
వాషింగ్టన్: ఇటీవలే కరోనా సోకిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కోవిడ్ చికిత్స కోర్సు పూర్తయిం దని డాక్టర్లు ప్రకటించారు. ఆయన మునపటిలాగా జనబాహుళ్యంలోకి వెళ్లవచ్చని చెప్పారు. కరోనా చికిత్స కోసం మిలటరీ ఆస్పత్రిలో చేరిన ట్రంప్ 4 రోజుల తర్వాత తిరిగి వైట్‌హౌస్‌కు చేరారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనేందుకు తనకు ఆసక్తిగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈనేపథ్యంలో డాక్టర్ల ప్రకటన రావడం విశేషం. గత శుక్రవారం నుంచి ట్రంప్‌నకు జ్వరం రావడంలేదని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల బృందం సూచించినట్లు గురువారంతో ట్రంప్ కోవిడ్ చికిత్స కోర్సు పూర్తయిందన్నారు. వైట్‌హౌస్‌కు వచ్చినప్పటినుంచి ట్రంప్ బాగానే ఉన్నారని, కరోనా పెరిగిన దాఖలాలేమీ కనిపించలేదన్నారు. శనివారానికి ట్రంప్‌నకు కరోనా సోకి పదిరోజులవుతుండడంతో ఇకపై తిరిగి ప్రజాజీవనంలో పాలుపంచుకోవచ్చని సిఫార్సు చేశారు.
ట్రంప్‌ను దించాలి!
అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై హౌస్ స్పీకర్ నాన్సీ పెలొసి అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు. ట్రంప్ పదవీ బాధ్యతలు నిర్వహించలేరని, రాజ్యాంగంలో 25వ సవరణను అమలు చేసి ఆయన్ను గద్దె దింపాలని ఆమె సూచిస్తున్నారు. అందుకు కాంగ్రెస్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. ట్రంప్ ఆరోగ్య స్థితి పరిశీలించేందుకు ఒక కమీషన్ ఏర్పాటుచేయించాలని పెలొసి పావులు కదుపు తున్నా రు. ఈ ప్రకటనపై ట్రంప్ మండిపడ్డారు. ఆమెను అందుకే క్రేజీ అంటానన్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నవేళ ఈ అమెండ్‌మెంట్‌ను అమలు చేయించేందుకు డెమొక్రాట్లు యత్నించడం చర్చనీయాంశమైంది. అయితే సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజార్టీ లేనందున ఈ యత్నాలేవీ ఫలించే సూచనలు లేవు.
ఎంతవరకు సేఫ్..?
తన నుంచి కరోనా సంక్రమించే స్థితి లేదని ట్రంప్ చెబుతున్నా, డాక్టర్లు మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వచ్చిన వారం తర్వాత ఆయన కంటాజినస్(ఇతరులకు రోగాన్ని అంటిం చే స్థితి) అవునా? కాదా? చెప్పలేమన్నారు. సీడీసీ ప్రకారం కరోనా నిర్ధారణ అనంతరం పదిరోజుల తర్వాత సోకిన వ్యక్తి లక్షణాలేమీ లేకుంటే జనాల్లోకి వెళ్లవచ్చు, అయితే ఆయన డాక్టర్లు మాత్రం ట్రంప్‌నకు ఆధునిక పరీక్షలు నిర్వహించి తను రోగవ్యాప్తి చేయగలరా? లేదా? నిర్ణయిస్తామంటున్నారు. డాక్టర్ ఫౌచీ ప్రకారం 24 గంటల వ్యవధిలో రెండు పీసీఆర్ టెస్టులు నెగిటివ్ వస్తే అప్పుడు తను రోగవ్యాప్తికారకుడు కాదని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment