
వాషింగ్టన్:అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా నియమితులైన కాశ్‌పటేల్ తన మూలాలను మర్చిపోలేదు. భారతీయులు పవిత్రంగా భావించే భగవద్గీత మీద ప్రమాణం చేసి కాశ్‌పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
వైట్‌హైజ్ క్యాంస్‌లోని ఓ భవనంలో శనివారం(ఫిబ్రవరి21) కాశ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాశ్ భార్యాపిల్లలు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా సెనేట్ శుక్రవారమే కాశ్ నియామకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
గతంలో కౌంటర్ టెర్రరిజం పప్రాసిక్యూటర్‌గా పనిచేసిన కాశ్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడంపై డెమోకక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాశ్ స్వతంత్రంగా పనిచేస్తారన్న నమ్మకం లేదంటున్నారు.ఎఫ్‌బీఐ డైరెక్టర్‌లు సాధారణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. గుజరాతీలైన కాశ్‌పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. కాశ్‌పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment