bujji
-
ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
Kalki Bujji: 'బుజ్జి' సందడితో.. యువత సెల్ఫీలు!
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి’ కారు వరంగల్ నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం హనుమకొండలోని ఏషియన్ మాల్లో ‘బుజ్జి’కారును బుధవారం ప్రదర్శనకు ఉంచారు.దీనిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బుజ్జితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని సంబురపడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
ప్రభాస్ కల్కి.. బుజ్జి ప్రస్తుతం ఎక్కడ ఉందంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచిన బుజ్జి కారు ప్రస్తుతం ఏపీలో హంగామా చేస్తోంది. ఇటీవల విజయవాడలో సందడి చేసిన బుజ్జి.. తాజాగా భీమవరంలో కనిపించింది. పట్టణంలో ఓ థియేటర్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. బుజ్జిని చూసిన ఫ్యాన్స్ తమ కెమెరాల్లో బంధించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. The Rebel’s City Bhimavaram welcomes #Bujji with boundless excitement! ❤️🫶#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/0kfWNzKffE— Kalki 2898 AD (@Kalki2898AD) July 5, 2024 -
విజయవాడలో బుజ్జిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ చిత్రంలో బుజ్జి కారు అభిమానులను తెగ ఆకట్టుకుంది. సినిమా విడుదల రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది. దీంతో అభిమానులు, ప్రముఖులు బుజ్జితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తాజాగా బుజ్జి విజయవాడకు చేరుకుంది. ఓ షాపింగ్ మాల్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఇది చూసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తమ కెమెరాలలో బుజ్జిని క్లిక్ అనిపిస్తున్నారు. ఆ థియేటర్ వద్ద భారీగా ఫ్యాన్స్ కోలాహాలం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. Thank you Vijayawada ❤️🔥🫶#Kalki2898AD #EpicBlockbusterKalki pic.twitter.com/Ov8oAS2MfB— Bujji (@BelikeBujji) June 30, 2024 -
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
యూత్‌కి పిచ్చిగా నచ్చేసిన 'కల్కి' బుజ్జి.. ఐమాక్స్‌లో స్పెషల్ అట్రాక్షన్..(ఫోటోలు)
-
IMAX వద్ద కల్కి సందడి
-
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
-
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. కల్కిలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు.అయితే హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్లో ఈ సినిమాలోని బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. విభిన్నమైన డిజైన్‌తో రూపొందించిన కారు(బుజ్జి) లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జి అన్ని ప్రధాన నగరాల్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ బుజ్జిని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. కల్కి సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. #Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/4VQCe3hSSv— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 12, 2024 -
బీచ్‌లో బుజ్జి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898ఏడీ'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్‌హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని కారు బుజ్జి లుక్‌ను రివీల్ చేశారు. దీని కోసం హైదరాబాద్‌లో భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో ప్రభాస్ కారును నడుపుతూ సందడి చేశారు.అయితే బుజ్జి ఇండియా మొత్తం టూర్ చేస్తోంది. ప్రధాన నగరాలను అన్నింటినీ చుట్టి వస్తోంది. తాజాగా ముంబయిలోని జుహు బీచ్‌లో బుజ్జి సందడి చేసింది. దీంతో అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు క్యూ కట్టారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ముంబయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.కాగా.. కల్కి ట్రైలర్‌ను ఈనెల 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీన్ని కూడా ముంబయిలోనే భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. Bujji at JUHU Beach ⛱️, MUMBAI.#Prabhas #Bujji #Bhairava #Kalki2898AD pic.twitter.com/grY8Pegd7e— Prabhas Fan (@ivdsai) June 7, 2024 -
బాహుబలి వర్సెస్ బుజ్జి
-
వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు క్లారిటీ ఇఛ్చిన ప్రభాస్
-
ప్రభాస్ తర్వాత బుజ్జిని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.కల్కి సినిమాలో భాగంగా బుజ్జిని ఎప్పుడైతే ప్రభాస్ పరిచయం చేశాడో ఆ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ తాజాగా ఒక కార్యక్రమాన్నే మేకర్స్ నిర్వహించారు. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం. ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. అయితే, తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. వాహనాన్ని చూసిన నాగచైతన్య ఆశ్చర్యపోయాడు. ఇంజనీరింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య వీడియోను మేకర్స్ షేర్ చేశారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిన కల్కి జూన్ 27న విడుదల కానుంది.Look who's met #Bujji... @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/8odhpYDqMz— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024 -
అన్ని ఈవెంట్లు ఒక లెక్క బుజ్జి ఈవెంట్ మరో లెక్క ఇది ప్రభాస్ రేంజ్
-
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్‌తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు.కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది. Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem AutmotiveFor the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥Made Up with a Cost of 7Cr for Car which is INSANE pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024 -
‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్‌పై ప్రభాస్ రియాక్షన్
‘బుజ్జి’.. ఈ పేరు గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్లో హల్ చల్ చేసింది. నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ‘బుజ్జి’పై ఆసక్తిని కనబరిచారు. దానికి తగ్గట్టే నిన్న(మే 22) మేకర్స్ హైదరాబాద్‌లో ఓ బిగ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి బుజ్జిని పరిచయం చేశారు. ప్రభాస్ ఓ భారీ స్టంట్ చేస్తూ బుజ్జి తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. డార్లింగ్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ స్టంట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ప్రభాస్ మూడు రోజుల పాటు రోజుకు నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేశారట. అందుకే ఆ కారు(బుజ్జి)ని పర్ఫెక్ట్గా గ్రౌండ్లోకి తీసుకురావడమే కాకుండా.. దాంతో చక్కర్లు కొట్టి ఆకట్టుకున్నాడు.అయితే బుజ్జి పరిచయం కేవలం 56 సెకన్ల వరకే ఉండడంతో ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశకు లోనయ్యారు. బుజ్జి వీడియో చూశాక పక్కనే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ చూసి ‘ఏంటి సార్.. మూడేళ్లలో తీసి 50 సెకన్లు చూపిస్తారా?..మిమ్మల్లి కొట్టాలి ఇక్కడకు రండి’అంటూ నాగికి ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి పోదాం అనుకుంటే .. నాతో ఫీట్లు చేయించాడు. క్యూరియాసిటీని పెంచేందుకే నాగి నాతో ‘స్పెషల్ పర్సన్’ అని ట్వీట్ వేయించాడు. బుజ్జి నాకు చాలా ప్రత్యేకం. బుజ్జి మెదడు కంటే బాడీ నాకు ఇష్టం’ అని ప్రభాస్ అన్నారు. -
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్లో బుజ్జి లుక్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024 -
చింతమనేని ‘గప్‌చుప్’
ఏలూరు టౌన్ : సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. ఆరు వారాల (42 రోజుల) నిరీక్షణ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇవన్నీ ఇకవైపు ఉంటే పోలింగ్ రోజు రాజకీయపార్టీలు విజయానికి వూహ్యాలు రచిస్తూ వాటిని అమలు చేసేందుకు కష్టపడ్డాయి. జిల్లాలోనే వివాదాలకు పెట్టింది పేరైన దెందులూరు నియోజకవర్గంలో గొడవలు, దాడులు, అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండానే సాఫీగా సాగిపోగా.. అనూహ్యరీతిలో ఏలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాలపై దాడులకు తెగబడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోవటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే ఇద్దరు టీడీపీ నేతలు ఇలా వ్యవహరించారా? ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇలా తమ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించారా? అనే అంశాలపై ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో దిట్టలుగా చెప్పుకునే టీడీపీ నేతలు ఇలా మారిపోవటం వెనుక అసలు కథ ఏంటనే అంశాలు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుపై టీడీపీ కేడర్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బడేటి ‘బరితెగింపు’ పోలింగ్ రోజు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారశైలి వివాదాస్పదంగా మా రింది. గురువారం ఉదయం 7.30 గంటల నుంచే ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణలు, దాడులు, గొడవలు సృష్టిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఎ మ్మెల్యే బడేటి బుజ్జి తన వ్యవహారశైలికి భిన్నంగా ఎన్నికల్లో గొడవలు పెట్టుకోవటం చర్చనీయాం శంగా మారింది. ఏలూరులోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద తన అనుచరులతో కలిసి దాడులకు తెగబడటం వెనుక కారణాలేమై ఉంటాయోనం టూ పలువురు చర్చిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రశాంతంగా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. ప్రతి స్థానిక నాయకుడినీ కలుస్తూ వారి మద్దతు కూడగడుతూ విజయం సాధించే దిశగా అడుగులు వేసిన బడేటి.. ఇప్పుడు భిన్నంగా వ్య వహరించటాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనా యుడు పోటీలో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీ నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బడేటి దుందుడుకు చర్యలకు పాల్పడటంపై కేడర్లోనే భిన్నస్వరాలు విని పిస్తున్నాయి. బడేటి దాడుల కారణంగా సొంత పార్టీలోని దళిత వర్గాలు, ఆర్యవైశ్యులు, ఇలా పలు సామాజికవర్గాల ఓట్లు గణనీయంగా చీలి పోయాయనీ, గెలిచే స్థితిలో నుంచి ఆత్మరక్షణలో పడ్దామంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యా ఖ్యానిస్తున్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా.. గత ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడు, ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ వంటి వారు కొండంత అండగా ఉంటూ నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులను సమన్వయం చేస్తూ టీడీపీ విజయానికి బాటలు వేసిన నేతలు ఇప్పు డు బడేటికి దూరం కావటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, పలువురు టీడీపీ స్థానిక నేతలు సైతం తనకు వ్యతిరేకంగా చాపకిందనీరులా పనిచేయటం, పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా చేతి వాటాన్ని ప్రదర్శించటం ఎమ్మెల్యే బడేటికి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. తనకు అడ్డువస్తే సహించలేని బడేటి ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నేతలే టార్గెట్‌గా దాడులు చేశారనే అభిప్రాయమూ ఉంది. ఓటమి భయంతోనే.. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుందని ఆరోపణలు చేసే టీడీపీ నేతలు.. బడేటి బుజ్జి చేసిన దౌర్జన్యాలు, దాడులు, రౌడీయిజాన్ని ఏమంటారంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేళ్లుగా ఏలూరు నియోజకవర్గంలో బడేటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, మరోసారి తన నిజస్వరూపాన్ని పోలింగ్‌రోజు బయటపెట్టుకున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఓట్లు వేసేందుకు వెళ్లకుండా భయపెట్టడానికే ఇలా బడేటి బుజ్జి దాడులకు పాల్పడ్డారని, అయినా వైఎస్సార్ సీపీ నేతలు, కేడర్ వారి వ్యూహానికి కళ్లెం వేస్తూ ఎదురుదాడులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తపడ్డామని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు గొడవలు చేస్తూ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుటిల యత్నాలు చేశారని అయినా అవేమి ఫలించలేదంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల నాని గెలుస్తారనే విశ్వాసం ఉందని.. బడేటి దాడులు, దౌర్జన్యాలతో తమ మెజారిటీని భారీగా పెంచేశారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొడవలు వద్దంటూ హితవు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి శనివారపుపేటలో దాడులు చేసిన సందర్భంలో అక్కడికి చింతమనేనిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా చింతమనేని తాను రానంటూ చెప్పటం, పట్టుబట్టి బడేటి అక్కడికి తీసుకువెళ్లినా.. తన శైలికి భిన్నంగా హడావుడి చేయకుండానే చింతమనేని వెనుదిరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. టీడీపీ కేడర్‌కు సైతం ఏమీ గొడవలు పెట్టుకోవద్దనీ.. ప్రజలు తమపై వ్యతిరేకతతో ఉన్నారంటూ స్వయంగా చింతమనేని హితబోధలు చేయటం గమనార్హం. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే ఇలా నటిస్తున్నారనీ.. అధికారం వస్తే రెచ్చిపోవటం ఆయనకు కొత్తేమీ కాదనే అభిప్రాయం ని యోజకవర్గ ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. మొత్తానికి చింతమనేనిలో మార్పు ఓట్లు కోస మో.. భయమో.. ఆందోళనో.. ఏదైనా కానీ.. చింతమనేని గమ్ముగా ఉంటూ ప్రజల ముందు సైలెంట్‌గా ఉన్నా ప్రజలెవరూ విశ్వసించలేదనేది బహిరంగ రహస్యం. చింతమనేని ‘గప్‌చుప్’ ఆంతర్యమేంటీ చింతమనేని.. ఈ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. గొడవలు, దౌర్జన్యాలు, దాడులు, వివాదాలే. పోలీసు అధికారులు, రెవెన్యూ, దళితులు, సామాన్యులు, వికలాంగులు, రాజకీయ నేతలు ఇలా ఒక్కరేమిటీ అన్నివర్గాల వారూ చింతమనేని చేతుల్లో దాడికి గురైనవారే. దెందులూరు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోవటం, కొట్టటం, తీవ్ర పదజాలంతో దూషణలకు దిగటం పరిపాటిగా మారింది. అయితే ఆయనకు ఏమయ్యిందో ఏమో గానీ తన స్వభావానికి భిన్నంగా మారిపోయారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే రెండో కాలిపై.. అంతెత్తునలేస్తూ గొడవలు చేసే చింతమనేని.. ఓడిపోతాననే ‘చింత’తో సతమతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజు సైతం చింతమనేని నియోజకవర్గంలో నోరెత్తిన పాపానపోలేదంటున్నారు. ఆఖరికి తమకు అనుకూలంగా ఉండే ఒక వర్గంపై దాడి జరిగిందని తెలిసినా ఏమాత్రం రెచ్చిపోకుండా తన వ్యవహారశైలికి భిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. చింతమనేనిపై 2010 నుంచి దెందులూరు, పెదవేగి, పెదపాడు, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, గన్నవరం, భీమడోలు తదితర ప్రాంతాల్లో ఏకంగా 26 కేసులు ఉండగా, ఒక కేసుల్లో రెండేళ్ల జైలు కూడా పడింది. ఇలా వివాదాలకు ఆద్యుడుగా పేరొందిన చింతమనేని ఈనెల 11న పోలింగ్ రోజు గప్‌చుప్‌గా మారిపోవటం, హల్చల్ చేయకుండా బుద్ధిమంతుడిలా వ్యవహరించటంపై చర్చసాగుతోంది. పతనానికి పలు కారణాలు నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గం సైతం ఎన్నికల్లో మద్దతుకు ససేమిరా అంటూ తెగేసి చెప్పేయటం, ప్రధానంగా పట్టున్న గ్రామాల్లో కూడా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా మద్దతు తెలపటం చింతమనేనికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని పోటీ చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు చివరి దశలో పోటీకి వచ్చారు. అప్పటివరకూ సొంత సామాజికవర్గంలోని అసంతృప్తి ఉన్నా.. ఎన్నికల నాటికి తమవాడే కదా అనే ధోరణిలో చింతమనేని వైపే మొగ్గుచూపారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవటం, సొంత సామాజికవర్గంలోని స్థానిక నేతలు, ఆయా గ్రామాల్లో బాగా పట్టున్న నాయకులు, దళితులు, బీసీలు వైఎస్సార్ సీపీకి జై కొట్టటం చింతమనేని వ్యవహారశైలిలో మార్పులు తెచ్చాయి. కొప్పాక సొసైటీ అధ్యక్షుడు చల్లగొళ్ల వెంకటేశ్వరరావు (భూస్వామి), పర్వతనేని జగన్మోహనరావు, మోరు రామరాజు, పోకల రాంబాబు, దోసపాడు టీడీపీ ఎంపీటీసీ ఎస్.సుధాకర్, దెందులూరు మండల కాపు సంఘం అధ్యక్షులు కొండేటి గంగాధరబాబు వంటి నేతలు చింతమనేనితో విసిగిపోయి మరీ కొఠారు పక్షాన నిలవటం చింతమనేనికి ఓటమి కళ్లముందే కనిపించింది. చింతమనేని పేరు చెబితేనే బయటకు రావటానికి సాహసం చేయని నియోజకవర్గ ప్రజలు దెందులూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి నామినేషన్‌కు వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావడం, పలు సందర్భంగా యువత, ప్రజలు పెద్దెత్తున ఆయన వెంట కదలిరావడం చింతమనేని పతనానికి నిదర్శనాలుగా మారాయి. -
కరెంటు షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కరెంటు షాక్ తో ఇద్దరు మృతి చెందారు. స్దానిక ఎంఎం సూపర్ మార్కెట్లో బుధవారం వేకువజామున ఏసీ బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన యువకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్, బుజ్జిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుజ్జిగారు చెప్పారు.. తలా వందివ్వండి
ఏలూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలు దుబారా చేసిన పాలకులు ఇప్పుడు ఆ నిర్మాణం పేరిట వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లలో కోత విధిస్తున్నారు. ప్రతి ఒక్కరి పింఛన్ సొమ్ము నుంచి వందరూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. లేదంటే పింఛన్ డబ్బు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏలూరు నగరపాలకసంస్థలో లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ. వంద స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ చేస్తున్న బలవంతపు వసూళ్లకు ఎమ్మెల్యే బుజ్జి పూర్తి సహకారం అందిస్తున్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ. 100 ఇచ్చే విధంగా ప్రకటన జారీ చేయాలని పౌరసంబంధాల అధికారులను కోరారు. అందుకు అనుగుణంగా అధికారులు ఒక్కో లబ్ధిదారుడు రూ. 100 ఇవ్వాలంటూ మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల నుంచి రూ. 10 పింఛన్‌దారుల నుంచే కాకుండా నగరంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పది రూపాయలు చొప్పున ఇవ్వాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేటర్ ఇళ్లు, కార్యాలయాల వద్ద పంపిణీ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 18,890 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా మాదిరిగానే ఈసారీ పింఛన్లు తీసుకునేందుకు రెండురోజులుగా లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళుతున్నారు. అయితే ఎక్కడికక్కడ పింఛన్ కేంద్రాల వద్ద కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు కాపుకాసి పింఛన్ సొమ్ము తీసుకోగానే అందులో నుంచి రూ. వంద వసూలు చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు తమ అనుచరులను పెట్టి వసూళ్లు చేయిస్తున్నారు. మరికొన్ని డివిజన్లలో పింఛన్ల పంపిణీని కార్పొరేటర్ ఇళ్లు, వారి కార్యాలయాల ఏర్పాటు చేశారు. పింఛన్లు తీసుకునేందుకు వచ్చేవారు తప్పకుండా రూ. 100 తీసుకుని రావాలని ముందుగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూ. 100 వసూలు చేసిన తర్వాతే పింఛను ఇచ్చే కౌంటరులోకి పంపిస్తున్నారు. అధికార పార్టీ నేతల దందాకు కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారు. దాదాపు రూ. 20 లక్షల వసూలుకు తెరలేపారు. ఎమ్మెల్యే ఇమ్మన్నారని తీసుకున్నారు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ సరిగ్గా ఇంటి అద్దెకి సరిపోతుంది. ఈ నెల రూ. 100 తగ్గించి ఇచ్చారు. దీనివల్ల తిరిగి రూ. 100 అప్పు చేసి ఇంటి అద్దె కట్టాలి. ఎమ్మెల్యే రూ. 100 రాజధాని నిర్మాణానికి ఇవ్వమన్నారని చెప్పి తీసుకున్నారు. - మద్దె లక్ష్మమ్మ, ఏలూరు, 10వ డివిజన్ రూ. 100 తీసుకురమ్మన్నారు రాజధానికి విరాళం కింద రూ. 100 తప్పకుండా తీసుకురావాలని చెప్పారు. రానున్న నెలల్లో పింఛన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు పెడతారేమోనని ఇచ్చాం. రూ. వందతో నాకు 10 రోజులకు మందులు వస్తాయి. - యల్లపు చిట్టెమ్మ. ఏలూరు, 9వ డివిజన్ -
విమానం అక్కడ ఎగరదా ...
-
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై దాడి
బాగేపల్లి. మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ చేయడానికి ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తాలూకాలోని జిలాచర్ల గ్రామ ప్రజలు దాడి చేశారు. సంఘటనలో జీపు ధ్వంసమైంది. బాగేపల్లి పోలీసుల సమాచారం మేరకు... జిలాచర్ల గ్రామానికి చెందిన బుజ్జి మట్కా నిర్వాహకుడిగా పేరుగాంచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురము జిల్లాలోనూ ఇతను అనైతిక వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా అనంతపురము జిల్లా పెనుగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో హిందూపురం రెండవ పట్టణ ఎస్ఐ ఆంజనేయులుతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఓ హెడ్ కానిస్టేబుల్ టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి బుజ్జిను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఓ ప్రైవేట్ సుమో వాహనం(ఏపీ 02-ఎన్ 0459)లో టాస్క్‌ఫోర్స్ జిలాచర్లకు చేరుకుంది. బుజ్జిని అరెస్ట్ చేసి తమతోపాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుటుంబసభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మఫ్టీలో వచ్చిన వారు దొంగలై ఉంటారని భావించి వారి చెర నుంచి బుజ్జిని విడిపించారు. ఆ సమయంలో గొడవ చోటు చేసుకుని టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశారు. వారు వచ్చిన జీపు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు అక్కడకు చేరుకుని దాడిని నివారించి, విషయాన్ని బాగేపల్లి పోలీసులకు చేరవేశారు. దీంతో బాగేపల్లి సీఐ సి.వసంత్, సిబ్బంది అక్కడకు చేరుకుని టాస్క్‌ఫోర్స్ పోలీసులను విడిపించి, బాగేపల్లికి పిలుచుకువచ్చారు. అప్పటికే విషయాన్ని తెలుసుకున్న హిందూపురం పోలీసులు పెద్ద ఎత్తున బాగేపల్లి చేరుకున్నారు. ఎస్ఐ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు 17 మందిపై కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించి నరసింహప్ప, నాగరాజు, నరసింహప్పను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దాడిలో గాయపడిన వారిలో ఎస్ఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు నరేష్, రవి, మల్లికార్జున, నరేష్‌బాబు, లోకేష్‌కుమార్ ఉన్నారు.