ఓక్లాండ్‌లో కమలా హ్యారిస్ సభకు భారీగా వచ్చిన మద్దతుదారులు
వాషింగ్టన్: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి అన్నారు.
హిందువుననే విమర్శలు
తులసీ గబార్డ్
హిందువునైనందునే తనపై విమర్శలు చేస్తూ తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో నిలిచిన మహిళ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ ప్రధాని మోదీతో నా భేటీని రుజువుగా చూపి నేను హిందూ జాతీయవాదినంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీతో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీసహా ఎందరో భేటీ అయ్యారు. వారినెవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వాళ్లు హిందువులు కారు. ఇలా చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే. మత దురభిమానాన్ని ప్రదర్శించడమే’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో తులసీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment