jellyfish
-
చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు..
హాంకాంగ్‌లోని ఒక చెరువులో బయటపడింది ఈ వింతజీవి. జెల్లీఫిష్ జాతికి చెందిన ఈ జీవికి ఏకంగా ఇరవైనాలుగు కళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అంగుళం పరిమాణంలో పారదర్శకమైన శరీరం, మూడు పొడవాటి టెంటకల్స్ కలిగి ఉన్న ఈ జీవిని హాంకాంగ్‌లోని మై పో రిజర్వ్ చెరువులో గుర్తించారు. ఇది జెల్లీఫిష్లో ఇప్పటివరకు తెలియని కొత్తజాతికి చెందినదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గంట మాదిరిగా కనిపించే దీని శరీరం లోపలి వైపు ఆరుభాగాల్లో పన్నెండు జతల కళ్లు ఉన్నాయని, ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీఫిష్ మాదిరిగానే ఇది కూడా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు వివరించారు. హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జెల్లీఫిష్‌ను మూడేళ్ల కిందటే గుర్తించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, ఇటీవల దీని విశేషాలను మీడియాకు వెల్లడించారు. చదవండి: కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి -
మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం
కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది. వృద్ధాప్యం మీద పడుతుంది. వందేళ్లు బతికినా అందులో మూడు వంతులకుపైగా ముసలితనంతోనే గడిచిపోతుంది. అలాకాకుండా బతికినంత కాలం యంగ్‌గానే బతికేస్తే.. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వయసును వెనక్కి తీసుకెళ్లి.. మళ్లీ ఆ బాల్యాన్ని, యవ్వనాన్ని ఎంజాయ్ చేయగలిగితే..!? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోందా.. అలాంటిది ఎప్పటికైనా సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తోందా? ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అలాంటి రోజు రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం సముద్రంలో జీవించే ఓ చిత్రమైన జెల్లీ ఫిష్‌పై చేస్తున్న పరిశోధనలు తోడ్పడతాయని అంటున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. అన్ని జీవులకు భిన్నంగా.. సాధారణంగా సముద్రాల్లో నివసించే చాలా రకాల జెల్లీ ఫిష్‌లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది కొంతకాలం మాత్రమే, అదీ పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే తిరిగి వయసును వెనక్కి తగ్గించుకునే సామర్థ్యం పోతుంది. కానీ శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద సముద్రంలో సరికొత్త జెల్లీ ఫిష్‌ను కనుగొన్నారు. టుర్రిటోప్సిస్ డొహ్రని (టీ.డోహ్రని) అని పేరుపెట్టి.. పరిశోధన చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. జీవితంలో ఏ దశలో అయినా, ఎప్పుడైనా తిరిగి తన వయసును వెనక్కి తగ్గించుకోలదు. దీనికి ఈ సామర్థ్యం ఎలా వచ్చిందన్న దానిపై స్పెయిన్‌లోని ఓవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇటీవలే ఈ పరిశోధన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. రెండు సెట్ల జన్యువులతో.. సాధారణంగా ఏ జీవిలో అయి నా వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలో కణ విభజన జరుగుతూ.. జన్యువుల్లో మార్పులు జరుగుతుంటాయి. కణాల్లో జన్యుక్రమానికి సంబంధించిన సమాచారం నిల్వ ఉండే టెలోమెర్ల (జన్యువులు ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఉండే భాగాలు) పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులే వృద్ధాప్యానికి కారణమవుతాయి. టీ.డోహ్రని జెల్లీ ఫిష్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. దానిలో జన్యువులన్నీ మరో సెట్ కాపీ చేసి ఉన్నాయని గుర్తించారు. దీనివల్ల ఈ జెల్లీ ఫిష్ వయసు పెరిగినకొద్దీ ప్రధాన జన్యువుల్లో మార్పులు జరిగినా, దెబ్బతిన్నా.. వాటిని మరో సెట్ సాయంతో తిరిగి సరిచేసుకుంటున్నట్టు తేల్చారు. అంతేగాకుండా ఈ జెల్లీఫిష్‌ల కణాల్లోని టెలోమెర్ల పొడవు తగ్గకుండా అంతర్గత వ్యవస్థలు పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీనివల్ల ఇవి వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సామర్థ్యంతో ఏం చేస్తుంది? టి.డోహ్రిని జెల్లీఫిష్‌లకు వృద్ధాప్యం రానప్పుడు.. మళ్లీ వయసును తగ్గించుకునే సామర్థ్యం ఎందుకనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జెల్లీ ఫిష్‌లు మరీ ఎక్కువ వయసుకు వచి్చనప్పుడు, ఇతర జీవుల దాడుల్లో దెబ్బతిన్నప్పుడు, అవి ఉన్న పరిస్థితులు జీవించడానికి అనుకూలంగా లేనప్పుడు.. వయసు తగ్గించేసుకుని, తిరిగి ఎదుగుతున్నట్టు గుర్తించారు. చాలా రకాల కీటకాలు, ఇతర జీవుల తరహాలోనే జెల్లీ ఫిష్‌ల పరిణామక్రమం ఉంటుంది. ఉదాహరణకు దోమ మొదట పిండం రూపంలో, తర్వాత లార్వా వంటి మధ్యస్థ దశలో, తర్వాత పూర్తి రూపంలోకి ఎదుగుతుంది. సీతాకోక చిలుకలు మొదట గుడ్డు, తర్వాత పురుగు, చివరిగా ఎగిరే సీతాకోక చిలుకల్లా మారుతాయి. ఇదే తరహాలో టి.డోహ్రిని జెల్లీ ఫిష్‌లు క్రమంగా తమ పూర్వరూపాలకు మారుతూ.. పిండం దశదాకా (జెల్లీ ఫిష్.. సిస్ట్.. పాలిప్ రూపాలదాకా) వెళ్తాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తిస్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా అనుభవిస్తాయని అనుకోవచ్చు. ఇదే శక్తి మనకూ వస్తే..? ఈ జెల్లీ ఫిష్‌లలో ఉండో రెండో సెట్ జన్యువులు కణాల రక్షణకు, పునరుద్ధరణకు తోడ్పడే ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తున్నాయని ఓవిడో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్లపై పరిశోధన చేయడం ద్వారా.. మనం తిరిగి మరీ చిన్నపిల్లల్లా మారిపోకున్నా, వృద్ధాప్యాన్ని దూరం చేసే అత్యాధునిక విధానాలను అభివృద్ధి చేయవచ్చని చెప్తున్నారు. ఎన్నోరకాల జన్యు సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకూ సమర్థవంతమైన చికిత్సలను రూపొందించవచ్చని అంటున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో అసలు వృద్ధాప్యమే దరి చేరకుండా ఉండే ఔషధాలు, చికిత్సలు వచ్చే అవకాశమూ ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: జంతువుల మాదిరిగానే..మనుషులకు తోక! -
వింతైన దృశ్యం: సముద్రంలో తెల్లటి చుక్కలు: వీడియో వైరల్
జెల్లీఫిష్‌లు గురించి అందరూ వినే ఉంటారు. వాస్తవానికి అవి మహా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో సంచరించే ఒక రకమైన జీవి. ఈ అకశేరుకాలలో మెదుడు అనేది ఉండదు. వాటి శరీరంలో మొత్తం దాదాపు 95% నీరు ఉంటుంది. మనం మహా అయితే ఒకటో రెండో జెల్లీ ఫిష్‌లు సముద్రంలో అరుదుగా కనిపిస్తాయి. ఏకంగా పెద్ద సముహంలా జెల్లీఫిష్‌లను చూసి ఉండం. కానీ ఇజ్రాయెల్‌లోని నేషన్స్ పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ ఒక అద్భుతమైన వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పడవ చుట్టూ భారీ సముహంలా కొన్ని లక్షల జెల్లీఫిష్‌లు ఉంటాయి. పైగా అవి చూసేందుకు సముద్రంలో తెల్లటి చుక్కల వలే అందంగా కనిపిస్తాయి. చూసేందుకు భలే అద్భుతంగా ఉంటుంది. ఐతే కాలుష్యం, వాతావరణ మార్పులే ఈ జెల్లిఫిష్‌లు అధిక సంఖ్యలో పెరిగిపోవడానికి కారణమని అంటున్నారు శాస్త్రవేత్లు. ఇవి వాస్తవానికి హిందూ మహాసముద్రలో ఉద్భవించాయి. ఐతే సూయజ్ కాలువా ద్వారా తూర్పు మధ్యధరా ప్రాంతానికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. శీతలికరణం కోసం సమద్రపు నీటిని వినియోగిస్తాయి. కానీ అధిక సంఖ్యలో ఉన్న ఈ జెల్లీఫిష్‌లు పవర్ స్టేషన్లో విద్యుత సరఫరాకి ప్రమాదకరంగా ఉన్నాయి. ఐతే ఈ జెల్లీ ఫిష్‌లు మానువులను కుడతాయని కొద్దిపాటి మోతాదులో విషం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇవి కుట్టిన ఒక్కోసారి అంతపెద్ద ప్రమాదం సంభవించదు గానీ కాస్త నొప్పిగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతాం. కొన్ని అరుదైన సందర్భాల్లో విపరీతమైన నొప్పి ఏర్పడి మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!
భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ పెద్ద జీవి.. మళ్లీ పిండంగా మారి.. ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్ డోహ్రిని’ రకం జెల్లీఫిష్. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్‌లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది. కానీ ఈ జెల్లీఫిష్ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె ఉండవట. ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్‌సెల్స్)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్ స్పాంజ్’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండే ‘ఓసియన్ క్వాహోగ్’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్రీన్‌ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్‌లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్‌ల్యాండ్ షార్క్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. తాబేళ్లు.. లెక్క తక్కువే.. మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్ గలపాగోస్ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్సీ ఉర్చిన్’. పసిఫిక్ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట. తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. వృద్ధాప్యం ఎందుకొస్తుంది? జీవుల కణాల్లోని క్రోమోజోమ్‌లపై జన్యువులు, క్రోమోజోమ్‌ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? ►వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. ►కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. ►కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్’ అనే ప్రత్యేకమై ప్రొటీన్ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. ►అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు. -
నాగాయలంకలో జెల్లీఫిష్‌లు
నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక రేవులో జెల్లీఫిష్‌లు కనువిందు చేస్తున్నాయి. నాగాయలంక ఎగువ వరకూ సముద్రపు జలాలే (బ్యాక్ వాటర్) కావడంతో జెల్లీఫిష్‌లు, ఇతర సముద్ర చేపలు అధిక సంఖ్యలో చేరుతున్నాయి. ఆవలి తీరంలో వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో సందర్శకులు బోtట్లో వెళ్లి చూస్తున్నారు. ఆటవిడుపుగా జెల్లీఫిష్‌లను పట్టుకుని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రాకాసి జెల్లీఫిష్‌ల కలకలం.. అలర్ట్
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధానిలో రాకాసి జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత ‘బాటిల్ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం. బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ‘బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా. ప్రజలకు నేను సూచించేది ఒక్కటే. బీచ్‌కు రాకపోవటమే ఉత్తమం’ అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి చెబుతున్నాడు. (కిల్లింగ్ వేల్ ‘హర్ట్ టచింగ్’ ఉదంతం) అంత డేంజర్ కాదు... బ్లూ బాటిల్ జెల్లీఫిష్ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు. ‘ఈ విషయంలో అపోహలు వద్దు. వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయి. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది’ అని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. -
భూమిపై మొట్టమొదటి జీవులపై క్లారిటీ..
⇔ స్పాంజీలు కాదని తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు వాషింగ్టన్: సముద్ర జెల్లీలు భూమిపై ఉద్భవించిన మొట్టమొదటి జీవులని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మరుగునపడి ఉన్న ఈ విషయాన్ని ఈ అధ్యయనాలు బయటపెట్టాయి. అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ భూ ప్రపంచ ప్రారంభజీవులు స్పాంజీలు కాదని, జెల్లీలేననే విషయాన్ని తమ పరిశోధన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు. ఇందుకోసం వారు ఫైలో జెనిటిక్ ట్రీని రూపొందించి... తద్వారా 18 రకాల జంతువులు, మొక్కలు, శిలీంద్రాలపై పరిశోధన చేశారు. మొదట కలుపు మొక్కల జన్యువులను ఒక్కొక్కటిగా పరిశీలించి తరువాత ఇతర జన్యులతో సరిపోల్చి చూశారు. ఇందులోభాగంగా వారు వేల సంఖ్యలో జన్యువులను విశ్లేషించారు. దీనిలో వారు జీవి పరికల్పనకు జన్యువులు ఎంతవరకు కారణమవుతున్నాయనే విషయాన్ని గమనించారు. అయితే అవన్నీ ఒకే వర్గ వికాసాన్ని నిలకడగా చూపిస్తున్నాయి. అయితే జెల్లీలలో మాత్రం పరిణామ క్రమం భిన్నంగా ఉంది. దీనికోసం జెనిటిక్ డేటా తీసుకుని వాటితో సరిపోల్చి జెల్లీలు మొదటి జీవులనే విషయాన్ని తేల్చారు. దాదాపు 95 శాతం పరిశోధన బాగా జరిగిందని, మిగతా ఐదు శాతంలో మాత్రమే కొన్ని భేదాలు ఉన్నాయన్నారు. -
‘ఆ ఫొటోలు చూసి ఊపిరాగినంతపనైంది’
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఓ బీచ్‌లో పెద్ద మరణ మృదంగం.. అయితే, అది మనుషులది కాదు.. సముద్ర ప్రాణులది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేలు దాటి లక్షల్లో జెల్లీ ఫిష్ మృత్యువాతపడ్డాయి. ఇది చూసిన పర్యాటకులు, సముద్ర జంతురాశిని ప్రేమించేవారు ఓకింత కంటతడి కూడా పెడుతున్నారు. చార్లోటి లాసన్(24) అనే వ్యక్తి క్వీన్స్లాండ్ తీరానికి వెళ్లాడు. దూరం నుంచి చూసి సముద్రపు ఒడ్డు భలే విచిత్రమైన కలర్ ఉందే అనుకొని ఫొటో తీశాడు. అనంతరం సమీపించి చూడగా తాను తీసిన ఫొటోలో పడింది సముద్రపు కలర్ కాదని, చచ్చిపడి ఉన్న వేల జెల్లీఫిష్‌లని తెలిసి అవాక్కయ్యాడు. పోని అదేదో తాను ఫొటో తీసిన ప్రాంతంలోనే అనుకుంటే అది కాదు.. ఏకంగా ఆ సముద్ర తీరం ఎంతపొడవుందో అంత దూరం చనిపోయిన జెల్లీ ఫిష్ దర్శనమిచ్చాయి. సముద్ర తీర ప్రాంతంలో తిరుగాడే జంతువులకు సంబంధించిన బయాలజిస్ట్ లిసా అన్ గెర్ష్విన్ స్పందిస్తూ తాను ఆ ఫొటోలు చూసి కదిలిపోయానని, ఒక్క క్షణం ఊపిరి ఆగినంతపనైందని చెప్పింది. అదెదో ఒక వాల్ పేపర్‌లాగా పరుచుకుపోయాయి. ఏమాత్రం నిడివి లేకుండా దగ్గరదగ్గరగా అచ్చం సముద్రపు వర్ణం మాదిరిగా చనిపోయి పడి ఉన్నాయి. సముద్ర జలాలు కలుషితం అవ్వడం, వాతావరణంలో విపరీత మార్పులు వాటి చావుకు కారణమై ఉండొచ్చని, తాము కారణాలు శోధిస్తున్నామని ఆమె చెప్పారు. -
జెల్లీ ఫిష్ లాడ్జి గదులు!
ఒక్కదెబ్బకు నాలుగు పిట్టలంటే ఇదేనేమో... ఫొటోలు చూశారా? అందులో నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నవి ఏమనుకుంటున్నారు? ఇవి.. లాడ్జీ రూములు. అంతే కాదు, గాలీ, నీరు క్లీన్ చేసే యంత్రాలు కూడా. ప్లస్ ఆకు కూరలు, కాయగూరలు పండించే పొలాలు! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవద్దు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బుడగలు నదుల్లో, కాలువల్లో లాడ్జీ రూముల్లా పనిచేస్తాయి. పైభాగంలో ఉన్న వస్త్రంలో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అడుగున నీట్లో దారపు పోగుల్లా వేలాడుతూ ఉండే నిర్మాణాలు కొట్టుకుపోయే చెత్తను ఒడిసిపడతాయి. అంతేకాకుండా ఈ పోగుల్లోనే నీటిలోని కాలుష్యాలను లెక్కకట్టే సెన్సర్లు వగైరాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ కాలుష్యాలు ఎక్కువగా ఉంటే పైన ఉన్న చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాల ద్వారా రకరకాల బ్యాక్టీరియాతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత వదిలేస్తారు. లేదంటే బుడగలోపల పంటలకు ఉపయోగిస్తారు. జానైన్ హంగ్ అనే డిజైనర్ చేతిలో రూపుదిద్దుకున్నాయి ఇవి. లాడ్జీల నిర్వహణతో పరిసరాల్లోని ప్రజలకు అదనపు ఆదాయం లభిస్తుందని, గాలి, నీరు శుద్ధి చేయడం, కాయగూరలు, ఆకు కూరలు పండించడం అదనపు ప్రయోజనాలని అంటున్నారు హంగ్. ప్రస్తుతానికి వీటిని వాస్తవరూపంలో ఏర్పాటు చేసే ఆలోచనలేవీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కాలుష్యం మరింత ఎక్కువైతే.. రసాయనాల వాడకంపై మరింత కఠినమైన నియంత్రణలు అమల్లోకి వస్తే ఇలాంటి సహజ సిద్దమైన ఏర్పాట్లకు ప్రాముఖ్యత లభించవచ్చు. జనావాసాలను ప్రకృతి స్ఫూర్తితో నిర్మించడం అన్న అంశంపై ఇన్హ్యాబిటాట్ వెబ్సైట్ ఏర్పాటు చేసిన ఒక పోటీకి హంగ్ ఈ జెల్లీఫిష్ లాడ్జీ డిజైన్‌ను పంపించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
ఆస్ట్రేలియా జెల్లీఫిష్‌కు బాలుడి పేరు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో వెలుగుచూసిన కొత్త జాతి జెల్లీషిఫ్కు శాస్త్రవేత్తలు ఓ బాలుడిపేరు పెట్టారు. వివరాలు.. 2013లో సాక్సన్ థామస్ (9) ఏళ్ల బాలుడు క్వీన్స్లాండ్ కాలువ వద్ద తన తండ్రితో కలిసి చేపలు పడుతున్నాడు. ఆ సమయంలో డబ్బా ఆకారంలో ఉన్న జెల్లీఫిష్ ఒకటి తీరానికి కొట్టుకువచ్చింది. దాని పొడవైన ‘టెంటికిల్స్’ను చూసి ఇదేదో కొత్త జీవి కావచ్చన్న అనుమానంతో వలసాయంతో తీశాడు. చొరవతీసుకుని దాన్ని క్వీన్స్లాండ్ మ్యూజియంకు పంపాడు. అక్కడ ఆ జెల్లీఫిష్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది నిజంగా కొత్త జాతేనని నిర్ధారించారు. తనకు దొరికిన జెల్లీఫిష్‌ను క్వీన్స్లాండ్ మ్యూజియానికి పంపాలన్న తొమ్మిదేళ్ల సాక్సన్ సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే పిల్లాడికి గౌరవార్థంగా సాక్సన్ థామస్ పేరు కలిసేలా ‘క్రిప్సెల్లా సాక్సానీ’ అని నామకరణం చేశారు.