
ట్రంప్ ‘మార్పు తెచ్చే వ్యక్తి’: ఒబామా
వాషింగ్టన్: అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘మార్పు తెచ్చే వ్యక్తి’అనీ, అతణ్ని తక్కువ అంచనా వేయొద్దని మరో మూడు రోజుల్లో దిగిపోనున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
అధ్యక్షుడిగా తన చివరి ఇంటర్వూ్యనుసీబీఎస్ న్యూస్‌కి ఇచ్చిన ఆయన, అమెరికా ప్రజలే వాషింగ్టన్‌ను మార్చగలరని, కానీ అలా అది మారదని, ఎందుకంటే ఆ మార్పును కొందరు పెద్దలు నిర్దేశిస్తారని పేర్కొన్నారు. ట్రంప్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నా, విజయవంతంగా ప్రచారంనిర్వహించాడనీ, ప్రస్తుతం జరుగుతున్న అధికార మార్పిడి మాత్రం అసాధారణంగా ఉందనీ, ట్రంప్ తనకన్నా మెరుగ్గా పాలించగలడని తాను అనుకోవడం లేదని ఒబామా అన్నారు.