tulsi gabbard
-
USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!
వాషింగ్టన్: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ఏబీసీ ఛానల్లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్ తులసి గబార్డ్ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా ట్రంప్ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్ చేశారు. చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్లకు సిద్ధమవడానికి ట్రంప్ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. -
తుల్సీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు తుల్సీ(తులసి) గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. తుల్సీ గబ్బార్డ్.. అమెరికా చట్ట సభకు ఎన్నికైన తొలి హిందూ-అమెరికన్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ కోసం యత్నించిన తొలి హిందువుగా(అత్యంత చిన్నవయస్కురాలిగా కూడా) తుల్సీ గబ్బార్డ్ చరిత్రకెక్కారు. అయితే ఆ తర్వాత వైదొలిగి జో బైడెన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇరవై ఏళ్లుగా డెమొక్రటిక్ పార్టీతో అనుబంధం ఉన్న ఆమె.. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ జాత్యహంకారం ప్రదర్శిస్తోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో 30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారామె. Click the link to watch my full statement on why I'm leaving the Democratic Party: https://t.co/pH58rEFpmS — Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) October 11, 2022 దేశ ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను డెమొక్రటిక్ పార్టీ అణగదొక్కుతోందని, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం అనే సిద్ధాంతాన్నే తాను నమ్ముతున్నానని, కానీ, ఇప్పుడున్న డెమొక్రటిక్ పార్టీ ఈ విలువలకు కట్టుబడి లేదని ఆమె విమర్శించారు. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికతకు డెమొక్రటిక్ పార్టీ శత్రువుగా మారింది. అమెరికా అణు యుద్ధంలోకి లాగుతోందని ఆరోపించారు. పార్టీ అవలంభిస్తున్న యాంటీ వైట్ రేసిజంను ఖండిస్తూ.. ఇకపై పార్టీలో సభ్యురాలిగా కొనసాగబోనని ఆమె ప్రకటించారు. ప్రస్తుతానికి తాను స్వతంత్రురాలినని ప్రకటించుకున్న ఆమె.. రిపబ్లికన్ పార్టీలో చేరతారా? మరేదైనా రాజకీయ వేదికను ఆశ్రయిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 41 ఏళ్ల వయసున్న తుల్సీ గబ్బార్డ్.. హవాయ్ స్టేట్హౌజ్కు ప్రతినిధిగా తన 21 ఏళ్ల వయసులోనే ఎంపికయ్యారు. హవాయ్ ఆర్మీ నేషనల్ గార్డు తరపున మెడికల్ యూనిట్లో ఇరాక్‌లో 2004-05 మధ్య, కువైట్‌లో 2008-09 మధ్య ఆమె విధులు నిర్వహించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ ఆమె పని చేశారు. అమెరికన్ సమోవాన్ ద్వీపమైన టుటులియాలో పుట్టి పెరిగిన గబ్బార్డ్.. సమోవాన్-యూరోపియన్ మూలాలు ఉన్న వ్యక్తి. యుక్తవయసులోనే ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. అందుకు గబ్బార్డ్ ముందర సంస్కృత పదం తులసి(తుల్సీ)ని చేర్చుకున్నారు. 2013 నుంచి 2021 మధ్య.. నాలుగు సార్లు యునైటెడ్ స్టేట్స్ హౌజ్ ఆఫ్ రెప్రెజెంటేటివ్‌గా ఆమె ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Tulsi Gabbard (@tulsigabbard) హిందుతత్వాన్ని పుణికిపుచ్చుకున్న తుల్సీ గబ్బార్డ్.. గౌడియ వైష్ణవాన్ని అనుసరిస్తున్నారు. తనను తాను కర్మ యోగిగా అభివర్ణించుకుంటారు. భగవద్గీతను నమ్మే ఆమె.. 2013లో ప్రమాణ సమయంలో భగవద్గీత మీద ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆ భగవద్గీత కాపీనే 2014లో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె అందించారు. 2002లో ఎడురాడో టమాయో అనే వ్యక్తిని వివాహమాడిన ఆమె.. 2006లో విడాకులిచ్చారు. ఆపై 2015లో ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అబ్రహం విలియమ్స్‌ను శాస్త్రోతంగా వివాహం చేసుకున్నారు. గతంలో సొంత పార్టీకి చెందిన బరాక్ ఒబామా పైనా విమర్శలు గుప్పించిన ఆమె.. రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలను కొన్నింటికి మద్దతు ప్రకటించడం గమనార్హం. -
ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్ రాలేదు!
(వెబ్ స్పెషల్): ఆకాశంలో సగం.. అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం... అత్యున్నత స్థాయి పదవీ బాధ్యతలు.. ఆటపాటలు మొదలు అంతరిక్షయానం వరకు ప్రతీ అంశంలోనూ అతివలు తమదైన ముద్ర వేస్తూ అన్నింటా మెరుగ్గా రాణిస్తున్నారు. రాజకీయ చదరంగంలోనూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనాపగ్గాలు చేపట్టి ప్రతికూలతలను అధిగమిస్తూ తమకు తామే సాటి అని నిరూపించిన, నిరూపిస్తున్న మహిళా నాయకులు ఎంతో మంది ఉన్నారు. అయితే అన్ని విషయాల్లోనూ ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో మాత్రం ఇంతవరకు ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం రాలేదు. 244 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్ర కలిగిన అగ్రరాజ్యంలో నేటికీ దేశాధినేత హోదా ‘ఆమె’కు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రిపబ్లికన్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఈసారి కూడా మహిళలకు మొండిచేయే ఎదురైంది. వస్తుందో రాదో తెలియని అవకాశం కోసం మరో నాలుగేళ్లపాటు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ ఇద్దరు.. ఎవరి ప్రత్యేకతలు వారివి.. నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థిత్వానికై పోటీపడిన మహిళల్లో ఈసారి తులసి గబ్బార్డ్(39), కమలా హారిస్(55) పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వాళ్లిద్దరూ వామపక్ష భావజాలం గల డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. అయినప్పటికీ ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అయితే ముక్కుసూటిగా మాట్లాడటంలో గానీ, నమ్మిన సిద్ధాంతానికై కట్టుబడి ఉండటంలో గానీ ఇద్దరూ ఘనాపాటీలే. పార్టీలో చేరిన అనతికాలంలోనే లక నేతలుగా ఎదిగి తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆసియా- ఆఫ్రికన్ మూలాలున్న కమల ఫిమేల్ ఒబామాగా ప్రసిద్ధికెక్కితే.. హిందూ ధర్మాన్ని పాటించే తులసి గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పతాక శీర్షికల్లో నిలిచారు. న్యాయ విద్యనభ్యసించిన కమలా హారిస్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేసిన అనుభవం ఉంటే.. సైనికురాలిగా తులసి, అమెరికా తరఫున పలు యుద్ధాల్లో పాల్గొని నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా సేవలు అందించారు. (చదవండి: సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా!) ఇక రాజకీయాల విషయానికొస్తే అత్యంత పిన్న వయస్సు(21)లోనే హవాయి స్టేట్ లెజిస్లేటివ్(2002)గా ఎన్నికైన ఘనత తులసి గబ్బార్డ్ సొంతమైతే.. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కమలా కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే ఇండో-అమెరికన్ల అభిమానం చూరగొన్న విషయంలో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. ఇండో- జమైకన్ సంతతికి చెందిన కమలా హారిస్ పట్ల ప్రవాస భారతీయులకు(అమెరికా) ‘మన’ అనే భావన ఉండటం సహజమే అయినప్పటికీ.. అమెరికన్ సమోవా సంతతికి చెందిన తులసికి మద్దతు తెలపడానికి గల ముఖ్య కారణాల్లో ఆమె హిందువు కావడం ఒకటిగా చెప్పవచ్చు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పీవీ గోపాలన్ మనుమరాలైన కమల తనను తాను అమెరికన్‌ను అని చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తే.. తులసి అనేకసార్లు భారతదేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.(చదవండి: అమెరికా ఒకప్పుడు బానిసగానే..) కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ధీశాలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించినపుడు ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో తులసీ గబ్బార్డ్ వార్తల్లో నిలిచారు. అంతేకాదు 2014లో ప్రధాని హోదాలో న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించిన సమయంలో మోదీను కలిసి అభినందించడంతో పాటు.. భగవద్గీతను బహూకరించారు. తద్వారా ఇండో- అమెరికన్లలో మంచి గుర్తింపు పొందారు. ఇక టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్ ఎథిక్స్ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ఐసిస్, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బాధితులు, మైనార్టీల పక్షాన నిలబడేందుకు ఏమాత్రం వెనకడుగువేయనని చెప్పారు. ఆలోచిస్తున్నా.. ‘అవును.. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మా దేశ దశ దిశల గురించిన శ్రద్ధ నాకు ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ గతేడాది డిసెంబరులో తులసి.. తాను అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికై పోటీ పడే విషయమై ప్రకటన చేశారు. అయితే ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన తులసికి సరిపడా ఓట్లు పడకపోవడంతో మార్చిలో ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను ఎండార్స్ చేశారు. (చదవండి: అగ్రరాజ్యంలో కమల వికాసం) ఒక అవకాశం చేజారినా.. చరిత్ర సృష్టించిన కమల ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అంటూ కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి పోటీ చేసే విషయమై గతేడాది జనవరిలో ప్రకటన చేశారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి‘ఫర్ ద పీపుల్’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, వలస విధానం, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించారు. ‘మనమంతా కలిసే ఈ పని పూర్తి చేస్తాం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అంటూ కమల విడుదల చేసిన క్యాంపెయిన్ వీడియోకు అనూహ్య స్పందన లభించింది.(చదవండి: తాతయ్యతో కమలా హారిస్ అనుబంధం) అందుకు తగ్గట్టే ప్రచార పథంలో దుసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే కమల.. 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు అదే ఏడాది డిసెంబరులో కమల ప్రకటన చేశారు. అయితే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిన తరుణంలో అనూహ్యంగా ఆమె ఉపాధ్యక్ష పదవి రేసులో నిలిచి.. ఆ ఘనత సాధించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇండో- అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా జో బిడెన్ కమలకు ఈ అవకాశం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో అయినా.. ఇక అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా పనిచేసిన దాఖలాలు లేవు. 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం గనుక సాధించినట్లయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవి అలంకరించే తొలి మహిళగా కమలా హారిస్ మరో సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రతిసారీ ఆమెను పదే పదే టార్గెట్ చేయడం, తనను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే కమలకు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఏదేమైనా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనైనా కమలను ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా చూసే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే కమల కంటే వయస్సులో 16 ఏళ్లు చిన్నదైనా తులసిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఎప్పుడైనా కమలకు ఆమెను పోటీగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అమెరికాకు ఒక మహిళ గనుక అధ్యక్షురాలు కావాలంటే ఆమె కచ్చితంగా డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే అయి ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ‘సంప్రదాయ’ రిపబ్లికన్లు అధ్యక్ష ఎన్నికల్లో మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువే. ఇక డెమొక్రటిక్ పార్టీ 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. కాబట్టి భవిష్యత్తులో కమలా హారిస్నో లేదా తులసినో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా చూడవచ్చేమో!! -
అందుకే ఆ ఓటు వేయలేదు: తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ఓటింగ్ సందర్భంగా.. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన తులసి గబ్బార్డ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ను అభిశంసించే తీర్మానానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఆమె ఓటు వేయలేదు. అభిశంసన సందర్భంగా సభలో ఉన్నట్లు(ప్రెజెంట్) మాత్రమే ఆమె ఓటు వేశారు. ప్రతినిధుల సభలో తులసి వ్యవహారశైలి పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌నకు భారీ షాక్ తగిలినట్లయింది. ఇక తదుపరి సెనేట్‌లో అభిశంసనను ట్రంప్ ఎదుర్కోనున్నారు.(అభిశంసనకు గురైన ట్రంప్) ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్ ఓటు వేయకపోవడం ద్వారా పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీపడాలనుకున్న మహిళ.. ట్రంప్‌ను సమర్థిస్తున్నారా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. తనకు అన్నింటికన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ‘నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చు. అయితే నేనెంతగానో ప్రేమించే నా దేశమే నాకు ముఖ్యం. 658 పేజీల అభిశంసన నివేదిక చదివిన తర్వాత.. అందుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలనే విషయంలో నాకు స్పష్టత లేకుండా పోయింది. నిజానికి ఓటింగ్ సమయంలో నేను పూర్తి స్పృహలో లేను. అయితే అధ్యక్షుడు ట్రంప్ తను చేసిందానికి పశ్చాత్తాపపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేశాన్ని విభజించే ఎటువంటి నిర్ణయాలకు నేను అనుకూలం కాదు’ అని తులసి చెప్పుకొచ్చారు. అదే విధంగా అధ్యక్షుడిని గద్దె దింపేందకు కేవలం రాజకీయ అంశాలే ముఖ్యకారణం కాకూడదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. (విలక్షణ వ్యక్తిత్వం.. తులసి గబ్బార్డ్ సొంతం) -
‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’
వాషింగ్టన్: నమస్తే.. అమెరికా పర్యటనకు విచ్చేసిన మోదీ గారికి హృదయపూర్వక ఆహ్వానం.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు.. నన్ను క్షమించండి అన్నారు హిందూ మహిళా నేత, డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్. ప్రస్తుతం డెమోక్రటిస్ పార్టీ సభ్యురాలైన తులసి గబ్బార్డ్.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో.. హౌడీ మోదీ కార్యక్రమానికి రాలేకపోతున్నాని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు తులసి గబ్బార్డ్. ‘భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం.. ఆసియా-పసిఫిక్ భూభాగంలో భారత్, అమెరికాకు గొప్ప మిత్రుడు. ఈ రెండు దేశాలు కలిసి వాతావరణ మార్పులు, అణు యుద్ధాన్ని ఎదుర్కొవడం, అణు విస్తరణను నివారించడం, ఇరు దేశాల ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం వంటి సమస్యలతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. పురాతన వసుధైవ కుటుంబ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు గబ్బార్డ్. రెండు రోజుల క్రితం గబ్బార్డ్ కావాలనే హౌడీ మోదీ కార్యక్రమానికి రావడం లేదంటూ ప్రచురించిన ఓ కథనాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వలన నేను దీనికి హాజరు కాలేకపోతున్నాను. కానీ మోదీ అమెరికా పర్యటన ముగిసేలోపు ఆయనను కలవాలనుకుంటున్నాను’ అంటూ గబ్బార్డ్ ట్వీట్ చేశారు. -
గూగుల్‌కు ఊహించని షాక్
వాషింగ్టన్ : టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందు వరుసలో ఉన్న డెమోక్రాట్ ప్రతినిధి తులసి గబ్బర్డ్ గూగుల్‌పై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. తన ప్రచార ప్రకటనల ప్రసారాలపై గూగుల్ వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ లాస్ఏంజిల్స్లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. 50 మిలియన్ డాలర్ల (సుమారు 345 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. న్యూయార్క్ కథనం ప్రకారం ఒక రాజకీయ ప్రతినిధి టెక్ దిగ్గజంపై దావా వేయడం ఇదే మొదటిసారి. జూన్ 27-28 తేదీల్లో రాత్రిపూట ఆరు గంటలపాటు ప్రచారం తమ ప్రకటనల ఖాతాను గూగుల్ నిలిపివేసిందని గబ్బర్డ్ ప్రచార కమిటీ తులసి నౌ ఇంక్. ఆరోపించింది. తద్వారా తమకు 50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. తన ప్రచార అకౌంట్ గంటల తరబడి ఆఫ్‌లైన్‌లోనే ఉందనీ, ఎలాంటి వివరణ లేకుండా నిలిపివేసిందని గబ్బార్డ్ ఆరోపించారు. ఇంటర్నెట్ శోధనలో గూగుల్ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమైనదో గూగుల్ వైఖరి ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ధోరణి భావస్వేచ్ఛకు, నిష్పక్షపాత ఎన్నికలకు, అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అయితే అమెరికా ప్రజల తరపున దీనిపై తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. మరోవైపు గబ్బర్డ్ ఆరోపణలపై స్పందించిన గూగుల్, తులసి గబ్బర్డ్ ఖాతాలో అసాధారణ యాక్టివిటీ మూలంగానే ఆ అకౌంట్ బ్లాక్ అయిందని వివరించింది. తమ సిస్టంలోని ఆటోమేటిక్ ఫ్రాడ్ ప్రివెన్షన్ ఫీచర్ కారణంగా తాత్కాలిక షట్డౌన్కు దారితీసిందని గూగుల్ పేర్కొంది. -
ప్రజాస్వామ్యంపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి అన్నారు. హిందువుననే విమర్శలు తులసీ గబార్డ్ హిందువునైనందునే తనపై విమర్శలు చేస్తూ తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో నిలిచిన మహిళ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ ప్రధాని మోదీతో నా భేటీని రుజువుగా చూపి నేను హిందూ జాతీయవాదినంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీతో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీసహా ఎందరో భేటీ అయ్యారు. వారినెవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వాళ్లు హిందువులు కారు. ఇలా చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే. మత దురభిమానాన్ని ప్రదర్శించడమే’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో తులసీ వ్యాఖ్యానించారు. -
‘మీ పద్ధతి అస్సలు బాగోలేదు’
వాషింగ్టన్ : మతాన్ని కారణంగా చూపి తనను ఎన్నికల్లో ఓడించాలని కొంతమంది వ్యక్తులు, మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తులసి గబ్బార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతస్తురాలినైన కారణంగా తనను, తన మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం సరికాదని హితవు పలికారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు దిగిన ఫొటోలను ఆధారంగా చూపి నేను కేవలం ఒక మతానికి మాత్రమే విలువనిస్తానని దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మరికొంత మంది నా సహసభ్యులు కూడా మోదీని కలిసిన విషయాన్ని గుర్తించాలి. మత దురభిమానం గల వ్యక్తిగా నన్ను చిత్రీకరించే మీ పద్ధతి అస్సలు బాగోలేదు’ అంటూ ప్రత్యర్థులను విమర్శించారు. ఎవరైనా బాధితులే కదా ‘ఈరోజు హిందువుని లక్ష్యంగా చేసుకున్నారు. రేపు ముస్లిం లేదా యూదు అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లని లక్ష్యంగా చేసుకుంటారు. అయినా నేను భయపడను. కాంగ్రెస్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి హిందూ వ్యక్తిగా నేను గర్వపడతున్నాను. అలాగే అగ్రరాజ్య అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి హిందువుగా కూడా ఆనందపడుతున్నాను. అయితే ఈ విషయం కొంతమందికి నచ్చడం లేదు. దేశం పట్ల నా బాధ్యత గురించి ప్రశ్నించాలి గానీ నా మతం గురించి కాదు. చెత్త రాజకీయాలు వద్దు. ఇతర నాయకుల వలె నాకు ద్వంద్వ విధానాలు చేతకావు. ఎందుకంటే నేను హిందువును. అయినా నిజమైన అమెరికన్లు మతం, వర్గం, లింగ భేదాలను అనుసరించి ఓటు వేయరు’ అంటూ తులసి వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం నాయకులతో చర్చలు జరపడం అతి సాధారణ విషయమని గుర్తించకపోవడం విచారకరమన్నారు. (అధ్యక్ష పదవికి పోటీ చేస్తా : తులసి) కాగా అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కనున్నారు. అలాగే 2020 ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. అమెరికన్ సమోవా సంతతికి చెందిన తులసి.. 2002లో హవాయి స్టేట్ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నుంచి మొత్తం 12 మంది అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు అంచనా. ఎలిజబెత్ వారెన్, కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్, తులసీ గబ్బార్డ్, కమలా హ్యారిస్‌లు పోటీ విషయమై ప్రకటన చేయడంతో ట్రంప్‌పై పోటీకి ఎవరు నిలుస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు గెలిచినా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.(చదవండి : అవును.. సీరియస్‌గా ఆలోచిస్తున్నా) -
‘నేను పోటీ చేస్తున్నా.. నాతో కలిసి రండి’
వాషింగ్టన్ : ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అంటూ భారత సంతతి సెనెటర్ కమలా హ్యారిస్(54) అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై ప్రకటన చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్రకెక్కిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటించే వలస విధానాలు, ఇష్టారీతిన కీలక పదవుల్లో తన అనునాయులను నియమించే తీరును ప్రధానంగా విమర్శించేవారు. కాలిఫోర్నియా మాజీ అటార్నీ జనరల్‌గా విధులుగా నిర్వర్తించిన ఆమె ముఖ్యంగా పౌర హక్కుల కోసం పోరాడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు, హెల్త్‌కేర్ ప్రధాన అజెండా కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి కమలా హ్యారిస్.. ‘ఫర్ ద పీపుల్’ అనే నినాదంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ‘మనమంతా కలిసే ఈ పని పూర్తి చేస్తాం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అంటూ కమలా హ్యారిస్ తన క్యాంపెయిన్ వీడియోను విడుదల చేశారు. కాగా కమలా హ్యారిస్‌కు డెమోక్రటిక్ పార్టీలో మంచి నేతగా గుర్తింపు ఉంది. ఆమె సన్నిహితులు కమలను ‘ఫిమేల్ ఒబామా’ గా అభివర్ణిస్తారు. ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున మరో కీలక నాయకురాలు తులసీ గబ్బార్డ్ కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. ఆమెతో సహా మొత్తం 12 మంది అభ్యర్థులు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా. మానవత్వంపై దాడి.. డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలస పౌరుల హక్కులు పరిరక్షించే వ్యక్తిగా కమలా హ్యారిస్ గుర్తింపు పొందారు. అమెరికా సరిహద్దుల్లో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయడాన్ని ‘మానవత్వంపై దాడి’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇండో- ఆఫ్రికన్ మిశ్రమ సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెనేటర్‌గా (2016) ఎన్నికైన ఆమె.. అంతకు ముందు కాలిఫోర్నియా అటర్నీ జనరల్‌గానూ ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) చట్టంపై మన వైఖరేమిటంటూ స్వపక్షం డెమొక్రాట్లను కూడా సవాల్ చేసి ఇరుకున పెట్టిన ఘనత ఆమె సొంతం. చెన్నై మూలాలు... 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. కమల.. తాతగారు పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆ తర్వాత దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. ఆఫ్రికా సంతతికి చెందిన తండ్రి- ఆసియా సంతతి చెందిన తల్లిదండ్రుల పెంపకంలో అటు ఆఫ్రికా, ఇటు ఆసియా సంస్కృతుల కలబోతగా ఆమె నిలుస్తున్నారు. మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు. I'm running for president. Let's do this together. Join us: https://t.co/9KwgFlgZHA pic.twitter.com/otf2ez7t1p — Kamala Harris (@KamalaHarris) January 21, 2019 -
హిందుత్వాన్ని నమ్మిన అమెరికన్
అన్నీ కలిసొస్తే ఆమె అగ్రదేశాధినేత అవుతారు.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలవుతారు. అమెరికా పీఠం అధిష్టించిన తొలి క్రైస్తవేతర, తొలి హిందూ మహిళగా మన దేశానికి గర్వకారణం అవుతారు. ఆమే.. తులసీ గబార్డ్. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ఢీకొనేందుకు డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు 37 ఏళ్ల తులసి ప్రకటించడం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు మరికొందరు మహిళలూ ప్రకటించారు. అయితే వారితో పోలిస్తే తులసికి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పుట్టుకతో అమెరికన్ అయినా చిన్న వయసులోనే హిందూ మతం స్వీకరించి హిందుత్వాన్ని పాటిస్తున్నారు. ఇండియన్ అమెరికన్లలో ఆమెకు మంచి పేరు ఉంది. తులసి వరుసగా నాలుగోసారి అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి. హిందూ మహిళగానే చెప్పుకోవడానికి ఇష్టపడతారు. వరల్డ్ హిందూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే హవాయి ప్రతినిధుల సభకు ఎన్నికయిన తులసి రెండేళ్లు దాంట్లో కొనసాగారు. 2012లో అమెరికన్ కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. అమెరికా సైన్యంలో పని చేశారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలపై తులసి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రజా సమస్యల పట్ల మెరుగైన అవగాహన ఉంది. ఈ అనుకూలాంశాలతో మిగతా వారికంటే రేసులో ఆమె ఒకడుగు ముందుంది. నేటివిటీ సమస్య తులసికి నేటివిటీ పెద్ద సమస్య కావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తులసి అమెరికా పౌరురాలే. అయితే ఆమె అమెరికా గడ్డమీద పుట్టలేదు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోని తుతులియా దీవిలో 1981లో పుట్టారు. తర్వాత ఆమె కుటుంబం హవాయికి వచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం(ఐఎన్ఏ)ప్రకారం తుతులియా వంటి ప్రాంతాల్లో పుట్టినవారు అమెరికా జాతీయులే కాని పుట్టుక తో అమెరికన్లుగా పరిగణించబడరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ‘నేచురల్ బోర్న్ సిటిజన్’అయి ఉండాలి. అయితే, నేచురల్ బోర్న్ సిటిజన్ అంటే ఎవరో రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. సాధారణంగా పుట్టుకతో అమెరికా పౌరుడయిన వారిని నేచురల్ బోర్న్ సిటిజన్‌గా పరిగణిస్తుంటారు. తులసి తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులే. కాబట్టి చట్ట ప్రకారం తులసి అమెరికా పౌరురాలే అవుతుంది. అయితే అమెరికా బయట పుట్టినవారెవరూ ఇంతవరకు అధ్యక్ష పదవికి ఎన్నికవలేదు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువైన, డెమోక్రటిక్ పార్టీ తరఫున నాలుగు సార్లు ప్రతినిధుల సభ ఎన్నికల్లో గెలిచిన తులసీ గబార్డ్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారంలో తాను పోటీ చేస్తున్న విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తానన్నారు. డెమోక్రటిక్ పార్టీకే చెందిన సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న రెండో మహిళ తులసి కానున్నారు. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా. తులసి హవాయ్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున నాలుగుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆమె తాజా నిర్ణయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ మహిళ తులసి కానున్నారు. ఒకవేళ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవికి అత్యంత పిన్న వయసులోనే ఎన్నికైన వ్యక్తిగా, అదే సమయంలో అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పుతారు. అయితే ఆమె గెలుస్తుందనే అంచనాలు తక్కువే. రిపబ్లిక్ పార్టీ తరఫున మళ్లీ పోటీచేయనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెల 3న ఐయోవా ప్రైమరీ ఎన్నికలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. -
‘వారం రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తా’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరో వారం రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ‘వాతావరణ మార్పులు, ఆరోగ్య పథకాలు, క్రిమినల్ జస్టిస్ తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఇక అన్నింటి కంటే ముఖ్యమైన విషయం... శాంతిని పెంపొందించడం. ఇందుకోసం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన వచ్చిన తర్వాతే 2020 ఎన్నికల్లో పోటీ చేసే విషయమై నిర్ణయం తీసుకున్నా’ అని తులసి వ్యాఖ్యానించినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కనున్నారను. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. అమెరికన్ సమోవా సంతతికి చెందిన తులసి.. 2002లో హవాయి స్టేట్ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2004లో అమెరికా ఇరాక్‌తో యుద్ధం ప్రకటించే నాటికే ఆమె సైన్యంలో చేరారు. ఆ తర్వాత కువైట్‌తో యుద్ధం జరిగినపుడు హవాయి నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా ఆమె సేవలు అందించారు. (చదవండి : అవును.. సీరియస్‌గా ఆలోచిస్తున్నా) వివాదాలు- విదేశాంగ విధానం... టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్ ఎథిక్స్ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ ఐసిస్, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇక సిరియా నుంచి సేనలను(పదాతి సేనలు) ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీచేసే క్రమంలో ఈ విషయమై తులసి ఎటువంటి హామీలు ఇవ్వనున్నారో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
‘సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా?!’
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే తత్త్వం.. ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురత.. యుద్ధరంగంలో శత్రువులను మట్టికరిపించే వ్యూహం.. నచ్చని అంశాలను నిర్భయంగా వ్యతిరేకించే నిక్కచ్చితనం.. వివాదాలను సైతం దీటుగా ఎదుర్కొనే దృఢచిత్తం.. అన్నీ కలిస్తే.. తులసి గబ్బార్డ్! ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత నూటికి నూరుపాళ్లు ఆమెకే ఉందంటారు తులసి సన్నిహితులు. ‘అవును.. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మా దేశ దశ దిశల గురించిన శ్రద్ధ నాకు ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై తన మనసులోని మాటను బయటపెట్టారు డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్. అన్నీ సజావుగా సాగితే ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడం పెద్ద సమస్యేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారందరి కంటే కూడా తులసే ఓ మెట్టు పైన ఉన్నారని అంటున్నారు ఆమె సహసభ్యులు. ఒకవేళ వారి మాటలు గనుక నిజమైనట్లైతే అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కుతారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే తులసి హిందువు అని తెలియగానే చాలా మంది ఆమె ఇండో అమెరికన్ అని పొరబడ్డారు. కానీ ఆమె అమెరికన్ సమోవా సంతతికి చెందిన వారు! తల్లి ద్వారా హిందూ ధర్మమార్గంలోకి తనను తాను కర్మయోగిగా చెప్పుకొనే తులసి టీనేజ్ నుంచే హిందూధర్మాన్ని పాటించడం మొదలు పెట్టారు. అమెరికన్ సమోవా సంతతికి చెందిన మైక్ గబ్బార్డ్.. యూరోపియన్ సంతతికి చెందిన కరోల్ దంపతుల ఐదుగురు సంతానంలో తులసి నాలుగోవారు. క్యాథలిక్ ధర్మాన్ని పాటించే తండ్రి, హిందూ ధర్మాన్ని పాటించే తల్లి.. ఇలా చిన్ననాటి నుంచే తులసికి భిన్న మతాచారాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తల్లివైపే మొగ్గు చూపిన ఆమె ఇప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. చైతన్య మహాప్రభువు నెలకొల్పిన గౌడీయ వైష్ణవాన్ని ఆచరించే తులసితో పాటు.. ఆమె తోబుట్టువులు భక్తి, జై, నారాయణ్, బృందావన్లు కూడా హిందూ ధర్మాన్నే పాటిస్తున్నారు. భగవద్గీతను తన ఆధ్యాత్మిక గ్రంథంగా భావించే తులసి హిందూ సంప్రదాయం ప్రకారమే తన స్నేహితుడు అబ్రహం విలియమ్స్‌ను (2015లో) పెళ్లాడారు. సైనికురాలిగా ఉండేందుకే మొగ్గు 2002లో హవాయి స్టేట్ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు తులసి గబ్బార్డ్. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2004లో అమెరికా ఇరాక్‌తో యుద్ధం ప్రకటించే నాటికే ఆమె సైన్యంలో చేరారు. అదే సమయంలో హవాయి లెజిస్లేచర్‌కు తిరిగి ఎంపికవ్వడం కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ పడాలని నిశ్చయించుకున్నారు. కానీ యుద్ధ కారణాల రీత్యా పరాయిదేశంలో ఉన్న ఓ వ్యక్తి తనను ఎన్నుకున్న ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారంటూ... తులసిపై ప్రత్యర్థి విమర్శల దాడికి దిగడంతో.. తాను సైనికురాలిగా ఉండేందుకే ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేసి 2005లో ఇరాక్ యుద్ధంలో పాల్గొని తదనంతర కాలంలో మేజర్‌గా ర్యాంకు కూడా పొందారు. అంతేకాకుండా 2009లో కువైట్‌తో యుద్ధం జరిగినపుడు హవాయి నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా ఆమె సేవలు అందించారు. ఓ సైనికురాలిగా పూర్తిస్థాయి బాధ్యతలు నెరవేర్చడం కోసం వైవాహిక జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల భర్త నుంచి విడిపోయారు ఆమె. భారత్ అంటే ప్రత్యేక అభిమానం హిందూ ధర్మాన్ని పాటించే తులసికి కర్మభూమిగా పేరొందిన భారతదేశం అంటే ప్రత్యేక అభిమానం. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించిన సమయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. 2014లో ప్రధాని హోదాలో మోదీ న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించిన సమయంలో ఆయనను కలిసి అభినందించడంతో పాటు.. ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన వద్ద పెట్టుకునే భగవద్గీతను మోదీకి బహూకరించారు. ఆమె ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెషనల్ ఇండియా కాకస్ (భారత్‌కు మద్దతు తెలిపే గ్రూపు) కో చైర్‌పర్సన్‌గా ఉన్నారు. హిల్లరీకి వ్యతిరేకంగా ప్రచారం! డెమోక్రటిక్ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే తన విలక్షణ వ్యక్తిత్వంతో కీలక నాయకురాలిగా ఎదిగారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తులసి.. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీకి పోటీగా బెర్నే సాండర్స్‌ను ప్రతిపాదించి మరీ ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలో పలువురితో విభేదాలు తలెత్తడంతో పార్టీ నేషనల్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కూడా. వివాదాలు- విదేశాంగ విధానం... టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్ ఎథిక్స్ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ ఐసిస్, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పిన ధీశాలి తులసి. అందుకే.... మెడలో హారం, చేతిలో భవద్గీతతో విలక్షణమైన ఆహార్యం కలిగి ఉండే తులసి గబ్బార్డ్ అంటే ఇండో అమెరికన్లకు ప్రత్యేక అభిమానం. అధ్యక్ష పదవికి ఆమె పోటీచేయనున్నారనే విషయాన్ని ప్రకటించింది కూడా ఇండో అమెరికనే కావడం విశేషం. ఇక అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండో అమెరికన్లు తులసి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆమెకు భారీ మెజార్టీ చేకూర్చడంలో తమ వంతు సాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో! - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అధ్యక్ష’ పోటీపై సీరియస్‌గా ఆలోచిస్తున్నా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఆ దేశ పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికైన మహిళ తులసి గబ్బార్డ్ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలపై తన స్పందన తెలపాల్సిందిగా గురువారం మీడియా ఆమెను ప్రశ్నించగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో అధ్యక్ష పదవికి ఆమె పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి గుర్తింపు పొందుతారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొందితే అధ్యక్ష పదవి దక్కిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్రలో నిలిచిపోతారు. హవాయ్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున నాలుగుసార్లు ఆమె దేశ ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. ఇండో– అమెరికన్లలో అత్యంత ప్రజాదరణ గల నేతగా తులసికి మంచి రికార్డు ఉంది. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ముందుగా ఆమె డెమోక్రటిక్ పార్టీ నేతలతో తలపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆమె కొద్ది వారాల నుంచి పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఇండియన్ అమెరికన్ల అభిప్రాయాలను సైతం తీసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగనున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారీస్, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, సెనెటర్లు ఎలిజబెత్ వారెన్, క్రిస్టన్ గిల్లీబ్రాండ్, అమీ క్లోబుకార్, టిమ్ కైన్ తదితరులు ఉన్నారు. -
అమెరికా అధ్యక్ష పదవి రేసులో తులసి గబ్బార్డ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో హిందూమతానికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్(37) పోటీ పడనున్నారు. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ సంపత్ శివాంగి ఈ విషయం ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసి గబ్బార్డ్ పోటీ చేస్తారని ఆమె ప్రకటించగానే ఆహూతులంతా లేచి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రసంగించిన గబ్బార్డ్.. అధ్యక్ష పదవికి రేసులో ఉండేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. అమెరికా లోని హవాయి రాష్ట్రం నుంచి నాలుగో విడత కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. -
‘యూఎస్, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యను హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రంప్ సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. వారికి అసలు దూరదృష్టే లేదని విమర్శించారు. ‘ఈ పాలన వర్గం(ట్రంప్ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు. ట్రంప్ చేసిన ఈ పని నాకు చాలా బాధను, కోపాన్ని కలిగించింది. ఇది అల్ కయిదాను మరింత బలోపేతం చేస్తోంది. వారు ఇంకెంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టనపెట్టుకోవచ్చు. ఎంతోమందిని శరణార్థులుగా మార్చవచ్చు. అంతేకాదు, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది’ అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'
వాషింగ్టన్: యూఎస్ కాంగ్రెస్‌లో మొట్టమొదటి హిందు సభ్యురాలు తులసీ గబార్డ్ (33) త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26) ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న వివాహం ద్వారా తాము ఒక్కటవుతున్నామని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం ఆమె వెల్లడించింది. తమ వివాహం హిందు సంప్రదాయ పద్దతుల్లోనే జరుగుతుందని తెలిపింది. ఇద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని పేర్కొంది. నిశ్చితార్థ సమయంలో డైమండ్ రింగ్ చేతి వేలికి తొడిగారని చెప్పారు. బోళాతనం, మంచితనం మూర్తిభవించిన వ్యక్తి అని అబ్రహం సుగుణాలను తులసీ ఈ సందర్భంగా కీర్తించారు. విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తూ ... మరో వైపు షార్ట్ ఫిల్మ్స్‌తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల కోసం అడ్వర్టజమెంట్లు రూపొందిస్తున్నాడు. -
నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను!
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ న్యాయనిపుణురాలు, యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గాబార్డ్ భగవద్గీత పుస్తకాన్ని కానుకగా అందజేశారు. సోమవారం మోదీని వ్యక్తిగతంగా కలిసిన ఆమె భగవద్గీత కాపీని ఇచ్చారు. తన వద్ద చిన్ననాటి నుంచి ఉంటున్నఆ ఆధ్యాత్మిక ప్రభోదను మోదీకి ఇవ్వడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ' మీకు గీత పుస్తకాన్ని కానుకగా ఇచ్చాను. ఆ పుస్తకం నా చిన్నతనం నుంచి నా దగ్గరే ఉంది. యూఎస్ హౌస్ ప్రతినిధిగా కూడా ఆ పుస్తకంపైనే ప్రమాణ స్వీకారం చేశాను' అని 33ఏళ్ల తులసీ గాబార్డ్ ట్వీట్టర్ లో తెలిపారు. భారత్ పై తనకున్న ప్రేమకు ఇదొక గుర్తుగా మోదీకి ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.'భారత ప్రధాని మోదీని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మోదీని కలిసి ఆ గీతను కానుకగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ'ఫేస్ బుక్ లో పేర్కొంది. తన జీవితంలో గీత పుస్తకం కంటే ఎక్కువ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది.