వాషింగ్టన్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసలే తనపై ఈగ వాలినా సహించని ట్రంప్ ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒబామా అసమర్థుడని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒబామాను అసమర్థ అధ్యక్షుడుగా అభివర్ణించారు. అంతకుమించి ఏమీ చెప్పలేను అని వ్యాఖ్యానించారు. కాగా శనివారం నాడు ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. (ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు)
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయన వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా అమెరికాలో ఇప్పటివరకు 14,84,804 కరోనా కేసులు నమోదవగా 89,399 మరణించారు. (కరోనా పోరులో ట్రంప్ విఫలం)
Comments
Please login to add a commentAdd a comment