దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి! | Bhagavad Gita Change Thief Mind Returns Stolen Ornaments Odisha | Sakshi
Sakshi News home page

దొంగలో సత్ప్రవర్తన తెచ్చిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!

Published Wed, May 17 2023 9:30 PM | Last Updated on Wed, May 17 2023 9:32 PM

Bhagavad Gita Change Thief Mind Returns Stolen Ornaments Odisha - Sakshi

భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్‌(ఒడిషా)లో జరిగింది. 

భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్‌ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్‌ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి.

చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు.


Video Source: OTV News English

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement