భూమిపై మొట్టమొదటి జీవులపై క్లారిటీ..
⇔ స్పాంజీలు కాదని తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: సముద్ర జెల్లీలు భూమిపై ఉద్భవించిన మొట్టమొదటి జీవులని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మరుగునపడి ఉన్న ఈ విషయాన్ని ఈ అధ్యయనాలు బయటపెట్టాయి. అమెరికాలోని వండర్‌బిల్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ భూ ప్రపంచ ప్రారంభజీవులు స్పాంజీలు కాదని, జెల్లీలేననే విషయాన్ని తమ పరిశోధన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు. ఇందుకోసం వారు ఫైలో జెనిటిక్ ట్రీని రూపొందించి... తద్వారా 18 రకాల జంతువులు, మొక్కలు, శిలీంద్రాలపై పరిశోధన చేశారు.
మొదట కలుపు మొక్కల జన్యువులను ఒక్కొక్కటిగా పరిశీలించి తరువాత ఇతర జన్యులతో సరిపోల్చి చూశారు. ఇందులోభాగంగా వారు వేల సంఖ్యలో జన్యువులను విశ్లేషించారు. దీనిలో వారు జీవి పరికల్పనకు జన్యువులు ఎంతవరకు కారణమవుతున్నాయనే విషయాన్ని గమనించారు. అయితే అవన్నీ ఒకే వర్గ వికాసాన్ని నిలకడగా చూపిస్తున్నాయి. అయితే జెల్లీలలో మాత్రం పరిణామ క్రమం భిన్నంగా ఉంది. దీనికోసం జెనిటిక్ డేటా తీసుకుని వాటితో సరిపోల్చి జెల్లీలు మొదటి జీవులనే విషయాన్ని తేల్చారు. దాదాపు 95 శాతం పరిశోధన బాగా జరిగిందని, మిగతా ఐదు శాతంలో మాత్రమే కొన్ని భేదాలు ఉన్నాయన్నారు.