relief package
-
తగ్గుముఖం పట్టిన వర్షం.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, అమరావతి: కుండపోత, భారీ వర్షాల నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తేరుకుంటున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టాన్ని నివారించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. అధికారులతో పాటు నాలుగు ఎస్డీఆర్ఎఫ్, ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సేవలందిస్తున్నాయి. వర్షాల వల్ల శిబిరాల్లో తల దాచుకున్న ఆరు జిల్లాలకు చెందిన వారికి తక్షణ సాయంగా రూ.1000, గరిష్టంగా కుటుంబానికి రూ.2 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మంచి భోజన, వసతి ఏర్పాటు చేశారు. కాగా, శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అధిక ప్రభావం తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో 21 మండలాలు, చిత్తూరు జిల్లాలో 14 మండలాలు, ప్రకాశంలో 10, నెల్లూరులో 9, అన్నమయ్యలో 8 మండలాలు ప్రభావితమయ్యాయి. తిరుపతి జిల్లాలో 571 మందిని, చిత్తూరు జిల్లాలో 416, నెల్లూరు జిల్లాలో 208 మందిని.. మొత్తంగా 1,195 మందిని శిబిరాలకు తరలించారు. వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలో 55 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గత 24 గంటల్లో వర్షపాతం ఇలా.. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లిలో అత్యధికంగా 15.4 సె.మీ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టెపాడులో 15.1 సెం.మీ, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లిలో 14.4 సెం.మీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం టి.ముస్తాపురంలో 12.37 సెం.మీ, చీపినపిలో 12.35 సెం.మీ, ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోతపల్లిలో 11.9 సె.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో 8.6 సెం.మీ, కందుకూరులో 7.6 సెం.మీ, మన్నేటికోటలో 7.4 సెం.మీ, కందుకూరు దైవివారిపాలెంలో 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష – తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వరద బాధితులకు చేపడుతున్న సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మెరుగైన భోజన, వసతి సౌకర్యాలు కలి్పంచారు. – ఈ రెండు జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో వివిధ పంటలు నీట మునిగినట్లు అంచనా. శనివారం వేకువజామున భారీగా వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శిబిరాల నుంచి ఇళ్లకు వెళుతున్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 వేలు అందజేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం వర్షపు నీటిలోనే పర్యటించి, మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడా నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు – మాండూస్ తుపాన్ తీరం దాటినప్పటికీ ఆ ప్రభావంతో ఇంకా నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల వాలడంతో ఆ శాఖకు నష్టం వాటిల్లింది. – నెల్లూరు నగరంతో పాటు లోతట్టు ప్రాంతాల కాలనీల్లో ఇంకా వర్షపు నీరు నిలబడిపోయింది. నెల్లూరు ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, చౌటమిట్ట కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న నీటిని అధికారులు జేసీబీల సాయంతో కాలువల్లోకి మళ్లిస్తున్నారు. నగర పంచాయతీ అయిన బుచి్చరెడ్డిపాళెంలో చెన్నకేశవ ఆలయం గర్భగుడిలోకి వర్షం నీరు చేరింది. వ్యవసాయ, విద్యుత్ శాఖాధికారులు నష్టం అంచనాకు ఉపక్రమించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు – ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునిగాయి. దర్శి, కనిగిరి, కొండపి ప్రాంతాల్లో కొంత మేర పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనేక ప్రాంతాల్లో వాగులు రోడ్లెక్కి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు నిండటంతో జలకళ సంతరించుకుంది. – ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వర్షాల ప్రభావం డెల్టా రైతులపై తీవ్రంగా ఉంది. భట్టిప్రోలులో వరి ఓదెలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలిస్తున్నారు. – తుపాను తీరం దాటి బలహీన పడినప్పటికీ కాకినాడ తీరంపై ఇంకా దాని ప్రభావం కనిపిస్తోంది. కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేటల్లో తీరానికి చేరువగా ఉన్న ఇళ్లు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ వద్ద తీర రక్షణకు వేసిన జియోట్యూబ్ గోడ ధ్వంసమైంది. – ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన, మైలవరం తదితర నియోజకవర్గాల్లో 7,500 ఎకరాల్లో పనలపై ఉన్న వరిపంట, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నీటమునిగాయి. కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, పెనమలూరు పరిసరాల్లో ధాన్యం రాశులు వర్షానికి స్వల్పంగా తడిచాయి. -
కేంద్రం బూస్ట్: దుమ్మురేపిన వొడాఫోన్ ఐడియా
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభం, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రభారీ ఊరట కల్పించిన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో టెలికాం షేర్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాభాల పరంగా, వినియోగదారుల పరంగా బాగా వెనుకబడిన వొడాఫోన్ ఐడియా కు మళ్లీ జీవం వచ్చినట్టైంది. ఈ కంపెనీ షేర్లు 15 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు గత 10 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ 72 శాతం పుంజుకోవడం విశేషం. టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు బుధవారం టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినసంగతి తెలిసిందే. ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఏజీఆర్‌కు సంబంధించి ప్రస్తుతమున్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి : టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట కాగా ఎయిర్టెల్ జియో, వొడాఫోన్ ఐడియా మూడు ప్రైవేట్ రంగ సంస్థల ఉమ్మడి నికర రుణాలు రూ. 3.6 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రం , ఏజీఆర్ బకాయిల విలువ .1.6 లక్షల కోట్లు. అంటే సంస్థ మొత్తం బకాయిల్లో 84 శాతం. బ్యాంకింగ్ రంగంలో వొడాఫోన్ ఐడియాకు మొత్తం రూ . 29,000 కోట్ల రుణాలుండగా, దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా రూ .11,000 కోట్లు. దీంతోపాటు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర మధ్యతరహా బ్యాంకుల రుణాలున్నాయి. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
Nirmala Sitha Raman: ఆత్మ నిర్బర్ రోజ్‌గార్ యోజనా పొడిగింపు
కోవిడ్ ఫస్ట్ వేవ్ అనంతరం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనా పథకాన్ని 2021 జూన్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా 58.50 లక్షల మందికి రూ. 22,810 కోట్ల రూపాయల లబ్ధికి చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్‌వో వాటా వెయ్యిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఎంప్లాయి, ఎంప్లాయిర్‌లకు సంబంధించిన ఈపీఎఫ్‌వో వాటాను పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు సంబంధించి కేవలం ఎంప్లాయి వాటాను కేంద్రం చెల్లిస్తుందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 21.42 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 902 కోట్లు చెల్లించినట్టు వివరించారు. చదవండి: భారీ ఆర్థిక ఉపశమన చర్యలు ప్రకటించిన సీతారామన్ -
Nirmala Sitha Raman: 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 5 లక్షల టూరిస్టు వీసాలను ఉచితంగా జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటించారు. కోవిడ్‌కి ముందు 2019లో సుమారు 1.93 కోట్ల మంది టూరిస్టులు ఇండియాకు వచ్చేవారన్నారు. వీరి వల్ల దేశంలో 30 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందన్నారు. మరోసారి విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఫ్రీ వీసాను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం 2022 మార్చి 30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ముందుగా వచ్చిన 5 లక్షల మంది విదేశీ టూరిస్టులకు ఈ పథకం వర్తింస్తుందన్నారు. ఒక వ్యక్తికి ఒకే సారి ఉచితంగా వీసా జారీ చేస్తామన్నారు. పర్సనల్ లోన్లు కోవిడ్‌తో దెబ్బతిన్న టూరిజం రంగాన్ని ఆదుకునేందుకే వర్కింగ్ క్యాపిటల్, పర్సనల్ లోన్లు అందిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా టూరిజం రంగంలో ఉన్న హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లను ఆదుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రర్ చేసుకున్న 10,700ల మంది గైడ్స్, 904 ట్రావెల్ టూరిజం స్టేక్ హోల్డర్లకు రుణాలు, ఆర్థిక సాయాన్ని రుణంగా అందిస్తామన్నారు. ట్రావెల్ టూరిజం స్టేక్హోల్డర్లకు రూ. 10 లక్షల రుణం అందిస్తామన్నారు. దీంతో పాటు టూరిస్ట్ గైడులకు లక్ష రూపాయల వ్యక్తిగత రుణం అందిస్తామన్నారు. కేంద్ర టూరిజం శాఖ ద్వారా ఈ పథకం అమలు చేయబోతున్నట్టు మంత్రి వివరించారు. -
ఆ మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లు
భువనేశ్వర్/కోల్‌కతా: యాస్ తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన ఒరిస్సా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో, తక్షణ సాయం కింద ఒడిశాకు రూ.500 కోట్లు, బెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి రూ.500 కోట్లు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు, తుపాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తారని పీఎంవో తెలిపింది. అంతకుముందు, ఒడిశాలో యాస్ తుపాను మిగిల్చిన విషాదం, వాటిల్లిన నష్టంపై ప్రధాని మోదీ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి పాల్గొన్నారు. తుపాన్ల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ఒడిశా సర్కారు డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం ప్రధాని బాలాసోర్, భద్రక్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి బెంగాల్‌కు వెళ్లారు. రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన మమత తుపానుతో రాష్ట్రంలో సంభవించిన నష్టం వివరాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బెంగాల్లో తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ కోల్‌కతాకు వచ్చారు. దిఘాలో సీఎం మమతా బెనర్జీతో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.తుపానుతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు మమత చెప్పారు. -
కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే లక్ష్యంగా తెచ్చిన 2.3 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. ఇందులోనే 90వేల కోట్ల డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీ కూడా ఉంది. ట్రంప్ సంతంకంతో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఈ బిల్లుపై సంతకం చేసేది లేదంటూ ట్రంప్ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కానీ చివరకు ఆయన ఎందుకు మనసు మార్చుకొని సంతకం చేశారో వివరాలు తెలియలేదు. -
‘హైదరాబాద్‌ని నాశనం పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. వరద బాధితులకు నిధులు మంజూరు చేసిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధమన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి సముద్రం లేదన్న కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. నగర రోడ్లు బాగుపడే వరకు టీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు. విశ్వనగరాన్ని మురికి నగరంగా మార్చారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు.. వర్రియింగ్ ప్రెసిడెంట్. తండ్రి కొడుకులిద్దరూ కలిసి దోచుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మిలాఖత్ అయ్యి హైదరాబాద్‌ని నాశనం పట్టించారు. తెలంగాణ రాష్ట్రన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటున్నది. వివిధ రంగాల్లోక నిధులు కేటాయించింది. వరద బాధితులకు కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది’ అని తెలిపారు. (చదవండి: జనంలో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ) ‘వర్షాలు పడి అన్ని కోల్పోయిన వారిని కనీసం పట్టించుకోని.. పరామర్శించని ఏకైకా ముఖ్యమంత్రి కేసీఆర్. అకాల వర్షాలు పడితే ఫామ్ హౌస్‌లో పడుకున్నావు. కేసీఆర్ అంటే ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి. మజ్లీస్ పార్టీ వరద సహాయ నిధులలో అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీకి బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. మీ ఇంట్లో మాత్రం అందరికి ఉద్యగాలు ఇచ్చావ్. పరీక్షలో ఫెయిల్ అయిన కవితకు ఉద్యోగం కల్పించావ్. ప్రస్తుతం నీ మనవడు హిమాన్ష్ మాత్రమే ఖాళీగా ఉన్నాడు’ అంటూ లక్ష్మణ్ తీవ్రంగా మండి పడ్డారు. -
పరిశ్రమలకు పరిపుష్టి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపశమన ప్యాకేజీ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ)ని ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు ఏ తరహా ఉపశమనం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత ఉపశమన ప్యాకేజీ ఉత్తర్వులు వెలువడే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. (మే, జూన్‌లోనే 84 శాతం మరణాలు ) ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు.. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో మారిటోరియం విధించింది. అయితే లాక్డౌన్ మూలంగా సుమారు రెండున్నర నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీల ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి రూ.130 కోట్ల మేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ తాజా ప్రతిపాదనల్లో అం చనా వేసింది. అయితే అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించిన íఫిక్స్డ్ చార్జీల వివరాలివ్వాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. (24 గంటల్లో 279 మంది మృతి) విడతల వారీగా సబ్సిడీలు.. పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయాల్సి ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బకాయిల్లో కనీసం నాలుగో వంతును విడుదల చేయడంతోపాటు, మిగిలిన మొ త్తాన్ని దశల వారీగా విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. తద్వారా సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలకు కొంత ఉపశమనం కలగనుంది. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్) ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు... ఉపశమన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో దేశ వ్యాప్తంగా కనీసం రూ.2 లక్షల కోట్లు కూడా బ్యాంకర్ల నుంచి రుణాలు అందే పరిస్థితి లేదని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉపశమన ప్యాకేజీ ద్వారా కొంతైనా మేలు కలుగుతుందని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ఉపశమన ప్యాకేజీకి సంబంధించి వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, వీలైనంత త్వరగా వివరాలు వెల్లడిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. -
వారికి గుడ్‌న్యూస్: అమెరికా మరో భారీ ప్యాకేజీ!
వాషింగ్టన్: మహమ్మారి కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా.. తాజాగా 3 ట్రిలియన్ డాలర్లతో కూడిన భారీ ప్యాకేజీ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం సహా దేశ పౌరుల ఆరోగ్య అవసరాలు ప్రాధాన్యాంశాలుగా డెమొక్రాట్లు ఈ మేరకు బిల్లును ప్రతిపాదించారు. కాగా వివిధ రాష్ట్రాలు నిధులు సమకూర్చుకునేందుకు, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, నిరుద్యోగులు, అద్దెదార్లు, ఇళ్ల యజమానులు, బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ ప్యాకేజీ ద్వారా ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది. 3 ట్రిలియన్ డాలర్లలో 1 ట్రిలియన్ డాలర్లు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు... కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్ కుటుంబాలను ఆదుకోవడానికి నగదు పంపిణీ, చిన్న వ్యాపారస్తులకు బిల్లు ద్వారా లబ్ది చేకూర్చేలా బిల్లు రూపొందింది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) ఇక ప్రతినిధుల సభలో మెజారిటీ డెమొక్రాట్లదే కావడంతో 208-199 ఓటింగ్ తేడాతో బిల్లును నెగ్గించుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ రిపబ్లికన్‌తో పాటు 14 మంది డెమొక్రాట్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. ఇక ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా స్పీకర్ నాన్సీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మానవతా దృక్పథంతో ఇప్పుడు కూడా మనం సరైన రీతిలో స్పందించకపోతే.. బాధ్యతారాహిత్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అమెరికన్ల జీవితాల్లో.. అమెరికా రాష్ట్రాలు, ప్రాంతాల బడ్జెట్లో ఇదే పెద్ద పెట్టుబడి అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల అతలాకుతలమైన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచి, సమస్యలను అధిగమించేలా చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఈ బిల్లును సెనేట్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎద్దేవా చేసిన రిపబ్లికన్లు.. వైట్‌హౌజ్‌లో వీటో(తిరస్కారం)కు గురవుతుందంటూ బెదిరింపు ధోరణి అవలంబించడం ఇందుకు నిదర్శనం. ఇక కరోనా సహాయక చర్యల్లో భాగంగా నాలుగోదశ ప్రారంభమైందని ట్రంప్ వైట్‌హౌజ్‌లో విలేకరులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఆయన సంతకం చేశారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా మార్చిలో 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ, చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు 483 బిలియణ్ డాలర్ల ప్యాకేజీని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా పన్ను చెల్లింపుదారులను ఆదుకునేందుకు పేరోల్ టాక్సులను తగ్గించాలని ట్రంప్ గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. (కరోనా సంక్షోభం: 484 బిలియన్ డాలర్ల ప్యాకేజీ) -
లాక్డౌన్: రూ.10 లక్షల కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలు తదితర రంగాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత ప్రజలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. బాధిత వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. మఖ్దూంభవన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా దీక్షలో పాల్గొన్న పార్టీ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, డా.కె.నారాయణ, అజీజ్‌పాషా, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్, డా. సుధాకర్లకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఇక జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ రాష్ట్రనాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు తమ తమ ఇళ్లలోనే దీక్షల్లో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షలో రాష్ట్రంలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం రూ. 7 వేలు చొప్పున ఆర్థిక సాయం, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలని, తెల్లకార్డులు లేని అర్హులను, పేదలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ వైద్య, విద్యాసంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇప్పించాలని, వరి కొనుగోలు క్వింటాకు 5 కిలోల తరుగు విధానంపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. (తెలంగాణ: అటు కేబినెట్ భేటీ, ఇటు దీక్షలు) -
లాభాల కోసం చూడొద్దు.. అమ్మేసుకోండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటేటా పెరుగుతున్న అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు అత్యాశగా లాభాల కోసం ఎదురుచూడకుండా ఇన్వెంటరీ గృహాలను విక్రయించుకోవాలని.. దీంతో కనీసం బ్యాంక్ వడ్డీ భారాౖన్నైనా తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏర్పాటు చేసిన వెబ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్వెంటరీ గృహాల విషయంలో అత్యాశ వద్దు. ఎంత ధర వచ్చినా సరే విక్రయించడమే ఉత్తమం. కనీసం చేతిలో నగదు లభ్యత అయినా పెరుగుతుంది. ముంబైలో చాలా మంది బిల్డర్లు ప్రీమియం ధర రావాలని ఇన్వెంటరీని విక్రయించడం లేదు. చ.అ.కు రూ.35–40 వేల ధర వచ్చే వరకు ఎదురుచూస్తున్నారని’’ వివరించారు. ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్లతో డెవలపర్లు ధరల గురించి చర్చించాలని, బ్యాంక్‌లు, ప్రైవేట్ రుణదాతల వడ్డీ వ్యయ భారం నుంచి విముక్తి కోసమైనా వీటిని విక్రయించడమే మేలని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, గృహ విభాగంలో డిమాండ్‌ను సృష్టించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. రూ.10 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను నిర్మించాలని కోరారు. రోడ్లు, రహదారుల విభాగంలో భారీ వ్యాపార అవకాశాలున్నాయి. ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగంతో లాజిస్టిక్ పార్క్‌లు, రహదారుల నిర్మాణంలోకి రావాలని సూచించారు. రహదారుల వెంట బస్ డిపోలు, పెట్రోల్ పంప్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటివి అభివృద్ధి చేస్తున్నామని.. ఆసక్తివున్న నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ముంబై–ఢిల్లీ కారిడార్‌లో టౌన్‌షిప్‌ల నిర్మాణం ప్రణాళికలో ఉందని చెప్పారు. సొంతంగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకోండి.. నిర్మాణ కంపెనీలు తమ వ్యాపార విభాగాలను మార్చుకోవాలని, సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్థాపించాలని సూచించారు. ఉదాహరణకు ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా తయారీ కంపెనీలకు సొంతంగా ఆటో ఫైనాన్స్ కంపెనీలున్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా సొంతంగా గృహ రుణ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించాలని సూచించారు. దీంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ఇన్వెస్టర్లలకు ఈక్విటీ ఇష్యూల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎన్బీఎఫ్సీలు నిధులను సమీకరించాలని సూచించారు. -
కోవిడ్-19 : కొలువులను కాపాడాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో కీలక రంగాలు ప్రభుత్వాల చేయూత కోసం వేచిచూస్తున్నాయి. కోట్లాది కొలువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలతో కీలక రంగాలను ఆదుకోవాల్సి ఉంది. అత్యధిక ఉపాధిని సమకూర్చే పరిశ్రమలు, సంస్ధల మనుగడకు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించి ప్రభుత్వం చేయూత ఇవ్వకుంటే పెద్దసంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం నెలకొంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలు ప్రాణాంతక వైరస్ ధాటికి కుప్పకూలుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యంలోకి జారుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకానమీని కాపాడుకుంటూ కోట్లాది ఉద్యోగాలను నిలబెట్టేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు భారీగా ఎగబాకిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి. మరికొద్ది నెలలు ఇదే పరిస్ధితి కొనసాగే పరిస్ధితి కనిపిస్తోంది. మాంద్య మేఘాలు ముసురుకున్న క్రమంలో దేశంలో ఐదు కీలక రంగాలకు ప్రభుత్వ ఊతం అవసరమని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈకి భరోసా ఇక భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచి కోట్లాది ఉద్యోగాలను కల్పిస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించాలనే డిమాండ్ ముందుకొస్తోంది. దేశ జీడీపీకి మూలస్తంభాలైన తయారీ, ఎగుమతి రంగంలో నిమగ్నమైన ఎంఎస్ఎంఈ రంగం కోవిడ్-19 ప్రభావంతో విలవిలలాడుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్ధితుల్లో ఆయా పరిశ్రమలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశ జీడీపీలో 30 శాతంపైగా సమకూరుస్తున్న ఈ రంగానికి భారీ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరతున్నారు. సత్వరమే ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించని పక్షంలో పలు చిన్న యూనిట్లు మూతపడే ప్రమాదం నెలకొంది. చదవండి : డబ్ల్యూహెచ్ఓకు చైనా భారీ సాయం! సంక్షోభంలో ఆతిథ్యం.. కోవిడ్-19 ప్రభావంతో ఆతిథ్య, పర్యాటక రంగాలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైరస్ వ్యాప్తి భయాలు, లాక్డౌన్ ఫలితంగా పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయి ఈ రంగాలు కుదేలయ్యాయి. దేశంలో టూరిజం, ఆతిథ్య రంగం 3.8 కోట్ల ఉద్యోగాలను కోల్పోయిందని కేపీఎంజీ నివేదిక స్పష్టం చేసింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టూరిజం రంగమూ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఒక్క పౌరవిమానయాన రంగానికే రూ 5 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు పర్యాటక రంగంలో 4 నుంచి 5 కోట్ల ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సత్వరమే ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలి. విమానయాన, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు ఊతం.. ఈ రెండు ప్రధాన రంగాలతో పాటు కరోనా మహమ్మారితో కుదేలైన విమానయానం, ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. పరిశ్రమలను కాపాడుకునేందుకు చొరవచూపితేనే కోవిడ్-19 ఎఫెక్ట్‌తో కళ్లముందు కనిపించే మహా పతనాన్ని కొంతమేర నివారించవచ్చు. -
ఎకానమీ కోసం మరో ప్యాకేజ్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారీగా దెబ్బతింటున్న ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. లాక్డౌన్ తరువాత ఆర్థిక రంగంలో నెలకొననున్న వివిధ పరిస్థితులను బేరీజు వేస్తోంది. అయితే, మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లాక్డౌన్ అనంతర పరిస్థితులను అంచనా వేసే పనిలో ఉన్నామన్నారు. అలాగే, కొన్ని సంక్షేమ, ఇతర ప్రభుత్వ పథకాలను లాక్డౌన్ అనంతర పరిస్థితులకు అనుగుణంగా మార్చే అవకాశాలపై కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఏదైనా నిర్ణయం ప్రకటిస్తే.. అది కేంద్రం తీసుకున్న మూడో నిర్ణయమవుతుంది. ప్రధాని మోదీ మార్చి 24న లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు.. ఆర్థికమంత్రి పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామిక వేత్తలకు కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించారు. రెండు రోజుల తరువాత మార్చి 26న కరోనా ప్రభావిత రంగాలను ఆదుకోవడం కోసం రూ. 1.7 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్‌ను కూడా ప్రకటించారు. కోవిడ్ 19పై పోరు కోసం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన 10 సాధికార బృందాల్లో ఒకటి ఆర్థిక రంగ పునరుత్తేజంపై పని చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా లాక్డౌన్ అనంతర పరిస్థితులను సమీక్షిస్తోంది. -
లాక్డౌన్లో ఆకలి చావులను ఆపాలంటే....
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తుండడంతో అనియత రంగంలో పనిచేస్తోన్న కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాద పరిస్థితి పొంచి ఉంది. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా 70వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆ సొమ్ము ఏమాత్రం సరిపోదు. ప్రస్తుత ప్యాకేజీని కూడా పక్కా ప్రణాళికతో అమలు చేయక పోయినట్లయితే ఆశించిన ఫలితాలు అందే అవకాశం లేదు. (రుణ గ్రహీతలకు భారీ ఊరట) 2015–16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ఎంప్లాయ్మెంట్–అన్ఎంప్లాయ్మెంట్ సర్వే’ ప్రకారం దేశంలో 80 శాతం మంది అనియత రంగంలో పని చేస్తున్నారు. వారిలో మూడోవంత మంది దినసరి వేతన జీవులే ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో వారందరిని ఆదుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ చిత్త శుద్ధితో అమలు చేయడంతోపాటు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. (బ్రేక్ 'కరోనా') 1. వద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఏప్రిల్ నెలలోనే మూడు నెలల పింఛను ఇవ్వాలి. సామాజిక భద్రతా పింఛన్లను నెలకు 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాలి. 2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2019–20 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలి. ఈ పథకం కింద కార్మికులకు నెలకు పది రోజుల చొప్పున మూడు నెలలపాటు, అంటే నెలకు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలను చెల్లించాలి. ఈ పథకం దేశంలో ఉన్న 14 కోట్ల కార్డుదారులకు సొమ్ము చెల్లించాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. (ప్యాకేజీ లాభాలు) 3. జాతీయ ఆహార పథకం కింద, ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి దేశంలో మూడింట రెండొంతుల మంది వస్తున్నారు. రేషన్ కార్డుల మంజూరులోనూ కొన్ని లోపాలు, పొరపాట్లు ఉన్నప్పటికీ వారందరికి బయోమెట్రిక్ గుర్తింపు అవసరం లేకుండా బియ్యం, గోధుమలు, పప్పులు ముందస్తుగా మూడు నెలలకు సరిపడా పంపిణీ చేయాలి. భారత ఆహార సంస్థ వద్ద భారీ నిల్వలు ఉన్నందున ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. 4. ప్రజా పంపిణీ వ్యవస్థ కిందనే బడుగువర్గాల ప్రజలకు సబ్బులు, నూనెలు కూడా సరఫరా చేయాలి. 5. అంగన్వాడీలు, పాఠశాలలు మూసివేసినందున పిల్లలకు పౌష్టికాహారం సరఫరాలో భగంగా కేరళ రాష్ట్రం తరహాలో ఇళ్లకే గుడ్లు, కర్జూరం ప్యాకెట్లు ఉచితంగా సరఫరా చేయాలి. 6. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ పథకం, ప్రజా పంపిణీ పథకం కిందకు రాని లక్షలాది మంది వలసకార్మికులు ఉన్నారు. లాక్డౌన్ సందర్భంగా పనులు ఉండవు కనుక వారికి ఉపాధి ఉండదు. అలాంటి వారు తమ తమ ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణించి పలు రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన విషయం తెల్సిందే. వలసకార్మికులందరికి స్టేడియంలలో, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేసి, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలి. ఆహార పంపిణీ కింద సరఫరా చేసే రేషన్ సరకులను కూడా ఈ కిచెన్లకు సరఫరా చేయాలి. ఇలా అనియత రంగంలో పనిచేసే కార్మికులు, దినసరివేతన జీవులను ఆదుకున్నప్పుడే సంపూర్ణ లాక్డౌన్ అర్థవంతంగా విజయవంతం అవుతుంది. లేకపోయినట్లయితే కరోనా వైరస్ బారిన పడి మరణించే వారికన్నా ఆకలితో అలమటించి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. -
ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఉపశమన ప్యాకేజీని తీసుకొచ్చిందని ఎస్బీఐ చీఫ్ రజనీష్‌కుమార్ అన్నారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంటుందని రజనీష్‌కుమార్ అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితుల్లో ఉందని, భారత్ ఇందుకు మినహాయింపేమీ కాదన్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన మార్గం చూపుతుంది. ఇది చక్కగా రూపొందించిన ప్యాకేజీ. బలహీన వర్గాలు కనీస వసతుల విషయంలో ఇబ్బంది పడకూడదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది’’అని రజనీష్ అన్నారు. అవసరమైన చర్యలు.. బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ప్యాకేజీ అవసరమైనంత సాయం అందిస్తుందని ఇండియన్ బ్యాంకు ఎండీ పద్మజ చుండూరు అభిప్రాయపడ్డారు. ‘‘ఆరోగ్య సంరక్షకులకు బీమా రక్షణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు సాయం, ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు ఎంతో అవసరమైనవి’’ అని పద్మజ తెలిపారు. -
కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు
వాషింగ్టన్/జెనీవా/మాడ్రిడ్: ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 22 వేలు దాటిపోయింది. చైనా కరోనాని అసాధారణ స్థాయిలో నియంత్రించినప్పటికీ అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా విజృంభణ ఇంకా ఆగలేదు. అమెరికా, యూరప్ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతూ ఉండడంతో సౌకర్యాల్ని ఏర్పాటు చేయలేక బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యంలో వెయ్యి దాటిన మృతులు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేసింది. వైరస్ కారణంగా రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో అమెరికాలో 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయి ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడడం దేశంలో ఇదే తొలిసారి. ఆ దేశంలో 75 వేలకు పైగా కేసులు నమోదైతే, 1,080 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా లాక్డౌన్ నిర్ణయం తీసుకోకపోతే వైరస్‌ను అదుపు చేయడం కష్టమని వివిధ రాష్ట్రాల గవర్నర్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. నెం.1 ప్రజా శత్రువు: కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోందని, ప్రపంచ దేశాల నాయకులు ఈ వైరస్‌పై పోరాడడంలో మొదట్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి విలువైన సమయాన్ని వృథా చేశారని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానమ్ ఘెబ్రెయేసస్ అన్నారు. ఒకట్రెండు నెలలకి ముందే ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు స్పందించి ఉండాల్సిందన్నారు. మేమూ సాయం చేస్తాం : భారత్‌కు చైనా ఆఫర్ కరోనాను అరికట్టడంలో తమ దేశానికి భారత్ అందించిన సాయానికి చైనా ధన్యవాదాలు తెలిపింది. ఇప్పడు చైనా కోలుకోవడంతో భారత్‌కు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఊళ్ల సరిహద్దుల్ని మూసేశారు : ఇరాన్ ఇరాన్లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఊరికి, ఊరికి మధ్య సరిహద్దుల్ని కూడా మూసేశారు. గురువారం ఒక్క రోజే 157 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 2,234కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య 30 వేలకి చేరుకోవడంతో ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. పోప్ నివాసంలో మతాధికారికి వైరస్: ఇటలీ వాటికన్ సిటీలో పోప్ నివాసం ఉండే భవనంలో ఉన్న సెయింట్ మార్థా గెస్ట్ హౌస్‌లో ఉండే మత ప్రబోధకుడికి కరోనా సోకడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే పోప్ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వాటికన్ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో జలుబు రావడంతో 83 ఏళ్ల వయసున్న పోప్ విడిగానే ఉంటున్నారు. ఆసుపత్రులుగా మారుతున్న హోటళ్లు: స్పెయిన్ కరోనా వైరస్‌తో స్పెయిన్‌లో ఒక్క రోజులో 655 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,089కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య 56 వేలు దాటి పోయింది. ఆరోగ్య కేంద్రాలు సరిపడినన్ని లేకపోవడంతో ప్రభుత్వం హోటళ్లన్నింటినీ తాత్కాలికంగా ఆసుపత్రులుగా మార్చి రోగులకు సేవలు అందిస్తోంది. ఇల్లుదాటి వస్తే హత్యాయత్నం కేసులు: దక్షిణాఫ్రికా ఇల్లు దాటి బయటకు వస్తే హత్యాయత్నం కేసులు పెడతామని తమ పౌరులను దక్షిణాఫ్రికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు నమోదు చేసింది కూడా. భారీగా జరిమానా, జైలు శిక్ష విధించనుంది. 3,700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలి: పాక్ కరోనా కేసులు 1100 దాటిపోవడంతో పాకిస్తాన్ 3,700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఐఎంఎఫ్‌ని కోరింది. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి తమకు లేదంది. -
ప్యాకేజీ లాభాలు
కరోనా వైరస్ కల్లోలానికి తట్టుకోవడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో మన స్టాక్ మార్కెట్ గురువారం జోరుగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లు పతనబాటలో ఉన్నా మన స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదం తెలపడం, ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరగడం కూడా కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,411 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 8,641 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4.94%, నిఫ్టీ 3.89% చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. మార్చిలో అధ్వాన పతనం... గత 3 రోజుల్లో సెన్సెక్స్ 3,966 పాయింట్లు, నిఫ్టీ 1,032 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ మార్చి సిరీస్‌లో సెన్సెక్స్ 25%, నిఫ్టీ 26% చొప్పున నష్టపోయాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క నెలలో సూచీలు ఇంత అధ్వానంగా పతనం కావడం ఇదే తొలిసారి. కాగా గురువారం ఆసియా మార్కెట్లు 1–4%, యూరప్ 1–2% లాభాల్లో ముగిశాయి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 45 శాతం ఎగసి రూ.437 వద్ద ముగిసింది. భారీ షార్ట్ కవరింగ్ దీనికి తోడ్పడిందని నిపుణులంటున్నారు. ఒక్క రోజులో ఈ షేర్ ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. గత పది వారాల్లో 80% మేర నష్టపోయింది. ► బంధన్ బ్యాంక్ షేర్ 39 శాతం లాభంతో రూ.216కు పెరిగింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు– మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ‘కమోడిటీ’ ట్రేడింగ్ వేళలు కుదింపు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ట్రేడింగ్ వేళలను కుదించాయి. గతంలో ఈ సెగ్మెంట్లో ఉదయం 9 గంటలకు మొదలై, అర్థరాత్రి వరకూ ట్రేడింగ్ జరిగేది. దీనిని ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకూ తగ్గించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 14 వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయి. ఎమ్‌సీఎక్స్, ఐపీఈఎక్స్లు కూడా ఇదే వేళలను పాటించనున్నాయి. 3 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు పెరిగిన సంపద మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.48 లక్షల కోట్లు పెరిగింది. మూడు రోజుల వరుస లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.11,12,089 కోట్లు పెరిగి రూ.112.99 లక్షల కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► గ్రామీణ ఆర్థికానికి ఊరట 21 రోజుల లాక్డౌన్ కారణంగా కష్టాలు పడే ప్రజల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కారణంగా గ్రామీణ ఆర్థిక రంగానికి ఊరట లభించనున్నది. దీంతో ఎఫ్ఎమ్సీజీ షేర్లు జోరుగా పెరిగాయి. మ్యారికో, హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్సూమర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గ్లాక్సో స్మిత్‌లైన్ కన్సూమర్ హెల్త్‌కేర్, డాబర్ ఇండియా, కోల్గేట్–పామోలివ్, నెస్లే ఇండియా షేర్లు 4–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► తదుపరి ప్యాకేజీపై ఆశలు మరోవైపు త్వరలోనే పారిశ్రామిక రంగాలకు కూడా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయన్న ఆశలు కూడా నెలకొన్నాయి. త్వరలోనే ఆర్బీఐ కూడా రుణాల చెల్లింపుల విషయంలో(ఈఎమ్ఐల వాయిదా, తదితర నిర్ణయాలు) వెసులుబాటునివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్థిక రంగ, బ్యాంక్, ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, బీమా కంపెనీల షేర్లు 40 శాతం మేర లాభపడ్డాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... మార్చి సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో భారీగా ఉన్న షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడానికి కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ► వేల్యూ బయింగ్: భారీ పతనంతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న.. ముఖ్యంగా బ్యాంక్ షేర్లలో వేల్యూ బయింగ్ జోరుగా జరిగింది. ► తగ్గుతున్న చమురు ధరలు... ఇక వివిధ దేశాల్లో లాక్డౌన్ కారణంగా వినియోగం భారీగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 30 డాలర్లలోపే ట్రేడవుతోంది. ముడిచమురుపై అధికంగా ఆధారపడ్డ మన దేశానికి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్య స్థితిగతులు భేషుగ్గా ఉండనున్నాయి. -
ప్రశంసనీయమైన ప్యాకేజీ!
కరోనా వ్యాధి ఉగ్రరూపం దాల్చే ప్రమాదం కనబడటంతో దేశమంతా 21 రోజులు లాక్డౌన్ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్మణ రేఖ గీసిన రెండు రోజుల తర్వాత గురువారం కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులను, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్యాకేజీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ఊరటనిస్తుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన అనేక చర్యలకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు కూడా ఎంతో తోడ్పాటును అందిస్తాయి. వాస్తవానికి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన రోజే కేంద్రం నుంచి ఇలాంటి ప్యాకేజీని చాలామంది ఆశించారు. ఎందుకంటే పౌరులను నయానో, భయానో లాక్డౌన్ చేయొచ్చు. గడప దాటకుండా చూడొచ్చు. కానీ వారి ఆకలిని, వారి కనీసావసరాలను లాక్డౌన్ చేయడం అసాధ్యం. అవి తీరక వారిలో వెల్లువెత్తే ఆగ్రహావేశాలను లాక్డౌన్ చేయడం అసాధ్యం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా ప్యాకేజీని ప్రకటించింది. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి తమ కార్యకలాపాలను నిలుపుచేసి కొన్ని రోజులు నెట్టుకు రాగలరు. సంపన్నవర్గం సరేసరి. కేవలం రెక్కల కష్టంపై ఆధారపడి బతికే నిరుపేద వర్గాలవారికి ఇది కుదరదు. ఒక్క పూట పని దొరక్కపోతే వారికి పస్తులు తప్పవు. అటువంటిది 21 రోజులపాటు ఇళ్లకే పరిమితం కావడం ఆ వర్గాలకు ప్రాణాంతకం. ఆ మహమ్మారి వైరస్ కబళించడం మాటేమోగానీ ఆకలి వారి అంతు చూస్తుంది. పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. కనుకనే ఎవరూ ఆకలితో అలమ టించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీని రూపొందించినట్టు కేంద్ర ఆర్ధికమంత్రి, కోవిడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చీఫ్ నిర్మలా సీతారామన్ చెప్పడం హర్షించదగ్గది. ఈ ప్యాకేజీ ద్వారా దేశ జనాభాలో మూడింట రెండువంతులమందికి... అంటే 80 కోట్లమందికి ప్రయోజనం కలుగుతుం దని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. వచ్చే మూడు నెలలపాటు కుటుంబానికి నెలకు అయిదు కిలోల బియ్యం లేదా గోధుమలు చొప్పున ఇస్తారు. అలాగే వారు కోరుకున్న పప్పు ధాన్యాలు కిలో చొప్పున ఇస్తారు. దీన్నంతటినీ ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా అందజేస్తామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు ఉచితంగా అందించడం ఎంతో అవసరం. ఈ చర్య వారు ఎదుర్కొంటున్న కష్టాలనుంచి సంపూర్ణంగా విముక్తి కలిగిస్తుందని కాదు. కానీ ఉన్నం తలో ఈ సంక్షోభకాలాన్ని సునాయాసంగా అధిగమించే నైతిక స్థైర్యాన్ని అందిస్తుంది. ప్యాకేజీ ద్వారా లబ్ధిపొందేవారిలో రైతులు, సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు, మహిళా స్వయం ఉపాధి బృందాలు, కూలీలు, కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు, వైద్య సిబ్బంది తదితర వర్గాలు కూడా వున్నాయి. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు వారి ఖాతాల్లో వచ్చే నెల మొదటివారంలో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు, దివ్యాంగులకు రూ. 1,000 చొప్పున రెండు దఫాలుగా అందజేస్తారు. వీరితోపాటు జన్‌ధన్ ఖాతా దార్లుగా వున్న మహిళలకు నెలకు రూ. 500 చొప్పున జమచేస్తారు. మహిళా స్వయం ఉపాధి బృందా లకు ఎలాంటి పూచీ చూపకుండా రూ. 20 లక్షల వరకూ రుణం మంజూరు చేయాలన్న నిర్ణయం కూడా ప్రశంసనీయమైనది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడిచ్చే దినసరి వేతనం రూ. 182ను రూ. 202కి పెంచడం కూడా మంచి చర్య. ఉజ్వల పథకంలోని కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచితంగా వంట గ్యాస్ అందించడం, కార్మికులు తమ పీఎఫ్ ఖాతాలనుంచి తిరిగి చెల్లించనవసరం లేని పద్ధతిలో 75 శాతం మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకునే వెసులుబాటు, మూడునెలలపాటు వారి పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తామనడం తోడ్పాటునందించే నిర్ణయాలు. నిరుపేద వర్గాలకు ఊరటనిచ్చే ఈ చర్యలన్నిటితోపాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్యులకు, ఆశా వర్కర్లకు, పారా మెడికల్ సిబ్బందికి ఈ మూడు నెలలపాటు రూ. 50 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించాలన్న నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం. వైద్యులు, వైద్య ఆరోగ్య రంగానికి చెందిన ఇతర సిబ్బంది ఈ గడ్డుకాలంలో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. శత్రుమూకలు దాడికి దిగినప్పుడు, అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు సైనికులు, పోలీసుల అవసరం ఎంత వుంటుందో... ఇలాంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు కూడా అంతే కీలకం. ముప్పు ముంచుకొచ్చినప్పుడు అందరిలా వారు ఇళ్లకు పరిమితం కావడం సాధ్యపడదు. ఇందువల్ల నిరంతరం వారిని ప్రమాదం వెన్నాడుతుంది. పశ్చిమ యూరప్ ప్రాంత దేశాల్లో ఇలాంటి సేవలందిస్తూ ఇంతవరకూ 30మంది కన్నుమూశారు. వేలాదిమంది కరోనా బారినపడి అస్వస్థులయ్యారు. హైదరాబాద్‌లో ఒక వైద్య జంట కరోనా వ్యాధి బారిన పడ్డారని తాజా సమాచారం చెబుతోంది. కనుక వారి జీవితాలకు ధీమానివ్వడం మంచి చర్య. అదే సమయంలో ఈ మహమ్మారి కాటేయకుండా వారికి అవసరమైన రక్షణ ఉపకరణాలు కూడా అందిం చాలి. సంక్షోభాలు ఏర్పడినప్పుడల్లా సొమ్ము చేసుకుందామనే అక్రమ వ్యాపారులకు మళ్లీ లాభార్జన రోగం పట్టుకుంది. కఠిన చర్యలతో ఆ రోగాన్ని కుదర్చడం కూడా తక్షణావసరం. ప్రతి నెలా ఒకటో తారీకు నుంచి మధ్యతరగతిని వేధించే సమస్య ఈఎంఐ. నెలవారీ వాయిదాలు కట్టడం ధరలు ఆకాశాన్నంటిన ఈ అస్తవ్యస్థ పరిస్థితుల్లో తలకు మించిన భారం. కనుక వాటి చెల్లింపులను కూడా ఈ మూడు నెలలూ వాయిదా వేసే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు నిత్యావసరాలపై ఉండే జీఎస్టీని తగ్గించడం కూడా అవసరం. కరోనా మహమ్మారిపై పోరులో భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని ప్రపంచమంతా ఎదురుచూసింది. ఇప్పుడు ప్రకటించిన చర్యలు ఎంతో ప్రశంసించదగ్గవి. -
కరోనా పంజా: భారీ ప్యాకేజీ
సాక్షి, న్యూఢిల్లీ : మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!) ఉపశమన చర్యలు కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన్ ద్వారా మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం వీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తాం పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి జన్‌ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు తమ పీఎఫ్ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి ప్రభావం తీవ్రం కావడంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి సెనేటర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీకరించింది. వ్యాపారవేత్తలకు, కార్మికులకు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్దీపన ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేస్తారు. కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపార వర్గాలకు కూడా ఈ ప్యాకేజీ డబ్బు వెళ్తుంది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ కావడం విశేషం. ప్యాకేజీ ప్రకటన స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 30 వేల స్థాయిని అధిగమించింది. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా మునుపటి ముగింపు (75.88)తో పోలిస్తే లాభపడుతోంది. అయితే మార్చి ఎఫ్అండ్ఓ కాంటాక్టు నేటితో ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం వుందనీ అప్రమత్తత అవసరం ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. -
అమ్మ అభిమానులకు 3లక్షల సాయం
చెన్నై : అమ్మకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేరు. 'అమ్మ' అంటే ఈపాటికే ఎవరో అర్థమై ఉంటుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లటాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు 193మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులను ఆదుకునేందుకు జయ తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోమవారం నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అమ్మ జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక 193 మంది ప్రాణాలు కోల్పోయారని వారిలో 139 మంది గుండెపోటుకు గురికాగా.., మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి 50 వేల చొప్పున జయలలిత సాయం ప్రకటించారు.