 
													మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.
కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
 
Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr
— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
