ఉంది. షూటింగ్ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్ గ్యాప్‌లో జిమ్ చేసి వచ్చేవాడు. కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పు తనదే అన్నాడు.. చరణ్‌లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్ మాస్టర్
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేసిన నబా కాంత్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్‌లో నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్–లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా వర్క్ చేశాను. ‘పుష్ప’ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్’ అని రామ్–లక్ష్మణ్ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పుష్ప 2, మన శంకర వరప్రసాద్‌గారు, డెకాయిట్’ సినిమాలకు వర్క్ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్ గ్లింప్స్‌లో సరికొత్త బ్యాటింగ్ స్టైల్‌తో చరణ్‌గారు సిక్సర్ కొట్టే షాట్‌ను నేనే కంపోజ్ చేశాను. మా గురువుగారు రామ్–లక్ష్మణ్మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్‌కి గాయమైంది. ఓ రోల్ మూమెంట్లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్‌కి వచ్చేశారు. నేనైతే షాక్ అయిపోయా.ఇందులో కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్గారి నాన్నగారు శ్యామ్ కౌశల్‌ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్‌ఖాన్–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్‌పై ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
పెద్ది పేరు చెప్పి మా నోరు నొక్కేయకండి
-
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈ ఫోటోలు చూశారా...(ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా రయ్ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
పెద్ది రిలీజ్ ముందు ఈ గలాటా ఏంటి..!
-
చాలా బాధగా ఉంది... పెద్ది అప్పుడే ఎందుకు ఇలా..!
-
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్‌గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
PEDDI ఐటెం సాంగ్ అరాచకం..! చరణ్ అన్న ఇరగదీసాడు
-
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పెద్ది' ట్రైలర్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
-
రామ్ చరణ్ పెద్ది గాయాల కథ...
-
పుష్ప-2 బాటలో పెద్ది.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండాఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్‌ను బిహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్‌లోనూ ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్
రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్‌కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.The BOSS and my GURU on sets of #Peddi...It's one of the best memories ❤️And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/gvgcNmkffZ— BuchiBabuSana (@BuchiBabuSana) May 8, 2026 -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్‌కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రెడీ.. మూడో లుక్ పై సస్పెన్స్..
-
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్‌లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్‌తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్‌కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్‌కి ఇది మాత్రమే కాదు, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్‌కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
-
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్‌గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్‌ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్‌ను హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
పెద్దిలో చరణ్ మూడో లుక్.. మెగా అభిమానులకు సర్ ప్రైజ్
-
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్‌కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
విసుగెత్తిస్తున్న 'వాయిదాలు'.. దీనికి పరిష్కారం లేదా?
ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్గా చేసినా ఇంప్రెసివ్‌గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్మెంట్లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్‌కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ
హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్‌ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్) -
శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్ల...?
-
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్‌లో వేసిన ఒక సెట్స్‌లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్‌పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు.


