CHANGE
-
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్‌తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం కారణంగా గత కొంతకాలంలో ప్రపంచం దృష్టిలో పడింది. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై అప్రకటిత యుద్ధ ధోరణిలో ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఇరాన్ తన రాజధానిని టెహ్రాన్ నుండి వేరే ప్రదేశానికి మార్చాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.ఈ చర్చల నేపధ్యంలో ఇరాన్(Iran) ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోలేదని మొహజెరానీ అన్నారు. అయితే ఇరాన్ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్‌ను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జకార్తాను విడిచిపెట్టి, మెరుగైన నగరాన్ని నిర్మించే దిశగా ఇండోనేషియా ప్రయత్నాలు ప్రారంభించింది.టెహ్రాన్(Tehran) మహానగరం అటు జనాభా, ఇటు పర్యావరణం పరంగా అనేక సమస్యలను ఎదుర్కొటోంది. ఫలితంగా నగరంలోపై మరింత ఒత్తిడి పెరుగుతోందని మొహజెరానీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా నీటితో పాటు విద్యుత్ కొరత పెరుగుతోంది. కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీనికితోడు భూకంపాలు సంభవించే ప్రాంతంలో టెహ్రాన్ ఉండటం వల్ల మరింత అసురక్షితంగా మారిందని మొహజెరానీ వివరించారు. అటువంటి పరిస్థితిలోనే ఇరాన్ ప్రభుత్వం రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. రాజధానిని టెహ్రాన్ నుండి మక్రాన్ ప్రాంతానికి మార్చడంపై ఈ కౌన్సిళ్లు విశ్లేషించాయి.ఇది కూడా చదవండి: UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ -
కట్ ఆఫ్ డేట్ మార్చండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్ ఆఫ్ డేట్‌గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్ ఆఫ్ డేట్‌ను మార్చాలని పలువురు కోరుతున్నారు. ఎడారి దేశాల్లో తెలం‘గానం’గల్ఫ్ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్ ఆఫ్ డేట్ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.విధివిధానాలు ఇలా...ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు క్యాన్సల్ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. -
హెల్త్ వర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యసేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు మాత్రం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఏనాడు ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రైవేటు వైద్య కళాశాలలను, ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించి వైద్య వృత్తిని వ్యాపారం చేశారు.కానీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వ్యవస్థలను ప్రవేశపెట్టి వైద్యశాఖను బలోపేతం చేశారు. ఆయన తనయుడైన జగన్ గడిచిన ఐదేళ్లలో వైద్యరంగం రూపురేఖలు మార్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. అలాగే, నాడు–నేడుతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆధునీకరించారు.ఈ నేపథ్యంలోనే.. వైద్య రంగాన్ని పేదలకు చేరువ చేసిన వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్శిటీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికితోడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టి వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. కానీ, రాజకీయ కక్ష సాధింపునకు కొనసాగింపుగా బాబు వైఎస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు తప్పుబడుతున్నారు. -
చంద్రుని ఆవలి వైపుకు చాంగే6
బీజింగ్: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్కెన్(ఎస్పీఏ) బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్–రిటర్నర్, ల్యాండర్–అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటార్–రిటర్నర్ జత నుంచి ల్యాండర్–అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్–రిటర్నర్ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్ ల్యాండర్–అసెండర్ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్–అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్–రిటర్నర్ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. -
Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైన వేళ ‘ఎక్స్’లో ఆయన ..‘ఈరోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. బీజేపీని ఓడించి, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నట్లు మొదటి నాలుగు విడతల పోలింగ్‌లో స్పష్టమైంది. విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. యువత ఉద్యోగాలు, రైతులు రుణ మాఫీ, కనీస మద్ధతు ధర, మహిళలు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, కార్మికులు రోజువారీ వేతనాలు వంటి అంశాలపైనే నేటి పోలింగ్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. అమేథీ, రాయబరేలతోపాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, ఐదో దశలో పోలింగ్ జరుగుతున్న రాయ్‌బరేలీలో పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. రాయ్‌బరేలీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించారు. ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అయితే, మీడియాతో మాట్లాడలేదు. -
కేరళలో యూపీ వ్యూహం.. గణపతి శరణులో బీజేపీ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు. కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్‌లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు. -
5 నెలల్లో 3 పార్టీలు.. 48 గంటల్లో బీజేపీకి రాంరాం.. కాంగ్రెస్ గూటికి ఛలో!
దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు. ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి హెలికాప్టర్లో సబల్గఢ్కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు. -
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్‌లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్‌లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్‌కు అనుసంధానమైన అన్ని గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్‌రథ్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను లింక్ హాఫ్మన్ బుష్‌గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో 352 బెర్త్‌లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
వీళ్లా.. అభ్యర్థులు!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నకోద్దీ తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకలేదు. డబ్బున్నదనో, ఇతర కారణాలతోనే మొత్తంమీద అభ్యర్థులనైతే ఎంపిక చేశారు. వీరిలో అధిక శాతం పోటీకైతే సిద్ధమయ్యారు కానీ, క్షేత్రస్థాయిలో కనీస ప్రభావం చూపించలేకపోతున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. కొందరిని అయినా మార్చి ఇంకా ధన బలం ఉన్న వారిని పోటీకి పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. మరోపక్క సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నారు. పనిచేయని పొత్తులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పారీ్టలతో పొత్తులు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగకపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచార సభల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్‌షోలకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు వైఎస్ జగన్ రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్లెదుటే ఓటమి కనిపిస్తోంది. చంద్రబాబు నాలుగు నెలల క్రితమే ప్రకటించిన మేనిఫెస్టో, ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నాయి. సత్యవేడు అభ్యర్థి మార్పు! చిత్తూరు జిల్లా సత్యవేడులో ఫిరాయింపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మార్చడం దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి ప్రజల్లో ఆదరణ లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ సీటు నిరాకరించింది. ఆయన్ని టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు అదే సీటు కేటాయించారు. ఇప్పుడు తత్వం బోధపడటంతో ఆదిమూలాన్ని తప్పించి మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు. అడ్డగోలు వాదనలు చేయడం ద్వారా ఎల్లో మీడియాలో గుర్తింపు పొందిన కొలికపూడి శ్రీనివాస్‌ని గొప్ప వ్యక్తిగా భావించి తిరువూరు సీటు ఇచ్చేశారు. కానీ అక్కడ ఆయన్ని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. దీంతో శ్రీనివాస్‌ని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడిలో స్థానిక నేతలను కాదని ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌ను ఎంపిక చేశారు. ఆయన కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో మరొక డబ్బున్న నేత కోసం కసరత్తు చేస్తున్నారు. గజపతినగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మడకశిర స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారమూ పని చేయలేదు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మొన్నటివరకు తప్పుడు ప్రచారం ద్వారా హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా, మౌత్ క్యాంపెయినర్ల ద్వారా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయించి ప్రజలను తికమక పెట్టాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అయినా వాపునే బలుపు అనుకుని టీడీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా గాల్లో తేలిపోయారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక వైఎస్సార్సీపీ నిర్వహించిన నాలుగు ‘సిద్ధం’ సభలు టీడీపీ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. ఇప్పుడు వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేస్తోంది. దీంతో టీడీపీ అంతర్మథనంలో మునిగిపోయింది. పొత్తులు కూడా వికటించినట్లు తేలడంతో ఇప్పుడు 10 శాతం అభ్యర్థులనైనా మార్చి ఉన్నంతలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే దిశగా చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండి, అనపర్తి సీట్లపై అనిశ్చితి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపైనా అనిశ్చితి నెలకొంది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించినప్పటికీ, చంద్రబాబు ఒత్తిడితో వివాదాస్పద నేత రఘురామకృష్ణరాజును అక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామరాజుకు బీజేపీ నర్సాపురం ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. రఘురామరాజు నర్సాపురం ఎంపీ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాకపోతే ఉండి సీటు కేటాయించక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగల అభ్యర్థిని మార్చాలని అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒత్తిడి తెస్తుండడంతో ఆ దిశగానూ కసరత్తు నడుస్తోంది. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాల మార్పుపైనా చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించే దిశగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించిన నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా బలమైన వైఎస్సార్సీపీకి కనీస పోటే ఇచ్చేలా వాతావరణాన్ని మార్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. -
మే 13న పోలింగ్.. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు
సాక్షి, విజయవాడ: మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మే 16కి వాయిదా పడ్డాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీ సెట్ జూన్ 10కి వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 14 ఏపీ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ ఆర్ సెట్ జరగనుంది. -
టీఎస్‌కు బదులు ‘టీజీ’!
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను తెలిపే ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్తరూపంలో ‘టీజీ’గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్‌ను ‘టీజీ’గా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనితోపాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించనున్నట్టు తెలిసింది. గ్రూప్–1 పోస్టులు పెంపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్–1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వివిధ శాఖలు/విభాగాల్లో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1,049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ‘బడ్జెట్’ తేదీల ఖరారు శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించే తేదీని కేబినెట్ ఖరారు చేయనుంది. సమావేశాల తొలిరోజున గవర్నర్ తమిళిసై చేయనున్న ప్రసంగాన్ని ఆమోదించనుంది. 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వంయోచి స్తోంది. 9న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ చట్ట సవరణ, పీఆర్ చట్ట సవరణ, సిటీ సివిల్ కోడ్ చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ధరణిపై అధ్యయన కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికపై కూడా సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రాష్ట్ర గవర్నర్ గతంలో నిలిపివేసిన బిల్లులను తిరిగి పరిశీలన కోసం పంపాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కులగణనపై చర్చ.. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖల మంత్రులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమల్లోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఏ మేర ఆర్థిక భారం పడుతుందన్నది పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఏ రాష్ట్రమో తెలిపే ‘కోడ్’ అది.. వాహనాల నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లలో వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో తెలియజేసేలా కోడ్ ఉంటుంది. తెలంగాణ ఏ ర్పాటై, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. వాహనాల నంబర్లో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’ అనే అక్షరాలను పొందుపర్చాలని నిర్ణయించింది. అప్పటి టీఆర్ఎస్ పార్టీ పేరును పోలినట్టుగా ‘టీఎస్’ అనే అక్షరాలను కోడ్‌గా ఖరారు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ అనే స్టేట్ కోడ్‌ను వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. -
వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్సీపీ అధిష్టానం. ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్ సీపీ 6వ జాబితా విడుదల... నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain#Siddham pic.twitter.com/asgTtiOE18 — YSR Congress Party (@YSRCParty) February 2, 2024 వై నాట్ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదే వైఎస్సార్సీపీ రెండో జాబితా ఇదే! ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరికీ.. అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించింది వైఎస్సార్సీపీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ మూడో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ నాలుగో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ ఐదో జాబితా ఇదే! -
బాబార్ రోడ్డును అయోధ్య మార్గ్‌గా మార్చాలంటూ..
దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్డీఎంసీ ఛైర్మన్‌కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్‌గా మార్చాలని ఆ లేఖలో కోరారు. -
వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల మార్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్‌లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్‌లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు. గత సర్కారుతో సంబంధాలపై ఆరా ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్‌ఫెడ్‌కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్‌రావు వద్ద పీఎస్‌గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న జితేందర్‌రెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్ఎస్తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. రఘునందన్‌రావు కొనసాగుతారా? వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ రఘునందన్‌రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు. -
మెరుగైన ఫలితాల కోసమే మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ఏ నియోజక వర్గానికి ఎవరిని పార్టీ సమన్వయకర్త(ఇన్ఛార్జ్)గా నియమించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరం మార్పులు చేర్పులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సోమవారం 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను ప్రకటించారు. మంగళవారం నుంచి 11 నియోజవర్గాల్లో పార్టీ వ్యవహారాలన్నీ కొత్తగా నియమితులైన సమన్వయకర్తలే పర్యవేక్షిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులని, భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చని వారు స్పష్టం చేశారు. బొత్స మాట్లాడుతూ.. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని, అందరి సేవలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారన్నారు. సామాజిక సాధికారతను చేతల్లో చూపించారన్నారు. అణగారిన వర్గాలకు మరింతగా మంచి చేయాలంటే పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. భవిష్యత్తులోనూ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షించుకుంటూ అవసరాన్ని బట్టి ఇన్‌ఛార్జ్‌ల మార్పు చేర్పులపై తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంత్రి బొత్స గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వకర్తగా చిరంజీవిని సీఎం జగన్ నియమించారన్నారు. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులుకోబోదని, ఎవరి సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల కొందరికి బాధ ఉండవచ్చని, అయితే అందరూ సీఎం జగన్ నిర్ణయాలను అర్థం చేసుకుని పార్టీకి సహకరిస్తారన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. సీఎం జగన్ దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుంది. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. ప్రజలకు మరింతగా సేవ చేయాలంటే మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలతో మమేకమై వారి మనసులు చూరగొని ఆశీస్సులు పొంది ఎవరు రాణిస్తారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. భారీ మెజార్టీతో గెలవాలన్న ఆలోచనతోనే మార్పులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు కూడా! పార్టీ ఒక వ్యక్తి కోసమో.. వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరిౖకైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతాం. ఎందుకు మార్పు చేశామనేది అంతర్గతంగా వారికి వివరిస్తాం’’ అని అన్నారు. ప్రతిపక్షాలు గాలి మాటలతో గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయని, పొత్తులపై ఒక దారీ తెన్నూ లేకుండా వ్యవహరిస్తున్నాయని అన్నారు. -
బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం
సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
మార్పునకే తెలంగాణ ఓటు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వాదన గెలిచింది? ఏ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది? ఓటరు దేన్ని విశ్వసించాడు? దేనికి ప్రభావితుడయ్యాడు? సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. రాజకీయ పార్టీల విశ్లేషణ కూడా ఇదే. ఈసారి ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమ పథకాల హామీల్లో ప్రధాన పార్టీలూ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సామాజిక సమీకరణలనూ తెరమీదకు తెచ్చాయి. ఇవి ఓట్లు రాలుస్తాయని భావించాయి. అయితే ఈసారి ప్రజాక్షేత్రంలో పార్టీల ప్రచారం, నినాదాలు ఒక స్థాయి వరకే పరిమితం కాలేదు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కొత్త అంశాలను అ్రస్తాలుగా ఎంచుకున్నాయి. ఈవీఎంలు ఫలితాలు నిర్దేశించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలే ఈసారి బలమైన ప్రభావం చూపాయనేది సుస్పష్టం. – సాక్షి, హైదరాబాద్ దూసుకెళ్లిన మార్పు రెండు దఫాలు పాలించిన బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రంతో మూడోసారి అధికారమివ్వమని కోరింది. దీన్ని బలమైన నినాదంగా ఆ పార్టీ భావించింది. కాంగ్రెస్ మాత్రం ‘మార్పు కావాలి ... కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. ‘ఒక్క అవకాశం ఇవ్వమనే’అభ్యర్థన బీఆర్ఎస్ నినాదం కన్నా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సంప్రదాయ కాంగ్రెస్ నినాదాలకు విరుద్ధంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళిన మార్పు కావాలనే నినాదం బలంగా పనిచేసినట్టు కన్పిస్తోంది. అభివృద్ధి కన్పించిన జిల్లాల్లోనూ బీఆర్ఎస్ ఈసారి ప్రతికూలత చవి చూడటమే ఇందుకు కారణం. తిరుగులేదని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో పాగా వేసింది. కాంగ్రెస్ ‘ఆరు హామీ’ల్లో కొద్దిపాటి కొత్తదాన్ని జొప్పించారు. మహిళలకు రూ. 2500, కౌలు రైతులు, రైతుకూలీలకు సహాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో కన్పించిన కొత్త అంశాలు. గ్రామీణ మహిళా ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టంగట్టడం చూస్తుంటే ఈ నినాదాలు ఆకట్టుకున్నాయనేది స్పష్టం. ఈసారి యువ ఓటరు పోలింగ్‌కు పోటెత్తడం, కాంగ్రెస్‌కు ఆకర్షితులవ్వడం విశేషం. ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీకి... జాబ్ క్యాలెండర్‌ను జోడించడం మరింత నమ్మకాన్ని చేకూర్చింది. అధికార పార్టీ అవినీతి నినాదాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ బలమైన స్థానాలే కాదు... కాంగ్రెస్ బలమైన స్థానాల్లోనూ దీని ప్రభావం కన్పించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న రాజకీయ నినాదం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దీనివల్ల ప్రయోజనమూ పొందింది. కొన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్ పక్షానికి మళ్ళడం ఫలితాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. నిష్ఫలమైన బీఆర్ఎస్ అస్త్రాలు బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో అభివృద్ధినే నమ్ముకుంది. అమలు చేసిన సంక్షేమాన్నే ప్రచార ఆయుధంగా చేసుకుంది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, పెన్షన్లను నినాదాలుగా మార్చింది. పాజిటివ్ మార్గంలోనే ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. ప్రతీ పథకంలోనూ మరింత పెంపును జోడించింది. కానీ రానురాను బీఆర్ఎస్ ప్రచార సరళి మార్చింది. పాజిటివ్ నుంచి కాంగ్రెస్‌పై విరుచుకుపడే నెగెటివ్ సరళిని ఎంచుకుంది. దీన్ని ఆ పార్టీ అనివార్యంగా భావించింది. ‘మళ్ళీ కాంగ్రెస్ వస్తే...’కరెంట్ ఉండదు.. మత కలహాలు వస్తాయి... ముఖ్యమంత్రులు మారతారు... అభివృద్ధి కుంటుపడుతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేస్తుందని భావించింది. నెగెటివ్ ప్రచార సరళి అప్పటి వరకూ జరిగిన పాజిటివ్ ఓటింగ్‌ను డామినేట్ చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వల్ల నష్ట నివారణకు ... ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రజాక్షేత్రాన్ని ఇవేవీ అందుకోలేకపోయాయి. అభివృద్ధి కన్పించే ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ అనుకున్న రీతిలో లాభపడకపోవడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రజల అభిమానం చూరగొనలేని అభ్యర్థుల వల్ల బీఆర్ఎస్ ఎన్నికల అ్రస్తాలన్నీ నిష్ఫలమయ్యాయా? అనే చర్చ విన్పిస్తోంది. కమలానికి కలిసి రాని బీసీ మంత్రం బీజేపీ సీట్లు, ఓట్లు పెరగడానికి కారణాలేంటి? మోదీ, షాల ప్రచారమా? ఆ పార్టీ ఎన్నికల నినాదమా? అన్ని వర్గాల్లో జరిగే చర్చ ఇది. ఏడాది క్రితం ఊపు పెంచిన బీజేపీ ఎన్నికల వేళ చతికిల పడ్డా... ఆశాజనకమైన ఫలితాలనే చవిచూసింది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పింది. బీసీ నేతలకే ప్రధాన భూమికని చెప్పింది. అయితే, బీసీలుగా చెప్పుకునే బలమైన నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. దీన్నిబట్టి బీజేపీ బీసీ నినాదాన్ని ప్రజలు విశ్వసించలేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు ఎక్స్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై ఏఐసీసీ అ«ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రజలకు ఎక్స్ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చామని, అయితే అక్కడి ఫలితాలు నిరాశపరిచాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీపై అభిమానం చూపి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డ కార్యకర్తల సేవలను గుర్తిస్తున్నట్లు వివరించారు. ఒడిదుడుకులను అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధపడతామంటూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గెలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు అభినందనలు ఏపీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో గెలుపొంది అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా ఆయా పార్టీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచిన బీజేపీకి, పొరుగు రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. హామీలన్నీ అమలు చేస్తాం రాహుల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన, మద్దతు పలికిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరిత్ర సృష్టించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలిపారు. ఇది ప్రజలతోపాటు కార్యకర్తలందరి విజయమని ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. ఆశించిన విధంగానే ప్రజలు ఫలితాన్నిచ్చారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నరకాసురుడి పాలనకు ముగింపు పలుకుతామని, హిట్లర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని ఏడాదిగా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెప్పినట్లుగానే ఫలితం ఇచ్చారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్, పాలేరు అభ్యర్థి గా గెలిచాక పొంగులేటి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల అభీష్టం, అభిప్రాయాలకు భిన్నమైన పాలన సాగించడంతోనే బీఆర్ఎస్కు ఈ రకమైన ఫలితాలొచ్చాయని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై తీర్మానం చేస్తామని, వంద రోజుల్లోనే ఇవి కార్యరూపం దాల్చేలా చర్యలుంటాయని పొంగులేటి వెల్లడించారు. గాందీభవన్ కళకళ సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గాందీభవన్ పరిసరాలు తొలిసారి కళకళలాడాయి. గత పదేళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినా గాందీభవన్ బోసిపోతూ కనిపించేది. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా గాంధీభవన్‌లో హడావుడి నెలకొంది. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఉదయం 9 గంటల నుంచే గాందీభవన్ బాట పట్టాయి. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ పార్టీకి ఆధిక్యం పెరగటంతో గాందీభవన్ పరిసరాలు మారుమోగాయి. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేడర్ సంబురాలు చేసుకుంది. -
అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రావ లసి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ ఒకరోజు వాయిదా పడ్డాయి. ఈనెల 18న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో జరిగే బహిరంగ సభల్లో షా పాల్గొంటారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
అలా మార్చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వేర్వేరు సిలబస్‌లతో ఇబ్బందులు ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్‌లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్‌లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పోటీ పరీక్షలుసవాలే.. ఎన్సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్‌ను ఎన్సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది. పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు. సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్ధులకు... సైన్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు. అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్‌లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) వక్రీకరణ సరికాదు చరిత్రను వక్రీకరించే విధానం ఎన్సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్‌లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
కేసీఆర్ సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్‌కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 28న విరామం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్‌ను గతంలో బీఆర్ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్ఖేడ్లలో, 31న హుజూర్నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. -
దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే!
పేరులోనేముంది అని చాలామంది కొట్టిపారేస్తారు గాని, పేరు మీద పట్టింపుగల వాళ్లు తక్కువేమీ కాదు. మనుషులు పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. చిరపరిచితమైన ఊళ్లు, దేశాల పేర్లు మారిపోతే మాత్రం విశేషమే! ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఉంది. విదేశీయులు మనల్ని ఇండియన్స్గానే సంబోధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి భారత్‌గా పునర్నామకరణం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. ఇప్పటికైతే అధికారికంగా మన దేశం పేరు మారలేదు. త్వరలోనే మారితే మారవచ్చు కూడా! అలాగని దేశాలు పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆధునిక ప్రపంచంలో పేర్లు మార్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విశేషాలు మీ కోసం... రాచరికాలు కొనసాగిన కాలంలో రాజుల ఆధిపత్యాలను బట్టి రాజ్యాల పేర్లు తరచు మారిపోతూ ఉండేవి. ఆధునిక ప్రపంచంలో దేశాల పేర్లు అంత తరచుగా మారిపోవడం లేదు గాని, అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల అవి మారుతూనే ఉన్నాయి. ఇరవయ్యో శతాబ్ది నుంచి ఇప్పటి వరకు పేర్లు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం. చెకియా చెకొస్లోవేకియా నుంచి 1992 విడివడిన తర్వాత ఈ దేశం పేరు ‘చెక్ రిపబ్లిక్’గా ఉండేది. ఈ దేశం పేరు మార్పు వెనుక ఘనమైన చారిత్రక, సాంస్కృతిక కారణాలేవీ లేవు. మరెందుకు పేరు మార్చుకున్నారంటే, ఇదివరకటి పేరు పెద్దగా ఉందట! పెద్దగా ఉన్న పేరుతో అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందడం కష్టమని, విదేశీయులకు ఆ పేరు పలకడం కష్టంగా ఉందని పాలకులు భావించారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2016 ఏప్రిల్‌లో దేశం పేరును ప్రభుత్వం ‘చెకియా’గా మార్చుకుంది. అధ్యక్షుడు మిలోస్ జెమాన్ ఆధ్వర్యంలో ఈ మార్పు జరిగింది. ఇరాన్ ఇప్పుడు ఇరాన్ అంటే జనాలకు బాగా అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు పర్షియాగా ఉండేది. పర్షియా తన పేరును 1935లో ఇరాన్‌గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక నాజీల ప్రభావం ఉంది. ఆర్యుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలతో నాజీ జర్మనీ ‘సత్సంబంధాలు’ కలిగి ఉండేది. ‘ఆర్యన్’ నుంచి వచ్చిన పేరే ఇరాన్! జర్మనీలో అప్పటి పర్షియా రాయబారి మొహసిన్ రియాస్ ఈ పేరు మార్పు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాడు. బహుశా నాజీల మెప్పు కోసం ఆయన ఆ ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే వాదన లేకపోలేదు. మొత్తానికి అప్పటి పర్షియా అధినేత రెజా షా పహ్లావీ 1935లో ఇకపై తమ దేశాన్ని ‘ఇరాన్’ పేరుతో గుర్తించాలని తమ దేశంతో దౌత్యసంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నింటినీ కోరారు. అవి ఆ కోరికను మన్నించడంతో పర్షియా పేరు ఇరాన్‌గా మారింది. రెండో ప్రపంచయుద్ధం ఫలితంగా జర్మనీలో నాజీ ప్రభుత్వం పతనమైన తర్వాత మిగిలిన దేశాలు కూడా పర్షియాను ఇరాన్‌గా గుర్తించడంతో అదే పేరు స్థిరపడింది. బోత్స్యానా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం బోత్స్యానా. దీనికి ఇంతకు ముందున్న పేరు ‘బెషువాన్లాండ్ ప్రొటెక్టరేట్’. బ్రిటిష్ పాలకులు దీన్ని 1885లో ప్రొటెక్టరేట్‌గా ప్రకటించారు. స్థానిక ‘త్సా్వనా’ పదాన్ని పలకలేక వారు ‘బెషువానా’గా వ్యవహరించేవారు. చాలా పోరాటాలు, చర్చోపచర్చల తర్వాత ఈ దేశానికి 1966లో స్వాతంత్య్రం దక్కింది. సెరెత్సె ఖామా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘త్వ్సానా’ తెగ ప్రజలు అత్యధికులుగా ఉన్న ఈ దేశానికి బ్రిటిష్‌వారు అపభ్రంశ పదాలతో పెట్టిన పేరును మార్చి, ‘బోత్స్యానా’గా మార్చారు. ‘బోత్స్యానా’ అంటే ‘త్వ్సానా’ ప్రజల నేల. ఈ పేరు మార్పును అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. శ్రీలంక శ్రీలంక పాత పేరు సిలోన్. బ్రిటిష్ పాలకులు ఆ పేరు పెట్టారు. ‘సహీలన్’ అరబిక్ పదం నుంచి వారు ఆ పేరు పెట్టారని చెబుతారు. అయితే, ఆ పేరు పుట్టుపూర్వోత్తరాల గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. పదో శతాబ్దానికి చెందిన అరబిక్ రచయిత ఇబ్న్ షహ్రియార్ తన ‘అజబ్–అల్–హింద్’ పుస్తకంలో శ్రీలంకను ఉద్దేశించి ‘సెరెన్దిబ్’, ‘సహీలన్’ అనే పదాలను ఉపయోగించాడు. తొలినాళ్లలో దీని పేరు ‘తామ్రపర్ణి’గా ఉండేది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకుయాత్రికుడు మెగస్తనీస్ దీనినే తన రచనల్లో ‘తప్రోబన’ అని పేర్కొన్నాడు. బ్రిటిష్‌వారి కంటే ముందు ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ వాళ్లు కూడా కొంతకాలం పరిపాలించారు. పోర్చుగీసులు దీనిని ‘సీలావో’ అని, స్పానిష్ వాళ్లు ‘సీలాన్’ అని, ఫ్రెంచ్‌వాళ్లు ‘సీలన్’ అని, డచ్‌వాళ్లు ‘జీలన్’ అని వ్యవహరించేవారు. అయితే, బ్రిటిష్ హయాంలో పెట్టిన ‘సిలోన్’ పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ దేశానికి 1948లోనే స్వాతంత్య్రం వచ్చినా, 1966 వరకు సిలోన్ పేరుతోనే ఉండేది. సిరిమావో బండారునాయకె ప్రధానిగా ఉన్న కాలంలో దేశం పేరును ‘శ్రీలంక’గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐర్లండ్ ఇప్పటి ప్రపంచానికి ఐర్లండ్ పేరు బాగా పరిచయం గాని, అంతకుముందు దీని పేరు ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’. ఇంగ్లిష్ వాళ్ల పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు మగ్గిన దేశం ఇది. ఐరిష్ జాతీయోద్యమం తర్వాత తొలుత ఇది 1922లో బ్రిటిష్ సామ్రాజ్యంలోని స్వయంపాలిత రాజ్యంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో దీనిని ‘నిర్వివాద స్వతంత్ర దేశం’గా ప్రకటించడంతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’గా అవతరించింది. ఐర్లండ్ ద్వీపంలోని మొత్తం 32 కౌంటీలు ఉంటే, వాటిలోని 26 కౌంటీలతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ ఏర్పడింది. మిగిలిన ఆరు కౌంటీలు ‘నార్తర్న్ ఐర్లండ్’గా బ్రిటిష్ సామ్రాజ్యంలోని భాగంగానే ఉన్నాయి. ఐరిష్ రాజ్యాంగం 1937లో దేశం పేరును అధికారికంగా ‘ఐర్లండ్’గా మార్చింది. ఐర్లండ్ 1949లో ‘రిపబ్లిక్’గా మారడంతో మిగిలిన ప్రపంచం అప్పటి నుంచి ఇదే పేరుతో గుర్తించడం ప్రారంభించింది. థాయ్‌లాండ్ థాయ్‌లాండ్ ఇప్పుడు అందరికీ అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు ‘సియామ్’. ‘శ్యామ’ అనే సంస్కృత పదం నుంచి ‘సియామ్’ పేరు వచ్చింది. ‘సియామ్’ అనేది ఈ దేశవాసులు పెట్టుకున్న పేరు కాదు, విదేశీయులు పెట్టిన పేరు. ఫీల్డ్ మార్షల్ ప్లేక్ ఫిబున్సాంగ్ఖ్రామ్ ప్రధాని పదవిలోకి వచ్చి, నియంతృత్వాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన 1939లో ‘సియామ్’ పేరును ‘థాయ్‌లాండ్’గా మార్చారు. ‘థాయ్’ భాషలో ‘థాయ్’ అంటే ‘మనిషి’, ‘స్వతంత్రుడు’ అనే అర్థాలు ఉన్నాయి. స్వతంత్రుల దేశం అనే అర్థం వచ్చేలా ‘థాయ్‌లాండ్’ పేరును ఎంపిక చేసుకున్నారు. మిగిలిన ప్రపంచం దీనిని గుర్తించడంతో ఇదే పేరు స్థిరపడింది. ఇస్వాతిని ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలోని చిన్న దేశం ఇది. ఈ దేశం ఇదివరకటి పేరు ‘స్వాజిలాండ్’. చాలాకాలం బ్రిటిష్ వలసరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా స్వాజీ తెగకు చెందిన ప్రజలు ఉంటారు. పూర్వీకుడైన తెగ నాయకుడి పేరు మీదుగా తమ తెగకు ‘స్వాజీ’ అని పేరు పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశానికి రాజుగా ఉన్న మూడో ఎంస్వాతి దేశం పేరును తన పేరు కలిసొచ్చేలా ‘ఇస్వాతిని’గా మార్చారు. ఎవరితోనూ సంప్రదించకుండా రాజు ఏకపక్షంగా దేశం పేరు మార్చేశారనే విమర్శలు ఉన్నా, అంతర్జాతీయ సమాజం కొత్తగా మార్చిన పేరు గుర్తించడంతో మారిన పేరుతోనే చలామణీ అవుతోంది. నార్త్ మాసిడోనియా యూరోప్ ఆగ్నేయ ప్రాంతంలోని దేశం నార్త్ మాసిడోనియా. ఇదివరకు దీని పేరు మాసిడోనియా మాత్రమే! రెండో ప్రపంచయుద్ధ కాలంలో 1944లో ఈ ప్రాంతం ‘సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా’గా ఆవిర్భవించింది. తర్వాత 1991లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం సాధించుకుని, ‘మాసిడోనియా’గా మారింది. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటికీ మాసిడోనియా ప్రాంతంలోని కొంతభాగం ఈ దేశానికి దక్షిణాన గల గ్రీస్‌లో ఉంది. పొరుగుదేశంతో గందరగోళం తొలగించుకోవాలనే ఉద్దేశంతో 2019లో ఈ దేశం తన పేరును ‘నార్త్ మాసిడోనియా’గా మార్చుకుంది. మయాన్మార్ మన దేశానికి సరిహద్దుల్లోని ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశానికి ఇదివరకటి పేరు ‘బర్మా’. అధికారికంగా మయాన్మార్గా మారినా, ‘బర్మా’ పేరుతో ఈ దేశాన్ని గుర్తుపట్టేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బర్మన్ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. అందువల్ల ‘బర్మా’గా పేరుపొందింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అలజడులతో అతలాకుతలమైన ఈ దేశం 1989లో జరిగిన సైనిక కుట్రలో పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన సైనిక పాలకులు దేశం పేరును మయాన్మార్గా మార్చారు. ‘మయాన్మార్’ పదం పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ గందరగోళం ఉంది.బెనిన్ అట్లాంటిక్ తీరంలో ఉన్న ఆఫ్రికన్ దేశం ఇది. ఆఫ్రికా పడమటి తీరాన ఉన్న ఈ చిన్న దేశానికి గతంలో ఉన్న పేరు ‘దహోమీ’. చిన్న రాజ్యంగా ఉండే ఈ దేశం పదిహేనో శతాబ్దిలో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను కలుపుకొని ‘దహోమీ’ రాజ్యంగా అవతరించింది. స్థానిక ఫోన్ తెగకు చెందిన ప్రజలు మాట్లాడే ‘ఫోంగ్బే’ భాషలో ‘ఫోన్ ద హోమీ’ అంటే ‘పాము పొట్ట’ అని అర్థం. దేశం ఆకారం దాదాపు అలాగే ఉండేది కాబట్టి వారు ‘దహోమీ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ దేశాన్ని 1872లో ఫ్రెంచ్‌వాళ్లు ఆక్రమించుకుని, 1960 వరకు పరిపాలన కొనసాగించారు. ఫ్రెంచ్ పాలన అంతమయ్యాక 1960లో స్వాతంత్య్రం వచ్చినా, ‘దహోమీ’ పేరుతోనే పదిహేనేళ్లు కొనసాగింది. మాథ్యూ కెరెకోవు నేతృత్వంలోని సైనిక బలగాలు 1972లో అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కెరెకోవు నేతృత్వంలోని ప్రభుత్వం 1975లో దేశం పేరును ‘బెనిన్’గా మార్చింది. ‘ఫోన్’ తెగ తర్వాత ‘బిని’ తెగవారు కూడా ఈ దేశంలో గణనీయంగా ఉంటారు. ‘బిని’ తెగ మూలం గానే బెనిన్ పేరు పెట్టారు. అయితే, ‘బిని’ తెగ జనాభా నైజీరియాలో ఎక్కువగా ఉంటారు. సూరినామా దక్షిణ అమెరికాలోని ఈశాన్యతీరంలో ఉన్న దేశం సూరినామా. దీని ఇదివరకటి పేరు సూరినామ్. స్థానిక స్రానన్ టోంగో భాషలో ‘ఆమ’ పదానికి నది లేదా నదీముఖద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వేర్వేరు యూరోపియన్ దేశాల వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్‌వారు 1630లో వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధికసంఖ్యాకులు సూరీనియన్ తెగకు చెందినవారు. స్థానిక భాష అర్థంకాని బ్రిటిష్ వలస పాలకులు దీని పేరును ‘సూరినామ్’గా వ్యవహరించేవారు. పదిహేడో శతాబ్ది చివర్లో బ్రిటిష్ వారి నుంచి ఈ దేశం డచ్ పాలకుల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో ఇది డచ్ గయానాలో భాగంగా ఉండేది. డచ్ పాలకులు ఇక్కడి నుంచి భారీగా చక్కెర ఎగుమతి చేసేవారు. దాదాపు రెండు శతాబ్దాలు సాగిన డచ్ పాలన నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం వచ్చాక, పాశ్చాత్యులు తమ దేశానికి పెట్టిన అపభ్రంశ పదాన్ని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని, 1978లో ‘సూరినామా’గా స్వతంత్ర పాలకులు ప్రకటించుకున్నారు. స్వతంత్ర దేశానికి తొలి అధ్యక్షుడైన హెంక్ ఆరన్ హయాంలో ఈ మార్పు అమలులోకి వచ్చింది. నెదర్లాండ్స్ మూడేళ్ల కిందటి వరకు ఈ దేశం పేరు హాలండ్. పశ్చిమ యూరోప్‌లోని డచ్ ప్రజల దేశం ఇది. ఇక్కడి ప్రభుత్వం 2020లో దేశం పేరును ‘నెదర్లాండ్స్’గా మార్చినట్లు ప్రకటించింది. ‘హాలండ్’ పేరు దేశంలోని రెండు డచ్ రాష్ట్రాలు గల ప్రాంతానికే వర్తిస్తుందని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలుపుకొనేలా ఒక పేరుపెట్టడం బాగుంటుందని దేశ నేతలు కొంతకాలం మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ప్రధాని మార్క్ రుట్టే నేతృత్వంలోని ప్రభుత్వం ‘నెదర్లాండ్స్’ పేరును ఖాయం చేసింది. జింబాబ్వే ఆఫ్రికా ఆగ్నేయప్రాంతంలోని దేశం ఇది. దీని ఇదివరకటి పేరు ‘రొడీషియా’. ఇక్కడ బ్రిటిష్ వలస రాజ్యానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు సెసల్ రోడ్స్ పేరు మీద అప్పటి బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశానికి ‘రొడీషియా’ అని పేరు పెట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1960లలో ఇక్కడి నల్లజాతీయులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఉద్యమకాలంలో వారు తమ దేశానికి ‘జింబాబ్వే’ పేరును వాడుకలోకి తెచ్చారు. ‘జింబాబ్వే’ అంటే స్థానిక ‘షువావు’భాషలో ‘రాతి ఇళ్ల దేశం’ అని అర్థం. పోరాట ఫలితంగా 1965లో స్వాతంత్య్రం వచ్చినా, పాలనలో 1979 వరకు నల్లజాతీయులు మైనారిటీలుగానే మిగిలారు. గెరిల్లా పోరాటం తర్వాత 1979లో జరిగిన ఎన్నికల్లో రాబర్ట్ ముగాబే నాయకత్వంలో నల్లజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ముగాబే ప్రభుత్వం దేశం పేరును ‘జింబాబ్వే’గా మార్చింది. బుర్కీనా ఫాసో ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలోని చిన్న దేశమిది. స్వాతంత్య్రానికి ముందు ఫ్రెంచ్ పాలనలో ఉండేది. ఫ్రెంచ్ పాలకులు దీనిని ఫ్రెంచ్ భాషలో ‘హాట్–వోల్టా’ అని, ఇంగ్లిష్‌లో ‘అప్పర్ వోల్టా’ అని వ్యవహరించేవారు. ఈ దేశానికి ‘అప్పర్ వోల్టా’ పేరు ఎక్కువగా చలామణీలో ఉండేది. ఫ్రెంచ్ వలస పాలకుల నుంచి 1958లో ఈ దేశానికి స్వయంపాలనాధికారం లభించింది. తర్వాత రెండేళ్లకు 1960లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ వోల్టా’గా దేశం పేరు మారింది. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతో 1984లో అప్పటి అధ్యక్షుడు థామస్ సంకారా తమ దేశానికి ‘బుర్కీనా ఫాసో’ పేరును ప్రకటించారు. స్థానిక మూరీ భాషలో ‘బుర్కీనా ఫాసో’ అంటే నిజాయతీపరుల దేశం అని అర్థం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా మధ్య ప్రాంతంలోని రెండో అతిపెద్ద దేశం ఇది. బెల్జియం రాజు రెండో లియోపోల్డ్ 1885లో ఇక్కడ సొంతరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లియోపోల్డ్ హయాంలో ఈ దేశాన్ని ‘కాంగో ఫ్రీ స్టేట్’ అనేవారు. తర్వాత 1908 నాటికి ఇది పూర్తిగా బెల్జియం ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. బెల్జియన్ల పాలనలో ఈ దేశాన్ని ‘బెల్జియన్ కాంగో’గా వ్యవహరించేవారు. బెల్జియన్ల నుంచి ఈ దేశానికి 1960లో స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ జైరీ’గా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదేళ్లు దేశం తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అతలాకుతలమైంది. అంతర్యుద్ధంలో సైనికాధికారి మొబుటు సెసె సీకో 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని నియంతృత్వ పాలన ప్రారంభించారు. దేశంలో ప్రవహించే కాంగో నది పేరు మీదుగా ఆయన దేశానికి ‘కాంగో’ పేరు పెట్టాడు. రెండేళ్లలోనే 1967లో సీకో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తిరుగుబాటు నాయకుడు లారెంట్ డిజైర్ కబిలా దేశానికి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ పేరును ఖాయం చేశారు. కాబో వెర్డీ ఆఫ్రికా పశ్చిమాన ఉన్న చిన్న ద్వీపసమూహ దేశం ఇది. పదేళ్ల కిందటి వరకు ఈ దేశం ‘కేప్ వెర్డీ’ అనే ఇంగ్లిష్ పేరుతోనే చలామణీ అయ్యేది. తొలుత పోర్చుగీసులు ఈ ద్వీపసమూహాన్ని 1462లో ఆక్రమించుకుని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వస్తువులే కాకుండా, బానిసలను కూడా దేశదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానిక క్రియోలె భాషలో ఈ దీవులకు ‘కాప్–వెర్ట్’ అనేవారు అంటే, ‘ఆకుపచ్చని అగ్రం’. దాని ఆధారంగానే పోర్చుగీసులు ఈ ద్వీపసమూహానికి తమ భాషలో ‘కాబో వెర్డీ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలతో వారు లావాదేవీలు సాగించడంతో వారికి అర్థమయ్యేలా ‘కేప్ వెర్డీ’ అనేవారు. పోర్చుగీసుల నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం వచ్చింది. దేశాధ్యక్షుడు జోస్ మారియా నెవిస్ 2013లో దేశానికి తిరిగి పోర్చుగీసు పదాన్ని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చారు. తుర్కియే నిన్న మొన్నటి వరకు ఈ దేశం ‘టర్కీ’ పేరుతోనే చలామణీలో ఉండేది. ఇక్కడి తుర్కు ప్రజల ప్రాచీన నాగరికత, సంస్కృతి ప్రతిబింబించేలా స్థానిక భాషలోనే దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ గత ఏడాది దేశం పేరును ‘తుర్కియే’గా మార్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఈ దేశాన్ని ఇప్పుడు ఇదే పేరుతో గుర్తిస్తోంది. నిజానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ఒక చిన్న ఇబ్బంది ఈ దేశం పేరు మార్చుకోవడానికి కారణమైంది. ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా ఉత్తర అమెరికన్లు సంప్రదాయంగా ఇచ్చేవిందులో టర్కీ కోళ్లు తప్పనిసరి. టర్కీ కోళ్లను వాళ్లు ‘టర్కీ’గానే వ్యవహరిస్తారు. కోడిజాతికి చెందిన పక్షుల పేరు, తమ దేశం పేరు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోందని, దీన్ని తప్పించుకోవడానికే దేశం పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ‘తుర్కియే’ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి: ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!) -
మరో వివాదం.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు
ఢిల్లీ: జీ-20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. ఏసియన్-ఇండియా సమ్మిట్, 'ఈస్ట్ ఏసియా సమ్మిట్' లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం వరుసగా హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో పేరు మార్పు వివాదం మరింత ముదిరింది. 20వ 'ఏసియన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4 — Sambit Patra (@sambitswaraj) September 5, 2023 అయితే.. జీ-20 డిన్నర్ మీటింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి అధికారిక ఆహ్వానాన్ని పంపారు అధికారులు. ఇందులో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీని ఓడించడానికి దేశంలో ప్రధానంగా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్ష కూటమి పేరు ఇండియా ఉండటం బీజేపీకి నచ్చనందునే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అటు.. తమ కూటమి పేరును త్వరలో భారత్‌గా నామకరణం చేస్తామని కూడా పలువురు నాయకులు చెప్పారు. Look at how confused the Modi government is! The Prime Minister of Bharat at the 20th ASEAN-India summit. All this drama just because the Opposition got together and called itself INDIA 🤦🏾♂️ pic.twitter.com/AbT1Ax8wrO — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును భారత్‌గా పిలవడం స్వాగతిస్తున్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది దేశానికి గర్వకారణం అని అన్నారు. అటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
ఇది దేనికి సంకేతం?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్‌గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే... కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది. 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు. ఒకటో అధికరణాన్నే మార్చేయాలి! ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్‌ను మాత్రమే ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు ‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది. 2020లో కూడా ఇలాంటి మరో పిల్‌ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు. జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా.. అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో! ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు. జంబూ ద్వీపం పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు. హిందూస్తాన్, ఇండియా బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది. భారత్ భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు.