వాషింగ్టన్: కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే లక్ష్యంగా తెచ్చిన 2.3 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. ఇందులోనే 90వేల కోట్ల డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీ కూడా ఉంది. ట్రంప్ సంతంకంతో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఈ బిల్లుపై సంతకం చేసేది లేదంటూ ట్రంప్ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కానీ చివరకు ఆయన ఎందుకు మనసు మార్చుకొని సంతకం చేశారో వివరాలు తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment