ప్రభాస్‌కు బర్త్‌ డే విషెస్ చెప్పిన బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఎవరో తెలుసా? | Birthday Wishes To Hero Prabhas From His Best Friend Bujji, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Prabhas : రెబల్ స్టార్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌ బర్త్ డే విషెస్.. ఎవరంటే?

Published Wed, Oct 23 2024 9:36 PM | Last Updated on Thu, Oct 24 2024 11:30 AM

Birthday Wishes To Hero Prabhas From His Best Friend

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్‌ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్‌ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అయితే ప్రభాస్‌ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌ బర్త్‌ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్‌లో హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.

కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్‌ వాయిస్‌తో డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement