వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌కు కరోనా సోకినట్లు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించారు. తమ దంపతులకు కరోనా సోకినప్పటినుంచి బారెన్ విడిగా ఉంటున్నాడని, అప్పటి నుంచి బారెన్‌కు తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో బారెన్‌కు పాజిటివ్ వచ్చిందని వివరించారు. అయితే కరోనా వచ్చినా, అదృష్టవశాత్తు పద్నాలుగేళ్ల బారెన్‌కు ఎలాంటి లక్షణాలు కానరాలేదని చెప్పారు. తమ ముగ్గురికీ దాదాపు ఒకే సమయంలో కరోనా సోకడంతో ఒకరికొకరం అండగా ఉండి ఈ సంక్షోభం నుంచి బయటపడ్డామన్నారు. ప్రస్తుతం తనకు నెగెటివ్ వచ్చిందన్నారు. కరోనా చికిత్స కోసం ట్రంప్‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించగా, మెలానియా మాత్రం వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఒకరకంగా తాను చాలా అదృష్టవంతురాలినని, చిన్నపాటి లక్షణాలతోనే బయటపడ్డామని మెలానియా చెప్పారు. కరోనా సమయంలో ఒళ్లునొప్పులు, దగ్గు, అలసట ఉన్నాయని, చికిత్సలో భాగంగా మరిన్ని విటమిన్లు, పౌష్టికాహారం తీసుకున్నానని తెలిపారు. తమకు చికిత్సనందించిన డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment