సాక్షి, ముంబై: వాణిజ్య రాజధానిలో రాకాసి జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత ‘బాటిల్ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం. బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి.
‘బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా. ప్రజలకు నేను సూచించేది ఒక్కటే. బీచ్‌కు రాకపోవటమే ఉత్తమం’ అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి చెబుతున్నాడు. (కిల్లింగ్ వేల్ ‘హర్ట్ టచింగ్’ ఉదంతం)
అంత డేంజర్ కాదు... బ్లూ బాటిల్ జెల్లీఫిష్ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు. ‘ఈ విషయంలో అపోహలు వద్దు. వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయి. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది’ అని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment