'అతను ఒక పవర్‌హౌస్‌'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్! | Manchu Vishnu Birthday Wishes To Rebal Star Prabhas | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: 'భారతీయ సినిమాకు పవర్‌హౌస్‌ లాంటివాడు'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!

Oct 23 2024 2:55 PM | Updated on Oct 23 2024 3:14 PM

Manchu Vishnu Birthday Wishes To Rebal Star Prabhas

రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్‌ డే కావడంతో ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్‌హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్‌లో రాసుకొచ్చారు.

కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్‌ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.

(ఇది చదవండి: ‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ .. ప్రభాస్‌ కొత్త లుక్‌ అదిరింది!)

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్‌ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement