వాషింగ్టన్: నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికలపై సర్వే చేసిన ఒక సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలే విషయాన్ని వెల్లడించింది. ఎన్నికల వేళ ఎక్కవ ఓట్ల శాతం ఉన్న భారతీయ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం 22 శాతం భారతీయ ఓటర్లు మాత్రమే రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. 72 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బిడెన్‌ను అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడయ్యింది. ఇక మిగిలినవారిలో మూడు శాతం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండగా, 3 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి ఇష్టపడటం లేనట్లు తెలిసింది.
ఇక డెమొక్రటిక్ పార్టీ తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి కమలహారిస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కవ మంది భారతీయులు ఆ పార్టీవైపు మళ్లినట్లు తెలుస్తోంది. కమలాహారిస్ ద్వారా భారత్- అమెరికా బంధం మరింత బలోపేతమవుతుందని వారు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వే వెల్లడించిన విషయాలతో ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్లయ్యింది. నాలుగేళ్లు పరిపాలన అందించి కూడా డెమోక్రటిక్ పార్టీ ఓట్లను పెద్దగా ట్రంప్ తన ఖాతాలో వేసుకోలేకపోయారని సర్వే ద్వారా తేటతెల్లమయ్యింది.
చదవండి: ‘నేనిప్పుడు శక్తిమాన్’
Comments
Please login to add a commentAdd a comment