పదో తరగతి పుస్తకాలు పదిహేనేళ్ల తర్వాత మారాయి. ఈ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి.
కామారెడ్డి, న్యూస్‌లైన్: పదో తరగతి పుస్తకాలు పదిహేనేళ్ల తర్వాత మారాయి. ఈ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. మారిన పాఠ్యాంశాలు విద్యార్థులను ఆకర్షించేలా ఉన్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా వీటిని రూపొందించారు. 2012-14 విద్యా సంవత్సరాలలో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మార్చిన సంగతి తెలిసిందే. ఈసారి పదోతరగతి పుస్తకాల్లో కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థులను ఆకర్షించే విధంగా ఉన్నాయని, మరికొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులపై తక్కువ ఒత్తిడి ఉండేలా, భౌతిక, రసాయన శాస్త్రాలలో ప్రయోగాలకు సంబంధించినవి ఎక్కువ పాఠ్యాంశాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యాంశాలు బాగున్నాయని పేర్కొంటున్నారు.