Bhagavad Gita
-
భగవద్గీత మీద కాశ్‌పటేల్ ప్రమాణం..ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్:అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా నియమితులైన కాశ్‌పటేల్ తన మూలాలను మర్చిపోలేదు. భారతీయులు పవిత్రంగా భావించే భగవద్గీత మీద ప్రమాణం చేసి కాశ్‌పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.వైట్‌హైజ్ క్యాంస్లోని ఓ భవనంలో శనివారం(ఫిబ్రవరి21) కాశ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాశ్ భార్యాపిల్లలు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్పై ప్రశంసలు కురిపించారు. అమెరికా సెనేట్ శుక్రవారమే కాశ్ నియామకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.గతంలో కౌంటర్ టెర్రరిజం పప్రాసిక్యూటర్గా పనిచేసిన కాశ్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడంపై డెమోకక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాశ్ స్వతంత్రంగా పనిచేస్తారన్న నమ్మకం లేదంటున్నారు.ఎఫ్‌బీఐ డైరెక్టర్లు సాధారణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. గుజరాతీలైన కాశ్‌పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. కాశ్‌పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు. -
బ్రెయిలీలో భగవద్గీత
అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలో రాశారు. ఎందరో అంధులకు భగవద్గీతను చదివే అవకాశం కల్పించాలనేదే అలూరుకు చెందిన అంధ ఉపాధ్యాయుడు బూర్ల తిక్కలక్ష్మన్న సంకల్పం. ఇదీ ఆయన స్ఫూర్తి గాథ..రామకృష్ణ, కర్నూలు కల్చరల్ఒకవైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే, బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాసిన బూర్ల తిక్కలక్ష్మన్న కర్నూలు జిల్లా ఆలూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర్ల హనుమన్న, నరసమ్మ. పదో తరగతి వరకు ఆలూరులోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ అంధుల కళాశాలలో ఇంటర్, టీటీసీ పూర్తిచేసి, బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత అలూరు మండలం మూసానిపల్లెలో 1993లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆలూరు మండలం హులేబీడు ప్రభుత్వ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్గా పనిచేస్తూ, మరోవైపు కర్నూలులోని ఒక కళాశాలలో బీఈడీ చదువుతున్నారు.చిన్మయి మిషన్ సహకారంచిన్మయి మిషన్ ఆదోని శాఖ సహకారంతో బ్రెయిలీ భగవద్గీతను 2001లో వెయ్యి కాపీలను ముద్రించారు. దీనిని ముంబైలోని చిన్మయి మిషన్ స్వామీజీ తేజోమయానంద చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్మయి మిషన్ అనుమతితో రెండోసారి కూడా బ్రెయిలీ భగవద్గీత ప్రతులను ముద్రించారు. వీటిని అప్పటి ఆలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ హేమ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య సహకారంతో ఆదోని లక్ష్మమ్మవ్వ జీవిత చరిత్రను మాస్టారు బ్రెయిలీ లిపిలో రాశారు.మాస్టారి సేవలు.. సత్కారాలు⇒ 2005లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.⇒ 2012లో కర్నూలులో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిల చేతుల మీదుగా సన్మానం. ⇒ 2004 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో గీతా జ్ఞాన యజ్ఞాల నిర్వహణ.⇒ 2014 నుంచి బ్రెయిలీ భగవద్గీత ఆలయం వద్ద ప్రతి ఆదివారం భగవద్గీత శ్లోకాల పోటీల నిర్వహణ. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.1000, రూ.500, రూ.300 చొప్పున నగదు బహుమతుల ప్రదానం.⇒ కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో ఆలూరులో బ్రెయిలీ భగవద్గీత ఆలయం నిర్మాణం పరిపూర్ణం.⇒ భగవద్గీతపై అవధానం కొనసాగిస్తున్న మొదటి అంధ ఉపాధ్యాయుడు లక్ష్మన్న. ⇒ 2020 ఏప్రిల్ 4న ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో మొదటిసారి భగవద్గీతపై అష్టావధానం నిర్వహణ. ఐదేళ్ల శ్రమ: బూర్ల తిక్కలక్ష్మన్న‘పుట్టుకతోనే అంధుడిని. నిరుపేదను. నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. నా తపన గమనించి మా నాన్న ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించారు. కృష్ణుడిపై భక్తి భావంతో బ్రెయిలీలో భగవద్గీతను రాయాలనుకున్నాను. తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాదరావు సహకారంతో భగవద్గీత 18 అధ్యాయాల్లోని 701 శ్లోకాలకు ప్రతి పదార్థ తాత్పర్యాలు రాసి, 300 పేజీల పుస్తకాన్ని ముద్రించాను. యజ్ఞంలా తలపెట్టిన ఈ పని పూర్తికావడానికి ఐదేళ్లు శ్రమించాను.మా తెలుగు ఉపాధ్యాయుడు శివశంకరయ్య చిన్నతనం నుంచి భగవద్గీత గురించి చెప్పారు. మరో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్ సహకారంతో భగవద్గీతను తెలుగు బ్రెయిలీ లిపిలో రాశాను. ఆయన నా భక్తికి మెచ్చి మేము కట్టించిన గుడికి రాధాకృష్ణుల విగ్రహాలను బహుమానంగా ఇచ్చారు. పిల్లల మనసు పరిశుభ్రమైన పలక వంటిది. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, భగవద్గీత, భాగవతం లాంటì వాటిని నేర్పించాలి. ఏటా మూడు నెలలు అన్ని పాఠశాలల్లో భగవద్గీత గురించి ప్రచారం చేస్తాం. తరువాత భగవద్గీత పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తున్నాం. భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మరిన్ని అవధానాలు నిర్వహించాలన్నదే నా లక్ష్యం. -
ఆత్మసాక్షాత్కారం అంటే..?
ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి కలిగినటువంటిది. మాతాజీ ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.– డాక్టర్ పి. రాకేష్ (శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) (చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!) -
Bhagavad Gita: అసలైన ఆస్తికులు
కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు -
జీవితాల్ని మార్చే జీవన'గీత'!
అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పుకణిక ఈ గ్రంథం. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. మన జీవితాలను మార్చే మహామంత్రం.మార్గశిర శుద్ధ ఏకాదశి రోజుని 'గీతా జయంతి'గా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా.. భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇందులో అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు ఉన్నాయి. నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి.బుద్ధి వికాసానికి...మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్ రచయిత హెన్రీ డేపిట్ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం జనాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప..కింద పడితే మళ్లీ లేచి పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. దీన్ని గీత నేర్పిస్తుంది. ఆరోగ్య గీత...ఆరోగ్యపరంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విషయంలో సయమనం పాటించకపోవడం వల్లే రోగాల పాలవుతున్నామని నొక్కి చెప్పింది. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేది గీతోపదేశం.మనోధైర్యం..శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు. వైఫల్యాన్ని అధిగమించాలంటే..ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం.దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. ఆధ్యాత్మిక గీత...శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాల్సిందే. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ఇలా భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకున్నట్లయితే(ఆచరిస్తే) ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది.(చదవండి: మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..) -
కే–పాప్ కాంటెస్ట్‌లో విజేతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్‌కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్‌ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్‌ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్‌ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.అలరించిన.. సంగీత్ సమారోహ్ మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు. పద్యనాటకం.. నటన అద్భుతం పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవన నిర్వహణగీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయతగా ఉంటానని పేర్కొన్నారు.శివాని రాజా చేసిన స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఈ భగవద్గీత మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.It was an honour to be sworn into Parliament today to represent Leicester East. I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024 కాగా గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె కన్జర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్కడ గత 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేతలెవరూ గెలవకపోవడం గమనార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన నేత (రాజేశ్ అగర్వాల్) కావడం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్‌కు 10,100 ఓట్లు పడ్డాయి.ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోగా.. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం: యంగ్ హీరో
ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈనెల 8న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయాన్ని లాంచ్ చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వేడుకలో భాగం కావడం గర్వంగా వుంది. భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంఛ్ చేయడం నా అదృష్టం. కేవలం పాడ్ కాస్ట్‌లా వినొచ్చేమో అనుకున్నా. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది' అని అన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా ఉంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. మొత్తం మన పురాణాలన్నింటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. నా వంతుగా సపోర్ట్ చేస్తూ లక్ష రూపాయిలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే అతిథిగా యంగ్ హీరో విశ్వక్‌ను పిలిచాం. దేవుడు కల్పించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు. దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...'భగవద్గీత ఆర్పీ పట్నాయక్ తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బాగుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్' అని అన్నారు. ఈ వేడుకలో జేకే భార్గవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం!
బ్రిటన్ పార్లమెంట్లో ప్రధానిగా రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేయడం భారతీయులకు ఎంతో గర్వంగా అనిపించింది. వలస పాలనతో మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల దేశంలో మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని అవ్వడం, మన హిందూమత గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం ప్రతీ భారతీయుడిని భావోద్వేగానికి గురి చేసింది. అలా చేసిత తొలి యూకే ప్రధానిగా రిషి సునాక్ అందరీ దృష్టిని ఆకర్షించారు కూడా. మళ్లీ అదే తరహాలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అంతేగాదు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఓ చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అదేంటంటే.. ఆస్ల్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో దీనిపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్(ఎంపీ) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. The Legislative Assembly and the Legislative Council have chosen Senator Varun Ghosh to represent Western Australia in the Senate of the Federal Parliament. 📄Read Hansard or view our broadcast archive after the joint sitting: https://t.co/TtFao460FO pic.twitter.com/TMEx59SqTG — Legislative Assembly (@AssemblyWA) February 1, 2024 లెజిస్టేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో..పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా. అని పేర్కొన్నారు పెన్నీ వాంగ్. ఇక ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ కూడా ట్విట్టర్లో పశ్చిమా ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండటం అద్భుతంగా ఉంది. అని అన్నారు. Welcome Varun Ghosh, our newest Senator from Western Australia. Fantastic to have you on the team. pic.twitter.com/TSnVoSK3HO — Anthony Albanese (@AlboMP) February 5, 2024 వరుణ్ నేపథ్యం.. పెర్త్‌లో నివాసం ఉండే వరుణ్ ఘోష్ వృత్తి రీత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లాలో డిగ్రీని పొందాడు. క్రేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్కూడా. అతను వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు సలహదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమయ్యింది. ఇక వరణ్ ఘోష్ మాట్లాడుతూ..తాను మంచి విద్యను అభ్యసించడం వల్లే అధికారాన్ని పొందగలిగాను కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా విశ్వసిస్తాను అని చెప్పారు. కాగా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ సెనేటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్ ఘోష్ లేబర్ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్ బారిస్టర్ అయిన ఘోష్ గతవారం లేబర్ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. #VarunGhosh on Tuesday became the first ever India-born member of the Australian Parliament to take oath on #Bhagavadgita. Varun Ghosh from Western Australia has been appointed as the newest Senator after the Legislative Assembly and the Legislative Council chose him to represent… pic.twitter.com/KzIhIYSZC0 — DD India (@DDIndialive) February 6, 2024 (చదవండి: 'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?) -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 'భగవద్గీత పారాయణం
-
‘గీతా’ సంకల్పం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సంకల్పం ఉంటే..సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎన్ని అవాంతరాలు..ఎన్ని అడ్డుంకులు ఎదురైనా సరే ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రతి ఇంటా భగవద్గీత ఉండాలన్నదే లక్ష్యంగా నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేందర్‌గుప్తా సంకల్పించారు. ఐదేళ్లుగా ఉచితంగా భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,618 భగవద్గీత గ్రంథాలను అందజేశారు. తన తుదిశ్వాస ఉన్నంతవరకు భగవద్గీత గ్రంథాలు పంచుతూనే ఉంటానని జ్ఞానేందర్‌గుప్తా చెబుతున్నారు. పదకొండేళ్లుగా తన తండ్రి మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులు, వైద్యులు, వ్యాపారులు మొదలు... సాధారణ వ్యక్తులు వరకు భగవద్గీత చేరేలా నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. భగవద్గీతతోపాటు రామకోటి పుస్తకాలు కూడా పంచుతున్నారు. పదుల సంఖ్యలో రామాయణం, మహాభారతం, భాగవతం పుస్తకాలు పంపిణీ చేశారు. 4 భాషల్లో ‘గీతా జయంతి’పేరిట ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకునే ఒకే ఒక్క గ్రంథం ‘భగవద్గీత’. ఈ గ్రంథానికి ఉన్న గుర్తింపు ప్రపంచంలో ఏ గ్రంథానికీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు, అత్యున్నతస్థాయి వ్యక్తులు భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే. జ్ఞానేందర్‌గుప్తా గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్ నుంచి ఆర్డర్‌పై భగవద్గీత గ్రంథాలు తెప్పిస్తున్నారు. ఈ గ్రంథం 880 పేజీల్లో 18 అధ్యాయాలు, 745 శ్లోకాలతో సవివరంగా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, మరాఠీ భాషల్లో ముద్రించిన గ్రంథాలను పంపిణీ చేస్తున్నారు. గీతాసారం అన్ని భాషల్లో ఉన్న వారికి అర్థమయ్యేలా చేర్చాలన్న సంకల్పంతో ఇలా చేస్తున్నారు. ఇటీవల దక్షిణకొరియా ఒకరు అడగ్గా కొరియర్లో భగవద్గీత పంపాడు, యూఎస్‌కు అయితే రెగ్యులర్‌గా ఆయనే కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. మరికొన్ని సేవా కార్యక్రమాల్లో... నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సొంతూరైన సిరిసిల్ల జిల్లా కనగర్తిలలో స్వర్గ రథాలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రెండునెలల్లో కాశీలోనూ స్వర్గరథం ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిజామాబాద్‌లో మృతదేహాలను పెట్టేందుకు 8 ఏళ్ల నుంచి 10 ఫ్రీజర్లు ఉచితంగా అందుబాటులో ఉంచారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ‘అమర్నాథ్ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011 ప్రతి ఏటా 60 రోజులు అన్నదానం, ఇతర సేవలు అందజేస్తున్నారు. ఎండాకాలంలో పిచ్చుకలు, పక్షులు నీటికోసం అలమటిస్తాయి. వాటి దాహార్తి తీర్చేందుకు రెండేళ్లలో 2,500 పైగా ‘బర్డ్ ఫీడర్ బాక్సులు’ఉచితంగా అందజేశారు. -
సంతృప్తిని మించిన సంపద లేదు
-
ఆ విషయం శ్రీ కృష్ణుడితో చెప్పకపోవడం వల్ల...!
-
యదు వంశపు చరిత్ర
-
శ్రీ కృష్ణుని భార్యలు చేసిన పుణ్యం
-
గోపికలు పరమాత్ముడి యొక్క భుజాలు చూసి ఆనందపడేవారు
-
ఆత్మఘాతకులు అంటే వాళ్ళే
-
వాళ్ళే స్థూల ద్రుష్టి కలవారు
-
శృతి గీత అంటే ఇదే
-
దుఃఖం నుంచి బయటకు రావాలి
-
అందుకే కృష్ణుడు సర్వాంతర్యామి అయ్యాడు
-
పాండవులందరూ అందుకే సంతోషించారు
-
శ్రీకృష్ణుడు కీర్తి అమృతమైంది ఎందుకంటే ?
-
సైన్స్ యే పరమాత్మా..!
-
ఇంద్రియ భోగములు అంటే ఏంటి..?
-
శ్రీకృష్ణుడు దర్శనమే...గొప్ప లాభాన్ని చేకూరుతుంది అన్నాడు
-
భగవద్గీత పరాయణంతో పులకించిన డాలస్
-
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి
మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది. దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది. – తూమాటి భద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
భగవద్గీత, ఖురాన్ మద్య పోలికలతో పుస్తకం రాసిన ఫాతిమా
-
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్‌లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్‌తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్‌కు భారత్ పాస్‌పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్‌లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భగవద్గీత పార్క్ ధ్వంసంపై భారత్ సీరియస్.. వివరణ ఇచ్చిన కెనడా
టోరంటో: కెనడాలోని బ్రాంప్టన్‌లో భగవద్గీత పార్క్ ధ్వంసం విషయమై భారత్ సీరియస్ అయ్యింది. ఆ పార్క్ పేరును కూడా తొలగించడంతో భగవద్గీత పార్క్‌లో జరిగిన ద్వేషపూరితమైన ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని, సత్వరమే కెనడా అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కెనడాలోని భారత్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ఐతే ఈ విషయమై బ్రాంప్టన్ మేయర్ బ్రౌన్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ.... ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పైగా ఈ విషయమై తమ నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే ఆ పార్క్‌లో ఎలాంటి విధ్యంసం జరగలేదని, కేవలం మరమత్తుల విషయమై ఆ పేరుని తీసి ఖాళీ గుర్తును ఉంచామని తెలిపారు. ఏదైన ప్రదేశం మరమత్తులు చేయాల్సి వస్తే దాని పేరుని తొలగించి ఆ ప్లేస్‌లో ఇలా ఖాళీగా ఉంచడం సర్వసాధరణమని తెలిపారు. అంతేగాక మరమ్తత్తుల పనులు పూర్తి అయిన వెంటనే అదే పేరును తిరిగి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. అంతేగాక ఆ నగర పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. అలాగే విధ్వంసం చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. పైగా గతంలో ఇది ట్రాయ్ పార్క్ అని ఆ తర్వాత భగవద్గీత పార్క్‌గా మార్చినట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కెనడాలోని స్వామి నారాయణ్ మందిర్ అనే హిందు దేవాలయాన్ని కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్‌పై ద్వేషంతో కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. అంతేగాక కెనడాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా అక్కడ ఉన్న భారత పౌరులను, చదువు నిమిత్తం కెనడా వచ్చిన విద్యార్థులను తగు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. We condemn the hate crime at the Shri Bhagvad Gita Park in Brampton. We urge Canadian authorities & @PeelPolice to investigate and take prompt action on the perpetrators @MEAIndia @cgivancouver @IndiainToronto pic.twitter.com/mIn4LAZA55 — India in Canada (@HCI_Ottawa) October 2, 2022 From @CityBrampton Community Services and Communications Department on the confusion over resident complaints about Gita Park sign. “We learned that the sign was damaged during the original install & a city staff member brought it back for unplanned maintenance & to reprint.” https://t.co/hkfmSFF1Ui — Patrick Brown (@patrickbrownont) October 3, 2022 (చదవండి: నోబెల్-2022: జన్యుశాస్త్ర మేధావి పాబో.. మానవ పరిణామ క్రమంలో సంచలనాలెన్నో!) -
సీఎం వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీత.. సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినం. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం పేర్కొన్నారు. కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami — YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022 -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
సిలబస్‌గా భగవద్గీత.. బీజేపీ నేతలపై మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ కొంత ప్రభావం చూపించింది. ఇదిలా ఉండగా బీజేపీ నేతలను సెటైరికల్‌గా రావణుడితో పోల్చి వార్తల్లో నిలిచారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి గుజరాత్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని గురువారం తెలిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇది గొప్ప నిర్ణయం అంటూ మనీష్ సిసోడియా ప్రశంసించారు. ఇంతలోనే బీజేపీ నేతలపై సెటైరికల్‌గా ఓ పంచ్ విసిరారు. గుజరాత్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు భగవద్గీతను బోధించి విలువలు నేర్పించడం కీలక పరిణామం అన్నారు. ఈ క్రమంలోనే భగవద్గీతను పరిచయం చేసే వ్యక్తులు ముందుగా గీతలోని విలువలను ఆచరించాలని సూచించారు. కొందరు వ్యక్తులు గీత గురించి మాట్లాడాతారు.. కానీ వారు పనులు మాత్రం రావణుడిలా ఉంటాయని పరోక్షంగా బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులతో హోలీ సందర్భంగా సంబురాలు జరుపుకున్నారు. దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. -
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
గాంధీనగర్: ఆరు నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో విలువలు, నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి స్కూల్ పాఠ్యప్రణాళికలో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వఘానీ చెప్పారు. గుజరాత్ సర్కారు నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ స్వాగతించాయి. -
విశ్వానికి గొప్పకానుక భగవద్గీత
సాక్షి, హైదరాబాద్: వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపదని పలువురు ప్రముఖులు ఉద్ఘాంటించారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువ గళ గీతార్చన కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, విశ్వహిందూ కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రంగాల వారు భగవ ద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకాలను పది నిమిషాల పాటు పారాయణం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీరామజన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ మహారాజ్ మాట్లాడుతూ సంపూర్ణ విశ్వశాంతి కోసం భగవద్గీత ప్రవచించిన మార్గనిర్ధేశం ఒక్కటే పరిష్కారమన్నారు. ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమానం అని చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు భగవద్గీతను తమ జీవితానికి అన్వయించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమం లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి గొప్ప వారసత్వ సంపద భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని చెప్పారు. లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలను భారతీయ వైదికగ్రంథాలు, ఉపనిషత్తులు వివరించాయన్నారు. జీవితం, ఖగోళం, కాలం వంటి అనేక అంశాలపై ప్రపంచానికి అవగాహనను, జ్ఞానాన్ని ప్రబోధించిన మహోన్నతమైన భారతదేశం, భగవద్గీత విశ్వగురువులుగా నిలిచాయన్నారు. గీత సందేశం ఎప్పటికీ కొత్తగా, వైవిధ్యంగానే ఉంటుందన్నారు. అనేక చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటి పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ అందరం అర్జునుడిలాగా కర్తవ్య నిర్వహణ చేస్తే సంపద, విజయం వరిస్తాయన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిళింద పరాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, భక్తి నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ప్రముఖ ఆలయాల్లో భగవద్గీత పారాయణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఎనిమిది ప్రముఖ ఆలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో ఉండే çపది ఆలయాల్లో భగవద్గీత పారాయణం చేపట్టనున్నారు. గీతా జయంతి పండుగ సందర్భంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు 18 రోజుల పాటు ఆయా ఆలయాల్లో వేద పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (శ్రీకాకుళం జిల్లా), సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం (విశాఖ జిల్లా), అన్నవరం శ్రీరమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (తూర్పుగోదావరి జిల్లా), ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం (పశ్చిమ గోదావరి), మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుంటూరు జిల్లా), నెల్లూరు శ్రీరంగనాథ దేవస్థానం (నెల్లూరు జిల్లా), కదిరి శ్రీలక్ష్మీ నరసింహదేవస్థానం (అనంతపురం), అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ దేవస్థానం (కర్నూలు జిల్లా)లో 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా తగిన ప్రచారం కల్పించాలని ఈవోలను ఆదేశించారు. భగవద్గీత పారాయణ నిర్వహణ ఖర్చులు టీటీడీ భరిస్తుంది. -
బియ్యపుగింజపై భగవద్గీత.. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక
హైదరాబాద్ సిటీలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొంతమంది గీసిన బొమ్మలోని భావాలు మనసు లోతుల్లోకి చేరుతాయి. కొందరి చిత్రాలు సమాజంలో అన్యాయాన్ని ఎత్తి చూపిస్తాయి. మరికొందరి చిత్రాలు ‘వారెవా.. భలే ఆర్ట్’ అనిపిస్తుంది. మూడో కోవకు చెందిన యువతే స్వారిక రామగిరి. ప్రముఖుల ముఖచిత్రాలు గీసినా బియ్యం గింజపై భగవద్గీత రాసినా.. తనకు తానే సాటిగా నిలుస్తూ నేటితరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది స్వారిక. – హిమాయత్‌నగర్ హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన రామగిరి శ్రీనివాసచారి, శ్రీలత కుమార్తె స్వారిక. హైకోర్టులో లాయర్‌గా ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చిన్నతనం నుంచే ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఓరోజు తన అన్న చంద్రకాంత్‌చారి పేపర్‌తో వినాయకుడిని చేశాడు. ఆ ఆర్ట్‌కు ఇంట్లో, బయటా మంచి ప్రశంసలు దక్కాయి. అంతే.. ఆ సమయాన స్వారిక మనసులో ఓ ఆలోచన తట్టింది. ‘నేనెందుకు కొత్తగా బొమ్మలు గీయడం మొదలు పెట్టకూడదు, నేనెందుకు అందరి ప్రశంసలు అందుకోకూడదు’ అని ప్రశ్నించుకుంది. అలా అనుకున్నదే తడవుగా మొదటిసారి బియ్యపుగింజపై వినాయకుడి బొమ్మ గీసింది. దీనిని అందరూ మెచ్చుకోవడంతో ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. జాతీయజెండా, భారతదేశపు చిత్రపటం, ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వేసి అందరి మన్ననలను అందుకుంది. ఆ తర్వాత బియ్యపుగింజపై భగవద్గీతను రాసి చరిత్రను లిఖించింది స్వారిక రామగిరి. ప్రముఖుల ఆర్ట్‌కు కేరాఫ్.. ప్రముఖుల చిత్రాలను మైక్రో ఆర్ట్‌గా గీయడంలో స్వారిక ‘ది బెస్ట్’అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. వారి నుంచి ఆమె అందుకున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల ముఖచిత్రాలను స్వారిక మైక్రో ఆర్ట్‌గా గీసింది. వాటిని వారికి పంపించగా స్వారికను అభినందిస్తూ సందేశాలు కూడా తిరిగి పంపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా స్వారిక గీసిన మైక్రో ఆర్ట్‌లను పలువురు వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడం గమనార్హం. 2005కిపైగా చిత్రాలు.. కళాఖండాలు స్వారిక ఐదేళ్ల ప్రాయంలో మొదలుపెట్టిన తన ఆర్ట్ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2005కుపైగా చిత్రాలు వేసింది. వీటిలో ప్రధానంగా మిల్క్ ఆర్ట్, పేపర్ కార్వింగ్, బాదంపప్పుపై ఆర్ట్, చింతగింజలపై ఆర్ట్, నవధాన్యాలు, బియ్యపుగింజలు, పాలమీగడ, నువ్వులగింజలు వంటి వాటిపై బొమ్మలు గీసింది. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక స్వారిక తన తలలోని ఐదు వెంట్రుకలపై బొమ్మలు గీసి తనలోని అద్భుత నైపుణ్యాన్ని చాటుకుంది. కేవలం ఆరుగంటల్లో ఆ వెంట్రుకలపై రాజ్యాంగ పీఠికను రూపొందించి చరిత్ర సృష్టించింది. ఈ ఆర్ట్‌ను చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వారికను రాజ్‌భవన్‌కు పిలిపించి సన్మానం చేశారు. అంతేకాదు బాదంపప్పుపై గీసిన ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం చూసి తమిళిసై ముగ్ధులయ్యారు. మోదీకి అందిస్తానని గవర్నర్ ఆ చిత్రపటాన్ని తీసుకోవడం గమనార్హం. స్వారిక టాలెంట్ గురించి తమిళిసై తన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేయడం విశేషం. నువ్వుల గింజలపైనా అద్భుత చిత్రాలను గీసింది స్వారిక. ఈఫిల్ టవర్, తాజ్‌మహాల్, చార్మినర్, వరంగల్ ఫోర్ట్, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ వంటి వాటిని వేసి ఔరా అనిపించింది. పాలమీగడపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు తదితరుల చిత్రపటాలను వేసింది. (చదవండి: యాదాద్రికి ‘బంగారు’ విరాళాలు) -
లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే
సాక్షి, హైదరాబాద్: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా?..
అంతఃపురంలో ఆడవాళ్ళే మిగిలారు. విరటుడు సైన్యంతో సుశర్మను ఎదుర్కొనాడానికి వెళ్ళాడు. మారువేషాలలో ఉన్న పాండవులు నలుగురూ వెళ్ళారు. ఇంతలో దూత వచ్చి ఉత్తరదిశను పెద్ద సైన్యం మన గోవులను మళ్లించుకు వెళ్ళిం దని ఉత్తరకుమారుడికి చెప్పాడు. నా వద్ద సారథిలేడు, ఉంటే నేను వారిని ఓడించి గోవులను తీసుకు వస్తానని ఉత్తరకుమారుడు బిరాలు పలికేడు. అప్పుడు సైరంద్రి బృహన్న లను తీసుకు వెళ్ళమంటుంది. మరో గత్యం తరం లేక ఉత్తరకుమారుడు వెళ్తాడు. అక్కడ సైన్యాన్నిచూసి భయపడి బృహన్నల వారి స్తున్నా పారిపోతాడు. బృహన్నల ఉత్తరడుని అడ్డగించి నేను అర్జునుడిని. నీవు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటాడు. ఉత్తరుడు నమ్మడు. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతోసందేహంగా "బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి. వాటిని వివరిస్తే నేను నిన్ను నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరు నవ్వుతో ఉత్తరుని చూసి నాకు అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహ నుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. "కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. అర్జునుడి ఈ పది నామాలే ఉన్నాయా లేక ఇంకమైనా పేర్లు ఉన్నాయా? ఉన్పాయనే చెప్పవచ్చు. భగవద్గీతలో ఉన్న అర్జునుడి ఇతర నామాలు ఇవి. అనఘుడు, అనసూయుడు, కపిధ్వజుడు, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు కూరుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు దేహభృయాం వరుడు, పరంతపుడు, పురుషవర్ధనుడు, భరతర్షభుడు , భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, మహాబాహుడు. అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా! ఇక్కడ మరో విషయం తెలుసుకోవలసినది ఉంది. పిడుగులు పడేటప్పుడు అర్జునుని దశ నామాలను తలచుకుంటే ఆ పిడుగు మనదరిదాపుల్లో పడదు, మనకు ప్రాణభయం ఉండదంటారు పెద్దలు. -గుమ్మా నిత్యకళ్యాణమ్మ -
ఖురాన్ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది..
మతగ్రంధాల మర్మాలేమిటో తెలుసుకోవాలనిపించింది ఓ ముస్లిం అమ్మాయికి.‘పెద్దల్లో ఓ గుణముంది.తాము అర్థం చేసుకున్న రీతిలోనేవాళ్లు వ్యాఖ్యానిస్తారు.అందుకే... మూలాల్లోకి వెళ్లు. మూలసారం గ్రహించు’ అన్నది ఆమె తండ్రి సలహా.అంతే... పట్టుబట్టి భగవద్గీత చదివిందామె. చదవడమే కాదు... తర్జుమానూ చేసింది.‘సర్వమతాల సంగ్రహమేమిటోగ్రహించావా అమ్మా’ అని అడిగితే...‘ఒరులేయవి’ అనే మహాభారత పద్య సారాంశంలా... ఆ చిన్నారితల్లి చెప్పిన మాటలే... ఈ ‘హీబా’సారం! ‘మిగతా మత గ్రంథాల్లో ఏం చెప్పారో? అవీ ఖురాన్లాగే ఉంటాయా నాన్నా?’ అడిగింది హీబా.‘అన్ని మతాల సారం ఒక్కటే బేటా’ నింపాదిగా సమాధానమిచ్చాడు తండ్రి.అప్పటి నుంచి ఆ అమ్మాయిలో ఆలోచన ... మిగిలిన మత గ్రంథాలనూ చదవాలి. ముఖ్యంగా భగవద్గీత. గీత గురించి చాలా గొప్పగా విన్నది. జీవితంలోని ఎన్నో సంఘటనలను గీతా శ్లోకాలతో అన్వయిస్తారు. అసలు జీవన సారం అందులోనే ఉన్నదని చెప్తారు.. అది చదవాలి.. తెలుసుకోవాలి.. అర్థం చేసుకోవాలి అన్న పట్టుదల పెరిగింది. యూట్యూబ్‌లో మత ప్రవచనాలు వినడం ఆమెకు ఆసక్తి. అలా ఒకసారి ఒక మౌల్వి చెప్పిన మాటలు విన్నది... ‘మత గ్రంథాల సారం తెలుసుకోవాలంటే ఆయా మతాలను అనుసరిస్తున్న వ్యక్తులతో మాట్లాడి తెలుసుకోవడం కన్నా నేరుగా ఆ గ్రంథాలను చదవడమే మంచిది. అధ్యయనం వల్లనే దాని సారం అర్థమవుతుంది. అడిగి తెలుసుకుంటే చెప్పేవాళ్ల వ్యాఖ్యానమే ఎక్కువగా వస్తుంది. గ్రంథంలోని అసలు విషయం కన్నా. అందుకే చదవండి .. విస్తృతంగా చదవండి’ అని. అప్పుడు మొదలుపెట్టింది భగవద్గీతను చదివే ప్రయత్నం.ఆ అమ్మాయి పూర్తిపేరు హీబా ఫాతిమా. నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణ నివాసి. ఆమె తండ్రి అహ్మద్ ఖాన్ ఓ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి జాహెదా పర్వీన్. గృహిణి. హీబా ఫాతిమాకు ఓ చెల్లెలు కూడా ఉంది జేబా ఫాతిమా. ఇంటర్ చదువుతోంది. హీబా బీఎస్సీ బీజెడ్సీ గ్రాడ్యుయేట్. టీచర్ కావాలన్న ఆశయంతో టీచర్ ట్రైనింగ్‌లో డిప్లమా చేస్తోంది నిజామాబాద్‌లో. అర్థంకాకుండా ఎలా? భగవద్గీత చదవాలనే ప్రయత్నంతో సికింద్రాబాద్, చత్తీస్‌గఢ్‌ల నుంచి పుస్తకాలను తెప్పించుకుంది. దేవనాగరి లిపిలో ఉన్న ఆ సంస్కృత శ్లోకాలు, హిందీ తాత్పర్యం చూసి తెల్లమొహం వేసింది హీబా. తొలి నుంచి ఇంటర్ దాకా ఆ అమ్మాయిది ఉర్దూ మీడియం. హిందీ చదవడం వచ్చు కాని అంత అనర్గళంగా రాదు. ముందు చదువుకుంటూ పో.. తర్వాత అర్థతాత్పర్యాల గురించి ఆలోచించవచ్చు అని సలహా ఇచ్చాడు తండ్రి. కాని అర్థంకాకుండా ఎలా చదివేది? తన వల్ల కాదు అంది. యూట్యూబ్ సహాయంతో తన దగ్గరున్న భగవద్గీతను చదివింది. అర్థం చేసుకుంది. అంతా అవగతమయ్యాక ఆశ్చర్యం వేసింది హీబాకు. ఖురాన్ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది. భగవంతుడు ఒక్కడే– కొలిచే రూపాలు.. ఆరాధించే తీరే వేరు అని తెలిసి. ఈ విషయం తన ధర్మంలోని వారికీ తెలియాలి. అంటే గీతను ఉర్దూలోకి అనువదించాలని నిశ్చయించుకుంది. 2018 , ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు.. మళ్లీ భాషతో చిక్కొచ్చింది. అప్పుడు హీబా తల్లి జాహెదా.. దేవనాగరి లిపిలో ఉన్న ఆ శ్లోకాలను ఉర్దూలోకి అనువదించడంలో కూతురికి తోడ్పడింది. మరాఠీ మీడియంలో చదివినా హిందీ మీదా పట్టుంది జాహెదాకు. అలా అమ్మ సహాయంతో అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత.. రోజుకి ఒక్క శ్లోకమే ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగింది. ఆతర్వాత రోజుకు రెండు.. మూడు శ్లోకాలు.. క్రమక్రమంగా అవి పెరిగి రోజుకి పది శ్లోకాలు రాసేంతగా పట్టు సాధించింది ఆ అమ్మాయి. పుస్తకం పూర్తయ్యే టైమ్‌కు రోజుకు ఇరవై శ్లోకాలను అనువదించగలిగింది. మొత్తానికి 2018, అక్టోబర్ వరకు భగవద్గీత ఉర్దూ తర్జుమాను పూర్తి చేసింది హీబా. అందరూ ఎలా స్పందించారు? ‘ఎవరో స్పందించాలనో.. ప్రశంసించాలనో నేనీ పని చేయలేదు. అన్ని మతాలూ బోధించేది ఒక్కటే.. మానవత్వం. సర్వ మానవ సమానత్వం. ఈ విషయం నాతోటి వాళ్లకూ తెలియచేయాలనుకున్నా. చేశాను. గీత చదివాక నాకు అర్థమైంది ఒక్కటే.. ఖురాన్‌కు, గీతకు మధ్య తేడా భాష మాత్రమే అని. దీన్ని తెలిజేయడం కోసమే గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేశా. ఫీడ్‌బ్యాక్ అడిగాననుకోండి.. వాళ్ల వాళ్ల నాలెడ్జ్, అనుభవాన్ని బట్టి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. నా లక్ష్యం నేను చేసిన దాని మీద పదిమంది అభిప్రాయాలు పోగేయడం కాదు... నేను రాసిన దాంట్లోని సారం పదిమంది తెలుసుకోవాలని. అన్ని ధర్మాల పట్లా గౌరవాన్ని పెంచుకోవాలి.. సామరస్యాన్ని పాటించాలి’ అంటుంది హీబా. నేనూ వేదాలు, ఉపనిషత్తులను కొంత తెలుసుకున్నాను. వాటి గురించి నా పిల్లలతో చర్చిస్తాను. ఆ వాతావరణమే బహుశా హీబాలో ఈ జిజ్ఞాసను కలిగించిందేమో. చిన్నప్పటి నుంచీ తను చదువులో చురుకే. డిఎడ్ ఎంట్రెన్స్‌లో స్టేట్ తొమ్మిదో ర్యాంక్ తెచ్చుకుంది. మా ఇద్దరమ్మాయిలకూ ఒకటే చెప్పా.. మీ ద్వారా సమాజానికి మంచి జరగాలి. ఒకవేళ మంచి చేయలేకపోయినా చెడు అయితే జరక్కూడదు అని. ఆ తీరుగానే ఆలోచిస్తారు వాళ్లు. పొరపాటున కూడా అబద్ధం చెప్పరు. ఏదున్నా నాతో, వాళ్లమ్మతో షేర్ చేసుకుంటారు. మేమూ అంతే పిల్లలతో స్నేహితుల్లా ఉంటాం. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండే కుటుంబం మాది. ఇలాంటి మంచి పనులకు భగవంతుడు మరింత శక్తినివ్వాలనే కోరిక తప్ప ఇంకేం లేదు మాకు.– అహ్మద్‌ఖాన్ ఇప్పుడు.. ‘ఖురాన్, గీతను ఒక్క చోటనే ఒకే పుస్తకంలో పొందుపరిస్తే చదివేవాళ్లకు ఉపయోగంగా ఉంటుందని.. ఖురాన్‌ను, గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. ఎలాగంటే.. ఖురాన్‌లోని ప్రతి అయాత్ను ఇంగ్లీష్ ఫొనెటిక్లో.. దాని కిందనే ఉర్దూలో రాసి.. అర్థమూ చెప్తాను. అలాగే గీతను కూడా అంతే. ప్రతి శ్లోకాన్ని ఇంగ్లీష్ ఫొనెటిక్లో.. దాని కిందనే ఉర్దూలో అర్థం వివరిస్తాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే పూర్తిచేసి పుస్తకంగా తెస్తాను. దీని తర్వాత నా దృష్టి అంతా టీచర్ ఉద్యోగం మీదే. నేను నేర్చుకున్నది పది మందికి చెప్పాలి. నాది, నీది అని తేడా లేకుండా బతకాలి. జ్ఞానాన్ని పొందడం.. దాన్ని పంచడానికి మించిన మంచి కార్యక్రమం లేదు. అలాగే మనం పొందిన జ్ఞానం బ్యాలెన్సింగ్ గుణాన్ని అలవర్చాలి.. హింసాప్రవృత్తిని తగ్గించాలి. ఇది ప్రాక్టీస్‌లో పెట్టలేని మేధస్సు ఎంత ఉన్నా వృధాయే’ అని చెప్పింది హీబా ఫాతిమా.– గడ్డం గంగులు, సాక్షి, బోధన్ఫొటోలు: బి. రాజ్‌కుమార్ -
భగవద్గీత... సన్మార్గానికి చేయూత
జీవితమంటే ఏమిటి? జీవితం ఇలాగే ఎందుకుంది? ఈ నక్షత్రాలు, గ్రహాలూ ఎందుకున్నాయి? కాలం ఎంతో శక్తిమంతమైనదా? అసలీ ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? దేవుడంటే ఎవరు? ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు? సమాజంలో మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది? చెడు చేస్తున్న వారిని నిగ్రహించేవారే లేరా? ఈ ప్రకృతి ఏమిటి? ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు... ఎపుడైనా ఇటువంటి ప్రశ్నలు మీ మదిలో మెలిగాయా? వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నించారా? అవునో, లేదో కానీ ఇటువంటి మరెన్నో సందేహాలకు సంతృప్తికర సమాధానాలతో తాత్వికదర్శనాన్ని అందించే గ్రంథమే శ్రీమద్భగవద్గీత. వేదసారాన్ని అందించే ఉపనిషత్తులలో మేటియైన ఈ గ్రంథమే గీతోపనిషత్తుగా కూడా ఖ్యాతినొందింది. అసలెందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అని అడిగితే అందుకు సమాధానమొక్కటే, అది ఈ సకల చరాచర సృష్టికి మూలకారణమైన దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీ కృష్ణునిచే స్వయంగా ఉపదేశించబడినందుకే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అంటుంది శ్రీమద్భాగవతం. ధర్మాచరణయందు సందిగ్ధతలో పడి, మనస్తాపంతో చింతామగ్నుడైన అర్జునునికి కర్తవ్యబోధ చేసి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉపదేశించినదే భగవద్గీత. అలా భగవద్గీతను విన్న అర్జునుడు చివర్లో ఈ విధంగా అన్నాడు – ఓ అచ్యుతా! నా మోహం ఇప్పుడు నశించింది. నీ కరుణతో నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను.’’– భగవద్గీత 18.73 మనం జీవితంలో ఎటువంటి పరిస్థితులలో వున్నా, భగవద్గీతలోని ఉపదేశాలను అనుసరిస్తే మన కర్తవ్య నిర్వహణయందు గల సందేహాలు నివృత్తి అవడమేగాక, దృఢమైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకెళ్ళగలం. భగవద్గీత అందించే ఆత్మవిశ్వాసం, చేసే పనుల్లో స్పష్టత మరే ఇతర వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలంటూ నేడు నిర్వహిస్తున్న పలు తరగతుల పాఠ్యాంశాలలో సైతం లభించదు. అసలు జీవన నిర్మాణ మూల ఉద్దేశమేమిటో తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసమన్నది సాధ్యపడుతుంది. ఆ విషయాలను గీత విపులంగా వివరిస్తుంది. సమస్త వేదసారాన్ని, భగవతత్త్వాన్ని సమగ్రంగా అందించేదే భగవద్గీత. క్రమం తప్పకుండా పఠించినవాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అయితే వందల రకాల భగవద్గీతలు అందుబాటులో వున్న నేటి తరుణంలో ఒక విశుద్ధభక్తుడు రచించిన గీతను ఎంచుకోవటమే సకల విధాలా శ్రేయస్కరం. బ్రహ్మ–మధ్వ–గౌడీయ పరంపరలో 32వ ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు చిన్ననాటినుండే శ్రీ కృష్ణుని విశుద్ధ భక్తులు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరులచే దీక్షను పొందిన వీరు కృష్ణ పరంపర సందేశాన్ని ‘భగవద్గీత యథాతథం’ గ్రంథంగా రచించారు. భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు అత్యంత విలువైన భగవద్గీతలోని 700 శ్లోకాలను పారాయణ చేయడం ద్వారా విశ్వశాంతి, లోక కళ్యాణం కలుగుతాయి. అలానే విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహభావనలు పెరుగుతాయి. మన లోపల ఉండే అసూయ, ద్వేషం లాంటి వాటిని జయించగలం. ఈ గీతాజయంతి రోజున ప్రతి ఒక్కరూభగవద్గీత చదవడం, చదివించడం వంటి సంకల్పాన్ని పాటించండి. (5054 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీ కృష్ణుని అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం వల్ల దీనిని గీతాజయంతి పర్వదినంగా జరుపుకుంటున్నాం). ►భగవద్గీతలోని ముఖ్యమైన 108 శ్లోకాలను తాత్పర్య సహితంగా పారాయణ చేయడం ద్వారా దేవాది దేవుడైన శ్రీ కృష్ణభగవానుడి అనుగ్రహం పొంది శాంతి సౌఖ్యాలు పొందుతారు. గీతా సందేశం ఏదో ఒక మతానికే కాకుండా ఈ విశ్వంలోనే అందరూ సమతా భావాన్ని కలిగి ఐకమత్యంతో కలిసి మెలిసి పని చేసేలా చేయగలదు. నేడు గీతా జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ‘యత్ర యోగేశ్వరో కృష్ణో...’ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతిరోజూ భగవద్గీతను పఠిస్తే సంపద, విజయం, అసాధారణశక్తి, నీతి నిశ్చయంగా సంప్రాప్తిస్తాయి. భగవద్గీతపై వివిధ రకాలుగా వ్యాపించి ఉన్న అపోహలను విడనాడి, జీవితంలో ఆచరించవలసిన సన్మార్గానికి చేయూతనిచ్చే భగవద్గీతను ఇంటిల్లిపాదీ చదువుకోవచ్చు. కావున, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాము. – సత్యగౌర చంద్ర ప్రభు, హరేకృష్ణమూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -
ఇంజనీరింగ్ సిలబస్‌లో భగవద్గీత
సాక్షి, చెన్నై: వర్సిటీ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో భగవద్గీత పాఠాలను బోధించాలని తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే వర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల పథకంలో ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఉన్నతస్థాయి కమిటీ మార్పులు, చేర్పులు, మరింత మెరుగులు దిద్దడం వంటివి చేపడుతుంటుంది. ఏఐసీటీఈ రూపొందించిన పాఠ్యాంశాల పథకాన్ని ఇంజినీరింగ్ కాలేజీలు అమలుచేస్తుంటాయి. అయితే అన్నావర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ పాఠ్యాంశాల పథకాన్ని మాత్రం వర్సిటీనే తయారుచేసుకుంటుంది. ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్‌లో ఏఐసీటీఈ విడుదల చేసిన మార్గనిర్దేశం ప్రకారం ఇంజనీరింగ్ విద్యలోని 32 పాఠ్యాంశాల్లో మూడింటిని ఆప్షన్ సబ్జెక్టులుగా ఎన్నుకుని 3,4,5వ సెమిస్టర్లో చదవాలని చెప్పింది. సమాజంలో వృత్తివిద్య, విలువలు, నాణ్యత, ధర్మం, మెరుగైన జీవనవిధానం, ఫొటోగ్రఫీ, వీడియోతీసి సమకూర్చుకోవడం 32 పాఠ్యాంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్టింగ్ అండ్ ప్లానింగ్, అళగప్ప కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, క్రోంపేటలోని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ నాలుగు కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లోని విద్యార్థులు పాఠ్యాంశాలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో వేదాంత పాఠ్యాంశంలో సంస్కృతం, భగవద్గీతకు సంబం ధించిన పాఠాలు చోటుచేసుకున్నాయి. వీటిని విద్యార్థులు తప్పనిసరిగా చదవాలని వర్సిటీ సూచించింది. ఈ రెండింటినీ ఇంజనీరింగ్ విద్యలో చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ కొన్ని సవరణలు చేసేందుకు సిద్ధమైంది. వేదాంత విభాగంలోని సంస్కృతం, భగవద్గీత పాఠ్యాంశాలపై నిర్బంధాన్ని సడలించి ఆప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వర్సిటీ వీసీ సూరప్ప తెలిపారు. స్టాలిన్ ఖండన.. అన్నాయూనివర్సిటీ పాఠ్యాంశాల్లో సంస్కృతం, భగవద్గీతలను చేర్చి విద్యార్థులపై బలవంతంగా రద్దుతున్నారని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. అన్నావర్సిటీ సీఈజీ క్యాంపస్‌లో 2019 సంవత్సర పాఠ్యపుస్తకాల్లో వేదాంతపాఠాలను నిర్బంధంగా చేర్చడం పైగా దానికి ‘భారత్‌లో విదేశీస్థాయి ఆధ్యాత్మిక చదువులు’ అని పేరుపెట్టడాన్ని తన ట్విట్టర్ ద్వారా ఆయన ఖండించారు. -
800 కేజీల భగవద్గీత ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఏకంగా 800 కేజీల బరువైన అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని ఇస్కాన్( అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం) ఆలయంలో ఆవిష్కరించారు. 2.8 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఈ మహా గ్రంథంలో 670 పేజీలు ఉన్నాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ఈ గ్రంథాన్ని అచ్చువేశారు. పేజీలను యుపో(వైయూపీవో) సింథటిక్ కాగితంతో తయారుచేశారు. ఈ కాగితం తడవదు, అస్సలు చిరగదు. గ్రంథంలో సందర్భోచితంగా 18 అత్యంత మనోహరమైన పెయింటింగ్‌లను పొందుపరిచారు. కాగా, భగవద్గీత ఆవిష్కరణ కార్యాక్రమానికి మోదీ ఢిల్లీ మెట్రో రైళ్లో వచ్చారు. ఖాన్ మార్కెట్ స్టేషన్ నుంచి నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వరకు ఆయన ప్రయాణించారు. ఆ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు దిగారు. తిరుగుప్రయాణంలోనూ కైలాశ్ కాలనీ స్టేషన్లో ఎక్కి ఖాన్‌మార్కెట్ స్టేషన్లో దిగిపోయారు. -
భగవద్గీత తీసుకెళ్లిన పాక్ ఖైదీ
వారణాసి: భారత జైల్లో నుంచి విడుదలైన ఓ పాకిస్తాన్ జాతీయుడు చేసిన పని భారత సంస్కృతి గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. పాకిస్తాన్‌కు చెందిన జలాలుద్దీన్ 16 ఏళ్లుగా వారణాసి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆదివారం రోజున జైలు నుంచి విడుదలైన జలాలుద్దీన్ తిరిగి స్వదేశానికి వెళ్తూ.. తన వెంట పవిత్ర గ్రంథం భగవద్గీతను తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన జలాలుద్దీన్ వద్ద అనుమానాస్పద పత్రాలు లభించడంతో 2001లో వారణాసి కంటోన్మెంట్ ప్రాంతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వారణాసి కంటోన్మెంట్ మ్యాప్‌తోపాటు, ఇతర కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత న్యాయస్థానం అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జలాలుద్దీన్ జైల్లోకి వచ్చినప్పుడు.. అక్కడ ఉన్నవారిలో అతనొక్కడే హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. జైల్లో ఉంటూనే అతను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్ కోర్సు కూడా నేర్చుకున్నాడు. గత మూడేళ్లుగా జైల్లో జరిగిన క్రికెట్ పోటీలకు అంపైర్‌గా ఉన్నాడు. కాగా, జలాలుద్దీన్ను వారణాసి జైల్లో నుంచి తీసుకువెళ్లిన ప్రత్యేక బృందం అట్టారి-వాఘా బార్డర్ వద్ద పాక్ అధికారులకు అతన్ని అప్పగించనుంది. 16 ఏళ్లలో జలాలుద్దీన్ ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు. -
యద్భావం తద్భవతి
భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది.‘‘యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహమ్!మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః’’ అని.ఎవరు తననెలా అనుకుంటే తాను వాళ్లకి అలాగే కనిపిస్తాననీ, ఎవరు ఏం అనుకున్నప్పటికీ తాను అనుకున్నది మాత్రమే జరిగేలా చేస్తాననీ, చేసుకుంటాననీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడనేది పై శ్లోక సారాంశం.అందుకే తనని దైవంగా భావించిన దేవకీ వసుదేవులకి అలాగే కన్పించాడు. తనని వివాహమాడే పతిగా భావించిన రుక్మిణిని అదే విధంగా అనుగ్రహించాడు. తమ జన్మని ధన్యం చేయవచ్చినవానిగా భావించిన భీష్మ–విదురులకి అలాగే మోక్షాన్ని ఇచ్చాడు. తనని చంపవచ్చినవాడని భావించిన కంసునికీ, శిశుపాలునికీ అలాగే చావునిచ్చాడు.వాస్తవాన్ని పరిశీలించి చూస్తే సాయి కూడా అదే తీరులో కనిపించాడు ఎందరికో. కనిపించలేదని ఎవరూ అనుకోకుండా ఉండేలా తనని నిజమైన భక్తితో సేవిస్తే ఏ రూపంతో దర్శించదలిస్తే అలానే కనిపిస్తానంటాడు సాయి. అలా కనిపించిన తీరు తెన్నుల్ని ఎందరో చెప్పారు కూడా.ఈ క్రమంలో జరిగిన ఓ చరిత్రని తెలుసుకుని తీరాల్సిందే! నాసికాత్య్రంబకమనే పుణ్యక్షేత్రం ఒకటుంది షిర్డీకి కొంత దూరంలో. దాన్నే నాసిక్ అని పిలుస్తూ ఉంటారు. గోదావరి పుట్టిన కొండలకి దిగువ ఉంటుంది ఈ క్షేత్రం. ఆలయం లోపల శివలింగం చిన్న పరిమాణంలో ఉంటుంది. ఆ లింగానికి కింద మూడు వైపుల నుంచి చిన్న తూముల వంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మూడింటి నుంచీ నిరంతరం జలం ప్రవహిస్తూ ఈ శివలింగాన్ని తాకుతూ ఉంటాయి. ఒకటి పవిత్ర గంగాజలం, రెండవది ఆ కొండల మీద నుంచి వచ్చే గోదావరి జలం, ఇక మూడవది ఎక్కడి నుండి వస్తోందో తెలియని పర్వత జలమునూ. ఈ మూడు జలాలనీ స్వయంగా సేకరించుకుని ఏ రోజుకారోజు శివలింగానికి మహాద్భుతంగా అభిషేకాన్ని చేస్తే గానీ, ఆ మీదట అగ్నిహోత్రాన్ని వేదమంత్రపూర్వకంగా నిర్వహిస్తే గానీ ఏనాడూ పచ్చిగంగని కూడా ముట్టనంత నిష్టాగరిష్ఠుడైన ములేశాస్త్రీ(మూళే శాస్త్రీ–శాస్త్రీ–మూలే–పండితుడు) అనే బ్రాహ్మణుడు ఉంటూండేవాడు నాసిక్‌లో. తన వద్దకొచ్చిన ఆధ్యాత్మికపరులైన వాళ్ల చేతుల్ని చూసి హస్తసాముద్రిక విశేషాలనీ, జాతకచక్రాలనీ చూసి భూతభవిష్యత్ వర్తమానాలనీ, అంతే కాక ఇళ్లకి సంబంధించిన వాస్తు బాగోగులనీ కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. దాంతో ఆయన ఇల్లు సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటూండేది. ఎందరు వచ్చినా ఆయన అనుష్టానం పూర్తయ్యాక మాత్రమే మాట్లాడటం తప్ప ఏనాడూ ఆ నియమాన్ని తప్పనివాడాయన.ఆయన చెప్పిన అన్ని కూడా స్పష్టంగా జరుగుతుండే కారణంగా అందరికీ ఆయన మీద పూజ్యభావం ఉంటూ ఉండేది. ఆయన్ని ఎవరైనా ‘ఎంతగొప్పవాడో’ అంటూ ప్రశంసిస్తే ‘అదంతా మా గురువు ఘోలవ్ స్వామి గారి చలవ’ అంటూ తన అహంకారం లేని తనాన్ని తెలియజేస్తుండేవాడు.ఆయన తన గురువైన ఘోలవ్ స్వామివారి వద్ద నాలుగు వేదాలనీ ఆ వేదానికి అంగాలుగా ఉండే 6 శాస్త్రాలనీ కూడా గట్టిగానే అభ్యసించి ఉండటంతో ఇటు జ్యోతిషం, అటు వాస్తు మరోౖవైపు సాముద్రిక శాస్త్ర పండితులూ ఇంకోవైపు వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లో పండితులు కూడా ఏమేమో సందేహాలని తీర్చుకోవడానికి స్వయంగా విచ్చేస్తూ ఉండటంతో ఆయనకి తీరుబడి అనేది దాదాపుగా ఉండేదే కాదు.ఇలాంటి ఈయనకి – సాయికి అత్యంత ప్రేమాస్పదభక్తుడైన బూటి (బాబు సాహెబ్ బూటీ)తో మంచి సంబంధం ఈ తీరు రాకపోకలతో ఏర్పడింది. నాగపూర్ వాస్తవ్యుడూ కోటి కోటీశ్వరుడూ అయిన బూటీ సాయి ఆజ్ఞ ప్రకారం ఆయనకి ఓ సుందర విశాలమందిరాన్ని శోభాయమానంగా నిర్మించి ఇచ్చాడు కూడా. అంతటి బూటితో ఓ సారి ములేశాస్త్రి పండితునికి పనిపడింది. బూటీ ఎప్పుడూ షిర్డీలోని ద్వారకామయి (సాయి ఉండే మసీదు)లోనే ఉంటాడు కాబట్టి ములేశాస్త్రి అక్కడికే వెళ్లాడు.వేదాలని చదివినవాడూ, శాస్త్రాల్లో దిట్టా, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసేవాడూ, అందరితో గౌరవాభిమాన పరిచయాలున్నవాడూ, సంప్రదాయపరుడూ అయిన ఆయనకి షిర్డీ వెళ్లినప్పటికీ కూడా ఒక సాయేబు (ఆయన దృష్టిలో సాయి)ని.. అందునా ఆయన మసీదులో.. అది కూడా 4 రోజులపాటైనా స్నానం కూడా (అప్పుడప్పుడు వీలు కుదరక) చేయని పండితుడు కానీ వ్యక్తి (శాస్త్రి దృష్టిలో)ని స్వయంగా వెళ్లి దర్శించడమా? అనే అభిప్రాయంతో తానున్న ఓ ప్రదేశంలోనే మూడురోజుల పాటు ఉండిపోయాడు. అంతా నిర్విరామంగా ఉండే తనకి ఇలా రోజులు గడిచిపోతున్నాయనే ఆలోచనతో... ఎలాగో అక్కడికి వెళ్లి బూటీని ఎలాగో ఒకలా ఆ మసీదు ఇవతలనుండే కలిసి, మాట్లాడి వచ్చేద్దామనే నిర్ణయానికొచ్చాడు నాల్గవ రోజున. సరిగ్గా అదే రోజున బూటీ బాబా దర్శనానికి రావలసిందనగానే అయిష్టంగా సాయి దర్శనానికి వెళ్లాడు. తనకొచ్చిన భక్తుల దక్షిణలతో పళ్లని కొని, తనని చూడవచ్చిన భక్తులకి ఇస్తూ ఉండటం సాయికి అలవాటు. ముఖ్యంగా మామిడిపళ్లనైతే రెండు అరచేతుల మధ్య పెట్టి ముందుకి వెనక్కి నలిపి పిసికి నోట్లో పెట్టుకోగానే రసమంతా వచ్చేలా మామిడిపండుని చేసి భక్తులకియ్యడం, అలాగే అరటిపండునైతే తొక్కని తొలగించి గుజ్జునిస్తూ తొక్కల్ని తన వద్ద ఉంచడం... వంటివి ఆయన నిత్యకృత్యాలు. శాస్త్రి వెళ్లేసరికి ఇలాగే జరుగుతోంది. ఆ పళ్లని తాను తీసుకోవడం ఏ మాత్రం ఇష్టమనిపించలేదు శాస్త్రికి.తన వంతు రాగానే శాస్త్రి తన చేతిని చాచి సాయిని తమ చేతిని చూపించినట్లయితే సాముద్రికవిశేషాలని చెప్తాననే అభిప్రాయంతో చూశాడు. శాస్త్రి అభిప్రాయాన్ని గమనించి కూడా సాయి తన చేతిని చూపించనే లేదు, ఎందరో తన వద్దకి చేయి చూపించుకోవడానికి వచ్చి తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటూంటే, సాయివద్దకి తాను వెళ్తే చేతిని చూపించడేమిటి సాయి? అనుకుని అలాగే ఉండిపోయాడు. అందరికీ ఇచ్చినట్లే శాస్త్రికి కూడా నాలుగు అరటిపళ్లని చేతిలో పెట్టాడు సాయి. అయితే సాయి పాదాలని గమనించి, పాదాల్లోని రేఖలని గమనించి, సాయిలోకోత్తర పురుషుడేనని మాత్రం లోపల అనుకున్నప్పటికీ, ఈ మహమ్మదీయునికి ఇంత గొప్పదనమా? అనే ఊహ శాస్త్రిని బాధించసాగింది. గొప్పదనాన్ని ఒప్పుకోనీయలేదు. అనంతరం శాస్త్రి బూటీతో సహా మరో ప్రదేశానికి వెళ్లిపోయారు.సాయి లెండీతోట (తాను స్వయంగా పచ్చికుండలతో నీళ్లని తెచ్చి పోసి పెంచే తోట)కి బయలుదేరి వెళ్తూ ‘ఈ రోజు కాషాయవస్త్రాలని నాకు తెప్పించండి. ధరిస్తా’ అన్నాడు భక్తులతో. ఎవరికీ అంతరార్థం బోధపడలేదు. బూటీ శాస్త్రి వద్దకి మళ్లీ వచ్చి మధ్యాహ్నహారతి సమయమైంది. ‘వస్తారా సాయి దర్శనానికీ – హారతికీ?’ అని అడిగాడు. శాస్త్రి అయిష్టంగా ‘సాయి దర్శనానికి సాయంత్రం వస్తాను. ఇప్పుడింకా దేవతా అనుష్టానం కాలే’ అన్నాడు. ఈ సమాధానంలో రెండున్నాయి. మొదటిది – ‘ఉదయం తనని అందరితో సమానంగా, అందరిలో ఒకడుగా సాయి లెక్కించాడనీ, చేయి చాపి సాముద్రికాన్ని చెప్తానని నోరు తెరిచి అడక్కపోయినా మౌనంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా తిరస్కరించాడనీ’. ఇక రెండవది – ‘తాను స్నానానికి అత్యంత శుచిగా చేసి, పట్టుబట్ట కట్టుకుని, వెంటతెచ్చుకున్న గంగాజలాన్ని కలిపిన జలంతో శివాభిషేకాన్ని చేసుకుని, ఓ మసీదులోనికి వెళ్లి ఆయన ఈయబోయే ప్రసాదాన్ని తీసుకుని రావడమా?’ అనేదీనూ. ఈ రెండాలోచనలతోనూ సాయంత్రం వస్తానని ముక్తసరిగా చెప్పాడు శాస్త్రి.మధ్యాహ్నహారతి ప్రారంభం కాగానే బూటీని పిలిచి సాయి.. ‘బూటీ! నాసిక్ నుండి వచ్చిన ఆ బ్రాహ్మణపండితుడి వద్దకెళ్లి దక్షిణని సాయి అడిగాడంటూ పట్రా!’ అన్నాడు. అది దైవాజ్ఞతో సమానం బూటీకి. వెంటనే శాస్త్రి వద్దకొచ్చి చెప్పి దక్షిణని యాచించాడు కోటి కోట్లకి అధిపతి అయిన బూటీ.శాస్త్రి ఈ మాటని వింటూనే.. ‘ఆ సాయి ఎంత తనదైన మహిమల్లో గొప్పవాడో నేనూ అంతే నాదైన శాస్త్రంలో గొప్పవాడిని. సరే! ఆ మాటని అలా ఉంచితే నేనేమిటి? ఆయనకి దక్షిణ ఇయ్యడమేమిటి? అయినా ఎవరికైనా ఎవరైనా గొప్పవారని తోస్తే దక్షిణనిస్తారేమో గానీ, ఈ దక్షిణకోసం దబాయింపు ఏమి?’ అని ఆలోచిస్తూ.. అడిగింది బూటీ కాబట్టి ‘సరే!’ అంటూ దర్శనానికి బయలుదేరాడు శాస్త్రి అర్ధాంగీకారంతో.అనుష్టానం దాదాపు ముగియవచ్చిన సందర్భంలో తాను మసీదులోనికి పోవడం సుతరామూ ఇష్టం లేని శాస్త్రి, మసీదు బయటి నుండే సాయిని దర్శించాడు. ఆ పక్కనే బుట్టలో ఉన్న పుష్పాలని దోసిలి నిండుగా తీసుకుని మసీదు గుమ్మం బయటి నుండే సాయి మీద పడేలా భక్తితోనే విసిరాడు. అంతే! క్షణంలో సింహాసనం లాంటి ఆసనంలో కూర్చున్న సాయి రూపం మొత్తం అదృశ్యమైపోయింది. పరీక్షగా చూశాడు శాస్త్రి. నిజమే. అది కలకానే కాదు. నిజమే. వాస్తవమే. సాయి కనపడటం లేదు. ‘ఇదేమిటి?’ అనుకునేంతలోనే తనకి సంపూర్ణంగా వేదాలనీ, శాస్త్రాలనీ బోధించిన తన గురువు ఘోలవ్ స్వామి ఆ ఆసనంలో కూచుని చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తున్నాడు శాస్త్రికి.గురువుగారు శివైక్యం చెంది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతే ఆయన ఇక్కడెలా ఉన్నాడు? అదీ సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తుండటమా? అది కూడా ఎవరికో కాకుండా శిష్యుడైన తనకే కూడనా? మళ్లీ ఓ సారి పరీక్షగా చూసి ఆశ్చర్యపడ్డాడు – నివ్వెరపోయాడు శాస్త్రి.తనకి తెలియకుండానే.. అందరు భక్తులూ తనని చూస్తుండగానే.. ముందుకి నడిచాడు. సాయి కూచున్న ఆసనం ఉన్న వేదికకున్న మెట్లని ఎక్కి వెళ్లాడు. మనసు నిండుగా కనిపిస్తున్న భక్తితో, బుద్ధి నిండుగా ఉన్న శ్రద్ధతో, శరీరం నిండుగా ఉన్న విశ్వాసంతో సాయి పాదాల మీద పశ్చాత్తాపబుద్ధితో తలని పెట్టి, వెంటనే సాష్టాంగపడి నమస్కరించాడు అప్రయత్నంగా.అందరూ గొంతెత్తి హారతి పాటని పాడుతుంటే శాస్త్రి మాత్రం తన గురువు ఘోలవ్ స్వామి నామాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఎదురుగా సాయి పాదాలని పట్టి నమస్కరిస్తూనే ఉన్నాడు. ‘తన పట్టుబట్ట – అగ్నిహోత్రం – అపవిత్రతాభావం – అది ఓ మసీదు’ అనే ఆలోచన పూర్తిగా స్ఫురణలోనే లేకపోయాయి. భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకుని ఆ నాటి గురువు ఈనాడు సజీవంగా దర్శనమిచ్చాడనుకుని కళ్లు తెరిచి చూశాడు.అంతే! మళ్లీ వెనుకటి సాయి కాషాయరంగు వస్త్రాల్లో కన్పించాడు. ఘోలవ్ స్వామి ఏమయ్యాడో తెలియదు. ‘ఈ వింత మరెవరికైనా కూడా కనిపించిందా?’ అనుకుంటూ శాస్త్రి భక్తజనం అందరినీ చూస్తుంటే.. అందరూ ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప తనవైపు చూస్తున్నట్లే కనిపించలేదు. అప్పటికర్థమైంది. బూటీ ఎందుకిలా సాయికి అంకితమైపోయాడో.. సాయికి తన జీవితాన్ని సర్వసమర్పణాన్ని చేసేసాడో!ఈ విశేషాన్ని పూసగుచ్చినట్లు భక్తులందరికీ శాస్త్రి చెప్పడమే కాక అప్పటి నుంచి సాయికి పరమసన్నిహిత భక్తుడయ్యాడు. మరో సంఘటనషిర్డీలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటూ ఉండేవాడు. ఆయన పరమభక్తుడు సాయికి. అయితే తన భక్తి ధోరణి ఏదో తనదే తప్ప మరెవరినీ సాయిదర్శనానికి రావలసిందని గానీ, వచ్చి దర్శిస్తే ఈ తీరూ ఆ తీరూ అద్భుతాలు జరుగుతాయని గానీ చెప్పి ప్రచారాన్ని చేసే సాయి భక్తుడు కాడు. సహజంగా ఒక సంప్రదాయాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్తూ ఉండే భక్తులు మూడు తీరులుగా కన్పిస్తూ ఉంటారు. మొదటి జాతివాళ్లు కేవలం తన భక్తీ తన పూజా ఏదో దాన్ని మాత్రమే చేసేసుకుంటూ నిరంతర భక్తి భావంతో వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లకి తమకంటూ జరిగిన అద్భుతాలని చెప్పుకోవాలనే ధ్యాసే ఉండదు.రెండవజాతివాళ్లు తమకి జరిగిన అనుభవాలని వివరిస్తూ ప్రోత్సహించి ఆ దైవదర్శనానికో లేక తాము నమ్మి ఆనందాన్ని పొందిన ఆ మహనీయుని దర్శనానికో ఒకరినో ఇద్దరినో నిస్వార్థంగా తీసుకువెళ్లి తాముపొందిన ఆ ఆనందాన్ని వాళ్లకి కూడా కలిగించేవాళ్లు. కేవలం దైవసేవాభావం ఇతరులకి ఆనందాన్ని పంచాలనే ధ్యేయమే వీళ్లది.ఇక మూడవజాతి వాళ్లుంటారు. దైవం మీద వ్యతిరేకతా నాస్తికభావాలూ అంటూ ఏవైనా ఏ కొందరికైనా అబ్బుతున్నాయంటే దానికి వీరే కారణం. దైవం గురించో లేక సాయి వంటి మహనీయుని గురించో ఎదుటివారిలో తీవ్రమైన నమ్మకాన్ని కుదిర్చి దాన్ని దృఢం చేయాలనే అభిప్రాయంతో ఉన్నదానికి మరికొంతని కలిపి తీవ్రంగా దాన్ని ప్రచారంలోకి తెచ్చేయడం వీరి లక్షణం. వాళ్లు చెప్తున్నదాన్ని ఏ మాత్రపు బుర్ర పెట్టి విన్నా అదంతా అబద్ధమే అని స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఎదుటివాళ్లు అనుకుంటారనే ధ్యాస కూడా లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోతుంటారు ఉన్నవీ లేనివీ కలగలిపి.ఇదే పద్ధతిలో పైన అనుకున్న రెవెన్యూ ఉద్యోగి ఒక డాక్టరుతో ‘షిర్డీ వెళ్దాం. వస్తావా?’ అని అడిగాడు. ఈ రెవెన్యూ ఉద్యోగి కేవలం తనకి సహాయంగా ఈ డాక్టరుని రావలసిందిగా పిలిచాడు తప్ప ఆయన్ని సాయిభక్తునిగా చేయాలనే తపనతో మాత్రం కాదు. దానికి డాక్టర్ సమాధానమిస్తూ.. ‘నేను షిర్డీకి సరదాగా వస్తా! అక్కడికొచ్చి సాయి దర్శనానికి రావలసిందని గానీ, ఇంతదూరం వచ్చాక ఓసారి దర్శిస్తే పోలేదా? అయినా దర్శిస్తే వచ్చే నష్టమేముంది? అని గానీ నన్ను బలవంతపెట్టనంటే వస్తా!’ అని కరాఖండీగా చెప్పాడు. అసలు ఆ ఉద్దేశమే లేని రెవెన్యూ ఉద్యోగి ‘అక్కడికొచ్చాక అది నీ ఇష్టం! బలవంతపెట్టడం నేనుగానీ నాకెరుగున్న మరెవరి ద్వారానైనా గానీ ఉండనే ఉండదు’ అని సహృదయతతో చెప్పాడు. దాంతో ఆ ఇద్దరూ షిర్డీకి వెళ్లారు.రెవెన్యూ ఉద్యోగి బాబా దర్శనానికి వెళ్తుంటే డాక్టర్ అతనితో ‘నువ్వేమీ అనుకోకు! నేను రామభక్తుడ్ని. ఏ రోజూ రామునికి సంబంధించిన వృత్తాంతాన్ని చదవడమో ఆయన శ్లోకాలని పఠించడమో లేక ఆంజనేయుని ధ్యాన శ్లోకాలని మనసులో అనుకోవడమో చేస్తూనే ఉంటాను. రామాయణం చెప్పిన అన్నింటి మీద సద్భావంతో ఉంటాను. ఏదో ఒక సంప్రదాయ రహస్యాలని తెలుసుకుని ఆచరించదలచడం పొరపాటున ఇది నచ్చకపోతే మరో వైపు అడుగులు వేయడం.. అనే ఇదంతా నాకు నచ్చని పని’ అంటూ చెప్పి ‘నువ్వొక్కడివే ఆ సాయి దర్శనానికి వెళ్లిరా!’ అన్నాడు.ముందునుంచి డాక్టర్ అదేమాటల్ని చెప్తుండటం బట్టి రెవెన్యూ ఉద్యోగి మారు మాట్లాడకుండా సాయి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చిన్నపని చూసుకుని దర్శనానికి వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.తాను వెళ్లేసరికి ఇన్ని మాటల్ని మాట్లాడిన డాక్టర్ ఆ సాయిపాదాలని గట్టిగా పట్టుకుని ఆయన ముఖంలోనికే తన దృష్టిని నిలిపి ఆర్ద్రంగా చూస్తూ ఆనందబాష్పాలని విడుస్తూ కనిపించాడు. సాయి సేవ పూర్తయ్యాక రెవెన్యూ ఉద్యోగి ‘దానికి కారణం ఏమిటి?’ అని అడగకుండానే డాక్టర్ చెప్పడం ప్రారంభించాడు.‘ఓసారి సాయిని సందర్శించే భక్తుల్ని చూస్తూ సాయి తన దర్శనాన్నిచ్చే చోటుని చూశాను. ప్రశాంతంగా కూర్చున్న సాయి నాకు ప్రత్యక్షంగా రామచంద్రునిలానే కనిపించాడు. తరచి తరచి పరిశీలించి చూసినా రాముడే ఉన్నాడు ఆ ఆసనంలో. అందుకే ఆనందంతో సాష్టాంగపడ్డాను. నన్ను ఈ దర్శనానికి వచ్చేలా చేసినందుకు జీవితాంతం ఋణగ్రస్తుడ్ని’ అన్నాడు డాక్టర్. అదీ సాయి గొప్పదనం. ‘ద్వారకామయి అన్ని కోరికలనీ తీరుస్తుంది’ అని సాయే చెప్పాడు. ఎప్పుడు? ఎందుకు? ఎలా? గమనిద్దాం! (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
అందరివాడు గోవిందుడు
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!ఆది శంకరాచార్యులు శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సనాతన ధర్మంలోని సర్వమతాలకు ఆరాధ్య గ్రంథం. అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలిచి తరించారు. కృష్ణుడు బోధించిన భగవద్గీతకు అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వ్యాఖ్యానాలు రాశారు. చైతన్య మహాప్రభువు కృష్ణభక్తికి విస్తృత ప్రచారం కల్పించారు. భక్త జయదేవుడు, మీరాబాయి, సూరదాసు, నామదేవ్ వంటి వారు కృష్ణలీలలను గానం చేశారు. జయదేవుడి అష్టపదులు, మీరబాయి, సూరదాసుల భజన గీతాలు, నామదేవ్ విరచిత అభంగ్లు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. పండితులు, ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే కాదు, బృందావనంలోని గోపికలు మొదలుకొని వ్రేపల్లెలోని ఆబాల గోపాలం సహా సామాన్యులు కూడా కృష్ణుని ఆరాధనలో తరించారు. అందుకే గోవిందుడు అందరివాడని ప్రతీతి పొందాడు. సంభవామి యుగే యుగే లోకంలో అధర్మం ప్రబలినప్పుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం పెచ్చుమీరిన కాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్థించగా, శ్రీమహావిషువు దేవకీ, వసుదేవులకు జన్మించ సంకల్పించాడు. అప్పుడు మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించేవాడు.వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయసు రావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే ‘దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు’ అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ శుద్ధ అష్టమినాడు అర్ధరాత్రివేళ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమునానది వైపు బయలుదేరుతాడు. యమునానది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇస్తుంది. వ్రేపల్లెలోని నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద పక్కన కృష్ణుడిని విడిచి, ఆమె పక్క నిద్రిస్తున్న శిశువును ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. దేవకికి శిశువు పుట్టిన సమాచారం తెలుసుకుని, కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువును చంపడానికి పైకి విసిరికొడతాడు. అయితే, ఆ శిశువు ఆకాశమార్గానికి ఎగసి, అష్టభుజాలతో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో కనిపిస్తుంది. తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి, నందుల వద్ద పెరిగాడు. ఆబాలగోపాలుడు యోగమాయ హెచ్చరికతో ప్రాణభయం పట్టుకున్న కంసుడు దేవకీ గర్భాన పుట్టినవాడు ఎక్కడ ఉన్నా, వెతికి వాడిని చంపాలంటూ తన వద్దనున్న రాక్షసులను పురమాయిస్తాడు. కంసుడు పంపగా వచ్చిన పూతనను పాలుతాగే వయసులోనే సంహరించాడు బాలకృష్ణుడు. బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసుడిని, ధేనుకాసురుడిని, బకాసురుడు తదితరులను వధించాడు. దోగాడే వయసులోనే చిన్నికృష్ణుడు తెగ అల్లరి చేసేవాడు. అతడి అల్లరిని అరికట్టడానికి నడుముకు తాడు చుట్టి, దానిని రోలుకు కట్టేస్తుంది యశోద. నడుముకు అంత పెద్ద రోలు ఉన్నా, దాంతోనే పాకుతూ పోయి రెండు మద్ది చెట్లను కూల్చి, వాటి రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు. ‘తమ్ముడు మట్టి తింటున్నాడు’ అంటూ బలరాముడు ఫిర్యాదు చేయడంతో, ‘ఏదీ నోరు తెరువు’ అని గద్దించిన యశోదకు తన నోటిలోనే పద్నాలుగు లోకాలనూ చూపి, ఆమెకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాడు. అన్న బలరాముడితో కలసి, వ్రేపల్లెలోని గోపబాలకులతో ఆవులను మేతకు తీసుకుపోయే వాడు. వారితో ఆటలాడుకునేవాడు. వెదురును వేణువుగా మలచి, అద్భుతమైన వేణుగానంతో ఆబాలగోపాలాన్నీ మైమరపించి వేణుగోపాలుడిగా, వంశీమోహనుడిగా ప్రఖ్యాతి పొందాడు. కాళిందినదిలో ఉంటూ గోపాలురను భయభ్రాంతులు చేస్తున్న కాళీయుని తలపై నృత్యం చేసి, కాళింది నుంచి దూరంగా తరిమికొట్టి తాండవ కృష్ణుడిగా పేరు పొందాడు. ఇంద్రుడు వర్షబీభత్సం సృష్టించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై నిలిపి, వ్రేపల్లె వాసులను ఆ కొండ నీడలోకి చేర్చి, వారిని కాపాడి, వారి మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో మురిపించి, ఆపత్సమయాల్లో ఆదుకుని వ్రేపల్లెలోని ఆబాలగోపాలాన్నీ అలరించాడు. కృష్ణుడిని ఎలాగైనా చంపాలనే పథకంలో ఉద్ధవుడిని దూతగా పంపి, కృష్ణ బలరాములను మధురకు రప్పిస్తాడు కంసుడు. చాణూర ముష్టికులనే మల్లులను బాలురైన కృష్ణబలరాముల మీదకు ఉసిగొల్పుతాడు. చాణూర ముష్టికులను వధించాక, కంసుడిని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాత ఉగ్రసేనుడిని చెరసాల నుంచి విడిపిస్తాడు. ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించి, దేవకీ వసుదేవులతో కలసి ద్వారకకు చేరుకుంటాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాభ్యాసం కోసం సాందీపని మహాముని ఆశ్రమంలో చేరుతారు కృష్ణబలరాములు. బాల్యంలోనే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి, గురుదక్షిణ సమర్పించుకుంటారు. సాందీపని మహాముని గురుకులంలోనే విద్యాభ్యాసం చేసిన కుచేలుడు శ్రీకృష్ణుడికి ప్రాణస్నేహితుడవుతాడు. గురుకులం విడిచిపెట్టిన తర్వాత పేదరికంలో కూరుకుపోయిన కుచేలుడు అటుకుల మూటతో తన వద్దకు వచ్చినప్పుడు అతడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి, అడగకపోయినా అతడి దారిద్య్రాన్ని తీర్చి, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతాయి. కృష్ణాష్టమినే గోకులాష్టమి అని, జన్మాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాలయాలలో మాత్రమే కాకుండా, అన్ని వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీనివాసుని పక్కనే కొలువై ఉన్న శ్రీకృష్ణుని రజతమూర్తికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున సాయంత్రంపూట శ్రీవారు ప్రత్యేకంగా కొలువుతీరుతారు. ఈ కొలువును ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు. స్వామివారు సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి వేంచేస్తారు. పౌరాణికులు భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని పఠిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో ఉట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. శ్రీకృష్ణుని బాల్యక్రీడా విశేషమైన ఈ వేడుకను తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యులు క్రీస్తుశకం 1545లో ప్రత్యేకంగా ప్రారంభించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా దేశంలోని చాలా చోట్ల ఉట్టెకొట్టే వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. గుజరాత్‌లోని ద్వారకలోను, ఉత్తరప్రదేశ్‌లోని మథురలోను, బృందావనంలోను కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలోను, బృందావనంలోని రాధా మదనమోహన మందిరం, బంకె బిహారి మందిరం, జుగల్‌కిశోర్ మందిరం, ప్రేమ్ మందిరం, రాధారమణ ఆలయాలలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఒడిశాలోని పూరీ శ్రీజగన్నాథ ఆలయంలోను, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయంలోను, హంపి బాలకృష్ణాలయంలోను, మైసూరు వేణుగోపాల స్వామి ఆలయంలోను, కేరళ గురువాయూర్లోని గురువాయూరప్పన్ ఆలయంలోను, రాజస్థాన్‌లోని నాథ్వాడాలో ఉన్న శ్రీనాథ్జీ ఆలయంలోను, తమిళనాడులో దక్షిణ ద్వారకగా పేరుపొందిన తిరువారూరులోని రాజగోపాల ఆలయంలోను, చెన్నైలోని పార్థసారథి ఆలయంలోను కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలతో ఈ ఆలయాలు కనువిందు చేస్తాయి. ఇవే కాకుండా దేశ విదేశాల్లోని ‘ఇస్కాన్’ మందిరాలు సైతం కృష్ణాష్టమి నాడు భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీకృష్ణ స్తోత్రాలు, భజన సంకీర్తనలతో మార్మోగుతాయి. కృష్ణాష్టమి రోజున భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు జరుపుతారు. అటుకులు, వెన్న, పెరుగు, పాలు, మీగడ, బెల్లం, పండ్లు నైవేద్యంగా పెడతారు. ఊయలలు కట్టి, బాలకృష్ణుని విగ్రహాలను వాటిలో ఉంచి వాటిని ఊపుతూ పాటలు పాడతారు. మహాభారత సారథి కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పార్థసారథిగా పేరుపొందాడు. కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే కాదు, యావత్ మహాభారతాన్ని నడిపించినది శ్రీకృష్ణుడే. మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడి అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర అర్జునుడిని వరించడంతో కృష్ణార్జునుల అనుబంధం విడదీయరానిదైంది. పాండవులందరూ ప్రతి పనిలోనూ కృష్ణుడి సలహా తీసుకునేవారు. ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేసిన ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఆ సభకు వచ్చిన శిశుపాలుడు కృష్ణుడిని, ధర్మరాజును నానా మాటలంటాడు. శిశుపాలుడు కూడా కృష్ణుడి మేనత్త కొడుకే. మేనత్తకు ఇచ్చిన మాట మేరకు నూరు తప్పుల వరకు సహించి, ఆ తర్వాత చక్రాయుధంతో శిశుపాలుడిని తుదముట్టిస్తాడు. శకునితో జూదం ఆడేటప్పుడు మాత్రం ధర్మరాజు కృష్ణుడిని సంప్రదించలేదు. శకుని ఆడిన మాయజూదంలో ఓటమిపాలై పాండవులు అడవుల పాలయ్యారు. దుర్యోధనుడు పురిగొల్పడంతో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడినప్పుడు ఆమె కృష్ణుడినే తలచుకుంటూ రోదిస్తుంది. దూరాన ఉన్నప్పటికీ ఆమె మొర విని తన మహిమతో ఆదుకుంటాడు. జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఆ తర్వాత విరాటరాజు కొలువులో ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అరణ్యవాసంతో పాండవులకు ఎదురైన అనేక సమస్యలను శ్రీకృష్ణుడే పరిష్కరించాడు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని తిరిగి వచ్చాక, వారి రాజ్యాన్ని తిరిగి వారికి అప్పగించాలంటూ కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళతాడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడిని దుర్యోధనుడు బంధించబోతే విశ్వరూప ప్రదర్శన చేసి, కౌరవులను హెచ్చరిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడం కోసం పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చూపును ప్రసాదిస్తాడు. కురుక్షేత్రంలో ఆయుధాలు విడిచి, యుద్ధవిముఖుడైన అర్జునుడికి గీతోపదేశంతో కర్తవ్యబోధ చేసి, యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. యుద్ధం ముగిసేంత వరకు పాండవులకు అండదండగా ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ సంధించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావానికి ఉత్తర గర్భంలోని శిశువు మృత్యువును ఎదుర్కోగా, తన చక్రంతో రక్షణ కల్పిస్తాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి, పాండవుల తర్వాత రాజ్యభారాన్ని వహిస్తాడు. కృష్ణుడి పరివారం కృష్ణుడు అష్టమహిషులు ఉన్నారు. వారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ. కృష్ణుడికి ఒక్కొక్క భార్యతోను పదేసి మంది పిల్లలు కలిగారు. సత్యభామతో కలసి వెళ్లి నరకాసురుడిని వధించాక, అతడి చెరలో ఉన్న పదహారువేల నూరుమంది గోపికలను కృష్ణుడు బంధవిముక్తులను చేశాడు. వారు శ్రీకృష్ణుని ఆశ్రయంలోనే ఉండేవారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కౌరవుల నాశనం చేసినందుకు ఫలితంగా యాదవకులం కూడా నశిస్తుందని గాంధారి శపిస్తుంది. శాపప్రభావం వల్ల కృష్ణుడి కొడుకుల్లో ఒకడైన సాంబుడికి ఆడవేషం వేసి, అతడికి పుట్టబోయేది మగబిడ్డో, ఆడబిడ్డో చెప్పాలంటూ యాదవ యువకులు మునులను ఆటపట్టిస్తారు. దానికి ఆగ్రహించిన మునులు యాదవకులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందని శపిస్తారు. సాంబుడి వేషం విప్పేస్తున్నప్పుడు అతడు కడుపు దగ్గర దాచుకున్న దుస్తుల నుంచి ముసలం పుడుతుంది. భయపడిన యాదవులు దానిని బాగా అరగదీస్తారు. ఎంత అరగదీసినా, చిన్న మొన మిగిలిపోతుంది. దానిని సముద్రతీరంలో పడేస్తారు. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో తాగితందనాలాడి గొడవపడిన యాదవులు ఒకరినొకరు చంపుకుని నశించారు. ముసలం మొనతో బాణం తయారు చేసుకున్న ఒక నిషాదుడు జంతువులను వేటాడుతూ విడిచినప్పుడు అది చెట్టు కింద సేదదీరుతున్న కృష్ణుడి పాదానికి తాకుతుంది. బాణం దెబ్బ వల్ల కృష్ణుడు నిర్యాణం చెందినట్లు కొన్ని పురాణాలు చెబుతుంటే, రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు శ్రీకృష్ణుడిని జరామరణ రహితుడిగా అభివర్ణించారు. విశిష్టాద్వైతాన్ని పాటించే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు కృష్ణుడిని జరామరణ రహితుడిగానే విశ్వసిస్తారు. -
తెలుసుకుంటే చాలు
ప్రేమకు నిర్వచనం ఒకటే ఉంటుందా?! ఎన్నో రకాలుగా ఉంటుంది. మూమూలు ప్రేమకే అంత శక్తి ఉంటే.. మరి దైవశక్తిలో ఎంత ప్రేమ ఉండాలి?! అందుకే.. భగవద్గీతను తెలుసుకోవచ్చు కానీ... తెలిసిపోయిందనుకోవడం సరికాదు. గీతలో ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకం... ప్రతిసారీ ఒక కొత్త కోణంలో దైవప్రేమను సాక్షాత్కరింపజేస్తుంది. జీవితంలోని ప్రేమను అర్థం చేసుకోడానికి భగవద్గీతను తెలుసుకుంటే చాలు! మీలో ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది. అటు ఉద్యోగధర్మాన్ని, ఇటు జీవన ధర్మాన్ని బ్యాలెన్స్ చేయడం అంత సులువు కాదు కదా! (నవ్వుతూ)పెరిగిన గ్రామీణ వాతావరణం, సంప్రదాయ జీవనశైలి, అమ్మనాన్న (అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ)ల వద్ద నేర్చుకున్న రామాయణ, భారత కథలు, స్కూల్లో చదువుకున్న వేమన, సుమతీ శతకాలు ఇందుకు కారణాలు అయ్యుంటాయి. మాది అనంతపురం జిల్లా, గోరంట్ల గ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఎప్పుడూ పెద్ద పెద్ద కోరికలు లేవు. దేనికీ పెద్దగా ఎగై్జట్ అవను. మోడ్రన్ కాన్వెంట్లో చదివిన విద్యార్థికంటే మామూలు స్కూల్లో చదివిన విద్యార్థి జీవితంలో వేటినైనా ఎదుర్కోగలడు అని స్వయంగా తెలుసుకున్నాను. మా సర్వీస్‌లో చూసినా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారు అందరితో కలిసిపోతుంటారు. అదే పెద్దపెద్ద కాన్వెంట్లలో చదివి వచ్చిన వాళ్లు మామూలు వాళ్లతో కలవరు. వారిలో కాన్ఫిడెన్స్ లెవల్ తక్కువగా ఉండటం చూశాను. ఇక నా విషయానికి వస్తే, దేవుడంటే భయం కాకుండా భక్తి, ప్రేమ ఉంది. అలాగే భక్తి నుంచి దైవాన్ని అర్థం చేసుకునే దిశగా పయనిస్తున్నాను. ఇవన్నీ జీవితంలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పుతున్నాయి. దైవాన్ని అర్ధం చేసుకునే దిశగా పయనిస్తున్నాను అంటున్నారు? ఎలా? భగవద్గీతను చదవడం, అర్థం చేసుకునే క్రమంలో ఈ విషయం స్పష్టమైంది. అప్పట్లో నేను నలభై ఏళ్ల వయసులో డీఐజీగా గుంటూరు, కృష్ణా జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్నాను. పోలీసు వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్ అనేది ఉంది. అక్కడికి వివిధ మతాలకు చెందిన ఏవేవో కరపత్రాలు వస్తుండేవి. ఇవన్నీ చదివినప్పుడు సమాజంలో మతం గురించి ఇంత యాక్టివిటీ జరుగుతుందేంటా అనే ఆలోచన మొదలైంది. ఆ టైమ్‌లోనే కొంతమంది ప్రొఫెసర్లను కలిశాను. భగవద్గీత ఔన్నత్యం గురించి అప్పుడే తెలిసింది. పుల్లెల శ్రీ రామచంద్రుడు వంటివారి ద్వారా సీరియస్‌గా భగవద్గీతను చదవడం అలవాటు చేసుకున్నాను. సంస్కృతం కూడా తెలిసి ఉండటం వల్ల భగవద్గీతతో పాటు రామాయణం, భారతం, ఉపనిషత్తులనూ అధ్యయనం చేస్తూ వచ్చాను. భగవద్గీత మిమ్మల్ని అంతగా ఎందుకు ఆకట్టుకుంది? ఏ విషయాలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి? మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా మంది మేధావులను ప్రభావితం చేసిన మహాగ్రం£ý ం భగవద్గీత. దీనిని అర్జునుడికి కృష్ణుడు బోధించి ఉండవచ్చు. కానీ, ఇది కృష్ణుడు గురించి కాదు... దేవుడంటే ఫలానా వ్యక్తి కాదు. దేవుడు ఆకాశంలో మాత్రమే ఉండడు. అతనో సూపర్ కాప్ లేదా సూపర్ కంప్యూటర్ కాదు. దేవుడు నీలోనే ఉన్నాడు అనే విషయం భగవద్గీత స్పష్టం చేస్తుంది. మతం ఎప్పుడూ మనిషిని మంచిమార్గంలో పెట్టడానికి పనిచేస్తుంది. అయితే, అసలు తత్త్వం ఏమిటనేది భగవద్గీత చెబుతుంది. ఈ అనంత విశ్వం దేవుడైతే అందులో నువ్వూ ఉన్నావు. నీలో ఉన్నదే భగవంతుడు అని కళ్లకు కడుతుంది. మనిషి మనస్తత్వాన్ని బాగా అవగాహన చేసి మన మందుకు తెచ్చిన మహాగ్రంథం. ప్రకృతిలో ఉన్న రజో, తమో, సత్వ గుణాలున్నట్టే అవి మనిషిలోనూ ఉన్నాయి. అయితే, ఒకరిలో ఒక్కోగుణం ఎక్కువ ఉంటుంది. అవే మంచి చెడులుగా నిర్ణయమవుతాయి. వీటిని దాటి బయటకు రా అంటుంది భగవద్గీత. మూర్ఖస్థాయి నుంచి అమోఘ స్థాయికి చేరుకోవడం ఎలాగో చెబుతుంది. సర్వాత్మభావన, ఆత్మశుద్ధికి అమోఘంగా పనికి వస్తుంది. నెల రోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ‘కర్మయోగ’పై పేపర్ ప్రెజెంట్ చేశాను. ఈ సమావేశానికి ఎంతోమంది పాశ్చాత్య ప్రొఫెసర్లు కూడా వచ్చి మన భగవద్గీత గురించి ఎంతో వివరణాత్మకంగా మాట్లాడారు. భగవద్గీత చెప్పినట్లు దేవుడు ఒక వ్యక్తి కాదు? మరి దేవుడు అంటే ఎవరు? మతపరంగా రెండు రకాల దేవుళ్లున్నారు. ఒకటి– చారిత్రక దేవుళ్లైన రాముడు, కృష్ణుడు మొదలైనవారు. రెండు– పురాణాల దేవుళ్ళైన శివుడు, విష్ణువు, గణేషుడు, అమ్మవారు.. వీరిని ఒక్కో శక్తికి గుర్తులుగా మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఉపనిషత్తుల్లో చెప్పినవిధంగా దేవుడు అనేది శుద్ధచైతన్యం. ఆ చైతన్యం నుంచి ఈ ప్రపంచం విస్తరించింది. ఇప్పుడు సైన్స్ ఎలా చెబుతుందో ఒకప్పుడు ఉపనిషత్తుల ద్వారా వివరించారు. అయితే, ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు కథల రూపంలో తీసుకువచ్చారు. లలితాత్రిపురసుందరి ఫొటోని గమనించండి. శివుడు పడుకొని ఉంటాడు. ఆయన పైన అమ్మవారు కూర్చొని ఉంటారు. ఎందుకు? ఇక్కడ శివుడు శుద్ధ చైతన్యానికి గుర్తు. ఈ చైతన్యంలోనే శక్తి ఉంటుంది. ఈ శక్తిని మనం అమ్మవారిగా భావించుకున్నాం. అంటే, చైతన్యం పైన ఆధారపడిన సృజనాత్మక శక్తిని మనిషి స్త్రీ రూపంగా సృష్టించాడు. సృష్టించినవాడు బ్రహ్మ అని, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని, శివం అంటే మంగళకరమైన వాడనీ అర్థం. శివుడికి, విష్ణువుకు తేడా ఎలాంటిదో వేదాల్లో చెబుతారు. కానీ, మతపరంగా మనవాళ్లు మరోలా తీసుకున్నారు. నిజానికి భౌతికంగా దేవుడు అంటే ఇలాగే ఉంటాడని లేదు. మనిషి ఊహలో పుట్టినవారు దేవుళ్లు. భాగవతంలో చిన్న చిన్న కథలు ఉంటాయి. వాటిని వయసు తేడా లేకుండా చిన్నపిల్లవాడు ఎంజాయ్ చేస్తాడు, పెద్దవాళ్లూ ఎంజాయ్ చేస్తారు. అందుకే అందరి దేవుళ్లపైనా రకరకాల కథలు సృష్టించబడ్డాయి. దేవుడు ఫలానాచోటు మాత్రమే ఉండడు. మన ఇంట్లోనూ, ఒంట్లోనూ, మనసులోనూ ఉన్నాడు. తత్త్వం స్థాయిలో తెలుసుకునేవాడికి ఏ దేవుడైనా ఒకటే! దేవాలయాల్లో, పూజల్లో చివర్లో చెప్పే మంత్రపుష్పంలో లాగా మనం ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో ఫలం లభిస్తుంది. అల్లా, జీసస్ అనుకున్నా అదే విధమైన ఫలం వస్తుంది. ఆలయానికి తరచూ వెళుతుంటారా? ఏ ఆలయం బాగా నచ్చుతుంది? ఆలయాలు అన్నీ సందర్శిస్తుంటాను. అయితే, ఏదైనా కోరుకోవడం కోసం వెళ్లను. ముఖ్యంగా ప్రాచీన ఆలయాలు, వాటి నిర్మాణ శైలిని ఇష్టపడతాను. తమిళనాడు దేవాలయాలు మహాకావ్యంలా ఎంతో శిల్పశాస్త్రం, నాట్యశాస్త్రం కళ్లకు కడతాయి. మన వైపు శ్రీకాళహస్తి ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది. మీ నాన్నగారు గ్రామ కరణంగా ఉండేవారు. మీరు పోలీసు శాఖలోకి వచ్చారు. అసలు ఖాకీకి–ఉత్తరీయానికి పొత్తు ఎలా కుదిరింది? యాక్సిడెంటల్‌గా జరిగింది. అనేక ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మా ప్రొఫెసర్లు చెప్పి, ప్రోత్సహించారు. మిగతా అన్ని పరీక్షలతో పాటు నేనూ, మా స్నేహితులు యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాం. ఈ ఉద్యోగానికి నేను సెలక్ట్ అయ్యాను. దైవం తప్పు చేసినవారిని కూడా క్షమించమంటుంది. మీ విధి నిర్వహణేమో శిక్షించమంటుంది. ఈ మీమాంసను ఎలా ఎదుర్కొన్నారు? దేవుడు ఇంకా క్రూరంగా శిక్షిస్తాడు! అందుకేగా నరకం అంటూ ఉంది. తప్పు చేసినవాడిని శిక్షించాల్సిందే! ఇందులో ఎలాంటి మీమాంస లేదు. అయితే, పశ్చాత్తాపం చెందినవాడిని మాత్రం శిక్షించకూడదు. నక్సలైట్ రీహాబిలిటేషన్ ఈ కేటగిరి కిందకే వస్తుంది. నక్సలైట్లలో చాలా మంది పల్లెల్లో ఉన్నవారే. వాళ్లు అమాయకులు. ఏదో కొత్త రాజ్యాన్ని స్థాపిస్తానని నక్సలిజంలోకి వెళ్లినవారు కొన్నాళ్లకు ఇదంతా సరైనది కాదు అని బయటకు వచ్చినవారున్నారు. అలాంటి వారిని జనంలోకి తీసుకురావడానికి కృషి చేశాం. టెక్ మధు అనే అతను రాకెట్స్ తయారుచేసేవాడు. మద్రాసులో పెద్ద షాప్ పెట్టారు. ముందు షాపులో వస్తువులు అమ్మేవారు. వెనకాల రాకెట్స్ తయారు చేసేవాళ్లు. కొన్నాళ్లకు అతడే రియలైజ్ అయ్యాడు. బయట అంతా ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. ఇంత అభివృద్ధి చెందుతున్న వ్యవస్థను మనం భూస్వామ్యం అంటూ కూలగొట్టడం ఎందుకు... అని బయటకు వచ్చేశాడు. అభినందించి, గవర్నమెంట్ నుంచి రావాల్సిన మొత్తాన్ని అందజేశాం. తిరిగి కొత్త జీవితం ఆరంభించాడు. ఇలాంటివి జరిగినప్పుడు సంతోషం అనిపిస్తుంది. చాలా మందితో సరెండర్ అవమని చెప్పినవి, అలా సమాజంలో వారికో స్థానం కల్పించిన సంఘటనలు ఎక్కువ. దేవుడా గట్టెక్కించు అనుకున్న సందర్భాలు న్నాయా? తప్పకుండా ఉన్నాయి. నలభై ఏళ్ల వరకు ఏమీ అనుకోలేదు. ఆ తర్వాత మాత్రం కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవుణ్ణి పూజించడం వంటివి ఉన్నాయి. కోరుకున్నవీ ఉన్నాయి. ఇప్పుడైతే లేవు. వయసు పెరిగే కొద్ది ఆలోచనల్లో మార్పు వస్తుంది. అందుకు గ్రంథపఠనాలూ తోడ్పడతాయి. కొన్నేళ్ల క్రితం మీ భూమి ఆక్రమణకు గురైనట్లు పేపర్లలో వార్తలు వచ్చాయి. ఈ కష్టాన్ని గట్టెక్కించమని దైవాన్ని కోరుకున్నారా? కీసర గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. నేను పోలీసుశాఖకు చెందినవాడినే. ఓ పోలీసాఫీసర్ నుంచే ఆ స్థలం కొన్నాను. కొని కూడా పదేళ్లు అయ్యింది. కానీ, మధ్యలో కొందరు వచ్చారు. గ్రామాలలో ఉండే చిన్నస్థాయి లీడర్ల వల్లే ఇలాంటివి జరుగుతాయి. ‘ఎవరొచ్చినా ఈ భూమి కొనకూడదు’ అని సమస్యను సృష్టించారు. నేను కేసు పెట్టకపోతే తప్పుడు ల్యాండ్ కొన్నారనో, ఆక్రమించుకున్నారనో నలుగురూ అనుకుంటారు. ఏంట్రా దేవుడా ఈ సమస్య అనుకున్నానే కానీ, దీన్నుంచి గట్టెక్కించు అనుకోలేదు. మొత్తానికి క్లియర్ అయ్యింది. మీ పిల్లలకు దైవం గురించిన విషయాలు ఎలాంటివి చెబుతుంటారు? హిందూయిజం గురించి పిల్లలకు ఏవిధంగా చెప్పాలి (హౌ టు టెల్ హిందూయిజమ్ టు యువర్ చైల్డ్) అనే అంశాలతో పుస్తకం రాశాను. నేను మా పిల్లలకు చెప్పిన విషయాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. హిందూయిజం అనేది మిగిలిన మతాల్లాంటిది కాదు.చాతుర్వర్ణం మయా సృష్టం.. గుణ కర్మ విభాగశః.. అని భగవద్గీతలో కుల ప్రసక్తి లేదు. అక్కడ వర్ణం గురించే చెప్పారు. సత్వరజస్తమో గుణాల వర్ణన అది. సత్వ గుణానికి అహింస మూలం, సత్యం, దానం, శౌచం.. ఈ గుణం ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఈ గుణాలు లేనివాడు బ్రాహ్మణుడు కాదు. ప్రపంచంలో ఈ గుణాలు ఎవరిలో ఉన్నా అతడిని బ్రాహ్మణుడిగానే పరిగణించాలి అని చెప్పారు. అంటే గుణాలను బట్టి మనుషులను వర్గీకరించారు. రజోగుణంలో ఉన్నవాడిని క్షత్రియుడు అన్నారు. వీటిలోనూ రెండు వర్గాలున్నాయి. తమో గుణం ఉన్నవాడిని శూద్రుడు అన్నారు. మనుషుల పనులు వారు చేసే వ్యాపారాలను బట్టి మారి అవి కులాలుగా స్థిరపడ్డాయి. దీనికి కొన్నేళ్లుగా రాజకీయాలూ తోడయ్యాయి. ఇప్పుడు విశ్రాంత జీవనంలో మీరు ఎంచుకున్న మార్గం? అద్వైత అకాడమీ పేరుతో భగవద్గీత ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాను. వెబ్సైట్ ఉంది. యూ ట్యూబ్‌లో రామాయణం, భగవద్గీత, ఉపనిషత్తుల గురించి క్లాసులు తీసుకున్న వీడియోలు ఉన్నాయి. తెలుసుకున్నది పుస్తకాలలోనూ, వీడియోలలోనూ పొందుపరచడంలో తీరికలేకుండా ఉన్నాను. మీ విధి నిర్వహణలో ఒకోసారి అవతలివారి ప్రాణం తీయాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు దైవం పోసిన ప్రాణాన్ని.. మనం తీయడం ఏంటి, అనే భావన కలిగేదా? ఒక బా«ధ్యతాయుత ఉద్యోగంలో ఉన్నప్పుడు షూట్ చేసే సంఘటనలు ఉంటాయి. అలాంటివి చేయకపోతే మా వృత్తికి మేం అన్యాయం చేసుకున్నట్టే. దైవం దృష్టిలో కూడా అంతేగా... మన విధిని మనం నూటికి నూరు శాతం నిర్వర్తించాలి. క్లిష్ట సమయంలోనే షూట్ చేసే పరిస్థితి వస్తుంది. అలా లేకపోతే ‘ఆ వ్యక్తి’ మరో పదిమందినో, వంద మందినో చంపుతాడు. అయితే, చంపాలనే ఆలోచనతో చేయం. షూట్ చేసే సమయంలో కాలికో, చేతికో గాయం చేసి దోషిని పట్టుకోవాలని చూస్తాం. ఎదుటివాడికి సాయపడటం దైవం అయితే, మనుషుల్లో మీరు చూసిన దైవత్వం? పోలీసు శాఖలో ఇవి నిత్యకృత్యం. ఒకటని చెప్పలేను. ప్రజలకు రక్షణ ఇచ్చేందుకు కఠినంగా కనిపిస్తాం. కానీ, పోలీసులే సాయానికి మారుపేరుగా కనిపిస్తారు. దేవుడు రక్షకుడైనట్టే పోలీసు ఆ బాధ్యతను తీసుకున్నాడని భావిస్తాను. దైవం పట్ల భక్తి గొప్పదా? భయం గొప్పదా? భగవద్గీత చదివిన తర్వాత దేవుడంటే ప్రేమ ఉంటుంది కానీ, భక్తి, భయం రెండూ ఉండవు. దేవుడంటేనే ఒక వెరీ ఫ్రెండ్లీ కాన్సెప్ట్. కృష్ణుడు, శివుడు, గణేషుడు.. వీరిని మనం ఎంత ప్రేమగా ఆరాధిస్తాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ‘హూ యామ్ ఐ’ అంటే ‘నేను ఎవరిని?’ రమణ మహర్షి రచనల్లో మొదట ఈ ప్రశ్న కనిపిస్తుంది. అధి+ఆత్మ. నా గురించి అనేది ‘అధి.’ నేను ఏమిటి అనేది ఆత్మ. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ గురించి తెలుసుకున్నాక దీని వెనుక ఉన్న చైతన్యం ఏంటి? అని ఆ స్థాయిలో మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడు అంటే భయం, భక్తి అనే స్థాయిని దాటిపోతాం. ఇవన్నీ మన మంత్రాల్లో ఉన్నాయి. కానీ, మనవాళ్లు వివరించరు. ఒకరిద్దరు వివరించినా అవి అందరికీ చేరవు. ‘ఇక్కడ మునిగితేనే పుణ్యం, ఈ పూజ చేస్తేనే ఫలం’ అంటూ ఏమీ లేదు. అందరం అర్థం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, వాటిని చెప్పగలిగేవారు లేరు. భగవద్గీత చదివితే మూఢనమ్మకాలన్నీ పోతాయి. సొంతంగా తప్పు చేయని స్థాయికి మనిషి ఎదుగుతాడు. - నిర్మలారెడ్డి చిల్కమర్రి తల్లి శ్రీమతి అన్నపూర్ణమ్మతో రిటైర్డ్ డీజీపీ కె. అరవిందరావు -
‘బడుల్లో భగవద్గీత తప్పనిసరి చేయాలి’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ రూపొందించిన ప్రైవేటు మెంబర్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ ఈ బిల్లును సభ ముందుంచుతారు. విద్యాసంస్థల పాఠ్య పుస్తకాల్లో నైతిక బోధనగా భగవద్గీత నిర్భంధ బోధన బిల్లుగా ఈ బిల్లును వ్యవహరించనున్నారు. అయితే మైనార్టీలకు చెందిన విద్యాసంస్థల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను ఈ బిల్లులో చేర్చలేదు. -
నేను పుట్టాను... లోకం పాడింది!
నేను పుట్టాను ఒక జననం! టాటా వీడుకోలు ఒక మరణం! జననానికీ మరణానికీ మధ్యలో... నా హృదయంలో నిదురించే చెలీ ఒక ప్రేమ నిలువవే వాలు కనుల దాన ఒక టీజింగ్ జగమే మాయ బతుకే మాయ ఒక వైరాగ్యం నిదురపోరా తమ్ముడా ఒక వేదసారం నేనొక పూల మొక్క కడ నిల్చి ఒక విలాపం. ఘంటసాల గాత్రం జీవన సూత్రం. మానవ జన్మకు దివ్యగానామృతం. ఆ స్వర వేంకటేశ్వరునికిది.. ‘సాక్షి’ పట్టిన పాటల పల్లకీ! ఘంటసాల ఇప్పటివరకూ పాడిన పాటల్లో అందుబాటులో ఉన్నవి మూడు వేల పాటలు. అందుకని ఆయన పాడిన పాటల సంఖ్య అదే అని కొందరి వాదన. ‘కాదు... ఆయన పదివేల పాటల వరకూ పాడార’ని మరికొందరి వాదన. ఆయన ఎన్ని పాటలు పాడారు? అనే పరిశోధన ఇప్పటికీ జరుగుతోంది. ఘంటసాల పాడిన పాటల్లో ‘ఇవి పాపులర్’ అని కొన్నింటినే చెప్పడం... సముద్రంలో చెమ్చా పట్టుకుని నీటిని తోడే ప్రయత్నం లాంటిదే! ఎన్నని చెప్పగలం! అందుకే అందరికీ తెలిసిన ఆయన పాపులర్ సాంగ్స్‌లో మచ్చుకు ఒక 22 పాటల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే, ఆయన పుట్టింది 1922లో కదా! రాజా, మ్యూజికాలజిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా... భగవద్గీత... ఓ రికార్డు! వేదవ్యాసుడు రాసిన ‘మహాభారతం’లో కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ బోధించిన ‘భగవద్గీత’ భక్తులకూ, వేదాంతులకూ పరమ పవిత్రమైనది. జీవన వేదాంతమంతా చెప్పే ఆ మహత్తర గీతా శ్లోకాలనూ, వాటి భావాన్నీ తెలుగు నాట వాడవాడలా పాపులర్ చేసింది ఘంటసాలే అంటే అతిశయోక్తి కాదేమో! ఆయన కన్నా ముందు గాయనీమణులు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ లాంటి కొందరు భగవద్గీత పాడినా, అవి ఏవీ అంతగా పాపులర్ కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది ప్రయత్నించినా తెలుగునాట వేరే దేనికీ ఆ స్థాయి ప్రాచుర్యం రాలేదు. హెచ్.ఎం.వి. వారి గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా ఘంటసాల చేసిన ఈ మహోపకారం ఇవాళ్టికీ ఒక రికార్డే! 1. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది.. (ప్రేమనగర్) ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది...’ ఈ పాట నేటికీ వినపడుతుంటుంది. ‘ప్రేమ్‌నగర్’లోని ఈ పాట అప్పట్లో యమ పాపులర్. నిజానికి ఇది తాగుడు సందర్భంలో వచ్చే పాట. కానీ, ఆ సందర్భంతో సంబంధం లేకుండా ఈ పాట ఎవర్గ్రీన్ అయింది. ఈ పాటను యానిమేషన్ల కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా వాడుతున్నారు. అక్కినేని నటించిన ఆఖరి చిత్రం ‘మనం’లో అక్కినేని కుటుంబమంతా కనిపించే సందర్భంలో ఈ పాటలో కొంత రీ-మిక్స్ చేసి వాడారు. 2. ఎంత ఘాటు ప్రేమయో... (పాతాళ భైరవి) గాయకుడు బడే గులామ్ అలీఖాన్‌ను మద్రాసు తీసుకొ చ్చి, పాడించడానికి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రయత్నించినప్పుడు అప్పట్లో చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఆయన కచ్చేరీని మద్రాసులో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఘంటసాల తన ఇంట్లోనే బడే గులామ్ అలీఖాన్కీ, ఆయన వాద్య బృందానికీ రెండు రోజుల పాటు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ వీళ్లందరికీ స్వయంగా చపాతీలు తయారు చేసేవారు. ఘంటసాల ఉదయం రికార్డింగ్ స్టూడియోకు వెళ్ళి, సాయంత్రం రాగానే బడే గులామ్ అలీఖాన్ బృందంతో రాగ సాధన చేసేవారు. హిందుస్తానీ రాగాలను ఆకళింపు చేసుకున్నారు . ఆ ప్రభావంతోనే ‘ఎంత ఘాటు ప్రేమయో...’ పాటను రాగేశ్రీ రాగాన్ని ఉపయోగించి స్వరపరిచారని అప్పట్లో కొందరు అనేవారు. ఘంటసాల స్వరపరచి, పాడిన ప్రేమగీతాల్లో ఇది ఎవర్ గ్రీన్. 3. నా హృదయంలో నిదురించే చెలి... (ఆరాధన) ప్రేమ పాటల్లో మరో చెప్పుకోదగ్గ పాట ‘నా హృదయంలో నిదురించే చెలి’. అక్కినేని నాగేశ్వరరావు అభినయించిన ప్రేమ పాటల్లో ఆయన సతీమణి అన్నపూర్ణకు బాగా నచ్చిన పాట ఇది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆవిడ స్వయంగా చెప్పారు. 4. అత్త లేని కోడలుత్తమురాలు... (మన దేశం) అప్పటి నుంచి ఇప్పటి దాకా శాశ్వతంగా ఉన్న పాటల్లో ఘంటసాల పాడిన ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒకటి. విశేషం ఏమిటంటే... సినిమా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన ఈ పాట ‘ప్రైవేట్ సాంగ్’గా కూడా శ్రోతల మనసు దోచుకుంది. చివరికి ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒక నానుడి అయింది. 5. నిలువవే వాలుకనుల దానా... (ఇల్లరికం) ఏ పాట అయినా ఘంటసాల నోట ప్రాణం పోసుకోవాల్సిందే. హీరోయిన్లను హీరో ఆటపట్టించే టీజింగ్ సాంగ్ ‘నిలువవే వాలు కనుల దాన..’ అలాంటిదే. ‘ఇల్లరికం’లోని ఈ పాటలో నటించడానికి అక్కినేని ఇష్టపడలేదు. అదే మాట చిత్రదర్శకుడు తాతినేని ప్రకాశరావుతో అన్నారు. కానీ, దర్శక-నిర్మాతలను కాదనలేక నటించారు. చేసిన తర్వాత కూడా ఆయనకు మనసొప్పలేదు. ‘ఈ పాటకు ఎంత ఖర్చయితే అంత ఇస్తా... సినిమాలో నుంచి తీసేయండి’ అని విన్నవించుకున్నారు. అప్పటికే సినిమా చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఉంచేశారు. మామూలుగా ఏయన్నార్ నటించిన ప్రతి సినిమా ఆయన భార్య అన్నపూర్ణ చూస్తారు. ఈ సినిమాను మూడు, నాలుగుసార్లు చూడటంతో ఆయన కారణం అడిగితే.. ‘ఈ పాట చాలా నచ్చింది.. అందుకే’ అన్నారట. 6. సుందరి నీ వంటి... (మాయాబజార్) సినీ చరిత్రలో ‘మాయాబజార్’ది ఓ ప్రత్యేకమై పేజీ. ఆ చిత్రానికి ఘంటసాల ఓ స్వరకర్తగా వ్యవహరించారు. ఇందులో ‘సుందరి నీ వంటి దివ్యస్వరూపము..’ పాట గురించి తెలియనవాళ్లు ఉండరు. ముందుగా ఈ పాటను గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు - సావిత్రి పాడగా రికార్డ్ చేయాలనుకున్నారు. ఇద్దరూ రిహార్సల్ కూడా చేశారు. ఈ పాటకు ఘంటసాల స్వరకర్త. చివరి నిమిషంలో దర్శక-నిర్మాతలు కేవీ రెడ్డి, బి. నాగిరెడ్డి ఈ పాటను ఘంటసాల పాడితే బాగుంటుందనుకున్నారు. అప్పటివరకూ హాస్యరస గీతాలంటే పిఠాపురం నాగేశ్వరరావు - మాధవపెద్ది సత్యమే. అలాంటిది ఘంటసాలతో ఈ పాట పాడించడం ఓ ప్రయోగం. ఈ పాటను ఘంటసాల ఎంత అద్భుతంగా పాడారంటే.. హాస్యరస గీతాలకు తనదైన ముద్ర సంపాదించుకున్నారు. 7. పడవా వచ్చిందే పిల్లా... (సిపాయి చిన్నయ్య) పాట సాహిత్యం ఘంటసాల పట్టించుకునేవారు. ‘సిపాయి చిన్నయ్య’కి స్వరకర్త ఎమ్మెస్ విశ్వనాథన్.అందులో ‘పడవా వచ్చిందే పిల్లా’ పాటను రికార్డ్ చేస్తామనగా ముందు రోజు ఘంటసాలతో రిహార్సల్ చేయించారాయన. విశ్వనాథన్ పాన్ నములుతూ పదాలు పలికారు. దాంతో ‘పడవా’ బదులు ‘భడవా’ అని ఘంటసాలకు వినిపించింది. అది ఇబ్బంది అనిపించింది. ఇంటికెళ్లగానే భార్యతో ‘ఆత్రేయ ఇలా రాయడం బాధగా ఉంది’ అని వాపోయారట. అప్పుడామె ‘విశ్వనాథన్ పాన్ నములుతారుగా. స్క్రిప్ట్ తెప్పించుకు చూడండి’ అన్నారు. స్క్రిప్ట్‌లో ‘పడవ’ అని చూసి, ఘంటసాల ఊపిరి పీల్చుకున్నారు. 8. ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మీ... (దసరా బుల్లోడు) ‘దసరా బుల్లోడు’లోని ‘అరెరెరెరె... ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ...’ మంచి మాస్ సాంగ్. ఈ పాటలో ఉన్న ‘అరెరెరెరె...’ అనే అక్షరాలు ఇన్స్ట్రుమెంట్ మీద వాయించడం కష్టం. అది ఘంటసాల అద్భుతంగా పలికించబట్టి మరింత పాపులర్ అయింది. ఈ పాటకు ఘంటసాల వాయిస్, ఏయన్నార్ స్టెప్స్ జనాలను ఆకట్టుకున్నాయి. ఇదే పాటను ‘నేనున్నాను’లో నాగార్జున రీ-మిక్స్ చేసి వాడారు. అక్కడ తండ్రి నర్తిస్తే, ఇక్కడ తనయుడు అంతే జోష్‌గా నర్తించారు. 9. జోరుగా హుషారుగా షికారు పోదమా... (భార్యాభర్తలు) ఘంటసాల పాడిన సరదా పాటల్లో ‘భార్యాభర్తలు’లోని ‘జోరుగా హుషారుగా షికారు పోదమా..’ ఒకటి. నాటి తరంలోనే కాదు.. నేటి తరంలో కారులో వెళ్లేటప్పుడు సరదాగా ఈ పాట వినేవాళ్లు... పాడేవాళ్లు ఉన్నారు. ఈ పాట టైటిల్‌తో ‘జోరుగా హుషారుగా’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఈ పాటను మోడ్రన్ ఆర్కెస్ట్రాతో రీ-మిక్స్ చేసి, ఉపయోగించారు. 10.కోలొ కోలోయన్న కోలో నాసామి (గుండమ్మ కథ) ఎన్టీఆర్, ఏయన్నార్.. వీరిద్దరిలో ఎవరికి పాడితే వారి గొంతులానే అనిపించడం ఘంటసాల వాయిస్ ప్రత్యేకత. ‘గుండమ్మ కథ’లో ‘కోలో కోలోయన్న కోలో నా సామి’ పాటలో ఇద్దరూ పాడుతున్నట్లు అనిపించి నా ఏ హీరోకు తగ్గట్లుగా ఆ హీరోకు ఘంటసాల గాత్రంలో వ్యత్యాసం స్పష్టంగా వినిపించింది. అలాగే ‘భూకైలాస్’లో ‘దేవ దేవ ధవళాచల మందిర...’ పాటను అటు ఎన్టీఆర్‌కీ, ఇటు ఏయన్నార్కీ తగ్గట్టుగా పాడారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’లో ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య వాద-సంవాద పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ఘంటసాల అద్భుతంగా పాడారు. అలా ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి సంవాద పద్యాలు పాడడం చక్కటి ‘ఓకల్ ఫీట్’ అని చెప్పాలి. 11.పెను చీకటాయె లోకం... (మాంగల్యబలం) ఘంటసాల పాడిన పాటల్లో ‘మాంగల్య బలం’లోని ‘పెను చీకటాయె లోకం..’ ఆయన తనయుడు ఘంటసాల రత్నకుమార్‌కు ఓ మంచి అనుభూతి. అఫ్కోర్స్ తండ్రి పాడిన పాటలన్నీ కుమారుడికి అలాంటివే అనుకోండి. అయితే ‘పెను చీకటాయె..’ స్పెషల్. ఒకసారి ఘంటసాల రత్నకుమార్ పెట్రోల్ పోయించుకోవడానికి బంక్‌కి వెళ్లారు. ఎంతసేపటికీ అక్కడి కుర్రాడు పెట్రోల్ కొట్టకపోవడంతో విషయమడిగారు. ‘ఒక్క నిమిషం సార్! ఘంటసాలగారి పాట వస్తోంది. అది అయిపోయాక కొడతా’ అన్నాడట. అప్పుడు రత్నకుమార్ ‘నేను ఘంటసాలగారి అబ్బాయిని’ అంటే ఆ కుర్రాడు ఆశ్చర్యానందాలతో చూశాడట. ఈ విషయాన్ని స్వయంగా రత్నకుమార్ పంచుకున్నారు. 12. జగమే మాయ బ్రతుకే మాయ... (దేవదాసు) మద్యం మత్తులో హీరో పాడే పాటలకు ప్రాణం పోయడం అంటే ఘంటసాల గాత్రానికే చెల్లుబాటైంది. ‘దేవదాసు’లో ‘జగమే మాయ బ్రతుకే మాయ...’ పాట అందుకో ఉదాహరణ.. ‘దేవదాసు’ కథను శరత్చంద్ర రాయక ముందు తాగుబోతులకు ప్రత్యేకంగా పేరూ గట్రా లేవు. ఆ సినిమా తర్వాత తాగుబోతులను ‘దేవదాసు’ అనడం మొదలైంది. ‘జగమే మాయ’ పాట మందు బాబులకే కాదు.. పాడుకునేవాళ్లందరికీ ఒక మైకం. వేదాంత పరంగా కూడా ఈ పాట ఓ మైకమే. 13. మనసు గతి ఇంతే... (ప్రేమనగర్) ‘ప్రేమనగర్’ సినిమాలో తాగుడు మానేసిన తర్వాత పాడే ‘మనసు గతి ఇంతే..’ అద్భుతంగా ఉంటుంది. మనసు పడే మథనానికి అద్భుత ఆవిష్కరణ ఈ పాట. 14.నిదురపోరా తమ్ముడా... (సంతానం) ‘సంతానం’ సినిమాలో అనిసెట్టి సుబ్బారావు రాసిన ‘నిదుర పోరా తమ్ముడా...’ అనే పాట ఉంది. ఈ పాటను ఘంటసాల - లతా మంగేష్కర్ పాడారు. ముందు లత పాడారు. ఆ తర్వాత ఘంటసాల వాయిస్‌ని రికార్డ్ చేశారు. లత కన్నా ఘంటసాల హై పిచ్‌లో పాడారు. ఆ తర్వాత ఆయన భార్య ‘పాట ఎలా వచ్చింది?’ అని అడిగితే.. ‘‘ఆ సంగతలా ఉంచితే.. ఈ పాట కోసం సుసర్ల దక్షిణామూర్తి (సంగీత దర్శకుడు) సూట్ కుట్టించుకున్నారు. బొంబాయి నుంచి లతాగారు వస్తున్నారు కదా... అందుకే సూట్ తొడుక్కున్నారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే ఆయనను మొదటిసారి సూట్లో చూశా’’ అని చమత్కరించారు. 15. శేషశైలవాస... శ్రీవేంకటేశా... (శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం) ఘంటసాల గాత్రం కొన్ని పాటలకు శాశ్వతత్వాన్ని ఇచ్చింది. ఆయన పాడిన భక్తి పాటలు శ్రోతల్లో భక్తి పారవశ్యాన్ని నింపుతాయి. అణువణువునా భక్తి తత్వాన్ని నింపుకొని ఆయన పాడిన పాటల్లో ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ చిత్రంలోని ‘శేష శైలవాస... శ్రీవేంకటేశా...’ ఒకటి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడి దేవస్థానంలో ఈ పాట మోగుతూనే ఉంటుంది. కలియుగం ఉన్నంతవరకూ ఈ పాట ఉండి తీరుతుందంటే అతిశయోక్తి కాదేమో! 16. చల్లనివెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) ‘సంతానం’ సినిమాలోని ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో..’ మంచి రొమాంటిక్ సాంగ్. ‘ప్రేమికుడు’లో ఎస్పీ బాలు-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చే సీన్లో ఎస్పీబీ ఈ పాటను ఆలపిస్తారు. అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన బాలు ఘంటసాలను గుర్తు చేసుకుని ఈ పాటను ఆ సినిమాలో ఆలపించడం చెప్పుకోదగ్గ విషయం. 17. మాణిక్యవీణామ్... (శ్యామలా దండకం) (మహాకవి కాళిదాసు) ‘మహాకవి కాళిదాసు’ చిత్రంలోని ‘మాణిక్యవీణామ్’ అని మొదలై, ‘చతుర్భుజే.. చంద్రకళా వతంసే...’ అని వచ్చే శ్యామలా దండకాన్ని ఘంటసాల పాడుతున్నప్పుడు స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావుకి విచిత్ర అనుభూతి కలిగింది. పాడుతున్నప్పుడు ఘంటసాల చుట్టూ ఓ కాంతి పుంజం ఉన్న భావన తనకు కలిగిందని పెండ్యాల స్వయంగా పేర్కొన్నారు. దండకం పూర్తయ్యాక ఘంటసాల దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయానని ఆయన అనడం విశేషం. ఆ దండకంలో ఘంటసాల గాత్రంలో దైవత్వం ఉట్టిపడిందనడానికి ఇదొక నిదర్శనం. 18. ధారుణి రాజ్యసంపద మదంబున... (పాండవ వనవాసం) ఘంటసాల పాడిన పద్యాలు.. స్తోత్రాలు ఎవర్గ్రీన్ అనాలి. ఘంటసాలకు ముందు ‘ఈలపాట’ రఘురామయ్య, సూరిబాబు.... వీళ్లందరూ పద్యాలు పాడిన పద్ధతి ఒక ఎత్తు. ఘంటసాలది మరో ఎత్తు. ‘మహాభారతం’లోని పద్యాల్లో ఘంటసాల ద్వారా పాపులర్ అయిన పద్యాల్లో ‘పాండవ వనవాసం’లోని ‘ధారుణి రాజ్యసంపద మదంబున..’, ‘కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్...’ లాంటివి చాలా ఉన్నాయి. ‘నర్తనశాల’లో తిక్కన పద్యాలు, ‘కాళహస్తీ మాహాత్మ్యం’లో ధూర్జటి మహాకవిపద్యాలు ఘంటసాల గాత్రం ద్వారా సామాన్య జనాల్లో కూడా ప్రసిద్ధి పొందాయి. స్తోత్రాల్లో ‘సీతారామ కల్యాణం’లో వాడిన ‘రావణ భుజంగ...’ స్తోత్రం ఒకటి. ఇది రావణకృతం. ఆ విషయం చాలామందికి తెలియదు. ఘంటసాల ఆలపించడంతో ఆ స్తోత్రం పాపులర్ అయింది. 19.రసికరాజ తగువారము కామా... (జయభేరి) స్వరసహితంగా ఘంటసాలగారు పాడటం మొదలుపెట్టాక ఔత్సాహిక గాయకులు కూడా ఆ ప్రయత్నం చేసేవారు. ‘జయభేరి’ చిత్రంలోని ‘రసిక రాజ తగువారము కామా...’ పాట వారికి లిట్మస్ టెస్ట్ లాంటిది. 20. శివశంకరీ... శివానందలహరి శివశంకరీ... (జగదేకవీరుని కథ) ‘జగదేకవీరుని కథ’లోని ‘శివశంకరి...’ పాట కూడా అంతే. ఔత్సాహిక గాయనీ గాయకులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి ‘రసిక రాజ తగువారము కామా...’, ‘శివశంకరి...’ - ఈ రెండు పాటలూ పాడాల్సిందే. ఈ పాటల్ని అద్భుతంగా పాడినవాళ్లు ఏ పాటనైనా పాడగలుగుతారు. వర్ధమాన గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హేమచంద్ర ఈ రెండు పాటల ద్వారానే బాగా పాపులర్ అయ్యాడు. గాయని కల్పన కూడా ఈ పాట ద్వారా చాలా పేరు తెచ్చుకున్నారు. చెన్నైకి చెందిన చిన్నారి స్ఫూర్తి ఈ పాట పాడి, ప్రశంసలు పొందింది. అంటే... వయసు తారతమ్యం లేకుండా అన్ని వయసులవారికీ ఘంటసాల పాటలు ఓ స్ఫూర్తి. 21. నేనొక పూల మొక్క కడ నిల్చి... (పుష్పవిలాపం కావ్యం) కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ‘కుంతీ కుమారి’, ‘పుష్ప విలాపం’... - ఈ రెండు ప్రైవేట్ సాంగ్స్ ఘంటసాల గాత్రంతో సామాన్య జనంలోకి ఎంతగానో చొచ్చుకుపోయాయి. ఈ రెండూ హృదయానికి హత్తుకునేవే. ముఖ్యంగా ‘పుష్ప విలాపం’లో ‘ఎంత దయలేనివారు మీ ఆడువారు..’ అంటూ ఘంటసాల పాడిన పద్ధతి ఆ తర్వాతి తరం కుర్రకారు ఆడవారిని ఆటపట్టించడానికి ఉపయోగించడం మొదలైంది. ఇక, ‘కుంతీ కుమారి’లోని ‘అది రమణీయ పుష్ప వనము’ అని రచయిత కరుణశ్రీ రాస్తే, పాడే సౌకర్యం కోసం ‘అది ఒక రమణీయ పుష్ప వనము’ అని ఘంటసాల మార్చారు. దానివల్ల ఛందస్సు దెబ్బతిన్నదనే విషయాన్ని కూడా ఎవరూ గ్రహించలేదు. ఘంటసాల పాట పాడే పద్ధతికి ఉన్న ప్రత్యేకత అది అని ఓ సందర్భంలో గాయకుడు పీబీ శ్రీనివాస్ అన్నారు. 22. టాటా వీడుకోలు... గుడ్‌బై ఇంక సెలవు... (బుద్ధిమంతుడు) ‘టాటా వీడుకోలు..’ తాగుబోతు పాట అని ‘బుద్ధిమంతుడు’ సినిమా చూసినవాళ్లకు తెలుస్తుంది. చూడనివాళ్లు ఇదేదో సరదా పాట అనుకుంటారు. ‘వీడుకోలూ...’ అంటూ ఘంటసాల ఒక రకమైన మత్తుతో పాడతారు. మత్తు పాటలకు ఘంటసాల ఇచ్చినంత పాపులారిటీ ఏ గాయకుడూ ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... దేశంలో ఏ గాయకుడికీ దక్కనంత గౌరవం ఘంటసాలకు దక్కింది. ఏ గాయకుడికీ లేనన్ని శిలా విగ్రహాలు ఆయనకే ఉన్నాయి. ఘంటసాల అకాడమీ ఉంది. ఆయన పాటలు సేకరించే వాళ్ల సంఖ్య బోలెడు. ఘంటసాల మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అలా ఆయన, ఆయన పాటలు ఎప్పటికీ చిరంజీవులే. తెలుగు సినిమాలో మరాఠీ గీతం! ‘పాండురంగ మాహాత్మ్యం’ సినిమాలో ఘంటసాల మరాఠీ గీతం పాడారు. ‘హే కృష్ణా ముకుందా మురారి..’ పాట తర్వాత కృష్ణుడి భక్తులందరూ కృష్ణుడిలో కలిసిపోతారు. అప్పుడు తుకారామ్ కూడా కృష్ణుడిలో కలసిపోతాడు. ‘తూ హీ.. బీజాజీ ఛలే..’ అనే మరాఠీ గీతాన్ని ఘంటసాల పాడారు. ఇలా ఒక తెలుగు సినిమాలో మరాఠీ గీతాన్ని ఘంటసాల పాడిన విషయం చాలామంది తెలియకపోవచ్చు. ఘంటసాల స్పెషల్ ‘స్టార్ స్టార్ సూపర్ స్టార్’ ఈరోజు రాత్రి 7.30 గం.లకు సాక్షి టీవీలో -
యుద్ధవేదం... మధుర గానం...
ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని, అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని దర్శించి, ‘తాతా! నీ మనుమలకు ధర్మబోధ చెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో భీష్మపితామహుడు, ‘జగన్నాటక సూత్రధారీ! చతుర్దశ భువనాలనూ సృష్టించి, పోషించి, లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను పాఠం చెప్పడమంటే, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చె ప్పినట్లుంటుందయ్యా’ అన్నాడు. అదీ శ్రీకృష్ణతత్వం. అలా భీష్ముడంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగదాచార్యా అని సంబోధించాడు. (ఉషశ్రీ భారతం నుంచి) జగద్గురువు, జగదోద్ధారకుడు, జగదాచార్యుడు, గీతాచార్యుడు... ఎన్ని నామాలతో శ్రీకృష్ణపరమాత్ముడిని స్మరించినా తనివి తీరదు. దశావతారాలలో ఒక్క కృష్ణావతారాన్ని మాత్రమే సంపూర్ణావతారంగా చెప్పారు. మిగిలిన అవతారాలను అంశావతారాలుగా వివరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయమ్... కృష్ణుడు స్వయంగా భగవంతుడు... అని శ్రీకృష్ణుని స్తుతించారు. యుద్ధ వేదం: మహాభారతంలో కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆవలి పక్షంలో ఉన్న కురు, గురు వృద్ధులను చూసిన అర్జునుడికి వైరాగ్యం వచ్చింది. తాను యుద్ధం చేయలేనన్నాడు. చేతిలో గాండీవం జారిపోతోందన్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తాతలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తాను సంహరించలేనన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణపరమాత్ముడు నవ్వురాజిల్లెడు మోముతో, భ గవద్గీత ప్రబోధించాడు. అంతే. అర్జునుడు గాండీవం అందుకున్నాడు. శత్రు సంహారం చేశాడు. అందుకే కృష్ణుని పుట్టినరోజు మనకు పండుగ అయ్యింది. సాక్షాతు పరమాత్ముడు భగవంతుడై, భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమానికి ఉపకరించేలా సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను ‘భగవద్గీత ’ గా అందించి జగద్గురువు అయ్యాడు. మధుర గానం: శ్రీకృష్ణుని పేరులోనే ఒక ఆకర్షణ ఉంది. కర్షతి ఇతి కృష్ణ... అంటే ఆకర్షించేవాడు అని అర్థం. శ్రీకృష్ణునిలాగే, భగవద్గీత కూడా అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇది మానవజాతిని శాసిస్తుంది. ఆ శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగల నైపుణ్యం గురువులకే ఉంటుంది. ఆ గురువులకే గురువు అయిన శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. కాల జ్ఞానం: అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మొత్తం ఉపనిషత్తుల సారమే. మానవజాతికి కావలసిన ఇహపరమైన మానవ ధర్మాలన్నింటినీ బోధించిన సమగ్రమైన సరళమైన గ్రంథం. మాన వజాతికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలను, ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కార్యశీలతను, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన జ్ఞానాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. ఏ కాలంలోనైనా పనికొచ్చే విషయాలన్నింటినీ కేవలం 700 శ్లోకాలలో చెప్పాడు. ప్రాంత ం, కాలం అనే నియమం లేకుండా జగత్తులో ఎవరికైనా, ఎక్కడైనా పనికొచ్చే మార్గనిర్దేశం చే సేవాడు జగద్గురువు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన అంశాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ మానవాళికీ ఆచరణయోగ్యంగా ఉంటాయి కనుకనే ఆయన జగద్గురువు అయ్యాడు. కర్మ ఫలం: ‘మానవజాతికి పిరికితనం పనికిరాదు. హృదయ దౌర్బల్యాల వల్ల ఏమీ సాధించలేం’ అని కృష్ణపరమాత్మ ఇచ్చిన ఉపదేశం, ఏకాలంలోనైనా, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆందోళన పడకుండా, ఫలితం కోసం ఆశపడకుండా, ఆ పనిని శ్రద్ధగా ఆచరిస్తే, మంచి ఫలితాలొస్తాయి.. అనే దానికి ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...’ శ్లోకం ఇస్తున్న సందేశం. స్థిత యజ్ఞం: ‘‘మనసులో చెలరేగే కోరికలను అక్కడే అణగద్రొక్కి ఆత్మయందే అన్నిటినీ అనుభవించగలవాడు స్థితప్రజ్ఞుడు. క్లేశాలకు కుంగడు, సుఖాలు మీదపడినా లొంగడు. భయం, క్రోధం, రాగం అనేవాటిని దరిచేరనివ్వడు’’ అని చెబుతూ మనిషి కోర్కెలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో వివరించి జగద్గురువు అయ్యాడు. మార్గ దర్శనం: సాధారణంగా లోకంలో జనసామాన్యం తమ కంటె ఉత్తములైన వారినే అనుసరిస్తారు. అందుచేతనే ఈ ముల్లోకాలలో చెయ్యవలసింది యేదీ లేకపోయినా, వాంఛించేది లేకపోయినా జ్ఞానులు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. అలా కర్తవ్యం నిర్వర్తించకపోతే అందరూ సోమరులవుతారు. అందువల్ల లోక నాశనం కాకతప్పదు. అలానే జ్ఞానులు కర్మ చేస్తూ అజ్ఞానులకు మార్గదర్శకులు కావాలని బోధించి జగద్గురువు అయ్యాడు. ‘‘ఈ కర్మ అంతా నా వల్లే జరిగిందనే భావం ఉండకూడదు. పైగా జరిపిన కర్మకు ఫలం కావాలనే ఊహ ఉండకూడదు. ఈ దృష్టితోనే ఎందరో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి మోక్షపదం చేరారు’’ అని పలికి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. - డా. పురాణపండ వైజయంతి, ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి నడిపించే శక్తే.. గురువు గురువు త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి. శిష్యులలోని అజ్ఞానాన్ని పోగొట్టి, నడిపించే శక్తి కలిగి ఉన్నవాడు గురువు. గు అంటే చీకటి అని, రు అంటే పోగొట్టేవాడు అని. అజ్ఞానమనే చీకటిని పారద్రోలగలిగేవాడు గురువు అని శాస్త్రం చెబుతోంది. తన సందేశం ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగినవాడిని జగద్గురువు అంటారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతతో ఆయన జగద్గురువు అయ్యాడు. - డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ -
ఈశావాస్యోపనిషత్తు బ్రహ్మసూత్రాల సారం
ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోని నలభయ్యవ అధ్యాయంలోనిది. ఇందులో ఉన్నవి పద్ధెనిమిది మంత్రాలు మాత్రమే. అయితే ఇది మిగిలిన అన్ని ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ, భగవద్గీతనూ అధ్యయనం చేసే క్రమంలో ముందుండి దారి చూపిస్తుంది. మానవ జాతికి ఈ జన్మ ఎందుకు ఎత్తామో, ఎలా జీవించాలో, ఏం తెలుసుకోవాలో తెలియజేస్తుంది అందుకే నాలుగు వేదాలలో్ర పాచీనమూ, ప్రసిద్ధమూ అయిన పది ఉపనిషత్తులలోనూ దీనికే ప్రథమస్థానం దక్కింది. ఈ ఉపనిషత్తు గురించి మనం గతవారం చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు ఈ వారం.. అంతటా ఆత్మయే నిండి భిన్న రూపాలుగా కనిపిస్తోందని తెలిసిన తర్వాత మానవ సమాజం ఎవరి పనులు వారు చేస్తూ కక్షలూ, కార్పణ్యాలూ లేకుండా నిండుగా నూరేళ్లూ జీవిస్తారనీ జీవించాలనీ ఈశావాస్యోపనిషత్తు ఆకాంక్ష. ఓం ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృధః కస్య స్విద్ధనమ్ ఈ జగత్తులో సృష్టి స్థితి లయలతో పరిణామం చెందుతూ కనపడేదంతా పరబ్రహ్మ స్వరూపమైన భగవంతునిచే ఆవరింపబడి ఉంది. ఈ సత్యాన్ని గ్రహించు. అతను నీకు అనుగ్రహించిన దానిని అనుభవించు. మరొకరికి ఇచ్చిన సంపదను దొంగిలించకు అన్నది ఈశావాస్యోపనిషత్తు ప్రధాన సూత్రం. ఈశావాస్య అనే మంత్రపాదం అనేకచోట్ల కనిపిస్తుంది కనుక ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చింది. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే... అవిద్యతో మృత్యువును గెలిచి విద్యతో అమృతత్వాన్ని పొందవచ్చు అనే వాక్యం ఈ ఉపనిషత్తుకు ప్రాణం. భౌతికాన్ని, పారలౌకికాన్ని మానవుడు ఒకటిగా ఇష్టపడకుండా రెండిటి ప్రయోజనాన్ని పొందాలని ఈ ఉపనిషద్వాక్యం సూచిస్తోంది. భౌతిక జీవన ప్రియత్వాన్ని అసంభూతి అనీ, ఆత్మజ్ఞానాన్ని సంభూతి అనీ దీనిలో పేరు పెట్టారు. అసంభూతితో ఎంత అంధకారంలో పడతారో కేవలం సంభూతితో అంతకంటే గాఢాంధకారంలో పడతారు. రెండిటినీ తెలుసుకున్నవాడే అమృతత్వాన్ని పొందుతాడు. రూపరహితమైన విశ్వాత్మను చర్మచక్షువు లతో చూడాలంటే.. సూర్యుడే చూపించగలడు. సౌరశక్తిని ఈ ఉపనిషత్తు జ్ఞానమార్గంగా స్తుతిస్తోంది. సత్యదర్శనానికి అడ్డంగా సూర్యబింబం మూతలాగా పెట్టబడి ఉంది. సూర్యుణ్ణి ప్రార్థించాలి. ఆయన కొంత కాంతి తగ్గించుకుని దారి చూపిస్తే మనకు సత్యదర్శనం అవుతుంది. సూర్యునిలో ఉన్న విశ్వశక్తి గోచరిస్తుంది. అప్పుడు భౌతిక శరీరంలో ఉన్న ప్రాణవాయువు విశ్వంలో లీనమవుతుంది. ఈ దేహం భస్మమౌతుంది. అనగా దేహభ్రాంతి నశిస్తుంది. జన్మపరంపర స్వరూపం గుర్తుకు వస్తుంది. ‘అగ్నే నయ సుపథారాయే అస్మాన్’ అంటే ఓ అగ్నీ! మమ్మల్ని మంచి దారిలో నడిపించు అంటూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించడంతో ఈశావాస్యోపనిషత్తు ముగుస్తుంది. మానవులకు పగలూ, రాత్రి కూడా ఆత్మజ్ఞానంతో కూడిన జీవనమే ఉంటుంది. సూర్యుడు, అగ్ని వారిని అలా నడిపించాలి. ఇహపరాల సమన్వయంతో కూడిన విశ్వాత్మజ్ఞానమే మానవ జన్మకు సార్థకతను ఇస్తుంది. అంతటా ఆత్మయే నిండి భిన్నరూపాలుగా కనిపిస్తోందని తెలిసిన తర్వాత మానవ సమాజం ఎవరి పనులు వారు చేస్తూ కక్షలూ, కార్పణ్యాలూ లేకుండా నిండుగా నూరేళ్లూ జీవిస్తారనీ జీవించాలనీ ఈశావాస్యోపనిషత్తు ఆకాంక్ష. ఓ సూర్యుడా! నీవు ఒక్కడివే ఋషివి (జ్ఞానపారంగతుడివి). అందరినీ నియమించేవాడివి. అన్ని ప్రాణులను కార్యోన్ముఖులను చేసేవాడివి. సృష్టిలో అన్నిటిపైన ఆధిపత్యం కలవాడివి నువ్వే. మహాకాంతిమంతమైన సూర్యగోళం నన్ను అనుగ్రహించాలి. మంగళప్రదంగా నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి. అప్పుడు నేను నువ్వవుతాను. అనే ఈ ప్రార్థన జ్ఞానసముపార్జనను, ఇంద్రియ నిగ్రహాన్ని, కార్యోన్ముఖత్వాన్ని, జ్ఞానం వల్ల స్థిరమయ్యే అద్వైత స్థితిని తెలియజేస్తుంది. మానవజాతి జీవనవిధానం ఇలా ఉండాలి అని సూచిస్తుంది. సూర్యుడికి అందరినీ పోషించే శక్తి ఉంది కనుక అతడిని పూషా అంటారు. ‘‘ఓ అగ్నీ: మమ్మల్నందరినీ సుపథంలో నడిపించు. అన్ని లోకాలనూ దివ్యత్వంతో నింపగల విద్వాంసుడివి నీవే. మాకు పోరాడే శక్తిని ప్రసాదించు. మా పాపాలను పోగొట్టు. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణం ఇది పూర్ణం. పూర్ణం నుండి పూర్ణమే పుడుతుంది. పూర్ణానికి పూర్ణాన్ని కలిపితే పూర్ణమే మిగులుతుంది. శుక్ల యజుర్వేదంలోని ఈ శాంతిమంత్రం ఒక్కటి చాలు. మనకు సంపూర్ణజ్ఞానాన్ని కలిగించడానికి. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఓం కారం... శబ్దాలకు ప్రధాన ద్వారం
అకార ఉకార మకారాలలో అకారం... భూమి, చె ట్లు లేదా ఇతర వస్తువులకు, ఉ కారం... ఆకారం, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు, మకారం... ఆకృతి ఉండీ లేనటువంటివానికి ప్రతీకగా ఉండటం, అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండటం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడూ కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూండటం వల్ల, శాశ్వతప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరవాత మోక్షం పొందగలుగుతాడు. అలౌకికం దేనిగురించయినా అదే మొదటిది అని చెప్పేటప్పుడు ఓం ప్రథమంగా అని చెబుతారు.ఎందుకంటే ఓంకారం అన్నింటికన్నా ముందుండేది. ఓంకారానికి మతపరంగా ఎనలే ని ప్రాధాన్యముంది. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతినామానికీ మొదటగా ఓంకారాన్ని చేర్చిన తర్వాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన మొట్టమొదటి అక్షరం ఓంకారమని వే దోక్తి. ఓంకారం నుంచి వెలువడే ప్రతిధ్వనులు భగవంతుడు సర్వవ్యాపకుడని వివరిస్తాయి. బౌద్ధం, జైనం, హిందూ... ఏ మతంలోనైనా దీనికి ప్రాధాన్యత ఎక్కువ. దీనికే ప్రణవ నాదమని కూడా పేరు. ఓంకారాన్ని నాసికతో సుదీర్ఘంగా పలుకుతారు. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రధానద్వారం. ఓం అనేది ఏకాక్షరం. పంచ పరమేష్ఠుల నుంచి తయారుచేయబడిందనేది వారి విశ్వాసం. ఓం నమః అనేది నమక మంత్రానికి సూక్ష్మరూపం. ఓంకారాన్ని మొట్టమొదటగా ఉపనిషత్తులు వర్ణించాయి. ఇది ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు,నేపాల్‌లో కూడా ఓం అనే అక్షరం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఓం అనేది భగవంతుడి పేరు. ఆయనకు సంబంధించిన ప్రతిధ్వని. ఒక్కొక్క అక్షరాన్నీ వరసగా పరిశీలిస్తే అకార ఉకార మకారాలు. ఇది ఆధ్యాత్మికశక్తిని ఈ మూడు శబ్దాలలో చూపుతుంది. ఓంకారం చేత మనలో శక్తి ప్రజ్జ్వరిల్లి ఆ శబ్దోచ్చారణ వల్ల సమాధిస్థితి కలిగి అంత్యాన అపరిమితానందం కలుగుతుంది. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది. అక్షరాలన్నీ ఏర్పడి సగుణబ్రహ్మగా మారుతుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది.. శరీరంలో ఉన్న నాడీవ్యవస్థలో ఇడ (కుడివైపున ఉన్నవి) అ కారంతోను, పింగళ (ఎడమవైపున ఉన్నవి) ఉ కారంతోను, సుషుమ్న (మధ్యలో ఉన్నవి) నాడీ వ్యవస్థ మ కారంతోనూ ఉత్తేజం చెంది, స్వస్థత పొందుతాయి. ఆర్యసమాజం ఓంకారాన్ని దైవస్వరూపంగా భావించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో, ‘నేను ఈ సృష్టికి తండ్రిని. నేనే తల్లిని, ఆధారాన్ని కూడా నేనే. జ్ఞానాన్ని ప్రసాదించే ఓంకారాన్ని నేనే అని ఓంకారం గురించి వివరించాడు. బ్రహ్మశక్తి (సృష్టి), విష్ణుశక్తి (స్థితి), శివశక్తి (లయ) ఓం అనేది ఒక ప్రతీకాత్మక చిహ్నం. విశ్వమంతా ఇదే. మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక, మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్ద మాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నిటినీ కోల్పోయినట్టే. - డి.వి.ఆర్ -
భగవద్గీత శ్లోకాలతో అతిచిన్న పుస్తకం
-
గీతలో అర్థం చేసుకున్నది ఆచరణలో...
శ్రీ కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడా? లేక యుద్ధం చేయలేనని గాండీవాన్ని దించేసిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశాడా? లేక నీ వెనుక నేనున్నాను... ధైర్యంగా యుద్ధం చేయమని ప్రోత్సహించాడా? ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రశ్నలకు అరటిపండు వలిచినంత సులువుగా సమాధానాలు చెబుతారు అరవిందరావు. ఒకప్పుడు రాష్ర్ట్రంలోని అరాచక శక్తుల ఆటకట్టించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారికి ఇప్పుడు ఇటువంటి ధర్మసూక్ష్మాలను బోధించగలగడం ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం... నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ దేవుడిని పూజించలేదు. అయితే అప్పట్లో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏమున్నదనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్న కాలంలో కొందరిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఒక తీవ్రవాది... ‘మాకు మీలాగ వందలాది దేవుళ్లుండరు, పిచ్చి బొమ్మలేవీ ఉండవు. ఒకే దైవం...’ అంటూ హేళనగా మాట్లాడాడు. అలాంటివే ఇంకొన్ని సంఘటనలు జరిగాక ఇంతకీ ఏ మతం ఏం చెబుతోందనే జిజ్ఞాస కొద్దీ బైబిల్, ఖురాన్, భగవద్గీత చదివాను. బైబిల్, ఖురాన్లు అర్థమైనంత సరళంగా భగవద్గీత అర్థం కాలేదు. దాంతో మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడిని ఆశ్రయించి సందేహాలు తీర్చుకున్నాను. ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే... గీతలో కృష్ణుడు ఉపనిషత్తులు, వేదాంతాల సారాన్ని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయే తప్ప మూఢవిశ్వాసాలవైపు మళ్లించేలా ఉండవు. అందుకే నేను భగవద్గీతను మరింత బాగా చదివి, ఆకళింపు చేసుకున్నాను. నేను తెలుసుకున్నదానిని పదిమందికీ అర్థమయేలా నా మాటల ద్వారా... రాతల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పటి విధులకు - అనంతరం విశ్రాంత జీవనంలో ఇప్పుడు నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలకు ఎక్కడా పొంతన కనిపించినట్లు అనిపించదు. కానీ భగవద్గీత సారాన్ని గ్రహించడం వల్లనే విధ్యుక్తధర్మాన్ని ఆచరించడం సులువైందని నేను నమ్ముతాను. ప్రణాళిక ఏమీ లేదు... అంతా ఆచరణలోనే! నిజానికి విశ్రాంత జీవితాన్ని ఆధ్యాత్మికపథంలో గడపాలనే ఆలోచన కానీ, అందుకు ఓ ప్రణాళిక కానీ అప్పట్లో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడు కలిగిన ఆలోచనలను అప్పుడు ఆచరణలో పెట్టడం వల్లనే నా ప్రయాణం ఇప్పుడిలాంటి ప్రణాళికాబద్ధమైన దారిలోకి మళ్లింది. అమెరికాలో అయోమయాన్ని చూశాక! మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వారి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులలో నెలకొన్న అయోమయమే ఇలా పుస్తకాలు రాయించింది. అక్కడ స్కూళ్లలో పిల్లలకు అన్ని మతాల గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. అలా చెప్పేటప్పుడు హిందూమతం గురించి చెట్లను, పుట్టలను, విగ్రహాలను పూజిస్తారంటూ కొంత హేళనగా చెప్పడాన్ని గమనించాను. అది విన్న పిల్లలు పలు సందేహాలతో ఇంటికొచ్చి తల్లితండ్రులను అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక చాలామంది తల్లితండ్రులు నీళ్లు నములుతుంటారు. అప్పుడు హిందూమతం ఏమి చెప్తోందని విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాశాను. భగవద్గీతను ఎంతోమంది రాశారు. వాటిలో ఐదారు వెర్షన్లు చదివాను. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాల్సిన అవసరం ఉందనిపించి నేనూ రాశాను. నలభైలలో మొదలైన జిజ్ఞాస నన్ను సంస్కృతం చదివేలా చేసింది. ఎం.ఎ, పిహెచ్డి చేశాను. రిటైరైన తర్వాత నా పిహెచ్డి గ్రంథం ‘ఉపనిషత్తుల్లోని జ్ఞానం గురించి వివేచన’ను పుస్తకరూపంలో తెచ్చాను. ఇప్పటివరకూ నేను మొత్తం ఏడు పుస్తకాలు రాస్తే, వాటిలో ఐదు విడుదలయ్యాయి. మరో రెండు ప్రచురణ దశలో ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల సారంపై నేను చెబుతున్న పాఠాలు అద్వైత అకాడమీ వెబ్సైట్లో ప్రసారమవుతున్నాయి. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయ్యే రెండవ జీవితాన్ని చాలామంది నిరర్థకంగా గడుతుపుంటారు. అయితే ఈ దశను ప్రయోజనకరంగా మార్చుకోవడానికి నలభైలలోనే నాందిపడితే మంచిది. సమాజానికి ఏం చేయగలమనే వివేచనతో ఒక ఆలోచన మొదలైతే ఉద్యోగవిరమణ తర్వాత జీవితం నిరర్థకంగా మారకుండా సార్థకమవుతుంది’’ అంటున్న ఈ అరవిందుడి సూచన రేపో మాపో రిటైరవబోయే వారే కాదు... ఇప్పుడిప్పుడే ఉద్యోగజీవనంలోకి ప్రవేశిస్తున్న వారు కూడా ఆలోచించదగ్గది... ఆచరించ వలసినదీ! ఆయన మార్గమే నన్నూ నడిపిస్తోంది ఇప్పటి పిల్లల పాఠ్యగ్రంథాల్లో నీతికథలు ఉండడం లేదు. కనీసం తల్లితండ్రులైనా పిల్లలకు ఇంట్లో సుమతీశతకం, వేమన శతకం వంటివి నేర్పించడం లేదు. ఇది సరైన ధోరణి కాదని ఆయన వాపోతుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ మార్గాన్ని తీసుకోవడం వల్ల నాకు కూడా సౌకర్యంగానే ఉంది. ఉదయం వ్యాయామం నుంచి రాత్రి వరకు మా దైనందిన జీవితం ఓ క్రమపద్ధతిలో నడుస్తోంది. - రమ, అరవిందరావు సతీమణి గీతను అర్థం చేసుకుంటే పరిస్థితిని చక్కదిద్దే మెలకువ, స్వీయనియంత్రణ వస్తుంది. ఉద్యోగి, రాజకీయవేత్త, పరిపాలనాధికారి... ఎవరైనా సరే తమ రంగంలో రాణించడానికి దోహదం చేస్తుంది. భగవద్గీత చదువుతూ కాల్పులు, ఎన్కౌంటర్లు ఎలా చేస్తారని కొందరు సిద్ధాంతకర్తలు నన్ను విమర్శించారు. గీత చదవడం అంటే... ఆ వ్యక్తి అన్నీ వదులుకుని ఎవరు తమ మీద దాడి చేసినా చేయించుకోవాలని కాదు. తన కర్తవ్యాన్ని మరింత కచ్చితంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడని అర్థం. - కె. అరవిందరావు, విశ్రాంత పోలీసు డెరైక్టర్ జనరల్ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'భారతీయులంతా భగవద్గీత చదవాలి'
సాక్షి, హైదరాబాద్: భారతీయులమైన మనందరం భగవద్గీత చదవాలనీ, అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన ఈ ఉత్తమ గ్రంథం నుంచి రోజుకో పాఠం నేర్చుకోవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు. ‘గీతా వారధి నిర్మాణం’ అనే 30 నిమిషాల లఘుచిత్రం డీవీడీని విడుదల చేస్తూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక-సామాజిక సంస్థ ‘భగవద్గీత ఫౌండేషన్’ పక్షాన గాయకుడు, మాజీ జర్నలిస్టు ఎల్వీ గంగాధర శాస్త్రి సంగీతం సమకూర్చి, తెలుగులో తాత్పర్య సహితంగా పూర్తి భగవద్గీతను గానం చేశారు. ఏడేళ్ల విశేష శ్రమ, కృషితో ఈప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా, ముందస్తుగా ఈ ‘మేకింగ్ ఆఫ్ భగవద్గీత’ లఘుచిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం సాయంత్రం గవర్నర్ విడుదల చేశారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశీర్భాషణం చేస్తూ, భగవద్గీత కేవలం హిందూ మతగ్రంథం కాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్. వేణుగోపాలాచారి, రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్, నటుడు బ్రహ్మానందం, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సీబీఐ మాజీ ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
భగవద్గీత అంతర్జాతీయ గ్రంథం
ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువాదమైన మహత్తర గ్రంథం భగవద్గీత. మహాత్మాగాంధి, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్‌ముల్లర్, దారాషికో, ఆర్నాల్డ్ ఎడ్వర్డ్ వంటి దేశదేశాల ప్రముఖులందరి ప్రశంసలు పొందిన భగవద్గీత మత గ్రంథం కాదు. అది మన జాతీయ గ్రంథం మాత్రమే కాదు.. అంతర్జాతీయ గ్రంథం కూడా! ‘‘నా ప్రజా జీవిత ప్రస్థానంలో అడుగడుగునా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. అప్పుడు నాకు ఒక విధమైన ఆందోళన, కర్తవ్య విమూఢత్వం, నిస్పృహ చోటు చేసుకుంటాయి. ఇక ముందుకు వెళ్లలేమన్న నిరా సక్తత ఏర్పడుతుంది. అప్పు డు వెంటనే ‘భగవద్గీతలోని గీతాకారుని దివ్యబోధ - క్షుద్రం హృదయ దౌర్భల్యం..’ అన్న మహా త్ముక్తి, ఆ వెంటనే ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన ..’ అన్న మరో శ్లోకం కనిపిస్తుంది. ‘కర్తవ్య విమూఢత్వాన్ని విడనాడు. నీ విధిని నువ్వు నిర్వర్తించు’ అన్న వాక్యం చదవగానే నాకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కలుగుతుంది.’’ ‘భగవద్గీత’ను గురించి ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు జాతిపిత మహాత్మాగాంధి. సరే! ఆయన భారతీయుడు కాబట్టి, భగవ ద్భక్తుడు కాబట్టి ‘భగవద్గీత’ పట్ల భక్తి ప్రపత్తులు ఉండడం సహజమని అనుకుందాం. మరి, ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ భారతీయుడు కాదే! ఆయన బ్రిటీష్ కవి. భగవద్గీతను ఇంగ్లిషులోకి తర్జుమా చేసింది ఆయనే! ఆ ఇంగ్లిషు భగవద్గీత వెలువడక పూర్వం మహాత్మాగాంధి తన మాతృ భాష గుజరాతీలో ఉన్న ‘భగవద్గీత’ను చదవనే లేదు! ఆయన ‘భగవద్గీత’ సారాంశాన్ని, సందే శాన్ని తెలుసుకున్నది ఆర్నాల్డ్ అనువదించిన ఇం గ్లిషు గ్రంథం నుంచే! అంతవరకు ఎందుకు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవ రు? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. సాపేక్ష సిద్ధాంత కర్త. అణుశక్తికి మూలకారకమైన పదార్థాన్ని కను గొన్న మహామేధావి. ‘కొన్ని సందర్భాలలో నాకు దారీ తెన్ను కాన రానప్పుడు, కర్తవ్య విమూఢత్వం నన్ను ముప్పి రిగొన్నప్పుడు ‘భగవద్గీత’ పేజీలు తిరగవేయగానే నాకు గాఢాంధకారంలో వెలుగు కానవస్తుంది. నేను ‘భగవద్గీత’ పాఠకుణ్ణి’ అన్న ఐన్‌స్టీన్ అమె రికాలో స్థిరపడిన జర్మన్ యూదీయుడు. దారాషికో ఎవరు? మొగల్ చక్రవర్తులలో అయిదవ వాడైన షాజహాన్ పెద్ద కొడుకు. దారా ‘భగవద్గీత’తో ప్రభావితుడై ఆ మహాగ్రంథాన్ని అప్పటి మొగల్ చక్రవర్తుల అధికార భాష ‘పర్షి యన్’లోకి తర్జుమా చేశాడు! దారా సోదరుడైన ఔరంగజేబు మతోన్మాది. అతడు ఆగ్రహోదగ్రుడై అన్నను జైలులో పెట్టించాడు! ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ప్రసిద్ధ జర్మన్ పం డితుడు. ‘భగవద్గీత’తో ప్రభావితుడైన వారిలో మరో ప్రముఖుడు. ఆ మహత్తర గ్రంథం ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడింది. 19వ శతాబ్దిలోనే రష్యన్ భాషలోకి తర్జుమా చేశారు. అయితే ‘భగవద్గీత’ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతు న్నదని ఆ మధ్య రష్యన్ న్యాయస్థానంలో ఒక ప్రబుద్ధుడు కేసు వేశాడు. సుదీర్ఘ విచారణ, చర్చల తరువాత రష్యన్ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. అంతేకాక, భగవద్గీత కర్తవ్య విమూఢులకు కర్తవ్య పథం నిర్దేశిస్తున్నదని, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చా లని ప్రబోధిస్తున్నదని కోర్టు పేర్కొన్నది! కాగా, ‘భగవద్గీత’ ఒక మతగ్రంథమనడం అనుచితం. గీతాకారుడు ‘భగవద్గీత’ను ప్రవచించి, ఇప్పటికి 5,151 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటి మతాలు ఏమీ లేవే! భగవద్గీతలో ఎక్కడా ‘హిందూ’ అన్న పదమే కానరాదు! అన్ని మతాలకు స్థాపకులున్నా రు కాని హిందూ మత స్థాపకులెవరు? అన్ని మతా ల స్థాపకులు, లేదా ప్రవక్తల పేర్లు చెప్పవచ్చు కాని, ‘హిందూ మత’ స్థాపకులెవరని చెప్పగలరా? ‘హిందూ’ అన్నది ఒక ధర్మానికే కాని ఒక మతానికి పేరు కాదు. మరి ‘భగవద్గీత’ ఒక మతగ్రంథమైతే, ఐన్‌స్టీన్, దారాషికో, ఆర్నాల్డ్ ఎడ్వర్డ్, ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్, రష్యన్ కోర్టు - వీరెవ్వరూ ఆ ‘మతానికి’ చెందిన వారు కారే! ఆ మహాద్గ్రం థాన్ని ఎందుకు అంతగా ప్రశంసించారు? కాగా, ‘భగవద్గీత’ మత గ్రంథం కాదు. జాతీ య గ్రంథం మాత్రమే కాదు- అంతర్జాతీయ గ్రం థం కూడా! అందువల్ల ‘భగవద్గీత’ను జాతీయ గ్రంథం చేయాలనడంలో తప్పేమున్నది? (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) మొబైల్: 98483 17533 - డా॥తుర్లపాటి కుటుంబరావు -
భగవద్గీతకు 5,151 ఏళ్లు!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచానికి అందించిన మహోన్నతమైన గ్రంథం భగవద్గీత రూపొంది 5,151 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆదివారం ఇక్కడ ఎర్రకోటలో నిర్వహించిన బహిరంగ సభలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ భగవద్గీతను జాతీయ పవిత్రగ్రంథంగా ప్రకటించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర ప్రపంచ నేతలకు గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఇక చేయాల్సిందల్లా ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమేనని ఆమె అన్నారు. దైనందిన జీవితంతో గీతకు ఎంతో ప్రాధాన్యముందని చెప్పారు. నిష్కామ కర్మను బోధించే ఆ గ్రంథం మంత్రిగా తన విధినిర్వహణకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ భగవద్గీత పోస్టల్ స్టాంపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ నేత అశోక్‌సింఘాల్, మైనారిటీ మోర్చా చీఫ్ యూసఫ్ రనపూర్ణ్‌వాలా, బాబా రామ్‌దేవ్‌లతోపాటు 20 దేశాలకు చెందిన మతగురువులు, ప్రముఖులు పాల్గొన్నారు. ** -
కొత్త పుస్తకాలు
గుణ (భగవద్గీత ఆధారంగా వ్యక్తిత్వ వికాసం) రచన: శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 292; వెల: 135 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, 3-19/11, మధురానగర్, గోకులం రోడ్, స్టార్ హోమ్స్, కాకినాడ. ఫోన్: 8686559557 దర్పణం (కవిత్వం) రచన: డా.ఎ.వి.వీరభద్రాచారి పేజీలు: 146; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9391310886 1.మరణ తరంగం (కథానికలు) సంకలనం: డా.కె.బి.గోపాలమ్ పేజీలు: 102; వెల: 100 2.కథాకేళి (బహుమతి పొందిన కథానికలు) సంకలనం: ఎం.నాగకుమారి, ఎం.రామారావు పేజీలు: 96; వెల: 60 3.గిడుగు-పిడుగు రచన: డా.వేదగిరి రాంబాబు పేజీలు: 100; వెల: 50 4.డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు పేజీలు: 140; వెల: 100 5.కథాకృతి-3 (పరిచయాలు-పరామర్శలు) రచన: విహారి పేజీలు: 182; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, హెచ్ఐజి-1, బ్లాక్-6, ఫ్లాట్ 10, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44. ఫోన్: 9391343916 కాలక్షేపం కథలు రచన: మేడా మస్తాన్ రెడ్డి పేజీలు: 164; వెల: 100 ప్రతులకు: రచయిత, 201, సత్యం ఎన్క్లేవ్, లక్ష్మీ నగర్, శివాజీ పార్క్ రోడ్, విశాఖపట్నం-17. ఫోన్: 9441344365 -
పురాతన పుస్తక భాండాగారం
* ఉర్దూ, సంస్కృత భాషల్లో.. 90 ఏళ్లనాటి భగవద్గీత * ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషల డిక్షనరీలు * అందుబాటులో మరెన్నో అరుదైన పుస్తకాలు న్యూఢిల్లీ: అదిపాత ఢిల్లీలోని అత్యంత ఇరుకైన ప్రాంతం. అక్కడ నివసించే యువతకు.. భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన తట్టింది.. వెంటనే ఆచరణలో పెట్టారు. వజ్ర సంకల్పంతో 1999లో ఓ చిన్న గదిలో గ్రంథాలయాన్ని ప్రారంభిం చారు. భవిష్యత్ తరాలకు పుస్తక సంపదను వారసత్వంగా (ఈ గ్రంథాలయాన్ని) అందజేశారు. ఈ ప్రయత్నానికి అందరూ చేదోడువాదోడయ్యారు. చేయిచేయి కలిపితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ఆ పుస్తక భాండాగారం ఇప్పుడు రెండు దశాబ్దాల వడికి చేరింది. అదే చాంద్నీ చౌక్‌లోని జమా మసీద్‌కు కొద్ది దూరంలోని ఇమ్లీ గలీలో ఉన్న‘షా వాలైలా’ గ్రంథాలయం. అరుదైన, అంతరించిపోతున్న పుస్తకాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడు పరిశోధనా గ్రంధాలయంగా మారింది. అందుబాటులో ఉన్న పుస్తకాలు: వివిధ పబ్లికేషన్లు, డిక్సనరీలు, వివిధ భాషలలో కథలు, పద్య కవితల పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. అంతరించిపోయిన పుస్తకాలు, అరుదైన పుస్తకాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది. ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తోంది. సుమారు 15,000 పుస్తకాలున్నాయి. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల పుస్తకాలున్నాయి. ఈ లైబ్రరరీలో సుమారు 70శాతం అంతరించిపోయిన, అరుదైన పుస్తక సంపద అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్(డవైడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో సికందర్ చాంగేజ్ నిర్వహిస్తున్నాడు. ఆఖరి మొఘలు వంశంతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన అనుభవాలు ఇలా వివరించారు.. దాతల సహకారం: ‘మా వారసుల నుంచి వచ్చిన పుస్తక సంపదను లైబ్రరరీని స్ధాపించినప్పుడు (సుమారు 2000 పుస్తకాలు) దానం చేశాన’ని చెప్పారు. ప్రజలు ముందుకొచ్చి పుస్తకాలను దానం చేస్తున్నారు. అన్ని రకాల, భాషల పుస్తకాలు, అరుదైనవి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అరుదైన పుస్తకాలు 15,000 వరకు ఉన్నాయి. ఈ లైబ్రరరీకి పుస్తకాలను దానం చేయడం ఆయన స్ఫూర్తితో..అలా మొదలై కొనసాగుతోనే ఉంది. అరుదైన పుస్తక సంపద: 150 సంవత్సరాల క్రితం నాటి పద్య పుస్తకాలు(బహదూర్షా జాఫర్ కాలం నాటి) కూడా ఉన్నాయి. 90 ఏళ్ల నాటి ‘భగవద్గీత’ సంస్కృతం, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ సేకరించిన పద్యాల పుస్తకం ఎర్రకోటలోని రాయల్ ప్రెస్‌లో 1885లో ముద్రించారు. ఇది పంజాబీ భాషలో అచ్చు అయ్యింది. అదేవిధంగా 225 ఏళ్ల క్రితం పర్షియన్ రచయిత క్వాజీ సయ్యద్ అలీ రచించిన‘సాయిర్-ఉల్-ఎక్తాబ్’ ఈ పుస్తకం అరుదైనది. సూఫీ బోధనల పుస్తకాలు ఉన్నాయి.. ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషలల్లో డిక్షనరీలున్నాయి. 1870లో బోపాల్‌కు చెందిన బేగం ఆరు భాషల్లో రచించిన ‘ఖాజానతుల్ లుగాత్’ అనే పుస్తకం ఉంది. ఈ అరుదైన పుస్తకాన్ని అంతర్జాతీయ ఆదరణ ఉంది. దేశీయ విద్యార్థులు, స్కాలర్లతోపాటు వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పుస్తకంపై అధ్యయనం, పరిశోధనలు చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.సమస్యల వలయంలో..: అట్లాంటి లైబ్రరరీకి ప్రస్తుతం స్థలం కొరత సమస్యగా మారింది. కొన్ని పుస్తకాలను కట్టలుగటి ఉంచాల్సి వస్తుంది. అంటే ఈ పుస్తక బండాగారం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని మహ్మద్ నయూమ్ చెప్పారు. -
బంజారా భగవద్గీత
హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత.. ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమైంది. అయితే బంజారాలకు మాత్రం ఇది చేరలేదు. వారికి గీతాసారాన్ని అందించాలనుకున్నారు కేతావత్ సోమ్లాల్. తన జాతి జాగృతి కోసం మొక్కవోని సంకల్పంతో పదహారు నెలల పాటు అవిశ్రాంత కృషితో భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలచి వారికి ‘గీతోపదేశం’ చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన సోమ్లాల్ నంద్యాలలోని ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఈయన బంజారా జాతి జాగృతం కోసం కంకణం కట్టుకున్నారు. వారిని చైతన్యపరుస్తూ 200కు పైగా పాటలు రాశారు. తండా తండాకు తిరిగి ఆ పాటలు పాడుతూ బంజారాలను ఉత్తేజితుల్ని చేశారు. రాత మార్చింది... జీవితంలోని మంచి చెడుల్ని భగవద్గీత బోధించింది. ఆ బోధనల్ని బంజారాల దరి చేర్చాలన్న ఆశయంతో గీత రచన చేశానంటారు సోమ్లాల్. అనువాదానికి ముందు ఎన్నో పరిశోధనలు చేశారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి ఔపోసన పట్టారు. 8-8-1988 రోజు భగవద్గీత అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలల కృషితో పూర్తి చేశారు. పండిత రంజకంగా ఉన్న గీతను అందరి దరి చేర్చడానికి సోమ్లాల్ అవిశ్రాంతంగా పని చేశారు. మల్లెమొగ్గ అనే పదాన్ని అనువదించడం కోసం తిరగని తండా లేదు. చివరకు మల్లెమొగ్గను బంజారా భాషలో ‘పుముడా’ అంటారని తెలుసుకుని.. ఆ పదాన్ని గీతలో చేర్చారు. ఇలా ఎన్నో పదాల్ని జనపదంగా మార్చి.. వాక్యంలో కూర్చి బంజారా గీతను తీర్చిదిద్దారు. ప్రేరణ... సోమ్లాల్కు ఆరుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. పేదరికం కమ్మేసినా.. తాత, మేనమామ ప్రోత్సాహంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగించారు. ‘నేను పదో తరగతి చదివే సమయంలో జనగాంలోని హాస్టల్లో ఉండేవాణ్ని. పక్కనే గీతామందిరం ఉండేది. అక్కడి నుంచి రోజూ ఉదయం లౌడ్స్పీకర్లో వినిపించే గీతను వినేవాణ్ని. అప్పటి నుంచే గీతపై అభిమానం ఏర్పడింది. అన్నివిధాలా వెనుకబడిన తన జాతి ప్రజలకూ గీతాసారాన్ని అందజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నా’నని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు సోమ్లాల్. పాతికేళ్ల తర్వాత... భగవద్గీత అనువాదం 1989 నాటికే పూర్తయినా అది అచ్చవ్వడానికి సోమ్లాల్ 25 ఏళ్లు నిరీక్షించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత బంజారా భగవద్గీతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ ద త్తు, జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్ ఆవిష్కరించారు. ద హిస్టరీ ఆఫ్ బంజారా, భారత్ బంజారా గీతమాల, తొలి వెలుగు వంటి రచనలు చేసిన సోమ్లాల్.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెబుతున్నారు. - కంచుకట్ల శ్రీనివాస్ -
నా చిన్ననాటి జ్క్షాపకాన్ని మోదీకి ఇచ్చాను!
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ న్యాయనిపుణురాలు, యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గాబార్డ్ భగవద్గీత పుస్తకాన్ని కానుకగా అందజేశారు. సోమవారం మోదీని వ్యక్తిగతంగా కలిసిన ఆమె భగవద్గీత కాపీని ఇచ్చారు. తన వద్ద చిన్ననాటి నుంచి ఉంటున్నఆ ఆధ్యాత్మిక ప్రభోదను మోదీకి ఇవ్వడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ' మీకు గీత పుస్తకాన్ని కానుకగా ఇచ్చాను. ఆ పుస్తకం నా చిన్నతనం నుంచి నా దగ్గరే ఉంది. యూఎస్ హౌస్ ప్రతినిధిగా కూడా ఆ పుస్తకంపైనే ప్రమాణ స్వీకారం చేశాను' అని 33ఏళ్ల తులసీ గాబార్డ్ ట్వీట్టర్ లో తెలిపారు. భారత్ పై తనకున్న ప్రేమకు ఇదొక గుర్తుగా మోదీకి ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.'భారత ప్రధాని మోదీని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మోదీని కలిసి ఆ గీతను కానుకగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ'ఫేస్ బుక్ లో పేర్కొంది. తన జీవితంలో గీత పుస్తకం కంటే ఎక్కువ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది. -
అద్వైతం
జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును. - భగవద్గీత ‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు.వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను. లుంగీ కట్టుకొని, టవల్ భుజం చుట్టూ వేసుకొని హడావిడిగా మెట్లు ఎక్కుతున్న నాకు, గుమ్మం ముందు నిండిపోయిన చెత్తబుట్ట కంపు కొడుతూ కనబడింది. ఈ అపార్ట్మెంట్ దరిద్రాలలో ఇదొకటి. పెరడు, ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉండదు. లక్షలు పోసి కొనుక్కున్నా ద్వారం ముందు చెత్తబుట్ట ఉంచాల్సిన దౌర్భాగ్యం. తలుపు తీసిన నా భార్యని, ‘‘ఏ...., ఆదిగాడు రాలేదా? ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చు కదా. తీసికెళ్లి కింద పారేసేవాడిని’’ అంటూ విసవిసా బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాను. రెండు రోజుల బడలిక వల్ల వెంటనే నిద్ర వచ్చేసింది. మా కంపెనీ ఎండీ కొడుకు క్రితంరోజు పొద్దున యాక్సిడెంట్లో చనిపోయాడు. నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకురావడం మొదలు, ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే సరిపోయింది నాకు. ఊళ్లోని మా ఇంటి పెరట్లో చేతి పంపు ఉండేది. చావు దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెనగ్గా వెళ్లి ఆ బట్టలు తడిపేసి, వాటిని అక్కడే విడిచేసి ఇంట్లోకి వెళ్లడం మాకు అలవాటు. ఈ సిటీలో అవన్నీ కుదరక, వాచ్‌మెన్‌తో బకెట్ నీళ్లు తెప్పించుకొని, నెత్తిమీద పోసుకుని ఫోన్‌చేసి, నా భార్యతో టవల్ లుంగీ కిందకి తెప్పించుకొని చుట్టుకొని వచ్చి పడుకున్నాను. తరువాతి రోజు సాయంత్రం నేను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా చెత్త బుట్ట నిండుగానే ఉంది. దానికి ఓ ప్లాస్టిక్ కవర్ కూడా తోడైంది. మా అంతస్తులో అందరి ప్లాట్ల ముందు అలాగే ఉన్నాయి. తలుపు తీసిన నా భార్యను మళ్లీ నిన్నటి ప్రశ్నే వేశాను. ‘‘ఆదిగాడు రాలేదా?’’ అని. ‘‘లేదు. ఆ వాచ్‌మెన్‌ను తీసుకెళ్లమంటే అన్ని ప్లాట్లది మోసుకెళ్లలేనంటున్నాడు’’ ఉక్రోషంగా చెప్పింది మా ఆవిడ. డ్రెస్ మార్చుకోకుండానే కిందకు వెళ్లి వాచ్‌మెన్‌ను కేక వేశాను. జవాబు లేదు. మెట్ల కింద అతని రూం తలుపు తీసే ఉంది కానీ మనుషులు లేరు. నడుచుకుంటూ వీధి చివరికి వెళ్లాను. అక్కడే ఖాళీ స్థలంలో ఆదిగాడు వాళ్లు ఉండేది. వాడి గుడిసె ముందు టెంటు వేసి ఉంది. ఏదో ఫంక్షన్ అనుకుంట అని వెనుదిరిగాను. నన్ను చూసి మా వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. ‘‘ఆదిగాడు రెండు రోజుల నుంచి రావడం లేదంటేనూ కేకలేద్దామని వచ్చాను. ఏంటి ఫంక్షన్?’’‘‘ఆయీ! తవకి తెల్దండీ? పేపర్లో కూడా ఏశారండి.’’‘‘ఏంటి?’’ అసహనంగా అడిగాను నేను. ‘‘ఆదిగాడు మొన్న రేతిరి తాగి రోడ్డు దాటతా లారీకి అడ్డంపడి చచ్చిపోనాడండి’’ విన్నది అర్థమవటానికి క్షణకాలం పట్టింది నాకు. ‘‘అయ్యో! నారాయణ ఉన్నాడా? ఆదిగాడికి పెళ్లి కూడా అయినట్టు ఉందే?’’‘‘ఉన్నాడండి. పిల్లోడు కూడానండే’’ టెంటు వేసి ఉన్న గుడిసె దగ్గరకు వెళుతుంటే ఎదురు వచ్చాడు నారాయణ. ఫుల్లుగా తాగి ఉన్నాడు. ‘‘నాకు తెలీదు నారాయణా. చిన్న వయసు. పాపం ఓ పిల్లాడు కూడానట కదా’’ పరామర్శించాను. ‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు. వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను. రేపు మా ఎండీ కొడుకు వర్ధంతి. సేవాకార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేశారు. వెంటనే నాకు ఆదిగాడు గుర్తుకు వచ్చాడు. వాడి భార్యని రేపటి సంతర్పణకి రమ్మంటే బాగుంటది, అంతో ఇంతో ధన రూపేణ లేదా వస్తు రూపేణ ముడుతుంది కదా అనిపించింది. వాచ్మెన్ చేత నారాయణను పిలిపించాను. ‘‘రేపు ఆదిగాడి సంవత్సరీకం కదా ఏం చేస్తున్నావురా?’’ ‘‘నా నేటి సేత్తానయ్యా. ఇప్పుడు తవరు చెప్పేదాకా అసల నాకు ఆ ఉసే తెల్దు. యేడాది అయీపోనాదని. పండగెల్లి పోనాక వారం పైన చచ్చాడు. ఇంకా పండగ రాలేదు కదుండే’’ తల గోక్కుంటా అడిగాడు. వాడి నిర్లక్ష్య వైఖరి నాకు కోపం తెప్పించింది. తమాయించుకొని, ‘‘ఈసారి పండగ వచ్చే నెలలో వస్తుంది గానీ, రేపు నువ్వూ నీ కోడలూ స్టేడియం దగ్గరకు రండి. మా కంపెనీ ఓనరు కొడుకు కూడా అదే రోజు పోయాడు. వాళ్లు రేపు దానాలు చేస్తారు. తీసుకుపోదురు గాని’’, వాడు సరేనని తల ఊపి వెళ్లిపోయాడు. రెండో రోజు పొద్దున్నే హడావుడి మొదలైంది. సొంత పొలంలో కట్టించిన సమాధి వద్దకెళ్లి శ్రద్ధాంజలి ఘటించి, అబ్బాయిగారి పేరున అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చివరికి స్టేడియం వద్దకొచ్చాము. అప్పటికే అక్కడ జన సందోహం భారీగా ఉంది. ఎండీగారు కొడుకు ఫొటో జ్యోతి ప్రజ్వలన గావించి, కొడుకు పేరున ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి కోడలిని జీవిత కాల ఛెర్మైన్‌గా నియమించారు. తన కంపెనీలో పాతిక శాతం వాటా ఆమెకు చెందేలా రాసిచ్చి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ శాఖకు ఆమెను డెరైక్టర్‌గా నియమించారు. ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాల ద్వారా తన మగనికి నివాళులు అర్పిస్తున్న ఆ నడి వయసు ముదితను చూస్తే, నాకు కడుపు తరుక్కుపోయింది. లేత పసుపు రంగు చీరలో, ఆచ్చాదన లేని నుదిటితో, ఆడంబరం లేని బోసి మెడతో తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ వయసుకు మించిన గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని, అన్నింటా తానయ్యి నడుచుకుంటున్న ఆ స్త్రీ మూర్తికి నమస్కరించాలనిపించింది. ముందుగా అన్న సంత్పరణ ప్రారంభించారు. అటు పై అవసరార్థులకు డబ్బు, దుప్పట్లు వితరణ చేస్తున్నారు. అప్పుడు వెదికాను నేను నారాయణ గురించి. నూనే ఎరగని చింపిరి జుట్టు నలుపూ ఎరుపుల అసంమిళిత రంగులో ఉంది. మాసిపోయిన బట్టలు వాడి దయనీయ స్థితికి నిదర్శనంగా ఉన్నాయి. నల్ల తుమ్మ మొద్దులాగున్న నారాయణ కూడా నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. వెనుక ఒక బక్కపలచని ఆడామె. బహుశా వాడి కోడలనుకుంటా, పక్కనే ఇంకో యువకుడు ఓ చిన్న బాలుడిని నడిపించుకుంటూ వచ్చారు. ‘‘కోడలా?’’ అడిగాను నేను, గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి సందేహిస్తూ.‘‘అవునయ్యా. ఈడు నా మరదలి కొడుకు. ఎవురో ఒకడిని పనిలో యెట్టకపోతే మున్సిపాలిటోళ్లు ఇంకోల్లకు ఆదిగాడి ఉద్యోగం ఇచ్చెత్తానన్నారు. అందుకే దీనికీ నాకు అండగుంటాడని ఊళ్లో నుంచి తీసుకొచ్చి, పెళ్లిచేసి పనిలో ఎట్టాను’’ వెకిలిగా నవ్వుతూ చెప్పాడు నారాయణ. నాకు వళ్లు కంపరం పుట్టింది. ఓవైపు పోయినవాడి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎండీగారు, మరోవైపు పోయినవాడి అస్తిత్వాన్ని కూడా గుర్తించని వీళ్లు. అందరి ముందు గొడవ ఎందుకని రెండు చిట్టీలు వాడి చేతిలో విదిల్చాను. అవి తీసుకొని వాళ్లు డయాస్ వైపు కదిలారు. వీళ్లని ఇక్కడికి పిలిచి, తప్పు చేశాననిపించి కోపంగా ఆ వైపు చూశాను నేను. భర్త పేరు నిలపడానికి కృషి చేస్తున్న ఇల్లాలు ఒక వైపు - ఎదురుగా తన కోడలికి కొత్త జీవితాన్నిచ్చిన నారాయణ, ఆమె నుంచి కొత్త బట్టలు స్వీకరిస్తున్నాడు. సౌభాగ్యం కోల్పోయిన కోడలికి ఆస్తి, అందలం సంపాదించిపెట్టిన మామగారు చూలాలికి డబ్బు దానమిస్తున్నారు. వేరొకరి స్థానంలోకి వచ్చిన అబ్బాయి తనది కాని బిడ్డని ఎత్తుకొని సముదాయిస్తుంటే, ముచ్చటపడిన ఎండీగారి భార్య చిట్టీ లేకపోయినా ఇంకో దుప్పటి వాడి చేతిలో పెట్టింది. ఇదంతా అంత ఎత్తు ఫ్లెక్సీ నుంచి ఎండీగారి కొడుకు చిద్విలాసంగా చూస్తున్నాడు. ఆ దృశ్యం నాలోని అంతర్వాహినిని తట్టిలేపింది. ఇంత క్రితం అథఃపాతాళానికి దిగజారినట్టు కనబడిన నారాయణ, ఇప్పుడు మా ఎండీగారితో సరి సమానంగా అగుపించాడు. ఇరువురు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు. ఇందుకు ఒకరిని తెగనాడడం... మరొకరిని మెచ్చుకోవడం తప్పు అని నేను గ్రహించాను. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే! ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి!! జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును, అన్న గీతాచార్యుని అతి నిగూఢ కర్మ తత్వము అప్పుడు నాకు అవగతమైంది. -అనీల్ ప్రసాద్ లింగం -
నిత్యనూతన గీతం
మనిషి జీవితంలో ‘యుద్ధం’ అనివార్యం. అవసరాల కోసం... అవకాశాల కోసం... గుర్తింపు కోసం... బంధాల రక్షణ కోసం... బాధ్యతల నిర్వహణ కోసం... సమరం సాగించాల్సిందే. ఇలా మనిషి జీవితం నిత్య కురుక్షేత్రం. సరిగ్గా ఇలాంటి యుద్ధంలోనే భగవద్గీత ఉద్భవించింది! అర్జున విషాదయోగంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. శత్రుసైన్యంలో అందరూ తనవారే ఉండేసరికి నైరాశ్యానికి గురై, యుద్ధానికి ముందే ఓటమి వైపు అడుగేస్తుంటాడు అర్జునుడు. అతని అంతరంగంలో ఆలోచనల అంతర్యుద్ధం మొదలైంది. ఏం చేయాలో దిక్కు తోచక ‘నువ్వే నాకు దిక్కు’ అంటూ భగవానుడిని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు. భగవద్గీతలోని రెండో అధ్యాయం సాంఖ్య యోగం నుంచి భగవానుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నాడు-నేడు-కృష్ణుడు ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥ ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ భగవానుడు బోధిస్తాడు. ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనోదౌర్బల్యం. దాన్ని విడిచిపెడితే విజయమే. ‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం’ యుద్ధం ఓ సదవకాశం అంటాడు భగవానుడు. యుద్ధం జరిగితేనే కదా ఎవరి బలాబలాలు ఏంటో బయటపడేది. యువతకి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి! ‘క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి’ కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం అంటాడు భగవానుడు. ఇది తెలిస్తే చాలు... వేరే యాంగర్ మేనేజ్మెంట్ అంటూ ఇంకేం ఉంటుంది! ‘సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః’ ఏ విషయం మీదా ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటివాడిగానే తయారవుతాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. ఆకళింపు చేసుకునే ఆసక్తితో ప్రయత్నం చేయాలేగానీ అర్జున విషాదయోగం మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకూ... గీతలోని పద్ధెనిమిది అధ్యాయాల్లో ఇలాంటి మేలిముత్యాలెన్నో. అందుకే భగవద్గీతకు మించిన వ్యక్తిత్వ వికాసం ఇంకోటి లేదు. ఇంతకు మించిన లీడర్ షిప్ పాఠమూ మరొకటి లేదు. దీనికంటే గొప్ప వాగ్ధాటిని, జీవన పోరాటాన్ని నేర్పించగలిగే గ్రంథమూ లేదు. ఇదీ అదీ అని కాదు... నేటి యువతరం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం భగవద్గీతలో ఉంది. ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయడం... ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటం ఇది నేర్పుతుంది. - బి.వి.సురేష్‌బాబా నేటి ‘అర్జునులు’! ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో నేటి యువతరంలోని ఎంతోమందిదీ అదే స్థితి! అదే అయోమయం. అదే ఊగిసలాట. చాలామందికి ఉన్నత లక్ష్యాలు ఉంటాయి. వాటి సాధనకు ప్రయత్నాలూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నంలో వైఫల్యాలు ఎదురైతేనే నిరాశానిసృ్పహలతో కుంగిపోవడం, ఓటమికి తల వంచేయడం. ‘ఇక దేని కోసం జీవించాలి? బతికుండి ఏం ప్రయోజనం?’అనే మెట్ట వేదాంత ధోరణి! ‘యుద్ధం చేయడం కర్తవ్యం’ అన్నది మరచిపోతారు. ఇక్కడ ‘యుద్ధం‘ అంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా జీవన పోరాటాన్ని కొనసాగించడం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని పోగు చేసుకుని పోరాడటం. ఈ తరం యువతకి కావాల్సిన బలం, బలగం ఇదే. గీతాచార్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఇచ్చిన భరోసా కూడా ఇదే. -
ధర్మనిర్ణయ గీత
(రేపు గీతాజయంతి) భగవద్గీత... సన్మార్గ దర్శిని... సాక్షాత్తూ భగవంతుని ముఖత వెలువడిన అమూల్యమైన గ్రంథం. జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చెప్పే మార్గదర్శక మణిదీపం. గాంధీజీ వంటివారు కూడా నిరంతరం పఠించి, చేతితో పట్టుకు తిరిగిన గ్రంథం. అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది? మంచితనంతో పాండవులు రాజ్యాన్ని చేసుకోనిస్తే దాన్ని హస్తగతం చేసుకోదలచీ- ధర్మంగా సంపాదించిన రాజ్యంగా ప్రకటించుకోదలచీ జూదాన్ని ఆడించాడు దుర్యోధనుడు. తెరవెనుక నిలబడ్డాడు ధృతరాష్ట్రుడు. అధర్మంగానూ వంచనతోనూ ఎదుటి వ్యక్తులు శత్రువులుగా మారి యుద్ధానికి దిగినప్పుడు వీళ్లు మా అన్నలు తమ్ముళ్లు తాతలు గురువులు- అనుకుంటూ కూచోకు! ఇది వెనుకడుగు వేయాల్సిన సందర్భం కాదు! అందుకే ఈ దశలో హృదయ దౌర్బల్యాన్ని విడువు! తెగబడి యుద్ధం చేసి విజయుడనే పేరుని సార్థక పరచుకో- అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునునితో. కాబట్టి గీత అనేది ధర్మసంకటం వచ్చినప్పుడు తీర్చగల చక్కటి న్యాయగ్రంథమన్నమాట. అందుకు పుట్టింది గీత. ఇది రెండవ అంశం. అందరం మానవజాతికి చెందినవాళ్లమే అయినప్పుడూ కులాలనేవి మనం ఏర్పాటు చేసుకున్నవే అయినప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం నేరమా? అలా చేసుకున్నవాళ్లని చాటుగా మరోలా అనుకోవడం ధర్మమా? అనేది మరో ధర్మసందేహం. కులాంతరంలాగానే మంతాంతర వివాహం చేసుకున్నాడు. మరొకరు దేశాంతర స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ పరస్పరం ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆచారాలూ విధానాలూ అంటూ ఎందుకు తప్పుపట్టాలనేది మరో సందేహం! దీనికి భగవద్గీత చక్కటి సమాధానం చెప్తుంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి నిదానంగా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి కూడ. ఉదాహరణకి ఓ బ్రాహ్మణుడు మరో కులపు స్త్రీని వివాహం చేసుకున్నాడనుకుందాం. ముందుగా తేడా వచ్చేది భోజనం వద్ద. ఈయన శాకాహారి. ఆమె, ఆమెవైపు బంధుమిత్ర జనం మాంసాహారులు. వంటింటి వద్ద పేచీ ప్రారంభమవుతుంది. ఇక ఎవరైనా మరణించిన సందర్భంలో జరిగే క్రియాకలాపాలూ ఆ మీదట చేయవలసిన మాసిక సాంవత్సరిక శ్రాద్ధాది క్రియాలూ స్నానాలూ మంత్రాలూ విధివిధానాలూ ఆమెకి అలవాటు లేక... వీటి ప్రాశస్త్యం తెలియక... నిరాసక్తతతో చేస్తుంటే చూసేవారికి మరోలా అనిపించవచ్చు. ఇలా ఆచార వ్యవహారాలు ధ్వంసమయ్యే అవకాశాన్ని ముందే పసిగట్టిన గీత ఇలాంటి వివాహాలు ఈ కారణంతో వద్దు - అంది. ఇది నిజమే కదా! ఆ స్త్రీ ఇంట్లో కొన్ని ఆచారాలుంటాయి. వాటిని ఇతడు పాటించకపోతే వాళ్లకీ కష్టమే కదా! కాబట్టి గీత అనేది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అందునా కుటుంబానికి సంబంధించిన వాటిని కూడా ముందుచూపుతో పరిష్కరిస్తుందన్నమాట. భగవంతుణ్ణి చూడాలంటే... భగవంతుడుంటే అందరికీ కన్పించాలి కదా! అని వాదిస్తుంటారు కొందరు. ఏదైనా ఓ విషయాన్ని నిరూపించాలంటే కొన్నిటిని ప్రత్యక్షంగా నిరూపించవచ్చు. కొన్ని అనుభవం ద్వారానే సాధ్యం. ఉదాహరణకి మనోబాధ, వాయుప్రసారం, నిప్పువేడిమి వంటివన్నీ అనుభవం ద్వారా తెలుసుకోదగినవే తప్ప నిరూపించలేం. ఈ దృష్టితో చూస్తే భగవంతుడున్నాడా? అనే ప్రశ్నకి సాక్ష్యం అనుభవమే. మరణానికి భయమా?... కొంతమంది మరణమనేదానికి చాల భయపడుతూ కన్పిస్తారు. మరణానికి దుఃఖించాల్సింది ఎప్పుడంటే- వస్త్రం జీర్ణం (శిథిలం) అయినప్పుడెలా విడిచి కొత్తదాన్ని ధరిస్తామో అలా శరీరం కూడ వృద్ధాప్య దశ దాకా వచ్చి శిథిలమై విడవనప్పుడు - మాత్రమే. ఏ అపమృత్యువో సంభవించినట్లయితే దుఃఖించే అంశమే అంటున్న ఆ భగవంతుడెంతటి హేతువాది! రహస్యాల స్థావరం ఆకాశం: ఈ రోజున నాసా వంటి సంస్థలన్నీ ఆకాశాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు బహిరంగ పరిశోధనాలయం, ప్రయోగవేదిక అని చెప్తున్నారుకానీ, ఈ విషయాన్ని భగవంతుడు తన గీతలో ఏనాడో చెప్పాడు ఆకాశాన్ని గూర్చి. ఆః అంటే ఆశ్చర్యమంది సంస్కృతం. ఆకాశం పేరు వినగానే అలాగే ఆశ్చర్యంతో చూస్తాట్ట ప్రతివ్యక్తీ. ఇలా ఆశ్చర్యమాశ్చర్యమంటూండ టమే తప్ప ఎవరికీ ఏమీ తెలియనంత ఉంది ఆకాశంలో... అన్నాడు గీతలో భగవంతుడు. అన్ని రహస్యాలున్నాయి కాబట్టే అది కనిపించకుండా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎన్నెన్నో కుటుంబం- సంఘం నడవడికల గురించిన అనేక ధర్మసందేహాలను తీర్చగల ధర్మనిర్ణయ శాస్త్ర గ్రంథంగా కనిపించే ఈ గీత పుట్టింది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు. ఆ రోజున శిరఃస్నానాన్ని చేసి భగవద్గీతను పూజించి 10, 11 అధ్యాయాలని చదివి శ్రీకృష్ణునికి షోడశోపచారాలు చేయాలి. - డా. మైలవరపు శ్రీనివాసరావు నువ్వు ముందు ఏదైనా నేర్చుకోవాలంటే మంచి విద్యార్థివి కావాలి. నా బోధనల్ని కంఠతా పడితే ఉపయోగం లేదు. ఆచరణ లేని బోధ వంటబట్టదు. నా లీలల్ని చదివి నువ్వు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆచరించాలన్నదే నా సంకల్పం. అందుకే జీవితాంతం మంచి విద్యార్థిగా ఉండు. - శ్రీ షిరిడీ సాయిబాబా -
వివరం: భగవానుడు గీసిన గీత
ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికీ, ప్రాంతానికీ చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్నీ శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు. సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్నీ ఉద్దేశించి అభ్యుదయ నిశ్శ్రేయస మార్గాలను రెండింటినీ మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన ‘భగవద్గీతా’ రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. చైత్ర శుద్ధ నవమి - ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముని పుట్టినరోజు. శ్రావణ బహుళ అష్టమి - ధర్మాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని పుట్టినరోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు. ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్ గ్రంథాలకు పీఠికలు రాసిన అనేక మంది జ్ఞానులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మము’ అంటే ప్రాణుల స్వభావము లేదా వాస్తవ రూపం! దీని గురించి వివరంగా తెలుసుకునే విద్యే ఆధ్యాత్మ విద్య! ఇంకా సరళంగా చెప్పాలంటే - ఎక్కణ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి, అందుకు ఏం చేయాలి?... అనేవి సంక్షిప్తంగా చెప్పే శాస్త్రమే ‘గీతా’ శాస్త్రం! చాలా మతగ్రంథాల్లాగా ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం కాదిది. మహాభారతమనే ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకూ 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా విభక్తమై ఉంది భగవద్గీత! స్కూల్లో టీచరు సంవత్సరమంతా పాఠం చెప్పి, పరీక్షల ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినట్టు - మొత్తం లక్ష శ్లోకాల భారతంలో - జీవితంలో పాసైపోవడానికి 700 శ్లోకాలు చాలన్నట్టుగా బయటకు తెచ్చిందే - భగవద్గీత! అర్జునుడి విషాదం వల్ల కృష్ణుడు గీత బోధించవలసి వస్తుంది. యుద్ధంలో తనవాళ్లందరూ మరణిస్తారన్నది అర్జునుడి చింతకు మొదటి కారణం. తానే వారందరినీ చంపడం అధర్మం అనే భావన రెండో కారణం. ఈ విషాద కారణాలు రెండింటినీ తొలగించి, అర్జునుని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే భగవద్గీత! నిరుడు రాసిన పుస్తకానికి అదే సంవత్సరంలో కాలం చెల్లడం చూస్తున్నాం! మరి ఒకటా రెండా 5,152 సంవత్సరాల క్రితం ఉపదేశించబడి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట... బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లోనో, పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్లోనో, మోటివేషన్ స్పీచుల్లోనో, మోరల్ వ్యాల్యూస్ చర్చల్లోనో... ఏదో ఒక సందర్భంలో ‘గీత’ గురించి మాట్లాడుకోవడం... అమెరికన్ సెనేట్‌లో ‘భగవద్గీత’ మీద ప్రమాణం చేసి, కాంగ్రెస్ సభ్యురాలిగా తులసీ గబ్బర్డ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశమంతా గర్వపడుతూ చప్పట్లు చరచడం... గీత శక్తిని ప్రపంచానికి చాటడమే అవుతుంది. పైగా... ‘భగవద్గీతా కించి దధీతా...’ భగవద్గీతను ఏ కొంచెం అధ్యయనం చేసినా వాడి గురించి యముడు చర్చించడని శంకరాచార్య... ‘జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు భగవద్గీత వల్లే ఏర్పడింది’ అని మాక్స్‌ముల్లర్... ‘శాశ్వతమైన ప్రమాణాలు గల ఉపదేశానికి సంక్షిప్త రూపమే భగవద్గీత. ఇది భారతీయులకే కాదు మానవ లోకానికంతటికీ సుస్థిరమైన ఉత్తమ ప్రయోజనాన్నిస్తుంది’ అని ఆల్డస్ హక్స్లీ... ‘ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడమనే అద్భుతమైన సూచననిచ్చి, మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం’ అని స్వామి వివేకానంద... ఇలా మహానుభావుల అనుభవాల్లో భగవద్గీత గురించి వింటుంటే, గీత లౌకిక ప్రయోజనాలనీ, పారమార్థిక ప్రయోజనాలనీ రెండూ ఇస్తుందనే నమ్మకం కలగడం లేదూ! కాబట్టే - గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్పాలన్నంత పవిత్రతను ఆ గ్రంథానికి ఆపాదించటం జరిగింది. యుద్ధ రంగంలో నిలబడే రెండు పక్షాలూ ఒకరికొకరు శత్రువులు. అది యుద్ధ ధర్మం! అక్కడ నిలబడి ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి కృష్ణుడు చెప్పిందే గీత! పైగా జరుగుతున్న యుద్ధం - వ్యక్తుల మధ్య కాదనీ, ధర్మానికీ అధర్మానికీ మధ్య అనీ, చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదనీ శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఉపదేశించాడు కృష్ణుడు! మనుజుల కర్తవ్యాన్ని గుర్తుచేసి, జ్ఞాన బోధతో పరమాత్మను చేరే మార్గాన్ని చూపించడమే కృష్ణావతార వైశిష్ట్యం! ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మ వంతుగా భావించి, భవ బంధాలను వదలి చేయడమే మనిషి కర్తవ్యం... ఇదే గీతా సారాంశం! అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అసలు కృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత! భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు. (ఇదంతే నా తపస్కాయ - (18-67).. భగవద్గీతే కాదు, ఏ సబ్జెక్టయినా అంతే! వేదికపైన ఉపన్న్యాసకుడు చెప్పిందే చెబితే, బోర్ కొట్టేస్తున్నాడంటారు. కాలేజీలో లెక్చరర్ చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పాలి. దీన్ని రివిజన్ అంటారు. ‘గీత’లో కృష్ణుడు చేసిందీ ఇదే! అర్జునుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్నీ, కాపాడుకోవాల్సిన క్షత్రియ ధర్మాన్నీ పలుమార్లు పలు విధాలుగా చెప్పాడు. కాబట్టే ‘న యోత్స్యే... (యుద్ధం చేయను) అని అన్నవాడు కాస్తా, గీతోపదేశంతో అజ్ఞాన జనితమైన సందేహాలు మొత్తం తొలగిపోయి ‘కరిష్యే వచనం తవ... నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు అర్జునుడు. మనలోని ఆత్మగ్రంథం తెరుచుకోనంతవరకూ బాహ్య గ్రంథాలన్నీ నిరుపయోగాలు. మన ఆటంకాలన్నీ తొలగించి, మన ఆత్మను మనం దర్శించే అవకాశం కల్పిస్తుంది గీత! ఇంట్లో అమ్మా నాన్నా ఉన్నారంటే పిల్లల ప్రవర్తన అదుపులో ఉంటుంది. సమాజంలో పోలీసు వ్యవస్థ ఉందంటే, జనం ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, మరుజన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటే, ఈ జన్మంతా అదుపులో ఉంటుంది. అదే చెబుతూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత - ‘శరీరం యదవాప్నోతి.. (15-8)! మనం చేసే పనులు ఎవడూ చూడ్డం లేదనుకుంటే, పెద్ద పొరబాటే! ‘సర్వతోక్షి శిరోముఖం... సర్వత శృతిమల్లోకే..’ నువ్వు చేసేది చూస్తున్నాడు. మాట్లాడేది వింటున్నాడు పరమాత్మ! వాడన్నీ గమనిస్తుంటాడన్న విషయం బాల్యంలోనే అర్థమైపోతే, జీవితాన్ని పారదర్శకంగా, ఆదర్శవంతంగా గడిపేయొచ్చు! విశేషమేమిటంటే - భౌతికంగా గీతను బోధించినవాడు కృష్ణుడే అని మనం అనుకుంటున్నప్పటికీ, ‘గీత’ లో ఎక్కడా ‘కృష్ణ ఉవాచ’ అని కనిపించదు. ‘భగవాన్ ఉవాచ!’ అనే కనిపిస్తుంది. ఈ భగవానుడికి ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా జగత్తులో మానవుడని చెప్పబడే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చేసిన మహోదాత్తోపదేశం కాబట్టే గీత దేశ, కాల, జాత్యాదులకు అతీతంగా విరాజిల్లుతోంది. కర్మణ్యేవాధి కారస్తే... అంటూ ఫలితంపైన దృష్టి పెట్టకుండా, త్రికరణ శుద్ధిగా కర్మని ఆచరించమని చెప్పే గ్రంథాన్ని ఒక మతానికి ఎలా పరిమితం చేయగలం! భోగ లాలసత్వానికీ, దురాశలకీ, నీతి బాహ్యమైన భావావేశాలకీ లోను కాకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్పే గీత నాకు తల్లి లాంటిది. స్వాతంత్య్ర సముపార్జనా దీక్షలో నాకు అమేయమైన శక్తినిచ్చింది భగవద్గీత. - మహాత్మాగాంధీ ఏదో విధంగా భోగమయ జీవితాన్ని గడపాలనే మానవ సమాజ ప్రవృత్తిని భగవద్గీత వ్యతిరేకిస్తుంది. ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా, ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తుంది. తెలివితేటల్నీ, కాలాన్నీ డబ్బుగా మార్చుకోవటంలోను, వీకెండ్స్ పేరుతో దాన్ని ఖర్చుపెట్టి ఆనందాన్ని కొనుక్కోవడంలోను బిజీగా ఉంటూ... అదే జీవితమనుకుంటున్న ఈ పరుగుల ప్రపంచానికి, భారతీయత కనిపించకుండా గ్లోబలైజేషన్ ముసుగు కప్పేసిన అధిక శాతం యువతరానికీ, భగవద్గీత ఉత్తమమైన, శాశ్వతమైన మార్గాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు! హిందూ ధర్మ సాహిత్యం అనంతమైనది. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు! ‘వీటిలో దేన్ని అనుసరించాల’ని సామాన్యుడడిగే ప్రశ్నకి ఒకే సమాధానం చెప్పొచ్చు. వీటన్నిటి సారమూ - ‘సర్వ శాస్త్రమయీ గీతా..’ అని పేరుగాంచినదీ... సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడే చెప్పినదీ ‘భగవద్గీత’ ఒక్కటి చాలు! ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే... జ్ఞానంతో సమానమైనదీ పవిత్రమైనదీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి జ్ఞానివి కమ్ము అంటూ అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జ్ఞానులు కావాలని కాంక్షించింది గీత! అందుకే భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన విదేశీయులకు మన ధన, కనక, వస్తు, వాహనాలపైన కన్ను పడితే, జర్మనీ దేశస్తులు మాత్రం ‘మా దృష్టి భారతదేశంలోని ఆధ్యాత్మ జ్ఞాన సంపదపైన పడింది’ అన్నారు. వేదాల గురించి, భగవద్గీత గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఎడ్విన్ ఆర్నాల్డ్, మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్లు జర్మనీ దేశం వారే! మహాత్మాగాంధీకి భగవద్గీతపైన మక్కువ ఏర్పడటానికి కారణం - ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్’ అనే గీతానువాద గ్రంథమే! ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం! ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే! ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది! ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందే గీత! అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం! సర్వేజనాస్సుఖినోభవన్తు! - గంగాధర శాస్త్రి గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవద్గీత లాంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదు. - ఎడ్విన్ ఆర్నాల్డ్, ‘ది సాంగ్ ఆఫ్ సెలెస్టన్ గ్రంథకర్త’