నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను! | narendra modi Modi gets Gita as gift from Gabbard | Sakshi
Sakshi News home page

నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను!

Published Mon, Sep 29 2014 7:53 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను! - Sakshi

నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను!

న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ న్యాయనిపుణురాలు, యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గాబార్డ్ భగవద్గీత పుస్తకాన్ని కానుకగా అందజేశారు.  సోమవారం మోదీని వ్యక్తిగతంగా కలిసిన ఆమె భగవద్గీత కాపీని ఇచ్చారు. తన వద్ద చిన్ననాటి నుంచి ఉంటున్నఆ ఆధ్యాత్మిక ప్రభోదను మోదీకి ఇవ్వడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ' మీకు గీత పుస్తకాన్ని కానుకగా ఇచ్చాను.  ఆ పుస్తకం నా చిన్నతనం నుంచి నా దగ్గరే ఉంది. యూఎస్ హౌస్ ప్రతినిధిగా కూడా ఆ పుస్తకంపైనే ప్రమాణ స్వీకారం చేశాను' అని 33ఏళ్ల తులసీ గాబార్డ్ ట్వీట్టర్ లో తెలిపారు.

 

భారత్ పై తనకున్న ప్రేమకు  ఇదొక గుర్తుగా మోదీకి ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.'భారత ప్రధాని మోదీని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మోదీని కలిసి ఆ గీతను కానుకగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ'ఫేస్ బుక్ లో పేర్కొంది. తన జీవితంలో గీత పుస్తకం కంటే ఎక్కువ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement