అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ రంగంలోకి దిగుతుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో కమలాకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ జాతీయ సదస్సుకు రెండోరోజైన మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యూఎస్ ఎన్నికల్లో గట్టిపోటీ ఉండబోతుందని, అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కమలా చేతిలో ఓడిపోతాననే భయం ట్రంప్‌లో కనిపిస్తోందని, దీంతో అతనికి నిద్ర కూడ పట్టడం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
అమెరికా అధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే ప్రజల సమస్యలపై దృష్టిపెడతారని తెలిపారు. ఆమెను అధ్యక్షరాలిగా పిలవడం గర్వంగా ఉందని కొనియాడారు. అధ్యక్షురాలిగా, ఆమె ఎల్లప్పుడూ మనకువెన్నుదన్నుగా ఉంటుంది. హారకు ఒక పోరాట యోధురాలు. కష్టపడి పనిచేసే కుటుంబాల కోసం ఆమె పోరాడుతుంది, మంచి జీతంతో కూడిన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తుంది’ అని తెలిపారు
ఒబామా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కూడా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేయడానికి హారిస్ సిద్దంగా ఉన్నారని, దేశం కోసం తన సొంత ఆశయాలను పక్కన పెట్టిన వ్యక్తిగా అభివర్ణించాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించిన అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ చరిత్రలో గుర్తుండిపోతాడని అన్నారు. అతన్ని తన స్నేహితుడు, అధ్యక్షుడిగా అని పిలవడం గర్వంగా ఉందన్నారు,
అంతకముందు జో బైడెన్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ అనేక కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని, అతనిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైందని విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను ఒక లూజర్(ఓడిపోయిన వ్యక్తిగా) అభివర్ణించాడు."ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ఓడిపోయిన వారుగా ట్రంప్ పేర్కొన్నాడు. తనకు తను ఏమని అనుకుంటున్నాడు? అదే ట్రంప్ వ్లదిమిర్ పుతిన్‌కు వంగి వంగి దండాలు పెడతాడు. ఆ పని నేను ఎప్పుడూ చేయలేదు.. నేనే కాదు కమలా హారిస్ కూడా ఎప్పటికీ చేయదు’ అని బిడెన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment