
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898ఏడీ'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్‌హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని కారు బుజ్జి లుక్‌ను రివీల్ చేశారు. దీని కోసం హైదరాబాద్‌లో భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో ప్రభాస్ కారును నడుపుతూ సందడి చేశారు.
అయితే బుజ్జి ఇండియా మొత్తం టూర్ చేస్తోంది. ప్రధాన నగరాలను అన్నింటినీ చుట్టి వస్తోంది. తాజాగా ముంబయిలోని జుహు బీచ్‌లో బుజ్జి సందడి చేసింది. దీంతో అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు క్యూ కట్టారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ముంబయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా.. కల్కి ట్రైలర్‌ను ఈనెల 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీన్ని కూడా ముంబయిలోనే భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.
Bujji at JUHU Beach ⛱️, MUMBAI.#Prabhas #Bujji #Bhairava #Kalki2898AD pic.twitter.com/grY8Pegd7e
— Prabhas Fan (@ivdsai) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment