పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్‌తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు.
కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.
Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem Autmotive
For the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥
Made Up with a Cost of 7Cr for Car which is INSANE
pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024
Comments
Please login to add a commentAdd a comment