
వాషింగ్టన్: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఇండో–పసిఫిక్ దేశాల సందర్శనలో భాగంగా తనకు బాగా పరిచయమున్న భారత్‌కు వెళ్లనున్నట్లు ఆమె సోమవారం వెల్లడించారు. ఆయా దేశాలతో సంబంధాల బలోపేతానికి, అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యాలైన శాంతి, స్వేచ్ఛల సాధనే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పారు. జపాన్, థాయ్‌లాండ్, భారత్‌లలో పర్యటించడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌లో ఆగుతానని చెప్పారు.
విమానంలో అడుగుపెడుతున్న ఫొటోను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు. మొదటగా ఆమె హనొలులులో ఆగుతారు. అక్కడున్న యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళతారు. కాగా, ప్రధాని మోదీ (PM Modi) ఆహ్వానంపై భారత్‌కు వస్తున్న తులసీ 18న ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
చావెజ్ నియామకానికి సెనేట్ ఆమోదం
అమెరికా కార్మిక మంత్రిగా ట్రంప్ నామినీ లోరీ ఛావెజ్ డీరెమర్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు మంచి వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకోసం పాటుపడతానని అనంతరం చావెజ్ ప్రకటించారు. అమెరికా కార్మికులను ప్రనపంచంలోనే తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తమ తొలగింపును కోర్టుల్లో సవాలు చేసిన వేళ ఆమె ఈ ప్రకటన చేయడం విశేషం.
చదవండి: భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఆమె నియామకాన్ని ఇంటర్నేషనల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ టీమ్‌స్టర్స్‌తో సహా ప్రముఖ కార్మిక సంఘాలు స్వాగతించాయి. అమెరికా కార్మిక శాఖలో దాదాపు 16 వేల మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులున్నారు. ఉద్యోగుల తొలగింపుకు ట్రంప్ ప్రభుత్వమే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కార్మిక మంత్రిగా చావెజ్ ఏ మేరకు స్వేచ్ఛగా పని చేయగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment