మెగా హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే 'గేమ్ ఛేంజర్' తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉప్పెన్ ఫేమ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇవాళ డైరెక్టర్ బుచ్చిబాబు సనా బర్త్‌డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఆర్‌సీ16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విటర్‌లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Warmest birthday wishes to @BuchiBabuSana 🎉
Here's to a year brimming with inspiration and innovation. Let's stir up some excitement with our next film #RC16 ✨— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2024
Comments
Please login to add a commentAdd a comment