Juhu beach
-
సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్
హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉండటం విశేషం.శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
బీచ్‌లో బుజ్జి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898ఏడీ'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్‌హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని కారు బుజ్జి లుక్‌ను రివీల్ చేశారు. దీని కోసం హైదరాబాద్‌లో భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో ప్రభాస్ కారును నడుపుతూ సందడి చేశారు.అయితే బుజ్జి ఇండియా మొత్తం టూర్ చేస్తోంది. ప్రధాన నగరాలను అన్నింటినీ చుట్టి వస్తోంది. తాజాగా ముంబయిలోని జుహు బీచ్‌లో బుజ్జి సందడి చేసింది. దీంతో అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు క్యూ కట్టారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ముంబయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.కాగా.. కల్కి ట్రైలర్‌ను ఈనెల 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీన్ని కూడా ముంబయిలోనే భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. Bujji at JUHU Beach ⛱️, MUMBAI.#Prabhas #Bujji #Bhairava #Kalki2898AD pic.twitter.com/grY8Pegd7e— Prabhas Fan (@ivdsai) June 7, 2024 -
లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?
ఇటీవలే వరుస సినిమాలతో దూసుకెళ్లన్న బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. తాజాగా 'సత్య ప్రేమ్ కీ కథ' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ యంగ్ హీరోకు సంబంధించి బీ టౌన్లో ఓ వార్త తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్) కార్తీక్ ఆర్యన్ తాజాగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జుహులో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన ఫ్లాట్ విలువ దాదాపు రూ. 17.50 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తిని జూన్ 30వ తేదీన కొ నుగోలు చేసినట్లు సమాచారం. కార్తీక్ ఆర్యన్ తన తల్లి మాలా తివారీ ఈ ఫ్లాట్ కొనుగోలుకు డీల్ కుదిర్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కార్తీక్ ఆర్యన్ నెలకు రూ.7.5 లక్షలు చెల్లిస్తూ షాహిద్ కపూర్ ఇంటిలో నివసిస్తున్నారు. కాగా.. ప్యార్ కా పంచ్‌నామా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సత్యజీత్ కీ ప్రేమ్ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్యన్.. తదుపరి చిత్రం కెప్టెన్ ఇండియాలో నటించనున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
బిపర్‌జోయ్‌తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్‌లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
Ishita Sharma: మేమే మా ధైర్యం!
ముంబై జూహూ గ్రౌండ్స్‌లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి... ‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ. ముంబైలో డాన్స్ స్కూల్‌ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది. 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది. అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు. దేహం, గళం, బుద్ధి ‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత. ‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది. 1100 స్కూళ్లలో ‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్‌బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు. మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె. నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. -
విరుష్క జంట అద్దె ఫ్లాట్.. ధర వింటే మీరు క్లీన్ బౌల్డ్..!
బాలీవుడ్ నటి అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ జంట గురించి పరిచయం అక్కర్లేదు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమంగా రాణించిన విరాట్ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ కలిసి ఉన్నారు. ఎప్పుడు బిజీగా ఉండే ఈ జంట తాజాగా ముంబైలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ను నెలకు దాదాపు రూ.2.76 లక్షల అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. నాల్గవ అంతస్తులో ఉండే ఆ భవనం 1,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో రెండు భూగర్భ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 17న రిజిస్ట్రేషన్ సమయంలో విరాట్ కోహ్లీ రూ.7.50 లక్షల డిపాజిట్ చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ వడోదర రాజకుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్సింగ్ గైక్వాడ్‌కు చెందినదిగా సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌లో ఒక ఫామ్‌హౌస్‌ను రూ.19.24 కోట్లతో కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. జిరాద్ గ్రామ సమీపంలోని 8 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అనుష్క చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా 2018 తర్వాత ఆమె మరోసారి తెరపై కనిపించనుంది. చక్దా ఎక్స్‌ప్రెస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ బయోపిక్. ఈ చిత్రంలో అనుష్క తన కెరీర్లో తొలిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. చక్దా ఎక్స్‌ప్రెస్ మూవీ వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. -
రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం
బాలీవుడ్ నటి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో ఉన్నారని టాక్. అంతేకాదు.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనున్నారట. బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్‌ను కూడా ఖరారు చేశారట. కాగా జాక్వెలిన్ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్‌తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్‌ఫుల్ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్‌తో ఆమె డేటింగ్ చేశారని, 2013లో బ్రేకప్ అయ్యారని టాక్. అయితే ఆ బ్రేకప్‌కి ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్ బాయ్’కి జాక్వెలిన్ డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
జుహూ బీచ్‌ను చూడండి.. ఎలా ఉందో : నటి
ముంబై : గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా లక్షల సంఖ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను సముద్రాలు, నదులలో నిమజ్జనం చేస్తుండటం వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. ఈ విషయంలో చైతన్యం తీసుకురావడానికి ఎంత ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతుండటంపై తాజాగా ప్రముఖ నటి సోనాలి బింద్రె ఆవేదన వ్యక్తం చేశారు. జుహూ బీచ్‌లో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయగా అక్కడ ఏర్పడిన విగ్రహా వ్యర్థాలు, ఇతర పూజా సామాగ్రిని ఓ చోట కుప్పగా పోసిన ఆ ఫోటోను ఆమె ట్విటర్లో పోస్టు చేశారు. ‘నిన్న జహూ బీచ్‌లో గణేష్ నిమజ్జనం తర్వాత తీసిన ఫోటో ఇది. ఇవి మనకు నష్టం కలిగించే సంకేతాలు కాకపోతే మరేంటో నాకు తెలియదు. ఇలా జరగకూడదు. ఇంతకన్నా మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు. దీంతో పర్యావరణహితంగా గణేష్ చతుర్థిని తాము ఎలా జరుపుకున్నామో చెబుతూ కొందరు ఆమెకు రిప్లై ఇచ్చారు. వారి రిప్లైలకు సంతోషం వ్యక్తం చేసిన సోనాలి బింద్రే సంప్రదాయ దుస్తులు ధరించి గణేష్ వేడుకల్లో పాల్గొన్న మరొక ఫోటోను షేర్ చేశారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల గత సంవత్సరం గణేష్ ఉత్సవాలలో పాల్గొనలేదని, ఈ సంవత్సరం తన కుటుంబసభ్యులతో కలసి ఉత్సాహంగా పోల్గొన్నానని ఆమె తెలిపారు. పర్యావరణహితంగా గణేష్ పండుగను జరుపుకోవాలని, అదే నిజమైన పండుగ స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. ఇక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాల వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హానీ కల్గించే విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయరాదని ఆయన ప్రజలను కోరారు. గణేష్ విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రి వల్ల నదులు, సముద్రాలు కలుషితం అవుతున్నాయని, కాలుష్యాన్ని తగ్గించే సమయం ఆసన్నమైందని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది చదవండి : శోభాయాత్ర సాగే మార్గాలివే..! -
రాకాసి జెల్లీఫిష్‌ల కలకలం.. అలర్ట్
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధానిలో రాకాసి జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత ‘బాటిల్ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం. బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ‘బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా. ప్రజలకు నేను సూచించేది ఒక్కటే. బీచ్‌కు రాకపోవటమే ఉత్తమం’ అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి చెబుతున్నాడు. (కిల్లింగ్ వేల్ ‘హర్ట్ టచింగ్’ ఉదంతం) అంత డేంజర్ కాదు... బ్లూ బాటిల్ జెల్లీఫిష్ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు. ‘ఈ విషయంలో అపోహలు వద్దు. వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయి. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది’ అని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. -
జుహూ బీచ్ కి అతి పెద్ద తిమింగలం
ముంబయి: ముంబయిలోని జుహీ బీచ్ సముద్ర తీరానికి గత రాత్రి భారీ తిమింగలం (వేల్) కొట్టుకు వచ్చింది. 30 అడుగుల పొడవు మూడు నుంచి నాలుగు టన్నుల బరువుగల ఈ తిమింగలాన్ని గురువారం రాత్రి పది గంటలకు ఒడ్డుకు కొట్టుకుని రావటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే రెండు రోజుల క్రితమే ఆ తిమింగలం చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అది చనిపోవడం వల్లే తీరానికి కొట్టుకొచ్చిందని, సముద్రంలోని వాతావరణ మార్పుల వల్ల తిమింగలాలు ఊపిరి ఆడక ఒడ్డుకు కొట్టుకునివస్తాయని మెరైన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో క్రేన్ ద్వారా ఆ తిమింగలాన్ని అక్కడ నుంచి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కూడా అతి పెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా లోని అలీబాగ్ సమీపంలో... 20 టన్నుల బరువు 42 అడుగుల పొడవు ఉన్న నీలి తిమింగలం కొట్టుకు వచ్చింది. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మర్నాడే అది చనిపోవడంతో జేసీబీ యంత్రాల సాయంతో సముద్రం ఒడ్డునే పాతి పెట్టారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్రం టుటికోరిన్ బీచ్ వద్ద దాదాపు వంద తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2000కు పైగా తిమింగలాలు సముద్ర తీరానికి కొట్టుకొస్తాయని, 1800 నుంచి 2015 వరకు ఏటా భారత సముద్ర తీరానికి 1500కు పైగా తిమింగలాలు కొట్టుకొచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.