barack obama
-
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
-
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్‌హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్‌కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్‌కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్‌గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్‌కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
ఒబామా దంపతులు విడిపోనున్నారా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్ దంపతులు హాజరుకానున్నారు. కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్ నివాళి, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్ ప్రారంభించిన బరాక్, మిచెల్‌లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
కార్టర్‌కు కన్నీటి వీడ్కోలు
వాషింగ్టన్: దిగ్గజ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు అమెరికా ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. దేశ రాజధాని వాషింగ్టన్లో జరిగిన అధికారిక నివాళుల కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేసి తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. గురువారం వాషింగ్టన్ సిటీలోని జాతీయ చర్చికు కార్టర్ పార్థివదేహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక సంతాప కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో అధ్యక్షుడు బైడెన్‌తోపాటు అగ్రరాజ్య మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులుగా సేవలందించిన ఐదుగురు అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018 డిసెంబర్లో మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సంతాప కార్యక్రమానికి ఇలా ఒకే చోట ఐదుగురు అధ్యక్షులు హాజరయ్యారు. కార్టర్‌కు ఘనంగా అంజలి ఘటిస్తూ బైడెన్ తన సంతాప సందేశం చదివి వినిపించారు. ‘‘ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు తదనంతర కాలంలో ఎలాంటి నిరాడంబర జీవించాలో, హుందాగా ఉండాలో కార్టర్ ఆచరించి చూపారు. అంతర్జాతీయ సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పానికి రాజకీయాలు ఏనాడూ ఆయనకు అడ్డురాలేదు’’ అని బైడెన్ అన్నారు. నివాళుల కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు సైతం పాల్గొన్నారు. మాజీ అధ్యక్షునిగా నివాళిగా సైనికులు తుపాకులతో ‘21 గన్ సెల్యూట్’ సమర్పించారు. 39వ అధ్యక్షుడిగా సేవలందించిన కార్టర్ 100 ఏళ్లు జీవించి డిసెంబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. కార్టర్ భౌతిక కాయాన్ని మూడు రోజులపాటు అమెరికా పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గురువారం ఉదయం నేషనల్ క్యాథడ్రల్‌కు తీసుకొచ్చి ఈ అధికారిక నివాళుల కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ అధికారిక వీడ్కోలు కార్యక్రమం గురువారంతో ముగిసింది. తర్వాత కార్టర్ భౌతికకాయాన్ని గురువారం జార్జియాలోని స్వస్థలం పెయిన్స్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భార్య రొజలిన్ కార్టర్ సమాధి పక్కనే కార్టర్‌ను ఖననం చేస్తారు. రోజలిన్ 77 ఏళ్ల వయస్సులో 2023 నవంబర్‌లో కన్నుమూశారు. -
అసాధారణ వ్యక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు. భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్‌లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది. ఆయన పర్యటన మైలురాయి ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ – డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు మన్మోహన్సింగ్ నాకు గురువు ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’ – జపాన్ మాజీ ప్రధాని షింజో అబే -
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
ఓటమి భయంతో ట్రంప్‌కు నిద్ర పట్టడం లేదు: ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ రంగంలోకి దిగుతుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో కమలాకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ జాతీయ సదస్సుకు రెండోరోజైన మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యూఎస్ ఎన్నికల్లో గట్టిపోటీ ఉండబోతుందని, అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కమలా చేతిలో ఓడిపోతాననే భయం ట్రంప్‌లో కనిపిస్తోందని, దీంతో అతనికి నిద్ర కూడ పట్టడం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు.అమెరికా అధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే ప్రజల సమస్యలపై దృష్టిపెడతారని తెలిపారు. ఆమెను అధ్యక్షరాలిగా పిలవడం గర్వంగా ఉందని కొనియాడారు. అధ్యక్షురాలిగా, ఆమె ఎల్లప్పుడూ మనకువెన్నుదన్నుగా ఉంటుంది. హారకు ఒక పోరాట యోధురాలు. కష్టపడి పనిచేసే కుటుంబాల కోసం ఆమె పోరాడుతుంది, మంచి జీతంతో కూడిన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తుంది’ అని తెలిపారుఒబామా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కూడా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేయడానికి హారిస్ సిద్దంగా ఉన్నారని, దేశం కోసం తన సొంత ఆశయాలను పక్కన పెట్టిన వ్యక్తిగా అభివర్ణించాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించిన అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ చరిత్రలో గుర్తుండిపోతాడని అన్నారు. అతన్ని తన స్నేహితుడు, అధ్యక్షుడిగా అని పిలవడం గర్వంగా ఉందన్నారు,అంతకముందు జో బైడెన్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ అనేక కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని, అతనిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైందని విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను ఒక లూజర్(ఓడిపోయిన వ్యక్తిగా) అభివర్ణించాడు."ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ఓడిపోయిన వారుగా ట్రంప్ పేర్కొన్నాడు. తనకు తను ఏమని అనుకుంటున్నాడు? అదే ట్రంప్ వ్లదిమిర్ పుతిన్‌కు వంగి వంగి దండాలు పెడతాడు. ఆ పని నేను ఎప్పుడూ చేయలేదు.. నేనే కాదు కమలా హారిస్ కూడా ఎప్పటికీ చేయదు’ అని బిడెన్ అన్నారు. -
ఎట్టకేలకు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. -
ఏఐ ప్యాషన్ షో.. ప్రముఖుల ర్యాంప్ వాక్! (ఫొటోలు)
-
డెమోక్రాట్ అభ్యర్థిపై సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన ఒబామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు బైడెన్‌ను ప్రశంసిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం తప్పుకొని నిస్వార్థంగా వ్యవహరించాలని కొనియాడుతున్నారు. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా బైడెన్ నిర్ణయాలన్ని స్వాగించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ‘‘బైడెన్ నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతుంది. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడు. అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని చాటిచెప్పారు. నాటోను పునరుజ్జీవింపజేశారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారు’’ అని ఒబామా కొనియాడారు. ఇదే సమయంలో కమలా హారీస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని, డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష బరి నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ తీవ్రతరమైంది. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఈ సందర్భంగా 4,700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతోపాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే. ఇక, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే హారీస్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
‘అమెరికాలా భారత్ పరిపూర్ణ దేశం కాకపోవచ్చు’
న్యూయార్క్: భారత ప్రధాని మోదీ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే టైంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. ఇలా పలువురు ఒబామాపై మండిపడ్డారు. ఈ క్రమంలో.. అమెరికాకే చెందిన ఓ మాజీ ఉన్నతాధికారి ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒబామా తన శక్తినంతా భారత్‌ను విమర్శించడానికి బదులు పొగడడానికి ఉపయోగించాలంటూ సూచించారు యూఎస్సీఐఆర్ఎఫ్(అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థ) మాజీ కమిషనర్ జానీ మూర్. భారత్‌ను విమర్శించడం కంటే.. పొగడడం కోసం తన శాయశక్తులా ఆయన(ఒబామాను ఉద్దేశించి..) కృషి చేయడం మంచిదని నేను అనుకుంటున్నా. మానవ చరిత్రలోనే అత్యంత వైవిధ్యం ఉన్న దేశం భారత్. అది అమెరికాలాగా అది పరిపూర్ణ దేశం కాకపోవచ్చు. కానీ, భిన్నత్వం ఆ దేశానికి ఉన్న అతిపెద్ద బలం. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వీలైనప్పుడల్లా పొగడాలే తప్పా.. ఇలా విమర్శించకూడదు’’ అని ఒమామాకు సలహా ఇచ్చారు జానీ మూర్. మోదీ అమెరికా పర్యటన చారిత్రాకమైందన్న ఆయన.. మిత్రదేశాల పట్ల ప్రజాసామ్య యుతంగానే ముందుకు వెళ్లాలని, సాధ్యమైనంత వరకు బహిరంగ విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారాయన. #WATCH | Reacting to former US President Barack Obama's remarks about the rights of Indian Muslims, Johnnie Moore, former Commissioner of US Commission on International Religious Freedom, says, "I think the former president (Barack Obama) should spend his energy complimenting… pic.twitter.com/227e1p17Ll — ANI (@ANI) June 26, 2023 ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే.. ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ ఆ ఇంటర్వ్యూలో ఒబామా అభిప్రాయపడ్డారు. అలాగే.. మోదీ-బైడెన్ చర్చల్లో మైనార్టీల హక్కుల పరిరక్షణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. యూఎస్సీఐఆర్ఎఫ్ అనేది.. 1998 ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ద్వారా అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్లను అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు సెనేట్, హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఉభయ సభల్లోని లీడర్లు ఎన్నుకుంటారు. ఇక జానీ మూర్ గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఆధ్యాత్మిక సలహాదారుగా పని చేశారు కూడా. ఇదీ చదవండి: ఆ విషయంలో అమెరికా కంటే ఆంధ్రానే మేలు -
ఒబామా హెచ్చరిక హేతబద్ధంగా లేదు!
మానవ ప్రగతి విషయంలో, అక్కడక్కడా అలజడి, తాత్కాలిక అశాంతితో నిత్యం వార్తల్లో నిలిచే దక్షిణాసియాలో చాలా వరకు ప్రశాంతత నెలకొని ఉన్న దేశం ఇండియా. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా, 32,87,263 చ.కి.మీ సువిశాల భారతంలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాల జనాభా 20 శాతం వరకూ ఉంది. అయినా, దాదాపు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మత ఘర్షణలు మన పొరుగు దేశాల స్థాయిలో ఎన్నడూ జరగలేదు. ఒకవేళ జరిగినా కొద్ది రోజుల్లోనే మామూలు పరిస్థితులు నెలకొనే ఆనవాయితీ ఉంది. మతపరమైన అణచివేత కారణంగా సరిహద్దు దేశాల నుంచి మైనారిటీలు ఇండియాకు శరణార్ధులుగా తరలివస్తున్నారేగాని, ఈ కారణంతో దేశం నుంచి మైనారిటీలు ఎవరూ విదేశాలకు వలసపోయే పరిస్థితులు లేనేలేవు. ఎక్కడైనా మతఘర్షణలు కాస్త తీవ్రస్థాయిలో పెరిగితే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ బలగాల వల్ల కాకపోతే– సైన్యాన్ని రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం ఎన్నో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మతాల ప్రజల మధ్య కొట్లాటలు జరిగితే ఇతర మతాల వారిని మరో మతం వారు తమ ఇంట్లో పెట్టుకుని కాపాడం కూడా భారత సాంప్రదాయంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక మతాలకు చెందిన ప్రజలు ఎలాంటి అశాంతి, అభద్రతాభావం లేకుండా దశాబ్దాల తరబడి జీవిస్తున్నారు. మత సామరస్యానికి సంబంధించి ఇంత చక్కటి, ఆదర్శప్రాయమైన నేపథ్యం, చరిత్ర ఉన్న భారత్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు, అక్కడి మైనారిటీ ఆఫ్రికన్–అమెరికన్ (నల్లజాతి) వర్గానికి చెందిన తొలి నేతగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా నిన్న ఇండియాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మైనారిటీల హక్కులకు రక్షణ కరువైతే ఇండియా ముక్కచెక్కలవుతుందన్న ఒబామా అల్పసంఖ్యాక మతాల ప్రజలు, మైనారిటీ జాతుల హక్కులు పరిరక్షించకపోతే భారతదేశం ముక్కచెక్కలవుతుందని మాజీ అధ్యక్షుడు ఒబామా గురువారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ప్రఖ్యాత జర్నలిస్టు క్రిస్టీన్ అమన్ పూర్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, భారత సమాజంలో బలహీనవర్గాల స్థితిగతులపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం సబబుగా కనిపించడం లేదని భారత మేధావులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇండియాలో మతపరమైన, జాతిపరమైన మైనారిటీల హక్కులు పరిరక్షించలేకపోతే, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేశం ముక్కచెక్కలవడం మొదలవుతుంది,’ అని ఒబామా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన అమెరికా అధినేతగా గుర్తింపు పొందిన ఒబామా ఇలా మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ దేశంలోనైనా బడుగువర్గాలను, మైనారిటీలను కాపాడాలని, వారి హక్కులను పరిరక్షించాలని కోరడంలో తప్పులేదు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధికెక్కిన అమెరికాలో (నల్లజాతీయులను బానిసలుగా చూడడం) బానిసత్వం రద్దు సమస్యపై అక్కడి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొద్ది కాలం అంతర్యుద్ధం జరిగింది కాని ఈ విశాల దేశం రెండుగా చీలిపోలేదు. కొన్ని ఏళ్ల అంతర్గత కల్లోలం తర్వాత అమెరికా మరింత బలోపేతం అయింది. కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యంగా అవతరించింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇండియాలో మతపరమైన మైనారిటీలకు లేదా జాతిపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు గాని తాత్కాలిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేశం చిన్నాభిన్నమౌతుందని భయపడాల్సిన అవసరం లేదని మన చరిత్ర నిరూపించింది. భారత చరిత్రను క్షణ్ణంగా పరిశీలిస్తే–ఒబామా గారి హెచ్చరిక హేతుబద్ధంగా కనిపించదు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు
వాషింగ్టన్: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్‌కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్ ఒబామా దంపతులు 2017లో వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. ఇది అమెరికా వైట్ హౌస్ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు జో బైడెన్ ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్ ఒబామా దంపతులకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్ అన్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్ హౌస్‌లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్ బైడెన్ అన్నారు. అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్ బైడెన్. ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్ చేపట్టింది. తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్కర్డీ, మిచెల్ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. I want to thank Robert McCurdy for his extraordinary work on my portrait. Robert is known for his paintings of public figures, and I love how he paints people exactly the way they are. Take a look at the process behind creating the official White House portraits: pic.twitter.com/oZb6ov4uwr — Barack Obama (@BarackObama) September 7, 2022 (చదవండి: స్వీట్ బాక్స్‌లో ఏకంగా రూ.54 లక్షలు) -
ఒబామాకు కరోనా...కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా ట్విట్టర్లో, ‘‘నేను గత రెండు రోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నను. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. అయితే నా భార్య మిచెల్‌కు నెగిటివ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను". అని పేర్కొన్నారు. అంతేకాదు కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు ఎవరైన ఉంటే తీసుకోండి అని సూచించారు. ఒబామ ట్వీట్‌కి ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... "ఒబామ త్వరితగతిన కోలుకోవాలి. మీరు, మీ కుటుంబం, మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన అమెరికాలో ఇప్పటివరకు సుమారు 79 మిలియన్ల పైగా కరోనా భారిన పడ్డారు, దాదాపు 9 లక్షల మరణాలు సంభవించడం గమనార్హం. (చదవండి: మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు) -
Jeff Bezos: పిల్లికి బిచ్చం పెట్టడని తిట్టారు కదా! ఇప్పుడేమో ఏకంగా..
Jeff Bezos donates Million Dollars to Obama Foundation: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నప్పటికీ.. దాతృత్వం విషయంలో మాత్రం ఆ ఇద్దరి మీద ‘పిసినారులు’ అనే ట్యాగ్ వినిపిస్తుంటుంది. వాళ్లే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు. ఛారిటీ ఫండ్ పేరుతో స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంది ఒకరైతే.. అసలు పిల్లికి బిచ్చం వేయడంటూ రెండో ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ తరుణంలో నెంబర్ టూ, అమెజాన్ బాస్ అయిన జెఫ్ బెజోస్ భారీ వితరణ ద్వారా తన పెద్ద మనసు చాటుకోవడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు. 57 ఏళ్ల ఈ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఏకంగా 100 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు 750 కోట్ల రూపాయలు) డొనేషన్ ప్రకటించాడు. ఆ సొమ్మును అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా నడిపిస్తున్న ఫౌండేషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అమెరికా పొలిటీషియన్, పౌర హక్కుల నేత జాన్ లూయిస్(దివంగత) గౌరవార్థం ఈ భారీ దానం చేస్తున్నట్లు బెజోస్ ప్రకటించారు. అంతేకాదు ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ పేరును జాన్ లూయిస్ ప్లాజాగా పేరు మార్చాలని అమెజాన్ చీఫ్, ఒబామా ఫౌండేషన్‌ను రిక్వెస్ట్ చేశారు. జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఈ దానం చాలామందికి చిన్నదే అనిపించొచ్చు.. కానీ, సాయం అందుకునే ఎందరికో ఇది పెద్దదే అని Obama Foundation ప్రతినిధి కోర్ట్నీ విలియమ్స్ వెల్లడించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంటూ.. కనీస దానాలు కూడా చేయట్లేదని, భూమి మీద సమస్యలు పట్టించుకోకుండా స్పేస్ టూరిజం మీద ఫోకస్ పెడుతున్నారంటూ మస్క్, బెజోస్లపై విమర్శలు ఉన్నాయి. బిల్ గేట్స్ లాంటి వాళ్లు సైతం వీళ్లను విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెజోస్ దానాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఓవైపు ఒబామా ఫౌండేషన్‌తో పాటు మరోవైపు న్యూయార్క్ యూనివర్సిటీ ఆధర్వ్యంలోని ఓ ఆస్పత్రికి సైతం 166 మిలియన్ డాలర్ల డొనేషన్ ఇవ్వడంతో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మాక్‌కెంజీ స్కాట్‌తో జెఫ్ బెజోస్ (పాత చిత్రం) ఇక అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నాక.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 600 మిలియన్ డాలర్లు డొనేషన్లు ఇచ్చినట్లు పక్ మీడియా ఓ కథనం ప్రచురిచింది. ఇవిగాక క్లైమేట్ ఛేంజ్ పోరాటం కోసం ఎర్త్ ఫండ్ ప్రతిజ్ఞ, నిరాశ్రయులైన వాళ్ల కోసం 2 బిలియన్ల దాకా సాయం ప్రకటించారు. బెజోస్ మాత్రమే కాదు.. ఆయన మాజీ భార్య మాక్‌కెంజీ స్కాట్ విడాకుల భరణం రూపంలో దక్కిన 8.5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు దానం చేసి సంచలనం సృష్టించింది. చదవండి: మనిషి పుట్టుక ఇక అంతరిక్షంలోనే! కానీ.. -
‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్ వైరల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్లీ ఒబామా దంపతులు తమ సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ వార్షికోత్సవం, వాలెంటైన్స్ డేకి పరస్పరం అభినందిచుకోవడం ఈ దంపతులకు అలవాటు. ఈ క్రమంలో అక్టోబరు 3 ఆదివారం, 29 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిచెల్లీ ఒక పోస్ట్ పెట్టారు. తన హబ్బీ కోసం పెట్టిన ఒక స్వీట్ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఒబామా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించడం విశేషం. అందమైన జంట..హ్యాపీ యానివర్సరీ కమెంట్ల జోరు కొనసాగుతోంది. తమ పెళ్లి రోజు సందర్భంగా మెచెల్లీ భర్త ఒబామాకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ అందించారు. ఎలా ప్రారంభమైంది.. ఎలా కొనసాగుతోంది అంటూ తమ అపురూపమైన జర్నీని గుర్తు చేసుకున్నారు. లవ్ యూ బరాక్ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఒబామాతో కలిసి ఉన్న అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను షేర్ చేశారు. కాగా 1992, అక్టోబర్ 3 న వివాహం చేసుకున్నారు ఒబామా, మిచెల్లీ. వీరికి మలియా (23) సాషా (20) ఇద్దరు సంతానం. గత ఏడాది తమ 28వ వార్షికోత్సవ సందర్భంగా 2020 అధ్యక్షఎన్నికల్లో జోబైడెన్ విజయంకోసం ఓటువేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Michelle Obama (@michelleobama) -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ఒబామా కుటుంబంలో విషాదం
నైరోబీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ(వరసకు) సారా ఒబామా సోమవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె కెన్యాలో తన 99 ఏట మరణించారు. నాన్నమ్మ మరణంపై ఒబామా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ ఇది నిజం.. ఆమె దేవుడి దగ్గరకు వెళ్లింది. ఈ ఉదయం ఆమె చనిపోయింది’’ అని ఆమె కూతురు మర్శత్ ఓన్యాంగో భావోద్వేగానికి గురయ్యారు. సారా ఒబామా 1922లో లేక్ విక్టోరియాలో జన్మించారు. బరాక్ ఒబామా తాత గారు హుస్సేన్ ఓన్యాంగో ఒబామా మూడో భార్య ఈ సారా ఒబామా. సారా ఒబామా ఫౌండేషన్ పేరిట ఆమె అనాథ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. రక్త సంబంధం లేకపోయినప్పటికి ఒబామా ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. 2006లో కెన్యా వెళ్లిన ఆయన సారా ఇంటికి వెళ్లారు. ఆమెను తన బామ్మ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాతే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కాగా, మంగళవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
స్టాలిన్‌ది ఒబామా స్టైల్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై ఎండీఎంకే నేత వైగో ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తూ కొనియాడారు. శుక్రవారం ఆయన స్టాలిన్ నియోజకవర్గమైన కొళత్తూరులో పర్యటించారు. వైగో మాట్లాడుతూ ఒబామా సెనేటర్‌గా ఉన్న సమయంలో తరచూ తాను ప్రాతినిథ్యం వహించే సెనేట్‌లో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించేవారన్నారు. అదే తరహాలో స్టాలిన్ సైతం ఎక్కడున్నా కొళత్తూరు ప్రజలతో మమేకమవుతుంటారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమంపై వీరిద్దరి చిత్తశుద్ధి అర్థమవుతుందని వెల్లడించారు. అందుకే ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారని, ఇదే బాటలో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
కోపంతో నా ఫ్రెండ్ ముక్కు పగులగొట్టా: ఒబామా
న్యూయార్క్ : చిన్నతనంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఓ స్నేహితుడి ముక్కు పగులగొట్టానన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో జరిగిన ఆడియో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఎపిసోడ్ మంగళవారం విడుదలైంది. 13 నిమిషాల ఆ ఆడియో ఇంటర్వ్యూ ఎపిసోడ్లో స్నేహితుడితో జరిగిన గొడవ గురించి ఒబామా మాట్లాడుతూ.. ‘‘ నేను స్కూల్లో చదువుతున్న సయమంలో నాకో ఫ్రెండ్ ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఫుట్‌బాల్ ఆడేవాళ్లం. ఓ రోజు మా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ సమయంలో అతడు నాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఓ పదం అంటూ నన్ను కించపరిచేలా మాట్లాడాడు. అసలతడికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఆ పదం ప్రయోగించి నన్ను బాధపెట్టాలనే ఉద్ధేశ్యం తప్ప. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. మూతి మీద గట్టిగా కొట్టాను. అతడి ముక్కు పగిలిపోయింది. ఇంకోసారి నన్నలా పిలవొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.’’ అని చెప్పుకొచ్చారు. చదవండి : నేపాల్ ప్రధానికి సుప్రీం షాక్ అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు -
బైడెన్ టీంలోకి వినయ్ రెడ్డి..!
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలోకి మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చేరారు. వినయ్ రెడ్డి, గౌతమ్ రాఘవన్‌లకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తనకు దీర్ఘ కాలంగా సహాయకుడిగా ఉన్న వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్ రాఘవన్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రాఘవన్ వైట్‌హౌస్‌లో సీనియర్ అధికారిగా విధులు నిర్వహించారు. ఇక వినయ్ రెడ్డి, రాఘవన్‌లతో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్‌లో చోటు కల్పించారు. వీరిలో గతంలో ఒబామా టీమ్‌లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉండగా.. ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్, మేనేజ్మెంట్.. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్‌కు డైరెక్టర్ ఆఫ్ షెడ్యూలింగ్ అండ్ అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్‌తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్, ఎలిజబెత్ విల్‌కిన్స్‌ని చీఫ్ స్టాఫ్ సీనియర్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు. ఇప్పటికే కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బైడెన్ తన టీమ్‌లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!) ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ‘నూతనంగా నియమితులైన అధికారులు తనతో కలిసి పాలసీలను రూపొందించడంలో.. అమెరికాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని’ వెల్లడించారు. రాఘవన్ గతంలో ఒబామా వైట్‌హౌస్ బృందంలోనూ సేవలందించారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్‌లోనూ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. వినయ్ రెడ్డి బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్‌గా పనిచేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. -
కూతురి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పిన ఒబామా
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తను తాజాగా రాసిన పుస్తకం ‘ ఏ ప్రామిస్డ్ లాండ్’ను ప్రమోట్ చేసుకోవటంలో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి హోం క్వారెంటైన్లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా కుటుంబాల్లోలానే మేము కూడా ఓ నెల ఆటలు ఆడుకుంటూ, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ సరదాగా గడిపాము. మాలియా బాయ్‌ఫ్రెండ్ కూడా మాతో ఉన్నాడు. రాత్రి పూట కూడా ఆటలు ఆడుకునేవాళ్లం. కొద్దిరోజులకే వారు బోర్‌గా ఫీలయ్యారు. అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్‌ఫ్రెండ్‌కు కార్డ్సు(పేకలు) కూడా నేర్పించాను. మాలియా బాయ్‌ఫ్రెండ్ బ్రిటీష్ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట నాకతడు నచ్చలేదు. కానీ, చాలా మంచి వ్యక్తి. మగపిల్లల తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మా ఇంటి నిత్యావసరాల ఖర్చు 30 శాతం పెరిగింది.’’ అని అన్నారు. (నాకు మరణశిక్ష విధించినా సరే..) కాగా, ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను ఒబామా నెమరువేసుకున్నారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. -
వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. (వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్) అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా 43వ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాకు వెల్లడించారు. అటు టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ చెప్పారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ఆధారంగా అధ్యక్షుడు క్లింటన్ టీకాను తీసుకుంటారన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే, తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా టీకా తీసుకుంటానని మరో మాజీ అధ్యక్షుడు ఒబామా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మరో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి తరువాత ప్రజల విశ్వాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బుష్ తల్లిదండ్రులు దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు. అలాగే 2005 లో కత్రినా హరికేన్ ప్రభావానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల ప్రజల సహాయార్థం జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ క్లింటన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. -
రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు."ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే ప్రజలతో (భారతదేశం) పరిపూర్ణ పరిమాణం కారణంగా భారత్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది" అని ఒబామా తన తాజా పుస్తకంలో భారతదేశంపై తనకు గల ఇష్టాన్ని చెప్పుకొచ్చారు. 2010లో తన అధ్యక్ష పర్యటనకు ముందు వరకు తాను భారతదేశానికి వెళ్ళలేదని.. కాకపోతే ఆ దేశం గురించి తన మదిలో ఎప్పుడు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు ఒబామా. "నా బాల్యంలో కొంత భాగం ఇండోనేషియాలో రామాయణం మహాభారతం పురాణ హిందూ కథలు వింటూ గడపడం వల్లనో.. తూర్పు మతాల పట్ల నాకున్న ఆసక్తి కారణంగానో.. పాకిస్తానీ, భారతీయ కళాశాల స్నేహితుల బృందం కారణంగా కావచ్చు. వారి వల్ల నాకు పప్పు, కీమా వండటం అలవాటయ్యింది. బాలీవుడ్ సినిమాలకు ఆకర్షితుడిని అయ్యాను" అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. (చదవండి: అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ ఈ రోజు విడుదల అయ్యింది. (ప్రామిస్డ్ ల్యాండ్: ‘సారా పాలిన్ ఎవరు?’) -
బైడెన్ గెలుపును ఇకనైనా ఒప్పుకో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారని, ఈ ఫలితాన్ని ఇక ఎవరూ మార్చలేరని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని వీడాలని సూచించారు. బైడెన్ గెలుపును ఒప్పుకోవాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. బైడెన్ గెలుపును అధికారికంగా అంగీకరించకుండా ట్రంప్ మొండికేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే తాను ఓడిపోయానని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటం సాగిస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో బైడెన్ గెలిచారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని ఒబామా తాజాగా వ్యాఖ్యానించారు. -
ఇకనైనా ట్రంప్ ఓటమిని అంగీకరించాలి: ఒబామా
-
ప్రామిస్డ్ ల్యాండ్: ‘సారా పాలిన్ ఎవరు?’
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రాజకీయ అనుభవాల గురించి వెల్లడించిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం మార్కెట్లోకి రాకముందే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల గురించి ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ఈ పుస్తకంలోని మరి కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున ఒబామా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ని తన సహచరుడిగా ఎన్నుకోవడం పట్ల పడిన ఆందోళన గురించి ఇందులో రాసుకొచ్చారు. ఎక్కువగా మాట్లాడడు.. స్వీయ అవగాహన లేదు.. ఇద్దరం చాలా వేర్వేరుగా ఉండే వాళ్లం. కానీ అతడి మంచి మనసు, విదేశాంగ విధానం, కష్టపడి పని చేసే స్వభావం అనతి కాలంలోనే అతడిపై నా అభిప్రాయాన్ని మార్చేశాయి అనితెలిపాడు. ఇక 2008లో రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటి పడిన సారా పాలిన్ గురించి కూడా ఒబామా తన పుస్తకంలో వివరించారు. (రాహుల్ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా) ‘డెమొక్రాట్ల తరఫున జో బైడెన్‌ని ఉపాధ్యక్షుడిగా ప్రకటించాము. ఇక రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి ఎవరు బరిలో నిలవబోతున్నారో తెలుసుకునేందుకు నేను, బైడెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంతలో జాన్ మెక్కెయిన్ ఉపాధ్యక్ష పదవికి సారా పాలిన్‌ని ఎన్నుకున్నట్లు తెలిసింది. దీని గురించి బైడెన్‌కి మెసేజ్ చేశాను. సారా పాలిన్ ఎవరు అంటూ బైడెన్ నన్ను అడిగారు’ అని తన పుస్తకంలో వివరించారు ఒబామా. ఇక పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ప్రకటించడం పట్ల తాను కొంత ఇబ్బంది పడినట్లు ఒబామా వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో పాలిన్ ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారని.. ఆమె ఎందరో ఓటర్లని ప్రభావితం చేయగలదని మొదట తాను భావించానన్నారు ఒబామా. అయితే అతి త్వరలోనే పాలిన్ గురించి తాము మరీ అంత కలత చెందాల్సిన అవసరం లేదని.. దేశాన్ని పాలించే అంశాల గురించి ఏ మాత్రం అవగాహన లేదనే విషయం పాలిన్ మాటల్లో ధ్వనించేది అన్నారు ఒబామా. ‘పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడంలో అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే ఇది దేశ రాజకీయాల దిశను మార్చింది. పాలిన్ అసమర్థత రిపబ్లికన్ పార్టీని "లోతైన స్థాయిలో ఇబ్బంది పెడుతోంది ... అయితే దీని గురించి చాలా మంది రిపబ్లికన్లకు పట్టింపు లేదు." ఆమె సమస్యల పరిజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తే "ఉదారవాద కుట్రకు రుజువుగా" ప్రచారం చేశారు’ అని ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు. (ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్) అయితే దీనిపై స్పందిస్తూ పాలిన్ శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో ఒక కామెంట్ పోస్ట్ చేశారు. ఇక దీనిలో ఆమె రిపబ్లికన్ రాజకీయాలను తీర్చిదిద్దినందుకు ఒబామాకు కృతజ్ఞతలు తెలుపుతూ, "గత పన్నెండు సంవత్సరాలుగా నేను మీ తలలో అద్దె లేకుండా ఉచితంగా జీవించానని తెలుసుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు పాలిన్. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్‌ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
వైరల్.. ఓటరుతో ఒబామా ముచ్చట..!
వాషింగ్టన్: అమెరికా నివాసి అలిస్సాకు అనుకోని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ తీవ్ర ఉద్వేగానికి గురి చేసింది. కొద్దిసేపు ఆమె కాళ్లు చేతులు ఆడలేదు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తేరుకున్న తర్వాత కలా నిజమా అంటూ తనను తానే గిల్లి చూసుకుంది. నిజమని తేలడంతో ఫుల్లు ఖుషీ అయ్యింది. అలిస్సాను ఇంతలా టెన్షన్ పెట్టిన ఆ కాలర్ ఎవరంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అవును ఆయనే అలిస్సాకు కాల్ చేశారు. డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేయాల్సిందిగా కోరారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా అలిస్సా ఎనిమిది నెలల కుమారుడు ఏడుపు లంకించుకున్నాడు. ఎందుకంటే ఒబామాతో మాట్లాడటానికట. దాంతో మాజీ అధ్యక్షుడు ఆ చిన్నారిని ఎలా ఉన్నావ్ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ) కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దాంతో ఒబామా ఇలా ఫోన్లోనే బైడెన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఫోన్ బ్యాంకింగ్ అంటారు. దానిలో భాగంగా అలిస్సాకు కాల్ చేశారు. ఇక తనకు ఒబామా కాల్ చేశాడని తెలియడంతో అలిస్సా ఆశ్చర్యంతో ఒకింత ఆందోళనకు గురవుతారు. బైడెన్, కమలా హారిస్‌కు ఓటు వేయడానికి తాను ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నాని అలిస్తా ఒబామాతో అంటారు. అలానే బైడెన్‌కు ఓటు వేయాల్సిందిగా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పమని ఒబామా ఆమెను కోరారు. అవసరమైతే ఆమె పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా తెలియజేస్తాను అన్నారు. వీరి సంభాషణ కొనసాగుతుండగా చిన్నారి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. (చదవండి: బైడెన్ కోసం బరాక్ ప్రచారం) దాని గురించి ఒబామా అలిస్సాను ప్రశ్నించగా.. ఎనిమిద నెలల తన చిన్నారి జాక్సన్ ఏడుస్తున్నాడని.. ఎవరైనా కాల్ చేస్తే తను కూడా వారితో మాట్లాడాలని ఏడుస్తాడని తెలిపింది. దాంతో ఒబామా హాయ్ జాక్సన్.. ఏం జరుగుతుంది అని పలకరిస్తారు. ఆ తర్వాత చిన్న బిడ్డ తల్లిని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేస్తారు. 2016 ఎన్నికల సమయంలో కూడా ఒబామా హిల్లరీ క్లింటన్ తరఫున రెండు నెలల పాటు ప్రచారం చేశారు. -
వైరల్ : ఒబామా అదరగొట్టాడు!
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. వీలైనంత ఎక్కువ సమయం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తరుపున ప్రచారంలో గడుపుతున్నారు. శనివారం నాటి ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని ఓ స్కూల్‌కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ ఆటలో తన ప్రతిభను బయటపెట్టారు. అక్కడి జిమ్‌లోని బాస్కెట్ బాల్ కోర్టులోకి అడుగుపెట్టి బాల్‌ను నెట్లో పడేలా వేశారు. ( కొంపముంచిన ట్రంప్.. 700 మంది మృతి ) ఆ వెంటనే ‘నాకు ఇంతే వచ్చు!’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న ప్రముఖులు, సామాన్యులు ఒబామా ప్రతిభను మెచ్చుకున్నారు. -
చైనాతోనే అమెరికాకు ముప్పు: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా చైనాతోనే అగ్రరాజ్యం అమెరికాకు నంబర్ వన్ ముప్పని భారత్-అమెరికా రిపబ్లికన్ రాజకీయ నాయకురాలు నిక్కీహేలీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరపున భారత్-అమెరికా మాజీ రాయబారి హేలీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా యుద్ధ భూమియైన ఫిలడెల్పియాలో ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో శనివారం ఏర్పాటు చేసిన సభలో హేలీ మాట్లాడుతూ... బీజింగ్, అమెరికా మేధో శక్తిని దొంగలించకుండా ట్రంప్ చూశారన్నారు. ట్రంప్ చైనాను దృష్టిలో పెట్టుకోవడం వల్లే డ్రాగన్ ఉచ్చులో అమెరికా పడలేదన్నారు. ప్రస్తుతం చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. చైనాతో జరిగిన ఒప్పందంలో ట్రంప్ ఉత్తమైన వాణిజ్య ఒప్పందం పొందడమే కాకుండా, మేధో సంపత్తితో చైనాను దృష్టిలో పెట్టుకున్నారని హేలీ వ్యాఖ్యానించారు. (చదవండి: షాకింగ్: బైడెన్‌ని హత్యచేయాలనుకున్నాడు) ప్రస్తుతానికి చైనా మన మేధో శక్తిని దొంగలించకుండా చూసినా.. భవిష్యత్తులో మనమంతా చైనాకు జవాబుదారితనంగా ఉండొచ్చని ఆమె హెచ్చరించారు. అయితే కరోనా వైరస్ కారణంతో పాటు, ఇండో పసిఫిక్, హాంకాంగ్, వాణిజ్య ఒప్పందాల కారణంగా చైనా-అమెరికా సంబంధాలు క్షీణించాయి. అనంతరం హేలీ డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్‌పై ఆమె విరుచుకుపడ్డారు. అదే విధంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనపై కూడా ఈ సందర్బంగా విమర్శలు గుప్పించారు. ఒబామా పరిపాలన ఉగ్రవాదానికి పోషణగా ఉందని ఆమె ఆరోపించారు. ‘బిడెన్ ఆధ్వర్యంలోని గత పాలనలో మిలియన్ డాలర్లతో నిండిన విమానాలను ఒబామా ఉగ్రవాదాని పోషించేందుకు స్పాన్సర్ చేశారన్నారు. ఆ నగదుతో యెమెన్, లెబనాన్, సిరియా, ఇరాక్ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 3న అమెరికాలో అధ్యక్షలు ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!) -
బైడెన్ కోసం బరాక్ ప్రచారం
మకాన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం డెమొక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియా, ఫిలిడెల్ఫియాల్లో ఈనెల 21న బైడెన్, కమలా హారిస్ తరఫున ఒబామా ప్రచారం సాగిస్తారని బైడెన్ ప్రచార బృందం ప్రకటించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు మార్లు బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఒబామా నేరుగా ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ర్యాలీల్లో ప్రజలను పెద్దపెట్టున ఆకర్షించే సత్తా డెమొక్రాట్లలో ఒబామాకే ఉందని పరిశీలకుల అంచనా. తన కారణంగా బైడెన్‌కు బ్లాక్ అమెరికన్లు, తటస్థుల మద్దతు పెరగవచ్చని భావిస్తున్నారు. అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఒబామా ఇటీవల పిలుపునిచ్చారు. కరోనాపై ట్రంప్ నిర్లక్ష్యాన్ని ఒబామా గతంలో నిశితంగా విమర్శించారు. -
ఒబామా ఫోటోగ్రాఫర్‌కు అంతర్జాతీయ అవార్డ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పీట్ సౌజాకు ది వే ఐ సీ ఇట్ చిత్రానికి 45 టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. అయితే పీట్ సౌజా గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వ్యక్తిగత, వైట్ హౌస్ ఫోటోగ్రాఫర్‌గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. కాగా పీట్ సౌజా మే 2019 సంవత్సరం హైదరాబాద్ పర్యటనలో అమెరికన్ ఫిల్మ్ మేకర్ డాన్ పోర్టర్ డాక్యుమెంటరీని రూపొందించారు. అయితే గతంలో బ్రాండ్ ఒబామాను మీరు ప్రమోట్ చేశారా అన్న ప్రశ్నకు సౌజా స్పందిసూ ఒబామా పాలనలో రాజకీయ, సామాజిక అంశాలను దృష్య రూపంలో చూపెట్టినట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఫోటోగ్రాఫర్‌ను మాత్రమే కాదని తన కెమెరా పనితనం చారిత్రక అంశాలతో ముడిపడి ఉంటుందని సౌజా పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం వైట్ హౌస్ జర్నలిస్ట్లుల పై ఏ విధంగా స్పందిస్తుందని సౌజాను అడగగా జర్నలిస్టుందరూ నిరాధార వార్తలు రాస్తున్నారంటూ ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ది వే ఐ సీ ఇట్ చిత్రంబపై సౌజా స్పందిస్తు ఇందులో బరాక్ ఒబామా ప్రెసిడెంట్‌గా, వ్యక్తిగా విభిన్న కోణాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయని పీట్ సౌజా పేర్కొన్నాడు. (చదవండి: ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) -
అమెరికాలో ‘కమల’ వికాసం
జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది. భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్‌ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్‌లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. భయం లేని పోరాటయోధురాలు: బైడెన్ కమలా హ్యారిస్‌ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్‌ని ఓడించబోతున్నాం. హ్యారిస్‌కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు. ఒబామా సలహా మేరకే ! కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్‌గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్‌ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్‌గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. కమలా ఎంపికకి కారణాలివే ! అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్‌గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి. వారి ఓట్లే కీలకం అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్‌కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి. అమ్మ చెప్పిన మాట ‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్‌గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు. నేను అమెరికన్నే కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్‌గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సెనేట్‌లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్గానే హ్యారిస్ చెప్పుకుంటారు. అధ్యక్షురాలు కావాలని కలలు సెనేటర్‌గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్‌ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల. ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు. తల్లి శ్యామలతో కమల (ఫైల్) -
సెనెటర్ శారమ్మ
ఇంకా సెనెటర్ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం. మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్.లోని మైన్ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్ ‘సెనెటర్’గా! సెనెటర్‌గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్) శారాను సెనెట్‌కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం. తర్వాత 2016లో అదే సభకు స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మైన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా సెనెట్‌లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్ సెనెటర్ 67 ఏళ్ల సుజేన్ కాలిన్స్‌ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్ సెనెట్‌లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్ సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్.లోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్ ఐలాండ్‌లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్ దగ్గర ఇంటెర్న్‌గా ఉన్నారు. తర్వాత మైన్స్టేట్లోని ఫ్రీపోర్ట్ టౌన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్‌లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్మెంట్లో రాశారు. శారా సెనెటర్‌గా ఎన్నికైతే కమలా హ్యారిస్ తర్వాత సెనెటర్ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్ లాయర్. భర్త, పిల్లలతో శారా -
వణికిన ట్విట్టర్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షకు పైగా డాలర్లు సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారంటే బిట్‌కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్వర్డ్లు తెలుసుకొని మెసేజ్‌లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: వలస వ్యతిరేక ఎజెండాతో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉన్న 6.50 లక్షల యువ వలసదారులకు ప్రభుత్వపరమైన రక్షణల రద్దుకు ట్రంప్ చేస్తున్న యత్నాలకు బ్రేక్ పడింది. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ) తీసుకువచ్చింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించారు.తాజాగా డీఏసీఏ విధానం అక్రమమనీ, దీనిపై సమీక్షించేందుకు కోర్టులకు అధికారం లేదని ట్రంప్ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనను ప్రధాన జడ్జి జాన్ రాబర్ట్స్, మరో నలుగురు జడ్జీలు తిరస్కరించారు. ‘డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన
జార్జి ఫ్లాయిడ్ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్డెన్, ఫ్లింట్ వంటి నగరాల్లోని పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది. రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది. అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్ న్యాయ విభాగం, ఫెడరల్ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు. కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్‌ఫోర్స్’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్షిప్ కాన్ఫరెన్స్ అభివృద్ది చేసిన టూల్ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్‌లో ఒక నిబద్ధత కలిగిన సైట్‌ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది. బరాక్ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు -
ఒబామా అసమర్థుడు : ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసలే తనపై ఈగ వాలినా సహించని ట్రంప్ ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒబామా అసమర్థుడని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒబామాను అసమర్థ అధ్యక్షుడుగా అభివర్ణించారు. అంతకుమించి ఏమీ చెప్పలేను అని వ్యాఖ్యానించారు. కాగా శనివారం నాడు ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. (ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయన వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా అమెరికాలో ఇప్పటివరకు 14,84,804 కరోనా కేసులు నమోదవగా 89,399 మరణించారు. (కరోనా పోరులో ట్రంప్ విఫలం) -
ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 75,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు. చదవండి: భారతీయులు భళా: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్‌చార్జ్‌లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ' ఒబామా విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించిన విషయం తెలిసిందే. చదవండి: వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో -
కరోనా పోరులో ట్రంప్ విఫలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్‌హౌస్‌లో తనతో కలిసి పనిచేసిన సిబ్బందితో శుక్రవారం రాత్రి ఒబామా మాట్లాడారు. దీనిని అమెరికా మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. సమర్థవంతమైన పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం కత్తి మీద సామేనని, అలాంటిది నాకేంటి అన్న ధోరణిలో అధ్యక్షుడు ఉండడంతో అగ్రరాజ్యం కొంప మునిగిందని ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వచ్చే ముప్పేమీ లేదని ఫిబ్రవరిలో వాదించిన ట్రంప్, మార్చికల్లా అది ఎంతో ప్రమాదకరమైందని అన్నారని ఇలా ఊగిసలాట ధోరణిలోనే ఆయన కాలం గడిపేశారని విమర్శించారు. కరోనాని ట్రంప్ ఎదుర్కొన్న తీరు ఈ విపత్తుని మరింత గందరగోళానికి గురి చేసి అందరిలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపిందని ఒబామా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్‌లో జరగనుండగా ట్రంప్‌పై డెమొక్రాట్ అయిన ఒబామా తీవ్రంగా విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. వైట్‌హౌస్ సభ్యులతో మాట్లాడుతూ ఒబామా పదే పదే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతునివ్వాలని కోరారు. క్వారంటైన్లో వైట్‌హౌస్ సిబ్బంది వైట్‌హౌస్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిలో ముగ్గురు క్వారంటైన్లోకి వెళ్లారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫాసీతో పాటు మరో ఇద్దరు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లారు. ► కరోనాతో అమెరికాలో 24 గంటల్లో 1,568 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80 వేలకి చేరువలో ఉంది. ళీ దక్షిణ కొరియా ఆంక్షలు సడలించడంతో నైట్ క్లబ్స్‌కి వెళ్లిన 50 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం క్లబ్బులను మూసివేయాలని వెంటనే ఆదేశాలిచ్చింది. ► చైనాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. వూహాన్లో కూడా ఒక కేసు నమోదు అయింది. చైనాలో ఏప్రిల్ 28 తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ► రష్యాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. గత 24 గంటల్లోనే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. -
ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్
న్యూయార్క్ : మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శల దాడి మొదలుపెట్టారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఒబామా ఆరోపించారు. గత శుక్రవారం తన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో ఒబామా వెబ్ కాల్ ద్వారా మాట్లాడారు. ఈ వెబ్ కాల్ ఆడియో కాస్తా లీకైంది. ఈ లీకైన వెబ్ కాల్ ఆడియోలో.. మైకేల్ ఫ్లైన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థను దిగజార్చిందని ఒబామా అన్నారు. ( ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు.. ) నవంబర్ ఎన్నికలలో ట్రంప్‌పై గెలిచేందుకు తనతో కలిసి, జోయ్ బైడెన్ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాలని తన మాజీ ఉద్యోగులను ఆయన కోరారు. స్వార్థం, అనాగరికం, విభజించి పాలించటం, ఇతరులను శత్రువులుగా చూసే పద్ధతులతో పోరాడుతున్నామని, ఇవన్నీ అమెరికా పౌరుల జీవితంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే అమెరికా కరోనాను అడ్డుకునే విషయంలో విఫలమైందని అన్నారు. -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్‌ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్‌కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్‌హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్‌హోవర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్‌కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్‌తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్‌తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్‌కు ప్రకటించారు. -
ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్, అతని కుమార్తె గియానా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బ్రియాంట్, గియానా మృతిపై ప్రపంచంలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రియాంట్ మృతి పట్ల ట్రంప్‌తోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బ్రియాంట్కు నివాళులర్పిస్తూ.. ట్రంప్ చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గొప్ప బాస్కెట్‌బాల్ ఆటగాళ్లలో బ్రియాంట్ ఒక్కరిగా నిలిచిపోతారు. బ్రియాంట్కు కుటుంబం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తుపై అతనికి బలమైన నమ్మకం, ప్రేమ ఉండేది. బ్రియాంట్‌తో పాటు అతని కుమార్తె గియానా కూడా ఈ ప్రమాదంలో మరణించడం మరింత బాధను పెంచింది. మెలానియాతో పాటు నేను.. బ్రియాంట్ భార్య వెనెస్సాకు, అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. దేవుడు వారితో ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందే ట్వీట్ చేసిన ఒబామా బ్రియాంట్ మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. అలాగే తన భార్య మిషెల్‌తోపాటు తన తరఫున వెనెస్సాతోపాటు బ్రియాంట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయతే ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు.. ఒబామా, ట్రంప్ ట్వీట్ల మధ్య సారూప్యత ఉందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొద్దిపాటి మార్పులతో ఒబామా ట్వీట్‌ను ట్రంప్ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్లను షేర్ చేస్తూ ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ ఒబామా కాలేరు.. కనుక ఇలాంటి పనులను ఆపేయండి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. Kobe Bryant, despite being one of the truly great basketball players of all time, was just getting started in life. He loved his family so much, and had such strong passion for the future. The loss of his beautiful daughter, Gianna, makes this moment even more devastating.... — Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020 Kobe was a legend on the court and just getting started in what would have been just as meaningful a second act. To lose Gianna is even more heartbreaking to us as parents. Michelle and I send love and prayers to Vanessa and the entire Bryant family on an unthinkable day. — Barack Obama (@BarackObama) January 26, 2020 -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్బీఏకు తీరని లోటని తెలిపింది. ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ దిగ్గజ ఆటగాడి మృతితో యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ దిగ్గజ క్రీడాకారుడి మరణావార్త విని అమెరికా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడి అన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు అతడి మరణవార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా అనేకచోట్ల అతడికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్‌లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచాడు. -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్‌లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్‌బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్‌బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్‌తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్‌బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్‌ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
ఒబామాను వదిలేద్దామనుకున్నా: మిచెల్
వాషింగ్టన్ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిచెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
నిర్మాతలుగా ఒబామా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ‘నెట్‌ఫ్లిక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్ నిర్మించి నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్ గ్రౌండ్ ప్రొడక్షన్స్’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. -
న్యూజిలాండ్ ప్రధానికి ఒబామా పాఠాలు
ఆక్లాండ్ : బరాక్ ఒబామా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడి గానే కాకుండా గొప్ప తండ్రి అని ప్రపంచానికి తెలుసు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కుమార్తెలు మాలియా, సాశాలను సాధారణ తండ్రిలాగే పెంచారు. అధ్యక్షుని బిడ్డలమనే గర్వం కూడా వారిలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒబామా కూతుళ్లు ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఎలా పెంచాలో ఒబామాకు బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతూ ఉండేవారు. అధ్యక్ష పదవి కాలం ముగిసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న ఒబామా అప్పుడప్పుడు ప్రజలకు అవసరమయ్యే ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా న్యూజిలాండ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒబామా.. ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్‌కు పిల్లల పెంపకంపై పాఠాలు చెప్పారు. జెసిందా గత జూన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒబామా చెప్పిన సూచనలు తనకు, తన బిడ్డ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని కివీస్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. -
ఒబామా మాటలు – ముత్యాల మూటలు
అవలోకనం ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కనబడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసుకున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లాడటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచం గుర్తించి గౌరవించే మేధావి. వీరిద్దరూ విఫల నేతలేనని కొందరనుకుంటారు. అందుకు ఒక కారణం ఉంది. మన్మోహన్ వలే జనాకర్షణ శక్తిగానీ, సొంతబలంగానీ లేకపోవడం... ఒబామాలా జాతిపరంగా మైనారిటీ నేతలన్న భావం వీరిపట్ల ఉండటం ఆ కారణమని నేననుకుంటాను. అయితే ఈ నాయకులిద్దరూ ఇతర నేతల్లా తరచు మాట్లాడకపోవచ్చుగానీ చాలా తెలివైన వారు. వారు మాట్లాడినప్పుడు వినడం అనివార్యంగా మనకు ప్రయోజనకరమవు తుంది. కొన్ని రోజులక్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీకి ఒబామా అద్భుత మైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సామాజిక మాధ్యమాల గురించి, ఆధునిక ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. ఉమ్మడి ప్రయోజనాలుండే వారందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడానికీ ఈ మాధ్యమాలు నిజంగా శక్తివం తమైన ఉపకరణాలన్న సంగతిని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇలాంటి వారంతా ఏ పబ్‌లోనో, ప్రార్థనాలయం వద్దనో, మరెక్కడైనా కలుసుకోవాలి. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు గల కారణం కూడా చెప్పారు. ‘ఇంటర్నెట్లో ఏర్పడ్డ సంబంధాల్లో అంతా సూక్ష్మంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ ముఖాముఖీ కలిసినప్పుడు మాత్రమే అవ తలివారెంత సంక్లిష్టమైనవారో అర్ధమవుతుంది’ అని ఆయన వివరించారు. ‘ఇంటర్నెట్తో ఉన్న మరో ప్రమాదమేమంటే తమకు దానిద్వారా పరిచయమయ్యే వారిలో వేరే రకమైన వాస్తవాలు దాగి ఉండొచ్చు. పర్యవసానంగా వారు తమ కుండే దురభిప్రాయాలను బలపర్చుకునే సమాచారంలోనే కూరుకుపోతారు’ అని కూడా ఒబామా అభిప్రాయపడ్డారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించే తీరుకు సంబంధించి ఆయనొక ముఖ్యమైన, అవసరమైన విషయాన్ని పట్టుకున్నారని నాకనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఏ సామాజిక మాధ్యమాల్లో లేను. ఎందుకంటే అవి మన ఏకాగ్రతను భంగపరుస్తాయి. నా ఆన్లైన్ వ్యాసాలపై వచ్చే వ్యాఖ్యలను గమనించినప్పుడు నా మనసెంతో వ్యాకులపడుతుంది. ఆ వ్యాఖ్యల్లో కనబడే ఆగ్ర హమూ, దుర్మార్గమూ, మితిమీరిన భాష గమనిస్తే ఎవరినైనా దూరం పెట్టక తప్ప దనిపిస్తుంది. ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కన బడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసు కున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లా డటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరు స్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. ఒబామా చెప్పిన మరో ముఖ్యాంశమేమంటే మనం ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటే తప్ప లేదా కోరుకుంటే తప్ప అతడు/ఆమె వైఖరేమిటో మనకు తెలిసే అవకాశం లేదు. నిజజీవితంలో ఎవరితోనైనా మనం వ్యవహరిస్తున్నప్పుడు వారు చెప్పేది కూడా మనం విని తీర వలసి వస్తుంది. అది మన నిశ్చయాన్ని, మన ప్రతికూల అభిప్రాయాలను పల్చ బారుస్తుంది. ఒబామా మనకిచ్చిన లోచూపు నుంచి మనం కొన్నిటిని గ్రహిం చవచ్చు. అందులో మొదటిది–తమ పని ద్వారా మార్పునాశించే క్రియాశీలవా దులు, రాజకీయ నాయకులు ఇంటర్నెట్ ద్వారా కాక నేరుగా ప్రజలను కలుసు కోవాలి. వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలి. నేను పనిచేసే చోటుకు కొన్ని వారాల క్రితం దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వచ్చారు. ఆయన తన దృక్కో ణాన్ని, ఆశలను వివరించారు. ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అది తన స్వల్ప కాల లక్ష్యమేమీ కాదని, పదిపదిహేనేళ్లుగా అందులో విజయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బలంగా ఉండే గుజరాత్‌లాంటి రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా సులభంగా నెగ్గుతానని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండరు. పైగా ఆయనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎన్నికల గుర్తు లేదు. కేవలం తన సొంత విశ్వసనీయతే ఆధారం. మరి ఇదెలా సాధ్యమైంది? తెలివిగా మాట్లాడటం, ఒప్పించే గుణం ఉండే ప్రసంగాలు చేయ డం... వేలాదిమందిని వ్యక్తిగతంగా కలవడం వల్లే మేవానీ గెలుపు సాధించగలి గారని నేననుకుంటున్నాను. నావంటి మానవ హక్కుల కార్యకర్త కూడా ఇదేవిధంగా జనాన్ని కలుసు కోవాలి. ఇది నేనెందుకు చెబుతున్నానంటే క్రియాశీల ప్రపంచం సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతుంది. దానిద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు చేరువ కావొచ్చునన్నది అందులో పనిచేసేవారి అభిప్రాయం. కానీ ఒబామా చెప్పినట్టు ఆ మాధ్యమాలు కృత్రిమంగా విభజితమై ఉంటాయి. నిరాదరణకు లోనయ్యే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు లేదా కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పనిచేసే వారికి మీరు సైనికుల హక్కుల గురించి మాట్లాడరేమన్న ప్రశ్న తరచుగా ఎదుర వుతుంది. ఇంటర్నెట్లో అయితే ఇలాంటి తప్పుడు ద్వంద్వాలను సులభంగా కొనసాగేలా చూడొచ్చు. ముఖాముఖీలో అవతలి వ్యక్తి ఆందోళనల్ని కొట్టిపారే యడం అంత సులభం కాదు. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిరాశ పడనవసరం లేదని (తరచు నాకు అలా అనిపిస్తుంటుంది) ఒబామా అంతర్దృష్టి చెబుతుంది. అంతమాత్రాన సామాజిక మాధ్యమాలు ఉత్త చెత్త అని ఒబామా అన్నారని మనం అర్ధం చేసుకోకూడదు. ‘బహుళ విధ స్వరాలను అనుమతించేలా, అదే సమయంలో సమాజంలో చీలికలు తీసుకు రాకుండా, ఒక ఉమ్మడి భూమికను కనుగొనేలా రూపొందడం కోసం మనం ఈ సాంకేతికతను ఎలా నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నదే ప్రశ్న’ అని ఆయన చెప్పిన సంగతిని గుర్తుచేసుకోవాలి. అత్య ద్భుతమైన ఈ మాటలు మన దేశానికి ఎంతో కీలకమైన ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోదగ్గవి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఒబామా
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ట్రెండింగ్‌గా ఉండేందుకు ఒబామా ప్రయత్నించేవారు. అలాగే అధ్యక్ష పదవినుంచి వైదొలిగిన తరువాత కూడా ఆయన వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇతర మాజీ అధ్యక్షులకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తాజాగా.. 2017లో తనకు నచ్చిన పుస్తకాలు, పాటల టాప్-12 జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఫిక్షన్ రచనలతో పాటు పలు రకాల రచనలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందులో మొదటి స్థానంలో నయోమి అల్డెర్మ్యాన్ రచించిన ‘ది పవర్’ నిలిచింది. అలాగే 2017లో తన మనసును చూరగొన్న పాటల జాబితాను ఆయన విడుదల చేశారు. ఇదిలావుండగా.. ఒబామా మనసుకు నచ్చిన పుస్తకాలు, పాటల జాబితాపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I️ CANT BELIEVE OBAMA SAID HAVANA WAS ONE OF HIS FAVORITE SONGS OF THE YEAR I️ AM REALLY CRUYING OH MY GOD DONT LOOKA T ME — camila (@Camila_Cabello) 31 December 2017 Obama posted his favorite songs of ‘17 and one of them was Broken clocks by @sza and since I also love that song i think we should just give this man a third term 🤷🏽♀️ — Lloyd (@unBRE_lievable) 1 January 2018 My goal is to someday have a book that I wrote on Obama’s reading list 🙏 https://t.co/HSVS2hcdjO — Brinley (@brinlliance1) 1 January 2018 -
విభిన్న నేత.. అసాధారణ వక్త..!
పిరమిడ్లలో కనుగొన్న మమ్మీలకు 1920లు, 30లలో అత్యంత ప్రాచుర్యం లభిస్తున్న కాలంలో, ప్రసిద్ధి పొందిన ఒక పాటలో తొలి పంక్తి ఇలా ఉండేది: ‘నేనొక మనిషితో డ్యాన్స్ చేశాను, అతడు ఒక బాలికతో డ్యాన్స్ చేశాడు, ఆమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌తో డ్యాన్స్ చేసింది’. ఈ వారం అలాంటి స్థితే నా అనుభవంలోకి వచ్చింది. ఈ శుక్రవారం బరాక్ ఒబామాతో కలిసి హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో నేను పాల్గొన్నాను. అద్భుతమైన వక్త, గొప్ప మేధావి అయిన ఒబామా నిజంగానే, చిన్న విషయాలను గుర్తుపెట్టుకుని వాటి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించే ప్రత్యేక వ్యక్తిగా నాకు కనిపించారు. గొప్ప రాజకీయవేత్తలకు అలాంటి సున్నిత విషయాలను ప్రస్తావించే సమయం ఉండదు మరి. కానీ అలాంటి వారిలో అతి గొప్ప వ్యక్తి అయిన ఒబామా ఈ విషయంలో కాస్త విభిన్నంగానే ఉన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు నిర్వాహకులు నన్ను ఒబామాకు పరిచయం చేశారు. ఒబామాతో గౌరవపూర్వకంగా కరచాలనం చేయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి కొద్దిమందిని ఆహ్వానించారు. ఆ అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని. మాలో ప్రతి ఒక్కరికీ బరాక్ ఒబామాతో ఫొటో దిగే అవకాశం వచ్చింది. సాధారణంగా తమ అసహనంతో, సుస్పష్టంగా కనిపించే చికాకుతో సెలబ్రిటీలు పాల్గొనే చిల్లరమల్లర కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. కానీ బరాక్ ఒబామా అలాంటివారు కాదు. ఈ సదస్సుకు హాజరైన తొంభైమందిలో ప్రతి ఒక్కరితో ఆయన ఒకటి లేదా రెండు మాటలను పంచుకున్నారు. మాలో ఎవరినీ అయన కలిసి ఉండలేదు కానీ ప్రతి ఒక్కరినీ తాము ప్రత్యేక వ్యక్తులుగా భావించేలా చేశారు. తనతో కరచాలనం చేస్తుండగా ఆయన నన్ను పలకరిస్తూ, నేను టై కట్టుకుని ఉండటాన్ని గమనించారు. ‘మీరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు, నేను కూడా టై ధరించి ఉంటే బాగుండేదని ఇప్పుడే భావిస్తున్నాను. ఫరవాలేదా? లేక నేను తప్పిదం చేశానా?’ అన్నారు ఒబామా. సదస్సు కొనసాగుతుండగా ఈ ప్రత్యేక వ్యక్తిలో మరో కోణాన్ని కనుగొన్నాను. తాను కోరుకోని ప్రశ్నలు కొన్నింటిని శ్రోతలు సంధించారు. కానీ ఆయన వాటిని జోక్‌గా తీసుకున్నట్లుగా కనిపించింది. కానీ ఆయన విషయాన్ని పక్కకు తప్పించి ప్రశ్నకు పూర్తి భిన్నమైన అంశంగురించి మాట్లాడారన్న విషయాన్ని మీరు కనుగొనేంతవరకు ఆ ప్రశ్నలకు పూర్తి సమాధానం చెబుతున్నట్లే కనిపించారు. నేను పలువురు ప్రభుత్వాధినేతలను ఇంటర్వ్యూ చేశాను. తమకు అసౌకర్యంగా భావించే అంశంపై మీరు లోతుగా ప్రశ్నిస్తున్నపుడు వారి ముఖం ఒకవైపునకు గుంజుకుపోవడం లేక వారి కళ్లు దొంగ చూపులు చూడటం మీరు స్పష్టంగా గమనించవచ్చు. కానీ బరాక్ ఒబామా అలాంటి వ్యక్తి కాదు. అనుచితమైన అంశంలోకి తనను లాగడానికి నేను ప్రయత్నించిన ప్రతి సమయంలోనూ ఒబామా నవ్వేసేవారు. ఎప్పుడైనా ఆయన కనుబొమలు ముడిపడవచ్చు కానీ అది శ్రోతలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించే ఒక కామిక్ ఉద్రేకానికి సంబంధించిన భంగిమగా మాత్రమే కనిపిస్తుంది. మైక్‌లు విఫలమైనప్పుడు సదస్సుకు భంగం కలిగింది కానీ, పప్పును ఎలా వండుతారు అనే చమత్కార ప్రశ్నను ఒబామా ఎదుర్కొన్నారు. మీరు వేసిన బలమైన పంచ్ ఎవరికైనా ఉద్రేకాన్ని తెప్పిస్తుందేమో కానీ ఒబామా విషయంలో అలా జరగదు. అలాంటి పరిస్థితిని కూడా ఒబామా చిరునవ్వుతోనే స్వీకరించారు. సత్వరం వివేకంతో వ్యవహరించే మాజీ అమెరికన్ అధ్యక్షుడిలాగా కాకుండా, నేను ఒక ఆహ్లాదభరితమైన కథను కూడా అల్లలేకపోయాను. అందుచేత మేం, గత సెప్టెంబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ సదస్సులో బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే ఎదుర్కొన్న దురవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి దగ్గు ముంచుకు రావటంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ‘అది అంత భయంకరమైనది కాదా మరి?’ అన్నారు ఒబామా... ‘ఏ రాజకీయనేత అయినా ప్రసంగించడానికి పూర్తిగా సిద్ధమైన దశలో ఉన్నట్లుండి గొంతు పెగలని స్థితి ఏర్పడితే అంతకుమిం చిన దురవస్థ మరొకటి ఉండదు’ అంటూ ఒబామా నిశ్శబ్దంగా నవ్వారు. బరాక్ ఒబామాను మాలో ఎవరైనా మళ్లీ కలవడం అసంభ వమే కావచ్చు. కానీ ఆయన కలిగించిన అపారమైన ప్రభావాన్ని మాత్రం కొందరు మర్చిపోలేరు. నామట్టుకు నాకు మహదానందం కలిగింది. పైగా మా ఇద్దరి సంభాషణ గురించి నేను ఇకపై కూడా కథలు కథలుగా చెప్పగలను. 1920ల నాటి ఆ సుప్రసిద్ధ గీతం ఈ పదాలతో ముగుస్తుంది. ‘సంతోషించు, సంతోషించు, హల్లెలూజా! స్త్రీలలో అత్యంత అదృష్టవంతురాలిని నేనే!’ ఈ పాటలో లింగాన్ని కాస్త మారిస్తే.. అది నేనే కావచ్చు! - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత పర్యటన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమత సహనం, వ్యక్తిగత మత విశ్వాసాల హక్కుల ఆవశ్యకతను భారత ప్రధాని మోదీతోనూ గతంలో ప్రస్తావించానని చెప్పారు. భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని ప్రశంసించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో, ఆ తరువాత ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ ప్రసంగించారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్‌ను మత ప్రాతిపదకన విభజించొద్దని సదస్సులో ఒబామా అన్నారు. ఇక్కడి ముస్లిం లు తాము భారతీయులమనే భావిస్తారని, ఈ నిజాన్ని మనసులో ఉంచుకోవాలన్నారు. మోదీతోనూ ప్రస్తావించా.. ‘ఓ దేశం మత ప్రాతిపదికన విడిపోవొద్దు. ఇదే విషయాన్ని మోదీకి, అమెరికా ప్రజలకు చెప్పా’ అని ఒబామా తెలిపారు. ‘2015లో భారత్కొచ్చినపుడు మోదీతో ఈ విషయమై మాట్లాడానన్నారు. ఆ సందర్భంలో మోదీ ఎలా స్పందించారని ప్రశ్నించగా, ఒబామా సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ఆ వ్యక్తిగత సంభాషణలను వెల్లడించడం తనకిష్టం లేదన్నారు. ‘ఇతర దేశాలకు భిన్నంగా భారత్‌లో ముస్లిం వర్గం ఎన్నో విజయాలు సాధించింది. తమను తాము భారతీయులుగా పరిగణిస్తూ ఈ దేశంలో అంతర్భాగంగా ఉంది’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపి ఏ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నానని తనను తాను ప్రశ్నించుకునే పౌరుడే కీలకమని పేర్కొన్నారు. ఓ నాయకుడు ఏదైనా చేయకూడనిది చేస్తుంటే, దాన్ని సమర్థిస్తున్నానో లేదో పౌరుడు ప్రశ్నించుకోవాలని సూచించారు. మత సామరస్యం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చేసినవి కావని, అమెరికా, యూరోప్‌ల్లోనూ పలు సందర్భాల్లో ఇవే విషయాలను చెప్పానని వివరణ ఇచ్చారు. ఆ విషయం పాక్‌కు తెలియదేమో... 9–11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాక్‌లోనే దాక్కున్న సంగతి ఆ దేశానికి తెలుసని నిరూపించే ఆధారాలు అమెరికా వద్ద లేవని ఒబామా అన్నారు. 2008లో ముంబైలో దాడుల తర్వాత ఉగ్ర స్థావరాలను నిర్మూలించాలని భారత్‌లాగే అమెరికా కూడా బలంగా కోరుకుందని, భారత్‌కు తమ నిఘా అధికారుల సేవలు అందించామని పేర్కొన్నారు. ట్వీట్ చేసేముందు జాగ్రత్త... సోషల్ మీడియా శక్తి ఏంటో తెలుసుకున్నాకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ట్వీట్లు, కామెంట్లు చేయాలన్నారు. టైపింగ్, స్పెల్లింగ్ దోషాలు ఎక్కువగా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ...‘పోస్ట్ చేసే ముందు నేను స్పెల్లింగ్, విరామ చిహ్నాలను సరిచూసుకుంటా. జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించాల్సిన అవసరం రాదు’ అని అన్నారు. పర్యావరణ మార్పు ఓ బూటకమని ట్రంప్ చేసిన ట్వీట్‌ను గుర్తుచేస్తూ.. కీలక విషయాలపై బాధ్యతా రాహిత్యంగా ట్వీట్ చేస్తే చర్చలకు తలుపులు మూసుకుపోతాయన్నారు. ప్రతి మీడియా సంస్థ తనదైన అభిప్రాయాలతో పనిచేస్తోందని అన్నారు. యువ నాయకుల శిక్షణపై దృష్టిసారిస్తా... 21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని నిర్ణయించేది భారత్–అమెరికాల సంబంధాలే అని ఒబా మా పేర్కొన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యువ నాయకులకు శిక్షణ ఇవ్వడంపైనే ఇకపై దృష్టిపెడతానన్నారు. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లోనే తనకు ఎక్కువ పని ఉంటుందని తెలిపారు. కాగా, బరాక్ ఒబామాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కలుసుకున్నారు. ఒబామాను మరోసారి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆ తరువాత రాహుల్ ట్వీట్ చేశారు. పప్పు బాగా చేస్తా... యువకుడిగా ఉన్నప్పుడు తనకు రూమ్ మేట్లుగా భారతీయులు, పాకిస్తానీయులు ఉండేవారని, వారి తల్లుల నుంచి పప్పు వండటం నేర్చుకున్నానని ఒబామా చెప్పారు. ఇప్పుడు తాను పప్పు బాగా చేస్తానని తెలిపారు. కీమా బాగానే వండుతానని, చపాతీలు చేయడం రాదని చెప్పారు . ‘ బుధవారం రాత్రి ఓ డిన్నర్‌కు వెళ్లా. అక్కడ పప్పు కూడా వడ్డిస్తున్నారు. దాని గురించి నాకు కొందరు వివరించే ప్రయత్నం చేశారు. కానీ నాకు పప్పు చేయడం వచ్చని, నా రూమ్మేట్ల తల్లుల నుంచి నేర్చుకున్నానని వారికి చెప్పా. పప్పు వండటం నేర్చుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే అనుకుంటున్నా’ అని ఒబామా సరదాగా వ్యాఖ్యానించారు. -
అయ్యో పప్పా.. నాకు కూడా తెలుసు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ మంది ఇష్టంగా తినే పప్పు కూర ఎలా చేయాలో తనకు తెలుసని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఒబామా ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో ఒబామా ముచ్చటించారు. ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా పేర్కొన్నారు. గురువారం హోటల్లో ఉన్న సమయంలో మిగతా వంటకాలతో పాటూ పప్పును ఓ వెయిటర్ తనకు వడ్డించారని ఒబామా తెలిపారు. అంతేకాకుండా పప్పు ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పారు. అది తనకు తెలుసని, తాను స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే ఓ ఇండియన్ రూమ్మేట్ ద్వారా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నానని ఒబామా చెప్పడం విశేషం. అంతేకాదు తాను కీమా కూడా బాగా చేస్తానని, చికెన్ కూడా వండటం వచ్చని తెలిపారు. మరి చపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు.. చపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు. -
ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు
వాషింగ్టన్ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా, మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (సీనియర్) జిమ్మీ కార్టర్లు శనివారం టెక్సాస్‌లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. డెమోక్రాట్ పార్టీ నుంచి బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మి కార్టర్లు, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్, జార్జి డబ్ల్యూ బుష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ (93) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్‌తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ఒకే వేదికపై అమెరికా మాజీ అధ్యక్షులు
వాషింగ్టన్: అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్ ఇర్మా, మరియా తుఫాను బాధితులకు చేయుతనిచ్చేందుకు ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికపై కలిశారు. తుఫాను బాధితులకు సాయంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గోల్ఫ్ కప్-2017 టోర్నమెంట్‌ను మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్‌బుష్, బిల్‌క్లింటన్‌లు గురువారం ప్రారంభించారు. ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలి సారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ద్వైపాక్షిక టోర్నమెంట్లో అమెరికా జట్టు.. ఇతర దేశాలతో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడనుంది. జెర్సీ సిటీలోని లిబర్టీ నేషనల్ గోల్ఫ్ కోర్సులో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రారంభ మ్యాచ్‌ను ఈ మాజీ దేశాధ్యక్షులు ఈ వేదికపై నుంచే తిలకించారు. గతంలో వీరు హరికేన్ ఇర్మా తుఫాను బాధితులను ఆదుకోవాలని అమెరికన్లను కోరుతూ ఓ వీడియా సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తుఫాను బాధితులకు సాయంగా అందించనున్నారు. -
తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒబామా
వాషింగ్టన్ : తన కూతురును కాలేజీ చదువు నిమిత్తం ఇంటినుంచి పంపిస్తున్నప్పుడు తనకు డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్లుగా అనిపించిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బ్యూ బిడెన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద కూతురు మలియా ఒబామాను ఇటీవల ఉన్నతచదువుల నిమిత్తం హార్వర్డ్‌కు పంపాను. యూనివర్సిటీలో తనను చేర్పించి తిరిగొచ్చే సమయంలో తనకు బై చెబుతుంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగింది. తండ్రులు అందరికీ అలాగే ఉంటుదని భావిస్తున్నాను. మలియాకు తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. ఆ సమయంలో కూతురి ముందు కన్నీరు పెట్టుకోలేదు. నా కూతుళ్లు మలియా, సాశా నాకు మంచి స్నేహితులు. వారిలో ఒకరు నానుంచి కాస్త దూరంగా వెళ్లిపోతున్నారు. కానీ నాకు ఎందుకో చాలా దిగులుగా ఉంది. అయితే కొంతకాలం తర్వాత మా జీవితంలో వారే సంతోషం నింపుతారన్న నమ్మకం ఉందని' ఒబామా పేర్కొన్నారు. గతంలో చికాగోలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. మీకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మలియా, సాశాలనుద్దేశించి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఒబామా ఓ సాధారణ తండ్రిగా వ్యవహరించి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు -
ట్రంప్‌ది చాలా క్రూరమైన నిర్ణయం: ఒబామా
వాషింగ్టన్ : చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయంగా ఒబామా అభివర్ణించారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ మంగళవారం ఉదయం సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. డ్రీమర్స్ వర్క్ పర్మిట్లు రద్దు చేయడాన్ని క్రూరమైర నిర్ణయంతో పాటు ట్రంప్ సొంతంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అభిప్రాయపడ్డారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమేంలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా డీఏసీఏను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రీమర్స్ (డీఏసీఎ) మద్ధతుదారులు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఏసీఏ రద్దును ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సహా మరికొందరు బిజినెస్ దిగ్గజాలు వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. (చదవండి : డ్రీమర్స్ కలల్ని ఛిద్రం చేసిన ట్రంప్) అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకున్నా డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారిపై దయతో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. డ్రీమర్స్ రెండేళ్లకొసారి తమ వర్క్ పర్మిట్లను రెన్యూవల్ చేసుకుంటే చాలు ఏ సమస్య లేకుండా అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు. -
అమెరికాను మళ్లీ కలవరపెడుతోన్న హింస!
శ్వేతజాతీయవాదుల హింస అమెరికాను మళ్లీ కలవరపెడుతోంది. కిందటి శనివారం వర్జీనియా రాష్ట్రంలోని షార్లట్స్విల్ నగరంలో తెల్లజాతి అమెరికన్ల దాడుల్లో ప్రాణనష్టం జరగడంతోపాటు వారి నిరసన ప్రదర్శనలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో అన్ని రంగుల జాతుల ప్రజలకు ‘అవకాశాల స్వర్గధామం’గా పరిగణించే దేశంలో జాతుల సహజీవనం ప్రమాదంలో పడిందనే అభిప్రాయం నెలకొంది. షార్లట్స్విల్ హింసలో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారు. శ్వేతజాత్యహంకారుల దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించకుండా హింసకు అన్ని వర్గాలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడడం కూడా అమెరికా ఉదారవాదాన్ని నమ్మే ప్రజాస్వామ్యవాదులకు మింగుడుపడడంలేదు. 2008 నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా విజయంతో దేశంలో జాతివివక్ష అంతమైందనే వాదనను తెల్లజాతి మేధావులు ముందుకు తెచ్చారు. వాస్తవానికి రంగు, జాతి వంటి అంశాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు అందించే ప్రక్రియ ముందుకుసాగడం వారికి ఇష్టంలేదు. అనేక రంగాల్లో శ్వేతజాతేతరులు రాణించడం, పరిమిత సంఖ్యలోనైనా కీలక పదవులు చేపట్టడం, ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలోకి వలసలు పెరగడం-వీటన్నిటికి తోడు ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో తమ దేశంలో తమకే అన్యాయం జరుగుతోందన్న భావన తెల్లజాతి అమెరికన్లలో బలపడింది. ఒబామా గెలుపుతో పెరిగిన హింస! 2009 జనవరిలో తొలి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షునిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ నల్లజాతివారిపై దాడులు పెరిగాయి. అన్నిటికన్నా పెద్ద హత్యాకాండ 2015 జూన్‌లో సౌత్కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్లో జరిగింది. ఇక్కడ ఆఫ్రికన్ అమెరికన్లు అధికంగా ఉండే చర్చిపై డిలన్ స్టామ్ రూఫ్ అనే యువకుడు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 9 మంది నల్లజాతివారు మరణించారు. ఏడాదిన్నర విచారణ తర్వాత శ్వేతజాత్యహంకార గ్రూపునకు చెందిన తీవ్రవాదిగా భావిస్తున్న రూఫ్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. 2044 నాటికి అమెరికాలో తెల్లజాతి అల్పసంఖ్యాకవర్గంగా (జనాభాలో ఇప్పుడున్న69 శాతం నుంచి 50 శాతం దిగువకు) మారిపోతుందనే అంచనాలతోపాటు, 21వ శతాబ్దంలో పెరిగిన శ్వేతజాతేతర ప్రజల వలసలు తెల్లజాతి అమెరికన్లను 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు పలికేలా చేశాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినాగాని తెల్లజాతివారంతా కలిసి లేరనే భావనతో వారందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో శ్వేతజాతీయవాదులు షార్లట్స్విల్ వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 19వ శతాబ్దంలో జరిగిన అమెరికా అంతర్యుద్ధంలో బానిస వ్యవస్థ రద్దును వ్యతిరేకించిన కాన్ఫడరేట్ శక్తుల నేతలే... ఇప్పటి క్లూక్లక్స్ క్లాన్, నయా నాజీలు వంటి శ్వేతజాత్యాంహకార గ్రూపులకు ఆరాధ్య దైవాలుగా మరారు. సమానత్వానికి, మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులైన ఈ కాన్ఫెడరేట్ సేనల నేతల విగ్రహాలు, స్మారకచిహ్నాలు తొలగించడాన్ని ఈ శ్వేతజాత్యాంహకారులు పెద్ద పాపంగా పరిగణించి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే షార్లట్స్విల్ ఘటన జరిగింది. శ్వేతజాత్యహంకారవాదులు ఎంత మంది? అమెరికా తెల్లజాతివారిదనే వాదనకు శతాబ్దాల చరిత్ర ఉన్నా ఈ సిద్ధాంతాన్ని బలపరిచే గ్రూపుల సంఖ్యను ఖచ్చితంగా అంచనావేయడం కష్టం. దేశంలో ఇలాంటి అతివాద, జాత్యాహంకార సంస్థలు 1600 వరకు ఉన్నాయని అమెరికా పౌరహక్కుల సంస్థ సదరన్ పోవర్టీ లా సెంటర్ అంచనావేసింది. 1865 అంతర్యుద్ధంలో బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల కాన్ఫెడరేట్ సైన్యంలో పనిచేసిన శ్వేతజాతి మాజీ సైనికాధికారులు క్లూక్లక్స్‌క్లాన్(కేకేకే) పేరుతో తొలి రహస్య సంస్థను స్థాపించారు. తర్వాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. దీని నుంచే అనేక శ్వేతజాత్యహంకార గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఈ గ్రూపుల్లో మొత్తం సభ్యులు ఐదు వేల నుంచి 8 వేల మధ్య ఉంటారని అంచనా. కాన్ఫెడరేట్ వైట్ నైట్స్, ట్రెడిషనలిస్ట్ అమెరికన్ నైట్స్, నేషనల్ సోషలిస్ట్ మూవ్మెంట్, అమెరికన్ఫ్రీడం పార్టీ -ఇలా అనేక పేర్లతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆర్థిక జాతీయవాదం, స్థానిక అమెరికన్ల ప్రయోజనాలకు మద్దతుగా మాట్లాడే ట్రంప్ విజయం సాధించాక తమ సంస్థలో సభ్యులుగా చేరేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని కేకేకే 2016లో ప్రకటించింది. షార్లట్స్విల్లో కాన్ఫెడరేట్ సేనాని రాబర్ట్ లీ విగ్రహం తొలగింపునకు నిరసనగా శ్వేతజాతివారందరినీ ఏకం చేయడానికి ఈ నెల 12న జరిగిన ర్యాలీ, దానికి పోటీగా జరిపిన ప్రదర్శన (విగ్రహం తొలగింపును సమర్థిస్తూ)తో హింస చెలరేగింది. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించటం కలవరపాటుకు గురిచేస్తోంది. విద్వేషపూరిత దాడులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. తెల్లజాతివారి ఆధిపత్యానికి చిహ్నంగా భావించే కాన్ఫెడరేట్ శక్తులకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల, సంస్థల విగ్రహాలు, స్మారకచిహ్నాలు బహిరంగ ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా 1500కు పైగా ఉన్నాయి. వీటి తొలగింపునకు లిబరల్స్ పట్టుబడుతుంటే శ్వేతజాతీయవాదులు వారిని ప్రతిఘటిస్తున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ ట్వీట్‌ను ఎక్కువ మంది ఇష్టపడ్డారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులకు భారీ స్పందన లభిస్తోంది. వర్జీనియా రాష్ట్రంలోని చార్లెట్‌విల్ నగరంలో ఇటీవల జరిగిన దాడులపై స్పందిస్తూ ఒబామా పెట్టిన ట్వీట్ ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా జీవితచరిత్ర 'లాంగ్ వాక్ టు ఫ్రీడం' పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ ఒబామా ట్వీట్ చేశారు. మనుషుల మధ్య ఉండాల్సింది విద్వేషం కాదని, ప్రేమని బోధిస్తున్న వాక్యాలను మూడు ట్వీట్లుగా పెట్టారు. మేరీల్యాండ్‌లో 2011లో తీసిన ఫొటోను మొదటి ట్వీట్లో పోస్ట్ చేశారు. దీనికి 28 లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి. 11 లక్షలకు పైగా రీట్వీట్ చేశారు. ఒబామా ట్వీట్‌కు 45 వేల మందిపైగా జవాబిచ్చారు. ట్విటర్ చరిత్రలో అత్యధిక మంది ఇష్టపడిన ట్వీట్‌గా ఇది రికార్డుకెక్కింది. పాప్ స్టార్ అరియానా గ్రాండే ట్వీట్‌ను ఒబామా ట్వీట్ వెనక్కు నెట్టిందని ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మే నెలలో మాంచెస్టర్‌లో మ్యూజిక్ కన్సర్ట్పై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అరియానా గ్రాండే పెట్టిన ట్వీట్‌కు అప్పట్లో అత్యధిక లైకులు వచ్చాయి. కాగా, చార్లెట్‌విల్‌లో.. అతివాద శ్వేతజాతీయులకు, మితవాదులకు మధ్య శుక్ర, శనివారాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. "No one is born hating another person because of the color of his skin or his background or his religion..." pic.twitter.com/InZ58zkoAm — Barack Obama (@BarackObama) 13 August 2017 "People must learn to hate, and if they can learn to hate, they can be taught to love..." — Barack Obama (@BarackObama) 13 August 2017 "...For love comes more naturally to the human heart than its opposite." - Nelson Mandela — Barack Obama (@BarackObama) 13 August 2017 -
ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..
వాషింగ్టన్: ప్రజల నేతగా గుర్తింపు పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రావడంతో ఓ యువ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన తల్లి రాసిన లేఖతో పాటు ఒబామా పంపిన ప్రత్యుత్తరాన్ని నవ వధువు ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 45వేల మంది రీట్వీట్ చేయగా, రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. గత మార్చి నెలలో టెక్సాస్‌కు చెందిన లిజ్ వైట్‌లో అనే మహిళ కూతురు బ్రూక్ అల్లెన్ జరిగింది. అయితే తన కూతురి వివాహానికి హజరు కావాల్సిందిగా ఒబామా దంపతులకు లిజ్ ఆహ్వానం పంపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత (జూలై 31న) ఒబామా నుంచి వారికి సమాధానం వచ్చింది. 'వివాహం చేసుకున్న జంటకు మా తరఫున శుభాకాంక్షలు. మీ పెళ్లి ఎంతో ఆనందంగా, సన్నిహితుల ప్రేమానుబంధంతో జరిగి ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ మీ ప్రేమ రెట్టింపు కావాలి. మీ బంధం జీవితాంతం కొనసాగాలిని ఆకాంక్షిస్తున్నాను. వివాహం తర్వాత మీ లైఫ్ ఎన్నో విశేషాలతో నిండిపోతూ బంధం బలపడాలని' కొత్త జంటను ఆశీర్వదిస్తూ ఒబామా దంపతులు ఈ లేఖ రాశారు. ఈ సంతోషాన్ని వధువు బ్రూక్ అల్లెన్ తన ట్విట్టర్లో షేర్ చేసుకుంది. MY MOM DEADASS SENT THE OBAMAS A WEDDING INVITATION BACK IN MARCH AND JUST RECEIVED THIS IN THE MAIL. IM HOLLERING -
ఒబామా మమ్మల్ని ఆటపట్టించారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ మహిళను, ఆమె భర్తను సరదాగా ఆటపట్టించారు. ఈ విషయాన్ని ఆ మహిళ స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గత సోమవారం అలస్కాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి జోలెన్ జాకిన్స్కీ తన భర్త, ఆరు నెలల పాపతో వచ్చింది. భర్త ఏదో పనిమీద కాస్త పక్కకు వెళ్లగా.. నెలల బుజ్జాయిని తల్లి జోలెన్ ఆడిస్తోంది. ఇంతలో సాధారణంగా ఉన్న ఓ వ్యక్తిని ఆమె చూసి ఒబామా అనుకుని పొరపడ్డట్లుగా భావించారు. దగ్గరకెళ్లి చూస్తే ఆశ్చర్యం.. ఆ సాధారణ వ్యక్తి మరెవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే. పాపతో పాటే ఒబాబా వద్దకు నేను చేరుకోగానే ఆయన చిరునవ్వుతో పలకరించారు. ఈ అందమైన బుజ్జాయి ఎవరు అని అడిగారు. మా పాప అని చెప్పిన తర్వాత.. చిన్నారి గిసెల్లేను ఒబామా ఎత్తుకుని ముద్దుచేశారు. ఆ సంతోషంలో నేను ఒబాబాతో సెల్ఫీలు తీసుకున్నాను. గిసెల్లే తండ్రి అక్కడికి రాగానే.. 'మీ పాప అందంగా ఉంది. చిన్నారిని నాతోపాటు తీసుకెళ్తాను. మీకు ఏం ఇబ్బందిలేదు కదా' అంటూ జోక్ చేసి ఒబామా ఆ దంపతులను సరదాగా ఆటపట్టించారు. నిజంగానే తమ పాపను అడిగారేమోనని తన భర్త భావించాడని జోలెన్ తెలిపారు. ఒబామా లాంటి గొప్పవ్యక్తిని కలుసుకుని ఆయనతో ఫొటోలు దిగడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని, కొందరికి మాత్రమే ఈ చాన్స్ దొరుకుతుందని జోలెన్ జాకిన్స్కీ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటొలోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. -
మిషెల్ ఒబామా ఫోన్ నెంబర్ ట్వీట్ చేయడంతో..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. వైట్ హైస్ లో గతంలో విధులు నిర్వహించిన ఓ మాజీ ఉద్యోగికి సంబంధించిన ఫోన్ నంబర్‌ను మిషెల్ ఇటీవల ట్వీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్లో ఆమెకు 76లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మిషెల్ నుంచి ట్వీట్ రావడంతో ఫాలోయర్లలో చాలా మంది వెంటనే స్పందించారు. ఏదో కారణం ఉండటంతో ఫోన్ నెంబర్ ట్వీట్ చేశారని భావించిన ఫాలోయర్లు ఆ నెంబర్ కు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోన్ అందుబాటులో లేదని రెస్పాన్స్ రావడంతో మిషెల్ ఒబామా ట్విట్టర్ హ్యాక్ అయి ఉండొచ్చునని ఫాలోయర్లు ట్వీట్లు చేశారు. పొరపాటును గ్రహించిన మిషెల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్ హ్యాక్ కాలేదని ఆమె సిబ్బంది తెలిపారు. ఆ ట్వీట్ పై మిషెల్ స్పందిస్తూ.. తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో క్రియేటివ్ డిజిల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన డంకన్ వోల్ఫ్ నెంబర్ అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేయడం లేదని, ఆ ట్వీట్ తాను పొరపాటుగా చేశానని తెలపడంతో అంతా సర్దుకుంది. -
వెలుగులోకి ఒబామా ట్రాజెడీ లవ్‌స్టోరీ
వాషింగ్టన్: తన భార్యతో ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా మెలిగే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జీవితంలో మిషెల్లీ రాకముందు బయటి ప్రపంచానికి తెలియని మరో స్త్రీ ఉన్నారు. షీలా మియోషి జాగర్ అనే మహిళ మిషెల్లీ రాకముందు ఒబామా ప్రేయసిగా ఉన్నారు. ఈ విషయం త్వరలో రాబోతున్న ఒబామా జీవిత చరిత్ర ద్వారా బయటి ప్రపంచానికి తెలియబోతుంది. ‘రైజింగ్ స్టార్: ది మేకింగ్ ఆఫ్ బరాక్ ఒబామా’ అనే పేరిట ఒబామా జీవిత చరిత్ర రాస్తున్న ప్రముఖ రచయిత డేవిడ్ జే గారో ఈ రహస్యాన్ని, మరెన్నో అంశాల్ని అందులో ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న ప్రకారం జాగర్ రచయిత డేవిడ్‌కు ఏం చెప్పిందంటే..‘1986 వింటర్ సమయంలో మేం మా తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు ఒబామా నాకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ మా కలయికను మా అమ్మనాన్నలు అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఆ సమయంలో ఒబామాకంటే రెండేళ్లు చిన్నదాన్ని. పైగా ఒబామాకు రాజకీయాలపై ఆలోచన ఉండేది. ఆతడి రాజకీయ ఆలోచనలు గాడిలో పడటం మొదలైంది. క్రమంలో అతడు రాజకీయాల్లోకి జారుకున్నాడు. రాజకీయాలతోపాటు, జాతి వివక్ష అంశం కూడా మా సంబంధంపై నీలినీడల్లా కమ్ముకుని విడిపోయాం. ఒక్క ఏడాదిలోనే మా రిలేషన్‌పై ప్రభావం పడింది. 1987ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అధ్యక్ష పదవి చేజిక్కించుకునే విషయంలో ఒబామాకు అప్పట్లోనే స్పష్టమైన ముందుచూపు, అంచనాలు ఉన్నాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఒబామా హార్వార్డ్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత చికాగో తిరిగొచ్చి స్థానిక న్యాయ సంస్థలో ఉద్యోగంలో చేరాడని, అక్కడే ఆయనకు మిషెల్లీ ఒబామా కలిసిందని, వారి సంబంధం అతి తక్కువ కాలంలో ధృడపడి వివాహానికి దారి తీసిందని కూడా వెల్లడించింది. అంతేకాదు, ఆమె హార్వార్డ్‌లో ఫెలోషిప్ టీచింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఒబామా తనను చూసేవాడని తెలిపింది. -
ఒబామా, మిషెల్లీ పెద్ద మనసు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్లీ ఒబామా పెద్ద మనసు చాటుకున్నారు. చికాగోలోని దక్షిణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలను కల్పించే సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు రెండు మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. చికాగోలోని జాక్సన్ పార్క్‌లో దీనిని ఏర్పాటుచేయనున్నారు. ఇందులోనే 200 నుంచి 300 ఉద్యోగాలు ఏర్పడనుండగా దీని ద్వారా దాదాపు రెండు వేల ఉద్యోగాలు క్రియేట్ చేయనున్నారు. వాస్తవానికి చికాగోలో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్‌ను ఒకటి ఏర్పాటు అవడానికి ఇంకా నాలుగేళ్లు పట్టనుందని అందరూ భావిస్తుండగా అప్పటి వరకు తాము ఉండలేమంటూ స్వయంగా ఒబామా దంపతులు ముందుకొచ్చి ఈ విరాళం ప్రకటించారు. ‘మిషెల్లీ నేను వ్యక్తిగతంగా రెండు మిలిన్ డాలర్లను సమ్మర్ జాబ్స్ ప్రోగ్రామ్ కోసం విరాళంగా ప్రకటిస్తున్నాం. పని కోరేవారికి ఇది సరైన మార్గం.. దీని ద్వారా వారికి సదావకాశాలు అందించవచ్చు. మనందరం కలిసి పనేచేసేందుకు మరో నాలుగేళ్లపాటు మేం వేచి చూడలేం. అందుకే నేను, మిషెల్లీ ఇప్పుడే దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు. -
మాలియానా... మజాకా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గారి పెద్దమ్మాయి మాలియా ఒబామా ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌తో కలసి న్యూయార్క్‌లోని ఒక బార్‌కు వెళ్లింది. మాన్హటన్ ప్రాంతంలోని ‘బి బార్ అండ్ గ్రిల్’ ప్రాంగణంలోకి ఆమె అడుగుపెడుతూనే అక్కడే ఉన్న కొందరు కెమెరాలకు పని చెప్పారు. మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్ బార్లో ఒక మూల ప్రశాంతంగా ఉన్నచోట కూర్చొని డిన్నర్ కానిచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో కలసి బార్‌కు రావడంతో అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ఉరుకులు పెట్టారు. ఆమె మాన్‌హట్టన్ బార్‌కు వచ్చిన సంగతి తెలిసినదే తడవుగా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాలియా చేరుకున్న కొద్ది సేపట్లోనే బార్ లోపలా, వెలుపలా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పెద్దసంఖ్యలో కనిపించినట్లు బార్ కస్టమర్లలో కొందరు చెప్పారు. చుట్టూ ఇంత హడావుడి జరుగుతున్నా మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏమీ పట్టించుకోకుండా డిన్నర్ పూర్తయ్యాక తాపీగా నిష్క్రమించారు. -
మిషెల్ ప్రసంగం స్ఫూర్తితో..
► సేవా రంగం వైపు భారతీయ యువతి సింధూ ► ఒబామాకు లేఖ వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు. -
ఒబామా నా ఫోన్లు ట్యాప్ చేశారు: ట్రంప్
వాషింగ్టన్ : ట్రంప్ టవర్లలోని తన ఫోన్లను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్యాప్ చేశారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఆరోపించారు. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడక ముందే ఈ ట్యాపింగ్ జరిగిందంటూ ఆయన ట్వీట్లలో చెప్పారు. ట్యాపింగ్‌ను ట్రంప్ ‘వాటర్‌గేట్’ కుంభకోణంతో పోల్చారు. అయితే ట్యాపింగ్ ఆధారాలను ట్రంప్ బయటపెట్టలేదు. ‘ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వ్యక్తి ఫోన్లను సిట్టింగ్ అధ్యక్షుడు ట్యాప్ చేయడం న్యాయ సమ్మతమేనా? మరింత దిగజారిపోయారు’అని ఒబామాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ఎన్నికలవేళ ఫోన్లను ట్యాప్ చేయడానికి ఒబామా ఎంత దిగజారిపోయారు! ఒబామా చెడ్డవారు’ అని మరో ట్వీట్‌చేశారు. ఈ ఆరో పణలను ఒబామా తోసిపుచ్చారు. ‘అక్టోబర్‌లో ఒబామా నా ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై ఒక మంచి లాయర్ బలమైన కేసు వేయగలరు’ అని ట్రంప్ పేర్కొన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యా రాయబారిని కలిసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అటార్నీ జనరల్ సెసన్స్ ను ట్రంప్ వెనకేసుకొచ్చారు. ఒబామా కాలంలోనే సెసన్స్ , రష్యా రాయబారు లు అధికారికంగా సమావేశమయ్యారని ట్రంప్ గుర్తుచేశారు. సెసన్స్ ను కలిసిన రష్యా రాయబారే ఒబామా పదవిలో ఉన్నప్పుడు శ్వేతసౌధానికి 22 సార్లు వచ్చి వెళ్లారనీ ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ లాయర్లకు గడువు సియాటెల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధ ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు చట్టబద్ధ పౌ రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సియాటెల్ ఫెడరల్ జడ్జి ట్రంప్ లాయర్లకు రెండు వారాల గడువు ఇచ్చారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న తమ పిల్లలను కలుసు కోవడానికి ఆ ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని వారు ఆరోపించారు. ఫిర్యాదుదారులు ఈ కేసును ‘క్లాస్ ఆక్షన్ ’ న్యాయవ్యాజ్యంగా మార్చుకోవడానికి చేస్తున్న యత్నాలపై స్పందించడానికి ట్రంప్ లాయర్లకు తగిన సమయం ఇస్తున్నట్లు జడ్జి జేమ్స్ రాబర్ట్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ఒబామాపై విషం చిమ్ముతున్న డోనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష కాల్పులు, ఆపై చెలరేగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఆందోళనలకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే కారకుడని, వీటి వెనక ఉన్నది డెమొక్రాటిక్ ప్రతినిధులేనని మంగళవారం ఉదయం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసన, ఆందోళనల వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న విలేకరి ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. కచ్చితంగా ఈ ఆందోళనల వెనక ఒబామా హస్తం ఉందని, దీన్ని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాన్సస్‌లో గత బుధవారం యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి ఫురింటన్ జరిపిన కాల్పుల్లో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ మృతిచెందగా, ఆయన స్నేహితుడు అలోక్ రెడ్డి గాయపడ్డారు. ట్రంప్ తీరుతోనే ఈ జాతి విద్వేషకాల్పులు జరుగతున్నాయని ఆందోళనలు మొదలయ్యాయి. దేశ భద్రతపై కూడా బరాక్ ఒబామా సహా డెమొక్రాటిక్ నేతలకు ఎలాంటి ఆందోళన లేదని ట్రంప్ ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించిన విలువైన సమాచారాన్ని సైతం ఒబామా వర్గీయులు లీక్ చేస్తున్నారని.. భవిష్యత్తులోనే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఈ నెల మొదట్లో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, మెక్సికో అధ్యక్షుడు ఎన్నిక్ పెనా నిటోలతో తాను ఫొన్లో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఎన్నో విషయాలను వైట్ హౌస్ నుంచి సేకరించి లీక్ చేశారని మీడియాకు తెలిపారు. ఫాక్స్ న్యూస్ మీడియా ప్రతినిధి జాన్ పాసాంటినో కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. నాన్ ప్రాఫిట్ గ్రూపు సంస్థ ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్.. డోనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయని గత వారం ఫాక్స్ న్యూస్ రిపోర్టులో వెల్లడైంది. ఒబామా రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సమయంలో(2012లో) ఎన్నికల ప్రచారకర్తల్లో ఒకరైన జిమ్ మెస్సినా, వైట్ హౌస్ మాజీ ఉద్యోగి జాన్ కార్సాన్ నేతృత్వంలో ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ ఏర్పడిన విషయం విదితమే. Trump says Obama is "behind" the protests at GOP town halls and leaks coming from the White House pic.twitter.com/HAPhHIEtzU — Jon Passantino (@passantino) 28 February 2017 అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! ట్రంప్ తీరుతో ముప్పేనని 8 రోజులకే..! -
బరాక్ ఒబామాకు బంపర్ ఆఫర్ !
-
‘మేం ట్విన్ టవర్స్‌ను అందుకే కూల్చాం’
న్యూయార్క్: సాధారణంగా.. 2001, సెప్టెంబర్ 11 అని చెప్పగానే అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి గుర్తొస్తుంది. అల్ కాయిదా చేసిన ఈ దాడి పేరు చెబితే ప్రపంచం గురించేమోగానీ ప్రతి అమెరికన్ మాత్రం ఉలిక్కిపడతాడు. అయితే, వాడి దాడి చేయడానికి కారణాలు పెద్దగా ప్రపంచానికి తెలియదు. ప్రతి సమస్యను పరిష్కరించుకునేందుకు మాట్లాడుకునే వెసులుబాటు ఉండగా విధ్వంసాన్ని సృష్టించిన కారణాలు ఎంతపెద్దవైనా వాటికి విలువ ఉండదు.. అయితే వాటిని తెలుసుకోవడం కొంతవరకు మంచిదే. ఈ నేపథ్యంలోనే అమెరికాపై తాము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వివరిస్తూ సరిగ్గా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజులకు ముందు ఖలీద్ షేక్ మహ్మద్ అనే వ్యక్తి ఓ లేఖను పంపించాడు. నాటి దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ ఉన్నప్పటికీ కీలక సూత్రదారి మాత్రం ఇతనే అని చెప్తారు. విధ్వంసకర విధానాలకు ప్రతీకారంగానే తాము నాడు దాడి చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఖలీద్ షేక్ చెప్పిన విషయాలేమిటంటే.. విదేశాంగ విధానం ‘ అమెరికా విదేశాంగ విధానం మాకు నచ్చలేదు. అమెరికన్ ఇండియన్స్‌పై దాడుల, వియత్నాం, కొరియా, టోక్యో, హిరోషిమా, నాగాసాకి, డ్రెస్డెన్, లాటిన్లాంటి దేశాల్లో మీ దేశ నేరాలు కోకొల్లలు. చైనా, మెక్సికో, శాంతా అన్నా దేశాల నియంతలకు మీరిచ్చే మద్దతు నచ్చలేదు. మీకు నచ్చిన దేశాల్లో మీ ఆర్మీ పెట్టుకుంటే మేం పట్టించుకోం.. కానీ మా ముస్లిం దేశాల్లో కూడా సైన్యాన్ని నిలిపారు అందుకు మేం ఒప్పుకోం’ పాలస్తీనా విషయంలో.. ‘గత 60 ఏళ్లుగా పాలస్తీనాలో మీరు మారణకాండను సృష్టిస్తున్నారు. 4మిలియన్లమందిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ సేనతో చేతులు కలిపి ఐక్యరాజ్యసమితి వారి నేరాలు బయటకు రాకుండా చూశారు. 60 ఏళ్లపాటు ఈ వ్యవహారం చూసి తట్టుకోలేక దాడి చేశాం’ మీడియా.. అబ్రహం లింకన్.. మీరు మీ దేశం మీడియా నిపుణులు కలిసి నిజాలు తొక్కిపెడతారు.. మీ దేశాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేందుకు నిజాలను సమాధి చేస్తారు. అబ్రహం లింకన్ చెప్పినట్లు.. ‘మీరు అందర్నీ కొన్నిసార్లు వెదవల్ని చేయొచ్చు..కొంతమంది ప్రజలు మాత్రం అన్నిసార్లు చేస్తారు.. అయితే, అందర్నీ అందరూ అన్నిసార్లు మాత్రం వెదవల్ని చేయలేరు. మీకు వ్యతిరేకంగా తొలుత యుద్ధం మొదలుపెట్టింది మేం కాదు.. మీరే మా భూమిలో అడుగుపెట్టి యుద్ధం చేసే పరిస్థితి తెచ్చారు. ఇరాక్‌ను ఉద్దేశిస్తూ ఇరాక్‌ను ఒక రక్తపు తివాచీలా మార్చారు. ఇరాక్‌లో మీరెప్పుడైనా భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలు చూశారా? కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాయభార కార్యాలయం కోసం మంచి చోటు మాత్రం చూసుకున్నారు. దాని ద్వారా ఆయిల్ వ్యాపారంలో అడుగుపెట్టి మీ చెప్పుచేతల్లో ఉన్నవారి సహాయంతో గుత్తాధిపత్యం కోసం ఇదంతా సృష్టించారు.. అందుకే దాడి చేశాం. ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై.. బిన్ లాడెన్‌ను అల్లా కృప ఉంటుంది. న్యూయార్క్‌పై దాడి చేసి మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బకొట్టాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఒక్క వాణిజ్యసముదాయంపైనే దాడి చేశాడే తప్ప స్కూళ్లు, ఆస్పత్రులు, శరణాలయాలు, నివాసాలు, చర్చిలపై దాడి చేయలేదు.. అయితే, కొందరి ప్రాణాలు పోయాయి.. మా అసలు లక్ష్యం మీ ఆర్థిక వ్యవస్థను కూల్చడమే. కానీ, మీరు మీ సైన్యం చేసిన ప్రతి దాడిలో మా చిన్నారులతో సహా ప్రాణాలుపోయాయి’ లాడెన్‌ను చంపడంపై.. మీ విలువలేమిటో ప్రపంచానికి తెలిసింది. కనీసం దర్యాప్తు చేయకుండా ప్రాథమిక విచారణ జరపకుండా లాడెన్‌ను హతమార్చారు. అతడి దేహాన్ని సముద్రంలో పడేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ తంతు మొత్తాన్ని అధ్యక్షుడు చూశాడు’ అంటూ ఓ భారీ లేఖను విడుదల చేశాడు. -
ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రన్సన్ ఓ సవాల్ విసిరారు. హవాయ్ లో సేదతీరుతున్న సందర్భంగా కైట్ సర్ఫింగ్‌లో తనతో పోటీపడి గెలవాలని ఒబామాను బ్రన్సన్ కోరారు. కైట్ సర్ఫింగ్‌తో పాటు ఫాయిల్ బోర్డింగ్ లలో పోటీ పడ్డారు. రిచర్డ్ కేవలం 50 మీటర్ల వరకు వెళ్లి నీళ్లల్లో పడిపోగా, ఒబామా దాదాపు 100 మీటర్ల వరకు వెళ్లి సవాల్ లో నెగ్గారని బ్రన్సన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఏది ఏమైతేనేం చివరికి ఈ గేమ్‌లో ఒబామానే విజయం సాధించారు. వర్జిన్ గ్రూప్ అధినేత బ్రన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఏకంగా 54వేలకు పైగా వ్యూస్, 10వేలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువగా సూట్లో అధికారులతో కనిపించే ఒబామా.. ప్రస్తుతం హాయిగా సేదతీరుతున్నారు. ఫ్యామిలీతో టూర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు కామెంట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఒబామాను చాలా మిస్సవుతున్నామని మరికొందరు తెగ బాధపడిపోతున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో పదవీకాలం ముగియడంతో ఒబాబా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. -
సాగర తీరంలో ఒబామా షికారు
అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు ముగిసిన వెంటనే బరాక్ ఒబామా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య మిషెల్ తో కలిసి సముద్ర తీరంలో సెలవులు గడుపుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, మరికొంత మందిలో కలిసి ఒబామా దంపతులు సరదాగా గడుపుతున్న దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నలుపు రంగు టీ-షర్ట్, షార్ట్ ధరించి భార్యతో కలిసి బీచ్ లో ఒబామా నడుస్తున్న ఫొటోలు, దృశ్యాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఒబామా ఆహార్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ దుస్తుల్లో ఒబామా చాలా బాగున్నారని, ఆయన స్టైల్ అదిరిందని కామెంట్లు పెట్టారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని కొంత మంది పేర్కొన్నారు. ట్విటర్ లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1న షేర్ చేసిన ఈ వీడియోకు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 78 వేల మందిపైగా రీట్వీట్ చేశారు. కాగా, ఒబామా మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
ట్రంప్ వద్దు.. ఒబామానే కావాలి..!
పబ్లిక్ పాలసీ సర్వేలో వెల్లడి వాషింగ్టన్ : మళ్లీ బరాక్ ఒబామానే అమెరికా అధ్యక్షునిగా కావాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారట. అమెరికాలో పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమిది. ఒబామా అధ్యక్షునిగా ఉన్న నాటి రోజులే బాగున్నాయని 52 శాతం మంది అభిప్రాయపడగా.. ట్రంప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్ల సంఖ్య 43 శాతమే కావడం విశేషం. 40 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను అభిశంసించాలని డిమాండ్ చేస్తున్నారు. వారం క్రితం వీరి సంఖ్య 35 శాతమే ఉండగా.. ఇప్పుడు అది 5 శాతం పెరగడం విశేషం. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ అభిశంసనను వ్యతిరేకిస్తున్నట్టు సర్వే వెల్లడించింది.